బ్రహ్మాండ మహా పురాణము
26 - విషంగపలాయనం
ఇక శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున భండపుత్రవధమను నిరువదియారవయధ్యాయము .
పది యక్షౌహిణుల సైన్యముతో గూడి వీర్యవంతుడైన కుటిలాక్షుడు, దండనాథ యొక్క వాడియైన బాణములతో రణమున భగ్నుడై పారిపోయెను. రాత్రి యందామె చేత పది యక్షౌహిణుల సైన్యము ధ్వంసము చేయబడినదీ. తరువాత నీ వృత్తాంతమును విని భండాసురుడు క్షోభమును జెందెను. రాత్రియందు దుష్టులైన రాక్షసుల కపట యుద్దమును విని మంత్రిణియు దండనాథయు నిర్వేదమును (హేయత్వ బుద్ధిని) బొందిరి, ఆశ్చర్యము అయ్యో! దానవులతో దేవికి మిక్కిలి కష్టము వచ్చిపడినది. పైకి వెలిగిన బుద్ధిగల మేమెదుట ముందుకు సుదూరముగా దాడి వెడలితిమి. మహాచక్రరథేంద్రము యొక్క రక్షణము సైన్యముల చేత జరుగలేదు. ఈ యవసరము దీసికొనీ రాత్రిలో దుష్టులు పరాక్రమించిరి, అక్కడ ఏ వృత్తాంతము జరిగినది! స్వామిని ఏ రణము జేసినది! ఇతర శక్తులేమైన నచట మహాసురులతో యుద్ధము చేసిరా? . ఈ కార్యము విమర్శింపదగినది. అచట ప్రవృత్తి యెట్టిది? మహాదేవి యొక్క యెదలో ఏ ప్రసంగమున్నది? - అని యచట దండనాథ మొదలగువారు శంకచే ఆకులురు. వెంటనే మంత్రిణిని ముందడుకొని లలితా దేవి కడకు కదలిరీ. రాత్రి గడషగనే ఆ సమస్త శక్తి చక్రము యొక్క సేనానాయకురాళ్లు పూజింపబడినవారై వేగముగా రథేంద్రమును చుట్టుముట్టిరీ-రీ. మంత్రిణీ - దండ సాయికలు తమ యానము (వాహనముల) నుండి దిగి క్రింద సైన్యము నావేశించి చక్కపరిచి యపుడు రథమునెక్కిరి. ఆయా పర్వముల నుండు శక్తి చక్రములు లలిత. యునీకీనీ నివేదింపగా వేగమైన నడకలతో క్రమముగా తొమ్మిది పర్వములను దాటి. మంత్రిణీ దండనాయికలు మహారాజ్ఞిని జేరి సేవించిరి. భూమిపై సాష్టాంగముగా బడి నమస్కరించి యీ విధముగా విజ్ఞాపనము చేసిరి. ఓ అంబికే! మహా ప్రమాదము వాటిల్లినదని వింటీమి. నీచ రాక్షసులు కూట యుద్ధ ప్రకారమున నపకారము జేసిరి. ఆ దురాత్ముడు, దురాచారుడు పగటి యుద్ధమునకు భీతిల్లి కపట వ్యవహారముతో జయసిద్దిని గోరుచున్నాడు . దైవ వశమున మనస్వామిని యొక్క శరీరముపైన బాణములు మొదలగునవి తాకుట జరుగలేదు. కావున వాడు జీవించియున్నాడు. ఓ మహారాజ్ఞి! నీ పాదమునొక్కదానినే యాధారముగా జేసికాని మేమందరము జీవించుచున్నాము. కోరిన దానిని సాధించుచున్నాము. కావున మేము శ్రీమతి యొక్క యంగరక్షణము జేయవలసియున్నది. దానవేంద్రులు మాయావులు. కావున అటువైపుగా మంత్రము. ఆలోచనము, మాయా నివారక మంత్రము)ను ప్రయోగింపుడు, ఆపత్సమయములలో భండాసురుడు మొదలగు రాక్షసాధములను జంపవలెను, " అపుడు వారు. కపట , యుద్ధమును జేయరు. ఈ మనసేనలో బ్రవేశింపరు. మహేంద్రశైలము యొక్క దక్షిణ భాగముగా నూరు -- యోజనముల వరకు విస్తరించిన శిబిరమును నిర్మింపవలెను. మన సేనా నివాసమునకు రక్షణకై గుండ్రని వహ్నిప్రాకారమును నిర్మింపవలెను. దాని వలన శత్రువుల మదము శాంతించును. నూరు యోజనముల పరిమాణమున ప్రాకార మధ్యప్రదేశము నేర్పరుపవలె, వహ్ని ప్రాకార చక్రమునకు ద్వారము దక్షిణమువైపు నుండి యుండవలె. కారణము. శత్రువుల పరమైన శూన్యకపురము . -అందు దక్షిణ దేశముననున్నది. ద్వేరమున ఆయుధములనెత్తి సిద్ధముగానున్న పెక్కు పరివారముల నీయోగింపవలె. వారు వచ్చువారినీ, పోవువారిని అడ్డుకొందురు. వారికి అలసట యుండదు. నిద్రమత్తులుండవు. ఎప్పుడును సంసిద్దులుగా నుందురు. ఈ విధముగా జేసినచో, అసమయములగు సంధ్యలలోను, మధ్యరాత్రులలోను ఆ దుష్టదానవులు చేయదలచీన కపట యుద్ధము సాధ్యపడదు. అకస్మాత్తుగా . హరి ప్రౌఢమైన యాక్షణము సంభవముగాదు . అట్లుకానిచో దురాశచే బహు మాయ. అవలంబించిన దైత్యులు. పశ్యతోహరునివలె (చూచుచుండగనే దొంగిలించువాని (కంసాలి) వలే) మన మహాసైన్య బలము నంతయు హరించి వైచెదరు. మంత్రిణి యొక్కయు దండనాథ యొక్కయు నీ మాటలను విని స్వచ్ఛమైన దంత కాంతిచేత ముత్యముల వెదజల్లుచు లలితా దేవి యిట్లనెను. మీ యొక్క యీ మంత్రాలోచనము చక్కని బుద్దీతో చేయబడినది. ఇదియే కుశలమైన బుద్ధి యొక్క మార్గము. ఇది ప్రాచీనమైన నీతి. జయింపగోరు మహాజనులు దృఢమనస్కులై తమ సైన్య చక్రము యొక్క రక్షణము జేయవలెను. తరువాత పరసైన్య చక్రము సక్రమింపవలెను, ఈ విధముగా మంత్రి-దండనాధలతో జెప్పి శ్రీ లలితా పరమేశ్వరి జ్వాలామాలినికయను నిత్యాశక్తిని బిలిచి యిట్లనెను. హే వత్సే! నీవు అగ్ని స్వరూపవు. జ్వాలామాలామయము నీయాకారము. నీవే మహాసైన్య బలమును రక్షింపుము. నూరు యోజనముల . విస్తారమైన భూతలమునావరించి ముప్పది యోజనములు పైకి క్కినవైన జ్వాలామాలలయాకారమును వహింపుము. ద్వారప్రదేశమునందు యోజన మాత్రము వదిలి తక్కిన చోట నంతటను మండుచున్న శరీరము గలిగి అగ్ని జ్వాలా రూపమునంది సమస్త బలమును (సైన్యమును) రక్షింపుము. జ్వాలామాలినీకానిత్యాశక్తితో నిట్లు చెప్పీ లలితేశ్వరి మహేంద్ర పర్వతము యొక్క యుత్తర భాగమునకు బోవయత్నము జేసెను. ఆ నీత్యాశక్తి నీత్యయయి, (నాశనములేనిదై} మండుచున్న జ్వాలలే తన యాకారముగా గలది. చతుర్దశీతిథమయి - అట్లే చేసెదనని యామెకు నమస్కరించెను. లలితా దేవీ పూర్వమే చేప్పిన మహేంద్ర పర్వతము యొక్క ఉత్తర భూ భాగమును చుట్టుముట్టి యా జ్వాలా మాలినీ ఒక శాలము రూపమున (సైనిక నివాసము వలే) ప్రకాశించెను. (అది భయంకర అగ్ని జ్వాలలచే రక్షింబడుచున్నట్లుండెను. ). దండనాథ యొక్కయు మంత్రీనాథ యొక్కయు సైన్యము గూడ ఆకాశమండలమునుకుబారీన జ్వాలా మాలామయమైన యాకారముగలదై ప్రకాశించెను. (జ్వాలలు ఆకాశమునంటి ప్రకాశించెను). ఏ మాత్రము శ్రమ లేకయే తక్కిన మహాశక్తుల యొక్క మహా బలమును అగ్ని జ్వాలా రక్షితమైన శాలమున ప్రవేశించెను, దండినీ శక్తి రాజచక్రరథమును మధ్యన నుండజేసెను. తన రథమును ఎడమ భాగమున నుంచేను. దక్షిణ భాగమున శ్యామలాదేవి రథమును నుండజేసెను. పశ్చిమ భాగమున సంపదీశ్వరిని, ముందున హయాసనను, ఈ విధముగా చక్ర రాజరథము యొక్క చుట్టును శక్తులను వాని రథములతో నుండజేసెను. ద్వారమున స్తంభిని యను దేవత నుండజేసెను. ఆమె యిరువది యక్షౌహిణుల సేనగలది. మండుచున్న దండాయుధములతో భయంకరమైనది. ఈమె దండనాథయొక్క వీఘ్నదేవిగా ప్రసిద్దీజెందినది. పగ్గపు త్రాడు ధరించిన దండనాథ సేనా శిబిరమును సురక్షితముగాజేసి సూర్యుడుదయింపగనే మరల యుద్దమారంభించెను, శక్తి మహాసేన కిలకిలా రావముజేసి అగ్ని ప్రాకారకద్వారము నుండి మహాధ్వనులతో బయలువెడలినది. ఈ విధముగా లలితా సైన్య మధ్య భాగము సురక్షితమని విని భండాసురుడు మరల సంజ్వరమును బొందెను. కుటిలాక్షుడు మొదలగు మంత్రులతో, విషంగునితోను, విశుక్రునితోను, ఆత్మసుతులతో గూడ సమముగా సమాలోచనము జరిపెను. మహా బలుడైన భండుడు తన పుత్రులందరినీ ఒకే గుంపుగా ప్రయోగించి యుద్ధము జేయదలచేను. నాలుగు సముద్రములతో సమానులు, యుద్ధ కృత్యములతో చతురులునైన చతుర్బాహువు మొదలగు పుత్రులను బీలిచి భండాసురుడు భయంకరక్రోధమున మండిపడుచు యుద్ధమునకు బంపెను, ఆతని పుత్రులు ముప్పదుగురు. మహాకాయులు, మహాబలులు. ఓ అగస్త్యా! వారి నామముల జెప్పెద వినుము. చతుర్బాహువు, చకోరాక్షుడు, చతుఃశిరుడు మూడవవాడు వజ్రహోషుడు, ఊర్వకేశుడు, మహాకాయుడు, మహాహనువు. మఖశత్రువు, మఖస్కందీ, సీంహఘోషుడు, సీరాలకుడు, లడునుడు, పట్టి సేనుడు, పురాజిత్, పూర్వమారకుడు-48. స్వర్గశత్రువు, స్వర్గబలుడు, దుర్గుడు, స్వర్ణ కంటకుడు, అతిమాయుడు, బృహన్మాయుడు, ఉపమాయుడు, వీర్యవంతుడు , ఈ వీరు దుర్మదులు దుర్బుద్దులునైన భండాసురుని పుత్రులు. తండ్రితో సమానమైన దుష్టపరాక్రమము గలవారు, తండ్రితో సమానమైన యాకారము గలవారు. వారు వచ్చి భండాసురుని పొదములకు. భక్తితో నమస్కరించిరి. వారిని చూచి ప్రసన్నమైన కన్నులతో ఆ కులఘాతకుడైన భండాసురుడు సగౌరవముగా నీ మాటలు పలికెను. ఓనా పుత్రులారా! మీకీ భూమిలో సమానులెవరు. మీ యొక్క బలముచేతనే పూర్వమునేను విశ్వమును జయించితిని-52. మీరు రణమున కోపముతో ఇంద్రుని యొక్కయు, అగ్ని యొక్కయు, యముని యొక్కయు, నీరృతియొక్కయు, వరుణని యొక్కయు సీగలను బట్టిలాగితీరీ-53. మీ సమస్త శస్త్రాస్త్రములును మీరును మేలుకొని యుండగనే యీ కులభ్రంశము వచ్చినదని తెలిసికొనుడు-54, మాయామిని, దుష్ట సౌందర్యముగలది, యుద్ద దుర్మదయునగు. నొకానొకగ్రీ, తనతో సమానమైన బహు స్త్రీలతో గూడినదై మసలను. జంపుచున్నది-55. కావున నీమేను యుద్దమున మీ వశము జేసికొనుడు. మండుచున్నయాయుధములుగల మీరు ఆమెను సజీవముగా బట్టుకొనవలె-56. అపరిమితకోపాంధ్యముగల మీమ్ములనొక స్త్రీ పైకి బంపుట యనుచితమే! ఐనను. ఇది విధి యొక్క క్రమము, తప్పలేదు-57. ఈ మీ శౌర్యకీర్తవ్యతిరేకము నొక్కదానిని సహింపుడు. అని చెప్పి భండాసురుడు తన పుత్రులను యుద్దమునకు బంపెను. రెండు వందల యక్షౌహిణీ సైన్యములను గూడ వారికి తోడుగానంపెను-58. రెండు వందల యక్షావోడీ సేనాముఖమునకు తీలకమువలె నున్నవారై, కనుబొమ్మలు ముడిచి శస్త్రములను చేత ధరించి భండపుత్రులు గృహమునుండి వెడలిరీ-55. భండ పుత్రులు బయలుదేరినపుడు భూమి. కంపించినది. అనేకములైన యుత్పాతములుగలిగినవి, జగమంతయు భయమందెను-60, వీధులలో తమ తమ వాహనములలోనికివెళ్లుచున్న .. మహాబలులైన యా కుమారులపైన పౌరులలోని ముసలి ముత్తైదువలు పేలాలను జల్లిరి-61. వందిమాగధులు కుమారుల స్తుతించిరి. ద్వార ద్వారమున పుర స్త్రీలు మంగళహారతులిచ్చిరి-62. వారు బయలు వెడలినప్పుడు భూమీ భేదింపబడుచున్నట్లుండెను. ఆకాశము లోగబడుచున్నట్లుండెను. సముద్రము సుళ్లు త్రిప్పబడుచున్నట్లుండెను-63. భండాసుర పుత్రులు రెండు వందల యక్షౌహిణీ సేనల దీసికొని కోపముతో పైకి కనుబొమ్మల ముడిపెట్టినవారై క్రూరముఖములతో పురము నుండి బయలువెడలిరి-64 రణములో క్షణమున శక్తి సేసలనన్నింటిని భక్షింతుము, వారీయాయుధ సమూహములను వాడి బాణములతో చూర్ణము చేసెదము-65, అగ్ని ప్రాకారవలయమును వెంటనే చల్లార్చెదము. ఆ తరువాత వెంటనే దుశ్చతురయైన లలితను బందీగా జేసెదము-66. ఈ విధముగా పరస్పరము వీర భాషణ - హోషణలతో అశ్వధారల సడిపించుచు భండాసుర కుమారులు అగ్ని ప్రాకార సమిపమనకు జేరిరీ-67. యౌవనముతోను మదముతోను అంధులై బొమ్మముడులు వైచుటచే కుటిలముఖులుగా నుండి మిక్కిలి గొప్ప సింహనాదమును జేసిరి-68. అది ఉత్పాత కాలమేఘము నుండి పడిన భయంకరమైన పిడుగు పొటు వలె నుండెను. ఆ సింహనాదముతో బ్రహ్మాండము బ్రద్దలైనట్లయ్యెను-69. అపూర్వమైన యీ మహాశబ్దము యొక్క విజృంభణము శక్తుల యొక్క చెవులను మనస్సులను క్షోభింపజేసెను-70. ఆ విధముగా తమ సైనికులతో బాటు వచ్చి వివిధాయుధములతో గొట్టుటచే వైమానికుల సమూహమును మూర్చిల్ల చేయుచు కలకలము జేసిరి-71. చతుర్బాహుముఖులుగా నయి యుద్దము జేయవచ్చిన రాక్షసకుమారులను జూచీ బాలాశక్తి మిక్కిలి కౌతూహలమును వహించెను-72. ఆమె కుమారి. ఆ లలితాదేవి సమీపమున నుండునది. సమస్త శక్తి మండలములకును పూజ్యురాలు. పరాక్రమ శాలినీ-73. లలితతో సమానమైన యాకారముగల యా కుమారి కోపము వహించెను. ఆమె నవవరవలే సర్వ విద్యలకు మహాఖనీ-74. బాల సూర్యునివలె నెఱ్ఱని గుండ్రని పిరుదులుగలది. ఎఱ్ఱని తీవవంటి శరీరముగలది. మహారాజ్ఞి యొక్క పాద పీఠమున నిత్యము తన సన్నిధానముగలది-75, ఆమె. లలితకు బహిశ్చరములైన ప్రాణముల స్వరూపము. నాలుగవ విలోచనమున్ను. “ఆ వచ్చిన భండాసుర పుత్రులను వేగముగా జంపెదను"-76. అని బాలాంబ నిశ్చయించి మహారాజ్ఞికి ఈ విధముగ విన్నవించెను. మాతా! భండమహాసుర పుత్రులు యుద్దమునకు వచ్చిరి-77. కుమారి నగుట వలన ఉత్సాహము గలదానిపై వారితో యుద్ధము జేయదలంతును. ఈ యుద్ధ కుండూతితో నా భాహువులు కదలుచున్నట్లున్నవి-78. ఇదీ నా కొకయాట. నా కడ్డు దగిలి నీవు వారిని చంపవలదు. నేను బాలికను గదా! నాకు నిత్యము ఆటలయందు మక్కువ యెక్కువ-79. క్షణ కాలము రణక్రీడచే చిత్తమున భీతినందెదను- అనీ బాలాంబ విన్నవించగనే దేవి కుమారికి మారుబలికెను-80. ఓ చిన్నదానా - నీవు మిక్కిలి సుకుమారాంగివి. తొమ్మిది యేడులదానివి. క్రొత్త క్రమము (నడక) కలదానపు. కొత్తగా యుద్ధ శిక్షయు నేర్చిన దానవు. నీవు నాకొక్కగా నొక్క కుమారివి-81. నీవు లేకుండగా నాకొక్క క్షణము గడవదు. సో ప్రాణమే నీవు. నీవు యుద్ధమునకు బోకుము-82. దండిని, మంత్రిణి మొదలగు తక్కిన శక్తులు యుద్ధము జేయుటకు కోట్లకొలదియున్నారు. ఓ చిన్నదానా! ఎందులకేమరుపాటు నందెదవు-83. అని శ్రీ లలితాదేవిచే నివారింపబడినను కుమారిక తన కౌమారకుతూహలమున సావేశితురాలై యుద్ధము జేసెదనని మరల అడిగెను-84. ఆమె సుదృఢమైన నిశ్చయమును జూచి.శ్రీ లలితాంబిక బాహువులతో కుమారిని గాఢముగా గౌగిలించుకొని యనుమతించేను-85. తనకవచము నుండి యొక కవచమును దీసి యామెకిచ్చెను. తన యాయుధముల నుండి యా యుధములను గూడ నిచ్చి యా కుమారిని రణమునకు బంపెను-86. మహారాజై యొక్క ధనుర్గండమునుండి వెలువడిన కర్జీరథమును కుమారిక యధిరోహించెను. ఆ రథమునకు నూరు హంసలు వాహనములు-87. ఆమె రణమునకు బూనుకొనగా, డానియన్ని పర్వములందుండు దేవతలు ధరింపబడిన ఖడ్గపంక్తులతో చేతులు జోడించి నమస్కరించిరీ-88. వారు నమస్కరించుచుండగా ఆ కుమారి చక్రరాజరథోత్తమము నుండి దిగిభూమీ మీదనున్న సైన్యమును బ్రవేశించెను-89. కోపముతో నెరుపెక్కీ క్రిందుగా వచ్చుచున్న కుమారిని జూచి మంత్రిణీ దండనాథలు భయముతో. నిట్లనిరి-90. ఓ భర్తృదారికా (యజమాని బిడ్డా!) నీవు యుద్ధము జేయనెందులకు యత్నింతివి? తప్పని పరిస్థితిలో మహారాజ్ఞచే రణమునకు బంపబడితివా? -91. సైనికులుండగా నిది నీకుతగదు, ఓ బోలాంబికా! నీవు శ్రీదేవికి ఆకారము దాల్చిన జీవితమవు-92. నీకు నమస్కారము జేసెదము. రణము నుండి మరలిపొమ్ము - అని మంత్రీజీ దండనాథల యిరువురిచే బ్రార్థింపబడినను కుమారీ దృఢ నిశ్చయమై రణమునకే కదలెను-93. మిక్కిలి యాశ్చర్యమునందీన మంత్రీడీదండనాథలు ఆమె రక్షణకై యామె యిరుపక్కల తోడు వెడలిరి-94. గొప్ప సేనలతో మంత్రిణీదండనాథలు వెంటరాగా అగ్నియావరణ ద్వారా కుమార్ బయలువెడలెను-95, కర్ణీరథము నధిష్టించిన కుమారికి సేనానాయికలతోబాటు సేనలన్నీయు ప్రణామాంజలిని ఘటింపగా నామె వారి ననుగ్రహించెను-96. శత్రుదమనయైన కుమారి దుష్టులైన భండాసుర పుత్రులను పారద్రోలెను. ఆమె సైన్యము ప్రాదేశ మాత్రము (బొటన వేలు చూపుడు వ్రేలును చాచినంత) కొలత, దాదాపు (పదియంగుళములు) లేదు. కాని లలితా సైన్యమంతయు నామె సైన్యమయ్యెను. ఆ తరువాత అత్యుద్ధత పరాక్రమముగల యుద్ధము జరిగెను-98. కుమారిక రాక్షసరాజులపై బాణ సమూహమును వర్షించెను. మహారాజ్ఞికుమారిక భండాసురకుమారులతో చేసిన యుద్ధము సురాసురలకు గూడ కోరికోరి చూడదగినదిగా నుండెను -99. తొమ్మిదేండ్ల వయస్సు గలిగీ కర్జీ రథము నెక్కి బాణమండలమును, వర్షించు కుమారిని చూచి రాక్షస కుమారులు మిక్కిలి యాశ్చర్యమును జెందిరీ-100, భ్రమించుచున్న (తిరుగుచున్న) పరిచారికలు క్షణక్షణము బాలికచే చేయబడుచున్న మహా యుద్ధమును మహారాజ్ఞికీ పిన్నవించిరీ-101. మంత్రిణీదండనాథలు మాత్రము. ఆమెను రణమున నొంటరిగా వదలలేదు. కాని చూపరులుగానై యూరకనే యుండిరి-102. ఆమెరాక్షస పుత్రులందరికినీ ఒకే రూపముగలదయ్యెను. సూర్యునియొక్క బింబపంక్తివలె ప్రతీ యొక్కనికొక్కొకటిగా కనబడినదీ-103. ఎల్లకలువవలె ఎటుపెక్కిన ముఖముగలదై అగ్ని జ్వాలలుగల బాణములతో రాక్షసుల మర్మములను భేదించుచున్నదీ-104. ఆకాశమున జూచుచున్న దేవతలు, మంత్రదండనాథలును. “ఆశ్చర్యము; బాగు బాగు” - అని మెచ్చుకొనుచుండిరి-105. వారితో పూజింపబడుచున్నదై చురుకైన చేతులతో కుమారీక యుద్ధము చేసెను. రెండవ యుద్ద దీవస మంతయు రణమున-106. అస్త్రములకు ప్రత్యస్త్రములను ప్రయోగించుచు ఆ రాక్షసులందరిని ఛేదించుచు ఆ లలితా పుత్రిక తన బలమంతయు ప్రకాశింపజేసెను-107. మహారాజ్జీ కుమారీ నారాయణాస్త్ర ప్రయోగముతో రెండు వందల యక్షౌహిణీ సైన్యమును క్షణకాలములో భస్మము చేసెను-108. అక్షౌహిణులు క్షీణించుటచే తత్క్షణము కోపమునంది లాగిన ధనువులు గలవారై యొక్క మాటున పైబడిరీ-109. అంత శక్తులలోను, దేవతలలోను కలకలము రేగెను. వెంటనే కుమారి ముప్పది బాణముల నొక్కమారు వదిలేను-110. చేతి నైపుణ్యముతో వదిలిన ముప్పడి అర్ధచంద్రబాణములతో భండాసురుని ముప్పదీపుత్రుల తలలు తెగిపడెను-111. ఈ విధముగా భండపుత్రులు యమసదనమునందగా (మరణింపగా) మీక్కిలి యాశ్చర్యమునందీన యాకాశగామీ దేవతలు పుష్పవర్షము గురిపించిరి-112. సమస్తాసురసైన్యమును భండపుత్రులను జంపిన మహారాష్టీపుత్రియైన కుమారికను మంత్రిణీదండనాథలు మిక్కిలి సంతోషముతో నాలింగనము జేసికొనిరి-113. జయము నిచ్చిన యామె పరాక్రమ వికాసములచేత నాట్యము చేసిరి. శక్తులు సాధువాదములచే (బాగు బాగు అను మొప్పులతో) మూడు జగములను ఏకము జేసిరీ-114. శక్తి సేనానులందరు దండనాథలను ముందడుకొని ఆయాశ్చర్యమును మహారాజ్ఞికి నివేదింప బయలుదేరిరీ-115. వారు నివేదించిన తన పుత్రీయొక్క భుజ పరాక్రమ కీర్తులను విని లలితాంబిక మిక్కిలి సంతసమునందెను-116. దేవతలలో గూడ మున్నెన్నడు చూడని కుమారి పరాక్రమములకు అక్కడి శక్తి మండలమంతయు ఆశ్చర్యపశమైపోయెను-117.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున శ్రీలలితోపాఖ్యానమున ఇరువదియారవ యధ్యాయము.
Summary of chapter 138 of the Brahmānda Mahā Purana is as follows:
In the grand climax of the divine war, this chapter details goddess Lalitā directly engaging Bhandāsura in a duel of cosmic proportions. It describes how Bhandāsura unleashed dark missiles creating evil forces, which goddess Lalitā instantly countered by generating divine incarnations like lord Rāma and lord Kṛshṇa from her fingernails. Finally, with the supreme Mahākāmeshvara missile, she reduced Bhandāsura and his capital city to ashes, restoring eternal peace and joy to the universe.