బ్రహ్మాండ మహా పురాణము
45 - అధ్యాయము
వసిష్ఠుఁడిట్లనెను.
అంత, ఒకప్పుడు కార్తవీర్యుని కుమారులలో నొకఁడయిన శూరుఁడు (పూర్వము హిమాలయములకు పారిపోయిన యతఁడు) చతురంగ బలాన్వితుఁడయి శూరసేనాదులతో కలిసి మృగయార్థమరిగెను. అతఁడు మహారణ్యమును ప్రవేశించి, బహువిధములయిన మృగముల జంపెను. దాహ పీడితుఁడయి మధ్యాహ్న సయమున నర్మదానది కరిగెను. అందు స్నానమాడి నదీనీరములు త్రాగి గతశ్రముఁడయ్యెను. తిరిగిపోవుచు మార్గమధ్యమున జమదగ్ని యొక్క ఆశ్రమమును చూచెను. రమ్యమయిన ఆశ్రమ పదమును చూచి మార్గము నందు వచ్చుచున్న మునులను “ఇది యెవ్వరి ఆశ్రమమని అడిగెను. “ఇందు అతి శాంతాత్ముఁడు, మహాతపస్వి, జమదగ్ని పసించును, ఆతని కుమారుఁడు రాముఁడు. శస్త్రధారులలో నగణ్యుఁడు.” అని వారు చెప్పిరి. రాజానుయాయులు భావికర్మ ప్రచోదితులు. పరశురాముని గూర్చివీనిరి. రామ నామానుకీర్తన శ్రవణములు వారందరు భయాఖీభూతులైరి. వారు రామునితో పూర్వవైరము ననుస్మరించి యధిక క్రోధావిష్ణులైరి. వారలొండొరులతో సంప్రదించుకొనిరి. పితృహంత యొక్క వధ వలన వైర నిర్యాతన మేల చేయరాదు? చెప్పుడు’ అనీ పలికి ఖడ్గ హస్తులయి, వారు ఆశ్రమమును ప్రవేశించిరి. ఆ సమయమున మునివీరులందరు వివిధ ప్రదేశముల కరిగియుండిరి. జమదగ్నిని వారు చంపి, ఆతని శీర్షమును క్రూరులయిన నిషాదులవలె నిర్దయులయి అపహరించి, దురాత్ములగు వారు బలములతో గూడి స్వపురీ కరీగిరీ. జమదగ్ని కుమారులు హతు డయిన తండ్రిని చూచి శోకకర్శితులై చుట్టును మూగి రోదించరీ. జమదగ్ని భార్య రేణుక చంపఁబడి భూమిపై పడియున్న భర్తను చూచినది. వెంటనే పిడుగుపాటు నొందిన లతవలె మూర్ఛితురాలై నేలపడెను. చైతన్యము తొలఁగి ఆమె మూర్ఛనంది, శోకాగ్నిచే దీపితురాలయ్యెను. చైతన్యము పోయిన వారివలె సంజ్ఞానష్టయై వెంటనే ప్రాణములచే విముక్తురాలయ్యేను. మూర్ఛనుండి తేరుకొనిన పుత్రులు విలపింపక సంజ్ఞా దూరులై యుండిరి. వారందరు శోకసాగర నిమగ్నులై మూర్ఛనొంది నేలపై పడిరి. తరువాత వచ్చిన ఆశ్రమమునందున్న ఇతర తపోధనులు పుత్రులతో తుల్యదుఃఖము నొంది, వారల నాశ్వాసపరచిరి.
జమదగ్ని కుమారులందరు మునీశ్వరులచే యథావిధి నూరడింపఁబడిరి. వారిమాట ప్రకారము పితృకళేబరమును అగ్నిచే దహించిరి. తరువాత వారు చేయవలసిన ఉత్తరక్రియల నాచరించిరి. వారందరు పితృమరణదుఃఖమున దీవానిశలు పీడింపఁబడిరి. అంత పండ్రెండు వత్సరములు గడచిన తరువాత స్నేహితుఁడయిన అకృతవణునితో సహా రాముఁడు తపస్సు నుండి పిత్రాశ్రమమునకు తిరిగి వచ్చెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున సగరోపాఖ్యానమున భార్గవచరితలో నలువదియైదవ అధ్యాయము.
Summary of chapter 83 of the Brahmānda Mahā Purana is as follows:
Spurred by supreme righteous anger to cleanse the earth of tyrannical rulers, this chapter describes Parashurāma taking a holy vow to rid the world of corrupt monarchs twenty-one times. It details his swift, invincible campaign across the continents, liberating the oppressed earth from the crushing burden of arrogance. The faithful reader contemplates the stern, purifying aspect of divine justice that destroys evil to protect the innocent and uphold cosmic order.