12 -  లలితాప్రాదుర్భవమను పండ్రెండవ యధ్యాయము.

రుద్రుని కోపాగ్నివల్ల బుట్టినందున భండుడు మహా బలుడు రౌద్ర స్వభావుడునైన దానవుడయ్యెను. తరువాత మహా తేజస్వియై దైత్య పురోహితుడైన శుక్రుడు వచ్చెను. మహా బలులైన నూర్ల కొలది దైతేయులును నచటికి వచ్చి చేరిరి.-2. తరువాత శుక్రునిచే నీయోగింపబడి భండుడు దైత్య వంశ్యుడై యాది శిల్పియైన మయుని బీలిచి విలువైన మాటను జెప్పెను-3. ఓమయ శీల్పి! పూర్వము దైత్యేంద్రులుండి ముల్లోకములు శాసించిన శోణిత పురమును అమరపురముగా జేయుమనెను-4. అది విని మయ శిల్పియు నా గొప్ప శోణీత పురమునకు వెళ్లి మానస వీక్షణముతో క్షణ కాలములో దానిని అమరపురముతో సమానమైన దానిగా జేసెను-5. తరువాత, శుక్రునిచేతను మహాబలులైన దైతేయులచేతను ఇంద్రుడుగా నభిషేకింపబడి ఉత్తమ లక్ష్మితోను లేజస్సుతోను గూడినవాడై ప్రకాశించెను.-6. పూర్వము బ్రహ్మచే హిరణ్యునకు (హిరణ్యకశిపునకు) ఈయబడినదియు, దైత్యేంద్రులచే నలంకరింపబడినదియు, సజీవమై యవినాశ్యమై బాల సూర్యునివలె ప్రకాశించు కిరీటమును శుక్రాచార్యుడీయగా బండాసురుడు ధరించెను-7. బ్రహ్మ నిర్మితములై చంద్ర ప్రకాశముగల చామరములను ధరించెను. వాటిని సేవించినచో రోగములు దుఃఖములును గలుగవు-8. పూర్వము బ్రహ్మచేతనే నిర్మింపబడిన గొడుగును గూడ శుక్రుడిచ్చెను. దానీ నీడలో గూర్చున్నవాడు అస్త్రకోటులతో గూడ బాధింపబడడు-9. విజయమను ధనువును, శత్రు సంహారియైన శంఖమును ఇంకను ఆయా మహారములైన భూషణములను ఇచ్చేను-10. ఆతనికి సూర్యునితో సమానమై యక్షయమైన సింహాసనమునిచ్చెను. తరువాత రత్న మూర్ఖ తేజస్సును వెదజల్లినట్లు ఆ సింహాసనమున గూర్చున్న వాడై భండాసురుడు సర్వాభరణములతో భూషితుడై మిక్కిలి తేజస్వీయయ్యెను-11. ఆ తరువాత భండాసురునకు - ఇంద్ర శత్రువు అమిత్రఘ్నుడు, విద్యున్మాలి, విభీషణుడు, ఉగ్ర కర్ముడు ఉగ్ర ధన్వుడు, వీజయుడు, శ్రుతిపారగుడు - అను ఎనమండ్రు పుత్రులు ఉండిరి.-12. సుమోహినీ, కుముదినీ, చిత్రాంగీ, సుందరీ అను నలుగురు వనితలుండిరి. వారు చూచుటకు ప్రియమైన వారు-13. కాలజ్ఞులైన సమస్త దేవతలు, ఇంద్రుడును - ఆ భండాసురుని సేవించిరి. అట్లే వేలకొలదీ రథములు, గుఱ్ఱములును, ఏనుగులును, కాల్బలమున్ను అతని సేవించిరి-14. శుక్రాచార్యమతముననుసరించి నడచుకొనువారై సమస్త దానవులు మహాకాయులు, గొప్పవారు జయముతో దీపించువారునై కలిసియుండిరి-15. మహాదేవుడైన శివుని బూజీంచుచు శీన శాసనములో నుండిరి. అచట దానవులు పుత్ర పౌత్ర ధనములతో గూడినవారైరి. ఇంటింట నంతటను యజ్ఞములు జరిగెను.-16. ఋక్కులు, యజుస్సులు, సామములు, మీమాంసాన్యాయాదులు దైత్యుల ప్రతిగృహముననపుడు ప్రవర్తిల్లుచుండెను.-17. మునుల యొక్కయు ద్వీజులయొక్కయు యజ్ఞములందు హవ్యభోజులు భుజించినట్లే దైత్యుల యజ్ఞములలోను హవిర్బోక్తలు హవిస్సులను. భుజించిరీ-18. ఈ విధముగా జేయుచు మత్తుడై ప్రకాశించు భండాసురునకు అణువదివేల యేండ్లు అర క్షణమువలె గడచిపోయేను-19. తపస్సు చేతను బలముచేతను బండాసురుని బలము వృద్ధి చెందుచుండెను. ఇంద్రుని బలము అంతకంతకు క్షీణించు చుండెను. అది చూచి కమలాపతి (విష్ణువు)-20. వెంటనే ఒక లోకవీమోహినియైన మాయను సృజించెను. ఆమెతో దేవ దేవుడైన జనార్ధనుడిట్లనెను.-21. నీవు నీ తేజముతో సర్వ ప్రాణులను మోహింపజేయుచు స్వేచ్చగా దీరుగుము. నిన్నెవ్వడును గుర్తించడు (తెలియడు)-22. నీవిట నుండి తొందరగా రాక్షస నాయకుడైన భండాసురుని కడకుబొమ్ము తొందరలోనే యాతనిని మోహింపజేసి విషయ సుఖములనను భవింపుము-23. ఈ విధముగా విష్ణువు నుండి మాయ వరమును బొంది యాతనికి నమస్కరించి తన సహాయముగా ముఖ్యమైన యప్సరసలనడిగెను-24. అట్లామెతో కోరబడిన హరి కొంత మంది యప్సరసలను బంపెను. ‘విశ్వాచి’ మొదలగునప్సరసలతో గూడినదై యా “మాయాదేవి మానస సరోవరము యొక్క శ్రేష్టమై యుజ్వల వృక్షములుగల తీరమును జేరెను-25. అచటనే భండాసురుడును తన స్త్రీలతో గూడి విహరించుచుండెను. ఇచట, లేడిపిల్ల కన్నులవంటి కన్నులుగల మాయాదేవి చంపక వృక్షము యొక్క మూలమున మధురస్వరముతో గానము చేయుచు రమ్యమైన నివాసమేర్పరచుకొనెను-26. అంత భండాసురుడు తన బలిషులైన మంత్రులావరీంచిరాగా నచటకి వచ్చెను. ఆమె వీణా గానమునువిని, శ్రేష్టమై మనోహరమైనయామెను జూచెను-27. సుందరమైన సర్వాంగములుగలది. రెండవ మెరుపు తీగవలె మెరయుచున్నది. ఆమెను జూచి మన్మథమను మాయామయ మహాగర్తమున బడిపోయేసు-28. ఆతని మంత్రులు గూడ ఎదలో మదన పీడితులైరి-29. ఆ రాక్షస రాజుచేత చాలాకాలము ప్రార్థింపబడిన మాయాదేవియు, మంత్రులచే ప్రార్థింపబడిన విశ్వాచీ మొదలగు అప్సరసలును వెంటనే యంగీకరించిరి-30. వారు అశ్వమేధాది మహాయజ్ఞములచేత గూడ బొందనలవిగానివారు. అట్టి మోహినీ మొదలగు వారిని బొంది పరమానందమునందిరి. వేదములను మరచిరి. అట్లే యుమాపతియైన శివుని గూడ మరచిరి-32. ఇతరములైన శుభావహములైన యజ్ఞములను గూడవదిలిరీ, వారి పురోహితుడైన శుక్రాచార్యుడును అవమాన హతుడాయెను. వారికి పదివేల సంవత్సరములు ఒక ముహూర్త (క్షణ) కాలమయ్యెను.-33. రాక్షసులు మోహితులుగాగానే ఓ బ్రాహ్మాత్మా నారదా ఇంద్రునితో బాటు దేవతలందరు పీడల నుండి విముక్తులై పరమానందమునందిరి-34. ఆ తరువాత నొకప్పుడు సమస్తదేవతలతో పరివృతుడై సింహాసనముననున్న ఇంద్రుని దగ్గరకు నారదమహాముని వచ్చెను-35. మండుచున్న యగ్నివలె ప్రకాశించుచున్న మునిశ్రేషునికి సమస్కరించి చేతులు జోడించి యింద్రుడిట్లనెను-36. భగవన్ సర్వధర్మముల దెలిసినవాడా! పరాపరవేత్తలతో శ్రేష్ఠుడా! నారదా! నీవు, ధన్యుని జేయదలచినవాని కడకే వెళ్ళేదవు-37. ఓ మునీశ్వరా! నీవు మాకు భవిష్యత్తులో శుభములగూర్చుటకే వచ్చితివీ.. నీయమృతము వంటి మాటల వీని శ్రవణానందముచే నిండి, సమస్త దుఃఖముల గడచి కృతార్థుడ నయితిని-38.

 నారదుడనెను : ఆ తరువాత విష్ణుమాయచేత భండాసురుడు సంమోహితుడయ్యెను. విష్ణుమాయావిముక్తుడైనచో మరొకయగ్నివలె లోకములనన్నింటిని దహించెడివాడు-39. నీ యొక్క తేజస్సులచేతను, అస్తములచేతను, మాయాబలముచేతను అతి బలుడైన భండారుని తేజోపహారమును మీక్కిలి చేయవలె-40. ఓ ఇంద్రా దేవియైన పరాశక్తి యారాధన దప్ప ఇతరమైన కల్పకోటి శతముల తపస్సుతో గూడ సాధ్యముగాదు -41. ఓ బాలిశులారా (పిల్లల వలెనజ్ఞానులైన దేవతలారా! శత్రువు యొక్క యుదయమునకంటే (అభివృద్ధికంటే) ముందే ఆ పరాశక్తి నారాధింపుడు. మీచే నారాధింపబడిన యా భగవతి మీకు శ్రేయమును గూర్చును-42. ఈ విధముగా నారదుడు బోధింపగా దేవగణేశ్వరుడైన యింద్రుడు సర్వదేవసమన్వితుడై యామునిని పూజించెను. తపస్సునకై సన్నాహము జేసికొని హిమవత్పర్వతతటమునకు వెళ్లాను-43. అట, సమస్తఋతువులబూయు పూవులతో గొప్పగా ప్రకాశించు భాగీరథీ తీరమున నఖీలదేవతలతో గూడి పరాశక్తి పూజనాచరించెను. అదియిప్పుడఖిల సీద్దుల నిచ్చునదై యింద్ర ప్రస్థమను పేరబరగిను-44. బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు చెప్పిన విధముగా దేవియొక్క మహాపూజను జేసిరి అట్లు దేవీమహాపూజ జేయునట్టియు, జపధ్యానరతాత్ములైనట్టియు, ఉగ్రమైన తపముననుండి, దేవితో ననన్యముగా (అభేదము) చిత్తము నర్పించినట్టి దేవతలకు పదివేలయేండ్లు పది దినములు గడచినవి-46. ఇక మాయామోహినీమోహితులైన రాక్షసులను జూచి, మహామతియై రాక్షస పురోహిత గురువైన శుక్రుడు భండాసురుని కడకు వచ్చి యిట్లనెను-47. ఓ భండాసుర రాజేంద్ర! యీ దానవ విద్వఛ్ఛేష్ణులందరును నిన్నాశ్రయించియే నిర్భయులై ముల్లోకములదు స్వేచ్ఛావిహారులై తిరుగుచ్నూరు-48. హరి యెల్లప్పుడు మీ జాతినీ మీయందరిని జంపును. అతని చేతనే యీ మాయ నిర్మింబడినది, దానితో నీవు మోహితుడవు గూడనైతివి-49. నీవు మోహితుడవైనట్లు చూచి నీలోని లోపములనే వెదుకుటయందు మిక్కిలియాసక్తి గల యింద్రుడు మిమ్ముల జయించుటకై మహాతపము జేయుచున్నాడు-50. కావున ఈ మాయామయిని వీడి మంత్రులతోబాటు హిమవత్పర్వతమునకు బోయి నీ శత్రువులకు (ఇంద్రాదులతపములకు) విఘ్నము చేయుము-51. ఈ విధముగా గురువైన శుక్రుడు జెప్పగా, భండాసురుడు మాయాశయ్యను వీడి మంత్రివృద్ధులను పిలిచి శుక్రుడు చెప్పినదంతయు తెలిపెను-52. అది విని శ్రుతవర్మ పరిస్థితిని విమర్శించి భండునితో - రా నీకు శివుడిచ్చినది అరువది వేల యేండ్ల రాజ్యము-23. ఓ వీరుడా! అంతకంటే నెక్కువనే గడచినది. శివుడు చెప్పిన కాలమునకు వ్యతిరేకముగా జేయుట అశక్యము-54. శివుని నర్చింపక యాతడు నియమించిన కాలముదాటుట అశక్యము. కాలముననుసరించి సుఖమునుగాని దుఃఖమునుగాని యనుభవింపవలెను అనేను-55. ఆ తరువాత భీమకర్ముడనువాడు బలముననుసరించి, శత్రువుపేక్షింపదగినవాడుగాడు. శత్రుతపఃక్రియాదులకు విఘ్నము జేసినచో ఓ భండాసురేంద్రా! నీకే విజయము కలుగును-56. నీ యుద్ధమున శత్రుబలమును హరించు విద్య శివునిచే నీకీయబడినది. కావున నెల్లప్పుడును నీకేవిజయము గలుగును-57.: అని అనెను, దానవపతి భండాసురుడును ఆతని మాటకు సమ్మతించెను, సేనలతో సహ వెళ్ళి హిమవత్పర్వతతట మునకు వెళ్లెను-58. తపోవిఘ్నము. జేయు రాక్షసులను జూచి జగదంబిక యెదుట దాటనలవిగానీ ఉజ్వలమైన గొప్పప్రాకారమును సృష్టించెను-59. దానిని జూచి భండాసురుడు గూడ ఇది యేమీ అని యాశ్చర్యముజేందీ మిక్కిలి కోపించి బలముతో దానవాగ్రముతో ఆ ప్రాకారమును భగ్నముజేసెను-60. మరలనాప్రాకారమట్లే రాక్షసులదుట దాటనలవిగానిదిగా నిలిచెను. ఆధీరుడు. భండాసురుడు వాయువ్యాస్తముతో భగ్నముజేసి గర్జించెను.-61 మాటిమాటికి ఆ ప్రాకారము భగ్నమగుచునే యథాప్రకారముగా నిలుచుచుండెను. ఇది చూచి భండాసురుడు దుఃఖితుడై స్వపురమునకు వెళ్ళెను-62. జగమును ధరించు నామెను, ఉజ్జల ప్రాకారమును జూచి దేవతలు భయముతో అన్ని క్రియలు మాని బాధజేందిరి-63. అంత, ఇంద్రుడు దేవతలతో ఇదిగో భండాసరుడిక్కడికి వచ్చెను. ఆతనితో యుద్దము జేయుట మనందరికిని సాధ్యముగాదు”-అనెను-64. పరుగెత్తిపోయినను మనకు ఎక్కడను గతిలేదు. యోజన విస్తారముగల శోభనమైన కుండము చక్కగా నిర్మించి యజ్ఞముజేసి పరాశక్తిని బూజించెదము-65. మహాయాగ విధానముతో అగ్నిహోత్రుని స్థాపించి ఓ దేవతలారా! మనము మహామాంసముతో (మన వ్యక్తి మాంసముతో) హోమముజేసి పరాశక్తిని బూజింతము దాన బ్రహ్మత్వమును బొందిన వారమైనను అగుదుము. లేదా స్వర్గముననుభవింతుము. : ఇట్లనగనే ఇంద్రుని ముందడుకొనీ దేవతలందరు-67. విధిప్రకారముగా శరీరములను వారి మాంసములను లాగిలాగి మంత్రపూర్వకముగా హోమము జేయసాగిరి. ఆ విధముగా సర్వమాంసములును, పాదములును చేతులును పరాశక్తికై హోమముజేసిరి-68. ఇక దేవతలు తమ మొత్తము శరీరములను హోమము చేయదలంచినంతనే ఒక యనుత్తమమైన (అంతకన్న యుత్తమము జగమున లేనట్టి) పరమతేజఃపుంజము ప్రాదుర్భవించెను. (ఆవిర్భవించెను)-69. దాని మధ్యన నొక చక్రాకారము ఆవిర్భవించాను. దాని మధ్యమున మహాదేవిని జూచిరి. ఆమె ఉదయ సూర్యకాంతి వంటి కాంతి గలిగినది-70, జగదుజ్జీవనకరీ, బ్రహ్మ విష్ణు శివాత్మిక, సౌందర్యసార సీమాంత, ఆనందరస సాగర-71 జపాకుసుమ (పారిజాతపుష్ప) వర్ణముగలది. దానిమ్మ పూవురంగుగల వస్త్రము (చీర) ధరించినదీ, సర్వాభరణములతో గూడినది, శృంగారరసమునకు ఒకే ఒక నీలయమైనదీ-72. ఆమె క్రీగన్నులు కృపాతరంగితములు. ఆమె చూపులతో వెన్నెలలు విరియును. పాశము-అంకుశము-చెఱకువిల్లు-పంచబాణములు-ఇవియొప్పిన నాలుగు చేతులుగలది-73, అభిలాత్మికయైన ఆ మహాదేవినీ జూచి ఇంద్రునితో బాటు దేవతలందరును సంతుష్టాంతరంగులై నమస్కరించిరి-74. ఆమె వారిని చూచేను వెంటనే ఆ దేవతలందరు విగతజ్వరులైరి. సంపూర్ణాంగులైరి. మిక్కిలిదృఢులైరి. వజ్రదేహులైరి. మహాబలులైరి. ఆ దేవతలు అఖిలార్థముల నిచ్చునంబికయైన యామహాదేవిని స్తుతించిరి.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున లలితోపాఖ్యానమున లలితాప్రాదుర్భావమను పండ్రెండవయధ్యాము.