బ్రహ్మాండ మహా పురాణము
30 - రేణుకా విలాపము: క్షత్రియ నాశనము చేయరాముని ప్రతిజ్ఞ జమదగ్నిప్రత్యుజ్జీవనము
వసిష్ఠుఁడు ఇట్లు చెప్పెను.
జమదగ్ని వధ తదితర విషయములను గూర్చి విని, రాజు, తన మనంబున సంక్షుద్ద భావుఁడయ్యెను. తత్సంబంధి బహు విషయముల గూర్చి ఆలోచించెను. “అహో ! నేనో, ఉభయలోకములందునను మిక్కిలి క్రూరమయిన కర్మ నాచరించితిని. బ్రాహ్మణుల సొత్తును హరింప కోరికయు, బ్రాహ్మణ హత్యయు మిక్కిలి గర్షింపఁదగినవి. అయ్యో ! పురోహిత బ్రాహ్మణుని యొక్క ఉపదేశమును విమూఢాత్ముఁడనయి సిగ్గువిడిచి అప్పుడు నేను విసర్జించితిని వినలేదు.” అని దుఃఖభరిత హృదయముతో చింతించుచు రాజు తన బలగముతో అనుచరులతో సహ నగరమున కరీగెను. స్వపరిపారముతో రాజు నగరమునకు తిరిగిపోగా, రేణుక (ఓ రాజా!) ఆశ్రమము నుండి వెంటనే ఈవలకు వచ్చెను. వచ్చి శరీరము నందంతటను గాయములు కలిగి రక్తముచే తడిసి ముద్దయి, నిశ్చేష్ణుఁడయి నేలపై పడియున్న తన భర్త నామె చూచెను. అంత గత చైతన్యము గల భర్త చంపఁబడిన వానినిగా తలంచి, ఆమె పిడుగు యొక్క పతనముచే కొట్టబడినట్లు భూమిపై కూలేను. చాల సేపటికి మరల భూమి నుండి లేచి, అత్యంత దుఃఖితయై మరల నేలపై మూర్చపడి తెప్పిరిల్లి లేచి, ఆమె మరల సుస్వరముతో ప్రరోదనము చేసెను. ధరణీధూళిధూసరయైన యామె అత్యంతము విలపించి విలపించి, అశ్రుపూర్ణ ముఖముతో దీనురాలై శోక సాగరమున మునింగెను. “హా ! నాథ! ప్రియ! ధర్మము నెఱింగినవాఁడా ! దాక్షిణ్యామృతమునకు సాగరమైన వాఁడా ! అయ్యో ! యెంత కష్టము ! అత్యంత శాంతుఁడా ! ఇట్టి శాంతమును ఎవ్వరును కోరరు ! ఆశ్రమము నుండి బయటికి వచ్చి, ఓ నాథా ! నీవు నన్ను వెంటనే అగాధమయిన దుఃఖార్ణవము నందుఁద్రోసి, అనాథనయిన నన్ను వీడి ఓ మానద ! అభిమానులలో శ్రేష్ఠుఁడా ! ఎచ్చటికి వెడలిపోయితివి? సజ్జనులతోడి మైత్రి సాప్తపదీనమందురు. నీతో కలిసి నివసించితినే ! ఒక్కడవై ఏకాకిగా వెచ్చటి కరిగితివి? అచ్చటకు నన్ను తీసికోనిపోవ నరుఁడవు కావా
ఓ మహాభాగ ! ఇట్టి అవస్థలో నిన్నుచూచి నా గుండె వ్రేలలేదే ! స్త్రీలు కఠినాత్మలు కదా” అని యీ విధముగా ఆమె విలపించి మాటిమాటికి హోరున రోదించుచు, అత్యంత దుఃఖపరిస్థుతమై రామ ! రామ ! (ఎందుంటీవి) అని అధికముగా ఆక్రందనము చేసెను. అంతలో రాముఁడు సమిధల భారముతో వనము నుండి అకృతప్రణునితో షహా స్వాశ్రమమునకుఁ దిరిగి వచ్చెను. (15) త్రోవలో రాముఁడు భయమును శంకింపఁజేయు అనేకములయిన దుర్నిమిత్తములను చూచెను. చూచి దుఃఖముచే నుద్విగ్న హృదయుఁడై రాముఁడు వెంటనే ఆశ్రమమును చేరెను. (16) ఆశ్రమమునకు వచ్చుచున్న రామునిచూచి, అత్యంతాతురయై నవీ భూతమయిన శోకముతో మరల రేణుక అధికముగా రోదించెను. భర్త వ్యసనముచే నత్యంత పీడితయైన రేణుక తన రెండు చేతులతో కడుపు మీద భాధాపరవశయై బాదుకొనెను. రాముఁడు మార్గములో వృత్తాంత మంతయు నెటింగెను. ఆడలేడి వలే దుఃఖార్తయైన తల్లిని చూచి, తాను కూడ దుఃఖ పరవశుఁడయ్యెను. మేథావియైన రాముఁడు ధైర్యము తెచ్చుకొనెను. దుఃఖముచే శోకముచే పరిఫుతుఁడై దుఃఖాశ్రువుల వరదలచే నిండిన కన్నులతో తలదించుకొని నేలను పరికించుచు అధోముఖుఁడై యుండి పోయెను, అంత, అట్లువచ్చి దుఃఖ సంఫ్లుతుఁడయిన రాముని చూచీ, అకృతప్రణుఁడు రామునితో “భృగు వంశశార్దూల! ఇదేమీ ? దుఃఖ పరీతుఁడవైతివి ! ఇది నీకు తగదు. ఓ మహాభాగ ! ఎక్కడయినను నీవంటివారు అధికముగా శోకించేదరా? ఆపద ఆపతితమయినప్పుడు, ధైర్యవంతులు, మహాత్ములు దుఃఖింపరుకదా ! శోకము సర్వేంద్రియములను శుష్కింపఁజేయునది. మహాబాహో! అత్యంత శౌర్యనిధీ ! శోకమును పరిత్యజింపుము. ఇయ్యది నీవంటి వారికి యోగ్యమైనది కాదు.
శోకము నిజముగా ఐహికాముష్మిక ప్రయోజనముల కన్నింటికీని ఏకైకరోధకమయినది. అట్టి శోకమున కావకాశము నెట్లు నీ హృదయమున నోసంగితివి? అందుచే, నీవు ధైర్యధనుఁడవై, మీ అమ్మ యయిన రేణుకను ఓదార్పుము. వైధవ్య శంకచే చైతన్యము లేనిదై మీయమ్మ రోదించుచున్నది. వ్యతిశ్రాంత వస్తువునకు జరిగిపోయిన దానికి గతమునకు) పునరాగమనము (తిరిగివచ్చుట) యున్నదా? అందుచే జరిగిన దంతయు విడిచిపెట్టి, ఇక ముందు చేయవలసిన కార్యమును గూర్చి ఆలోచించుము.” అనీ ఈ విధముగా అకృతవణునిచే ఊరడింపఁబడి, రాముఁడు దఃఖ సమన్వితుం డయ్యు తనకు తాను మెల్లగా దృఢచిత్తుఁడయ్యెను. దుఃఖ శోక పరీతాత్మురాలయిన రేణుక మాటిమాటికి రోదించుచునే యుండెను. ఇరువది యొక్కమారు తన బాహువులతో ఆమె ఉదరమును బాదుకొనెను. (28) అంతలో రాముఁడు కన్నీరు నిండిన కనులు గలిగి రేణుక యొక్క సమీపమున కరుదెంచి “అమ్మా విలపింప చాలును. అని ఆమెను సాంత్వన పరచెను. భర్తృశోకము వలన గలిగిన దుఃఖము నుండి తల్లిని అపనయించి, రాముఁడు “నీవు ఇరువది యొక్కమారు కుడుపు పై బాదుకొనినట్లు, అన్ని మార్లు నే నా క్షత్రజాతి నశేషముగా చంపెదను. నీతో చెప్పుచుంటిని. ఇదీ భువి సత్యము' అందుచే నీవు శోకమును విడువుము. ఇప్పుడు ధైర్యమును వహింపుము. జరిగిన వస్తువులు {పోయిన విషయములు) విచారించిన తిరిగి రావు కదా " అని పలికెను. ఆమె యత్యంత దుఃఖాన్వితయై యున్నను, ఎట్లో ధైర్యము వహించి 'అట్లే చేయుదుననీ' రామునికి రేణుక ప్రత్యుత్తర మిచ్చెను. ఓ రాజా ! అంత మహాబాహుడయిన రాముఁడు, తన సహోదరులతో సహితముగా, యథావిధి పితరున కగ్ని సాతృతీ చేయ నారంభించెను. భర్తృ వియోగము వలన శోకము గలిగిన రేణుకయు, దృఢవ్రతురాలై తన బిడ్డల నెల్లరను పిలిచి ఇట్లు వారితో పలికెను.
రేణుక ఇట్లనెను.
నాయనలారా ! పుణ్యశీలుఁడు, సర్గమును పొందినవాఁడును నయిన మీ తండ్రిని అనుగమించుటకు నేను కోరుచున్నాను అట్టి నాకు మీరనుజ్ఞ నీయ నర్పులరు. సహించుటకు దుర్లభమైన వైధవ్యదుఃఖమును వహించుచు, భర్తచే విరహితురాలపై వీనిందితురాలనై యెట్లు నేను ప్రవర్తింపఁగలను. (3) అందుచే నాకు ప్రియదతుఁడయిన భర్తను నేననుసరించి పోయెదను. పూర్వ మాతనితో నెట్లుంటినో స్వర్గమున కూడ (పరలోకాము నంగూడ) నట్లే ఆతనితో ననిశము ప్రవర్తించెదను. ఈ ప్రజ్వలించు నగ్నిలో ప్రవేశించి అచిరకాలములో నేను పితృలోకమున నా భర్తకు ప్రియాతిథినగుదును. ఓ పుత్రులారా ! నా కిష్టమును మీరాచరింపఁదలంచినచో, మీరందరు కలిసి యీ విషయములో నాకు వ్యతిరేకముగా పలుకవలదు, నేను సహగమనము చేసెదను,” అని పలికి, దృఢ నిశ్చయురాలయిన రేణుక అగ్నిని ప్రవేశించి భర్తననుగమింప దృఢమనస్సు పూనెను. అంతలో (అంతలో) కుమారులతో సంప్రదించు రేణుకను నిర్దేశించి 'అశరీర' వాణి గంభీరమయిన వాక్యము లాడెను. “ఓ రేణుకా ! నీవు నీ తనయులతో గూడ ఈ నావాక్కులను వినుము. ఓ భద్రురాలా ! ఓ మాంగళ్యవతీ ! సాహసము చేయకుము. నీకు ప్రియమును చెప్పుచున్నాను, నీవు మరణింపరాదు. “సర్వో జీవన్ భద్రాణి పశ్యతి” బ్రతికీ యుండి శుభముల బడయవచ్చు. అందుచే, ధైర్యధనురాలపై కాలమును ప్రతీక్షించుచు నుండుము. ఓ శుచిస్మిత ! శుచి మంతమైన చిరునవ్వు గలదానా ! నిమీత్తమును గమనించి కొంతకాలము సహించుము. అచిర కాలములో నీభర్త సచేతనుఁడు కాగలడు. ఆతడు ప్రత్యుజ్జీవితుడయినంతనే నీవు నీ కోరికలను పొందగలవు. ఓ శోభనా ! చిరకాలముండగల కళ్యాణములకు నీవు స్థానమవు కాఁగలవు”. అనెను.
వసిష్ఠుఁడిట్లనెను’
ఆ ఆకాశవాణిని విని రేణుక ధైర్యమూసాను. ఆమె కుమారులందరావాక్యగౌరవమున హర్షము నొందిరి. అంత పితృశరీరమును ఆశ్రమాభ్యంతరము లోనికి తీసికొనిపోయిరి. ఆ శరీరమును బాగుగా గాలి లేని ప్రదేశమున పండుకొనఁబెట్టి చుట్టును వారందరు కూరుచుండిరి.
సంతోష రహిత చిత్తములతో వారందరందుపవిష్టులై యుండగా గొప్పవియైన యనేక శుభ నిమిత్తములు కలిగెను. తన్మూలమున మునీ పుంగవులు కొలదిగా నూరట చెందిరి. అందే పితృపాదుల పునర్జీవనమునాకాంక్షించుచు, తల్లితో కూడికొని వారుండిరి. (50) ఆ మధ్యకాలంలో భృగు వంశోద్దరణుఁడయిన యొక ముని మతీమంతుఁడు, అతర్కితోపపన్నముగా దైవబలమున నచ్చటకేతెంచెను. ఆతఁడు అధర్వణ మంత్ర నిర్మాత. వేదవేదాంగముల యొక్క సారమును ముట్టినపోఁడు. సర్వ శాస్త్రముల యొక్క అర్థము నేజింగిన వాఁడు. ప్రాజ్ఞుఁడు. సకలాసుర వందితుఁడు. ఆతఁడు మృత సంజీవనీ విద్య నెటీంగినవాఁడు. తన్మూలమున యుద్దమున మరణించిన దానవులను బ్రతికింపఁ గలిగినవాఁడు ఈ రహస్యశాస్త్రము ఇతర ఋషులకు తెలియనిది రోజులకురాజ్యఫలప్రదమయిన శాస్త్రమును రచించినవాఁడు. ఆ శాస్త్రమే ఆతని తరువాత “శుక్రనీతిసారము” అయినది. ఆ శాస్త్రమే రాజులను తమ రాజ్యములను తిరిగి పొందఁజేసినది. ఇప్పటికి కూడ రోజులందరు దాసిననుసరింతురు. దానిపై ఆధారపడియుందురు. (అట్టి యాతఁడు) ఆ యాశ్రమమును చేరి లోనికి ప్రవేశించెను. ఆ యవస్థలో దుఃఖ పరీఫుతులయియున్న వారందరిని ఆతఁడు చూచెను. అంత వారందరు, తమ వంశ పితరుఁడయిన భృగువును చూచి లేచిరి, సత్కరించిరి. ఆతనికి ఆసన మొసంగిరీ, ఆ మహాముని ఆశీస్సులచే వారందరిని అభినందించెను. 'ఇదంతయు ఏమి'యనీ వృత్తాంతమడిగెను. ఆ వృత్తాంతము నంతటినీ వారు నివేదించిరీ, అది భృగు ఋషి వినినాఁడు. ఆ మంత్రవిదుఁడు వెంటనే నీటిని తీసికొని వచ్చి క్రింది పదముల నుచ్చరించుచు సంజీవినీ విద్యచే జమదగ్ని శరీరము నందు ఆ జలమును ప్రోక్షించేను. “నేనొనరించిన యజ్ఞముల యొక్క తపస్సు యొక్క శుభమయిన శక్తి యున్నచో, తచ్ఛక్తిచే పండుకొనినవాఁడు లేచినట్లు ఇతఁడు వెంటనే జీవించుగాక, “సాధుకారియయిన భృగునిచే ఈ శుభ వాక్యముచ్చరింపఁ బడినవేంటనే ఋచీకుని కుమారుం డయిన జమదగ్ని వేడొక బృహస్పతి వలె లేచెను.
అందే యున్నట్టి వానిని, తన పితామహుఁడయిన భృగుని, వంద్యుని చూచి, భక్తితో జమదగ్ని నమస్కరించెను. కృతాంజలియై యిట్లు పలికెను.
జమదగ్ని పలికెను.
నేను ధన్యుఁడనయితినీ. కృతకృత్యుఁడనయితిని. నా జీవితము సఫలమయినది. సురాసురులచే నమస్కరింపబడునట్టి నీ చరణద్వంద్వమును చూచిన పుణ్యముచే ఓ మానద ! ఓ భగవన్ ! నీకు ఎట్టి శుశ్రూషను చేయగలను? ఓ విభో నీ చరణాంబుకణములచే నీ కులమంతయు పుణ్యమయినది.” అని పలికెను. ముదాన్వితుఁడయ్యెను. రాముఁడు అర్ఘ్యమును వెంటనే తీసికొని వచ్చెను. భక్తిచే వంచిన కంధరముతో ఆ మహరీ పాదముల గడిగెను, ఆ మహామతిమంతుని కుటుంబ సభ్యులెల్లరా జలమును (పాదార్యజలమును శిరసాధరించిరి. జమదగ్ని భృగువును సత్కరించెను. వినయాన్వితుఁడై యిట్లు అడిగెను.” భగవన్ ఆ రాజుచే ఈ పాతకమేల చేయంబడినది? ఆతనికి నేను సమ్యగ్వధానముతో సర్వసంపత్సమృద్ధముగా ఆతిథ్య మొనర్చి యుంటినే. ఓ మహామతీ! ఆ దుష్టాత్ముడు, ఏమి పాపమొనర్చెను”. వసిష్ఠుఁడిట్లనెను.
ఇట్లుడుగబడి మతిమంతుఁడు బ్రహ్మతుల్యుఁడునగు భృగువు, చిరము ధ్యానము చేసి, సమాలోకించి, కారణమిట్లు చెప్పెను.
భృగువు ఇట్లనెను.
“ఓ మహాభాగ ! వత్స ! ఈ కర్మకు బీజమును వినుము, సర్వజ్ఞుఁడవయిన నీకేల పాపమాచరించెనో మినుము. పూర్వము వసిష్టునిచేత ఆ మహీపతి నాశనము అగునట్లుగా శపింపఁబడెను. “ఓ మూఢ ! ద్విజశ్రేష్ఠున కొనరించిన అపరాధముతో నీ వీర్యము నశించగలదు. ఆ మునీశ్వర వచనమెట్లన్యధా కాగలదు? ఈ రాముఁడు మహావీర్యుడైన ఆ రాజును ఎదుర్కొని చంపఁగలఁడు. మహాబాహో ! రాముడింతకు పూర్వమే ప్రతిజ్ఞచేసి యున్నాఁడు ! ఏ కారణమున నా యెదుట దుఃఖ పరీతయయిన తల్లి తన యురమును ఇరువది యొక్కమారు చేతులతో తాడనము చేసికొనెనో, తత్కారణమున ఈ పృథివి నంతటిని ఇరువది యొక్క మారు నిఃక్షత్రయుత మొనర్చెదను.
అందుచే, తండ్రివయిన నీవు నిరంతరము ఆతనిని వారించుచున్నను, రాముఁడు, అనివార్యమయిన భవిష్యత్కార్య బలాత్కారమున తప్పక యిట్లు చేయును. మహాభాగుఁడయిన ఆ రాజు వృద్ధులను బహుపర్యాయములు భక్తిచే సేవించినవాఁడు. దత్తాత్రేయుని వలన లభించిన మహా విజ్ఞానము కలవాఁడు. మహాత్ముడైన యారాజు సాక్షాద్భక్తుఁడు. తద్వధ వలన పాతకము కలుగును. ఓ మహారాజ ఇట్లు పలికి బ్రహ్మ సుతుఁడయిన యా భృగువు భవిష్యత్కాల విపర్యయవేత్త వచ్చిన విధముగనే తిరిగి వెడలి పోయెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమునందు మధ్యభాగమున తృతీయోపోద్ఘాత పాదమునందు భార్గవ చరితమను ముప్పదియవ అధ్యాయము.
Summary of chapter 68 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the Lunar Dynasty chronicle, this section details the succession of king Āyu and the majestic reign of king Nahusha who once ascended to the throne of heaven. It recounts his great virtues as well as his eventual fall due to momentary pride when interacting with the holy sages. The story serves as a profound spiritual lesson for the faithful, reminding them that humility and constant self-vigilance are essential on the path to ultimate liberation.