బ్రహ్మాండ మహా పురాణము
32- యుగప్రజాలక్షణము ఋషి ప్రవర వర్ణనము
సూతుఁడిట్లు చెప్పెను :-
యుగములయందెవ్వరెవ్వరు పుట్టుదురో వారిని గూర్చి నావలనఁదెలిసికొనుము. వారు ఆసురులు, సర్పజాతులు, గాంధర్వులు, పైశాచులు, యక్షులు రాక్షసులు. (1) వారే యుగములందు పుట్టుదురో, వారి జీవిత ప్రమాణమెంతయుండునో తెలిసికొనుము. పిశాచులు, ఆసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు వీరందరు కృతయుగమున పుట్టుదురు. వారి యెత్తు, పరిణామము (వారి శరీర స్థౌల్యములు) సమానము. దేవజన్ములయిన యీ అష్ట ప్రజ్ఞాశాఖలు, వారివారి అంగుళ ప్రమాణములబట్టి 92 అంగుళముల ఎత్తువారు. ఇయ్యదీ వారి శరీర పోషణమును బట్టి కలుగును. ఇదీ వారి స్వాభావిక ప్రమాణముగా గ్రహింపఁబడును. (4) సంధ్యాంశకమందు వర్తించు మనుష్యులు దేవజన్ముల ఉన్నతీకంటే ఏడుపడు అంగుళ ప్రమాణము ఎత్తు తక్కువ (5) (వారు కురుచ వారు) దేవాసురుల శరీర ప్రమాణము 158 అంగుళములుగా కలియుగమున పుట్టిన వారు తలంతురు. (6) కలియుగములో పుట్టినవారు వారు ఉన్నతి తలనుండి పాదము వరకు వారి యంగుళ ప్రమాణములను బట్టి ఎనుబది నాలుగు అంగుళములు. (7) మానవుల యెత్తు యుగాంశకయుగమునందు (యుగముల మధ్య కాలములో) అన్నియుగ కాలముల యందు భూత భవిష్యత్కాలముల తగ్గుచుండును. (8) స్వకీయాంగుళి ప్రమాణమును బట్టి నరుఁడు ‘అష్టతాల’ ప్రమాణము కలవాఁడు. ఈ గణమాతని యంగళుముల బట్టి ఆపాద తలమస్తిష్కము ఎవ్వడు ‘నవతాల’ ప్రమాణుఁడు అగునో ఆతని బాహువులు మోకాళ్ల వరకు దీర్ఘములు ఆతనినీ దేవతలు కూడా పూజింతురు. వారి వారి కర్మననుసరించి (క్రమముగా) భిన్నభిన్న యుగములలో ఆవుల యొక్క గుఱ్ఱముల యొక్క ఏనుగుల యొక్క మహిషముల యొక్క స్థావరముల యొక్క (ఉ త్సేధములు) ఎత్తులు ఈ పనిచే హ్రసత్వమును వృద్ధిత్వమును పొందుచుండునని గ్రహింపవలెను.
పశువుల మూపురములు 76 అంగుళముల ఎత్తు. ఏనుగుల యొక్క ఉత్సేధము (ఎత్తు - ఉన్నతి) మొత్తము 108 అంగుళములని చెప్పబడినది. చెట్లయొక్క ఉత్సేధము (ఎత్తు - ఉన్నతి) మొత్తము 108 అంగుళములని చెప్పబడినది. చెట్లయొక్క పొడుగు (ఉత్సేధము) 1000 అంగుళములు 40 అంగుళములు మరియు 50 యవలు అనఁగా (ఒకయవ = 1/4 అంగుళము; 50 యవలు = 12 యవలు. 1000 - 40 + 12 1/2 = 947 1/2 అంగుళములు) మనుష్య శరీర సంస్థితి యెట్టిదో దేవతల శరీర సన్నివేశము తాదృశమైనది. తత్త్వమును గూర్చి ఆలోచించిన దానిని గ్రహింపవచ్చును. బుద్ధి విశేషణమున తన్ను ఏదియు అతీశయించనట్టి శరీరము దేవతల శరీరమనంబడును. అట్లే తన్ను అతిశయించుటకు వేటీకటి గల్గినట్టిదీ మానుష కాయముగా చెప్పుదురు. ఈ విధముగా దివ్యమానుషుల భావములు వర్ణింపబడినవి. (14,15) సర్వత్ర పశువులు, పక్షులు, స్థావరములు (స్థిరముగా నుండునవి) ఉపయుక్తములైనవి. ఉదాహరణమునకు ఆవులు, మేకలు, గొఱ్ఱలు, అశ్వములు, ఏనుగులు, పక్షులు మరియు వృక్షములు. ఇవి యజ్ఞాదులయిన పవిత్ర కర్మల యందుపయుక్తములు. అందుచే అన్ని విధముల అవి యజ్ఞముల కర్షములు. అవి దేవస్థానములందు (దేవతా దేహముల యందు) పుట్టినవి. అందునయ్యవి తద్దేవతా రూపముల నున్నవి (17) దేవతల యొక్క శుభ స్వరూపములు (మూర్తులు) యథా శయోపభోగములు (కోరుకొన్నట్టి యూహానుకూలముగా ననుభవింపఁదగినవి.) స్థావరములు జంగమములు నైనట్టివి, సుందరములైనట్టివియు నగు వానితో సుఖమొందిరి (ప్రజలు), అయ్యది రూపానురూపములకు ప్రమాణములకు తగినట్టివి. ఇక సత్పురుషులు, సాధువుల గూర్చి వివరించెదను ‘సత్’ అనుపదము బ్రహ్మనుగూర్చి చెప్పును. అది కలిగినవారు ‘సంతః’ ఇది బ్రహ్మతో వారు పొందిన తాదాత్మ్యము ననుసరించి వారికి బ్రహ్మతోడి తాదాత్మ్యము చెప్పును.
జ్ఞానేంద్రియకర్మేంద్రియవిషయాస్వాదనననుసరించి (దశేంద్రియము) యెవ్వరు కోపగింపరో, సంతోషింపరో, వారు జీతాత్ములు ఇంద్రియముల (వ్యాపారముల) జయించినవారు. నియతేంద్రియులు. అష్టలక్షణకారణముల జయించినవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సాధారణము లయిన సామాన్య ధర్మముల యందు, వైశేషిక ధర్మముల యందు, నీయుక్తులగుట వలన ‘ద్వీజులు’ అంరురీ. (రెండు సార్లు పుట్టిరి), తన వర్ణనమునకు, ఆశ్రమమునకు నియుక్తములయిన ధర్మముముల యందు నియుక్తుఁడు, స్వర్గ స్థితి యందు ధర్మముల నాచరించుచు, శ్రౌత స్మార్త ధర్మముల జ్ఞానము వహించి యుండుటచే నతఁడు ధర్మజుడని పిలువబడును. (23) బ్రహ్మచారి (విద్యార్థి) గురువు గారి హితముకోరి, గురువు యొక్క క్షేమమునకు పని చేయుచు, విద్యా సాధనకు ప్రయత్నము చేయునతఁడు సాధువు అనంబడును. తన గృహమునకు కావలసిన సాధనముల సంపాదించుటచే గృహస్టు సాధువనంబడును. (24) వైఖానసుఁడు (ఆరణ్య యతి) అరణ్యమున తపస్సుచే శక్తిని సాధించుటచే నతఁడు సాధువనంబడును. యోగసాధనము వలన యతమానుఁడు (ప్రయత్నించు) యతి సాధువు. (25) ఈ విధముగా బ్రహ్మచారీ, గృహస్థు, వైఖానసుఁడు, యతి - వీరందరు వారికి సంబంధమయిన జీవితములందు ధర్మమును సాధించిన వారగుట సాధువులు. దేవతలుగాని పితృదేవతలు (పితరులు) కాని, మునులుగాని, మనుష్యులుకాని, విభిన్న ధర్మ దర్శనములుండుటచే, “ఇది ధర్మము, ఇది అధర్మము” అని గ్రహింపలేదు. (27) ఇచ్చట చెప్పఁబడిన ధర్మాధర్మ శబ్దములు క్రియాత్మకములు (శ్రుతి స్మృతుల విధింపఁబడిన పవిత్ర కర్మలు). పవిత్రమైన కర్మ (కుశల) ధర్మము; అపవిత్రము (అకుశలము) అయిన కర్మ అధర్మము. ధాతువు “ధృ” ధారణార్థమున నుపయోగింపబడినది (ధారణ పోషణములు ధర్మార్థములు) అధారణము వలన అధర్మ మనంబడినది.
మనము కోరునట్టి దానిని పొందిపఁజేయునది ధర్మము. దాని నాచార్యులు బోధింతురు. అనిష్టఫలదమయిన అధర్మమును గూర్చి కూడ ఆచార్యులుపదేశింతురు. (30) ఎవరు వృద్ధులో, అలోలుపులో (అలుబ్ధులో) ఆత్మ నిగ్రహము కలవారో, అదాంభికులో, గురుకులక్లేశ మనుభవించి చక్కగా విద్యాభ్యాసమొనర్చియుండిరో, ఋజువర్తనులో వారిని ఆచార్యులందరు. (31) ఎవఁడు ధర్మమును స్వయముగా నాచరించునో, అచారమును స్థాపన మొనర్చునో, సర్వశాస్త్రములను పరిపూర్ణముగా నధ్యయనము చేయునో, అతనినే ఆచార్యుఁడందురు. (32) శ్రాతము, స్మార్తము అని ధర్మము ధర్మజ్ఞులైన ద్వీజులచే ద్వీవీధముగా వీధింపఁబడినది. శ్రాత ధర్మము వివాహ విధులకును అగ్నిహోత్రార్చనమునకు సంబంధించినది. (33) స్మార్త ధర్మము వర్ణాశ్రమాచారములకు, యమములకు, నియమములకు సంబంధించినది. పూర్వఋషుల నుండి ధర్మము నెత్తింగిన తరువాత సప్తర్షులు శ్రాత ధర్మమును ప్రవచించిరి. (34) ఋక్కులు, యజుస్సులు, సామములు; శ్రుతి బ్రహ్మకంగములు. ఇవీ శ్రుతికి అవయవములు : గడచిపోయిన మన్వంతరములందలి ఆచారములను స్మరించి మనువు లానురచించిన స్మృతిని ప్రవచించెను. (35) అందుచే వర్ణాశ్రమ ధర్మ విభాజకము స్మృతి ధర్మమని స్మరింపఁడినది. వివిధ రూపమున యీ ధర్మమే శిష్యాచారముగా చెప్పుఁదడుచున్నది. శేష శబ్దమే శిష్టమని, శేషమునే శిష్టముగా జెప్పుదురు. మన్వంతరములలోని శిష్టులు ధార్మికులుగా నీటనుందురు, (37) మనువు, సప్తర్షులు, లోక సంతానకారణమున ధర్మార్గముండువారు. వీరిని శిష్టులని చెప్పుదురు. (38) మన్వాదులును, నేను పూర్వము చెప్పినవారునైన శిష్టులచే ప్రతి యుగమున ధర్మము బాగుగనే యాచరింపబడినది.
త్రయి (వేదములు మూఁడు) వార్త (వ్యవసాయము) దండనీతి (ధర్మ నిర్ణయము) యజ్ఞాచరణము వివిధ వర్ణాశ్రమాచారములు అన్నియును శిష్టులచేతను మనువుచేతను పునః పునః ఆచరింపఁబడినవగుట అవిసాత్వతములైన శిష్టాచారములు, దానము, సత్యము, తపము, జ్ఞానము, విద్య, యజ్ఞము విద్య, సన్న్యాసము, (తనగమనము) దయ ఈ యెనీమీది లక్షణములు శిష్టాచార లక్షణములు. శిష్టులు మనువు సప్తర్షులు వీని నాచరించియుండుటచే నివి సమస్త మన్వంతరములలో శిష్టాచారములు అనబడినవి. శ్రవణముచే శ్రాత మెఱుంగవలయును. స్మరణమున స్మార్తము నెఱుంగవలయును. వేదాత్మకము యజ్ఞాత్మకము నయినది శ్రాతధర్మము. ప్రజల యొక్క వర్ణ ధర్మములకు ఆశ్రమ ధర్మలకు సంబంధించినది స్మార్తము. ప్రతి భాగమునకు సంబంధించిన ధర్మము యొక్క ప్రత్యంగమును చెప్పెదను. (44) ఒక విషయమును దర్శించి దానిని గూర్చి ప్రశ్నించినప్పుడు దానిని కప్పి పుచ్చక జరిగినది జరిగినట్లు వచించుట సత్యము. బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారత్వము ఈ లక్షణములతో గూడినది తపస్సు. ఇది చాల కఠినమయినదీ. సుఖోరము, దానిని సాధించుట చాల కష్టము. (46) పశువులు నేయి (హవిస్సు) ఋక్సామయజుర్మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణలు (ఇవి యజ్ఞ సంభారములు) వీని సంయోగమే యజ్ఞము. (47) సర్వ ప్రాణుల హితాహీత విషయములలో తనతో సమానముగా సర్వస్వ ప్రేమతో వర్తించుట దయ. నిందింపఁబడినను, లేదా కొట్టఁబడినను, తిరిగి(48) తిట్టక, తిరిగి కొట్టక, త్రికరణ శుద్ధిగా వాక్కుచేగానీ మనస్సుచే గాని, కర్మచేగాని ప్రతిక్రియ నాచరింపని వ్యక్తి యోర్పు క్షమా గుణము. యజమానులచే రక్షింపఁబడినవారిని కానీ, పరిత్యజింపఁబడినట్టివారిని కానీ, ఒడలు తెలియని మైకమున విడిచినవి గానియైన ఇతరుల వస్తువులను, ముట్టకుండుట గ్రహింపకుండుట అలోభగుణము.
మైథున వ్యాపారమున ఆసక్తి చూపకుండుట, స్త్రీ సంభోగమును గూర్చి యాలోచింపకుండుట, దానిని గూర్చి వాగకుండుట, వీని నుండి నివర్తించు రూపమైన బ్రహ్మచర్యము అచ్ఛిద్రమైన ‘తప’ ముగా చెప్పబడుచున్నది. ఆత్మార్ధము కాని పరార్థముకాని జ్ఞానేంద్రియములు మిథ్యగా ప్రవర్తింపకుండుట శమము. (ఇంద్రియ నిగ్రహము శమము) జ్ఞానేంద్రియ పంచకము యొక్క కర్మేంద్రియ పంచకము యొక్క యెనిమిది కారణముల నుండి ప్రతిహతుఁడు కాగా నెవ్వఁడు కోపగించండో, అతఁడు జీతాత్ముఁడు. ఇంద్రీయ వ్యాపారముల కవష్టంభము కల్గినచో కోపమూసని పోఁడు జీతాత్ముఁడు). (53) తనకు మిక్కిలీ ప్రియతమమైనదీ, న్యాయ మార్గమున సంపాదించినదియునగు ద్రవ్యమును గుణవంతుఁడైన యర్థికిచ్చుట దానము. (54) దానము కనిష్టము, జ్యేష్ఠము, మధ్యమము అని త్రివిధము వీనిలో మోక్షమునకై యిచ్చునది జ్యేష్ఠము. తన యొక్క నీచమయిన స్వార్థమును సాధించుట కొఱకు నొసంగబడినది కనిష్ఠమయినది. నీచదానము. ప్రాణుల యెడ దయతో నిచ్చునదిమధ్యమ దానము. నాలుగు వర్ణముల వారికి నాలుగు ఆశ్రమముల వారికి ధర్మము ప్రత్యేకముగా శ్రుతి స్మృతులచే విహితమయినది. (56) ఏది శిష్టాచారమునకు విరుద్దమయినదీ కాదో, అదీ కూడ ధర్మమే. అయ్యది విద్వద్వరేణ్యులయిన సాధుజనులకు సమ్మతమయినది. (57) ఒకని కిష్టము లేని వస్తువులయందు విద్వేషము లేకుండుట, ఇష్టమయిన దానిని అభినందించుట, ప్రీతి శాప విషాదముల నుండి వినివృత్తి విరక్తత. (58) కృతాకృతములతయిన కర్మల నుండి సన్న్యాసము. బాగోగులను విడుచుట సన్యాస యనంబడును. ఈ వికారముచేతనమై యుండ నా విశేషములవ్యక్తములగును.(?) చేతనా చేతనములకు వేరైన (జీవజగదతీతమైన) దానినీ దెలిసికొనుట జ్ఞానమనబడును, గత స్వాయంభువ మన్వంతరమున ధర్మతత్త్వజ్ఞులైన ఋషులు, ధర్మప్రత్యంగలక్షణముగా వీనిని స్మరించిరి.
మన్వంతరాచారమును, అట్లే చతుర్హోత్ర చతుర్విద్యల యొక్క ప్రకారమును మీకు వర్ణించెదను. (61,62) ప్రతి మన్వంతరము నందు వేరు విధమయిన (అన్యా) శ్రుతి విధింపఁబడును. (62) ప్రతి మన్వంతరమున దేవతలు విధింపఁబడినట్లు ఋక్కులు, యజస్సులు, సామములు విధింపఁబడును. సర్వ భూతములు వినాశనము నొందినను, హోత్రస్తోత్ర విధానము శతరుద్రీయము వదలీ పూర్వమువలెనే ప్రవర్తించును. (63) స్తోత్రము నాలుగు విధములు : ద్రవ్య స్తోత్రము (ద్రవ్య ప్రశంస) గుణ స్తోత్రము (గుణ ప్రశంస) ఫల స్తోత్రము (ఫల ప్రశంస) 4 ఆభిజనక స్తోత్రము (అభిజనుల స్తుతి), సర్వ మన్వంతరము లందు బ్రహ్మ దేవతలకు సంబంధించి ఈ చతుర్విధ స్తోత్రములను ప్రవర్తింపఁజేయును. ఈ విధముగనే మంత్రగణముల సముత్పత్తియు చతుర్విధముగా నుండును. (66) తీవ్రతరమయిన పరమ దుషరతపస్సాచరించు ఋషులకు, అధర్వవేద ఋగ్వేద, యజుర్వేద సామవేదముల మంత్రములు, వేరువేరుగా (ఏడివిడిగా) పూర్వ మన్వంతరంబు లందువలె ప్రాదుర్భవించును. అయ్యప్ ఐదు విధములుగా గోచరించును :- (1) అసంతోషము వలన (2) భయము వలన (3) దుఃఖము వలన 4 సుఖము వలన (5) శోకము వలన (68) ఈ మంత్రములు యదృచ్ఛయా వాని యంతటనవియే తారకుఁడను పేరుగల ఋషి యొక్క దర్శనమున కనిపించును (ప్రాదుర్భవించును) ఆ ఋషీశ్వరుల యొక్క ఋషిత్వమును ఇట లక్షణములతో చెప్పెదను. (69) అతీతానాగతులలో (పూర్వ ఋషులలో భవిష్యత్ ఋషులలో) పంచవిధ ఋషులు కలరు. అందుచే ఆర్ష సముద్భవమయిన ఋషుల యుత్పత్తం గూర్చి చెప్పెదను. (ముందు వచ్చు వర్ణనములలో సవ్తర్షుల ఆవిర్భావ విధానము వర్ణింపఁబడును).
గుణములన్నియు సామ్య స్థితిలో నుండ, సర్వప్రళయము సంప్రవృత్తమైయుండ, వేదములు అవిభాగములై యుండ, నిర్దేశించుటకు శక్యముకానీ తమోమయమై సర్వమునుండ అబుద్ది పూర్వకముగ చేతనము కొఱకే కార్యములు జరుగును. చేతనాబుద్ధిపూర్వము చేతనము చేత ప్రవర్తించును. (ప్రధానము). సదసదభిచారశక్తిచేతనే. (72) బుద్ది, సదసదభిచార శక్తి రెండును చేపలు (మత్స్యములు) నీటియందు ప్రవర్తించునట్లు వ్యవహరించును. చేతనాధిష్ఠితము గుణాత్మకమయిన సత్వము (చరించు వస్తువుల సత్వము)పనిచేయును. అట్లే కారణము వలన కార్యము ప్రవర్తిల్లును. విషయములు విషయిత్వము వలనను, అర్థత్వము వలన అర్థము (74) పని చేయును. (అర్ధ జనక లక్షణము. శబ్దములందు లేక యర్థము కలుగనీయట్లు), కరణీయములయిన భేదములు కాలము ననుసరిచి తత్తత్సమయమున పొందదగినవి. తరువాత క్రమముగా మహత్తు మొదలగునవి వ్యక్తములగును. (75) అహంకారము మహత్తు నుండియు, అహంకారము నుండి భూతేంద్రియములు, భూత భేదములు భూతముల నుండి పరస్పరము జనించెను. (76) (కరణము కారణముగా మారినది. కరణము (జ్ఞానేంద్రియము) అన్న అర్థము వచ్చు పాదము నందలి యర్థమును నిగూహ పరచుచున్నదీ?) కార్యకరణము యొక్క సంసిద్ది (ఇంద్రియము) తనంతటనది వెంటనే వివర్తతత్త్వమును (మార్పును) పొందును. నిప్పురవ్వలు, నెరుసులు అగ్ని నుండి యొకేమారు పైకి ఎటులు వచ్చునో, అట్లే క్షేత్రజ్ఞులు (ప్రత్యేకపు జీవులు) ఒకే కాలమున ఒకే కాగణమున ఉపాదాన కారణము నుండి పుట్టునో ఏ విధముగా ఖద్యోతము (మిణుగురు పురుగు) ఆకస్మికముగా అంధకార ప్రాయమయిన చీకటిలో కనబడునో (క్షేత్రజ్ఞుడు) అవ్యక్తము నుండి దృశ్యమానమగును. అయ్యటీ చాల పెద్దదీ (మహాన్) శరీరము కలిగియుండును. (79) తద్విభువు విద్వాంసుఁడు; ద్వారశాలా ముఖమున నుండును. (అంటే మహాశరీరుడై మహాతమస్సునకు పారమున, మహత్తు లక్షణత్వమున భావింపఁబడును కాననగును).
అతఁడచ్చటనే విద్వాంసుఁడయిన యతఁడు తమస్సుయొక్కయంతరమున నుండును. అని శ్రుతి. అయ్యది (అవ్యక్తము). తన్ను మార్పు నొందించుకొనిన తరువాత బుద్ది చతుర్విధముగా ప్రాదుర్భవించెను. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము అనునవి నాలుగు. వీనిని మానవుని తరింపఁజేయునట్టి. సంసిద్దీకరములని యేలుంగవలయును. (82) అతఁడు మహాత్ముఁడు. శరీరపుమార్పు (వివర్తము) వలన సిద్ది. ఆతఁడు శరీరము నందు శయనించునుగోన పురుషుడనంబడెను. క్షేత్ర సంబంధమయిన జ్ఞానముచే ఆతఁడు క్షేత్రజ్ఞుండనంబరగిను, ఆతఁడు లోపల (శరీరములో) నుండును గోన ఆతఁడు బోధాత్మకుఁడు. (84) వ్యక్తా వ్యక్తమగునచేతనము సంసిద్దికి పరిగతము ఈ విధముగా క్షేత్రజ్ఞు డు వీవృత్తుఁడు. క్షేత్రజ్ఞానాభీసంహితుడు. క్షేత్ర జ్ఞానముతో గూడిన). (85) ఏవృత్తి సమకాలముననే బుద్దీతో స్వయంవ్యక్తుడు ఋషి ఆతఁడు (పరం హర్షయతే) మిక్కిలి సంతసించువాడు, సంతసింపచేయువాడు గావున పరమరీ (86) గత్యర్థక ‘ఋష్’ ధాతువు నుండి ఈ నామము కలిగినది. తనంతట తానే పుట్టినందువలన ఋషిత (ఋషిత్వము) కలిగినది. (87) వారు ఈశ్వరుని వలన స్వయముగా నుద్భూతులయిరి. అందుచే వారు బ్రహ్మమానస పుత్రులు. పుట్టిన వెనుక వారందరు “మహత్తు” ను పరీవృతులయి చుట్టు ప్రదక్షిణ మాచరించిరి. ఆత్మభువులయిన వారు తమ గుణ పరంపరచే మహత్తు చుట్టు తిరుగుటచే “మహర్షులు” గానయిరి. వారు బుద్ధి యొక్క పరమ దర్శనులుగా చెప్పఁబడిరి. వీరు ఈశ్వరునకు మానస పుత్రులు ఔరసులు కూడ (పుట్టినవారు). వారు అహంకారమునకు, తపస్సునకు పరులగుట (దూరులగుట) వారు ఋషిత్వమును పొందిరి.
భూతాదుల యందు తత్త్వమును కనుగొని యుండుటచే వారు సప్తర్షులు అయిరి. ఋషీకులు ఋషిపుత్రకులు. వారు మైథునమున (భార్యా భర్త యోగమున) కలిగిరి. మహాతేజస్వులయిన యా ఋషులచే తన్మాత్రలు, సత్యము కూడ తెలిసికొనఁబడినవి. అందుచే సప్తర్షులు సత్యమును (పరమ సత్యమును) దర్శించిరి. (92) వారు ఋషీకుల యొక్క పుత్రులు. వారిని ఋషి పుత్రులనుగా గ్రహింపవలయును. ఈ ప్రపంచము (విశ్వము) యొక్క అద్భుత సత్యము ఋతము. వారు అసత్యమును విశేషములను గ్రహించిన వారగుట ఋషి పుత్రములయిరి. (93) ఆ ఋషులు వేదము నిజముగా చూచిన వారగుట వారు సప్తర్షులు. (1) అవ్యక్తాత్మ (2) మహాన్ ఆత్మ (3) అహంతాత్మ (4) భూతాత్మ ఋక్షజాతులు. [5) ఇంద్రియాత్మ అను నైదు ఋషిజాతులు. (94,95) భృగువు, మరీచి, అత్రి, అంగీరుఁడు, పులహుఁడు, క్రతువు, మనువు, దక్షుడు, వశిష్ఠుఁడు, పులస్త్యుఁడు. ఈ పదిమందీ బ్రహ్మమానసపుత్రులు. స్వయమీశ్వరులు, పరమరులుగాన మహరులనబడిరి. (97) ఈ క్రిందఁ జెప్పఁబడు ఋషులు ఈశ్వర సుతులు; కావ్యుఁడు (శుక్రుఁడు), బృహస్పతి, కశ్యపుడు, చ్యవనుఁడు, ఉతథ్యుడు, వామదేవుఁడు, అపాస్యుడు, ఉషిజుడు, కర్దముడు, విశ్రవసువు, శక్తి, వాలఖిల్యులు, అర్తవులు. (99) ఈ ఋషీశ్వరు లందరు ఋషిత్వ స్థితిని తపస్సుచే పొందిరి. ఋషీకులు - ఋషుల పుత్త్రులు. యోని జాతులని యెఱుంగుము.
వత్సరుఁడు, నగృహుఁడు, భరద్వాజుఁడు, దీర్ఘతముడు, బృహదుదుక్థుడు, శరద్వతుండు, వాజశ్రవుఁడు, శ్రుతి, వశ్యాశ్వుడు, పరాశ రుఁడు, దధీచుఁడు, శంశపుఁడు, వైశ్రవణుఁడు (రాజు) వీరందరిని ఋషకులందురు. వారు ఋషత్వమును వారీ సత్యత్వము వలన పొందిరి. వారినే ఈశ్వరులని, ఋషులని, ఋషికులని జ్ఞాపకముంచు కొందురు. వారందరు మంత్రకర్తలు. వారి నందరినీ పూర్తిగా సెలుంగుము, భృగువు, కావ్యుడు, ప్రచేతసుఁడు, ఋచీకుఁడు, ఆత్మవంతుఁడు (104) ఔర్వుఁడు, జమదగ్ని, విదుఁడు, సారస్వతుఁడు, అరిషేణుడు, యుథొజిత్తు, వీతూవ్యుఁడు, సువర్చసుఁడు, వైశ్యుఁడు, పృథువు, దివోదాసుఁడు, బాధ్యశ్వుఁడు, గృత్నుఁడు, శౌనకుఁడు. వీరు 19గురు భృగువులు. ఆ ఋషులందరు మంత్రవాదులు. (106) అంగిరుఁడు, వైద్యగుడు, భరద్వాజుడు, భాషలీ, ఋతపోకుడు, గర్ణుండు, శ్రీని, సంకృతి, పురుకుత్సుడు, మాంధాత, అంబరీషుఁడు, యువనాశ్వుఁడు, పౌరకుత్సుడు, త్రసదస్యుఁడు, దస్యుమంతుఁడు, ఆహార్యుఁడు, అజమీడుఁడు, తుక్షయుఁడు, కపి, వృషాదర్భుడు, వీరూపాశ్వుండు, కణ్వుడు, ముద్గలుఁడు, ఉతథ్యుఁడు, సనద్వాజుఁడు, వాజశ్రవసుఁడు, ఆయాస్యుఁడు, చక్రవర్తి, హమదేవుఁడు, అసిజుఁడు
బృహదుక్థుడు, దీర్ఘతముఁడు, కక్షీవంతుఁడు ఈ ముప్పది మూఁడుగురు మహర్షులు అంగీరస ఋషి వంశ శ్రేష్ఠులు. (111) వీరందరు మంత్రకర్తలు. ఇక కాశ్యప వర్గ ఋషుల నెఱుంగుము. కాశ్యపుఁడు, వత్సారుఁడు, నైధ్రువుఁడు, రైభ్యుఁడు, అసితుఁడు, దేవలుఁడు, ఈ ఆరుగురు బ్రహ్మవాదులు. ఆత్రీ, అవ్యసనుఁడు, శావాశ్వుండు, గవిష్ఠిరుఁడు, ఆవీహోత్రుఁడు, ధీమంతుఁడు, పూర్వాతిధి వీరిని అత్రి సంబంధు లందురు. వీరందరు మహరులు, మంత్రకారులు. (114) వశిష్ఠుఁడు, శక్తి, పరాశరుఁడు, నాలుగవవాఁడు ఇంద్రప్రమతి, పంచముఁడు భరద్వసుఁడు, మైత్రావరుణి ఆడవవాఁడు, ఏడవవాఁడు కుండీనుఁడు, వీరు ఏడుగురు వశిష్ఠ వంశోద్భవులు. వీరందరిని బ్రహ్మ దులుగా నెఱుంగుము. గాధి కుమారుఁడయిన విశ్వామిత్రుండు, దేవరాతుఁడు, ఉద్దలుఁడు, విద్వాంసుడైన మధుచ్చందుఁడు, అఘమర్షణుఁడు, అష్టకుర డు, లోహితుఁడు, కతుఁడు, కోలుఁడు, దేవశ్రవసువు, రేణువు, పూరణుఁడు, ధనంజయుఁడు ఈ పదిముగ్గురు కుశికవంశమందలి ధర్మిష్ణులయిన ఉత్తమ వ్యక్తులని యెఱుంగవలయును. అగస్త్యుఁడు, అయుడు, దృఢాయువు, ఇద్మ.హుఁడు ఈ మువ్వురు బ్రహ్మిష్ణులు, బ్రహ్మను గూర్చిన తపస్సు నందు నియుక్తులు. వీరికి ఉత్తమ తపస్సు కలదు ప్రసిద్దమయిన కీర్తి కలదు. వైవస్వతుని కుమారుఁడయిన మనువు, ఐలుఁడయిన పురూరవరాజు వీరిరువురు ఉత్తమక్షత్రియులు. మంత్రములను గనుగొనినవారు (మంత్రవాదులు).
బలందనుఁడు, వత్సుఁడు, సంకీలుఁడు ఈ మువ్వురును మంత్రకారులు. అంతియకాక వైశ్యులలో వీరు మిక్కిలి శ్రేష్ఠులుగా స్మరింపం బడుచున్నారు. ఈ విధముగా ఋషులచే సమకూర్పబడిన (చేయబడిన - చూడబడిన) మంత్రములు తొంబది. ఆ ఋషీశ్వరులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడ. ఋషి పుత్త్రకులయిన వీరల నెఱుంగుము.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణ మందలి పూర్వభాగము నందలి ద్వితీయానుషంగపాదమున యుగప్రజాలక్షణము, ఋషి ప్రవర వర్ణనము అను ముప్పది రెండవ అధ్యాయము.
Summary of chapter 32 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the exploration of cosmic time, this section intricately links the prevailing spirit of each Yuga with the nature of the people and the continuous, luminous lineages of the great sages. It pays devout homage to the enlightened seers who relentlessly preserve the sacred wisdom through the darkest of ages, serving as eternal guides for humanity. The devoted soul is encouraged to seek the company of the holy and take shelter in the timeless teachings handed down by these majestic spiritual masters.