30 - మదనపునర్భవో   

అగస్త్యుడనెను: ఓ హయగ్రీవా! మహాప్రాజ్ఞా! నీవల్ల ఉత్తమమైన లలితాఖ్యానమును ఆమె విశిష్ట పరాక్రమమును వింటిని. ఓయగస్త్యా! దేవియొక్క పాపరహితమైన చరితము సంతుష్టుడనైతిని. మంత్రీడీదండనాథలయొక్క యామహాశక్తిని గూడవింటిని.-2. నాలుగవ దినపురాత్రి తెల్లవారగనే యుద్ధానంతరము అంబికయేమి చేసెను?

హయగ్రీవుడనెను. ఓ ప్రాజ్ఞ! కుంభజ! భండాసురుడు చనిపోగా తరువాత జగదంబ ఏమి చేసెనో వినుము-4. భండాసురుని నూర్లకొలదీ యాయుధములచే పీడింపబడిన సమస్తశక్తి సైన్యమును తనలోచనామృత స్నానములతో గాయముల బోగొట్టి మరల సంతసింపజేసెను-5. లలితా పరపరమేశాని యొక్క కటాక్షామృత ధారచేత శక్తులు ప్రీతమనసులై యుద్ధ పరిశ్రమను వదిలిరి-6. ఈ సమయమున భండాసురవధతో సంతసించిన బ్రహ్మ, విష్ణువు మొదలుగాగల దేవతలు అందరును అదేవిని సేవించుటకు వచ్చిరి-7. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రాది దేవతలు, ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు మరుత్తులు, సాధ్యదేవతలు-8. సిద్దులు, కింపురుషులు, యక్షులు, నిరృతి మొదలగు నిశాచరులు, ప్రహ్లాదుడు మొదలగు మహాదైత్యులు, బ్రహ్మాండమున నివసించునందరును వచ్చి సింహాసనముననున్న మహేశ్వరిని సంతోషముతో స్తుతించిరి.

బ్రహ్మాదులు అనిరి :- ఓ జగమున కేకైకనాథురాలా నీకు నమోనమః ఓ శ్రీ త్రిపురయనుపేరు గలదానా! నీకు నమోనమః భండమహాసురుని జంపినదానా! నీకు నమోనమః. ఓ కామేశ్వరి! సుందరమైన కేశములు గలదానా! నీకు నమస్కారము-11. కోరినదెల్ల యిచ్చు సమర్ధురాలా! చింతామణి స్వరూపిణీ! చింతింపనలవి కానీదానా! (ధ్యానాతీతా) చీత్స్వరూపముయొక్క తరంగములను మాలలుగా ధరించినదానా! జ్ఞానసముద్రరూపిణీ, (అచటచట జ్ఞానభేదములు పోడసూపినను తరంగములు సముద్రమున లీనమైనట్లే జ్ఞానభేదములు అద్వయజ్ఞాన సముద్రమున లీనమగును. ) చిత్రమైన యంబరములు (వస్త్రములు) కలదానా! చిత్రమైన జగమును సృజించినదానా! చిత్రా యను- నిత్యాశక్తి రూపిణి. సుఖము నిచ్చుదానా! నీకు నమస్కారము-12. మోక్షమునిచ్చుదానా! సుందర చంద్రకళను సిగలో ధరించినదానా! సుందరమైన చిరునగవు గలదానా! మోహమును భేదించుటలో సమర్థురాలా! ముద్రలకీశ్వరివై రాజతంత్రమును చర్చించినదానా! ముద్రాప్రియయైన దేవీ నీకు నమస్కారము. (శాక్తేయమున ప్రతికైంకర్యము ముద్రాపూర్వకముగనే జరుగును గాన ముద్రాప్రియ యనబడినది)-13. క్రూరుడైన యంతకుని ధ్వంసము జేసిన దానా! కోమలాంగే! కోపమున కాళీరూపమును వహించుదానా! వరాహ ముఖమైనదానా (వారాహీ రూపిణి). శక్తి సైన్య చక్రమును పాలించినదానా! సమస్త భయములను, వారాహీ రూపమున  నిమిడ్చుకొనినదానా! నీకు నమస్కారము. శరీరము యొక్క యాజు, అంగములను రక్షించు దేవీ పరివారమునకు కృష్ణస్వరూపిణీ! శిక్షా-వ్యాకరణ-చ్చందో-నిరుక్త-జ్యోతిష-కల్పములను ఆరంగములతో గూడిన శ్రుతి వాక్యములకు వేదుకదగినదానా (అలభ్యమైనదానా!) మూలాధారాది షట్చక్రములలో నున్నదానా! క్షుత్-తృష్ణా-శోక-మోహ-జరా-మరణములను షడూర్ములతో గూడిన దానా! (ప్రాణి శరీరాంతర్గతముగా! షడ్బావరూపిణీ! ఓ లలితా! నీకు నమస్కారము-15. స్త్రీ రూపము జెందిన కామ స్వరూపిణి! శీవాస్వరూపిణి ముఖ్యములైన సమస్తములోని నిత్యస్వరూపిణి! మనోహర స్వరూపిణి! కాంతాసనాంతరూపిణీ! కమలవిశాలలోచనే కోరిన కోరికలనిచ్చుదానా! కామశంభుపునకు కామినియైనదానా! మోక్షమునకై కోరదగినదానా! కళలకు అధిపురాలా! నీకు నమస్కారము-16. దీన్యౌషధమునకు మొట్టమొదటిదానా! నగర సముహ స్వరూపిణి! దీవ్యురాలా! సూర్యసహస్రకాంతిమతి! ఆకాంతితో మిక్కిలి ప్రకాశించుదానా! దయతో గూడినదానా! దేవాదిదేవులకు సంతోష స్వరూపురాలా! నీకు నమస్కారము-17. ఎల్లప్పుడు అణిమాది అష్టైశ్వర్యములతో సేవింపదగినదేనా! సదాశివుని యాత్మయై దివ్య ప్రకాశముతో వెలుగు మంచముననుండు దానా! (సదాశివ హృదయాశాయిని) సభ్యురాలా! (సభామర్యాదలు తెలిసినదానా!) సత్తునకు ముఖ్యమైన యాలయమైన పాదములందు పూజ్యురాలా (నీ పాదపూజవల్ల సదాత్మత చేకూరును), లోకమును సృష్టించినదానా నీకు నమస్కారము-18. బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలతో సేవింపదగినదానా! బ్రహ్మకు ప్రియురాలా! (జ్ఞానప్రియవు) బ్రాహ్మణుల ఇంధములను చేధించుదోనా! బ్రహ్మ జ్ఞానము) అను ప్రవాహమున విహరించు రాజహంసీ! బ్రహ్మకు గూడ ఈశ్వరివైనదానా ఓ శ్రీలలితా! నీకు నమస్కారము-19. సంక్షోభిణీ మొదలగు సమస్తముద్రలతో సేవింపబడినదానా! సంసారబంధమును ధ్వంసము జేయుదానో! సంసారమునకు లీలకొరకైన యాకారమైనదానా! పద్మములవంటి కన్నులు గలదానా! (సంసారలీలాకారమునకు పద్మాక్షి వైనదానా!) ఓ అధినాథవైన లలితా! నీకు నమస్కారము. నిత్య స్వరూపిణి! పదునాలు కళలతోను లలితయను నామముతోను సర్వముగా సాకర్పించుదానా! సర్వమున కధీశ్వరివైన దానా! ప్రమథ గణముతో సేవింపదగినదానా! -20 నిత్యస్వరూపిణి (నిత్యాశక్తి స్వరూపిణి) - భయములేని దయకు విస్తార స్వరూపిణికి నల్లని ముంగురుల వరసలు గలదానా! నీకు నమోనమః. మన్మధపుష్పములై ఉన్నత గీతనాదములు గలవారైన మన్మథుని దేవుల (భార్య) చేతను ఎల్లప్పుడు సేవింపదగినదానా! అభవ్యులను (అమంగళులను) జంపుదానా! శివదూషకులను  జంపుదానా! వర్ణమాలా స్వరూపిణి! చంపబడిన శత్రువులు గలదానా! ఓ లలితా నీకు నమస్కారము-21. సంక్షోభిణి మొదలగు పదునాలుగు జ్వాలలతో నావరింపబడి గొప్పదైన మహాజ్వాలతో ప్రకాశించినదానా ఆత్మను (సర్వాత్మను) పూర్తిగా ధరించుదానా! విలాసశోభితురాలా! శుభ్రమునకు నెలవైనదానా! శుభ్రమైన పాదములు గలదానా! (నీరుష్టములైన మాటలు గలదానా!). నీకు నమస్కారము-22. శర్వసిద్ద మొదలగు శక్తులకు నమస్కరింప దగినదానా! సర్వజ్ఞునిచేత సర్వస్వాత్మ జ్ఞానిచేత, (శిపునిచేత) తెలియబడిన పదకమలములు గలదానా! సర్వులకన్ననధికురాలా! సర్వము నందున్నదానా! సమస్త సిద్దుల నిచ్చుడోనా! ఓ శ్రీలలితా! నీకు నమస్కారము-23. సర్వజ్ఞునకు జనించిన మొదటివారగు నితర దేవులాశ్రయించిన చక్ర స్వరూపిణి! సమస్త దేవతల కోరికల నెరవచ్చుదానా! సర్వలోకములను సృష్టించుదానా! రక్షింపుము-24. వశిని మొదలగు శక్తుల వాగైశ్వర్యరూపిణి! చక్రాకారము గల కాంతీ ప్రవాహమును వహించుదానా! (ఆకారము చుట్టు మహాకాంతిపుంజ ప్రవాహము గలదానా!) మేఘవలె నల్లని వెంట్రుకలు గలదానా! హక్కులకు సముద్రమైనదానా! వరమునిచ్చుదానా! ఓ సుందరి! లలితా విశ్వమును రక్షింపుము-25. బాణము మొదలగు దివ్యాయుధములకు సార్వభౌమ చక్రవర్తి స్వరూపిణి! భండాసుర సైన్యవనమధ్యము నందలి కార్చిచ్చువైసదానా! వజ్రేశ్వరి! భగేవ్వరి (బశ్వర్యములకు గూడనీశ్వరి! రూపములేనీ దానా! (ఆత్మస్వరూపిణి) కన్యా! కలి స్వరూపిణి! కాలుని గూడ జంపదక్షురాలా! దైత్య సైన్యమును ధ్వంసముజేసి మాటలలో మాత్రము నిలుచు దానిగ జేసినదానా! కామేశునిచే ననుసరింపబడినదానా! లక్ష్మీస్వరూపిణి! నీకు నమస్కారము-27. బిందువునందున్నదానా! బిందుకళతో ఏకరూపమైన దానా! బిందు స్వరూపమైన దానా! జ్ఞాన ప్రకాశమును ప్రకాశింపజేసినదానా! విశాల స్తనములపై కదులుచున్న కమలహారములు గలదానా! విశాల ప్రభావము గలదానా! ఓ లలితా! నీకు నమస్కారము-28. కామేశ్వరుని తొడపై నెల్లప్పుడు నివసించుదానా! కాల స్వరూపిణి! దేవి! దయదలచినదానా! కల్ప ప్రలయము చివర విజృభించిన యమస్వరూపిణి! కామములనిచ్చు కల్పవృక్షలతా! నీకు నమస్కారము-29. మద్యముతో గూడినదానా! దట్టమైన చంద్రుని వెన్నెల వలె చల్లనైనదానా! లేడిపిల్ల కన్నులదానా! పద్మముఖీ! పద్మసారము (బ్రహ్మానందసారము) నకెల్లప్పుడొకే నెలవైనదానా! సమస్త విద్యలకు ఈశ్వరి! నీకు నమస్కారము-30. జ్ఞానాగ్ని యందు బుట్టినట్టియు, శ్రీశంభునాథునిచే ప్రకటింపబడినట్టిదియు నైన నీయొక్క ప్రభావముచే సమరమున జగతంటకులై భయంకరులైన భండాసురుడు మొదలగువారు చంపబడిరి-31. ఓ సభ్యులకు లభ్యమైనదానా! నీ దట్టమైన దయాసుధా ప్రపోహములతో మా శరీరములను ఆయుధపు దెబ్బల గాయములు లేకుండగా క్రొత్తవానీనిగా జేసితివి. నీవీ సమస్త లోకమును సంతోషముతో సుఖముగా జీవించిన ప్రాణులు గలదానినిగా జేసితివి-32. (11 నుండి 32వ శ్లోకమునకు నమోనమస్తే జగదేక నాథే మొదలుకొని సభ్యలభ్య-అన్నది చివరిదిగా మొత్తమించు మించు 122 నామములున్నవి. ఇందులో కొన్ని వాక్యరూపములు, మొత్తము పైననివి విడిగా విశద వ్యాఖ్యేయములనిపించుచున్నవి.) లలితా సహస్రనామములిందు కనబడచులేవు. కాని అవియున్నట్లు సూచన ఈ లలితోపాఖ్యానమున 20 అధ్యాయమున 68వ శ్లోకమున గలదు - "తా సాం సారూని సర్వాసాం డండిన్యాలి కుంభసంభవ సహస్రనో మధ్యాయే తు వక్ష్యంతే నాధునా పునః” మహాశయుడైన శ్రీశంభునాథుని యొక్క రెండవ తేజము ప్రసరించినచోటు స్థాణ్వాశ్రమము. అచట సతీ వియోగమున శివుడు నిరస్తభోగుడై విరక్తుడై యుండెను-33. అపుడు హిమ పర్వతవంశమున బుట్టిన కన్యయైన ఉమను శివునితో గలుపుటకు బూనినవారై దేవతలు ఘోరతపమున నున్న యా శివునికడకు మన్మథుని ప్రేరేపించిరి-34. ఆ తరువాత. తన వైరాగ్య తపములకు విఘాతము నొనరించుటచే శివుడు ఫాలనేత్రాగ్నితో మన్మథుని భస్మము జేసెను. ఆ విధముగా భస్మావశేషుడైన మన్మథుడే యీ భండాసురుడుగా జనించెను-35, తరువాత దురాశయుడును దర్ముదుడునైన యా భండాసురుని నీవు చంపితివి. మా కొఱకు (దేవతల కొఱకు) మన్మథుడు శరీరములేని వాడయ్యేను. ఈ రతీదేవి కూడ భర్తవియోగమున మిక్కిలి దుఃఖితురాలై యభవ్యమైన వైధవ్యమును బొందినది. కావున నీవా కాముని వెంటనే సంజీవితునిగా జేయుము. నీవు సంజీవితునిగా జేసిన మన్మథుని సంగముచే ఓ శ్రీ లలితా! రతీదేవి సనాథ (నాథుడు గలది) యగును-36, 37. రతితో జూడబడిన మన్మథుడు మరల చంద్రమౌళిని మోహితుని జేయును. తరువాత అట్లు మోహితుడైన యీశుడు చాలాకాలము మిక్కిలి సపర్యజేసిన పార్వతిని వెంటనే పెండ్లాడగలడు-38. ఆ శివపార్వతుల సంగము వలన సమస్త దేవసేనాయకుడగు కుమారస్వామి జనించును. శివపుత్రుడైన (కుమారస్వామి) ఆతడు, దురాశయుడైన భండాసురుని మిత్రుడును, ముల్లోకములకు తోకచుక్కవలె వినాశసూచకుడునునైన తారకుడను రాక్షసరాజును రణమున నిరసించి చంపినచో మనకు (దేవతలకు) ప్రాణప్రతిష్ట యగును-40. కావున నో త్రిపురాంబా! నీవు జనమానముల భంగపరచు మహావీరుడగు మన్మథుని జనింపజేసి విరబోసికొన్న తలవెంట్రుకల గల రతీదేవియొక్క వైధవ్య దుఃఖమును బోగొట్టుము-41. భర్త నశించుటచే అనాథయై బక్కచిక్కినదై  రతీదేవి నిన్ను శరణు బొంది నమస్కరించుచున్నది. కావున నో త్రిపురాంబా! ఇచట నీ కారుణ్యకళను ప్రసరింపజేయుము-42.

హయగ్రీవుడనెను:- బ్రహ్మ మొదలగు దేవశ్రేష్ఠులు ఈ విధముగా జెప్పి దుఃఖముతో బక్కచిక్కిమలినముగానున్న (అలంకారములేమియు లేకయున్న) యా రతీదేవిని శ్రీలలితాంబకు జూపించిరి-43. ఆ రతీదేవియు దుమ్ముబారి విరియబోసికొన్న వెంట్రుకలు గలిగి, కన్నీరు గార్చుచున్న ముఖముగలదై వైధవ్యముతో నలంకార శూన్యయై జగదంబకు నమస్కరించెను-44. అంత, పరమేశ్వరి యామెను జూచి కారుణ్య పూర్తయయ్యెను. అంత, ఆమె కటాక్షమునుండి చిరునవ్వు ముఖమును, పూర్వదేహమున కన్న మించిన కాంతిని గలిగి మదముతో నునుపెక్కిన మన్మథుడు రెండు భుజములు గలిగి సమస్త భూషణములతో నొప్పి పుష్పధనువును పుష్పబాణములను ధరించి-46. తన పూర్వజన్న ప్రియురాలైన రతీదేవిని క్రీగంటి చూపుతో నానందింపజేయుచు జనించెను. ఆ రతీదేవియు భర్తను జూచి మహానంద . సాగరమునమునుగుచు ముదము నందెను-47. అంతరాత్మలలో నానందము. నిండిన వారైనమ వారిరువును లలితాదేవి, యెడ భక్తితో నిండిన మనస్సులు గలవారైరి. అట్టి వారిని గుర్తించి మహారాజ్ఞి లలితాదేవి చిరునవ్వుతో సిగ్గున తలవంచియున్న రతీదేవిని చూచి శ్యామలతో నిట్లనెను-48. ఓ శ్యామలా! ఈ రతీదేవిని స్నానము చేయించి వస్త్రములు మొలనూలు మొదలగు నలంకారములతో, పూర్వమువలె నలంకరించీ తొందరగా నీటకు దీసికొనిరమ్ము-48. శ్యామలయు నామె యాజ్ఞ నౌదలదాల్చి యామె చెప్పినదంతయు  జేసెను. వైవాహిక విధి విధానముతో-50. వసిష్టాది బ్రహ్మర్షులచే నా దంపతులకు పాణిగ్రహణ మంగల కర్మను చేయించెను-51. ఇది చూచి మహేంద్రాదులును తపోధనులైన ఋషులును బాగు బాగు అని ప్రశంసించుచు లలితాంబికను స్తుతించిరి-52. లలితా పరమేశ్వరిని మహాభక్తితో నమస్కరించి పుష్పవర్షమును గురిపించుచు అందరును సంతుష్ట మనస్కులైరీ-25. రతీమన్మథులును లలితాదేవి యొక్క ప్రక్కన చేతులు జోడించి నిలిచిరి. తరువాత మన్మథ వీరుడుగూడ మహేశ్వరికి నమస్కరించి భక్తి నిండిన మనస్సుతో నీ మాటలును విన్నవించెను-54. ఓ లలితాంబా! ఈశ్వరుని నేత్రముచే దగ్గమైన నాశరీరమును నీ కటాక్షప్రసాదమున మరలబొందితిని-55. ఇపుడు " నీ పుత్రుడను. నీదాసుడను. ఏదేని పనియందు నన్ను నియోగింపుము- అనగనే పరమేశానియు మన్మథుతో నిట్లనెను-56.

శ్రీదేవియనేను: వత్సా! మనమున బుట్టినమన్మథా! రమ్ము. నీకు భయములేదు. నాయనుగ్రహమున కొట్టుబడని యాయుధములు : గలవాడవై సర్వ జగమును సంమోహింప జేయుము-57. నీ బాణములు పడుటచే కోల్పోయిన ధైర్య విజృంభణము గల ఈశ్వరుడు వెంటనే పర్వతసుతయైన గౌరిని పరిణయ మాడగలడు-58, నాయనుగ్రహమున నీ నుండి బుట్టిన వేయి. కోట్ల మన్మథులు అందరి . దేహముల నావేశించి యుత్తమరతి నీయగలరు-59. నాయనుగ్రహముననే వైరాగ్యము వలన కోపించినను ఆ యీశ్వరుడు నీ దేహమును .. దహింపజేయ సమర్థుడుగాడు-60. అందరికిని కనబడకుండగనే ప్రాణులందరికిని సంసార మోహమును గలిగించు వాడగు శిపుడు తన భార్యా విరహము నాశంకించి పార్వతికి తన సగము. శరీరమునిచ్చును. నీ బాణములచే కొట్టబడిన మనస్సు గల యీ శివుడు పిరికివాడగును-61. ఓ మన్మథా! ఇవ్వేళటినుండి గొప్ప వాడవైన నిన్ను నిందిచువారు గాని, నీకు ఏముఖులైన వారుగాని జన్మ జన్మలలోగూడ .. తప్పక నపుంసకులగుదురు.-62. పాపిష్టులు, దురాత్ములు, నా భక్తులకు ద్రోహము చేయువారునైన వారిని అగమ్యలైన స్త్రీలలో బడవైచి నశింపజేయుము-63, నా పూజలందును నా భక్తులందును ఆదరముగల వారికి వారు కోరిన దానితోబాటు సమస్త కామ సుఖమును సంపాదించి పెట్టుము-64. ఈ విధముగా నాజ్ఞాపించిన లలితాదేవి వచనమును అట్లే చేయుదునని శిరమున చేతులు జోడించి మన్మథుడు వెడలెను-65. తరువాత, ఆ మన్మథుని రోమకూపముల నుండి శోభనములై సుందరములైన యాకారములుగలిగి. విశ్వ మోహనులైన యనేకులు మన్మథులు బయలుదేరిరీ-66. వారి చేత మన్మథుడు. సమస్త జగమును మోహింపజేసెను. చంద్రమౌళిని జయించుటకై మరల స్థాణ్వాశ్రమమును జేరెను-67. మిత్రుడు వసంతుడు, సేనానియైన చంద్రుడు, వీరమర్ధకుడైన (విదూషకుడైన) రాగము. మందానిల . . వేగము-68, పుంసోకిలగానములు అనెడి కాహళులు, డప్పు చప్పుడులు) వెంట వచ్చిరి. మన్మథుడు శృంగార వీర వేషముతో సుసంపన్నుడై రతీదేవిచే కౌగిలింపబడి యుండెను-69. జయ శీలమైన పుష్పధనువును కదల్చుచు ప్రవీరులందరికిని ముందుగా నడచుచు మదనారియైన శివుని కెదుట జేరి నిర్భయుడై నిలిచెను-70. తపోనిష్టుడైన చంద్రచూడుని (శిపుని) బాణములతో గొట్టసాగెను. తరువాత మన్మధ బాణ - సముహములు చాకిన చంద్రశేఖరుడైన శివుడు వైరాగ్యమును. దూరము జేసెను. దుష్కరమైన తపమును గూడ వదిలెను-71. సమస్త నియమములను వదిలి ధైర్యము వీడెను. ఆ పార్వతినే చింతించి మాటిమాటికి కామ జ్వరము గలవాడయ్యెను-72. శివుడు నిట్టూర్చెను. ఆతని చెక్కిళ్లు తెల్లబారేను. కన్నుల నీరునిండెను. గౌరీ విరహమున బాధితుడయ్యెను. ధైర్యము బోయి నందున సంతప్తుడయ్యెను. " పూర్వము జూచిన గిరిసుతనే స్మరించుచుండెను-73. మన్మథ బాణాగ్నులచే తపింపబడుచున్న శివునకు చల్లని చంద్రరేఖగాని, గంగగాని తాపశాంతి కుపయోగించుటలేదు-74, నంది, భృంగి, మహాకాలులను ముఖ్యములైన గణమండలములచే సిద్దము జేయబడిన పూల . పాన్పున మాటమాటికి పొర్లుచుండెను-75, నందీశ్వరుని చేయి పట్టుకొని ఒక పుష్ప శయనము నుండి మరొక పుషశయనమును, బొందినను మాటిమాటికి వికృత చేష్టల జేయుచుండెను-76. పూలపాన్పున గాని, చంద్రరేఖ నుండి జాలువారిన యమృతమునందుగాని, మంచు నీటగాని శివుని శరీరజ్వరము నివృత్తముగాలేదు-77. శరీరము దాల్చిన మన్మథ (కామ) జ్వాలను జల్లార్చుటకు 'శిలలుగా మారీన మంచు నీటి ఫలకములను మాటి మాటికి శివుడధివసించుచుండెను. మాటిమాటికి గిరిసుతా రూపమును చిత్రపటమున వ్రాయుచుండెను-78. ఆ చిత్రపటగౌరిని చూచి కాము. బాధను కొంత పెంపొందజేసెను. సిగ్గుతో తలవంచి క్రీగంట తన్ను జూచునట్లుగా, గీరిసుతను' చిత్రపటమున వ్రాసి యా పటమును పులకించిన యంగములతో దాకుచుండెను. మహాచింతాసంగమునను, మహరతీసంపదతోను మిక్కిలియైన సురతాపముచేతను ఆ త్రినేత్రుడు వ్యధ జెందెను. -76-80. ఆమెనే (గౌరినే) యంతట జూచుచుండెను. - ఆమెయందే మనము నెల్లపుడు లగ్నము జేయుచుండెను. ఆమెతోనే మాట్లాడుచుండెను. ఈ విధముగా: పిచ్చెత్తినవాడై-61. యామెనే యెదలో నింపుకొని, యామెనే చింతించుచు, తత్పరాయణుడై, ఆమె కథామృతముతోనే రేయింబవళ్లు గడపుచుండెను-82. ఆమె శీల వర్ణనమునందాసక్తి గలవాడై, ఆమె రూపమును జూడ నుత్సహీంచుచు, ఆమె సౌందర్య భోగ సంకల్పమనెడి మాలలను గూర్చువాడై, ... తన్మయుడై శివుడు మిక్కిలి తపించేను-83. ధూర్జటియైన శివుడు ఈ కామ జ్వరమును. చికిత్స జేయనలవికానీ దానిగా భావించి, గౌరీని వివాహము జేసికొనుటకే ప్రయత్న శీలియయ్యెను-84. లలితాదేవి యాజ్ఞచే నీవిధముగా శివుని విమోహింపజేసి తరువాత ఆ పార్వతీని గూడ మన్మథుడు తన బాణములకెరగావించెను -85. మీక్కుటమైన విరహజ్వాలలచే ఆమె శ్వాసాగ్నులు ఆమె పెదవుల వెండింపజేసి మలినము గావించుచున్నవి. చెక్కిళ్లు మిక్కిలి తెల్లబారినవి-86. ఆహారమునగాని, పాన్పునందుగాని, నీద్ర విషయమునగాని యభిలాషను గోల్పోయినది. వేలకొలది చెలికత్తెలు నిత్యము శీతలోపచారములు జేయుచున్నారు-87. కాని ఆమె మరల మరల తపించి మరల మరల వివశురాలగుచున్నది. మన్మథ మహాగ్నీ బాధశాంతినీ బొంద లేకున్నది-68. పార్వతీ విరహతాపమున నిద్రబోవుటలేదు. తన శరీరతాపముచే తండ్రికీ దుఃఖమును బెంచెను-89. పార్వతికి శివుని తోడి విరహము ప్రతీకారము చేయజాలనంతటి తీవ్రముగా నున్నది. అది తెలిసి హిమవంతుడు మిక్కిలి దుఃఖించెను-90. ఓ మంగళకరమైనదానా! ఆ దేవుడైన మహేశ్వరుని తపముతో సంతోష పెట్టి వివాహమగుము అని హిమవంతుడు ప్రేరేపించెను -91. ఆమె కూడ గౌరీ శిఖరమను హిమవత్పర్వత శిఖరమున పతిలాభమునకై దుష్కరమైన తపము జేసెను-92, శిశిరములలో జలములందుండి, గ్రీష్మమున అగ్నుల మధ్య నుండి సూర్యుని యందుచూపు నిలిపి ఘోరమైన తపము జేసెను-93, ఆ తపమునకు సంతసించి శివుడు ప్రసన్నుడయ్యెను. వైవాహిక విధానమున నామెను భార్యగా నంగీకరించేను-94. తరువాత ముందుగా సప్తరుల ద్వారా హిమవంతుని అడిగించి, ఆతనిచే యథావిధిగా నీయబడిన పార్వతిని శివుడు పెండ్లాడెను-45. ఆమెతో రమించుచు శివుడు మామగారి నగరమైన యోషధీ ప్రస్థమున చాలకాలముండెను-96. తరుపోత హిమవంతుడు సంతసించుచుండగా కైలాసమునకు సమస్త ప్రమథులతో వచ్చి పార్వతిని దీసికొనివచ్చెను-97. శివుడు కైలాసమున, మందరమున, వింధ్య పర్వతమున, హిమవత్పర్వతమున మలయపర్వతమున, పొరియాత్రికమున, నానా విధ రమ్య స్థానములలో గౌరీతో రమీంచుచు రతి- బొందెను, అప్పుడు శివుడుగ్రమైన వీర్యమును వదిలెను. దానిని పార్వతి ధరించుటకు అశక్తురాలై-69. భూమిపై వదలెను. ఆ భూమియు అగ్నియందును కృత్తికల యందును ఆ వీర్యమునుంచేను. ఆ కృత్తికలును గంగా జలమున దీరి, ఆ గంగయు రెల్లు గడ్డి యందు వదిలేను-100. అచట వీరుడు ఆు ముఖములు గలవాడునైన మహాసేనుడు (కుమారస్వామి) పుట్టెను. శివుడాతనిని గంగా సమీపమునకు దెచ్చి పెంపుజేసేను-101. ప్రతి దినమాతడు మిక్కిలి పరాక్రమవంతుడై పేరుగుచు తన తండ్రియైన శివుని వలన సమస్త విద్యలను బొందెను-1/2 తండ్రిచే ననుమతింపబడిన వాడై దేవ సేనకు పతియయి సమస్త దానవులతోబాటు తారకాసురుని జంపెను -108. తారకాసుర వధతో సంతసించిన యింద్రుడు కుమారస్వామికి దేవసేన నిచ్చి పెండ్లిజేసేను-104. ఆ యింద్రుని కూతురయిన దేవ సేనయను యశస్వినీ కుమారస్వామిని భర్తగా బొంది మిక్కిలి యానందము నందెను-105. ఈ విధముగా విశ్వచక్రము నెల్ల సంమోహింపజేసిన మన్మథుడు దేవి కార్యమును నరకాసుర వధతో సుసంపన్నము జేసి మరల శ్రీ పురమునకు వెళ్లాను-106. ఆ పుణ్య శ్రీపురమున లలితా పరమేశ్వరి జగము యొక్క సంపత్సమృద్ధికై యుండెను. మన్మథుడామెను సేవించుటకై అచటకి వెళ్లాను -107.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున ముప్పదియవయధ్యాయము.