35 - మహాపద్మాటవ్యర్యస్థాపనకథనం

హయగ్రీవుడనేను:-

ఇక వాపీత్రయము మొదలగువాని కక్ష్యాభేదములను చెప్పెదను, దీనిని విన్నమాత్రమున లక్ష్మీమహోదయము గలుగును -1. మారుతయోజనముగల (విశాల వాయుసంపర్కము గల) వేయి స్తంభముల భవనములో ‘మనస్సు' అను మహాభవనముగలదు. అదీ సమస్త రత్నములతో విచిత్రముగా జేయబడినది-2, పూర్వభవనముల వలెనే గోపురములు, ద్వారములు, తలుపులు వాని గడియలు-మొదలగువానితో గూడికొనినది. దానీమధ్యకక్ష్యాభాగము మొత్తము అమృతవాపీక (అమృతపుబావి)-3. ఆ యమృతమును ద్రావీ పురుషులు, యోగులు, సిద్ధులు, వజ్రశరీరులు, మహాబలులు, ప్రాజ్ఞులును నగుదురు. అది రసాయనమే-4. అమృతము ఆ నిండిన బావిలో నీరుగానై యున్నది. దాని గంధమును వాసన జూచినంత మాత్రమున సిద్దీయనుకాంతకు పతియగును (సిద్ధినీ వశమందుంచుకొనును)-5, ఓ యగస్త్యా ఆ రెండు భవనముల ప్రక్కన అమృతపు బావి యొక్క రెండు తీరముల ప్రక్కన నుండి నీటిని తాకకున్నను. పురుషుని పాపములు నశించును-6. ఇక తక్కినయన్ని బావులు కోసు పొడవుగలవి. వాని జలమధ్యనలోతు నాలుగు యోజనములు-7: దానియొక్క మెట్ల వలయములు అనేక రత్నముల విచిత్రముగా చిత్రింపబడినవి. దానియందు హంసలును, సారసములు (కమలములు-బెగ్గురు పక్షులు), స్వర్ణవర్ణములు, రత్నవర్ణములును--8. మందములై చంచలములైన తరంగములు ఆ సరస్సు యొక్క ఒడ్డులను గొట్టుచున్నవి. పక్షులు రసాయనమయమైన యా క్రొత్త జలమును ద్రావి ఓ వింధ్యగర్వాపహరణా! యచట అజరామరత్వము (ముసలితనము-మరణము లేమితనమును పొందినవి. అచట కారండవపక్షులు తమ కూతల రూపములో-10. సల్లప్పుడును మహత్తరమైన లలితాదేవి మంత్రమునే జపించును. విశాలమై పాపికాచక్రమును జుట్టివచ్చుటకు నౌకావాహనమునకు దప్ప తక్కిన వారికి అచటికీబోవు మార్గములేదు. అచట మంత్రిణీ దండనాథల యొక్క యాజ్ఞచేత మాత్రమే 'తార'యను మహాశక్తి తో(త)రణేశ్వరీయై యుండును-12. అచట నల్లకలువలె నల్లనైన పరిచారికలు తారకు పెక్కురుగలరు. వారు సరసజమున వేలరత్నశోకలతో క్రీడింతురు-15. ఈవలి ఒడ్డునకు వత్తురు మరల నావలి యొడ్డునకు బోవుదురు. మాటిమాటికి వీణా-వేణు-మృదంగాది పాద్యములను వాయించుచుందురు-14. అట తారయొక్క నావికలు నవయువతులు కోట్లకొలదీ యుందురు. వారు మాటిమాటికి దేవియొక్క మిక్కిలి పుణ్యమైన కీర్తిని గానము జేయుదురు. నాట్యము జేయుదురు-15, కొందరు పడవ నడపు తెడ్లు చేతగలవారు, కొందరు శూగజలములను (పడవ నడుపుచున్నప్పుడు ప్రవహించు జలములు చేత ధరించి వదులుట యలవాటు ఆ జలము శూగజలముగా వచ్చును). కొందరు, ఆ యమృత జలమును త్రాగుచు నూర్లపడవలతో చరించుచుందురు-16. అనేక వాహక నౌకలుగలిగి నల్లని కాంతిగల శక్తులలో ప్రధానురాలు, తారాంబ. ఆమె జలసమూహమును శమింపజేయుటలో సమర్ధురాలు-17. మంత్రిణీదండధారల యొక్క యాజ్ఞలేక యా 'తార' యా వాపీకాజలములో ముక్కంటికిని తరించుపడవ నీయదు. (జలక్రీడ సలుపనీయదు)-18. గానము జేయుచున్నవారు, మణులతో సుందరతరములైన నౌకలతో దీరుగుచున్నవారు, అడుగడుగున మహారాణి యొక్క మహోధార్యమును జదువుచు గానము జేయుచున్నవారు-19. మణులతో జేయబడిన పానపాత్రలతో మధువును మిక్కిలి ద్రాగుచున్నవారు, మణిగృహమున ప్రతి సుందరమగు నింటనుండువారు-20. ఇటువంటి తారయొక్క నౌకాశక్తుల సమూహము మిక్కిలి సుందరముగా నుండును. ఓ యగస్త్యా కొన్ని నౌకలు బంగారముతో నొప్పినవి. కొన్ని మణులతో జేయబడినవి-21. కొన్ని మొసలి యాకారమున నున్నవి, కొన్ని లేడి యాకారముననున్నవి. కొన్ని నావలు సింహాసనము (సింహముఖము) వలెనున్నవి. కొన్నీ యేనుగ ముఖమువలె నున్నవి-22. ఈ విధముగా వీచిత్రరూపములుగల నౌకలచే జుట్టబడినదై తారాంబ యొక గొప్పవైన నౌకను ఎక్కి విరాజిల్లుచుండును-23. ప్రవాహమునకున అనుకూలముగాను వ్యతిరేకముగాను వాపికాజలమున సంచారము జేయుచు తారాంబ యీ కక్ష్యను (భవనాంతర్భాగమును) రక్షించును-24. 'మనస్సు' అనుభవనము యొక్క మధ్యన ఏడు యోజనముల దూరముగా “బుద్దిశాల' యను బ్రసిద్ధమైన భవనము నాలుగు యోజనముల యెతైనదై యున్నదీ-25, దాని మధ్య కక్ష్యాభాగమున మొత్తమానందవోపిక గలదు. అట దీవ్యమైనదియు, వకులము. (పొగడ)ల పరిమలములతో దట్టమైనదియు కాచీనబంగారు కాంతి గల మహామద్యము ఆవాపీజలముగా నుండును. ఆనంద వాపీక గాధలు పూర్వమువలెనే (పూర్వవాపికల వలెనే) చెప్పబడినవి. అచట మేట్లు మొదలగువాని క్రమము, పక్షులును పూర్వము వలెనే యుండును-27, అచటనున్న జలరూపమైన మద్యమును త్రాగుచు త్రాగుచు తీరముననున్న వారై శక్తులు మత్తుతో పిచ్చెక్కిన వారై యెఱ్ఱనైనవారై విహరించుచుందురు-28. సాక్షాత్తు వారుణీదేవియే యచట నౌకాధినాయిక. ఆమెను సుధామాలినిగను అమృతేశ్వరిగాను జెప్పుదురు-29. ఆ వారుణీదేవి అచట మణీనౌకలోనున్న శక్తి, సేనతో, జుట్టబడినదై కొద్దిగా చూచినంత మాత్రముననే ముల్లోకములమత్తెక్కించును-30, ఆమె. బాలసూర్యప్రభతో వెలుగును. మదముతో - చెక్కిళ్ళెబోరును, పారిజాత పుష్పమాలతో జుట్టి యలంకరించిన కొప్పు గలిగియుండును-31, కదులుచున్నకలువ వలెనున్న మద్యమునింపిన పాన పాత్రమును ధరించు చున్నది. అట్లేమక మణి పాత్రలో వండిన మాంసపు ముక్కనుంచినది-32. ఇటువంటి నౌకాశ్రేణులనాయిక. పొరుడీదేవి విరాజిల్లుచున్నది. ఆమె కూడ మంత్రిణీ దండనాథల యొక్క యాజ్ఞచేతనే యందరికిని వాపి లో వారుణీదేవి తరణమున (ఈదుటకు అవకాశమిచ్చును. అనుమతి లేనిచో ముక్కంటికి గూడ జలక్రీడావకాశములభింపదు-33. ఇక విశాలవాయుయోజనముగల 'బుద్ధి' యను మహాభవనములో అహంకారమను మహాభవనముగలదు. అది పూర్వమువాని వలె గోపురములతో గూడినది-34, ఆరెండు భవనముల మధ్యన కక్ష్యాభూమియంతయు ఓమునీ! “విమర్శవాపీక” యనునది కలదు. అది సుషుమ్లానాడికి సంబంధించినయమృతము. ఆకారము దాల్చినట్టిది-35. అది మహాయోగులయొక్క ప్రాణాయామవాయువునింపిన అంతర్ముఖమైన మనస్సు యొక్క రూపము. అది సుషుమ్లాదండము యొక్క వివరము (రంధ్రము) న పరమామృతముగా మేల్కొని యుండును-36. ఓ మునీ! అదియే యావాపికయొక్క జలము. పూర్వమువలెనే ఆ తీరములు మెట్లు పక్షులు - నౌకలు చెప్పబడినవి-37. అచట నౌకేశ్వరీ దేవి “కురుకుల్లా" అని ప్రసిద్ది. జెందినది. ఆమె తమాలవృక్షము (కానుగచెట్టు) వలె నల్ల నీయాకారముగలది. నల్లని కంచుక స్తనవస్త్రమును ధరించునది. తనతో సమానురాళైన యితర నౌకేశ్వరీలతో జుట్టబడినది. రత్నములతో జేసిన తెడ్లు చేతిలో గలది. నిత్యము ప్రకాశించు. మదముతో నునుపెక్కినది-89, మణినౌకను ఎక్కినదై నౌకేశ్వరీదేవి యోమునీ చుట్టు తిరుగును. పాపికయొక్క నీటి యొక్క గాథ పర్వమువంటిదే-40. విశాలమారుత యోజనముగల అహంకార భవనము యొక్కమధ్యన సూర్యబింబ మహాభవనము గలదు. అది నాలుగు యోజనముల - యెత్తెనదీ-41. అట లలితాపరమేశ్వరి వెలుగొందెను. అది సూర్యునకు గూడ గొప్ప అరుణోదయమయ్యెను. వారిద్దరి మధ్య కక్ష్యలోని భూమి కురువిందమణులతో బొదుగబడినది-42. అచట లేయేండ యొక్క ఒక్కుమ్మడిగా వచ్చుకాంతిలో (అగ్ని వలె నున్నదానిలో) మిక్కిలి తీవ్రమైన తపమును జేసి సూర్యుడు ఆకాంతిని బొందెను-43. సమస్త గ్రహరాశీగణములు, నక్షత్రములు, తారకలు అవి గూడ. ఇచటనే తపముజేసి లోకముల భాసింపజేయువానీగా సైనవీ-44. సూర్యుడను భైరవుడు అచట ఓమునీ! పండ్రెండు విధములుగానయ్యెను. (ద్వాదశాత్ముడయ్యెను) కోట్ల కొలది తైజసీశక్తులతో గూడిన వాడుగూడ నయ్యెను-45, మహా ప్రకాశరూపుడును, మదముచే నెల్లనైన కన్నులు గలవాడుగను, కంకోలితరుఖండములందు (అంకోల అయి ఉండును) నిత్యము క్రీడించు -సోనందమునకుత్సుకుడుగను "తన్మయుడుగను (సూర్యబింబమహాభవనమయుడుగను) అయ్యెను-46. దానీ యొక్క (సూర్యబింబంవంటి భవనము యొక్క మహాశక్తి మహాప్రకాశమనుపేరనున్నది. చక్షుష్మతి యను మరొక శక్తిగలదు. ఛాయాదేవియను మరొక పరాశక్తి కలదు - అనికూడ చెప్పబడినది-47. ఈ విధముగా మువ్వురైన యిష్టశక్తులతో జుట్టుకోనీ లలితామహేశ్వరి యొక్క విద్యలను హృదయమున జపించుచుండును-48. లలితాపరమేశ్వరీ, భక్తులయొక్క ప్రకాశవంతమైన (తేజోవంతమైన) యింద్రియములను జ్ఞాన ప్రకాశవంతములుగా జేయుచు-49. బహిరంతస్సులలోను తమోజాలమును సమూలముగా నీర్మూలించుచు, అచట లేయెండ కాంతీలో మార్తండ భైరవుడు (సూర్యుడను,భైరవుడు) ప్రకాశించును. విశాలమారుతయోజనముగల సూర్యబింబమహాభవనములో-50. చంద్రబింబమయమైన భవనము గలదు . అదీ నాలుగు యోజనముల యెత్తైనది. పూర్వము వానివలెనే గోపుర ద్వారకపాట అర్జల ములతో గూడినది-51. వాని మధ్యభూమియంతము చంద్రీకాద్వారమనబడును-52. ఆ చంద్రీకాద్వారమున సుధారణమైన తపముజేసి యత్రినేత్రమునుండీ బుట్టిన వాడై చంద్రుడు కాంతిని బొందెను-58. ఇచట సోమనాథుడను దేవుడుండును. అతడు నిర్మలమైన యాకారము గలవాడు. ముల్లోకముల చీకటిని నశింపజేయువాడు సంసారమును (సృష్టిని) నడిపించువాడు-54, పానపాత్రము నిండుగా వెన్నెల యమృతమును ద్రాగుచు ఇరువదియేడు' నక్షత్రముల శక్తులతో జుట్టబడి-55. ఎల్లప్పుడు నిండైన తనయాకారము గలిగి, కళంకము లేని నిజాకారముగలవాడై యచటనే చంద్రికాద్వారమున - భగవంతుడైన శశి (చంద్రుడు) ఉండును-56 ఆచంద్రుడు అశ్విని మొదలగు నక్షత్రములతో గూడి లలితాదేవియొక్క జపములతోను, స్తోత్రములతోను, పూజాశతములతోను ధ్యానములతోను కాలము గడుపును-57, ఇతరములైన తారా సోమధేయముగల శక్తులు గూడ నాతనిదగ్గరనే వేలకొలదియుండును. ఆకక్ష (భవనభాగము) వారితో నిండినది-58. ఇక విశాల వాయుయోజనము గల చంద్రభవనములో శృంగారమను భవనముగలదు. అది నాలుగు యోజనములయెత్తైనది-59. శృంగార భవన రూపములైన కౌస్తుభమణులచేతనా యన్నట్లు నిర్మింపబడినది. దానిమధ్యన మహాశృంగారమైన కోటగవను గలదు. అచట శృంగార రసపరిపూరితమైన కందకము చుట్టును నానా భూషణములతో.. బ్రకాశీంచీన శృంగార శక్తులున్నారు-61, వారు అచట వేలనౌకలలో దీరుగుచు- విజృంభించిన వారై యెల్లప్పుడు మదించి నౌకలోనున్న కుసుమాయుధుని (మన్మథుని) ఉపాసింతురు-62. ఆతడు లలితాజ్ఞకు లొంగినవాడై సంమోహనము మొదలగు బాణములతో సమస్త లోకములను విశ్వమును సంమోహింపజేయుచుండును-63. ఆతని ప్రభావమునకు ముగ్ధులై మహాపద్మాటవీస్థలమున నివసింపగోరుదురు. శుద్దవేషముగలవారై లలితాభక్తి నిండిన వారై సావధానమైన మనస్సుతో పద్మాటవీస్థలమునకు జేరుదురు-64. సురులు సిద్దులు సరులు అసురులు ఆపద్మాటవీ స్థలమునకు బోనేపోలేరు. సహజముగా శుద్ద చిత్తులైన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఆమెయాజ్ఞతో మాత్రము పద్మాటవీ స్థలమునకు బోవుదురు-65, సంసారులు రాగాంధులు, బహువాంఛలు ఊహలు గలవారు, గోప్పకులమునకు జెందినవారు, సంశయ జ్ఞానమను దుమ్ముబట్టినవారు, గాఢమైన రాగమున బ్రవేశించినవారు నైనపురుషులు ప్రౌఢులకు యావనములోనున్నవారికీ వ్యామోహమును గలిగించు మహాశృంగారమను - కందకమును తరించుటకు అసమర్థులు-67. దీనికి జయింపనలవిగాని సౌందర్యము గలిగీ త్రిలోకములలోని జనములను మోహింపజేయు వాడైన మన్మథుడు ఆ మహా శృంగార పరిఖకు అధికారిగా నుండుట కారణము-68. ఆతని యా మొత్తమును దాటి మహాత్ములను గూడ మోహింపజేయు మహాపద్మాటవిని జేరుటకు ఎవ్వడును సమర్థుడుగాడు-69. తరువాత ఏడుయోజనములుగల శృంగార భవనములో చింతా మణిగృహమను చక్రరాజమహా భవనము గలదు-70. దాని మధ్యలో మొత్తము భూమి అంతటను రత్నము లచేనలంకరింపబడినది. దాని పేరు మహాపద్మాటవి. అది సర్వసౌభాగ్యములనిచ్చునది-71. ఓమునీ! శృంగారమనే పేరుగలిగి మహాకాలుని వరకు గోపురముగలదు. నాలుగు దిక్కులలోను ఈ విధముగనే గోపుర వ్యవస్థగలదు-72. ఓమునీ! అన్నిదిక్కులలో ఆ చెప్పబడిన గోపురములు నూరుగలవు. భవనములు మాత్రము శుభములైనవి యిరుషదియైదు గలవు-73. అన్ని భనవములకును మూలముగా యోజనము పునాది దీసికొనబడినది. ఓమునీ! పద్మాటవీస్థలమును గూర్చి చెప్పెదను సావధానముగా వినుము-74. అచట సమస్తరత్నములు పొదిగిన యుయోజనములలోనంతటను గొప్ప కొండము (నోళము) గల స్థలపద్మములు (మెట్టతామరపూవులు, పెద్ద గులాబి పూవులు} గలవు-75. కాని కాండములు ఒక యోజనము పొడవైనవి మెత్తని ముండ్లతో జుట్టబడినవి, వానిరేకులు పడితాడి చెట్ల పొడవైనవి-76. ఆమెట్ట తామరపూవుల కింజల్కములు ఐదు తాడిచెట్ల పొడవైనవి. ఆతామరదుద్దులు పడితాడిచెట్ల యెత్తైనవి-77. ఇచట అనేకముగా కోట్లకోట్ల పద్మములుగలవు అని నూత్నసుగంధముతో మనోహరములు. వీరివిగల దళములతో గూడినవి. ఎల్లప్పుడు వికసించియుండునవి (పొడనివి). మిక్కిలి సుకుమారములైనవి-78. మహాపద్మాటవీకక్ష్యయొక్క తూర్పున ఓకుంభసంభవుడవైన యగస్త్యమునీ! ఒక కోసు ఎత్తైనదియు, అగ్నిరూపమైనదియు, గుండ్రముగానున్నదీయు-79. అరయోజనము వెడల్పైనదియు, పదకళలతో గూడినదియునైన అర్ఘ్యపాత్రమహాభారమున్నది-80. ఆయాధారము చుట్టును ప్రకాశించిన యాకారములతో శక్తులున్నవి. అవి సూర్యుని యొక్క ధూమార్చి మొదలగు పదీకళలు, ఉద్దీప్తమైన యావన సంపదగలవి. నానాలంకారముల నలంకరింపబడినవి. ఆధారరూపుడై, శోభావంతుడై భగవంతుడైన యగ్నిని అంతటను కౌగిలించుకొని మన్మథునిచే నలస భావమునందిన వైయున్నవీ-81, 82. ధుమ్రార్చి, ఉష్ణా, జ్వలినీ, జ్వాలినీ, విస్ఫులింగినీ, సుశ్రీ, సురూపో, కపిలా, హవ్యవహా, కవ్యవహా- అనునీపది కళలు వహ్నికాధారరూపిణులుగా చెప్పబడినవి-83. అచట నాధారముననుండు దేవుడు పాత్రరూపమునాశ్రయించెను (ధరించెను). సూర్యుడు ముల్లోకములచీకటిని నశింపజేయుటలో ప్రసిద్ధి చెందిన యుదయముగలవాడు-84. సూర్యాత్మకమైన యాపాత్రము ఒకటిన్నరయోజనముల యెత్తైనది. ఒక యోజనము పొడవు, వెడల్పులుగలది. మహాజ్యోతితో వెలిగినది-85. ఆ పాత్రమునకు చుట్టుగా పుత్రికలవలె శరీరముల నంటించి పండ్రెండు కళలుండును. అవి సూర్యుని కన్న మించిన కాంతిగలవి-86. తపినీ, తాపినీ, ధూమ్రా, మరీచి, జ్వలినీ, రుచి, సుషుమ్రా, భోగదా, వీశ్వా, బోధినీ, ధారిణీ, క్షమా-67. ఆపాత్రలో పరానందకారణమైన (ఇతరానంద, పరమానందకారణమైన) పరమామృతము కలదు. అది సమగ్రౌషధిరసములతో నొప్పినది. మనోహరమైన పరిమళముతో గూడినది-88. మిక్కిలి సుగంధములైన నల్లగలువలచేతను, వాడని చెంగలువలచేతను సువాసితమైనది నిత్యమనోహరమైనది. చల్లనీది తేలికయై నిర్మలమైనది-69. కదలుచున్న నూర్లత రంగములచే గంభీరమైనది. లలితాపూజకు తగినది. ఎప్పుడును శబ్దించునది, అర్చనకు కారణమై భాసించినదీ-10. ఆర్ఘ్యము (హస్తోదకము) చంద్రకళామయమైనయమృతమని చెప్పబడినది. దానియందు సన్నని చంద్రకాంతి కళలు నౌకామణులతో (కాంతులతో) గలిసిన చక్కగానున్నవి-91. అవి అమృతా, మానదా, పూషీ-92. తుషీ, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రికా, కాంతి, జ్యోత్స్న శ్రీ, ప్రీతి, అంగదా, పూర్ణా, పూర్ణామృతా, ఇవి యమృతకీరణుని కళలు. నవయౌవనమునిండి, ఎల్లప్పుడు నగుమోముగలవై-93. పుష్టి, ఋద్ధి, స్థితి, మేధ, కాంతి, లక్ష్మి, ద్యుతి, ధృతి, జరా, సిద్ది - అనునవి బ్రహ్మయొక్క కళలనబడినవి-94, స్థితి, పాలిని, శాంతి, ఈశ్వరి, తతి, కామిక, వరద, హోదిని, ప్రీతి, దీర్ఘ - అనునవి హరి (విష్ణువు) యొక్క కళలు-95. తీక్ష, రౌద్రి, భయ, నిద్ర, తంద్ర క్షుత్, క్రోధిని, త్రప, ఉత్కరి, మృత్యువు, ఇవి యటనున్న రౌద్రీ కళలు-66. ఈశ్వరుని కళలు పచ్చనివి, తెల్లనివి, ఎఱ్ఱనివి, సీతములు, అని నాలుగు కళలే శంకరుని వనబడినవి-97. ఇక, నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, ఇందిర, దీపిక, రేచీక, మోచీక-98. పర, సూక్ష్మ సూక్ష్మామృత, కళ, జ్ఞానామృత, వ్యాధిని, వ్యాపిని, వ్యోమ రూపిక, - ఈ పదునాలుశక్తులు అచట క్రీడించుచుందురనబడినది-99. రుద్రనౌకలో నెక్కినవారై, చంచలుడై వేలకొలది విద్యలు ఇటునటు శక్తి రూపమున క్రీడింతురు-100. హాస్తోదక సంశోధనము కొఱకు బ్రహ్మచే సృష్టింపబడిన వీరు ఆహస్తోదకమైన యమృతమును ద్రావీ శక్తు. లెల్లప్పుడును మత్తెక్కియుందురు-101. మహా పద్మాటవియందుండినను, మహాచక్రమునందుండినను కొంగొత్తనైనదియు, మాటిమాటికి సౌగంధ్యమునిండినదియు-102 ఆయమృతమైన మహారమును వేలకొలది మజీ కుంభములతోను, కోట్ల కొలదీ బంగారు కుండలతోను ఎల్లప్పుడు నింపి నింపి, చింతామణి గృహమందున్న వారి పరిచారక శక్తులు మదోద్ధతలే అణిమాది శక్తులకు అర్ఘ్యమును (హస్తోదకమును) ఇత్తురు-104 మహాపద్మాటవీ కక్ష్య యొక్క తూరుపు భాగమున అర్ఘ్యకల్పనము చెప్పబడినది. తరువాత నచట మరొకటి గూడ చెప్పబడును-105.

ఇది శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీనాసస్యసంవాదమున లలితోపాఖ్యమున మహాపద్మాటవ్యర్ఘ్యస్థాపనకథనమను ముప్పదియైదవ యధ్యాయము 35.