బ్రహ్మాండ మహా పురాణము
25 - అర్జునోపాఖ్యానము
వసిష్ఠుడిట్లు చెప్పెను.
అంత, జగత్పతి, రాముని యొక్క భక్తియోగముచే ప్రేతాత్ముఁడయ్యెను. మరుద్గణములందరితో ఆతనికి ప్రత్యక్షమయ్యెను. దేవ దేవేశుఁడు, త్రినేత్రుఁడు, చంద్రశేఖరుఁడు, వృషేంద్ర వాహనుఁడు నయిన శంభునీ భూతకోటి సమన్వితుని రాముఁడు చూచి, సస్థంభ్రమముగ లేచి, సంతోషమున ఆకులమయిన నేత్రములతో, శర్వునికి, భక్తితో, భూమిపైపడి సాష్టాంగ ప్రమాణ మాచరించెను. (3) ఆత్రముతో లేచి, దేవేశుడయిన ఈశ్వరునకు బహు వారము శిరస్సు వంచి నమస్కరీంచి, అంజలీ పుటము సంధించి, జగత్పతిని రాముఁడు స్తోత్రము చేసెను.
రాముఁడిట్లనెను:
దేవదేవేశ నీకు నమస్కారము. పరమేశ్వర నీకు నమస్సు. ఓ జగన్నాథ నమస్కారము. ఓ త్రిపురాంతక ! సకలాధ్యక్ష! భక్తవత్సల ! నీకు నమస్కారము. ఓ సర్వభూతేశ ! వృషభధ్వజ ! సకలాధీశ ! కరుణాకర ! సకలావాస ! ఓ నీలలోహిత ! సకల దేవారీగణనాశక ! ఓ శూలి ! నీకు నమస్కారము. ఓకపాలిన్, సర్వలోకైకపాల ! నిత్యశ్మశానవాసీ ! కైలాసవాసి ! నీకు నమస్కారము. ఓ పాశము కలవాఁడా ! కాలకూట విషము నారగించినవాఁడా ! ఓ సర్వవిభూ ! అమరవంద్య ! స్వయంభూదేవ ! శక్తిమంతుఁడా నీకు నమస్కారము. అఖిల జగత్కర్మ సాక్షిభూతుఁడ వయిన ఓ శంభూ ! నీకు నమస్కారము. (10) శీర్షమున చంద్రుని గలిగి, గంగా ఫేన ధావళ్యమున భాసించు మౌళ్ళీ గలవాఁడా, మహా భోగీంద్రుని కంఠహారముగా దాల్చినవాడ ! ఓ శివ ! ఓ పరమాత్మ, విభూతితో సంఛన్నదేహా ! నీకు నమస్కారము. సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా కలవాఁడా ! కపర్దీ ! అంధకాసురమర్ధనుఁడా నీకు నమస్కారము. త్రిపురధ్వంసీ ! దక్షయజ్ఞవీధ్వంసీ ! శైలజా కుచ మందలి కుంకుమముచే విరంజితమయిన వక్షోభాగము కలవాఁడా ! మహాదేవా ! కృత్తివాసా ! ఓ యోగిజనములచే ధ్యానింపఁబడు స్వరూపా ! శివా! అచింత్య తేజస్వరూపా ! నీ భక్తుల యొక్క హృదయాంభోజకర్ణికామధ్యవర్తీ ! సకలాగమసిద్దాంతసారరూప ! నీకు నమస్కారము. (15)
సకల యోగేంద్ర ప్రబోధనునకు, అమృతాత్మునకు, శంకరునకు అఖిలప్యాప్తమహామహిమునకు, పరమాత్మునకు నమస్కారము. శర్వునకు, శాంతునకు, జగద్రహ్మయైన వానికి, విశ్వరూపీకి ఆదిమధ్యాంతములు లేనివానికి, నిత్యునకు, అవ్యక్తమూర్తికి వ్యక్తావ్యక్త స్వరూపునకు, స్థూల సూక్ష్మాత్మునకు, వేదాంతవేద్యునకు, సమస్త విశ్వ విజ్ఞాన స్వరూపునకు నమస్కారము. సమస్త సురాసుర సంఘ శ్రేష్ఠులచే పుష్పములచే పూజింపం బడిన పాదములు కలవానీకీ, శ్రీకంఠునకు, సర్వ ప్రపంచమునకు సృష్టికర్తయైన వానికి, లోకకర్తకు, నమస్కారము. రజోగుణాత్ముఁడైన వానికీ, విశ్వ సృష్టి విధాయియైన వానికి హిరణ్యగర్భ రూపుఁడయిన వానికి నమస్కారము. పరాత్పరునకు, ప్రత్యగాత్మునకు తమోగుణ వీకారునకు, జగత్సంహారకారునకు, కల్పాంతమున రుద్రరూపునకు, పరాపర విదుఁడవయిన నీకు నమస్కారము (22) అవీకారుఁడవయిన నీకు, నిత్యుం డవయిన నీకు, సత్ అసత్ అత్ముఁడవయిన నీకు, బుద్ధి బుద్ధి ప్రబోధుఁడవయిన నీకు, బుద్ధీంద్రీయ వికారుఁడ షయిన నీకు నమస్కారము. ఎవని యొక్క మాయచే వసు, రుద్ర, ఆదిత్య, మరుత్, సాధ్య రుద్ర అశ్వి భేదమున భిన్న మతములుగా దేవతలుండిరో అట్టి నీకు నమస్కారము. నీవు ఆవకారుఁడవు, అజుఁడవు, నీత్యుఁడవు, సూక్ష్మరూపుఁడవు, ఉపమింప శక్యముకొనీవాఁడవు; నిన్ను అమలు లయిన యోగులు కూడ తెలిసికొన లేరు, దుర్జయుఁడవగు నీన్ను బ్రహ్మ మొదలగు వారు కూడ తెలిసికొనలేక ప్రపంచమున జన్మ నొంది సంచరింతురు, వారికా జన్మ కర్మలు చిరకాల ముండవు. (26) అజ్ఞానమును పటాపంచలోనర్చు నీ చరణములను ఎంత కాలము పొందరో, అంతకాలము పండితులు గానీ, అచేతనములుకాని సంసారమున భ్రమింతురు. (27) ఎవనీ యొక్క బుద్ధీ భవచ్చరణాంభోజమున స్థిరీకృతమో, అతఁడే సమర్థుఁడు; ఆతఁడే కృతి; ఆతఁడే మునివర్యుఁడు; ఆతఁడే పండితుఁడు, (28) త్రయీమయమయిన నీ సద్భావము (నీ స్థితి, ఉనికి) మిక్కిలి సూక్ష్మమయినందున గహనము, తెలిసికొనుట కష్టము. విద్వాంసులకే తెలియబడనప్పుడు, మూడుఁడనైన నాచే నేట్లు తెలియబడును? నీ గొప్పతనము పదముల కందనిది. శబ్దములచే నిరూపించుటకు వీలుకానీది. అందుచే భవన్మహిమాతిశయమును సంపూర్ణముగా స్తోత్రము చేయ శక్తుఁడను కాను. జడబుద్దినీ అయినను అజ్ఞానముతో నిన్ను భక్తితో స్తోత్రము చేసితిని. సంప్రీతుఁడవు కమ్ము. నిజముగా నీవు భక్త వత్సలుఁడవు. నీవు భక్తుల యెడ ప్రియతముఁడవు.
వసిష్ఠుఁడిట్లు చెప్పెను.
ఈ విధముగా భక్తియుక్తుఁడైన రామునిచే శంకరుఁడు స్తోత్రము చేయబడెను. మేఘ గంభీరమయిన వాక్కుతో నవ్వుచు ఆతని గూర్చి శంకరుఁడనెను.
భగవంతుఁడు :
ఓ రామ ! నేను నీ వలన సుప్రసన్నుఁడను. నీ యొక్క శౌర్య సౌలిత్వముచే, తపస్సుచే, నా యందలి భక్తిచే, స్తోత్రము చేతను విశేషముగా సుప్రసన్నుఁడను. అందుచే, నీవు నీ హృదయ భావముచే నేది కోరెదవో అట్టి వరమును కోరుము. నీకది సంపూర్ణముగా, అశేషముగా నొసంగెదను అనెను.
వసిష్ఠుడు పలికెను :
ఈ విధముగా దేవదేవుఁడు పలుకగా, భృగూద్వహుఁడయిన రాముఁడు అతనికి నమస్కరించి, బిద్దాంజలి పుటుఁడై ఓ రాజా ! ఇట్లు పలికెను. ఓ దేవ ! నీవు ప్రసన్నుఁడవైనచో, నేను వరములకు అరుఁడనైనచో, నీ వలన సర్వాస్త్రములను సంపూర్ణముగా కోరుచున్నాను. అస్త్రముల యందు (మంత్ర ప్రయుక్తములు) శస్త్రముల యందు, శాస్త్రముల యందు నాకంటే అభ్యధికుఁడుండరాదు. లోకముల యందు యుద్దములలో నన్ను జయించువాఁడు, భవదనుగ్రహమున లేకుండుగాక. వసిష్ఠుఁడు చెప్పెను 'అట్లే యగుగాక' అనీ, శంభుఁడు, సుప్రీతుఁడై అశేషముగా అస్త్ర శస్త్రములను, సమంత్రముగా, రామున కొసంగెను. ఆ యస్త్రశస్త్రములను సప్రయోగముగా, ససంహారముగా ప్రసాదాభిముఖుఁడై చతుర్విధమైన అస్త్రముల యొక్క సమస్తమును, రామునిచే శంకరుఁడు గ్రహింపం జేసెను. (39) ఎక్కడను అడ్డులేని వేగము కలిగిన శుభాశ్వమును, సుధ్వజమును నైన రధోత్తమమును, అక్షయతూణీరద్వయమును, శంకరుం డు రామున కొసంగెను. భేదింప శక్యము కానిది, శాశ్వతమైనది, దీవ్యమైనది, దృఢమయిన ఏంటి నారి కలిగినదియునగు విజయధనువును, సర్వశస్త్ర పాతములను సరకుగొనని చిత్రమయినది మహాఘనమైనదియునగు కవచమును, యుద్ధములయందు జయింపఁబడని అసామాన్యమైన శౌర్యమును, ప్రాణములను స్వేచ్ఛగా ధరించుశక్తిని, ఖ్యాతిని, స్వనామము దాల్చిన బీజమంత్రముచే సర్వలౌకికమయిన కీర్తిని, గొప్ప ప్రభావమును, భక్తిని శంకరుఁడు భార్గవునకు యధోచితముగా నొసంగి సకల భూతములతో అమరులతో కూడి చంద్రశేఖరుఁడు, ఆ రూపముతోడనే అంతర్థానుఁడయ్యెను. సర్వాభీప్సితముల నొంది రాముఁడు కృతకృత్యుఁడయ్యెను. (45)
మహేశ్వరుఁడదృశ్యుఁడయ్యెను. రాముఁడు మహోదరునితో నిట్లనెను. 'మహోదర ! ఈ సర్వస్వము రథ చోదకమును నా కొఱకు నీవు రక్షింప నరుండవు. నాకు వీనితో పనిగలిగిన యప్పుడు నిన్ను స్మరింతును. రథ చాపాదికము సర్వస్వము నాకడకు పంపుము”,
వసిష్ఠుఁడిట్లు చెప్పెను :
మహోదరుఁడు “అట్లే ! యని చెప్పి వెడలిపోయెను. అంత భృగువర్యుడు కృతకృత్యుఁడై గరుజనమును చూడబోవ సభిలషించెను. ప్రయాణీంచుచు, హిమాద్రి వసగహ్వరము నందు, భావీకర్మ ప్రచోదితుఁడై రాముఁడు ఒక కందరమును (గుహను) ప్రవేశించెను. అచ్చట నతం డొక బ్రాహ్మణ బాలుని చూచెను, ఆ బాలుఁడు ధృత ప్రాణుఁడు, వ్యాఘమాతని వెంటాడుచుండెను, ఆతఁడు ఏడ్చుచుండెను, మిక్కిలి భ్రయత్రస్తుం డై యుండెను, ఆ బాలుని చూచి దయా హృదయుఁడు, రాముడు, ఆతనిని రక్షింప సంభ్రమముతో తిష్ణ ! తిష్ఠ (ఆగు ! ఆగు.) మని ఆ వ్యాఘమును గూర్చి బిగ్గరగా అరచి దాని ననుసరించి పరుగిడెను. (51) పరువెత్తే ఆ ఘోరమయిన వనము నందు భయంకరమైన వ్యాసమును నాతఁడు చేరెను. ఆ వ్యాఘముచే వెంటాఁడబడి పరువెత్తి తన గహ్వరము నందు, ప్రాణ భయాతురుఁడై ఆ విప్రసుతుఁడు అత్యంత భీతుఁడై నేల పడిపోయేను. రాముఁడు క్రోధరూక్షుఁడయ్యెను. ఆ విప్రబాలుని పరిరక్షించుటకు ఒక దర్భమూలమును తీసికొని, తత్తణాగ్రమును కుశాస్త్రముచే అభిమంత్రించెను. మిక్కిలి ఐలిష్టమయిన యా వ్యాఘము, పరువెత్తి పరువెత్తి నేలపడిన బాలునిచూచి ఆకోశము కంపించునట్లు బిగ్గరగా గాండ్రించెను. ఇక రామ ప్రయుక్త కుశా స్త్రము, తన గోళ్ల చివరలచే బాలకుని ప్రహరించు నా వ్యాఘమును, దహించి ఎట్టి గాయములు లేకుండా ఆ బ్రాహ్మణ బాలుని రక్షించెను. (56) ఆ పాపాత్ముఁడయిన వ్యాఘము, బ్రహ్మాసముచే దగ్గభూతమయిన దేహుఁడై ఆకాశమున కెగిరి గంధర్వ రూపము నొంది రామునితో అత్యధిక గౌరవముతో నిట్లనెను. (57) భో ! మహాశయ ! విప్రశాపముచే నేను వ్యాఘ్రత మొందితిని. శాపము నుండి నీచే మోక్షమిప్పుడొసంగంబడితిని.” అని పలికి యాతఁడరిగెను. రాముఁడాశ్చర్యమొందెను.. వెంటనే పడియున్న బ్రాహ్మణపుత్రుని దయతో నేల నుండి లేవ నెత్తెను. “భయపడకు”! అని పలుకుచు రాముఁడు వెంటనే, ఆ బాలుని యవయవములను నెమ్మదిగా ఒత్తి ఆతనిని పునరుజ్జీవితుని చేసెను.
రాముఁడాతనిని లేవనెత్తేను. ఆతఁడు కన్నులు తెరచెను. వెంటనే తన ముందవస్థితుఁడయిన భృగుశ్రేష్ఠుఁడగు రామునబాలుఁడు చూచెను. శార్దూలము భస్మీకృతమగుట చూచి ఆతఁడాశ్చర్యచకితుఁడయ్యెను. అతని భయము తగ్గినది. “భో ! మీరెవరు? ఇచ్చటకెట్లు వచ్చితిరి. భీషణాకారము దాల్చి, సాక్షాత్తుగా రెండవ మృత్యువు వలె నుండి నన్ను చంపుటకు ద్యమించియున్న శార్దూలమును ఎట్లు భస్మ సాత్కృతము గావించితిరి. ఓ మహామతీ ! ఇప్పటికి కూడ భయసమ్మూకమయిన మనస్కుండను. అదీ చంపఁబడినను, నాకు సర్వదిక్కులు తద్ర్భాంతీతో నిండియున్నవి. నిన్నే, సర్వము తండ్రిగా తల్లీగా, స్నేహితునిగా, గురువుగా, భావించుచున్నాను. పరమమయిన ఆపద నొందిన నన్ను నీవు బ్రతికించితివి. శాంతుఁడను ఒక మునివరుఁడుండేను. ఆతడు మహాతపస్వి. ఆతని పుత్రుఁడను నేను. తీర్దార్ధినై నేను శాలిగ్రామమున కరిగితిని. అచ్చటి నుండి గంధమాదనశైలమును దర్శింప బయలుదేరితిని. నానా మునిగణములతో గూడియున్నది, పుణ్యప్రదమయినదియునగు బదరికాశ్రమమునకుఁబోవలవలయునని యెంచి, సహాయరహితుఁడనైన నేను, హిమాలయమున నొక మార్గమును ప్రవేశించితిని. అది గహనము. రమ్యము. తత్రదేశావలోక నాభిలాష చేతిరుగుచు, త్రోవతప్పితిని. తూర్పు దిక్కుగా ఒక క్రోశ దూరమరిగితిని, దురదృష్టవశమున వ్యాఘభయపీడితుం డనై పరువెత్తితిని. నేలపై పడిపోయితిని, ఆ భూ ప్రదేశమునుండి, తండ్రివలె, అత్యంత పుత్త్ర ప్రేమతో దయాళుత్వముచే నీచే ఇప్పుడు లేవనెత్తంబడితిని" ఇది నా వృత్తాంతము. సర్వమును నీకు చెప్పితిని నేను.
వసిష్ఠుఁడు చెప్పెను :
ఆతఁడట్లు స్వవృత్తాంతమును సర్వమును చెప్పగా రాముఁడాతనికి యథాక్రమముగా సర్వమును వివరించెను. (71) అంత వారిరువురు ప్రీతిమంతులయిరి. వారొకరొకరితో ప్రసంగించుకొనిరి. కొంతకాలము పోరందుండిరి. ఆతఁడు (ఆ బాలుఁడు) బయలుదేరి వెడల నభిలషించెను. ఆ బాలుఁడు తోడ రాగా రాముఁడు ఆ గుహాముఖము నుండి ఈవలకు వచ్చి, సంతోషాన్వితుఁడై తండ్రియున్న ఆశ్రమమునకు బయలుదేరెను. వ్యాఘము వలన నేలపడినను, ఆ బోలుఁడు అకృతవ్రణుఁడైన కారణమునను, వ్యాఘమును చంపిన రామునిచే నతఁడు రక్షింపఁబడుటచేతను ఆ బ్రాహ్మణ బాలునకు 'అకృతప్రణుఁడను నామ మెల్లెడలను విఖ్యాతమయ్యెను.
అదీ మొదలు సూర్యుని ననుసరించియుండు ఛాయవలె, ఆ బాలుఁడు రామున కత్యంత మిత్రుఁడయ్యెను. సర్వావస్థలయందాతని ననుసరించెను. ఆతనితో ననుసరింపఁబడి రాముడు భృగు మహర్షి సన్నిధి చేరెను, రాముడు ఖ్యాతిని (భృగుపత్నిని) చూచి, ఆమెను సమీపించి వినయముతో నమస్కరించేను. ఆ భృగదంపతీ ద్వయముచే రాముఁడా శీస్సులతో నభినందితుఁడై వారలను సంతోష పరచుటకు కొన్ని దినములు రాముఁడందుండేను. అంత, వారిరువురి యొక్క అనుమతితో, శిష్య సంఘములతో సమావృతమైన చ్యవన మహర్షి ఆశ్రమమున కతఁడరిగెను. నియంత్రితమున ఇంతఃకరణము కలవాడు, అంతయుత.మనసుడైన చ్యవనునకు తద్భార్యమయిన సుకన్యకు మహా మనస్వియైన రాముఁడు నమసురీంచెను. (80) పోరిద్దరు ప్రీతిమంతులు, వారిచే వభినందింపఁబడి ఔర్వాశ్రమముపకు తత్తపోవీధివి దర్శించుకోర్కెతో రాముఁ డు చేరెను. మేధావి యయిన రాముడు వారలకు నమస్కరించేను. వారలచే ప్రత్యభినందితుఁడయ్యెను. వెరీ సంతోషము కొఱకు అయాశ్రమమున కొన్ని దినములు రాముఁ డుండెను. పొరలచే అనుమతింపఁబడి, ఆమౌర్వాశ్రమమును వీడి, నెమ్మదిగా, భార్గవుఁడు, అకృతవణునితో సహా సంతోషముగా ఋచీక భవనమునకు బయలుదేరెను. తల్లిదండ్రుల పాదములకు మాటిమాటికీ నమస్కరించి, వారిచే సంతోషమున ప్రత్యాడిషములచే నభినందింపఁబడెను. (34) వారాకవి వృత్తాంతము నడిగిరి. ఉదారధీయుతుండు రాముడు, జరిగినదంతయు యథాక్రమముగా వారికి వివరించేను. అందుకొన్ని దినములు వసించి, వారి యనుచుటచే, పితృదేవుల నివాసమునకు, అత్యంత ముదాన్వితం:డై రాముఁడరిగేమ. ఉత్తమమైన ఆశ్రమమున ఆసీనులైయుప్పు పితరులనుచేరి, వారి పాదములంటి యధాశాస్త్రముగా రాముఁడు నమస్కరించెను. పాదప్రణామానంతరము రాముని లేవనెత్తి సాదరముగా కౌగిలించుకొని ఆనందాశ్రువులచే వారితనివి పర్యభిషేకించిరి. ఆశీస్సులచే అభినందించి, అంకముందు కూర్చుండపెట్టుకొని, మాటిమాటికి కుమారుని ముఖమును వీక్షించుచు, శరీరాంగములమ తాకుచు, వారానందపడిరి. అంతవారు 'నాయనా ! ఇంతకాలమేమి చేసితివి. బిడ్డా ! ఈతఁడెవడు? ఎచ్చట నీకు లభించెను? ఆతనితో ఎట్లు వసించితివి. అతఁడెట్లు వచ్చెను. వాయవా ! తథ్యమంతయు మీ యిరువురినీ గూర్చి చెప్పుము” అని అడిగిరి.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమువ మధ్యభాగమందు, తృతీయోపాదాతపాదమున అర్జునోపఖ్యానమున భార్గవచరితము ఇరువదియైదవ అధ్యాయము.
Summary of chapter 63 of the Brahmānda Mahā Purana is as follows:
This section illuminates the exalted lives of king Ambarīsha and king Dilīpa, who were legendary for their flawless devotion to lord Vishṇu and selfless protection of the sacred cow. It illustrates how Ambarīsha's absolute surrender to the lord protected him even from the fierce wrath of powerful sages. The faithful reader is inspired to embrace unshakeable devotion, realizing that the supreme lord eternally shelters those who take refuge in his holy feet.