10 - మోహినీప్రాదుర్భావ - మలకాసురవధోనామ

హయగ్రీవుడనెను: తరువాత భ్రవిష్ణువైన విష్ణువుచే నంగీకృతులై మహాధీరులై పరమ సంతోషము నందిరి-1. విష్ణువునకు ముఖము దీప్పిన మలకాదులగు సమస్తరాక్షసులు శ్రీదేవిచే వదిలిపెట్టబడిన పొరై మిక్కిలి యుద్వేగమును జెందిరి-2 అంత, రాక్షసులు ధన్వంతరి చేతిలోనున్నదియు పరమామృతసారముతో నొప్పీనదియు నైన బంగారు అమృత కలశమును దీసి కొనిరి. తరువాత, దేవరాక్షసులకు పరస్పరము కలహము జరిగెను-3. ఇంతలో సర్వలోకములకు రక్షకుడైన విష్ణువు తనతోనేకరూపిణియైన లలితాదేవిని, చక్కగా నారాధించేను-4. సురాసురుల యొక్క యాభయంకరమైన యుద్ధమును జూచి బ్రహ్మ తన స్థానమునకు బ్రహ్మలోకమునకు బోయెను. శివుడు కైలాసమును జేరెను-5.

ఇంద్రుడు దైత్యరాజైన మలకునితో యుద్ధము జేసెను. రాక్షసులతో దేవతలందరును యుద్ధము చేసిరీ-6. భగవంతుడై యోగీంద్రుడైన విష్ణువు కూడా మహేశ్వరిని తదేకధ్యానయోగముతో ధ్యానించి తద్రూపు (మహేశ్వరీ రూపు) డయ్యెను-7. ఆమె సర్వాభరణ భూషితమై, సర్వ శృంగార వేషముతో నొప్పినదై, కన్నుల యెదుట శృంగార నాయికయై సర్వ సంమోహినియై యుండెను-8. సురాసురల యాతీక్ష మైన రణమును నివారించి, చిరునవ్వుతో రాక్షసులను మోహింపచేయుచు పలికెను-9. “యుద్దమును జాలీంచుడు, మర్మస్థానములను భేదించు శస్తములతోనేమి ప్రయోజనము. గొంతు నేండగొట్టునట్టి వ్యర్ధమైన కఠిన సంభాషణములతో నేమి ప్రయోజనము-10. మీకును దేవతలకును నేనేయిట మధ్యస్థురాలిని. మీరును వారును ఇచట. కష్టమును బంచుకొంటిరి-11. అందరికిని నీట సమముగానే అద్భుతమైన అమృతమును ఇచ్చెదను. ఆ యుత్తమమైన సుధాకలశమును నాచేత నుంచుడు-12.

అని యను మోహినీ వాక్యమును విని దైత్యులు ఆమె మాటలకు మోహితులై మూఢ చిత్తులైయామెకు అమృతకలశము నిచ్చిరి-13, ఆ మోహిని యామృతకలశమును దీసికొని జగన్మోహనరూపిణియై దేవతలకును దానవులకును వేరు వేరు పంక్తులను జేసెను-14. రెండు, పంక్తుల మధ్య నుండి “వరుసగా అమృతము నిత్తును. ఊరక (అల్లరిచేయక) యుండుడు” అనెను-15. అక్కడ గుమికూడిన దేవదానవులందరు దానికంగీకరించిరి. ఆమోహినియైతే సంమోహితములైన యశేష లోకములుగలదై యమృతమునిచ్చుట కారంభించెను.-16. ధ్వనించుచున్న బంగారు గరిట గలదై, ధ్వనించుచున్న మంగళ కంకణములు గలదై, మనోహరములైన భూషణములతో నొప్పినదై యాదేవి పరమ కళగా ప్రకాశించేను.-17. పద్మమువలే సుందరమైన యెడమ చేతిలో ఉజ్జ్వలమైన సుధాకలశమును ధరించుచు మొదట దేవతా పంక్తికి వరుసగా గరిటతో నమృతమును బంచసాగెను-18. ఆక్రమములో చంద్ర సూర్యులు సూచించినట్టియు, దేవతల మధ్యనున్నట్టిరాహువును ఆ గరిటతోనే ఖండించేను. త్రాగినయమృతముగల రాహువు శిరము మాత్రము ఆకాశమునకు వెళ్లాను.-19. దానిని చూచి రాక్షసులు విమోహితులై యూరకయుండిరి. ఈ విధముగా నమృతమునంతయు దేవతలకిచ్చియామోహిని రాక్షసుల యెదుట నా కలశమునుంచి యదృశ్యమయ్యెను-20. అమృతశూన్యమైన యా కలశమును జూచి దైతేయులును దానవులును (రాక్షసులు) యుద్దమును జేయదలచి యుప్పొంగిన కోపముగల వారైరీ-21. ఇంద్రాదులైన దేవతలందరు అమృతపానముతో మిక్కిలి బలవంతులై సాయుధులై దుర్బలులైన రాక్షసులతో యుద్ధముజేసిరీ-22. దేవతా శ్రేష్ఠులచే సూరుల కొలదీ యస్త్రములతో గుచ్చబడుచున్న వారై రాక్షసరాజులు కొంతమంది దిగంతములకు బోయిరీ, కొంతమంది పాతాలమునకు బోయిరీ-23. దేవేంద్రుడు మలకుడను రాక్షసరాజును జయించి లక్ష్మీ కటాక్షమున కటాక్షింపబడినవాడై తన దేవరాజ్య లక్ష్మిని మరల పరిగ్రహించెను -24. మరలదేవరాజ్యసింహాసనమును బొంది యింద్రుడు దేవతలతో సేవింపబడి రాక్షసజేతయై పూర్వమువలె ముల్లోకములను పరిపాలింపసాగెను-25. చరాచర భూయిష్టమైన ముల్లోకమున సమస్త దేవతలు నిర్భయులై సంతుష్ట చేతస్కులై స్వేచ్ఛగా సంచరించుచుండిరి-26. అపుడు ఆ సమస్త మోహినీ చరితమును జూచి నారదమునీ యాశ్చర్యము జెంది కామచారియై కైలాసమునకు వెళ్లేను-27.

నందిచే ననుమతింపబడి, పరమేశ్వరుని నమస్కరించి, యాతనిచే గౌరవింపబడుచూ సంతుష్టుడై నారదుడాసనమున గూర్చుండెను -28. ఆసనమున గూర్చుండి నట్టియు, స్వేచ్ఛా విహారియైనట్టియు, మునియైన నారదుని స్వచ్ఛమైన స్ఫటికము వలెనున్న (నిర్మలుడైన) పార్వతీపతి యిట్లడిగెను-25. కలహప్రియా! దేవర్షీ! అచట అమృత మథనమున దేవతలకేమి జరిగినది? దేవరాక్షసులలో నెవరికి విజయము లభించినది? అమృతము యొక్క వృత్తాంతమేమి? (అదియేమైనది?) విష్ణువేమి చేసెను?-31. అని మహేశుడడిగెను. దానికి నారదమునిసత్తముడిట్లనెను. అపుడాతని ముఖము ఆశ్చర్యముతో గూడినది, కానీ ముఖము చూపులు ప్రశాంతముగా నున్నవీ-32. ఓ భగవంతుడా! నీవు సర్వజ్ఞుడవు. అయినను నీవడిగినందున నిపుడు. చెప్పెదను-33. దేవరాక్షసులకాఫనోరయుద్ధము జరుగగా శ్రీమంతుడైన యాది నారాయణుడు మోహినీ రూపమును ధరించెను -34. ఆఉదార (నిండైన) విభూషణములతో నొప్పినది, శృంగార దేవత యాకారము దాల్చి వచ్చినదాయన్నట్లున్నది. అట్టి యామేను జూచి దేవరాక్షసులు యుద్ధ ప్రయత్నమును విరమించిరి-35. రాక్షసులామె మాయచే మోహీతులైరి ఆమె వారి నమృత కలశమునడిగెను. వారు ఆమెను మధ్యస్థురాలిగా జేసి చక్కగానమృత కలశమును వారీ కర్పించిరి-36. అపుడామోహినీ దేవి దానిని తీసికొనెను. మనోహరముగా చిరునవ్వులొలకబోసెను. దేవతలకే మొత్తమమృతము నిచ్చెను. -37. అంతర్థానమయ్యెను. రాక్షసులు ఆమెయదృశ్యమగుటజూచిరి. వెంటనే యమృతకలశమును శూన్యమైన దానినిగొజూచిరి. అపుడు వారి ముఖములు మండిపోయినవి, మరల దేవతలతో యుద్దమునకు లేచిరీ-38. కాని, దేవతలు మాత్రము అమృతము ద్రోవుటచే మిక్కిలి తీక్షమైన పరాక్రముగలవారైరి. కావున రాక్షసులు వారితో వోడిపోయి నశించిరి, పాతాలమునకు బోయిరీ-39. అవ్యయుడైన భవానీపతి శివుడు ఈ వృత్తాంతమును విని, నారదుని బంపి వైచి, అతను జెప్పినదానినే ఎల్లప్పుడు స్మరించుచు-40. తన సమస్త ప్రమథ గణములకును, కుమారస్వామి వినాయకులకును తెలియకుండగా పార్వతితో గూడ నాశ్చర్యముతో విష్ణువు కడకు వచ్చెను -41. అపుడు విష్ణువు క్షీరసముద్రపుటోడ్డున నుండేను. తన స్త్రీతో (పార్వతితో) గూడి, వృషవాహనుడైన శివుని జూచెను. అప్పుడు విష్ణువు తన ఆదిశేషశయనమునుండి లేచి శివుని కడకు వచ్చెను-42. శివుడు తన వాహనమునుండి దిగి పార్వతితో సహ నిలిచెను. అతనిని జూచి హరి శీఘ్రముగా సమీపించి అర్ఘ్యాదులతో పూజించెను. సంతోషముతో-43. స్నేహముతో పార్వతీ పతిని శ్రీమహావిష్ణువు గాఢముగా గౌగిలించుకోనెను. అటకు వచ్చుటకు కారణము గూడ నడిగెను-44. అపుడు మహాదేవుడు(శివుడు) భగవంతుడైన ఓ పురుషోత్తమా! మహాయోగేశ్వరా! శ్రీమన్ (లక్ష్మిని గలిగినవాడా) సర్వసౌభాగ్యముతో సుందరము-45. సర్వసమ్మోహజనకము, వాజ్మనములకందనిదియునై నీవు పొందిన యారూపమును నాకు జూపుము-46. శృంగారమునకధిదైవతముగా నున్న నీ రూపమును జూడగోరితిని అది నేను తప్పక చూడవలయును. నీవడిగిన వాని నిచ్చుటలో కామధేనువవు-47. అని యడిగెను. ఈ విధముగ మాటిమాటికి మహాదేవుడు ప్రార్థింపగా యోగేశ్వరుడైన విష్ణువు, తాను పరాశక్తి ధ్యానవైభవముబొందినట్టిదియు తనకద్వైతమైనట్టిదియు, నద్బుతమైన యా మోహినీ రూపమును తదేకమైన మనస్సుతో ధ్యానించి, కొద్దిగా చిరునవ్వుతో నవ్వి-అట్లే యగుగాకయని యంతార్థనమందెను. (అదృశ్యమయ్యెను) (ఇచట పరాశక్తియే మోహినియనియు తదఖిన్నుడే హరీయనీ వ్యక్తమగును. హరిపరాశక్తులకద్వైతము చెప్పబడినది)-49. ఈశ్వరుడు (శివుడు) కూడ అంతట తేరిపార జూచుచు నొకచోనంతకుముందెన్నడు చూడని సుందరమైన యుద్యానవనమును చూచెను-50. అందులో వికసించుచున్న పూల వరుసలలో మధుపములగుంపులు వినోదించుచున్నవి. చంపకపు పూగుత్తుల సుగంధముతో దిక్కులన్నియు పరిమలవంతములైనవీ-51. తీయమామిడి గుంపులతోను విప్పపూలతోను మదించి కోకిలలు గొంతెత్తి పాడుచున్నవి. అశోక వృక్షముల గుంపులలో నెమళ్ళు నాట్యమాడుచున్నవి-52. తుమ్మెద గుంపుల ఝంకారములు వల్లకీ నాదమును జయించుచున్నవి. తెలుపు మించినయెల్లని కలిగోట్టుచెట్ల పూవులు వనమంతయు మించి ప్రకాశించుచున్నవి-53. తమాలములు (చీకటి మ్రానులు) తాలములు (తాడిచెట్లు) పొంతాలములు (గిలక తాడిచెట్లు) వీని వరుసలు ప్రకాశించుచున్నవి పర్యంతములోని దీర్ఘకలలో (నడబావులలో) సుదీర్ఘములైన కమల సంపదలు వీరాజిల్లుచున్నవీ.-54. పిల్లవాయువులచే ఉద్యానలతా వృక్షములచిగురాకులు పూలును కదలి నాట్యమాడుచున్నవి. సంతాన వృక్షముల (కల్పవృక్షముల)పూల వాసనలు గుంపులు గుంపులుగా నంతట వ్యాపించిచు సుగంథము నిచ్చుచున్నవి-55. అటనంతటను చిత్ర విచిత్ర పుష్పములు ఒప్పుచున్నవి. అది సర్వమనోహరముగా నున్నది. అందులో పారిజాత తరువు మూలమున నొకకాంత శివునకు గనబడినది-56. ఆమె బాల సూర్యుని మెరుపులోనున్నది. నవయౌవనముతో మదీంచినదీ. ఆమె చరణాజ్ఞములు నఖములును పద్మముల కాంతినాకర్షించినవి. లాక్షారాగము బూయుట చే పాదముల యొలుపు ప్రవహించుచున్నట్లున్నది. మధురధ్వనినిచ్చు కాలియందేలతో నామె పాదకమలములు - మనోహరముగానున్నవి-58. ఆమెపిక్కలు నిండుగానుండి మన్మథుని వీరతూణీరముల (పూవుటమ్ముల పొదుల) దర్పమును ఉన్మదీంప (పిచ్చెత్తింపజేయుచున్నవి. ఆమె తొడలు ఏనుగు తొండములవలెను అరటిస్తంభములవలెను స్థూలసువృత్త శీతలములై ప్రకాశించుచున్నవి-59. ఆమె కట్టిన చీర యెఱ్ఱనిది పట్టుది, మెత్తనిది, చిన్నదీ పిరుదులను బాగుగా నలంకరించియున్నది. దానివలన నామె పిరుదుల వైశాల్యము చక్కగా ప్రకాశించుచున్నది-60. ఆమె జఘనములు కొంగొత్త మాణిక్యములు పొదిగిన బంగారుమొలనూళ్ళతో ప్రకాశించుచున్నవి. పెద్ద సుడివలె నామె నాభి కొద్దిగా వంగి త్రివళులుఅను అలలకాంతుల ప్రవాహముల నీండి వీరాజిల్లుచున్నదీ-61. కమలపు మొగ్గలవంటి స్తనములు తమపై నూగాడు నూరు ముత్యముల హారములతో జుట్టబడినవి. మిక్కలి లావైన స్తనముల భారముచే నడుము భాగము అల్లలాడుచున్నది-62. ఆమె భుజములు శరీర పుష్పములవలె కోమలములు. బాహువులందు కంకణము భుజకీర్తులు నొప్పుచున్నవి, ప్రేళ్ళలో ఉంగరములు ప్రకాశించుచున్నవి. ఆమె కంఠము శంఖమువలె సుందరముగానున్నదీ-63. ఆమె మోముటద్దమున (అద్దము వంటిముఖమున) ఒక చిన్న వృత్తము వలె గదువ ప్రకాశించుచున్నది. ఆమె పేదవీ పాటలవర్ణమైనది. ఆమె దంతములు శుద్ధమైన పంక్తులుగలవి, పవిత్రమైనవీ, విద్యారూపములు, విశేషముగా ప్రకాశించునవీ-64. మల్లెమొగ్గల వలె సుందరములు, అవి మొత్తముపైన వన్నెలనే ప్రకాశింపజేయుచున్నవి. (షోడశీకలా చంద్రికను ప్రకాశింపజేయుచున్నవి కావుననే విద్యాస్వరూపములు) లావైనముత్తెమును బొదిగిన నాసాభరణము (మలాకీ)తో బ్రకాశించినది-65. ఆమె కన్నులు కేతకాంతర్దల ద్రోణుల వలె (మొగిరేకులలోపలి దొప్పవంటి యాకువలె) దీర్ఘదీర్ఘములైనవి. అర్ధచంద్రునితో, తులదూగు నామె ఫాలభాగమున నందముగానమరిన, ముంగురుల సరములు ప్రకాశించుచున్నవి-66. పాలీవతంస(గొలుసుతో.. నలంకరించిన) మణికుండలములతో నామె చెవులు ప్రకాశించుచున్నవి. ముఖము నందలి తమలపాకు విడెము కొంగొత్త కర్పూర కస్తూరీ రసముల సుగంధమును వెదజల్లుచున్నవి-67. ఆమె ముఖము శరత్కాల చంద్రబింబమువలె మధురముగానున్నది నౌదుట కస్తూరీ తిలకమెప్పుచున్నది. తల వెంట్రుకలు గుంపై సంపూర్ణముగా నీలమైనవి-68. సిందూరరేఖనుంచుటచే సామె పొపెట భాసిల్లుచున్నది. ఆమె కన్నులు మదలోలములు షోడశీచంద్రికలనే శిరమున నలంకరించుకొన్నది. వేయేల సర్వశృంగార వేషముతో నొప్పినదీ. సర్వాభరణములనలంకరించికొన్నది-70. ఆమె ప్రస్తుతము కందుక క్రీడలో నాసక్తయైయున్నది. ఆయాటచే నాభరణములన్నియు కదలుచున్నవి. అట్టిమోహినిని జూచిన వెంటనే యీశ్వరుడు ఉమను వదలి యామె వెంట పరువెత్తెను-71. ఉమాదేవి కూడా మోహిని వెంట పరుగిడుచున్న తన ప్రియుని బాగుగా జూచీ, మిక్కిలి యాశ్చర్యము చెంది, తనను తన సౌందర్యమును నిందించుకొనెను. లక్ష్యాసూయలతో తలవంచికొన్నదై నిలుచుండెను-72. చిట్ట చివరకు శివుడు ఆ మోహినిని మాటిమాటికి కౌగిలించుకొనేను, మోహిని కూడా విదిలించుకొని విదిలించుకొని సదూరముగా పరువెత్తుచుండెను-73. కామవశీకృతుడైన శివుడు ఆమెను మరలబట్టుకొని యతివేగముగా సామెను గాఢముగా గౌగిలించుకొనెను. అప్పుడు శివుని వీర్యము స్థలితమయ్యెను-74. ఓయగస్త్య మహర్షి దాని నుండి మహాబలుడు దేవుడైన “మహాశాస్త్ర యావిర్భవించేను. అతడు అనేక కోటి దైత్యేంద్రుల గర్వమును నశింపజేయ సమర్థుడు-75. శివుని వీర్యబిందు సంస్పర్శవలన నచట భూమీ గుర్తునకు రజీతవర్ణముగను స్వర్ణవర్ణమగనయ్యెను. అట్లే ఆవిశ్వ మోహినియైన దేవతయు అంతర్థానమందెను. అటనుండి మరలిన గౌరీశుడైన శివుడు ఉమతోబాటు కైలాసగిరికి వెళ్లాను-77.

ఇక, ఓలోపాముద్రాపతీ! అగస్త్యా! ఆశ్చర్యకరమైన యీ విషయమును జెప్పెద వినుము. అదియింతవరకెవ్వరికిని జెప్పబడలేదు. నా హృదయము లోనే గూఢముగా నున్నది-78. పూర్వము భండాసురుడను సర్వరాక్షస శిఖామణియొకడు గలడు. అతడు పూర్వము బహువిధ దేవతలను సమర్థుడై స్వేచ్ఛతో శాసించెను-79. ఆతడు భండుడు కుడి భుజముతో విశుక్రుడను దైతేయరాక్షసుని సృష్టించెను. ఆవిశుక్రుడు శ్రక్రునితో సమానుడు. విచారజ్ఞుడు. అట్లే భందుడు యెడమ భుజముతో విషా(షంగుని సృష్టించెను. అతడు దుష్టశేఖరుడు. అట్లే వీరియక్కను ధూమీనియను నామెను సృష్టించెను-81. ఉగ్రవీర్యులైన యా సోదురలతో గూడి సర్వశత్రువులను హతమార్చేను. శౌర్యవీర్యములతో విజృంభించి బ్రహ్మాండమునే బ్రద్దలు గొట్టుచుండెను. ప్రదీప్త తేజస్కుడైన యాతనిని చూచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పలాయన పరులై (పారిపోయి వెంటనే వారివారి యిండ్ల నెల్లప్పుడు వసింపసాగిరి-83. అప్పుడే భండుని బాహువుల మర్ధింపబడి మూర్చిత దేవగణములు ఊపిరిదీసికొనుటకు గూడ శక్తిలేనివైనవి-84. కొందరు పాతాల గర్భములందును, కొందరు సముద్రజలములలోను, కొందరు దిగంతములకోణములందును కొందరు పర్వతముల గుహలందును మిక్కలి భీతులై భార్యాపుత్ర స్త్రీలను వదలి భ్రష్టాధికారులై దేవతలు మారువేషములలో చరించిరి-86. యుద్ధదుర్మదులైన యక్షులు మహోరగులు-సిద్ధులు సాధ్యులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు వీరందరిని భండుడు ఒక గడ్డిపోచక్రింద తలంచి సర్వలోకములను శాసించెను-87.

 ఆ తరువాత భండాసురుని జంపుటకును ముల్లోకములను రక్షించుటకును ఓ యగస్త్యమునీ! మహాయాగాగ్ని నుండి మూడవ రూపమావిర్భవించెను-88. ఆరూపముతో నొప్పినదానిని పరదేవతయైన లలిత యందురు. ఆమె పాశము-అంకుశము-ధనువు-బాణముఇవి ధరించిన నాలుగు భుజములు గలది-89. ఆదేవి యే పరమదైనశక్తి (పరాశక్తి) పరబ్రహ్మ స్వరూపిణి. యుద్ధవిశారదయైన యాలలితాదేవి యుద్ధమున భండదైత్యుని జంపెను-90.

ఇదిబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున మోహినీప్రాదుర్దావ-మలకాసురవధము అను దశమాధ్యాయము. 10

ఉపోద్ఘాత ఖండము సమాప్తము