బ్రహ్మాండ మహా పురాణము
35 - వేదవ్యసనాఖ్యము
సూతుఁడు చెప్పెను.
శాకల్యుఁడు మహాత్ముఁడు, ద్వీజపుంగవుఁడు. ఈతనికి దేవమిత్రుఁడను నామాంతరము, ఆతఁడు బుద్ధిమంతుఁడు; వేద విత్తముఁడు. ఆతఁడు ఐదు సంహితల రచించెను. (1) ఆతనికీ ముద్దలుఁడు, గోఖలుఁడు, ఖలీయుఁడు, సుతపుఁడు, ఐదవవాఁడు శైశిరేయుఁడు. శిష్యులు. శోకము, వ్రణము, రధీతరమను మూఁడు బ్రాహ్మణములను చేప్పెను. ఆతఁడు రచించిన నాలుగవ గ్రంథము నిరుక్తము (3) ఓ బ్రాహ్మణులారా! ఆతనికి నల్గురు శిష్యులు వారు పైలుఁడు, ఈక్షలకుఁడు, ధీమంతుఁడగు శతబలాకుఁడు, గజుఁడు. (4) బాష్కల కుమారుఁడు భరద్వాజుఁడు మూడు సంహితలను రచించెను. ఆతనికి మహాత్ములు, గుణాన్వితులు నగు ముగ్గురు శిష్యులు వారిలో అపనాపుఁడు ధీమంతుఁడు; బుద్ధిమంతుఁడు పన్నగారి; ఇంక మూఁడవ వాఁడు ఆర్జవుఁడు; (6)
క్రిందటి అధ్యాయములో బృహదారణ్యకోషనిషత్తులో యాజ్ఞవల్క్యుఁడు శాకల్యుని “ఔషనిషద పురుషుని” గూర్చి ప్రశ్నించెను. అంతియేకానీ ఈ బ్రహ్మాండ పురాణములో చెప్పినట్లు సాంఖ్యమార్గము యొక్క ఆధిక్యమును గూర్చి కాదు.
పైలుని శిష్య రంపర శాకల్యుడు మొదలు ఇట్లున్నది.
సుమంతుఁడు
కబంధుఁడు (కృష్ణాధర్వణమును గ్రహించెను)
పడ్యుఁడు దేవదర్యుఁడు .
జాజల కుముదాది శౌనకుడు
మోదుఁడు బ్రహ్మబాల పిప్పలాదుడు శౌలాయనీ
బభృ సైంధవాయన (లేక) ముంజకేజ్య
వీరందరు వీతరాగులు, మహాతేజులు, సంహిత జ్ఞానము యొక్క పారమును ముట్టినవారు. వారందరు తపముతో శంసిత ప్రతులు. వీరందరు బహ్వృచులు. వీరి వలననే సంహితలు ప్రవర్తిల్లెను. (7) వైశంపాయనుని శిష్యుఁడు యజుర్వేదమును రచించెను ఆతని వలన 86 సంహీతలు వచింపఁబడెను. ఇవి శుభంకరములు. (8) ఆతఁడు వానినీ తన శిష్యుల కొసంగెను. వీరో వానిని విధి విధాన పూర్వకముగా గ్రహించిరి. తన శిష్యులలో నొకఁడయిన యాజ్ఞవల్క్యుని గురువు విడిచెను. ఆ యాజ్ఞవల్క్యుఁడో మహాతపస్వి (9) ఆ శిష్యులు 86 గురు. వారే వేరువేరు సంహితలను కల్పించిరి. ఈ 86 సంహితలలో ఒక్కొక్కటి మూఁడు విధములు. ఆ భేదములు చెప్పబడినవి. (10)
శుభంకరమయిన యీ వేదభేదములు మూఁడు విధములు 1. ఉత్తరదిక్కునకు 2. మధ్య దేశమునకు 3. తూర్పుదిక్కునకు సంబంధించినవి, ఇవి వేరు వేరు విధములు. (11). ఉదీచ్యులకు శ్యామాయని ప్రధానుడయ్యెను. (నాయకుఁడయ్యెను) మధ్యదేశపు వేద విభాగ ప్రథమ ప్రతిష్టాత ఆసురీగా సంస్కృతుఁడు. (12) ప్రాచ్యులలో ఆలంబీ అగ్రేసరుఁడు. ఈ విధముగా వీరు మువ్వురు మూఁడు దేశభేదములకు ప్రప్రథములు. (12) ఈ విధముగా సంహితవాదులయిన బ్రాహ్మణులు చరకులని చెప్పఁబడిరి. ఋషులు ఇట్లనిరి. ఏ కారణమున చరవాధ్వర్యువులు అయిదోతత్త్వతః చెప్పుము. ఏదీ విభజింపబడినదీ? ఏ కారణమున వారు చరకత్వమును బొందిరి? (14) సూతుఁడిట్లనెను. ఓ బ్రాహ్మణోత్తములార! వారు చేయవలసిన కార్యము ఒక కొంచెమున్నది. వారు మేరు శిఖరమును చేరిన తరువాత వారీ విధముగ ఆలోచించిరి.
ద్విజసత్తముఁడెవ్వఁడైన ఏడు రోజులో నిచ్చటకు రాని పక్షమున ఆతఁడు బ్రహ్మహత్యా దోష పరిహారమును సలుపవలేను. అనీ యిది సమయముగా ప్రకటింపఁబడినది. (16) అంత, వైశంపాయనుఁడు తక్క తక్కిన ఋషిగణములు మేరు పర్వతమున (సప్త రాత్రి సంధి చేయబడిన ప్రదేశమునను) (బోయిరి. (17) బ్రాహ్మణుల వచనమును బట్టి ఆతఁడు బ్రహ్మహత్యను చేసెను. తరువాత తన శిష్యుల నెల్లరను పిలిచి వైశంపాయనుఁడిట్లనియెను. నా కొఱకై ద్వీజసత్తములారా ! బ్రహ్మహత్యను చేయుఁడు. మీరందరు నొక్కచో కలిసి, మిక్కిలి హితమయిన వాక్కులను వచింపుఁడు. (19) యాజ్ఞవల్క్యుండిట్లనియెను. నేనొక్కడనే చేసెదను. మీరందరు మునులు అట్లే నీలువఁబడియుండుడు. సా తపస్సు యొక్క బలముచే ఆతనిని నుత్తాపనము చేయుదును. యాజ్ఞవల్క్యుఁడిట్లు పలుకగా వైశంపాయనుఁడు మిక్కిలి క్రుద్ధుఁడయ్యెను. యాజ్ఞవల్క్యుని బహిష్కరించెను. ఆతనితో “ఓ యాజ్ఞవల్య్కా, నా నుండి నే నేర్చినదీ సర్వస్వమును సాకు ప్రత్యర్పణము చేయుము! (21) ఇట్లు చెప్పఁబడి, బ్రహ్మ విత్తములలో శ్రేష్ఠుఁడయిన యాజ్ఞవల్క్యుడు గుర్తించుటకు వీలయిన రూపములు గలిగినవి రక్తసిక్తములయినవియునగు యజుర్వేద మంత్రములను వమనము చేసి గురువున కోసంగేను. (22) అంత ధ్యాన నిమగ్నుఁడయి. యాజ్ఞవల్క్యుడు సూర్యుని సారాధించెను. సూర్యునందు బుట్టిన బ్రహ్మ (వేదము) అంతయు సూర్యునిజేరి నిలుచును. (23) అంత ఆదిత్య మండలమును పొందిన యజుర్వేద మంత్రములను బ్రహ్మరాతుఁడయిన యాజ్ఞవల్క్యునకు (వేదనిధియైన యతనికి) సంతుష్ఠుఁడయిన సూర్యుఁడొసంగెను. (24) ధీమంతుఁడు అశ్వరూపమునొందిన యాజ్ఞవల్క్యునకు మార్తాండుడు యజుర్మంత్రముల నొసంగెను. ఏదో యొక విధముగా బ్రాహ్మణులు ఆ యజుర్మంత్రములను అధ్యయనము చేయుదురు. (25)
(భారతాదుల యందు నూతన వేదమొసంగునపుడు సూర్యుఁడు అశ్వరూపము నొందినట్లున్నది. అంతియేకానీ యాజ్ఞవల్క్యుడు కాదు).
మంత్రములు అశ్వరూపము నొందిన యాజ్ఞవల్క్యున కొసంగబడినవి. అందుచే వారందరు “వాజిను” లయిరి. బ్రహ్మహత్యా రోగములచే చీలినవారు చరణమువలన చరకులుగా సంస్కృతులు. వైశంపాయనుని శిష్యులైన వారు చరకులుగా చెప్పఁబడుదురు (ఇది యొక సంప్రదాయము) ఈ విధముగా చరకులు వివరింపఁబడిరి. వాజినులను గూర్చి యింక మీఁద తెలిసికొనుఁడు.(27) వాజినులుగా పదీయైదుగురు కలరు. వారు సత్తములు యాజ్ఞవల్క్యుని శిష్యులు వారు కణ్వుఁడు, బౌధ్య మధ్యందినుఁడు, సాపత్యుడు, వైధేయుడు, అధుడు, బౌద్దకుడు, తాపమునీయుం డు, వత్సుడు, జాబాలుఁడు, కేవలుఁడు, ఆవటి, పౌండ్రుఁడు, వైజేయుఁడు, పారాశరుఁడును యజుర్మంత్ర విభాగములు ఏకాధికశతము నూట యొక్కటియని యెఱుంగవలయును. (30) జైమినీ తన కుమారుఁడయిన సుమంతున కధ్యాపనము చేసేను. సుమంతుఁడు తన కుమారుఁ డగు ‘సుత్వాను’ నకు చెప్పెను. (31) సుత్వానుడు తన పుత్రుడైన సుకర్మునకు జెప్పెను. సుకర్ముఁడు వెంటనే ఒక సహస్రసంఖ్య సంహితలను గఱచి, (32) ఒక వేయిమందికి వానీని చెప్పెను వారందరు సూర్య వర్చస్వులు. వారు అనధ్యాయ దినములలో చదువుటచే ఇంద్రుఁడు వారిని చంపెను. (33) తత్కారణమున శిష్యుల కొఱకై యతఁడు ప్రాయోపవేశము చేసెను. ఇంద్రుఁడు క్రోధోదగ్రుఁడయిన యాతనిని చూచి, వరమొసంగెను. “నీకు మహావీర్యులు అతులవర్చస్వులు నయిన ఇరువురు శిష్యులు కలిగెదరు. అత్యంత ప్రాజ్ఞులయిన యీ యిర్వురు సహస్ర సంహీతలను అభ్యసింతురు”.
“ఓ ద్విజసత్తమ ! ఈ సురలు (దేవతలు) మహాభాగులు. అదృష్టవంతులు. వారు సంక్రుదులు”, అని యశస్వియిన సుకర్మునకు చెప్పి, శ్రీమంతుఁడయిన వాసవుఁడు, శాంతక్రోధుఁడయిన ద్విజునీ చూచీ వెంటనే అంతర్జానము నొందెను. ఆతని శిష్యులు ధీమంతుఁడు, ద్విజ సత్తుముఁడయిన పౌష్యంజి (2) హిరణ్యనాభుఁడు ఇతడు కౌశల్యుఁడను నామాంతరము కలవాఁడు. నరాధిపుఁడు. పౌష్యంజి ఆర్ధసహస్రము (500) సంహితలను బోధించేను. (38) శుభంకరులయిన పౌష్యంజీ శిష్యులు ‘ఉదీచ్య సాముల’ లను నామముతో ప్రసిద్ధులు. కౌశిల్యుఁడు ఐదు సంహితలను అధ్యయనము చేసెను. (39) హిరణ్య నాభుని యొక్క శిష్యులు ప్రాచ్యసామగులుగా ప్రసిద్ధులు, పౌష్యంజీ యొక్క నల్గురు శిష్యులు (1) లౌగాక్షి (2) కుశుమి (3) కుశీది (4) లాంగలి అనువారు. వీరి యొక్క భేదముల నెఱుంగుము (40), లౌగాక్షి యొక్క వివిధ (విద్యా) శాఖలు నాడాయనీయము, తాండీపుత్రము ఆ తండిపుత్రునినుండి అనోవైనుడను సువిద్వాంసుఁడు, సకోతి పుత్రుఁడు సుసహుఁడు, సునాముఁడు. వీరందరిని లౌగాక్షి శాఖలోని వివిధ సభ్యులనుగా నెఱుంగుము. (41) కుశుమీకి ముగ్గురు శిష్యులు. ఔరసుఁడైన, పరాశరుడు తేజస్వీ యయిన నాభి విత్తుఁడు, ఈ విధముగా కౌశుములు త్రివిధములుగా స్మృతులు, శారిషుఁడు, శృంగిపుత్రుఁడు (శృంగి కుమారుఁడు) వీరిద్దరు చీరవ్రతులు,(43) రాణాయనీయుఁడు, సౌమిత్రి వీరిర్వురు సామవేదవిశారదులు. వీరు సామవేద నిపుణులు. మహా తపస్వీయైన శృంగి పుత్రుఁడు మూఁడు సంహితలను రచించిరి. వైనుఁడు, ప్రాచీన యోగుఁడు, సురాలుడు ఉత్తమ బ్రాహ్మణులు. కౌథుమ పారాశర్యుఁడు ఆరు సంహితలను జెప్పెను. (45)
అసురాయణుఁడు వైశాఖ్యుండు ఇరువురు వేదవృద్ద పరయాణులు. (వారికి పూర్వమందున్న వేదములందు వృద్ధులయిన వారి యందు భక్తులు) బుద్ధిమంతుఁడయిన పతంజలి ప్రాచీనయోగపుత్రుఁడు. (46) పరాశర కుమారుఁడయిన కోడుమునీ యొక్క వేద విద్యా శాఖలు ఆరు. శాలిహోత్ర నామమున వ్యవహరింపఁబడు లాంగలుఁడు 6 సంహితలను రచించెను. (47) హాలిని, జ్యామహానీ, జైమిని, లోమగాయని, కండు, కోహలుఁడును ఈ ఆరుగురును లాంగలుని అనుయాయులుగా సంస్మరింపబడుచున్నారు. (48) వీరారుగురు లాంగలి యొక్క శిష్యులు. సంహితలు వారిచే వ్యాఖ్యానింపఁబడినవి. ప్రచురింపఁబడినవి. (49) ఒకే యొక్కఁడు నృపాత్మజుండు హిరణ్యనాభునిచే శిష్యుండుగా చేసికొనఁబడెను, ఆతఁడు 24 సంహితలను రచించెను. ద్విపదులలో శ్రేష్ఠుఁడయిన యాతఁడు తన శిష్యులను వివరించెను. వారి నామముల నెంగుఁడు. (50) రాడి, రోడవీయుఁడు, పంచముఁడు, వాహనుఁడు, తలకుఁడు, మాండూకుఁడు, కాలికుఁడు, రాజికుఁడు, గౌతముఁడు, అజబస్తుఁడు, సోమరాజాయనుఁడు, పుష్టి, పరీకృష్ణుఁడు, ఉలూఖలుఁడు. యవీయులు (చిన్నవారు) కనీయులు శాలి, అంగులీయుఁడు, కౌశికుఁడు శాలిమంజరీపాకుఁడు, శధీయుఁడు, కానినీ, మజీయు ధర్మాత్ముఁడయిన పారాశర్యుఁడు. ఈ విధముగా సామగులు పేర్కొనంబడిరి. సామగులలో పౌష్యంజలి, కృతుఁడును ఇరువురును శ్రేష్ఠతములుగా పరికీర్తితురు. (55) వారు సంహితలను వివరించిరి. ఓ ద్వీజులారా ! సుమంతుఁడు అధర్వ (వేదమును) రెండుగా విభజించి తన శిష్యుల కొసంగెను. (55) (55 - 62) అధర్వవేదశాఖలు ఉపాధ్యాయులు వివరించును. వారిని నిర్ణయించుట కష్టము, పురాణ క్రమమిట్లున్నది.
శాకల్యుఁడు
ముద్దలుఁడు గోఖలుఁడు ఖలీయవంతుండు సుతపడు శైశిరేయుడు
(ఇతఁడు మూఁడు సంహితలను,
నిరుకమును రచించెను)
పైలుడు ఇక్షలకుఁడు రతబలాకుఁడు గజుఁడు
బాస్కులుఁడు
త్వాపనాపుఁడు పన్నగారి ఆర్జవుఁడు
ఆతఁడు కబంధునకు కృష్ణా ధర్వణ మంత్రము నొసంగెను. ఆకబంధుఁడు విద్వాంసుఁడు. తాను విన్నదంతయు, రెండు విధములుగాం జేసి పథ్యున కొక భాగము, దేవదర్శునకు రెండవది యొసంగెను. ఆ మహర్షి దానిని నాలుగు విధములుగా విభజించెను. (56,57) దేవదరునికి నలుగురు శిష్యులు. మోదుఁడు, బ్రహ్మబలుఁడు, పిప్పలాదుఁడు, శౌల్కాయనియు వారు దృఢవ్రతులు. (58) శౌల్కాయని ధర్మజుఁడు. తపము నందు స్థిరుఁడు. పథ్యానుయాయుల యొక్క (వేద) విభాగముత్తమము. అది మూఁడు విధములు. ఆశిష్యత్రయము -1 జాజలి. రెండు కుసుమాదీ, మూఁడవ పొఁడు శౌనకుడుగా స్మరీంపఁబడుచున్నారు. శౌనకుడు సంహితను రెండుగాఁ జేసి ఓక భాగమును బభ్రువున కొసంగేను. ధీమంతుఁడయిన శౌనకుండు, రెండవ సంహితా భాగమును సైంధవోయననామక శిష్యున కొసంగెను. (60) ముంజకేశుఁడను నామాంతరము కల సైంధవుఁడు ఆ సంహితను రెండుగా విభజించెను (ఈ సంహిత యింతకు పూర్వమే రెండుగా విభజింపఁబడినది) అధర్వణ సంహీత యొక్క శ్రేష్ఠతమములయిన విభాగములు 1. నక్షత్ర కల్పము 2. వైతానము 3. సంతావీధి, 4. అంగీరసుని. కల్పము 5. శాంతి కల్పము (62) ఋషి సత్తములారా ! ఖడ్లుఁడు. నాతో సహితము పురాణములను వివరించెను. ఈ క్రింద చెప్పబడువారు నా శిష్యులు. వారందరు పురాణములను సూక్ష్మముగా ననుసరించువారు. (63) ఆత్రేయుఁడు, అకృతవ్రణుఁడు, ధీమంతుఁడు సుమతి, కాశ్యపుండు, భరద్వాజుఁడు, అగ్నివర్చుండు, వశిష్ఠుఁడు, మిత్రాయుఁడు, సావర్ణి, సోమదత్తి, సుశర్మ, శాంశపాయనుఁడు, సంహితలు. ఆ మువ్వురిచే రచింపఁబడెను. (65)
కాశ్యపుండు, సావర్ణి, శాంశపాయనుఁడు వీరు సంహితాకర్తలు, నాయది నాలుగవది. ఈ నాలుగును మూల (పురాణ) సంహితలు. ఇవి యన్నియును చతుష్పాదములు, (4 భాగములు ఒక్కొక్కటీ). అన్నియును ఏకార్డవాచికములు. పాఠాంతరమందు, వేదశాఖల యందు వలెనవీ వ్యర్థములు. శాంశపాయనీకము కాక మిగిలిన వన్నియును చతుస్సాహస్రకములు (4వేల శ్లోకములు), లౌమహర్షణికము మూలము. తరువాత కాశ్యపికము. సావర్ణికము మూడవదీ అదీ ఋజు వాక్యార్థ శోభితము. శాంశపాయనికాసంహిత వేడొకటి. ఇది ప్రేరకములైన అర్థములతో విభూషితము. అందు మొత్తము మీద 6,600 ఋక్ మంత్రములు, అవికాక 15,10,10 ఋక్కులున్నవి మొత్తము 8655, (70) వాలఖిల్య సువర్ణ ఋక్ మంత్రములతో కలిసి అవి ఏడు అని కీర్తింపబడినవి. (?) సామ మంత్రములు 8014 (ఎనిమిది వేల పదినాలుగు) (71) సామగులు వీనిని ఆరణ్యకములతో 'సహోహం'తో పఠింతురు. (72) ఆధ్వర్యవములు 12000 మంత్రములు, (72) వ్యాసుఁడు యజుర్మంత్రములు బ్రాహ్మణము లెన్నియున్నవో యన్ని గ్రామ్యములను ఆరణ్యకములను (పఠించుటకు) రచించెను. (73) అటు తరువాత కథలకు ‘పూర్వ’ అను విశేషణము కలిగినది. ఋక్ బ్రాహ్మణములు, యజుస్సులు, గ్రామ్య, ఆరణ్యక మంత్రములు కలిగి యున్నట్లుగా స్మృతములు. అట్లే హారిద్ర వీర్యుల యొక్క శిష్యుల రచనలు. ఖిలములు, ఉపఖిలములును అట్లే తైత్తిరీయుల యొక్క (అధికములయిన) మంత్రములు పరక్షుద్రములుగా స్మరింపఁబడుచున్నవి. (75)
వాజసనేయ వేదమునందు ఋక్కు మంత్రముల మొత్తము (1900) ఒక వేయ్యి తొమ్మిది వందలుగా చెప్పఁబడినది. బ్రాహ్మణ భాగము దానికి నాలుగింతలు. (76) యజుర్మంత్రముల యొక్కయు ఋక్కుల యొక్కయు మొత్తము (8880) ఎనిమిదివేల యెనిమిది వందల యెనుబది. ఈ సంఖ్య (ప్రకక్ష్యకు చెందిన సామ) శుక్రియతో ఖిలమంత్రములతో సహా యాజ్ఞవల్క్య మహర్షి ననుసరించి చెప్పబడినది. (77) తద్విధముగా ‘చారణ’ విద్యల యొక్క ప్రమాణమును వినుము. (వివిధ శాఖల ననుసరించి) ఋక్కుల యొక్క మొత్తము సంఖ్య (6026) ఆరువేల ఇరువదియారు, ఇంతకంటె యజుర్మంత్రముల సంఖ్య. అధికమయినదని చెప్పబడినది. (79) అందు 11010 (పదకొండువేల పది ఋక్కులు) 19 అందు 10,080 ఋక్కులు. అందు 1030 ఋక్కు మంత్రములు. ఈ సంఖ్య సప్రమాణముగా చెప్పబడినది. ఇంత మాత్రమే ఋజ్మంత్రముల పరిమితీ. అధర్వ మంత్రముల గూర్చి యొకమాట. బహముల ననుసరించి అధర్వ మంత్రములు ఐదువేల తొమ్మిది వందల ఎనుబది, ఇరువదీ తక్కువగా ఒక సహస్ర మంత్రములున్నవని ఋషులెఱుంగవలెను. ఇయ్యది అంగీరసుల యొక్క పద్దతి ననుసరించి, వారికీ ఆరణ్యకములు కూడ కలవు. (82) ఈ విధముగా సంఖ్య చెప్పబడినది. వివిధమయిన శాఖలు కూడ చెప్పఁబడినవి. శాఖా కర్తలు, వాని భేదములకు గల కారణములు కూడ చెప్పఁబడినవి. (83) ఈ విధముగనే అన్నీ మన్వంతరముల యందు వేదములు శాఖా భేదములు కలవు. ప్రాజాపతి శ్రుతి శాశ్వతము ఇవి యన్నియు వాని యొక్క వికల్ప భేదములుగా స్మరింపఁబడినవి. (84) దేవతలు అనిత్యులగుట వలన మంత్రములు మాటిమాటికి ఉత్పత్తి చెందుచుండును. ద్వాపర యుగము నందు శ్రుతుల యందలి భేదములు చెప్పఁబడినవి.
ఈ విధముగా వేదములను విభజించి, తన శిష్యుల కొసంగి ఋషి సత్తముఁడు తపమాచరించుటకు అరణ్యమున కరిగెను. (86) ఈ విభిన్నమయిన శాఖా భేదములు వారి శిష్య ప్రశిష్యులచే కల్పింపఁబడినవి. విద్యలు పదునాలుగు ఆరు వేదాంగములు, నాలుగు వేదములు, మీమాంస, న్యాయవిస్తరము, ధర్మశాస్త్రము. పురాణము ఇంకను నాలుగు విద్యలు కలవు. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము. ఈ మూడింటితోడ కలిసియున్న అర్థశాస్త్రము వీనితో కలిసి విద్యలు పదునెన్మిది (అష్టాదశ) బ్రహ్మర్షులు మున్ముందలివారు. వారి తరువాత దేవర్షులు రాజర్షులును. ఈ విధముగా ఋషుల ఆరంభము మూఁడుగా తెలియనగును.
బ్రహ్మవాదులు పంచగోత్రముల యందు పుట్టుదురు. (కాశ్యపులు, వాసిష్ఠులు, భార్గవులు, ఆంగీరసులు, అత్రులు). వారు బ్రహ్మను పొందుదురు కాన వారు బ్రహ్మరులుగా స్మరింపఁబడుదురు. (91) దేవర్షులు ధర్మునియొక్క పులస్త్యుని యొక్క క్రతు యొక్క పులహుని యొక్క ప్రత్యూషుని యొక్క దేవుని యొక్క కశ్యపుని యొక్క కుమారులు. సమతః వారల నెఱుంగుము. దేవరులయిన నరనారాయణులిర్వురు బ్రహ్మ పుత్రులు. వారు ధర్మ పుత్రులు. వాలఖిల్యులు కృతుని యొక్క సుతులు. పులహుని కుమారుఁడు కర్దముడు. కుబేరుండు పౌలస్త్యుని యొక్క కుమారుఁడు. దలుఁడు ప్రత్యూషసుని కుమారుఁడు. నారదుఁడు, పర్వతుఁడును కశ్యపునీ కుమారులు, వారు దేవతల సమీపించేదరు కానవారు దేవరులుగా సంస్మృతులు. (95) మను వంశమున పుట్టిన రాజులు, పురూరవసు వంశమున పుట్టినవారు, (ఐలవంశ్యులు) ఇక్ష్వాకు నాభాగ వంశమున పుట్టినవారు - రాజర్షులుగా తెలియబడవలయును. (96) వారు ప్రజలను రంజించుటచేతను, మిత్రభావముతో ఆనందపరచుచు సమీపించుటచేసి, వారు రాజర్షులుగా పిలువబడిరి. (97) దోషరహితులయి, బ్రహ్మలోకమున సుప్రతిష్ఠితులయిన వారు బ్రహ్మరులుగా సంస్కృతులు. (98) దేవలోకమున ప్రతిష్టితులయిన వారు ఉత్తమ దేవరులుగా తెలిసికొనవలయును. ఇంద్ర లోకమున ప్రతిష్టితులయిన వారెల్లరు రాజర్పులు. తమ ఆభిజాత్యముచేతను, తపఃప్రభావముచేతను, మంత్రముల నుచ్చరించు సామర్థ్యము చేతను, ఎవరు బ్రహ్మరులుగా చెప్పఁబడిరో, దేవర్పులుగా, రాజర్షులుగా చెప్పఁబడిరో వారి లక్షణములను చెప్పుచున్నారు. వారికి భూతభవ్య భవిష్యద్ జ్ఞానము కలదు; వారు నిత్య సత్యవాదులు; వారు సుసంతుష్టులు, వారు ఆత్మ వివేకము కలవారు. వారు వారి తపస్సుచే ప్రసిద్ధులు. వారు వారి మాతృ గర్భము నందే సర్వము నెఱుంగగలిగిరి. వారు మంత్రకర్తలు, మంత్రగాయకులు; అనంత శక్తిచే వారు సర్వగులు; వారు దేవతలు, బ్రాహ్మణులు, రాజులు. ఈ లక్షణములు కలిగిన వారెల్లరు ఋషులుగా భావింపఁబడిరి. (102) వారలలో నేడుగురు, వారి సప్తగుణ విశేషముల చేతను, సప్తర్షులుగా సంస్మరింపఁబడుదురు. (103)
వారు దీర్ఘాయుష్కులు. మంత్రకర్తలు. వారు ఈశ్వర ప్రాప్తమయిన దివ్యదృష్టి కలవారు. వారు బుద్ధిమంతులు, వారి గోత్రమునకు వారే ప్రవర్తకులు. వారు ప్రత్యక్ష ధర్మ స్వరూపులు. వారెప్పుడును జ్ఞానమునందే నిమగ్నులు; వారు వస్తువులను స్వయముగా దర్శింపగలరు. వారు షట్కర్మనిరతులు; వారు (శాలీన) వినయవంతులై గృహమేధినులు. వారందరియందు అపక్షపాతమున వ్యవహరింతురు. దోషరహితముగా వర్తింతురు. అదుష్టములయిన కర్మహేతువులచే ఉత్తర క్రియలను ఇతరులు ఆచరించునట్లు చేయుదురు. వారు స్వయంకృతములు, నీచములు (అగ్రామ్యములు) కానీవీయునైన రస పదార్థములచే జీవింతురు. వారందరు బుద్ధిమంతులయిన గృహస్థులు. వారు గహనములయిన వనముల యంతరములలో జీవింతురు. (106) కృతయుగమునందు, ఇతర యుగములందు, వారందరిచే మరల మరల చతుర్వర్ణాశ్రమ వ్యవస్థలు చేయబడును. (107) త్రేతాయుగారంభమునందు, ఈ అంతట వర్ణాశ్రమములను ప్రవర్తిల్లజేసిన సప్తర్పుల వంశమున వీరులు మరలమరల బుట్టుదురు. పుత్రునియందు, తండ్రి, తండ్రియందు పుత్రుడును జన్మింతురు. (109) ఈ విధము వారి వంశ పరంపర యుగాంతము వరకు అవిచ్చిన్నముగ సాగును. ఇట్టి గృహమేధినుల యొక్క సంఖ్య (88000) అష్టాశీతి సహస్రముగా చెప్పబడినది. (110) ఈ గృహమేధినులు దక్షిణాయనమున పితృయానము ననుసరించి యుందురు. వారు భార్యలను గ్రహింతురు. అగ్నిహోత్ర క్రియలను చేయుదురు. అయ్యవియే ప్రజోత్పత్తికి (సంతానమునకు) హేతువులుగా వెలుంగునది. గృహమేధినులు అసంఖ్యాకులు. వారు శ్మశానమున కరుగుదురు. (మరణింతురు) (88000) అషాశీతి సహస్ర సంఖ్యగలవారు ఉత్తరాపథమున నుంచబడిరి. వారు ఊర్థ్వరేతస్కులు. వారు స్వర్గమును పొందిరి. మంత్రములను బ్రాహ్మణములను రచించినవారు వారు యుగాంతమున జన్మించెదరు. ఈ విధముగా వారు ద్వాపరయుగమున పునః పునః జన్మించెదరు. వారు, కల్పములను, వివిధ మంత్రములను, ఆర్షవిద్యలను రచించిరి. (114)
మరల మరల వారు, ద్వాపరయుగము నందు, వైవస్వత మన్వంతరమునందు, వైదిక కర్మల నాచరింతురు. (115) మహర్షులచే వేదములు ఇరువది యెనిమిదిమార్లు వ్యక్తీకరింపఁబడినవి. స్వయంభువుండైన బ్రహ్మచే స్వయముగా సప్తమ ద్వాపరము నందు వేదములు క్రోడీకరింపఁబడినవి. ద్వితీయ ద్వాపరమున ప్రజాపతి వేదవ్యాసుఁడు. తృతీయ ద్వాపరము నందు ఉశనసుఁడు వేదముల విభజించెను. చతుర్థ ద్వాపరమున బృహస్పతి వర్గీకరించెను. పంచమ ద్వాపరమున సవిత విభజించెను; ఆరవ ద్వాపరమున మృత్యువు వ్యాసుఁడుగా సంస్కృతుఁడు. ఇంద్రుఁడు ఏడవ ద్వాపరమున, వశిష్ఠుఁడు అష్టమ ద్వాపరమును వ్యాసుఁడుగా వేదముల విభజించెను. తొమ్మిదవ ద్వాపరమున సారస్వతుఁ డు పదియవ ద్వారమున త్రిధాముఁడు, పదునొకండవ ద్వాపరమున వరుఁడు, సనద్వాజుఁడు 12వ ద్వాపరమున వ్యాసుడు. త్రయోదశమున అంతరిక్షుఁడు వ్యాసుఁడు. చతుర్ధశమున ధర్ముడు; తైయ్యారుణీ పంచదశమున వ్యాసుఁడు, పదియారవ యుగమున ధనుంజయుఁడు వ్యాసుం డు. కృతంజయుఁడు సప్తదశ వ్యాసుఁడు, అష్టాదశమున ఋజీషుఁడు, ఋజీషుని తరువాత భరద్వాజుడు వ్యాసుఁడు, భరద్వాజునీ పిమ్మట గౌతముఁడు, గౌతముని తరువాత ఉత్తముఁడు, తరువాత హర్యవనుఁడు స్మరింపబడెను. హర్యవనునియనంతరము వేనుడు. తరువాత వాజశ్రవసుం డు. వాజశ్రవసుని తరువాత సోమముఖ్యాయనుఁడు. తరువాత తృణబిందువు. తృణబిందువు తరువాత తలజుఁడు. తతజునీ తరువాత శక్తి, శక్తి తరువాత పరాశరుఁడు తరువాత జాతుకర్ణుఁడు వచ్చెను. తరువాత ద్వైపోయనుఁడు సంస్మృతుఁడు. ఇట్లు ఇరువది యెనమండ్రు. వేదవ్యాసులు పురాతనులు. భవిష్యత్తులో ద్వాపరమున ద్వైపాయన వేదవ్యాసుని యనంతరము తపః ప్రభవుఁడయిన ద్రోణి వేదవ్యాసుడగును.
భవిష్యత్తులో కూడ వేదసంబంధమయిన శాఖలుండును. (126) బ్రహ్మ బ్రహ్మ జ్ఞానమును పొందెను. అది తపస్సుచే అవినాశనము తపస్సు చేతనే వైదిక కర్మ యశస్సు కూడ ప్రాప్తము. (127) మరల, తేజస్సు చేత సత్యము, సత్యము చేత అవ్యయమైన ఆనందము పొందబడినవి. ప్యాపించిన బ్రహ్మామృతము శుక్రము. బ్రహ్మమే అమృతమనబడును, (128) ఇదియే ఏకాక్షరము అయిన “ఓం” అని ధ్రువముగా నిశ్చయింపం బడినది. అయ్యదే దాని యొక్క బృహత్వముచేతను సర్వ వ్యాపకత్వము చేతను సుస్థిరత్వముచేతను బ్రహ్మముగా చెప్పఁబడినదీ. (129) అధర్వవేద, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములందు ప్రణవము నందున్న. భూః భువః సువఃగా స్మరింపఁబడినది. ఆ బ్రహ్మకొఱకు నమస్కారము. (130) జగత్తు యొక్క ప్రలయమునకు, ఉత్పత్తికి, నేది కారణముగా సంజ్లితమో, మహత్తునకు పరమై యేది గుహ్యము (రహస్య) అయినదో ఆ బ్రహ్మకు నమః (131) అయ్యది అగాధము, అపారము, అక్షయ్యము, జగత్సమ్మోహసంభవమయినది. అయ్యదీ ప్రవృత్తిచే ప్రకాశముచే పురుషార్థ ప్రయోజనము గలది. (132) సాంఖ్య జ్ఞానవంతులకు అయ్యది నిషా. శమము దమము గల వారలకదీ గతి లక్ష్యము. అది అవ్యక్తమతము ప్రకృతి బ్రహ్మ శాశ్వతము. (133) ఆత్మయోనియని గుహ్యమని సత్వమని, అవిభాగమని, శుక్రమని (పరిశుద్ధమని) అక్షరమనీ బహుధాత్మకమని సూచింపం బడినది. ఎల్లప్పుడా పరబ్రహ్మకు నమస్కారము. కృతయుగమున వైదికక్రియా కలాపములు లేవు. స్వక్రియల ఆచరింపని ప్రజలేట్లుందురు? (135) ప్రపంచమున ఒకేసారి యేదీ చేయఁబడినదో, ప్రపంచమున నెయ్యటీ చేయబడి, చేయిబడలేదో, ఎయ్యది శ్రోతవ్యమో యేయ్యదే శ్రుతమో, మంచిదికాని చెడ్డది కాని యేది కలదో. (136)
ఎయ్యెది జ్ఞాతవ్యమో, మంతవ్యమో, యెయ్యది స్ప్రష్టవ్యమో ఏయది భోజ్యమో, ఎయ్యది ద్రష్టవ్యమో, శ్రోతవ్యమో, వాసన చూడం దగినదో అది యంతయు బ్రహ్మము. (187) దానిచే నేది దర్శిత మయినదో దేవర్షులచే నయ్యది జ్ఞాతమైనది. ఏది వీడు చూడలేదో దానిని వెదకుటకు చూచుటకెవ్వఁడు సమర్ధుఁడు? (148) సర్వ వస్తువులను సర్వమును, సర్వ వ్యక్తులను ఆతఁడే చెప్పెను. ఎప్పుడయినను, ఏదయినను, ఎవనిచే చేయబడినను అదీ ఆతఁడు (ఆకర్త) చేసినదిగా భావింపవలయును. ఇంతకుఁబూర్వ మీచ్చటనేది చేయఁబడినదో, అయ్యది వేలోకనీచే చెప్పఁబడలేదు. ఎవనిచేనైన నేదియైన, నెచ్చటనైన, ఎట్లయినను అయ్యది యా బ్రహ్మచేతనే చేయఁబడినది. లోకమున కర్తలాచరించు కృత్యము ఆతనిచేతనే (ఆ బ్రహ్మచే) చేయబడినట్లు ప్రతిభాసించును. విరిక్తము, అతిరిక్తము (శూన్యాశూన్యములు) జ్ఞానము, అజ్ఞానము, ప్రీయము, అప్రియము, ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము, మృత్యువు, అమృతము, ఊర్థ్వస్థితి, తిర్యక్షితి, అధోభావము. ఇవన్నీయును అదృష్టకారణుం డయిన ఆ బ్రహ్మక్రియలే. (142) అవీ యన్నియును స్వయంభువుఁడును, జ్యేష్ఠుఁడు, బ్రహ్మయు, పరమేష్టియు సయిన ఆ ప్రభువునకు చెందినవియే త్రేతాయుగము లందు మరల మరల, ప్రతి వ్యక్తికి నదీ వేద్యమయిన దగును. (143) ఏయది యొక్కటిగా వేద్యమో (ఒకే వేదముగా నున్న స్థితి) అయ్యది ద్వాపర యుగమున మరల మరల విభజింపఁబడినది, శాఖలుగా కూర్పఁబడినది. మొట్టమొదట ఆరంభమున వైవస్వత మన్వంతరమున బ్రహ్మవేదములను అనువదించేను. (144) యుగయుగము నందు ఋషులు మరలమరల పుట్టుచునే యుందురు. వారు పరస్పరము పుట్టిన పారగుట సంహితలను వారేరచింతురు. (88000) ఎనుబదియెన్మిది వేల శ్రుతరులు సంస్మృతులు. అన్ని సంహితలు, మరల ఆవర్తింపఁబడినవి. (146) ప్రతి యుగమునందు ఈ శాఖలు శ్మశానస్థలముల కేగినవారిచే, దక్షిణ పథము నాశ్రయించిన వారిచే మరల మరల వర్గీకరింపఁబడినవి. (147)
అన్ని ద్వాపరయుగము లందు అన్నియుగములందు శ్రుతర్షులచే సంహితలు వర్గీకరింపఁబడినవి. వాని గోత్రములలో ఈ శాఖలు, పునః పునః వ్యవహారములో నున్నవి. (148) ఆ శాఖలు ఆ రచయితలు ఆయుగాంతము వరకుందురు. గత మన్వంతరముల యందు, భవిష్యత్మన్వంతరములందును, ఇట్లేయని గ్రహింపవలయును. (149) ప్రతి మన్వంతరము నందును శాఖల వర్గీకరణము కలదు. గత మన్వంతరము నందిట్లే జరిగినది. అట్లే వర్తమాన మన్వంతరములఁ జరుగును. ఏయది జరుగవలయునో యది భవిష్యత్తులో మన్వంతరముల జరుగును. పూర్వము కలిగినవానిచో తరువాత కలుగునట్టివి, వర్తమానముచే పూర్వాపరముల రెండింటినీ తెలిసికొనవలయును. (151) ఈ క్రమ యోగముచేత మన్వంతరముల వీనిశ్చయము జరుగును. అందుచే, దేవతలు, పీతరులతో, ఋషులతో, మనువులతో, మంత్రములతో నూర్ణమునకు పోవుదురు. మరల వారితో నవతరింతురు. (153) సర్వదేవతలు జనలోకమునకు పోయి, మరల, అందుండి పదికల్పములు తిరిగి వచ్చేదరు. పర్యాయ కాలము (తిరిగి రావలసిన సమయము) సంప్రాప్తముకాగా, వారు అవశ్యము జరుగవలసిన మృత్యువుతో సంబంధ మొందుదురు. తరువాత వారు దోషవజ్జన్న నొందుదురు. రోగముల నందెదరు. అప్పుడట్లు వారు తిరిగివత్తురు. వారిని వర్తనము వారు వారీ దోషముల దర్శించుట వలన కలుగును. (155) ఆ విధముగా ముందు వెనుకలకు పదిసార్లు దేవయుగమున వచ్చి పోవుచుందురు. జనలోకము నుండి వారు. తపోలోకమునకరుగుదురు. అందుండి వారు తిరిగిరారు. (156) ఈ విధముగా వేలాది దేవయుగములు సాగిపోయినవి. వారు బ్రహ్మలోకమున ఋషులతో సహా మరణమొందెదరు. వివరముగా వారిని వర్ణించుటకు శక్యముకాదు. కాలము అనాది, ఆరంభము అంతము లేనిది అగుట కారణము. (158)
కల్పములతో పితరులతో దేవతలతో, ఋషులతో కూడ మన్వంతరములు సాగిపోయినవి. అయ్యవి యార్హకాలమున సృష్టింపఁబడినవి. యుగములుకూడ వచ్చిపోవుచుండును, ఈ వీధముగా కల్పములు మన్వంతరములు వందలు వేలు ప్రజలతో సహితముగా వ్యతీతములయినవీ. మన్వంతరాంతమున నాశనము; మరల నాశనానంతరము సృష్టియు జరుగును. (161) అనుపూర్విగా క్రమముగా దేవతల యొక్క ఋషులు యొక్క మనువుల యొక్కయు పితృగణముల యొక్క సృష్టి యొక్క విధానమును వినాశము యొక్క పద్దతిని ఒక వంద సంవత్సరముల కయినను చెప్పుటకు శక్యము కాదు. (162) (కాలము అనంతమని చెప్పుట) మనుష్య గణనములో మన్వంతరము యొక్క సంఖ్య విస్తారము, వినాశనము, సృష్టి తెలిసికొనుము. (163) మన్వంతరముల యొక్క విస్తృతి సంఖ్యాశాస్త్రమున విశారదులైన వారిచే గణింపఁబడినది. ప్రతి మన్వంతరము మూఁడు వందల కోట్ల సంవత్సరములు సంపూర్ణమని ద్విజులచే లెక్కింపఁబడినది. (164) ?(ఇతరములు ‘సప్త షష్టి నియుతములు మరియు 20 వేల సంవత్సరములు. సంధ్యా సంధ్యాంశాది కాలగణనము కాకుండ) మన్వంతర సంవత్సర సంఖ్య మనుష్య గణనములో చెప్పబడినది. దేవతా గణనము ననుసరించి మన్వంతర ప్రమాణమును చేప్పెదను. (166) దేవతా సంఖ్యా మానము ననుసరించి, ఒక మన్వంతరము ఎనిమిది వందల ఏబది రెండు వేల సంవత్సర పరిమితము. దీనికి పదునాలుగు రెట్లు “అభూత సంప్లవ” మందురు. (సర్వజీవుల ప్రళయము). నాలుగేసి యుగముల యొక్క వేయి సంవత్సరముల మొత్తము ఒక బ్రహ్మకు పగలుగా చెప్పబడినది. తరువాత సర్వభూతములు సూర్యరశ్ములచే దగ్గపటలము లగును. బ్రహ్మను అగ్రేసరునిగా నుంచుకొని, దేవతలచే, ఋషులచే, దానవులచే అనుసరింపఁబడుచు, వారు
సురశ్రేష్ఠుఁడు, దేవుఁడు, ప్రభువునగు, నారాయణుని ప్రవేశింతురు. ఆతఁడే సర్వ జీవరాశులను మరల మర కల్పాదుల యందు సృజించువాఁడు. (170) దేవర్షులతో సహా ఇది స్థితి కాలముగా భావింపఁబడినది. ఇఁక సర్వమన్వంతరముల యొక్క (మధ్య కాలము) ప్రతి సంధిని యేటలుంగుము. (171) ఓ అనఘులారా ! యుగమనగనేమియో యింతకుం దూర్వము నాచే సముద్గీష్టమయినది. కృత త్రేతాదులతో గూడిన కాలము చతుర్యుగముగా చెప్పబడినది. భగవానుడిట్లు చెప్పెను. “మనువు యొక్క పాలనము నాలుగు యుగముల యొక్క డెబ్బది యొక్క రెట్లు” అని (దీనికి సంధ్యలు, సంధ్యాంశలు - అధికముగా చేర్చవలయును). (173) ఇట్లు గడచినట్టి, గడవనున్నట్టి మన్వంతరముల లక్షణములు వర్తమాన లక్షణములను బట్టి చెప్పబడినది. (175) మన్వంతరము పూర్వము వలెనే, దేవతలతో, ఋషులతో బాటు అవశ్యం భావియర్ధమున (తప్పనిసరిగా) వినివర్తనము చెందును. మూఁడు లోకముల యొక్క ఈశ్వరులు, సప్తర్షులు, దేవతలు, పీతరులు, మనువులు. ఎవరెవరింతవరకు స్థితిపొంది యుండిరో (జీవించియుండిరో) ఈ మన్వంతరములో తమ మరణము యొక్క స్థితిని గ్రహించెదరు. (అధికమయిన సంవత్సరములతో మన్వంతరపు వత్సరములు సంపూర్ణములు కాగా) వారి యొక్క పాలనము చివర స్థితికి వచ్చిన, దీనిని వారెరుంగుదురు. దీనినీ గ్రహించి వారందరు విషాదమొందుదురు. వారందరు మహర్లోకమునకు పోవలయునని ఉన్ముఖ మనస్సు కలిగియుందురు. ఇంక మన్వంతరము సమాప్తమునకు రాగా, వారియొక్క స్థితి ప్రమాణము సంపూర్ణము కాగా, ఆ దేవతలు కృతయుగము వరకు నుండవచ్చును. అప్పుడు మన్వంతరపు భవిష్యత్పభువులుదయింతురు. (180)
అట్లే దేవతలు, పితరులు, ఋషులు మరియు మనువు. మన్వంతరము సంపూర్ణము కాగా, ఆ విధమునే కలియుగము సమాప్తము నొందును. (181) కలియుగమున మిగిలియున్న కలిశిష్ఠులు ఉండగనే కృతయుగ మారంభమగును. బుధులచే, కృతయుగము యొక్క ప్రవృత్తి జరుగుట) కలియుగముచే ప్రారంభమయినదనీ జ్ఞాపకముంచుకొందురు. అట్లే మన్వంతరము యొక్క ఆరంభము మన్వంతర సమాప్తమునకు పూర్వమే జరిగినది. పూర్వమందు మన్వంతరము సమాప్తముకాగా, వేడొక మన్వంతరమారంభముకాగా, కృతయుగము యొక్క ఆరంభమున, బ్రతికి మిగిలియున్న సప్తర్సులు మనువు, అందే తమ కాలము నపేక్షించుచు నుందురు. (184) క్షీయమానులయిన తపస్వులు (అలిసిపోయినవారు) వచ్చేడు మన్వంతరము కోణకు మన్వంతరాగమోత్సవము కొఱకు, సంతానము కొఱకును ప్రతీక్షించుచుందురు. వృష్టి యొక్క ఆరంభము కాగానే పూర్వము వలెనే వారు ప్రవర్తించెదరు. జంటలు తమకార్యములకు ప్రవర్తించుచుండ ఔషధమూలికలు వృద్ధి పొందనారంభింప, నివాసములు (నికేతనములు) ప్రజలు ఇందందు వసించుచుండ వ్యావసాయిక ప్రవృత్తులు (వ్యాపారములు) ఆరంభముకాగా, ధర్మముపసంస్థితము గా ప్రపంచమంతయు నీరానందముగా నుండ, స్థావర జంగమ భూతములన్నియు నష్టము నొంద, (ఇంతకు పూర్వము నాశనమయినవి తిరిగి మొలకలెత్తక యుండ) సంఘమంతయు గ్రామములతో ఆరంభమయి పట్టణములతో అంతమొందునట్టివన్నియు వర్ణాశ్రమ వివర్జితములై యుండ, పూర్వ మన్వంతరమున మిగిలిపోయిన వారు, ధార్మికులు, సప్తర్పులు సంతానార్థము వ్యవస్థీతులై యుందురు. (189) ప్రజోత్పత్యర్థము పరమ దుష్కరమయిన తపస్సులు పొరాచరించినను దేవతలు, అసురులు, పీతగులు, ఋషులు, సర్పములు, మనుష్యులు, భూత పిశాచములు, గంధర్వులు యక్షరాక్షసులు వీరందరు పూర్వమువలెనే, పూర్వపూర్వ జనులు మరణించుటచే పుట్టెదరు. (191) అంత పార్టీలో మిగిలియున్నట్టివారు (శిష్టులు) సప్తరులు మనువులు ఉత్తముల శిష్టాచారములను, మన్వంతారంగభమున వివరించుటకు ప్రారంభింతురు. దేవతలతో మనుష్యులు విశిష్టములయిన వైదికాచారములను ఆచరించుటకు ప్రారంభింతురు. బ్రహ్మచర్య వ్రతముచే (వేదాధ్యయనముచే) వారు ఋషుల యొక్క ఋణమును తీర్చెదరు.
సంతానముచే పితరుల ఋణమును తీర్చెదరు. యజ్ఞములచే దేవతల ఋణము తీర్చెదరు. ఒక వంద వేయి సంవత్సరములు, వర్ణాత్మకమయిన ధర్మమున, వర్ణ శిక్షణమును పాటించుచునుందురు. (194) వేదత్రయిని స్థాపించిన తరువాత, వ్యావసాయిక వ్యాపారమును స్థాపించిన పిమ్మట, దండనీతి (ధర్మపాలనము) సంస్థాపన, ధర్మయుతములయి వర్ణాశ్రమాచారముల సంస్థాపనమును, ఆశ్రమములను నిర్మించిన తరువొత, వారు స్వర్గమునకు పోవలయునని తలంచిరి. (155) పూర్వ దేవతలందరు స్వర్గాభీగమనమున కుత్సుకులై యుండ, ధర్మము నందు సంస్థితులయిన దేవతలందరు పరమ పవిత్రులుగా నుండిరి, (196) మన్వంతరము గడువగా, వారు పొరీ స్టానములను అన్నింటిని విడిచిపెట్టి, ఎట్టి అనామయమైన (బాధలు లేని) మహర్లోకమునకు మంత్రములతో వాగరిగెదరు. (197) వారందరు వారి వారీ ఆధికారిక స్థానముల నుండి తిరిగి వచ్చిరి. మానసీ సిద్ధినీ వారు పొందిరి. విషయేంద్రియముల పై పరిపూర్ణ విజయమునందీ, వారు సర్వ భూతముల వినాశము కొఱకు నిరీక్షించుచుందురు. (198} {అదీయే విశ్వవిలయము) అంత, పూర్వదేవతలు (వ్యతీతేషు) వెడలిపోగా, మూఁడు లోకముల యందంతటను దేవతల నివాస స్థానములు శూన్యములయినవి. స్వర్గ పోసులయిన ఇతర దేవతలు, ఇచ్చటనే ఉపస్థితులై యుండిరి. అటు తరువాత తపః ప్రభావ యుక్తులయిన వారు వారి స్థానములను పూరింతురు. (200) వారు సత్యవ్రతులు, బ్రహ్మచర్య వ్రతదీక్షితులు వేదవిద్వాంసులు. సప్తరుల యొక్క మనువు యొక్క దేవుల యొక్క పితరులతో సహా, నీధనము (పూర్వీకుల యొక్క భవిష్యద్వ్యక్తుల యొక్క) మొదటి నుండి చెప్పఁబడినది. మన్వంతరక్షయము వరకు పార్టీ ప్రజా సంతతి యందు విచ్చేదము లేదు. ఈ విధముగనే, ఆ వ్యక్తుల యొక్క స్థితి యదేవిధానమున నున్నది. బ్రతికియున్న వారందరు నాశనమగు నంతవఱకు అన్నీ మన్వంతరములయందు ఇదే విధానము జరుగును.
జరిగిపోయినట్టి రానున్నట్టి (అతీతములు, ఆగతములు) మన్వంతరముల యొక్క ప్రతీసంధాన లక్షణము (మారునట్టి లక్షణములు స్వయంభువునిచే చెప్పఁబడినవి. భవిష్యన్మన్వంతరముల యొక్క సాధనము (సాధించిన విషయములు) గత మన్వంతరముల మీద సౌధారపడియుండును. ఈ విధముగా అవిచ్చిన్నమయిన సంతతి సర్వ భూతముల విలయము వరకు సాగుచుండును. (205) మహర్లోకమున మన్వంతరముల యొక్క (మార్పు) పరిర్తనము అవితథముగ జరుగుచుండును. మహర్లోక ప్రజలు, జనలోక ప్రజలు సత్యలోకమునకు పోవుదురు. అందు ప్రతిష్ఠితులగుదురు: (206) అందు జరుగు దర్శనములచే (కార్యములచే)తను, అందలి నానాత్వ కలిత ప్రత్యయము చేతను, సత్యలోకమున ప్రతిష్ఠితులయిన వారు, అందే నిత్యముగా సంస్థితులై (పారీ తపస్సుచే) మన్వంతర సంధాన లక్షణమున (పరిణామకాలమున) నుందురు. (207) మన్వంతరముల పరీవర్తనములలో, వారు సత్యలోకమును (అపరాంతే) పరిత్యజింతురు(?) తరువాత విషయ వాంఛా పరిత్యాగము వలన వారు దేవుఁడైన నారాయణుని యందే ప్రవేశింతురు. విధి ప్రభావమున చిరకాలము నుండీ జరుగుచున్న మన్వంతర పరివర్తనములందు జీవలోక మొక క్షణమయినను మీగీలియుండదు. ఇయ్యది విధి ప్రభావము. జీవజన ప్రపంచము క్షయో దయములు నొందుచునే యుండును (209) ఈ విధముగా ధర్మాత్ములయిన మనువుల యొక్క మన్వంతరములు, వారి దీవ్యదృష్టి ఋషులచే వర్ణింపఁబడినది. వారు వీనిని వాయు ప్రోక్తములుగా మనోహర వర్ణనా మిశ్రములుగా, కొలదిపాటి సంక్షేపముతో పొందరి. మనువులకు దివ్యశక్తి కలదు. మన్వంతరములందేల్లెడలను రాజర్షులు, దేవతామునులు, బ్రహ్మరులు, దేవతలు, నాగములు ఉండిరి. మన్వంతరములన్నియు దేవతలను, సప్తర్షులను, ప్రజాపతి (ప్రజేశుఁ డు) పితరులను కలిగియున్నది. (211) ఈశ్వరులను స్తుతించుట ఖ్యాతిదము. వారందరు ఉదారవంశముల నుండి జన్మించిరి. వారు గొప్ప కీర్తిమంతులు. వారు, వారి ప్రకృష్ట మేధాబలము చేతను, బుద్ధీ విశేషముతోడను కూడియుండిరి. వారికి గల కీర్తిని బట్టి, కాంతిని బట్టి, ప్రశస్తిని బట్టి, గౌరవమును బట్టి వారు పూజింపఁబడిరి. వారి చరిత్ర యంతయు, పవిత్రము స్వర్గయోగ్యము పుత్రప్రాప్తియోగ్యము, మిక్కిలి రహస్యము. మహాపర్వములలో శ్రేష్ఠమైన జప్యము అయ్యది దుఃఖోపశాంతి కూర్చును ఆయువు నొసంగును. (213)
యోగసిద్దులు కలిగిన ప్రజల కధిపతి యగు పరమాత్మ నాకు సిద్ధి నొసంగుగాక. ఏలయన నేను క్రమముగా అజుని యొక్క (బ్రహ్మ యొక్క) సంతతిని స్తోత్ర మాచరించితిని. అయ్యది పవిత్రము. అయ్యది ప్రధానముగా రాజుల గూర్చి, దేవర్షుల గూర్చి, దివ్యర్దుల గూర్చి మనువును గూర్చి ప్రథితముగ చెప్పఁబడినది. ఈ విధముగా విస్తారముగ, సాకల్యముగ స్వాయంభువ మను చరిత్రము వివరింపఁబడినది, ఇం క నేమి. నేను వర్ణింపవలయును !
ఇది పోయుప్రోక్తమయిన మహాపురాణము అయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగమున ద్వితీయానుషంగ పాదమున వేదవ్యసనాఖ్యానము, స్వాయంభువమన్వంతరవర్ణనమను ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 35 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter beautifully weaves together the inspiring legends of great spiritual luminaries like Yājñavalkya and Vyāsa, celebrating their unsurpassed devotion and wisdom. It seamlessly transitions into describing the majestic Svāyambhuva Manvantara, the foundational epoch guided by the very first Manu under the supreme lord's divine gaze. These celestial narratives strengthen the faithful heart, demonstrating how deep asceticism and unyielding devotion can bridge the mortal realm with eternal divine grace.