బ్రహ్మాండ మహా పురాణము
22 - జమదగ్నితపశ్చరణమ్
వసిష్ఠుఁడు ఇట్లు పలికెను.
భృగువుచే నీట్లు చెప్పఁబడి అట్లే చేయుదును అని రాముఁడు అతనికి నమస్కరించేను. ఆతనిచే ఆజ్ఞాపింపఁబడి ప్రయాణమునకు నిశ్చయించేను. భృగువునకు తత్పత్ని ఖ్యాతికీ యథావిధి ప్రదక్షిణము చేసి, నమస్కరించెను. వారు కౌగిలించుకొనిరి. ఆశీస్సులచే నభినందించిరి. మునులకు కూడ నమస్కర్తించి, వారిచే గూడ ప్రయాణమున కంగీకరింపఁబడి రాముఁడు ఆ యాశ్రమము నుండి తపస్సునకు కృత నిశ్చయుం జై బయలు దేరెను. మహో మనస్విమయిన రాముఁడు గురుని నీయోగాను సారము ఆతఁడు నిర్దేశించిన మార్గమున నీరివరమయిన హిమవత్పర్వతమునకు వెడలెను. ఆతఁడు వివిధములయిన దేశములను, పర్వతములను, నదులను, వనములను, మునీ ముఖ్యుల ఆశ్రమములను క్రమముగా దాటెను. మార్గములో మునుల యొక్క వసతులలో రాముఁడాగెను. తీర్థములందు, ముఖ్యమయిన క్షేత్రముల యందు నివసించుచు నెమ్మదిగా ప్రయాణము సాగించేను. అనేకములయిన దేశములను దాటిచనెను. మనోహరములయిన దృశ్యములను సందర్శించెను. తుదకు ఉత్తమోత్తమమయినది, పర్వత శ్రేష్టమయినదియునగు హిమాచలమును రాముడు చేరెను. (7) ఆ ప్రదేశమును చేరిన తరువాత, అనేకములయిన లతా ద్రుమములతో సమన్వితమయిన పర్వతమును ఆతఁడు చూచెను. ఆ పర్వతము విపులములయిన శిఖరములతో ఆకాశమును తాకుచున్నదా యన్నట్లుండెను. సర్వత్ర రత్నములచే ఓషధులచే ప్రకాశించుచు నానా ధాతు విచిత్రములచే ఆ ప్రదేశముపశోభితము. కొన్ని ప్రదేశములలో పెనుగాలుల విజృంభణమున శుష్క వృక్షముల సంఘర్షణమున కలిగిన అగ్ని జ్వాలలచే ఆరణ్యములు ఎత్తుగా దహింపబడుచుండెను. గాలుల తోడి ఆగ్నిచే వనములు అధికముగా దహించుకొని పోవుచుండెను. కొన్ని ప్రదేశములలో సూర్య కిరణములచే ప్రకాశించిన సూర్యకాంతమణుల నుండి ప్రసరించు నగ్నులు సూర్యరశ్మిచే ద్రవీంచు శిలాజలముల జలములచే నుపశాంతి పొందుచుండెను. కొన్ని ప్రదేశములలో పర్వతములు స్పటికశిలలు, అంజన శిలలు, రజత రాశులు, స్వర్ణ రాశులు వీని యొక్క కాంతులచే, వెలుంగుచుండెను. ఆ స్వర్ణాది రాశుల నుండి వానిని ప్రకాశించు కీరణ జ్వాలలు పరస్పరము వెలుగొంద జేసికోను ఛాయా శరములచే జాజ్వల్యమాన దీప్తి వ్యాపించి యుండెను. కొన్నిచోట్ల, పర్వతోపత్యములందు, మంచు చేత తడిసిన సిద్ధాఘములు యెండలో చలికాచుచుండుటచే ఆ ప్రదేశములు ప్రకాశించుచుండెను. (13) కొన్ని ప్రదేశములు యక్షులచే ప్రకాశించుచుండెను. వారు బంగారు శిలలపై కూర్చుండి యుండిరి. ఆ సువర్ణ శిలలపై సూర్య కిరణములు పడుచుండెను. అందుచే యక్షులగ్నిలో ప్రవేశించుచున్నట్లగుపించు చుండిరి.
కొన్నిచోట్ల, గుహాముఖముల నుండి బయటికి దూకిన తరక్షువు చూచీ (ఒక విధమయిన క్రూర మృగము, లేళ్ల కుదుపులు బెదరి, చేయు ఆర్తనాదములచే నీండి ప్రతిధ్వనిల్లు గుహలు. (16) ఒకచో, ఒండొరులతో తీవ్రముగా పొట్లాడుకొను వరాహ శార్దూల సమూహాలచే, రాష్పడు చెందిన సుందరమయిన శీలాతరుతటములు. (16) (గవయ మృగం - ఒక విధమైన అడవి ఎద్దు) కొండొకచో, గవయ మృగపోతములం జూచి (ఆకార సామ్యమున పొరపడి) ఆడయేనుగులు అవీ తమ ఏనుగుగున్నలనీ భాంతీనొంది, వెంటనంట, భయపడి పరువెత్తు గవయ మృగఖురములచే గోతులు పడి, ఒరిసిపోయి, నలిగిన, శీలాతటములు (17) అత్యధికమయిన మదోన్మత్తతచే నొక యాడయేనుగు కొఱకు, పరస్పరము మత్తేభములు యుద్ధము చేయగా, చూర్ణీకృతములయిన గండశిలలు గల ప్రదేశములు. మత్తగజముల ఘీంకార బృంపాతముల సహింపక పోనీ వేంబడి తరుముకొనీ వచ్చు సింహముల చరణముచే పోటీపొడి నఖములచే చిట్లపగిలిన రాళ్లుగల చోటులు (19) ఆకస్మికముగా వచ్చిపడునట్టి సింహముల గోళ్లచే చీల్చబడిన మస్తకములు గలిగిన గజముల ఆక్రందనలచే నిండిన వనములు ఒకచో (20) (ఎనిమిది కాళ్లు జంతువులు శరభమృగములు). ఎన్మీదికోళ్లు గలిగి మిక్కిలి ఐలము కలిగిన శరభమృగములు తమ కేసరములు పట్టుకొని గట్టిగా నాకర్షించుట వలన బాధకలిగిన సింహాములు దారుణమయిన సాదములు చేయ, దాని వలన, భేదింపబడిన శిలగంభీర కుహరములు. (21) ఆగ్రహోదగ్రులైన అనేక శరయూథములు ఋష (ఎలుగుదొడ్లు) యూథ ప్రధానములతో సంభవించిన తీవ్ర కలహములలో పరస్పర సమ్మర్గముచే పొడిపొడియైన రాళ్లు గల ప్రదేశము లొకచో (22) కొన్ని ప్రదేశములలో పర్వత కుంజముల యందు ఆడ ఏనుగులతో క్రీడించు మగ ఏనుగులు, మరికొన్ని ప్రదేశములలో కరేణువును (ఆడ ఏనుగును) వెంటాడు మత్త గజములతో కూడిన కాననములు (23) నిద్రించు సింహము యొక్క ముఖము నుండి వెలువడు నిశ్వాస మరుత్తులతో పూర్ణమయిన వందలాది గుహలు. అరణ్యముల యందు అత్యధికమయిన భయముతో శంకాసహితముగా, విహరించునట్టి మృగములు. (24)
చమరీమృగములు ముండ్ల యందు తగుల్కొని తమ తోకల యొక్క వెంట్రుకలు తెగిపోవునను భయముచే మంద మందగమనములతో క్రీడించుచుండెను. (25) గిరికందరముల యందు వసించు కిన్నరులచే గానము చేయబడిన తాలలయయుక్త నాద స్వరములచే దిక్కులన్నియును నీండి యుండెను. (26) ఇందునందు (ఇతస్తవః) సంచరించు అరణ్య దేవతల యొక్క లాక్షారసముచే, తడిసిన, చరణములచే పాదాచ్చాయ లేర్పడిన భూతలము ఒప్పుచున్నది. (27) ఆడమగనెమళ్ల బృందము సంగీత మధుర స్వరములచే విస్తరింపఁజేయబడిన బరులతో (పింఛములతో) సర్వత్ర నృత్తమాచరించుచున్నది. (28) నీరు గల ప్రదేశముల మొలచిన అనేక వృక్ష లతా సుమోతర వర్పములచే వనమారుతములు శరీరానందకరముగా మందముగా వీచుచుండెను. (20) వసంతఋతు సంబంధమైన రసమును నాస్వాదముచేసి, మదించిన పుంసోకిలల కుహూరావములు మామిడి వనము నంతటిని ఆకులీకృత మొనర్చుచుండెను. (30) నానా పుష్ప సంబంధ మధువు నాస్వాదనము చేసి మత్తెక్కిన భృంగముల యొక్క సంగీత నాదముచేతను, అనేకములయిన పక్షి సమూహముల యొక్క కూతల వలన గలిగిన రావముల చేతను కానన మంతయును బధిరీకృతము చేయబడుచున్నది. (31) భూతల మంతయు, మధుస్రావముచే తడిసి దట్టముగో రోలిన (వాడని) ప్రత్యగ్రములయిన కుసుమ సముదాయములచే వనమున వీచు మారుతములచ పువ్వులు నలుగడలకు చల్లబడి వనము అలంకృతమై యున్నట్టుండెను. (32) విషమోషలప్రదేశములపై నుండీ గుభాలున పడునట్టి కొండ సెలయేళ్ల మహాధ్వనులచే అరణ్యమంతయు చేవులుగళ్లుపడుచుండెను (బధరీకృతమయ్యెను). (35) పర్వతము నందలి వనములు సర్వవిధ వృక్షములతో సర్వత్ర నిండియుండెను.దంబ వృక్షములు, నింబ (వేప), హింతాలములు, సర్జము, బంధూకము, తీందుకము, కపిత్థము, పనస అశోకము, మామిడి, ఇంగుదము, ఆసనము, నాగ, పున్నాగ, కోవిదారము, ప్రియంగుపు, చంపకము, ప్రీయాలము, నీపము, వకులము, బంధూకము, అక్షము, తమాలము, ద్రాక్ష, మధూకము, ఆమలకము -
జంబు (నేరేడు) కంకోల, జాతులు, బిల్వము (మారేడు) అర్జునము, ఆమ్ర బీజపూరవృక్షములు, పీచులము, అంబద్ధము, కనకము, ప్రేకంకత, శమి, ధవ, పుత్త్రబీజ, అభయ, అరిష్టము (కుంకుడు)లు లోహ, ఉదుంబర, పిప్పల మొదలగు ఇతరములయిన వృక్షములచే సమంతాత్ పరీశోభితము. నిరంతరము వృక్షముల నీడలచే సుదూరము వినివారీతమయిన సూర్య కిరణములు గలిగిన భూతలము, వివిధ నానా పక్వ ఫలముల నాస్వాదించుటచే, బిలము గలిగి పుష్టి మంతములయిన కోతులచే ఆక్రమింపఁబడి, చకితమయిన వనముల పంక్తి శతములచే ఆకులమయినది, అక్కడక్కడ అతి రమ్యములయిన శిలా కుహరముల నుండి బహిర్గమించు ననేక కొండ పెలయేళ్లు; విషమములైన రాళ్ల నుండి పడుటచే కలుగు భయంకర సరిస్నాదములు. విపులములయిన కుషుదోత్పలములచే నలంకృతములయిన విపుల సరోవరములు; నానా విధములయిన పక్షి సంఘముల రోదలచే సంఘుష్టమై సర్వత్రోపశోభితమయి మంచుచే చల్లనయిన శైలరాజముచేరి (43) భృగు శ్రేష్ఠుఁడయిన రాముఁడు ముదాన్వితుఁడై వెంటనే ఆగిరి నారోహించెను. (44) గహనమయిన ఆ వనమును మహాబుద్ధిమంతుఁడయిన రాముఁడు ప్రవేశీంచెను. పర్వత సమీపమున వృక్షములచే నిండియున్న ఆ యరణ్యము నందు నెమ్మదిగా సంచరించెను. ఆ ప్రదేశమున సంచరించుచు రాముఁడు అనుమానముతో, శంకతో, ముగ్గములయిన అమాయకములయిన చూపులతో దీక్కుల వెంబడి సంచరించు లేళ్లగములను జూచి, ఆనందము నొందెను. పూవుల మనోహరములయిన పరీమళలములతో నిండి వీచు వాయువులచే నిండిన ఉదారమయిన వన సంపదను చూచి రాముఁడు హరపులకితుం డయ్యెను. (46) వివిధములయిన స్థలములను భార్గవుఁడు సూక్ష్మముగా పరిశీలించుచు సంచరించెను. పరస్పరము భిన్నములయిన శీతోష్ణ ద్వంద్వములను, అట్లే విభిన్నములయిన లోహధాతువులను చూచు భార్గవుఁడిట్లు భావించేను. “అహో ! ఈ పర్వతము బ్రహ్మచే సర్వశైలాధిపత్యమున నభి షేకింపఁబడెను. అంతీయకాక బ్రహ్మచే యజ్ఞ భాగము ప్రతిపాదింపబడుటయు ఉచితముగానే యున్నది.
ఈ పర్వతము యొక్క శైలాధిరాజత్వము సువ్యక్తముగా అభివ్యక్తమగుచున్నది. (49) ఈ పర్వతమును వెదుళ్ల యొక్క సాళముల నుండి వచ్చు రవములచే మధురీకృత కాననముగా శైల రాజానర్చెను. కొండకోనల యందు తగులుకొని యున్న తుషార చయముచే ఈ పర్వతము స్వచ్ఛమయిన ధవళ వస్త్రముచే కప్పఁబడియున్నదేమో యన్నట్లు ప్రకాశించుచున్నది. శిఖరముల తగులుకొనీ ప్రకాశించుచున్నదట్టమయిన నీహారనికరములచే నానా వర్ణములచే శోభితమయిన ఉత్తరీయముచే ఆవృతమయిన (కప్పఁబడిన) శరీరాంగము కలిగిన దానివలె ఈ గీరివరము కానవచ్చుచున్నది. చందనాగురు కర్పూర కస్తూరీ కుంకుమాది పరీమళ వస్తువులచే ఈ పర్వతరాజు అలంకృతాంగుఁడై విలాసివలె స్పష్టముగా నగుపించుచున్నాఁడు. సింహములచే చీల్చబడిన దంతీంద్ర కుంభ స్థలముల నుండి జారీక్రింద పడిన పెద్ద పెద్ద ముత్యముల సమూహములచే నగేంద్ర పరితః ప్రదేశము ప్రకాశీంచుచున్నట్లున్నది. ఈ గిరిరాజు నానా వృక్షలతావల్లీనీకర పుష్పములచే నలంకృత మూర్ధజుఁడు. ఆతనీ శిరోజములు పువ్వులచే నలంకరింపఁబడినవేమో యన్నట్లున్నవి. (54) దట్టముగా వ్యాప్తములయిన మేఘ పంక్తులనెడి వితానములచే (ఛాందినీచే) నీగిరిరాజు సమలంకృతుఁడు. ఈ గీరీంద్రుఁడు సాసాధాతు విచిత్రాంగుఁడు; సర్వరత్న విభూషితుఁడు; కైలాస వ్యాజమున ప్రకాశించు తెల్లని ఛత్రముచే విరాజితుఁడు; ఆ హీమవర్రాజ గజముఖము గల అశ్వముఖముగల దేవతా సమూహములచే పరివృతుఁడై యుండెను. ఆతఁడో రత్నద్వీపము మహా ద్వారముగా గల శిలాకందర మందీరుఁడు; వివిక్తమయిన గహ్వరమను ఆస్థాన మధ్య సింహము ఆసనముగా గలిగిన వాఁడు : సర్వత్ర వృక్షములను వేత్రహస్తులతో సంసక్తుఁడై నెమ్మదిగా చూడబడి మహారాజాధి రాజువలె జనులు వచ్చి చేరుటకు సాధ్యము కానివాఁడు.
ఇందు నందు తిరుగాఁడు చమరీ మృగముల తోకలతో చారు (చామర) వింజామర సేవను, నృత్యము చేయు నెమిళ్లతో, సంగీతము పాడుకిన్నరులతో నొప్పి, అనేకములయిన సత్వములచే సేవింపఁబడుచు హిమవర్ణిగిరాజు ప్రకాశించుచున్నాడు. పర్వతముల కధిరాజ పదత్వము ఈ గిరీంద్రమునకు వ్యక్తమగుచున్నది. (60) సమగ్రమయిన భూమిని ఆక్రమించిన తరువాత తన శక్తిచే సమస్త శ్రీనీ సతఁడను భవించును”. ఈ విధముగా ఆత్మలో ఆలోచించుకొనుచు, రాముఁడు చిరకాలము హిమాలయాద్రి వన గహ్వరవమున అత్యంతానందముతో సంచరించెను. తిరిగి తిరిగి భృగుపుంగవుఁడయిన రాముఁడు ఓ సగరమహారాజా ! ఆ వనమున ఒక వీపుల సరోవరమును చేరెను. ఆ సరోవరము విమలోదకముతోం గూడినది. కుముదములు, ఉత్పలములు, కల్హారములతో కూడి చక్కగా ప్రకాశీంచుచుండెను. (63) రక్తవర్ణములు, పీతవర్ణములు, తెలుపు, నలుపు రంగులు కలిగిన పంకజోత్పలముల చేతను, అనేకములయిన ఇతర జలవృక్షములచే సర్వత్ర ఆ సరస్సు సమలంకృతము. హంసలు, సారసపక్షులు, జలవాయసములు, కొరండవములు (నీటి జాతులు) చక్ర వాకములు, భ్రమర సముదాయములు మొదలగు వానిచే సంఘుష్యమాణమగుచు మందపాయువుచే ఆ ప్రాంతమంతయు సేవింపఁబడుచుండెను. లోస సంచరించుచు, చెంగు చెంగున గెంతుచు, శఫరీ మత్స్య సంఘములచే కూడి ఆ సరస్సు అంతర్జనితములయిన తరంగములచే సర్వత్ర నృత్యము చేయుచున్నట్లుండెను. అట్టి ఉత్తమమయిన సరోవరమును భృగుశ్రేష్ఠుఁడయిన రాముఁడు చేరెను. (67) నానావిధ పక్షుల యొక్క కూజితములచే మధురీకృతమయిన దీక్తటములుగల ఆ సరోవర తీరమందు శుభంకరమైన ఆశ్రమపదము నేర్పరచుకొని ఆతడు శాకమూల ఫలాహార నియతుఁడునై నియతేంద్రియుడై మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు తపస్సాచరించుట కభిలషించెను. (69)
రాముఁడు తన హృదయమున దేవేశుఁడయిన ఈశ్వరుని అధిష్ఠింపఁజేసి భృగూపదిష్ట మార్గమున, పరమభక్తితో కూడినవాడై తపస్సాచరించెను. (70) ఓ రాజు ! ఏకాగ్రమయిన మనస్సుతో దేవేశుని రాముఁడు పూజింపఁ దొడగెను. ఆతఁడో అనికేతనుఁడు. పర్ణశాలయనెడిది లేనివాఁడు. వర్షాకాలము నందు శీతకాలమున జలముల సంశ్రయించి, జల ప్రవాహముల మధ్య యందు నిల్చి తపస్సాచరించెను. గ్రీష్మఋతువున పంచాగ్ని మధ్యమున, నాలుగు ప్రక్కల అగ్ని జ్వాలలుంచుకొని, పైనీ సూర్యుండు చండ, కిరణుఁడై ప్రకాశింప చిరకాలము రాముఁడు తపస్సాచరించెను. కామక్రోధాదులగు షడ్రిపుల జయించెను. ఊర్మిషట్కమును విదిలించీ వైచెను. సుఖదుఃఖములు, శీతోషములు, కష్టసుఖములను ద్వంద్వములచే ననుద్వేజిత ధీరుఁడు. తాపదోషములచే అనకులుడు. యమము చేతను, నీయమముల చేతను శుద్ధమయిన దేహముతో కూడినవాఁడు, (73) శరీరమందు సంచరించు పవనమును ప్రాణాయామముచే రాముఁడు వశీకరించుకొనెను. పద్మాసన స్థితుఁడు. మౌనము పాటించేను. స్థిరచిత్తు డు, మహాముని. ఇంద్రియములను వశీకరించుకొనెను. ప్రత్యాహార పరాయణుఁడు. ధారణములను స్థిరీకరించెను. ధ్యానముచే పరమేశ్వరుం డయిన దేవదేవునితఁడు దర్శించెను. స్వాధీనాంతఃకరణుఁడు. కరుణామైత్రీ భావములతో సర్వబాధా వివర్జితుఁడు. ఈ విధమైన దృఢ సమాధిపొంది రాముఁడు దేవదేవుని చింతించెను. ధ్యానమున జగద్గురువును దర్శించి, ధ్యేయమయిన దేవదేవుని యందు సంస్థీత చిత్తము, ఆత్మయును గలిగి, నిశ్చలేంద్రియ దేహవంతుఁడై నియమిత కాలాంత పర్యంతము గాలి లేనిచోట పెట్టిన జ్వలించు దీపమువలె, స్వమనీషచే, దేవదేవేశుని గూర్చి జపించెను, ధ్యానించెను. సర్వభావస్తుఁడైన ఈశ్వరుని రాముఁడు ఆరాధన మొనర్చెను. అంత, నీష్కలము (అవయవ రహితము) నిరంజనము, పరంజ్యోతి, అచింత్యము, యోగులు కానివారిచే ధ్యానింపఁబడరానిది, అత్యుత్తమము, నిత్యము, శుద్ధము, సదాశాంతము, అతీంద్రియము, ఉపమానరహితము, ఆనందమాత్రము, అచలము, సర్వచరాచర ప్రపంచ వ్యాప్తము, అయిన దేవదేవుని యొక్క రూపమును సోహం భావ సమన్వితుఁడయి భార్గవరాముఁడు చిరకాలము చింతించును.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున వసిష్టసగర సంవాదమున, అర్జునోపాఖ్యానమున జమదగ్నికుమారుఁడయిన రాముని తపశ్చరణమను ఇరువది రెండవ అధ్యాయము.
Summary of chapter 60 of the Brahmānda Mahā Purana is as follows:
In deeply moving prose, this section recounts the legendary trials and ultimate triumph of king Harishcandra and his predecessor Trishanku. It dramatically illustrates Harishcandra's absolute commitment to truth, showing how he willingly sacrificed kingdom, wealth, and freedom to honor his word. The faithful listener is brought to tears of devotion and inspired to hold fast to truth and virtue even in the face of insurmountable worldly suffering.