9 - అమృతమథనమను నవమాధ్యాయము

ఇంద్రుడనెను : ఓ భగవన్! సర్వధర్మజ్ఞ, త్రికాల జ్ఞానులులో శ్రేష్ఠుడా! పాపమును దాని ప్రతీకారమును నీవు బాగుగా జెప్పితివి-1. ఏ కర్మ పరిపాకమున నాకీయాపద వచ్చినది? ఓ ప్రవక్తలో శ్రేష్ఠుడా! దానికి ప్రాయశ్ఛిత్తము కూడ నేమియో సెలవిమ్ము-2. బృహస్పతియను కాశ్యపునకు దీతీయందు బుట్టిన వాడు దనువబడెను. తరువాత రూపవతియను కన్యజనించెను. ఆమెను తండ్రి బ్రహ్మకిచ్చెను-3. ఆమెకు విశ్వరూపుడను మహాతేజస్వి జనించెను. ఆతడు నారాయణపరుడు. వేదవేదాంగపారగుడు-4. తరువాత దనువు భృగు పుత్రుడైన శుక్రుని తన పురోహితునిగా వరించెను. నీవు దేవతలకు ఇంద్రుడుగా అధిపతివైతివి-5. అంతకు పూర్వకాలమున నీవు సుధర్మయను దేవ సభలోనుండగా ఋషుల సన్నిధిలో నీవొక ప్రశ్నయడిగితివీ-6. “సంసార తీర్థయాత్రలలో నేగీయధిక గుణములు గలది? నాయను గ్రహమున మీరు నిశ్చయించి చెప్పుడు” అని-7. ఆ ప్రశ్నకు సమాధానము జెప్పుటకందరును మొదలిడిరి. దాని కంటేముందే విధి బలమున నాచే-8. “సంసారమున కంటే తీర్థయాత్ర యధీకము” అని తొందరగా జెప్పబడినది. అది విని ఋషులందు కోపించినవారై నన్ను -9. పరిమిత పుత్రులతో దొరిద్ర్యముతో కర్మభూమియైన భూలోకమును బొందుము అని శపించిరి. ఈ విధముగా శపింపబడి ఖిన్నుడనై కాంచీపురమును జేరితిని-10. అపుడు అమరావతి పురోహితుడు లేనీదయ్యేను అది చూచి నీవు చింతాకులుడవైతివి. అప్పుడు నీతోబాటు (ఇంద్రునితోబాటు) దేవతలు ఆదరముతో విశ్వరూపుని పురోహితునిగా నుండుమని ప్రార్థించిరి, దానవుల చెల్లెలి కుమారుడైన విశ్వరూపుడు దేవతలకు పురోహితుడయ్యెసు-12. మహాతపస్వియైన విశ్వరూపుడు దైత్యుల విషయమున మిక్కలివైరమును బూనలేదు. దాని వలన దైత్యేంద్ర వాసులిరువురు సమబిలులైరి-13. తరువాత ఓరాజా! ఇంద్రా! నీవు కోపించినవాడవై దానవరాజు చెల్లెలి కొడుకైన విశ్వరూపుని జంపగోరి తపఃసాధనమైన వనమునకు బోయితివి. అచట మునులతో మూడు శిఖరములు గళి పర్వతమువలె ఆసనముననున్నవాడును వేదధ్వనులతో మారుమ్రోగిన దీక్కులు గలవాడును కేవల బ్రహ్మానంద నిష్టితుడైన విశ్వరూపుని శిరముల ఖండించితివి-16. ఆ పాపమునంటి మాటిమాటికి పీడింపబడుచున్నవాడవై మేరు పర్వత గుహను జేరి బహువరములుంటివి-17. ఆ తరువాత మునుల మాటల ద్వారా కాశ్యపుడు పుత్రశోకముతో తపించినవాడై కోపముతో త్వరలోనే ఇంద్రుడు తన రాజ్యలక్ష్మిని గోల్పోవుగాక యని శపించెను. తరువాత దేవతలు అనాథలై దైత్యులచే పీడింపబడి దుఃఖితులైరీ-19. నీవు నేను (ఇంద్ర బృహస్పతులు) లేక దేవలోకము నుండి పలాయితులైరి బ్రహ్మ నివాసమునకు వెళ్లి తమ వృత్తాంతమును జెప్పిరి-20. బ్రహ్మ ఇంద్రునియా పాప ప్రతిక్రియను గూర్చి చింతింపసాగెను. కాని దానిని కనుగొనలేకపోయెను-21. తరువాత దేవతలను వెంటదీసికొని నారాయణుని కడకు వచ్చెను-22 అతనిని స్తుతించి నమస్కరించి బ్రహ్మ దేవతల వృత్తాంతమును విన్నవించెను. లోక నాయకుడైన నారాయణుడు గూడ అనేక విధములుగా నాలోచించి కృపదలచి-23. ఆ పాపమును మూడు భాగములుగా జేసి మూడు స్థానములందుంచేను. స్త్రీల యందు, భూమియందు, వృక్షములందు ఆ పాపమును విభజించెను. స్త్రీలకు ఋతు కాలములలో భర్శ సమాయోగమును, పుత్రావాప్తినీ, సర్వవృక్షములకును ఖండించినను మరల మొలచుటను, భూమికి ఖాతాపూర్తిని, చెరువులు మొ! నిండుట వరములుగానిచ్చెను. స్త్రీలకు రజోదోషము, వృక్షములకు నిర్యాస (బంక) దోషము, భూమికి చవుడు(నిస్సారత) దోషము, ఇవీ వెంటనే కలిగెను-26. దానివలన నీవు శాపగుహనుండి బయట పడి దేవనాయకుడవై యింద్రుడవైతివి. బ్రహ్మయొక్క యనుగ్రహమున రాజ్య లక్ష్మిని పొందితివి-27. దానిచేతనోదార్బబడిన వాడై కశ్యప బ్రహ్మ జనార్ధనునితో నేనింద్రునికిచ్చిన శాపము వృధగా కారాదు అని యనెను. అమిత తేజోస్కుడైన కశ్యపమునీ యొక్క యా మాట విని ఓ కశ్యపమునీ! కాలాంతరమున నీశాపము సార్థకమగుననెను. రాబోవునది దెలిసిన బ్రహ్మ సంతుష్టుడై యపుడు వెడలిపోయెను-29. ఇంతకాలము నీవు ముల్లోకములను పాలించుచు, ఐశ్వర్యమదమత్తుడవగుట వలన కైలాస పర్వతమును పీడించితివి-30. వెంటనే సర్వజ్ఞుడైన శివుడు. భగవంతుడైన దుర్వాసమహాముని పంపెను. అతడు నీమదము నశింపజేయగోరి శపించెను-31. రెండు శాపములకు (కశ్యప-దుర్వాసులశాపములకు)ఫలమొక్కటేమైనది. ఇపుడు చూడుము ముల్లోకములు గూడ నిః శ్రీకములైనవి-32. ఇంద్రా! యజ్ఞములు దానములు ప్రవర్తిల్లుటలేదు. ఎక్కడగూడ యమ-నీయము-తపస్సులు ఆచరింబడుటలేదు-33. బ్రాహ్మణులందరు లోభముగప్పిన మనస్సులుగలవారై శ్రీవిహీనులైరీ. సత్త్వము లేనివారు, ధైర్యము లేనివారు, తరచుగా నాస్తికులును ఐరి-34. భూమీ ఓషధి రసములేనిదై మీకలి నిర్వీర్యమైనది. సూర్యుడు ధూలికారమును జెందెను, చంద్రుడు కాంతి హీనుడయ్యెను-5 హవీర్భోక్తయైన యగ్ని తేజము లేనివాడై గాలిదుమ్మునిండినవాడయ్యెను. దిక్కుల భాగములు నిర్మలములుగా లేవు. ఆకాశము సైతము నిర్మలముగాలేదు -36. సకలదేవతలు దుర్బలులైరి. దేవతలవలెగాక వేరొక్కరుగా గనబడుచున్నారు. చరాచరములతో గూడిన ముల్లోకము ఇంచుమించు నశించినట్లుగనే యున్నది-37.

హయగ్రీవుడనెను : ఈ విధముగా బృహస్పతి మహేంద్రులు మాటాడుచుండగానే మలకాదులైన మహారాక్షసులు స్వర్గలోకమును దండెత్తి బాధించిరి-38. బలగర్వితులై నందనోద్యానమును ఛేదించిరి. ఉద్యానపాలకులనందరిని ఆయుధముల చేగొట్టిరి-39, కోటను చేధించి నగరములోపల ప్రవేశించి మందిరములలోనున్న సమస్త దేవతలను మిక్కిలి పీడించిరి-40. దేవనర్తకులైన యప్పరః శ్రేష్టలను . విశేషించి హారించిరి, తరువాత సమస్త దేవతలు మీక్కిలి బాధింపబడనీ పొరుగా జూచుకొనిరీ-41. ఆదాడి ఘోష విని యింద్రుడు. ఇంద్రాసనము వీడి అందరు దేవతల వెంట నీడుకొని పలాయన పరుడయ్యెను-42. అపుడా. యింద్రుడు బ్రహ్మనివాసముజేరి యున్నదియున్నట్లుగా రాక్షసులు జేసినది చెప్పెను-43. బ్రహ్మయు అది విని సర్వదేవతలతో గూడిన వాడును, సిరితొలగిన వాడును ఐన హరిహయుని (ఇంద్రుని) జాచి యిట్లనెను-44. ఓ యింద్రా! నీవు ఈ సమస్త దేవతలతో ముకుందుని (విష్ణువును శరణము వేడుము. దైత్యశత్రువు, జగత్కర్తయైన యాతడు నీకు శ్రేయమును జేయును-45. అని చెప్పి పితామహుడైన బ్రహ్మ సమస్తదేవతలతో ఇంద్రునితో వెడలి పాలసముద్రమును జేరెను-46. తరువాత బ్రహ్మాది దేవతలందరు సర్వలోక మహేశ్వరుడైన శ్రీమహావిష్ణువును శ్రేష్టమైన పదములతో స్తుతించిరి-47. తరువాత భగవంతుడు వాసుదేవుడు సనాతనుడునైన శ్రీ మహావిష్ణువు జగద్రక్షణలంపటుడైయా సమస్త దేవతలతో నిట్లనెను-48.

భగవంతుడనేను : ఓ దేవతలారా! మీకు మీ తేజముతోనే యభివృద్ధిని గలుగజేయుదును. నేను చెప్పినదానీనాచరింపుడు-49. సమస్తమైన ఔషధిశ్రేష్ఠములను క్షీరసాగరమున బడవేయుడు. అసురులము గూడ సమముగా కలుపుకొని, మందరమును కవ్వముగా జేసి, వాసుకినీ కవ్వపుత్రాడుగా జేసి, నేను (అడుగున కూర్మరూపమున) సహాయముండగా అమృతమునకై యాక్షీరసాగరమును మధించుడు-51. సమస్త రాక్షసులతో సొంత్వన పూర్వకముగనే సముద్రమథన ఫలమిరువురికి సమానమని చెప్పుడు-52. సముద్ర మథనమున బుట్టిన సుధను ద్రాగుటచే మీరు (దేవతలు) బలవంతులును అమర్యులును (మరణము లేనివారును) ఆగుదురు-53. రాక్షసులు సుధనేమాత్రము త్రాగకుండగను కేవలము కష్టమును మాత్రమనుభవించునట్లు నేనే చేసెదను-54.

ఈ విధముగా హరిచే దేవతలందరు చెప్పబడిరి. అపుడువారు రాక్షసులను సముద్రమథనమున సాధనముగా జేసికొనిరి. అపుడు దేవదానవులు నానా విధములైన యోషథి గణమును దెచ్చి క్షీరసముద్రజలమున వైచిరి. చంద్రుని కంటెను నిర్మలమైన మందరమును కవ్వమునుగా జేసి వాసుకినీ కవ్వపు త్రాడుగా జేసిరి. ప్రయత్నముతో సముద్రమును మథింప బ్రారంభించిరి-56 దేవతలందరు వాసుకి తోకభాగమును బట్టుకొనుటకును, రాక్షసులందరు వాసుకి తలభాగమును బట్టుకొనుటకును హరిచే నీయోగింపబడిరీ-57. బలవంతలైనను రాక్షసులు వాసుకి నోటి బుసల యగ్నిజ్వాలలతో శరీరములు మాడి యందరు నిస్తేజస్కులైరీ-58. తోకభాగమును లాగుచున్న దేవతలు విష్ణు ప్రేరితమైన యనుకూలవాతముచే సేద దీర్చుకొనుచుండిరి-59. ఆదికూర్మావతారమునొందిన భగవంతుడైన విష్ణువు పాలసముద్రమధ్యన తీరుగుచున్న మందర పర్వతమునకు అధిష్టానమయ్యెను-60. దేవతల మధ్యలో నొక రూపమునను దానవుల మధ్య మరొక రూపమున ఉండి వాసుకీని వేగముగాలాగేను-61. బ్రహ్మరూపమున నామందర శైలమును సముద్రమునా క్రమించునట్లుగా జేసెను, మరొక రూపమున దేవరియై మహాతేజముతో మాటిమాటికి దేవతలను బలవంతులుగా జేసెను. బలాత్కారమును సహించు మరొక తేజముతో సర్వశక్తియైన జనార్దనుడు వాసుకినాగమును గూడ బలముతో వర్ధిల్లజేసెను. తరువాత దేవదానవులచే పాలసముద్రమావీధముగా మథింపబడుచుండగా-64. ముందర దేవపూజితయైన సురభి (కామధేనువు) ఆవిర్భవించెను. ఓ తపోధనుడా! అపుడు దేవతలును దానవులును సంతసించిరి-65, దేవదానవులచే మరల పాలసముద్రము మథింపబడగా, ఇదేమిటా! యనియాకారమున సీదులు చింతించుచుండగా-66. మదముతో కదులు కన్నులు గలదై వారుణీదేవి (కల్లు) బయలువెడలెను. ఆ రాక్షసులముందు చిరునవ్వు నవ్వుచూ నిలుచుండెను-67. ఆమెను దైత్యులు (రాక్షసులు) స్వీకరింపలేదు. కావున వారు అసురులు (సుర-(కల్లు) లేనివారు) ఐరి. సురలేని వారు అసురులు అనబడిరి-68. తరువాత నదీ సర్వదేవతల యెదుట నిలుచుండెను. బ్రహ్మచే సూచింపబడిన వారై దేవతలు ఆవారుణిని-సురను) స్వీకరించిరి. సురను స్వీకరించుటచే దేవతలు సురులనబడిరి-69. మరల సముద్రము మథింపగా పరిమళముతో జగమంతయు సుగంధితముగా జేయుచు పారిజాతమను మహావృక్షము ఆవిర్భవించెను-70. ఓ దేవరీ మిక్కిలి సుందరాకారులైన యప్సరోగణములు లోకమనోహరములైయావిర్భవించెను-71. ఆ తరువాత చంద్రుడు బుట్టెను. ఆతనినీ మహేశ్వరుడు స్వీకరించెను. విష సమూహములు కొన్ని పుట్టినవి. వాటిని నాగజాతులు స్వీకరించినవి-72. తరువాత బుట్టిన కౌస్తుభమను రత్నమును జనార్ధనుడు (విష్ణువు) స్వీకరించెను. తరువాత తనయాకుల గంధముతో మహౌషధులను గూడ మదింపజేయుచు ‘విజయ’యనునది బుట్టెను, దానిని భైరవుడు స్వీకరించెను-73. తరువాత దివ్యవస్త్రములు ధరించి దేవుడైన ధన్వంతరి స్వయముగా తన చేతనమృతకమండలమును ధరించి యావిర్భవించెను-74. ఓ తపోనిధీ! దేవతలు దానవులును, మునులును అపుడు సంతుష్టులైరీ-75. ఆ తరువాత వికసించిన కమలమున నుండు నట్టిది, వరమునిచ్చునట్టిది, పద్మముల హస్తములందుగలదియునైన శ్రీదేవి (లక్ష్మీదేవి) పాలసముద్రమునుండి పుట్టినది-76. అంత మునులందరు ఆ పరాశక్తి రూపణియైన లక్ష్మిని శ్రీసూక్తముతో స్తుతించిరి. సంతుష్ట హృదయులైన గంధర్వులు ఆమెను గొప్పగా గానముజేసిరి-77. విశ్వాచి మొదలగు సప్సరసల గణములు నాట్యము జేసినవి. గంగ మొదలగు పుణ్యనదులు ఆమె స్నామునకై సమీపించినవి-78. అష్టదిగ్గజములు గూడ పవిత్రపాత్రముల జలములు దెచ్చి పద్మవాసిని యైన యాశ్రీదేవిని స్నానము చేయించినవి-79. సాక్షాత్తు క్షీరసముద్రమే రూము దాల్చివచ్చి హరికి పరార్ధ్యయై యైక్యజయై పుట్టిన తులసికి పద్మమాలను సమర్పించెను-80. విశ్వకర్మ దీవ్యభూషణములనామెకు సమర్పించెను. ఆ విధమవుగా దీవ్యమాల్యాంబరధరరై దీష్యభూషణ భూషితయైన లక్ష్మీ అందరుచూచు చుండగనే విష్ణువు యొక్క వక్షస్థలమును జేరెను-81. ప్రభవిష్ణువైన విష్ణువుచే తులసి ధరింపబడినది. విష్ణువక్షస్థలి నన్ను సర్వమహేశ్వరియైన యా లక్ష్మీదేవి దేవతలను దయార్థ దృష్టితో జూచుచుండెను-82.

ఇది బ్రహ్మాండ మహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితో పాఖ్యానమున అమృతమథనమను నవమాధ్యాయము-9.