బ్రహ్మాండ మహా పురాణము
31 - హైహయ రాజ వధ విషయమై బ్రహ్మ పరశురాముని శివుని దర్శించుమనుట
సగరుఁడిట్లు చెప్పెను.
పూజ్యుఁడవైనయో బ్రహ్మపుత్ర ! పరశురామ చేష్టితమును వివరింపుము. రాజొనర్చిన కర్మచే క్రుద్ధుఁడయి మహావీర్యుఁడయిన రాముఁ డేమి చేసెను?
వసిష్ఠుఁడిట్లు చెప్పెను.
మహాభాగుఁడైన భృగువర్యుఁడు వెడలిన తరువాత, సంక్రుద్దుఁడు పితృ పరాయణుఁడు నయిన రాముఁడు పదేపదే దీర్ఘోచ్చ్వాసల విడుచుచు ఇట్లనెను. పరశురాముడిట్లనెను. “అహో ! సత్పథమును వీడి ఉత్పథగామియైన రాజయిన కార్తవీర్యుని మూఢత్వము ! విద్వాంసుఁ డయినను ప్రత్యక్షముగా బ్రహ్మవధోద్యమము గోచరించెను. దైవము బలవంతమయినదని తలంతును. ఏలయన తత్ర్పభావమున శరీరధారులు మోహింపఁబడి శుభాశుభకర్మల నాచరింతురు. (4) ఋషులందరు నాచే నొనర్పఁబడిన ప్రతిజ్ఞ విందురుగాక కార్తవీర్యుని యుద్ధములో. జయించి పితృవైరమును ప్రసాధించేదను. ఒకవేళ రాజయిన కార్తవీర్యుఁడు సర్వదేవతలచే ఇంద్రాదులచే, అట్లే దానవులచే రక్షింపఁబడినచో, అప్పటికిని ఆతనిని సంహరించేదను. వేకటిలేదు. (6) ఈ విధముగా రాముఁడు పలికిన వాక్యములను సుమహాత్ముఁడయిన జమదగ్ని ఆలకించి సాహస భాషణము ధైర్యముగా నొనర్చిన పుత్త్రునితో నిట్లనెను.
జమదగ్ని పలికెను.
ఓ రామ ! సజ్జనుల యొక్క సనాతన ధర్మమును వచించుచున్నాను వినుము. దీనిని విని యెఱింగి మానవులందరు ధర్మకార్యాచరణు లయ్యెదరు. ఎవరు సాధువులో మహాభాగులో సంసారము నుండి మోక్ష మాకాంక్షింతురో, వారెవనీదేనయిన నిందింపఁబడినను, కొట్టబడినను, ఏ ఒక్కనీపై కోపగింపరు? (9) మహాభాగులైన తపస్వినులు ఇంద్రియ నిగ్రహము కలవారు. క్షమాధనులు. అట్టి సాధుకారీణులకు అక్షయ లోకములు సంతతము లభించును. ఎవఁడు దుష్టులచే గాని, దండాదులచేతగాని వాక్కుచేగాని తాడితుడైనను అతఁడు క్షోభము నొందడో ఆతఁడు సాధువు తననుగొట్టుచున్న వానిని కొట్టువాడు సాధువు కాదు. పాపి. మనమో సాధువులము, బ్రాహ్మణులము. క్షమాగుణమున తత్థానము నందితిమీ. వత్సా ! కార్తవీర్య భూపతిని చంపుటవలన సుమహాపాతకము కలుగును. ఆ కారణమున నిన్ను తత్కార్యము నుండి నివారించుచున్నాను. క్షమ వహింపుము, తపస్సాచరింపుము.
వసిష్ఠుడిట్లనెను.
ఓ నృపనందన ! ఇట్లు తండ్రిచే నాజ్ఞాపింపఁబడినది తెలిసికొని, రాముఁడు క్షమాశీలుఁడు అరిందముఁడు నయిన పితరునితో నిట్లనెను. పరశురాముఁడిట్లు పలికెను. మహాప్రాజ్ఞుఁడవైన ఓ తండ్రీ ! ఇప్పుడు నా విజ్ఞప్తిని ఆలకింప గోరెదను. సుమహాత్ములయిన సాధువుల విషయమై మీరు క్షమా ధర్మమును ప్రతిపాదించితీరీ. ఆ శమ భావము సాధువుల యెడ, దీనులయెడ, గురువులయెడ ఈశ్వర భావముతో ఆచరింప దగినది, దుష్ట చేష్టల నొనర్చు పొరీయెడ క్షమాభావము సుఖమొసంగునదికాదు. అందుచే కార్తవీర్యుని వధ నాకు కర్తవ్యమైనది. మాననీయులలో ప్రప్రథముఁడవయిన ఓ తండ్రీ ! ఆత్మీయ వైరమును సాధించుటకు ఆజ్ఞ నొసంగుము.
జమదగ్ని ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను.
ఓ రామ ! ఓ మహాభాగ నా వాక్కులను సమాహిత మనస్సుతో అవధారణా పూర్వకముగ ఆలింపుము. భవిష్యత్తు అనివార్యము అట్లే చేయుదువు. విధికి అన్యముగా జరుగదు కదా ! ఇచ్చటి నుండి నీవు బ్రహ్మకడ కరుగుము. వత్సా ! హితాహితమును యోగ్యతా యోగ్యతను బ్రహ్మను అడుగుము. విభుడేమి చెప్పునో దాని నాచరింపుము. అందు సందేహింపవలసినది లేదు.” అనెను.
వసిష్ఠుడిట్లనెను.
తండ్రిచే నిట్లు చెప్పబడి తండ్రికి నమస్కరించి మహామతియైన రాముఁడు ప్రాకృతులయిన (సామాన్యులయిన) జనుల కగమ్యమైన బ్రహ్మ లోకమున కరిగెను. (20) బ్రహ్మలోకము నాతఁడు దర్శించెను. అది శాత కుంభము (బంగారము)చే నిర్మింపబడినది బంగారపు ప్రాకారములతో కూడియున్నది. మణులచే కూర్చబడిన స్తంభములచే విభూషితము. అందు రత్నభూషణ భూషితము, రమ్యమునైన రత్న సింహాసనమున కూర్చుండియున్న అమితతేజః పుంజుఁడయిన బ్రహ్మను రాముఁడు చూచెను. బ్రహ్మ సిద్ధులలో శ్రేష్ఠులయిన వారితో, ధ్యాన తత్పరులయిన మునీంద్రులచే పరివేష్టితుండై యుండెను. ఆతఁడో విద్యాధర స్త్రీల యొక్క నృత్యమును సుస్మితముతో సంతోషముగా దర్శించు చుండెను. (23) తపస్సులకు ఫలము లొసంగువాఁడు, జగత్తునకు కర్తయైనవాఁడు, పరబ్రహ్మము గూర్చీ ధ్యానించువాఁడు, మనస్సంయమనము గలవాఁడు, విభుఁడు, భక్త బృందములకు రహాస్యతమమయిన గుహ్య యోగమును నుపన్యసించుచున్నవాఁడు, అవ్యయుఁడు అయిన బ్రహ్మనుచూచి, భృగూద్వహుఁడయిన రాముఁడు, భక్తితో నమస్కరించెను. బ్రహ్మ వినయముతో నమస్కరించిన రాముని చూచెను. ఆశీస్సులతో నభినందించెను. కుశలమును గూర్చి యడిగెను. వత్సా ! నీ విచ్చటకు వచ్చిన కారణమేమి” అని యడిగెను. (26)
బ్రహ్మచే ప్రశ్నింపఁబడి రాముడు మొదటి నుండియు జరిగిన కార్తవీర్యుని వృత్తాంతమును, మహాత్ముఁడైన తండ్రి విషయమును మీనరించెను. (27) మానద ! సర్వము తెలిసినవాడయ్యు బ్రహ్మ రాముని పలుకులను విని, ధర్మిష్ణుఁడయిన రామునితో తుదకు సుఖావహ పరిణామమును గూర్చు విషయమును వివరించెదను. ఓ వత్స ! కోపముతో నీవు చేసిన ప్రతిజ్ఞ దుర్లభము. ఓ వటూ ! ఈ సృష్టి యంతయు భగవత్కృపచే సంభవించును. తద్భగహానుని ఆజ్ఞచే, అత్యధిక క్లేశముతో ఈ జగత్తు నాచే సృష్టింపఁబడినది. నీవు చేసిన ప్రతిజ్ఞయో తత్సృష్టికి నాశకారిడీ. ఒకే యొక రాజు యొక్క దోషముచే తండ్రికి జరిగిన పరిభవముచే భూమండలము నంతటిని (త్రిఃసప్తకృత్) ఇరువది యొక్కమార్లు భూపతి రహితముగ చేయకోరుదువు. (31) బ్రహ్మ క్షత్రీయ వైశ్య శూద్రులతో నీ సృష్టి మిక్కిలి సనాతనమయినదీ. అయ్యది హరికారణముగ మాటిమాటికి ఆవిర్భవించినది. తిరోభూతమయినదీ (హరి నుండి కలిగినది. హరి యందే విలీనమయినది) విశ్వము యొక్క ప్రాక్తనమైన ఈ సూత్రముచే నీ ప్రతిజ్ఞ వ్యర్థమయినదీ కాదు. అధవా, ఆయాసపురస్సరముగ నీ కార్యసిద్ధి యగుటకు నీరుండవు. నీవు శివలోకమున కరుగుము. శివాజ్ఞను పొందుము. భూలోకమున శంకర కింకరులయిన రాజులెందరో కలరు. అందుచే, తన్మహేశ్వరుని ఆజ్ఞలేక ఆ రోజులను చంపుటకివ్వం డు శక్తిమంతుఁడు? ఆ భూపతులు శరీరములందు కవచములను శక్తిని ధరించెదరు. వారు దురాసదులు పారితరులక సాధ్యులు జయమునకు బీజము శుభావహమునునైన ఉపాయమును పొందుటకై యత్నము చేయుము. ఉపాయముతో నారంభింపఁబడిన సర్వకార్యములు సిద్ధి నొందును. ఓ బిడ్డా ! గురువరము వలన శ్రీకృష్ణ మంత్ర కవచమును వహింపుము. దుర్లంఘ్యమయిన వైష్ణవ తేజమును శివశక్తీ జయించును. (37) “త్రైలోక్య విజయ”మను పేరి పరమాద్భుతమయిన కవచమును, ఎట్లో కష్టపడి దుర్లభుఁడయిన శంకరునకు విజ్ఞాపనముచేసి పొందుము. నీ గుణములచే ప్రసన్నుండయి దీనవత్సలుఁడయిన ఈశ్వరుడు కృపాలుఁడై దివ్యమయిన పాశుపతమునైన నీయగలడు. సందేహము లేదు.” (39) అనెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యభాగమున తృతీయోపాద్ఘాత పాదమున భార్గవచరితము నందు ముప్పది యొకటవ అధ్యాయము.
Summary of chapter 69 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter details the event-filled life of king Yayāti, a powerful monarch of the Lunar line whose life was a dramatic journey through worldly pleasure and spiritual awakening. It recounts his royal conquests, his divine marriage, and the strange turn of destiny that brought him premature old age. The devout reader follows his life story with keen spiritual interest, observing the eternal play of karma and divine grace guiding a soul toward final truth.