2 - శివ పుర వర్ణనము

వాయువిట్లనెను.

అసాధారణ వృత్తి కలిగిన జనులచే, సూక్ష్మదర్శులచే, హోమము చేయగా మిగిలిన వానిచే ప్రత్యేకములయిన పవిత్ర ధర్మములు చేయబడినవి. వారు. దేవతలతో సహా మహర్లోక నివాసులుగా వెనుక నుందురు. కీర్తి వర్థనులయిన చతుర్దశ మనువులు కీర్తింపఁబడిరి. దేవతలు, ఋషులు, మనువులు, పితరులు, ఎవరెవరు గతించిరో, వర్తమానులో అనాగతులో, ఎవరెవరు నా చే ఇంతకుఁబూర్వము వర్ణింపబడిరో, వారందరు బ్రాహ్మణులతో, క్షత్రియులతో, వైశ్యులతో, ఇతర పుణ్య పురుషులతో మహర్లోకమునకు దేవతలతో అనుసరింపబడి వెళ్లిరి. వారందరు మహర్లోకమును సమాశ్రయించిరి. వారు శ్రద్ధావంతులతో గర్వరహితులతో వర్ణాశ్రమముల యొక్క ధర్మములందు శ్రాత స్మార్త విషయముల యందు సంస్థితులతో అనుసరింపఁబడిరి. మన్వంతరముఁక్షయముకాగా వారందరు నివృత్తాధికారులయిరి.

ఋషులిట్లడిగిరి.

ఓ వాయూ! మహర్లోకమున నీ చే చెప్పఁబడిన లోకమున ఏది స్థాపింపఁబడి యున్నది? ప్రతి లోకమున కర్తవ్యముగా అందు ఏది సమధిష్ఠితమయినది? అనగా తత్త్వ విదుఁడయిన వాయువు, మధురమయిన వాక్యమును పలికెను.

వాయువిట్లు సమాధానమొసంగెను.

మహర్షులు పదునాలుగు స్థానములనే నిర్మించిరి. వానిని లోకములందరు. అందు మానవులు నివసింతురు వానిలో ఏడు కృతములు. మీగిలిన ఏడు అకృతములు. 'భూ' అనుదానితో ఆరంభమై 'సత్య ముతో సమాస్తమగునట్టివి ఏడును కృతములు. అకృతములు ఏడు. అవి ప్రకృతములైన ప్రాకృతములయిన స్థానములు. అందుండు వారు స్థానినులు. స్థానములు స్థానులతో. సృజింపఁబడినవి. భూమి, అంతరిక్షము, దీవము, మహము అనునవి నాలును ఆవర్ణకములుగా స్మరింపఁబడినవి (ఆవర్ణకమన పై కవచము) క్షయాతిశయ యుక్తములు కొన్ని, క్షమాదులతో కూడియుండునవి మరి కొన్ని ఏవి నైమిత్తికములో (కారణమువలన నిమిత్తము లన గలిగినవి) అవి “ఆభూతసంప్లవము వరకు స్థిరముగా నుండును. (అవి భూతప్రళయము వరకు ఉండును).

జనః, తపః, సత్యం ఈ మూడు స్థానములు ఏ కాంతీకములు. అయ్యవి మహా ప్రసంయమము వరకు నుండును. ఈ సప్త స్థానములను గూర్చి స్పష్టముగా చెప్పెద వానిలో మొదటిది భూర్లోకము, రెండవది భువర్లోకము.

మూఁడవది స్వర్లోకము, మహర్లోకము నాలుగవది. జనలోకము ఐదవది. తపోలోకము ఆరవది. సత్య లోకము ఏడవది. సత్య లోకమునకు పైగా నీరాలోకము ఆ లోకమున కాంతి ఏమియు నుండదు. పూర్వము, భూః అన్నది వ్యాహృతిగాక పూర్వము దాని నుండి భూ ర్లోకమవతరించెను. రెండవది 'భువః' అన్నది దాని నుండి ఆకాశము ఆవిష్కృతము. “స్వః' అనీ మూడవది. దాని నుండి దివము (స్వర్గము) ప్రొదుర్భవించెను. ఈ వ్యాహృతిత్రయముచే బ్రహ్మ ఈ విశ్వమును (లోకమును) కల్పించెను. అందుచే, భూః పార్ధివలోకము. 'భువం' అంతరిక్షముగా స్మృతము. స్వర్లోకము స్వర్గము, ఇది పురాణము నందలి నిశ్చయము. భూతముల కధిపతి అగ్ని అందుచే అగ్నిని భూతపతిగా స్మరింతురు. వాయువు (గాలి) భువమునకు అధిపతి. అందుచేతనే వాయువు భువస్పతియయ్యెను. సూర్యుం డు దివస్పతి. (దివః స్వర్గము). “మహ' అని వ్యాపారింపఁబడుటచే మహర్లోక మావిర్భవించెను అయ్యది (మహర్లోకము) అధికారముల నుండి తొలగింపఁబడినవారికి నివాసము. 'జన'ము పంచము లోకము. అందుండీయే జనులు పుట్టుదురు. అయ్యది స్వాయం భువాది ప్రజలకు జన్మస్థానమగుట దానిని జన లోకమందురు. పూర్వము కీర్తింపఁబడిన స్వాయంభువాదులు ప్రజలకు జన్మస్థానమగుట దానినీ జన లోకమందురు. పూర్వము కీర్తింపఁబడిన స్వాయంభువాదులు ఈ ప్రపంచమున ఈ కల్పములో తపస్సు చేయుదురు. అందుచే ఆ పదము 'తపమయినది. ఊర్థ్వ రేతసులు తపస్సుచే భావితాత్ములును నయిన ఋభువులు సనత్కుమారాద్యులు అందుండుటచే తపమయినది. 'సత్య' మనుపదము బ్రహ్మము. అయ్యది సత్తా మాత్రముగనే స్మరింపఁబడును. (సత్తయనగా పవిత్ర స్థితి) అందుచే బ్రహ్మ లోకము సత్య లోకము. ఇది ఏడవ లోకము అయ్యది కాంతి మంతము. దేవతలందరు, గంధర్వులు, అప్సరలు, యక్షులు, రాక్షసులతో సహా గుహ్యకులు, సర్వ భూతములు, పిశాచములు, మానవులతో సహా నాగులు - వీరందరు స్వర్లోక వాసులు, మరుత్తులు, మాతరీశ్వులు (వీరు వాయుదేవతలు) రుద్రులు, అశ్వనీదేవులు. వీరు భువినీవాసులు. ఆ నికేతనులయిన వారు భువర్లోకనివాసులుగా నుందురు.

ఆదిత్యులు, ఋభువులు, విశ్వ దేవతలు, సాధ్యులు, పితరులు, వీరందరు దీవోకసులు, ఆంగీరసులయిన ఋషులు భువర్లోక సమాశ్రితులు. తారా గ్రహనివాసులయిన ఋషులు వైమానికులనంబడుదురు. శుక్రునితో మొదలిడి, చాక్షుషులతో అంతమయిన వారు వ్యతీతులైనవారు, భువర్లోకమును పొందుదురు (స్వర్లోకము!) వారు పరస్పరము శుద్దులు. వారు తన్మాత్రలతో ఆరంభమగుదురు .

లోకములలో మహర్లోకము నాలుగవది. ఆ లోకమున వారు కల్పాంతము వరకు నుందురు. ఈ విధముగా బ్రహ్మచే వ్యాహృతములయిన లోకములు క్రమశః చెప్పఁబడినవి. భూ లోకము ప్రథమము మహర్లోకము అంతమునను చెప్పఁబడినవి. ఏడుగురు సూర్యులు. (ప్రళయ కాలమున) హరీ అర్చుల (జ్యోతుల) చే దహింతురు . మారీచీ, కశ్యపుఁడు, పులహుఁడు, దక్షుండు, స్వాయంభువుఁడు, అంగిరసుఁడు, భృగువు, పుల్యస్త్యుఁడు, క్రతువు ఇతరులు - వీరందరు ప్రజాపతులు. వారందరదు ఋభువులతో నుందురు. వారు నిస్సత్తులు, ధనాదికములులేని వారు, నీర్మములు (నాదియన్నది లేనివారు), వారు ఉర్వ రేతసులు (జితేంద్రియులు). ఋభువు, సనత్కుమారాదులు తపోధనులు వైరాజులు (విరాజుని పుత్రులు. విరాజు ప్రజాపతి). (కామ దూరులు), (35 శ్లోకము సరిగాలేదు). తపోలోకము ఆరవలోకము. ఇది చతుర్దశ మనువులకు సర్వమన్వంతరములలో సావర్ణులతో సహా పునరావృత్తి హేతువులు. వారు వారి హృదయములలో యోగము, తపము, సత్త్వమును (సమాధాయ) ఉంచుకొని, ఆరవ లోకమునకు తిరిగివచ్చెదరు. వారి రాక విపర్యయముగా నుండును. సత్య లోకము ఏడవది. అపునర్మార్గగాములయిన వారికి ఇది లోకము. అనగా - వారు. అంతర్లీనస్థితిలో మోక్షమార్ధగతులు. బ్రహ్మ లోకము అప్రతీఘాత లక్షణము గలది. (తిరస్కారము, అభ్యంతరము లేనిది). పర్యాస పరిమాణమున భూర్లోకము స్మరింపఁదగినది. (పర్యాసము) భూమికిని సూర్యునకు మధ్య దూరము స్వర్గలోకము. అది దివము. ధ్రువునకు జనలోకమునకు మధ్య దూరము మహర్లోకమందురు. ఏడు లోకములు వ్యాఖ్యానింపఁబడినవి. అవి సాధించిన అధ్యాత్మీక సిద్ధులను గూర్చి వివరింతును. భూలోక వాసులందరు అన్నమును తిని (ఫల) రసములను త్రాగి బ్రతుకుదురు.

భువర్లోకమున స్వర్లోకముననున్న వారందరు, సోమపానము చేయువారు, నేతిని త్రాగువారు మహర్లోకమును సమాశ్రయించి, యాచతుర్ధలోకమున నుండువారు పంచలక్షణయుత మయిన మానస్థితి గలవారు. వారు మానసికముగా కోరిన దెల్ల వెంటనే సంపన్న మగును. ఈ దేవతలందరు పరస్పరము సర్వ యజ్ఞములచే పూజింతురు.

 ఆ దేవతలు భూత వర్తమాన భవిష్యత్కాలవర్తులు. మొదటిది తుదిది వర్తమానముచే నిర్దేశింపఁబడును  దేవతా వర్గము తపోలోకము నుండి దూరముగా పోయినప్పుడు, వారి సంబంధము. తగ్గును. వారి సిద్ది మానసికము వారి అధికారము సమాప్తమయినట్లేయుండును. వారి మానసిక సిద్ధి పవిత్రమయినది. దీనికి కారణము వారి పరస్పర సంబంధము.

నాలుగు లోకములు గూర్చి చెప్పబడినది. జనలోకము గూర్చి చెప్పితిని, మరల వానిని గూర్చి సూక్ష్మముగా చెప్పెదను.

వాయువిట్లనెను.

మరీచి, కశ్యపుఁడు, దక్షుఁడు, వసిష్ణుఁడు, అంగీరసుఁడు, భృగువు, పులస్త్యుఁడు, పులహుడు, క్రతువు - మొదలగు వారందరు, పూర్వము బ్రహ్మ యొక్క మానసము నుండి ఉద్భవించిరి. తరువాత వారు ప్రజలను ప్రతిష్టించి జనలోకము నాశ్రయించిరి. కల్పాంతమందలి అగ్నియందు, భూలోకముతో ఆరంభించి మహర్లోకముతో సమాప్తమైన ప్రపంచమున వారందరు సంవర్తకాగ్ని జ్వాలలచే వాసనలతో పరివ్యాప్తులయిరి. (వాసనలతో - వారాచరించు క్రియాకలాపములతో) మహర్లోక నివాసులయిన యముడు మొదలయిన గణములు, మహార్లోకము ప్రజ్వరీంచుచుండ వారందరు జనలోకము నాశ్రయింతురు. అందుండు వారందరు సూక్ష్మ శరీరులు. వారందరు యామాదులతో) తుల్య సామర్థ్యము కలవారు. వారితో సమానమైన రూప ధరులు కూడ. వారు జనలోకమున సంచరింతురు. సంవర్తాగ్ని యావత్ప్రపంచము పై జాజ్వల్యమానమై చెలరేగును. అవ్యక్త యోని యైన బ్రహ్మ బ్రహ్మ యొక్క రాత్రీ, వ్యుష్టముకాగా, పగటి యొక్క ప్రారంభమున పూర్వము వలే క్రమముగా ఆరంభమగును. వారందరు పూర్వము వలెనే జన్మింతురు. స్వాయంభువాదులు, సాధకులైన మరీచ్యాదుల తుద వరకు అట్లే మరలనుదయింతురు. వారందరు దేవతలు. వారందరు యమాదులను దాటి పోవుచు క్రమముగా ప్రజా పతి యొక్క కనీయ సోదరులుగా పుట్టెదరు. పూర్వీకులు పూర్వము, తరువాత వారు తరువాత పుట్టెదరు. దేవతాస్వయమందు దేవతలు సప్త సంభూతులుగా స్మరింపఁబడుదురు. ఈ సప్త సంభూతులు కల్పములతో పుట్టెదరు. వారు వారితోడి సమాన క్రమముననే పుట్టెదరు. దేవతలు ఆ వర్తమాన ములయిన క్రమ జన్మలు పది పర్యాయములు (దశ కృత్వా) ఈ గణములు పునః పునః జవజవీ భావమును పొందెదరు. అనివార్యమయిన భవిష్యత్తుచేత, వారి యొక్క

            పుణ్యవంతమైన ఖ్యాతి యొక్క బలమునను, నివృత్త వృత్తులయి అందున్న ఎల్లరు దేవతలు వైరాజస్థితిని పొందెదరు, లోకములనన్నిటిని పరిత్యజించిన తరువాత తత్సతి పొందుదురు. కాల క్రమమున, కొంత కాలము గతించగా తపస్వినులయిన నిత్యముక్తులు తమయన్వయము . నందు ఇంతకు పూర్వము చెప్పిన ధర్మము ఫలితముగా పుట్టెదరు. ఇక్కడ పుట్టిన తరువాత వారు వారి స్థానముల వహింతురు (నింపుదురు) స్థానములు దేవతల యొక్క ఋషుల యొక్క మనుష్యుల యొక్క స్థితులు. (తపస్సమాధిస్థితులు) ఏవం వీధముగా దేవతా . గణములు అందరు. పదిసార్లు జన్మల పునః పునః పొంది, వారు వైరాజలోకములకు బ్రహ్మలోకమునకు) చేరిన తరువాత అందు పది .. ఉపప్లవముల కాలముందురు. కల్పములు సమాప్తికి రాగా, వారు అందే వైరాజ లోకమున నుండి, మరల బ్రహ్మలోకమునకు తమ పూర్వ పూర్వ క్రమమున చేరుదురు. బ్రహ్మ లోకమున వైరాజలోక కల్పము గతింప, వైరాజ  బ్రహ్మ ఆ వ్యక్తమున స్థానము నొసంగును, ఆ విధముగా దేవతలు పూర్వానుపూర్వత్వములతో స్థానముల బ్రహ్మలోకమున పొంది, వచ్చి పది సార్లు పోయిన తరుపోత వైరాజు లోకమునకు చేరుదురు . ఈ విధముగా వేల కొలది దేవ యుగములు సాగిపోయినవి. వారి యందరి మరణముల క్రమ బద్దముగా ఋషులతో బ్రహ్మలోకమన పోయిన వారిని గూర్చి సవిస్తరముగా చెప్పుట కష్టము. శక్యము కాదు.  ఏలయన కాలము అనాది (మొదలు లేనిది) యగుట. పూర్తిగా లేక్కపెట్టుటకు అసాధ్యము కనుక. ఈ విషయమున సందేహము లేదు. ఉన్నదున్నట్లు స్పష్టముగా చెప్పితిని.

ఈ వాక్యార్థమును ఋషులు విని సంశయాన్వితులయిరి. వ్యాస శిష్యుఁడు, పురాణజ్ఞుండు, మహామతీయునైన సూతుని వారడిగిరి. ఋషులిట్లు ప్రశ్నించిరి.

అవైరాజులు ఎట్టి ఆహారము కలవారు, ఎట్టి బలవంతులు, దేనిని ఆశ్రయించుకొనియుండిరి, ఎంత కాలము వారట్లుందురు? యథాతథముగా. మాకు చెప్పుఁడు.

లోకార్థతత్త్వవిదుఁడైన సూతుఁడు ఋషులు చెప్పిన వాక్యములు విని, వినయముతో నిట్లు చెప్పెను.

వారు శుద్ధ బుద్ధియయిన సర్వేశుని ఆశ్రయించిరి. అందు ఆభూతసంప్లవులు అజ్వరులై పది వత్సరములుందురు. వారందరు సూక్ష్మ శరీరులు. విద్వాంసులు. మేఘ స్వరూపులు.

 స్థిత లోకమున నున్నవారగుట. వారి భూతము (జరిగిపోయినది) లేదు. యోగధర్ములు సనత్కుమారాద్యులు చెప్పిరి. ఇట్లే మహాభాగులయినవారు ప్రణవమును ప్రవేశించి, బ్రహ్మలోకమున ప్రవర్తించెదము. అందువలన మనకు శ్రేయస్సు కలుగును. ఈ విధముగా పలికి బ్రహ్మాండమునం దధివసించిన వారెల్లరు, యజ్ఞమాచరించి, యోగధారణులయి తమయందు తామే యుండిరి. అందే విలీనము నొందుదురు. శాంతమయిన దీపపుకాంతులు తమయందే విలీనమగునట్లు తమయందు తామే విలీనమగుదురు. వారు బ్రహ్మ కాయమునందు వసింతురు. అందుడి తిరిగివచ్చుట దుర్లభము. ఆలోకము సర్వము భావనామయము. ఆ ప్రపంచము భావనామయము. (ధ్యానమయము) బ్రహ్మ సంబంధమైన ఆనందమునొంది అమృతత్వమును వారు పొందుదురు. బ్రహ్మలోకము వైరాజలోకములను పైన దాటిన తరువాత ఆరింతల దూరముననున్నది (షడ్గుణీతతః). అది పురోహితుడయిన బ్రహ్మ ఉండు స్థలము. (బ్రహ్మలోకము) వారందరు ప్రణవాత్ములు, (ఓంకారవీతానమనస్కులు) బుద్ధి యొక్క శుద్ధత్వముచేనున్నవారు. వారానందమును బ్రహ్మానుండి పొంది అమృతత్వమును ఆశ్రయించి యుందురు. వారు ద్వంద్వములచే నభీభూతులుకారు. వారు (భూతవర్తమానభావీ) కాలత్రయ వివర్జితులు. ఆ తేజస్వంతులందరు ఆధిపత్యము ఒక్కటి యే లేని వారు బ్రహ్మతుల్యులు వారు ప్రభావము (వర్చస్సు) విజయము, ఐశ్వర్యము, స్టీతి (స్థిరత్వము) వైరాగ్యము, దర్శనము కలవారు. వారు బ్రహ్మ లోకవాసులు, తత్సానమునుపొంది, సంసారమునకు వచ్చువారుకారు. బ్రహ్మతో దేవతలతోడి సహత్వము పొంది, ప్రతి సంచరావసరమున ప్రకృతిలో లీనముగునప్పుడు, తపస్సు యొక్క యంత్యమున క్రియాత్ములు (సర్వాకర్మపరీత్యక్తులు) బుద్ధావస్థ చెందిన మనీషులు వారుక్షణ దర్శినులు ప్రపంచము యొక్క క్షణకాల స్థితిని అల్పస్థితినీ ఎటింగినవారు వారందరవ్యక్తమున సంప్రలీనులగదురు. ఆ స్థితి ఈవిధముగా అమృతము, శుక్రము, నిత్యము, అక్షయము, అవ్యయము. దేవతలు ఋషులు సనాతనమయిన బ్రహ్మసత్రమును ఉపాసింతురు. వారూర్వరేతసులు. మారకాదులు లేవు. కర్మాభ్యాసముచేత చేయబడిన శ్రద్ద వేదాంతములందు ఉపలక్ష్యమగును. వారందరభ్యాసపరులయి యోగనిషులయి పరాకాష్ఠమునుపాసింతురు (ఉత్కృష్ణ ఉన్నతస్థానమును పాసింతురు). పాపమునకు కారణమైన శరీరమును విసర్జించి అమృతత్త్వమునకు నన్వేషింతురు (పొందుదురు) వారు వీతరాగులు, జితక్రోధులు, నిర్మోహులు, సత్యవాదులు శాంతులు, ప్రణిహితాత్ములు దయావంతులు, జితేంద్రియులు, నిస్సంగులు, శుచిమంతులు, బ్రహ్మసాయుజ్య మొందినపోరు.

వారు వీరులు, వారు బ్రహ్మవిదులు. అకామయుక్తములయిన తపములచే పాపములను దగ్గపటలము చేసినవారు. వారు భ్రంశ రహితములయిన లోకములనెరుగుదురు అందుండి వారు పతనము చెందరు. వారు అప్రమేయ సుఖములు కలపోరు. ఇది బ్రహ్మపదము. ఐక్యము, మిక్కిలి జ్యోతిర్మయమయిన ఆకాశము. (వ్యోమము). అక్షరులు బ్రహ్మతో నందరినీ విచారింపరు. అదియే మోక్షస్థానము.

ఋషులీట్లనీరి

 పరార్ధమేది? పరమనునది యేది?

దానిని తెలిసికొనకోరుచున్నాము. ఓ పూజ్యోత్తమా! మాకావిషయమును వివరింపుము.

సూతుఁడిట్లు ప్రత్యత్తరమిచ్చెను.

నావలన మీరు పదము యొక్క పరిసంఖ్యనెఱుంగుడు.

 వేయివరకు ప్రధాన సంఖ్యలు - ఒకటి, పది, వంద, సహస్రము.

 పది సహస్రములు ఒక అయుతము.

వంద సహస్రములు ఒక నియుతమని ఋధులందురు. అట్లే పది శతసహస్త్రములు ఒక ప్రయుతము.

అయుత దశ సహస్రములు ఒకకోటి, పది కోట్లు అర్బుదము. కోటి సహస్రములు అబ్జము.

వేయి కోటులు ఖర్వమని బుద్ధిమంతులు చెప్పెదరు. దశకోటి సహస్రములు ఒక నీఖర్వము.

వందకోట్ల సహస్రములు శంకు వందురు.సహస్ర సహస్రములకోట్లు పద్మమందురు.

సహస్ర సహస్రములకోట్లు పదిచేహెచ్చ వేయ దానిని సముద్రమందురు.

వంద సహస్రములు వేయిచే గుణింపబడిన దానిని అంత్యము అందురు.

 కోటి సహస్త్ర ప్రయుతము మధ్యమని యందురు. పరార్ధ్యమునకు రెండింతలు పరమందురు.

శతమును పరివృడ మందురు. సహస్రమును పరిపద్మకమందురు.

మీగిలిన సంఖ్యలు, మొదటి దానిని 10చే గుణించినవచ్చును. అని

ఆయుతము, నియుతము, ప్రయుతము, అర్బుదము, న్యర్బుదము, ఖర్వము, నిఖర్వము, శంకు, పద్మ, సముద్ర, అంత్య, మధ్య, పరార్ధ - పరార్థమును రెండుచే గుణించిన పర ఇట్లు పదునెమ్మిది స్థానముల వరకు పరి సంఖ్యానముకొలకు మహర్షులు నామకరణమొనర్చిరి.

ఈ విధముగా పందతో ఆరంభించు సంఖ్యలను తెలిసికొనవలెను. 103 పరార్ద ప్రమాణము కల్ప సంఖ్యా ప్రవృత్త బ్రహ్మ ప్రమాణముగా నేఱుంగవలయును.

అంతవరకు వ్యాప్తము చెంది కాలముండును

ఆ కాలము యొక్క సమాప్తి సమయమున అతఁడు శాంతి పొందును. పరమే పరార్ధము. అంతవరకు సంఖ్యామానము చెప్పితిని. ఆతని వీర్యము, ఆతని ఆయుర్దాయము, ఆతని తపస్సు, ఆతని శక్తి, ఆతని ధర్మము, ఆతనీ విద్య, ఆతని ధృతి, ఆతని బ్రహ్మ, ఆతని జ్ఞానము, పరమైశ్వర్యము, ఉత్కృష్టమైనది, ఆధికతమమైనదగుటవలన ఆతని కంటే పరాత్పరమైన భూతము (బ్రహ్మకంటే) ఉండదు. ఆతఁడుఉన్నత తమమైన స్థానమున సంస్థితుఁడు. అందుచే నతఁడు పరునిగా చెప్పబడినాఁడు. ఆతనిలో అర్ధభాగము పరార్ధత.

సంఖ్యేయం (గుణించుట) అసంఖ్యేయం, (గుణింపలేకపోవుట) అనునవి సతతము తాంత్రికము. గణ్యము సంఖ్యలలో చెప్పం బడును. 'అయ్యది పరార్ధము వఱకు చెప్పబడినది. రాశి యందు చూడబడగా దానికి సంఖ్య లేదు. అదీ ఆ సంఖ్యా స్థితికి లక్షణము. సికతాదులయందు (ఇసుక కుప్పలయందు) అపరిమితము చూడబడును. ఇదికూడా దాని సమాజ లక్షణము. వాని గణన లక్షణము (ప్రసంఖ్యానము) శుద్ధత్వముచే, దివ్య దృష్టులచే ఈశ్వరునిచే చెప్పబడును. బ్రహ్మ అన్నింటిని చూచును. కారణమాతఁడన్నింటి యందును సుసంస్థితుడు. జ్ఞానప్రతిష్ట వలన సర్వము బ్రహ్మచూచును. దానిని వినీ, నైమషేయులయిన తపస్వులందరు, బాష్ప పర్యాకుల నేత్రులు, ప్రహ్లాదముచే గాధదిక స్వరులునైరి. సంతోషమున వారికి మాటలు రాలేదు. బ్రహ్మవాదులయిన వారందరు మాతరిశ్వుని (వాయుదేవుని) అడిగిరి. ఓ ప్రభూ! బ్రహ్మలోకమెంత దూరముననున్నది? దాని వైశాల్యమెంత? యోజనములలో ఇది (బ్రహ్మలోకము) ఎట్లు గుణింపబడినది? కొలమానమేది? యోజనమెంత? క్రోశమెంత? దాని పరిమాణమును యథార్థముగా వినందలంచితిని, అని వారీ వచనములనువీని మాతరీశ్వుఁడు (వాయువు) వినీతునివలె (వినయవంతునిపోల్కి) మధురమైన వాక్యమును యథాదృష్టము క్రమానుగుణముగా పలికేను.

 వాయువిట్లనెను

దానిని మీకు నేను చెప్పుచున్నాను. నే చెప్పునది మీరు ఆలకింపుఁడు. అవ్యక్తమునుండి వ్యక్తభాగము మహత్ అనీ చెప్పబడుతున్నది. మహత్తునకు 10 భాగములు. స్థూలభాగమును భూతాదియందురు. (అహంకారము) భూతాది యొక్క వీరివీ 10వ భాగముకంటే అధికము (?) పరమాణువు సుసూక్ష్మము భావాగ్రాహ్యమది నేత్రములచే గ్రహించలేము. ఏదిలోకమున అభేద్యతమమో యది పరమాణువు...? జలము యొక్క కన్నుల నుండి ఇంటికప్పు చిన్న రంధ్రము నుండి వచ్చు సూర్యప్రకాశములో ఏ రజఃకణము సూక్ష్మము దృశ్యమగునో దానిని మహర్షులు పరమాణువు అందురు. ఇదీయే . మొదటి పరిమాణమునకు మానము. (కొలమానము). ఎనిమిది పరమాణువులు కలిసినచో అయ్యది ఒక పద్మరణ రేణువు. దానిని త్రసరేణు వందురు. అట్టి త్రసరేణువులు ఎనిమిదింటి కలయిక రథరేణువు. ఈ రథరేణువుల సమవాయము బాలాగ్ర మని పండితులందరు. బాలాగ్రమన వెంట్రుక యొక్క మొన.

ఎనిమిది బాలాగ్రములు ఒక 'భిక్ష' (లిక్ష మనగా పేను గ్రుడ్డు), 8 లిక్షలు ఒక పేను 8 యూకములు ఒక యవ 8 యవలు ఒక అంగుళము. (వేలి మీద ఒక కణుపు నుండి రెండవ కణుపు మధ్యదూరము) అట్టి 12 అంగుళపర్వములు ఒక వితస్తి. 21 అంగుళపర్వములమధ్య దూరము ఒక 'రతి'యని కూడా నేణుంగవలయును. (మొచేతినుండి ముడిచిన పిడికిలి మధ్యదూరము). 24 అంగుళములు ఒక 'హస్తము' అగును. (హస్త మనఁగా మొచేతి నుండి చేతి యందలి మధ్యాంగుళి యొక్కశిఖరము వరకు) " 2 రత్నుములు లేక 42 అంగుళములు - ఒక 'కీష్కు అని యెఱుంగవలెను, 96 అంగుళములు ఒక 'ధనువు' అని విజ్ఞులు చెప్పుదురు.. . గవ్యతినిగణించునప్పుడు ధనువు మానమును గ్రహింతురు. ధనువునకు రెండుదండములు. దానిపై గొట్టము మీదనుంచిన అంగుళమువలె అంగుళములుండును. (నాతీ తుల్యా) (గాస్రూప్ వలెనుండునది.), సంఖ్యామానము తెలిసిన వారు 300 ధనువులు ఒక 'నల్వ' - అందురు. 2000 ధనువుల మనము ఒక గవ్యూతి. 6000 ధనువులు ఒక యోజనమగును. యోజనముల కొలత ధనుషుల మీఁదశోధారపడియుండునది. 1000 యోజనములు శక్రకోశ మగుననీ యెఱుంగవలెను. ఈ విధముగా సంఖ్యాజ్ఞాన విశారదులచే చెప్పబడినది. యోజనము ప్రమాణముగా బ్రహ్మసృష్టిలో నున్న లోకముల మహీ తలమునుండి సూర్యుడు నూరువేల యోజనములకంటే దూరముగానున్నాఁడు. చంద్రుఁడు రెండువందల వేల యోజనములు సూర్యునిపై నున్నాడు. నక్షత్ర మండలమంతయు పూర్తిగా నూరువేల యోజనములకు చంద్రునికీ పైగా ప్రకాశించును, నక్షత్రమండలములకుపైనున్న గ్రహమండలములు రెండువందల వేల యోజనములకు పైగా నున్నవి, ప్రతీ యీ గ్రహలోకము దాని క్రింది గ్రహలోకముకంటే సంత దూరమున పైగా నున్నది. బుధగ్రహము అన్ని గ్రహములకు నక్షత్రములకు దిగువ ప్రకాశించును. శుక్రగ్రహము బుధగ్రహముపై చరించును. లోహితుఁడుఁ (కుజుఁడు) బుధునకు పైగా నున్నాడు. దానిపై బృహస్పతి, శనైశ్చరుఁడు బృహస్పతిపై శనైశ్చరునిపై నూరు వేల యోజనములు సప్తర్షుల మండలము.

నూరువేల యోజనముల దూరము సప్తర్షిమండలమునకు పైగా ఉత్తానపాదుని కుమారుఁడు ధ్రువుఁడు, మేధీ భూతుఁడైయున్నాం డు.

గ్రహములన్నియు ధ్రువునకు కట్టబడి యున్నవి. మూడు లోకముల ఔన్నత్యమును (ఉత్సధమును) యోజనముల మానములో నేను వ్యాఖ్యానము చేసితినీ. మన్వంతరములలో వివిధ వర్ణములలోని మనుష్యులు జీవీతములలో వివిధాశ్రమముల నున్నవారు మూడు లోకములయందు దేవతలకు యజ్ఞములు చేయవలయునని చెప్పబడుటచే నది ప్రవర్తించుచున్నది. ఈ ప్రపంచమున నెట్టి యాగము చేయబడినను దేవయోనులకు, అది ఆధారముగా ఘటింపఁబడినదని గ్రహింపవలెను.

త్రైలోక్య విషయము వ్యాఖ్యాతము. అందుచేత తరువాతి విషయమునెంగుఁడు. (కల్పవాసినులు- కల్పకాల మంతయు బ్రతికి ఉండువారు), కల్పవాసినులు నివసించు మహర్లోకము ధ్రువునకు పైగా నున్నది. అయ్యది ఒక కోటి యోజనముల దూరమునందున్నదని నిశ్చయముగా చెప్పఁబడినది. జనలోకము మహర్లోకము నుండీ (ద్వికోటి) రెండు కోట్ల యోజనముల దూరమున నున్నది. ఈజన లోకమున బ్రహ్మపుత్రులయిన దక్షాదులు సాధకులు నుందురని జ్ఞాపకముంచు కొనవలెను. (సాధకులు - ఆధ్యాత్మికోన్నతీని కోరునట్టివారు). జనలోకమునకు మీఁద తపోలోకమున్నది. ఇయ్యది వైరాజలను దేవతల నిహాసము. వీరు ప్రళలయమున} కలీ నాశనకాలమున) భూతములతో దహింపబడుట లేని వారు .వారు మరణ వర్షితులు. తపోలోకమునకు సత్య లోకమునకు దూరము పూర్వము చెప్పఁబడినదూరము కంటే ఆరింతలు. అనఁగా ఆరువందల వేల యోజనముల దూరము. బ్రహ్మలోకము అపునర్మారక నామముకలది. అందు మృత్యువురాదు. అచ్చటి నుండి సంసారమునకు పునరాగమనమింకలేదు. బ్రహ్మను పూజించువారు అందేయుందురు. తిరిగి సంసారములోనికి రారు. బ్రహ్మలోకమునకు పైగా అండములో (బ్రహ్మండములో) పల, ఒకకోటి, ఏబది నీయుతముల యోజనముల వరకు ప్యోపించియున్నది. ఈ ప్రపంచము యొక్క కక్ష గ్రహపథము, ఊర్థ్వలోక భ్రమణము యొక్క అవధి (మేర) 14 కోట్ల, 11 లక్షల యోజనములని జ్ఞాపకముంచుకొనవలెను. ధ్రువ మండలమునకు పైనున్న లోకమును, యోజన ప్రమాణములలో, మేము విన్న విధముగా చెప్పబడినది. ఇంక జీవతతికి అధోలోకమున (పాతాళమున) ఉన్న భూతగతుల నివాస సాధన కల్పముల స్థితిని గూర్చి చెప్పెదను. నరకలోకములు క్రింద చేప్పబడుచున్నవి. ఘోరకర్మము లాచరించిన ప్రాణులు ఎచ్చటకు పోవుదురో ఆ నరకలోకములు వివరింపఁబడుచున్నవి. అవి-నర్వము-గౌరవము, ఘోరము, శూకరము, తాలము, తప్త కుంభము, మహాజ్వాల, శబలము, వీమోహము, కృమి, కృమి భక్షము, లాలాభక్షము, విశంసనము, అధఃశీరము, పూయవహము, రుధిరాంధువు, విషాకీర్ణము, నరకము, మూత్రాకీర్ణము. .

వైతరణి, కృష్ణ, అసి షత్రవనము, అగ్నిజ్వాలా మహాఘోరము, సందంశము శ్వభోజనము తమము, కృష్ణసూత్రము లోహము, అభిజము, అప్రతిష్ఠ వీచి మొదలయినవి నరకములు. నరకములన్నియు యముని అధికారముననున్నవి. ఆలోకములు నరకములు తలక్షణ లక్షితములు. మాటి మాటికి దుష్కృత కర్ములందుపడుదురు. భూమికి అధఃప్రదేశమున రౌరవాది లోకము లన్నియు చెప్పఁబడినవి కూట సాక్ష్యములు చెప్పువారు, మిథ్యను (అసత్యము) వచించువారు గౌరవ నరకమున పడుదురు. అసక్తుఁడై సత్యమును వచింపవలసి యుండ పాక్షికవాదియయిన వాఁడు క్రూరగ్రహ నరకము నపడును. గోవులను అడ్డగించువాఁడు, గోధోనరకము గోవులకు ద్రోహము చేయువారు, (చంపువారు), భ్రూణ హత్యనాచరించువారు, పురములకు నిప్పుపెట్టువారు, క్రూరగ్రహ నరకమున పడురు. బ్రాహ్మణుల చంపువారు, సురాపానము చేయువాఁడు, బంగారమును దొంగిలించువాఁడు, 'శూకర'మను నరకమున పడుదును. క్షత్రీయునీ చంపువాఁడు, వైశ్యుని చంపుపోఁడు 'తల'మను నరకమునపడును. క్రింద చెప్పబడబోవువారందరు తప్త కుంభ నారకమున పడుదురు - బ్రాహ్మణ హత్య చేయువాఁడు, గురుతల్పగుఁడు (గురుని భార్యతో భోగించువాఁడు) ఎవడు రాజభటులను, గుజపు వర్తకులను, ధన రక్షికులను, పీడించునో, సాధ్వియైన స్త్రీని విక్రయించునో ఎవ్వడు విశ్వాసపాత్రుఁడయిన భక్తుని (సేవకుని) పరిత్యజించునో - వీరందరు తప్తకుంభ నరకమున పడుదురు. ఎవడు కూతురితో భోగించునో కోడలితో సంగమించునో అతఁడు మహాజ్వాలా నరకమున పడును. ఎవరు వేదముల విక్రయించెదరో ఎవరు వేదము దూషింంచెదరో, ఎవరు పెద్దల చిన్నబుచ్చెదరో, ఎవరు గురువుల అవమానించెదరో, ఎవరు గురువులను పెద్దలను వాక్శరముల గాయ పరచెదరో, ఎవడు అగమ్యగామీ యగునో పెద్దలను వాక్శరముల గాయ పరచెదరో, శబల మను నరకమున పడుదురు. ఎవడు మర్యాదను పరిత్యజించి, ధర్మమును విడిచి, ప్రవర్తించునో వాఁడు ఘోరమయిన విమోహ మను నరకమునపడును. ఎవడు ఇతరులకు హానీ చేయుటకు, యజ్ఞములు (దురిష్టములు) చేయునో అతఁడు 'కీటలోహ' మను నరకమున పడును. దేవతలను, బ్రాహ్మణులను, ద్వేషించువాఁడు, గురువులను పూజించక యవమానపరచువాఁడు రత్నముల దూషించువాఁడు కృమిభక్ష) నరకమునపడును. ఎవడు తానొక్కడే యన్నమును బ్రాహ్మణులకు సుహృదుల కొడకభక్షించునోయతఁడు దుర్గంధ భూయిష్ఠమయిన లాలాగంధ నరకమునపడును. (వసించును). శరములను కాండముల చేయువాఁడు, కుంభకారుఁడు, బంగారు నిష్కములను హరించువాఁడు, వైద్యుడు (విచికిత్సకుఁడు). ఆ రామములకు (తోటలకు) నిప్పంటిచువాఁడు, వీరందరు 'విశంసన' మను నరకమున పడుదురు. అసత్పరుషుల నుండి యేవఁడు ధనము గ్రహించునో, అనర్హుల కొఱకు, అపాత్రులకొఱకు యజ్ఞముల నెవడు చేయునో ఎవడు నక్షత్ర గణకుడు జ్యోతిష్యమున జీవించునో, అతఁడు అధోముఖమను నరకమును ప్రవేశించును.

ఎవడు, క్షీరమును, లవణమును సురను, లక్కను, గంధమును, ఫలరసములను, తిలలను, అత్తరులను, అమ్మునో యతఁడు ఘోరమైన 'పూయవహమను నరకమునపడును. ఎవఁడు కోళ్లను బంధించునో, పిల్లలను, సూరకములను, పక్షులను తేళ్లను, మేకలను, బంధించునో, అతఁడును పూయవహ నరకమున పడును. ఎవడు మేకలను, గొఱ్ఱెలను, పెంచునో, మహిషముల పెంచునో చక్ర ధ్వజియో, సైనికుల యొక్క ధ్వజములను (జెండాలను) వహించునో, వృత్తిచే రంగులు వేయువాడు, నటకుడు {రంగోపజీవి) అయినవాండు, పిట్టలను పట్టిజీవించువాఁడు, గ్రామ పౌరోహిత్యము వహించు. బ్రాహ్మణుఁడు, ఇండ్లను తగుల బెట్టువాఁడు, విషమును పెట్టువాడు (గరదుఁడు) కుండాశీ (కులటాపుత్రుడు) సురనమ్మువాడు, సురాపానముచేయు త్రాగుబోతు మాంసభక్షకుడు, పశువులను చంపువాఁ డు, మహిషములను, మృగములను (తేళ్లను) చంపువాఁడు పర్వకారుఁడు (పర్వములు కాని దీనముల యజ్ఞ పూజాదికముల స్వలాభము కొఱకు జరుపువాఁడు), రహస్యదూత (సూచ్య విషయములను రహస్యముగా తెలియపరచు)వాఁడు మిత్ర ద్రోహము చేయువాఁడు, - వీరందరూ. 'రుధిరాంధు'వను నరకమునపడుదురని పెద్దలందురు. భోజన పంక్తిలో భోజనమునకుగూర్చుండి యున్నవానిని వంచన - చేయువాడు “విట్ భుజ” మనుఘోర నరకమున పడునను టకుసంశయము లేదు. ఎవఁడు స్వభావ సిద్ధముగా అసత్యము (మృషను) పల్కునో, అపవిత్రుడు, ఎవడు ఇతరులను తిట్టిపోయునో, నిందించునో ఇతర పాపులు- మూత్రాకర్ణమను హోరనరకమున కూలుదురు. మధువును త్రాగెడువాడు, మొసళ్లను, సొర చేపలను చంపువారు, వైతరణీనరకమమున కరుగుదురు. ఉన్మత్తులు (పిచ్చివారు) . చిత్తభగ్నులు, శౌచాచారమును (శ్రోత్రియాచారమును) విడిచిన వారు, సహజముగా క్రోధస్వభావులు, ఇతరులకు దుఃఖమునాఫాదించువారు, కుహకులు (వంచకులు) 'కృష్ణ' అను న రకమును పొందుదురు. అరణ్యమున వృక్షములను ఛేదించు వారు గొఱ్ఱల మేకల మేపు గొల్లవారు, అసిపత్రమనే నరకమున కూలి, మగ వ్యాధులచే, సుదారుణముగా, అంపములచే, కత్తెరలచే కోయబడుదురు. ఆశ్రమ ధర్మములవలంభీంచి వర్తించువాడు, ఆ శ్రమ ధర్మములను విడిచి మామూలు జీవితమునుస్వీకరించినవాడు అగ్నిజ్వాల యనునరకమునపడును, వారు ఇనుప ముక్కలు గలిగి శ్యామ, శబల వర్ణములు గలిగిన పక్షుల మండలములచే పొడవబడి తీనబడుదురు. ఇష్టాపూర్తవతలోపమున సందంశ (పట్టుకారు) నరకమును బొందుదురు. దీవా స్వప్నమున, బ్రహ్మచారులు పుత్రులచే అధ్యాపితులయిన తండ్రులు, పుత్రులచే ఆజ్ఞాపింపబడిన తండ్రులు, “శ్వభోజనమను” నరకమును పొందుదురు. ఎపరు వర్ణాశ్రమ ధర్మములకు - విరుద్దముగానాచరింతురో ఎవరు క్రోధహర్ష సమన్వితులై కర్మలను (యాగములను) ఆచరించుదురో వారందరు నరకవాసులగుదురు.

ఘోరము, ఉష్టాత్మగము సుదారుణము అయిన ఘోరమైన గౌరవ నరకము ఊర్ధ్వ ప్రదేశముననున్నది. భయంకరమై మిక్కిలి చల్లగానుండు భయంకరనరకము క్రిందనున్నడని జ్ఞాపపకముంచుకొనవలెను. ఈ విధముగా వర్ణింపబడు నరకములను క్రమముగానెలుంగుము. భూమికి ఆధోభాగమున ఏడు నరకములు మాత్రమే యున్నవని చెప్పబడినవి. అవి.“అంధతామిస్రము” మొదలయినవి. వానీలో గౌరవనరకము మొదటిది. ఇయ్యద్ మహాగౌరవము. దానియధఃప్రదేశమున శీతలమయమైన యొక నరకముకలదు, ఆనరకమును 'తపమందురు. మూఁడవది కాలసూత్రము. దానియందు వివిధ జాతీభయంకరమైన హౌరసర్పములుండునని జ్ఞాపకముంచుకొనవలెను. సోలుగవది అప్రతిష్ట మనునరకము. “అవీచి' అన్నది యైదవది. 'లోహమనునది ఆరవది. అవిధేయమన్నది ఏడవది. మొదటి నరకము గౌరవమనీ చెప్పఁబడినది కారణము అది అతిఫోరమయినదగుట. అయ్యది మిక్కిలి ఉష్ణము. దానిని “దహన" మని జ్ఞప్తి యందుంచవలెను. భయంకరమయిన శీతలనరకము దాని కథః ప్రదేశముననున్నది, అదీ “తపః'నరకము, అధమము. కాలసూత్రమతీహోర నరకమని చెప్పబడినది ఏలయన యందు సర్పములున్నవి. అవి కరచును. నాశనము చేయును, “అవీచి' నరకము. భయంకరము ఘోరమని చెప్పబడి ఏలయన అందు సంపీడనముకలదు. (నలిపీవేయుట, గుండెపిండి వేయుట - యాంత్రిక సాధనములచే యుండును. లోహ' నరకము దానీకంటే కూడా దారుణము ఏలయన 'కర్నాశ్రయణముల'వలన.) భయంకర క్రియలమూలమున) తద్వీధములయిన బాధలననుభవించుట కేర్పడిన శరీరమగుట అది విధేయమనీ స్మరింపవలేను. ఆ శరీరమును అనందించలేము భోగించలేము, ఈ నరకమందలి బాధలకు బాధోపశమనము (నివారణము) లేక పోవుట లక్షణము. ఆకారణమున ఈనరకమున పడు పాపులు ‘బాధలకు, పీడలకు, భంగములకు, వధలకు ఎదిరింపక లోనగుదురు. ఈ నరకములు పైవానితో క్రిందవానితో సంబంధము కలిగియున్నవి. అందు (నిరాలోకములు) వెలుతురులుండవు. పోనీ యన్నింటియందు. అధికమయిన పాపములవలన దుఃఖ్తర్ఘ అధికము. ఈ రేండును ఊర్థ్వలోకనరకములతో సమానములు. కాని ఆరేండింటి యందు వెలుతురన్నదుండదు. కూటాగార ప్రమాణాదులచే పూర్వ జన్మ కర్మలచే ఆనరకములట్లు చేయబడినవి. వారి శరీరములు అట్టి బాధలనుభవించుటకు సమర్థములు. ఈ నరకములయందలి యాతనలు పరమ దుఃఖోత్కరయుతములని తలంపవలెను. నరకములయందలి యాతనలు అసంఖ్యేయములు. అందువారు దుఃఖముననుభవింతురు, వారి కర్మ పరిపాకము క్షీణముకాగా, వారు తిర్యక్కుల యోనియందు, మిగిలియున్న కర్మశేషమున ఉద్భవించెదరు. దేవతలు, నారకవాసులు, వారికి పైని క్రిందను సంస్థితులై వసించు చుందురు. వారి యొక్క ధర్మా ధర్మములు నిమిత్తములుగా వెంటనే, ఉపభోగార్థము (సుఖదుఃఖానుభూతికి) వారి భౌతిక దేహముల పరిణామోత్పత్తిని పొందును. (వారికి కర్మానుగుణమయిన దుఃఖము). వారి ముఖములు క్రిందకు వంచుకొని దేవతలు అధోగతులయిన నరకవాసులను, నరకవాసులు అధోముఖులయి దేవతలను చూచెదరు.

దేవతలకు, నరకవాసులకు (వారిరువురకు). తుల్యత్వముండుటవలనను, దారుణమైన యీ పరిస్థితి సహజ మగుటవలనను, అట్టి స్థితి పైనకాని క్రిందకాని లోకాలోకముల లేకపోవుటవలనను. అది స్వభావసిద్ధస్థితి. (సంజ్ఞ) లోకాలోకములయందే యుండును, అంత సత్రీణులు (విద్వద్గోష్ఠిలోనున్న బ్రాహ్మణులు) వాయువును గూర్చియడిగిరి..

ఋషులిట్లు అడిగిరి.

లోకాలోకములందు, నివసించు సర్వ భూతములయొక్క ప్రాణికోటి యొక్క సంఖ్యను పూర్తిగా మాకు చెప్పుము. (విశ్వసంసారమునందు సంఖ్యతో పరిసంఖ్యతో - సంఖ్యామానముతో సంచరించునట్టివానిని) ఋషుల యొక్క ఈ వాక్యములు విని, మరుత్తు ఇట్లు చెప్పెను.

వాయువు ప్రత్యుత్తరమిట్లో సంగెను.

ఈ విషయము దివ్య దృష్టి చేతనుగానీ, జ్ఞానముచే గాని తెలిసికొనుటకు శక్యముకాదు. ఒకవేళనిది యేదో విధముగా తెలిసినను, చక్షువులచే దానిని గణించుటకు లెక్కించుటకు సాధ్యము కాదు. అందుచే, ఓ బ్రాహ్మణులారా! . ఆ సంఖ్యను ఊహింపలేము అను ప్రశ్నలేదు. తత్కారణమున ఏది, బ్రహ్మచే సంజ్ఞతమో నిశ్చితమో సంఖ్యచే దానిని గ్రహింపుడు. కృములు, సంపర్కము వలన పుట్టినట్టివి, స్థావరములలో సహస్రాంశభాగముననున్నవి.

ఉదక సంబంధమైన జంతువులన్నియు, సంసేకములు (ఈలిళీరిదీబిజీ లెవీకీలిరీరిళిదీ వలన పుట్టినవి) సహస్రాంశ భాగముగా నుండును. దానిని నిశ్చయముగా నెఱుంగుఁడు. నీటిలో జీవించు పక్షులు ఒక సహస్రాంశ భాగముగా నెఱుంగవలయును. అవి యన్నియు లౌకికములుగా (ఈ లోకమునకు చెందినవిగా) గ్రహింపవలయును.

ఒక సహస్రతమభాగము పక్షులగును.

పశువులు కూడా వానితో సమాన భాగములని తెలియవలయును. లౌకికులు చతుష్పాత్తులు. సర్వ చతుష్పదులు సహస్ర భాగము. చతుష్పాత్తుల సంఖ్యలో ద్వీపాత్తులు, ఒక సహస్రాంశము. ద్విపాదులలో ధార్మికులు ఒక సహస్ర భాగము, ధార్మికులయందు ఒక సహస్ర భాగము స్వర్గమునకు పోవుదురు. స్వర్గము నందు, ధార్మికులలో ఒక సహస్రాంశము మోక్షమును పొందుదురు. యాతనా లోకమున నుండువారు స్వర్గమును ముట్టిన వారితో సమానముగా సంఖ్యలో నుందురు. ధర్మ విద్వేషులయిన దురాత్ములు మరణింతురు గౌరవనరకమున పడుదురు. అచ్చటి గౌరవ నరక తమస్సులో శీతోష్ణముల వలన బాధలననుభవింతురు. యాతనాస్థానమును చేరినవారు, దుష్కరమైన భయంకరమైన వేదనననుభవింతురు గౌరవ నరకము చాల ఉష్ణముగా నుండును. అది భయంకరము. భోరము. అంధమనెడి గౌరవనరకమంతకంటే ఘోరతమము తప అనేడు నరకము శీతలమయము. ఈ విధముగా సర్గమున కరుగు ధార్మికులు యోగ్యులు, సుదుర్లభులు.

            స్వర్గమునకు బోవునట్టి వీరి సంఖ్య ఈశ్వరుఁడైన స్వయం భువునిచే సంజీకృతమయినది. (లెక్కింపఁబడినది)

ఈ స్వయంభువుని గణన సంఖ్య అమానుషమైనది, సాధారణగణనమున కతీతమయినది.

ఋషులిట్లు అడిగిరి.

మహర్లోకము, జనలోకము, తపో లోకము, సత్య లోకము, భూత లోకము, భవ్య లోకము, భవ్య లోకములు - నీచే చెప్పబడినవి. యథా తథముగా, లోకాంతరముల స్థితిఁ (వైశాల్యములు) లోకమునకు లోకమునకు మధ్యనున్న అంతరములు చెప్పగోరెదము

 ఊర్ధ్వరేతస్కులయిన ఋషీశ్వరుల యొక్క వాక్యములను విని, తత్వార్ధము నెఱింగిన వాయువు యథార్థమైన స్థితిని చేప్పేను.

వాయువు యొక్క సమాధానము.

ఋభువు, సనత్కుమారాద్యులు జ్ఞానవంతులు, శుద్ధబుద్ధులు, యోగశక్తి చేతను, తర్కము చేతను, ప్రత్యక్ష దర్శనులు. ప్రత్యాహారము చేతను (జ్ఞానేంద్రియ సంబంధనియమము) ధ్యానముచే, తపస్సుచే, స్వకీయమయిన క్షయమును ఆవాస స్థానమును ప్రత్యక్షముగా, దర్శించెదరు. వారు పరిశుద్దులు శుద్దబుద్ధి గలవారు. వారు భాహ్యావరణసంబంధమైన అజ్ఞానము నుండి నీవృత్తులు. వారు వ్యపేత కోశులు వారు విరజులు, రజో గుణ రహితులు. వారు సంతులు. (సత్పురుషులు) బ్రహ్మతో తుల్యులైనవారు. అక్షయులు. ప్రీతితో - గూడినవారు. బ్రహ్మ పదార్థమునందు అధివసించు యోగులు, వారు ఈశ్వరునిచే కృతమయిన విధముగా సర్వము చూడగలుగు  వాలఖిల్యుల. వలె చూడగలరు. ఆ విధముగనే, వారి సాన్నిధ్యము భౌతికముగా కలిగినవాడ, నేనును చూడగలిగితిని.

ఈశ్వరుని యొక్క ఆవాసము అకృతార్థులకు అగ్రాహ్యము. ఈశ్వరుఁడు పరమాణుత్వమొందిన వాడగుట మనీషులచే (బుద్ధి మంతులచే) భావ గ్రాహ్యుడు.

ఈ క్రిందఁజెప్పఁబడు అవ్యయములైన పదిగుణములు శంకరుని యందున్నవి. పరిపూర్ణ జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము, తపము సత్యము క్షమ, ధృతి ద్రష్టత్వము ఆత్మ సంబంధము, అధిష్ఠాతృత్వము. విభుత్వము వలన, యోగారూఢ్యుడైన ఈశ్వరుండు బ్రహ్మప్రసాదించుటయందు ఆసక్తుండు. ఈశ్వరుఁడాతనికి లోక విగ్రహడై సాహాయ్య మనుగ్రహించును. ఈశ్వరుని ఆవాసము, అవ్యయము, నిత్యము, అవికల్పము, మరియు స్థిరము. అది యెట్టి విపత్తునైన ఎదుర్కొనుటకు శక్తిమంతమైనది. అయ్యది ఎనిమిదవ లోకము. అది ఈశ్వరుని యొక్క చిన్మాత్ర స్థానము, మాయామయము, పరమము. అది మాయచే కృతము. మాయాదేవో మహేశ్వరః. దేవతల యొక్క ఉపసంహారము, తత్రమాణమును. కీర్తింతును. బ్రహ్మలోకము భూమి నుండి, 13 కోట్లు, 15 లక్షల, యోజనముల దూరమున నున్నదని చెప్పబడినది. బ్రహ్మాండము (భగవదండము) 1 కోటి 50 లక్షల యోజనముల దూరము బ్రహ్మ లోకమున, నుండీ ఉన్నతముగా (పైగా) ఉన్నదని గ్రహించవలెను-. ఇది ఊర్ధ్వగమనము - దానికి పైన గమనము లేదని గ్రహించవలెను. ప్రకృతులు నిత్యములు, సూక్ష్మములు. సృష్టి (ప్రసవ) ధర్మము కలిగిన వగుట అవి ప్రకృతులయినవని గ్రహించవలెను. అని స్పష్టముగా గ్రహింపబడలేదు. ఏలయన - గుణములు అన్యోన్యాధారములు, పరస్పర సమ్మిశ్రములు. వాని నుండియే క్షేత్రజ్ఞుడు బ్రహ్మసంజ్ఞాతుడుగా సంభూతుఁడయ్యెను. ఆతఁడే అధికర్త.

అతి సూక్ష్మము, ప్రధాన కారణమైనది (అధిష్ఠాతృత్వము) అవ్యయము ఉత్పాదింపశక్యము కానిది (అనుత్పాద్యము, పరంధామము, అయినది పరమాణువు. పరేశయము. పరమేశ్వరుని యందంత స్థితము. మహేశ్వరుఁడు. అక్షయుండు. అనూహ్యుండు. (ఊహింపబడరాని వాడు) అమూర్తి (రూపము లేనివాఁడు) అయినను మూర్తిమానుఁడు. ఆతని ప్రాదుర్భావము, (జన్మ) తిరోభావము (అదృశ్యత్వము). స్థితి (ఉనికి) అనుగ్రహము (ఆశీస్సు) - అతని చైతన్యము. శివుడు ఉపమింప సమర్థుఁడు కాడు. పరమాణువు (విధి) ఇతరులతో పోల్చదగనివాఁడు. ఆతఁడు జేత, అతఁడు కాంతిమంతుఁడు. అతఁడే తమస్సును ప్రకాశింపఁజేయువాఁడు. ఔపసర్గికముగా మొట్టమొదట ఏది సంజాతమయినదో, అది బృహత్తు (చాల పెద్దది). సర్వతః పరివృత్తిమయియున్నది. (వలయా కారయుతము) అది ఈశ్వరునుండి, పుట్టినదీ.

ఈశ్వరుని నుండి బీజము . నిర్భిన్నమైనది. క్షేత్రజ్ఞుండే బీజముగా నంగీకృతుఁడు. ప్రకృతిని యోనియందురు. ఆ ప్రకృతి నారాయణాత్మకము.

ఈశ్వరుఁడు లోక సృష్టి కొఱకు. ఆతఁడే లోకాధారుఁడు. (లోక సంస్థానము). లోక సృష్టి కర్తయై మహాత్ముని యొక్క సన్ని సర్గము (ఉత్పత్తి) తత్త్వములతోడి సంబంధము వలన ఉత్కృష్టమైనది. బ్రహ్మలోకమునకు పురస్తాత్ బ్రహ్మాండము యొక్క అర్వాక్ క్రింద ఆ రెండింటి మధ్యను నొక దివ్యమయిన పురమున్నది. అది మనోమయము, అరోగము (అనామయము). సౌఖ్యకరము. అయ్యది, విగ్రహమును ధరించినపుడు (రూపమును దాల్చినప్పుడు) ఈశ్వరుని యొక్క స్థానము. ఆ ఈశ్వరుడో అమితాజసుఁడు. ఆ పట్టణమునకు నామము 'శివము'. అదీ జన్మ పరంపరలచే భయపడువారలకు శరణము  దాని అభ్యంతరము {ఆంతరవైశాల్యము) ఓ బ్రాహ్మణులారా! ఒక వంద సహస్రముల యోజనములు అది మహీమండల సంస్థితము.

నగర ప్రాకార సువర్ణ కుడ్యము మధ్యాహ్న సూర్య ప్రకాశముగలది. మధ్యాహ్న సూర్యతేజోభివలయితమయి ప్రాకారకుడ్యముండును. దాని కాంతి యితర వస్తు కాంతిని తోసి రాజునును. ఆ పట్టణము సౌవర్ణమయము, ముక్తదామ విభూషితము, తపనీయనీభము (బంగారతోతుల్యమైనది) శుభ్రములైనవి, యు నయిన ద్వారముల చతుష్టయముచే సుకృత సువర్ణ వేష్టనములతో నొప్పినది.

ఆ పట్టణము దీవ్యమయినది. ఆకాశముననున్న పురవరము. ఘంటానినాదములతో నొప్పినది. నానా రత్నములతో, విచిత్రములైన పతాకల యొక్క బాహుళ్యముతో కూడినది. అదీ సర్వ కామ సమృద్ధములు అగు వనోపవనములతో శోభించునది, గృహాంతములయందు వెండి, బంగారపు, శాతకుంభమములు, సంధ్యా కాలమందలి మేఘములతో తుల్యములు కైలాస ప్రతిమములయినది. అందలివారు ఆ భవనోపరిస్థలముల క్రీడింతురు. మనోహరంబులయినవి, ప్రీతి కరములైనవియనగు భోగములచే ఆనందమును అను భవింతురు. ప్రాసాదముల యొక్క శ్రేష్ఠమయిన పృష్ఠభాగములందు, సువ్రతులైనవారు మోదమునొందెదరు.

భవనముల యొక్క ఉపరి భాగములందు వేదమంత్రఘోష నిరంతరము వినబడును. వివిధములయినవి శుభవంతములయినవియునగు కథలందు ప్రవచింపఁబడును. గీత వాడిత్ర ఘోషములు సంతతము. వినంబడును. అందు సంస్రావములు (తర్పణములు) సర్వత్ర జరుగును. వర్ణించుటకు వీలుకాని జనముల సమావేశములచ్చట జరుగును.

అందొక సుందరమైన పవిత్రమైన ప్రాసాదమున్నది. ఆ భవనమునకు వేయి స్తంభాములు కలవు. (పాదములు) అవి సువర్ణ వికారములు. అమూల్య రత్నములచే స్థగితములు స్ఫటిక సంబంధములు, చంద్రసంకాశములు, వైడ్యూర్యమణి ప్రకాశములు, అవీ బాల సూర్యమయములు సౌవర్ణములు, అగ్నిసమ ప్రభావంతములు. ఈ వర్ణనమును నైమీషేయ తపస్వినులు విసిరి, వేరు గట్టిగా అరచిరి, వారికి కొన్ని సంశయములు కలిగి వాయువుతో నిట్లనిరి.

 ఋషిలీట్లడిగిరి:

ఈశ్వరానుసారిణులయిన ఆ మహాత్ము లెవ్వరు? వారు ఆశీర్వదింపబడనర్పులు. ఆశ్రేష్ఠతమమైన పురములో వారు ఆనందించు చున్నారు? ఋషుల యొక్క వాక్యములను విని వాయువు ఇట్లు పలికెను.

వాయువు ప్రత్యుత్తరము.

దేవ దేవుని యందు భక్తి సంకల్పితులయి దానిని వినుఁడు.

శాశ్వతము అవ్యయమునైన, శివ పదము, రుద్రునితో సాలోక్య స్థితి కలిగించునది. మహేశ్వరునితో ఆనన్యమైన మనస్సు గలిగిన వారిచే ప్రసన్నులచే పొంద గలిగినది. వారి హృదయము పవిత్ర భావములతో పవిత్రీకృతమైనది. వారు విశుద్దాంతరాత్ములు, వారు వినయ ప్రకాశులు, దాంతులు, శౌర్యయుక్తులు, అలోభులు, అలోలుపులు, వారనన్య మనస్కులై మహేశ్వరుని ప్రపన్నులైరి. అట్టి వారిచే ఆ పదము లబ్దము. ఈశ్వరునితోడి రూప సాదృశ్యమను శ్రేష్టమయిన స్థితిని పొందినవారు. వారందరు వైశ్వానర ముఖులు (వారందరు అగ్నిహోత్రుడు ముఖముగా గలవారు). వారందరు విశ్వరూపులు జటా శిరోభారములు కలవారు. వారు నీలకంఠులు తెల్లనైన గ్రీవములు కలవారు తీక్షదంష్టలు కలవారు త్రిలోచనులు. చంద్రుని ఊర్ధ్వమున తలపాగలుగా (ఉషములుగా) కలవారు. జటా సముదాయములను కిరీటములుగా గలవారు. ఆ వీరులందరు దశభుజులు; వారందరు పద్మగర్భాంతర స్ధమయిన పరీమళములు కలవారు. వారందరు తరుణాదిత్య తుల్య ప్రకాశముకలవారు, అందరును పీతవర్ణ వస్త్రములు ధరించిన వారు.

వారు పినాకమును చేతియందుగలవారు వారందరు శ్వేత వర్ణముగల గొప్ప వృషభవాహనులు; వారు శ్రీయాన్వితులు, (కాంతిమంతమైన శరీర కాంతి కలవారు). ముక్తాహారవిభూషితులు, అందరు కుండలములను చెవుల ధరించినవారు. తేజస్సుచే అభ్యధికమయిన దేహములు కలవారు. వారు సర్వజ్ఞులు సర్వ దర్శనులు. వారు బహుధా తమ్ము విభజించుకోని యందురు (వివిధ రూప ధరులు) జరామృత్యు . వివర్జితులు. వారు సుదుర్లభములయిన భోగములను పొంది, వివిధములయిన భావములతో క్రీడింతురు వారిచ్చవచ్చిన విధమున సంచరింపగలవారు. స్వచ్ఛందగతిమంతులు. వారు సిద్దులు. ఇతరులయిన సిద్ధులచే వీబోధితులు. వారు మహాత్ములు ఏకాదశ కోటి - రుద్రల సమూహములు. వీరందరితో దేవదేవుఁడు మహేశ్వరుఁడు భక్తులయందు దయ, కలిగినపోడు, పార్వతీ ప్రియుఁడు భగవంతుఁడు నయిన ఆ మహాత్ముఁడు ఆనందించు చుండును. ఆ రుద్రులతో మహానుభావుడయిన భవునితో విభిన్నమయిన నానాత్వమును నేను చూడను మీతో సత్యమును చెప్పుచున్నాను ఈ విధముగా వాయువు ఈశ్వరుని వలన నాలకించిన పుణ్యమైన విషయమును చెప్పెను. దివాకరసమప్రభులయిన ఆ ఋషులందరు ఈ పరమ పుణ్యమైన కథను విని, ఈశ్వర సంబంధమైన కథనువిని, అత్యంతానందమును పొందిరి. భగవంతుని ఆశీస్సులను పొందిరి. వారు మహా బలుడయిన వాయువును గౌరవించి మరలవారిట్లనిరి.

ఋషులిట్లడిగిరి

ఓ వాయూ! మహాభాగ! ఔపసరికము, ఈశ్వరుని యొక్క ఉత్తమమైనది, పుణ్యమైనదియునగు అష్టమమయిన నివాసమును గూర్చి మాకు వివరించితివి. దాని యొక్క స్థానమును ప్రమాణమును యథావత్పరికీర్తితము. పరమాత్మ యొక్క స్థానము ఉత్కృష్టమైన యోగధర్మసమృద్ధమయినది. దేవదేవునియొక్క మాహాత్మ్యము దేవతలకు కూడ దుర్జయము. నీ యొక్క మా హాత్మ్యయోగముచే అనంత దేవతలకు కూడా దుర్జయము. నీ యొక్క మాహాత్య యోగముచే అనంత శక్తిగల పరమేశ్వరుని గొప్ప దనము మేమెఱింగిమి. ఆ పరమాత్మ యొక్క భక్తుల యందు (ఇంత చిన్నను) సమ్మోహమున్నచో అది పరమేశ్వరుని యొక్క అనుకంపార్థమే కదయాశీస్సుల కొఱకే, దేవ దేవుని యొక్క వేశ్మము నందలి గొప్పఁదనము ఐశ్వర్యము (విభూతి) అధికముగా ప్రకాశించును. ఆతని యందు (ఈశ్వరుని యందు) విన్యస్తమైన గొప్పఁదనము అనన్యమైనది అప్రతిమశాలిని. బ్రాహ్మీప్రకాశముచే స్వయముగా కూడియున్నది. విశ్వరూపియైన ఈశ్వరుని వేశ్మమునందు నిక్షిప్తమైన యావిభూతి, చంద్రుని యొక్క జ్యోత్స్న వలెనున్నది. మహాదేవునితో తుల్యులైన మహాత్ములైన రుద్రుల యొక్క గొప్ప దనము (విభూతి) చెప్పఁబడినది. అదియంతయు నీవక్రమునుండి నిస్రుతమైన యమృతము. ఓ సువ్రత! శర్వుని యందలి భక్తిచే తత్సర్వము మాచే త్రాగబడినది. రుద్రుని యొక్క అనుగాములమైన మా చే తెలియబడనిది ఏమైనను కలదా! ఓ వాయూ ఈ ప్రశ్న యొక్కటి, దేవవరప్రాణ! నీవు చెప్పుటకరుడవు.

సూతుఁడిట్లనెను:

భగవంతుఁడే చెప్పెనుకదా! ఇంక నేమి నేను మీకు వివరింపవలయును. దానిని చెప్పెదను.

ఋషులిట్లు అడిగిరి.

పక్కనున్న ఆదిత్యులు కోధ విక్రములయిన సింహములు, వైశ్వానరులు, భూతగణములు అనుసరించు వ్యాఘములు ఘోరమయిన ఆభూతసంప్లవమున (సర్వ భూత జాల వినాశనము కలుగునప్పుడు) ఈ భూతముల యొక్క స్థితియేమగును? ఈశ్వరుని యొక్క సద్భావమును, అవ్యక్త ప్రభవమును, తెలిసి వివరింపుము.

వాయువు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

పూర్వము బ్రహ్మ కుమారులయిన సనందనుడు సనాతనుడు సనకుఁడు వోడుడు, కపిలుడు పోయిన ప్రదేశమిది. కపిలుడు వారి నాయకుఁడు. మహా యశస్వియైన ఆసురీ, పంచశిఖ ఋషి, వారి వంటి యితరులు అక్కడకు వెళ్లిరి. కొంత కాలమయిన తరువాత కాల కల్పముల పర్యయము గడచిన వెనుక మహాభూతముల వినాశము ప్రలయము ప్రత్యుపస్థితము కాగా అనేక రుద్ర కోటులు ప్రసన్నురాలయిన మహేశ్వరికి వారు సమీపించిరి.

శబ్దాదులయిన అష్ట విధ భోగములను పరిత్యజించి ఆ మహాత్ములు సూక్ష్ముడయిన మహేశ్వరుని చేరుదురు. వారి యొక్క జ్ఞాన యుక్తమయిన తేజస్సుతో వారు సర్వ భూతములందు ప్రవేశించి ఎనిమిది విధములయిన ఇంద్రియ భోగములననుభవింతురు భూతముల యందలి అనుకంపచే వారి స్థానమును ఎట్టి ఆవేశము లేక విసర్జించెదరు. అంత వారు సూక్ష్మాణువు పరమాణువునైన, మహేశ్వరుని పొందుదురు. -277.

అంత వారు. గొప్ప గొప్ప ఆవర్తములు సుడిగుండములతో నొప్పి జన్మమృత్యూదకమైన నదిని దాటుదురు. అంత వారు అభిన్నమైన విభజింపశక్యముకాని పరంబ్రహ్మను దర్శించేదరు. 278.

సప్త మాతృకలు (దేవతలు) పార్వతితో సహితముగా కీర్తింపబడిరి, ఆ విధముగనే సింహముల సహసము, ఆదిత్యులు, వైశ్వానరులు (అగ్ని దేవులు) భూత గణములు, వ్యాఘములు, మరియు ఇతరములైన అనుగాములు వర్ణింపఁబడిరి. సాంఖ్య యోగ శాస్త్ర వివరణ కర్తయైన భవుఁడు తనలో నాని నన్నిటిని ఆవేశింపచేసికొనును సప్తలోకములు, పంచ మహాభూతములు, విష్ణువుతో సహ సంయుక్తములై-280. అతఁడు మరల ఏడు లోకములను పంచ భూతములను సృజించును. (రుద్రుండే వానిని సృజించును. వినాశనము చేయును).

సామమయుడయిన రుద్రుఁడు యజుర్మయుఁడయిన రుద్రుఁడు ఓత ప్రోతముగా సర్వ ప్రపంచమును లోపల వెలుపల నిశ్చయముగా వ్యాపించును. 282.

ఓ బ్రాహ్మణులారా! ఆతఁడొక్కడే భగవంతుఁడు అధిపతి. ఆతఁడే ప్రపంచమునకు ప్రభవుఁడు వినాశకుడును. అంత ఆ ఋషీశ్వరులందరు, దివాకర సమప్రభువులు. వారి మనస్సులను పూర్తిగా నాతనిపై కేంద్రీకరింతురు.

వారు సత్య ప్రభావులు. తమ యందు ఆధ్యాత్మికాగ్నిని ఆరోపించుకొందురు. కర్మలచే, మనస్సుచే, వాక్కుచే విశుద్ధమైన అంతరాత్మచే ఈశ్వరునియందు కేంద్రీకరించి అనన్య మనస్కులైన మహేశ్వరుని వారు పొందుదురు. వారు ప్రతోపవాస నిరతులు సర్వ భూతదయా పరులు -285. యమాభ్యాసాదులచే యోగము పొరిచే పొందబడినది. వారందరు చిన్నసంశయులు జ్ఞాన యుక్తమయిన, తేజస్సుచే అత్యంతమైన భక్తిచే పొంది, రుద్రునిగని, శాశ్వతము పరమమవ్యయము. నైన స్థానము వారిచే పొందఁబడినది. వాయు దేవ ప్రోక్తమైన యీ శ్రుతీని తపస్సుచే గూడుకొని యెవఁడు చదువునో. బ్రాహ్మణుడు కాని, క్షత్రియుఁడుకాని, వైశ్యుందుగాని, స్వక్రియాపరుడైనవాడు రుద్ర లోకమును పొందును అయ్యది లోక కారణము -286. సృజింపఁబడిన వస్తువులు, వివి వృత్తములయిన (వశించిన ప్రకృతి యందే అవస్థితములై యుండును. అప్పుడు అత్యంత పరోక్షత్వము వలన, కనపడనందువలన ప్రత్యక్ష దర్శనము లేదు. అప్పుడు ప్రతి వస్తువు కనబడని కారణము వలన, చూచునవకాశము లేదు. చెప్పుటకు ఎట్టి పేరును లేనందువలన, తెలియబడని కారణమున, అజ్ఞానము వలన, జ్ఞానులకు కూడ, ఆగతాగతికత్వమువలన (వెళ్లివచ్చుట లేనందున) అయ్యది తెలియ బడశక్యము కాదు. -290. భావ గ్రాహ్యము వలన, అనుమానము చేతను చక్కగా నాలోచించిన పిమ్మట ఇది. చెప్పబడుచున్నది. దాని యందు ప్రధాన కారణము సదసదాత్మకముండుట వలన దాని యందొక ప్రవృత్తి చైతన్యమున్నది. అది అనిర్దేశ్యమైనను. కాని అది స్వాత్వికమైన (సహజ మైన) కారణమువలన ఈ విధముగా సప్త ప్రకృతులు ఒకదానినొకటి ఈ విలీన క్రమమున ఒక్కొక్కటి ద్వీపర్యాయములు ప్రవేశించును. అంత దేని నుండి సర్వము ఆవృతమగునో ఆ బ్రహ్మాండము, నీటియందు ప్రలీనమగును.

సప్త ద్వీపములు, సప్త సముద్రములు, సప్త లోకములు, సర్వ పర్వతములతో, అన్నిటికి నీరే ఆవరణముగా కప్పుగా, జ్యోతులయందు ఐదు భూతములు పూర్తిగా నిమజ్జనమగును. ఏది తైజస ఆవరణమో అదీ మారుత ఆవరణమున నిమజ్జనమగును, వాయవ్యమయిన (వాయు భూత సంబంధమైన) ఆవరణము ఆకాశమున విలీనమగును.

ఆకాశావరణమో భూతాదులచే గ్రహింపఁబడును. బుద్ధి లక్షణమయిన మహత్తు భూతాదులను గ్రహించును. అవ్యక్తము మహత్తును గ్రహించును. దానిని తరువాత గుణ సామ్యము. ఇట్లు అవ్యక్తము బ్రహ్మ రెండును నాశనమునకు విస్తారమునకు మరల కారణములు 287 ఆ యిద్దరు సృజింతురు. నాశనము చేయుదురు. సృష్టి వినాశనములు రెండును వికారములు (జూణీతితిశిరిళిదీ) ఉద్భేధము) (లిడిభీళిఐతిశిరిళిదీ)అవగుంఠనం (అచ్భాధనము) సిద్ధ కార్యకరణులయిన సంసిద్ధ జ్ఞానులు పునర్జనీభావములో విలీనమగుదురు. వారు ప్రకర్ష సంయమమును వహింతురు.

క్షేత్రజ్ఞులు కరణములతో (ఇంద్రియములతో) సంయోగము చెందుదురు. -299. అవ్యక్తము క్షేత్రము బ్రహ్మ క్షేత్రజ్ఞుండని చెప్పుదురు. క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సంయోగము ఆరంభము లేనట్టిది అయినను ఆ సంయోగము సాధర్య వైధర్మములు కారణములుగా గలుగును సాధర్మ్యము సమాన లక్షణములు కలిగియుండుట. వై ధర్యము అసమాన (సరిపోలనీ). ధర్మములు కలిగియుండుట. -300 ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగా సృష్టి క్రియయందు క్షేత్రజ్ఞుని ప్రధానముగా తెలిసికొనవలయును. బ్రహ్మవిత్తును గూడ ప్రత్యేకముగా తెలిసికొన వలయును. దీనిని క్షేత్రజ్ఞుని వలన పృథక్ పృథక్గా తెలిసికొనవలయును-301.

క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క విషయా విషత్వమును స్మరింపవలయును.

బ్రహ్మత్వ విషయమును తెలిసికొనవలెను. విషయమును క్షేత్రమందురు. -302. బ్రహ్మను అవిషయముగా తెలిసికొనవలెను క్షేత్రమును విషయముగా తెలిసికొనవలయును క్షేత్ర జ్ఞునిచే అధిష్టితమయిన క్షేత్రము క్షేత్ర జ్ఞార్గమని చెప్పఁబడును. శరీరములు అనేకమగుట శరీరి శరీరములందుండువాఁడు అనేకముగా స్మరింపఁబడును -303. ఈ ప్రాణులు (ఆత్మలు) అప్యూహముగా నుండును. ప్రకాశవంతమైన జ్యోతులవలె ఒక దానితో నొకటి కలిసిపోయి యుండును. సుఖము యొక్క కాని దుఃఖము యొక్క కాని అనుభవోపలబ్దియుండుటచే, భిన్న భిన్నశరీరములు, ప్రత్యేక జీవుల యొక్క అనేకత్వము తెలిసికొనగోరువానిచే తెలిసి కొన బడవలయును. ఈ విభిన్న పురుషుల యొక్క భావముపసంహరింపబడవలయును. ఈ భావము సహజముగా చేలయేండ్లు గడచిన వెనుక వచ్చును. అప్పుడు వారు బ్రహ్మలోక నీవాసులతోడను, బ్రహ్మతో సమానత్వము పొందిన వారితోడను తీరీగీ వచ్చెదరు. వారి తిరుగుదలలో ఆత్మనివాసినులతో వెనుక నుండి పోవుట చేతను, అందరి తత్కాల నివాసుల యొక్కయు అందలి దోష దర్శినుల యొక్క దర్శినుల యొక్క దర్శనముచే ఆత్మవాద(స) ప్రణాశనమైన వైరాగ్య మప్పుడుత్పర్యమగును. -308. భోజ్యములు భోక్తృత్వముల యొక్క నానాత్వముచే తల్లక్ష్యమును వారు గ్రహింతురు. క్షేత్రజ్ఞులకు వారి పృథక్వ జ్ఞానము కలదు. అప్పుడా బ్రహ్మలోక నివాసులు ప్రత్యేక వ్యక్తుల యొక్క వివిధ వ్యక్తుల యొక్క నానాత్వమును గ్రహించెదరు. వారు బ్రహ్మలౌకికులు, ప్రకృతి యందలి కారణములకతీతులు. వారందరు వారి యందు వసింతురు. (స్వాత్మన్యేవ వసంతి). వారు ప్రశాంతులు దర్శనాత్మకులు (కంటి కగుపించు ఆకృతులు కలవారు)-310.

(అనువాదము)

చేతనులు అచేతనులు అందరు శుద్దులు, నిరంజనులు, దోషరహితులు వారచ్చటనే మోక్షమును పొందుదురు. వారు మరల సంసారమునకుఁదిరిగిరారు. వారు నిర్గుణులు, నిరుత్మానులు, ఆత్మలేనివారు. ప్రాణచైతన్యరహితులు. అగుట వలన ప్రకృత్యంత్యమునందు వ్యతిరేక క్రమమున (వ్యతిక్రసూత్) ప్రకృతిలో అంతర్లీనులగుదురు.

ఈ విధముగా స్వయంభువుని యొక్క ప్రతీ సర్గము (అంతర్లీనత్వము) ప్రాకృతము నుండి చెప్పఁబడినది. (ప్రకృతి నుండి)-312. వర్ణాశ్రామాచారయుతమయిన ప్రతీ సర్గ (విలీనము ఎవ్వడు వినునో అతఁడు భక్తిమంతుఁడయి ఎట్టి బాధయు లేక, (విగతజ్వరుఁడై) శివ సాయుజ్యమును పొందును.

త్రాగుడునకు అలవాటు పడని శూద్రుఁడు, జితేంద్రియుఁడు, ఈశ్వర భక్తుఁడు, అప్రతీఘాతలక్షణుఁడు అప్రతిగ్రహ లక్షణుఁడు, ఆభూతసంప్లవస్థాయి అయినవాఁడు, (అవరోధము లేనివాఁడు), సర్వ జీవ ప్రళయము వరకు (అనగా వినాశనమువరకు) నుండును. లేదో - గణముల కాధిపత్య స్థానము సార్వకాలికముగా పొందును.

మద్యపానరతుఁడు మద్యపులయిన భూతములతో (తాగుడు మూకతో) సహ ఆనందించును-315. భవుఁడు (ఈశ్వరుఁడు) భూమియందు సేవింపఁబడి మర్యులకువరదుఁదగును.

ఇట్లు భగవానుండయిన వాయువు వరరూపమయిన వాక్యమును పలికెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమునందు ఉత్తర భాగమున చతుర్థ ఉపసంహార పాదమున శివపుర వర్ణనమను ద్వితీయాధ్యాయము.