24 - బలాహఠాదిసప్తసేనాపతివధో

ఆయైదుగురు సేనాపతులు చంపఁబడగా శూన్యకపురాధీశుడైన భండాసురుడు రోషాంధుడై బుసకొట్టుచు యుద్ధముజేయు కోరికతో వ్యాకులమైన మనస్సు గలవాడై కుజలాశుడనువానితో నిట్లనెను ఓ భద్రుడవైన సేనాపతీ! మనకు అభద్రము వచ్చిపడినది. కరంకుడు మొదలు సేనాపతులు చిగుర్చుచున్న భుజపరాక్రమములు గలవారు. సర్పిడి మాయతో సమస్త దేవతల మదముల భంజించువారు. వారు ఐదుగురు మిక్కిలి పాపురాలైన యాగూఢమాయచే జంపబడిరి. ఇపుడు బలాహకుడు మొదలగు నేడుగురు సేనాపతులు గలరు. వారు గొప్ప భుజబలము గలవారు. వారిని యుద్ధమునకు బంపుము వారితోబాటు మూడు వందల యక్షౌహిణీ సేనను గూడ ఒంపుము. మాయాపరాయణులయిన వారు లలితా సైన్యమును మర్థించి-5. ఓయీ! విజయమును సంపాదించి నాకడకు వత్తురు. కీకస యను (ఎముకల రాక్షసి) గర్భమున బుట్టినవారు ప్రచండ పరాక్రములు. బలాహకుడు మొదలగు నేడుగురు సోదరులు ఎప్పుడును విజయులే. కావున రణరంగమున వారికి తప్పక విజయము గలుగగలదు. అని భండాసురుడు చెప్పగా కుటిలాక్షుడు బలాహకుడు మొదలగు నేడుగురు సేనాపతులను మదముచే నుత్కటువైనవారిని బిలీచేను. మొదట బలాహకుడు తరువాత సూచీముఖుడు (సూదీపంటి మూతి గలవాడు), పాలముఖుడు (బల్లెము వంటి మూతిగలవాడు) వీకర్ణుడు, భీకటాననుడు . కరాలాయువు, కరటకుడు-ఈయేడుగురు పరాక్రమశాలురు, వారు భండాసురునకు నమస్కరించి యుద్ధకౌతూహలముతోనుప్పొంగిరీ. వీరందరు కీకస యొక్క పుత్రులు. సోదరులు ఒకరినొకరవరించిన వారు (రక్షించువారు), ఒండొరులకు సహాయపడువారు. వారు శూన్యక నగరములోనుండి బయలుదేరిరి. మూడు వందల యక్షౌహిణీ సేనాపతులు వారిని వెంబడించిరి. వారు తమ జెండాల సమూహములతో ఆకాశమున మేఘమండలమును వ్రాయుచున్నారు. భయంకర సంగ్రామిణుల పాదాఘాతమున భూతలమును మర్ధించినారు. దుమ్ముల నమూహముతో నమస్త సాగరములనే ద్రాగీవేయనుచున్నారు. అడుగడుగున బేరీ-నీః సాణ-తంపాట్ట(తప్పెటలు)-పణవ ఆనక-ఆది వాద్యములచే ప్రపంచమునంతను శబ్దమయము జేయుచున్నారు. అటువంటి - మూడువందల యక్షౌహిణీ సేనను దీసికొని విశ్వమునంతటను ప్రవేశించుటకా యన్నట్లు కైకసేయులు (కీకసా పుత్రులు) బయలుదేరిరి. కోపముచే నెఱనై, సూర్యమండలమున నుద్దీప్తములైన కంకటములవంటికిరణములుండునట్లు మండుచున్న శస్త్రములధరించి నిక్కబొడిచీకొన్న వెంట్రుకలు గలవారై వారు కదిలి. పూర్వమీ యుద్ధతులు సప్తలోకములను మథించుటకు జగద్విజయకారియైన మహాభండాసురునితోబంపబడీరి. సప్తలోకములవిమర్ధించిన మహాబలులనీ, లలితాసైన్యమును జయింప తలంపుతో దుర్బుద్ధి భండాసురుడు వారిని లలితపైకి బంపేను. వారు గొడుగులు చేతబట్టుకోని రణభూమిలో దూకుచు శక్తిసేన కభిముఖముగా పరువిడిరి. మాటిమాటికి కిలకిలా రావములతో దశదీక్కులను మారు మ్రోగించుచు దేవీసైన్యమున్న చోటికి దండెత్తి వెడలిరి. లలితా దేవి సైన్యముగూడ శస్త్రములతో భయంకరముగా సన్నద్ధమైయున్నది. కుటిలముగా కనుబొమ్మలు ముడిచి నిష్ఠురముగానున్నది. శత్రువునెదుర్కొని పోవనున్నది. ఓ యగస్త్యమునీ! దేవసేనలోని స్త్రీలు పాశములుగలవారు. రోకళ్ళు గలవారు, చక్రములు గలవారును, ముద్గరములు గలవారు, పట్టేశములు గలవారు, విండ్లు గలవారునునై యుండిరి. లలితా సైన్యముననున్న శక్తులు అనేకలు, తీవ్రలు వారు వేలకొలదీగా రాక్షస సముద్రమును త్రాగుటకా యనునట్ల ఒక్కుమ్మడిగా రాక్షసుల మీదబడిరి. అపుడు. క్రూరడానవులుగూడ ఓ దుష్టలారా! పాపినులారా! నీచ వనితలారా! రండి! రండి! మాయతో జడాశయమును చాలావరకు మోహింపజేయు మిమ్ములను. బుసకొట్టు పాములవలె మిక్కలి భయంకరములైన బాణములచే నివ్వేళయమునింటికి బందము. అని శక్తులను భయపెట్టుచు రాక్షసులు యుద్ధముజేసిరీ. ఒకయామె రాక్షసాధిపతి కంఠమును పట్టిశముతో తెగనరికేను. వాని కంఠము నుండి రక్తము ఎగజిమ్మెను. అచట గద్దలు పెక్కుచుట్టుముట్టినవి. ఈ విధముగా నవి యముని గొడుగు రూపమును వహించినవి. ఒక శక్తి శక్తాయుధముతో అచట తనపైకి వచ్చిన రాక్షసుని తలను ఆశక్తిని త్రుంచిన బాణముతో ఖండించెను. ఒకయామె యేనుగనెక్కి దుర్మతియైన యొక రాక్షసుని యెదలో తన యేనుగు దంతాఘాతక్రీడను జరిపించి చంపెను. ఒకయామే (శక్తి) శత్రుభటులెక్కిన యేనుగును కుంభస్థలమున నకస్మాత్తుగా గొట్టిచంపెను, తనచేత ప్రయోగింపబడిన బాణముతో నొక రాక్షసుని ధనుర్ధండమును రెండు ముక్కలుగా జేసి వానిని తన రెండు కనుబొమ్మలకు సమముగా జేసెను. మరొక శక్తి తన వాడి బాణములచేత విరోధులను జంపీ ఖడ్గమును ధరించి పులకాంకురములతో సంతోషమును వ్యక్తీకరించెను . ఒకయామె తన ముద్దరపు దేబ్బలతో విరోధులను చూర్ణము జేసి రథచక్రముల వంటి పిరుదులుగలయామె సంతోషమును వ్యక్తీకరించేను. ఒక యామె తన ఖడ్గముతో ఒక రాక్షస ప్రభువు యొక్క రథపునొగసు ఖండించి తన సంతసమును భూమిపై విస్తరింపజేసెను. శక్తిసేన దానవ సేనలోనికిని, దానవసేన శక్తి సేనలోనికిని జొచ్చినవి. శక్తి దానవులు నీరక్షీరములవలె గలిసి పోరాడుటచే నపుడు యుద్ధము సంకులాకారము వహించినది. శక్తుల కత్తిదెబ్బలకు రాక్షసుల యేనుగుల తొండములు దంతములును తెగిపడిపోయినవి. "అపుడా యేనుగులు మదించిన పెద్ద యడవిపందులవలె గనబడుచున్నవి. ఈ విధముగా వీరుల భయంకర యుద్ధము జరిగినది. దీని యంతమెప్పుడో పిరికి మానవులకు తెలియనంత తీవ్రముగా నున్నది. భయంకర శస్త్రములు భయంకర శస్త్రములతో తలపడుటచే ప్రవేశింపనలవికానిదిగానున్నది-38. యుద్ధదుర్మదుడైన బలాహకుడను రాక్షసాధిపతి సంహారగుప్తమను మహాగ్రుధ్రము (పెదగద్ద)ను ఎక్కీ వివిధమైన యుద్ధమును జేసెను. ఆ గద్ద ముఖము మొదలగునవి వజ్రమువలె వాడిగానున్నవి. యముని దండమువలె నున్నది. దాని జంఘాకాండములలో (పిక్కలో) భయంకర పరాక్రమమున్నది, ముందులేచి యున్నట్లున్నది. పొగవలె ధూసరాకారముగలది. దానిరెక్కల తాకిడి యతి భయంకరమైనది. అది భయంకర ధ్వనులతో రెక్కలను క్రోశార్ధము (క్రోశము) విస్తరింపజేసి యుండ దానిపై నెక్కి బలాహకుడు నానాయుద్దముల జేసెను. అది యగ్నివలె నున్న తన ముక్కునుదెరచి సేనను భక్షించెను. క్రూరములైన - " " కన్నులుగల యా సంహారగుప్తమను మహోగ్రుధ్రము రణమున పైకిలాగిన. ధనస్సును గల బిరాహకుని మోయుచుండెను ఆ మహాగ్రుధ్రము వీపుపై నున్న బలాహకుడు. తన శరీరమును సవరించుకొనుచున్నట్లుగా విదిలించుచు రెక్కలున్న పర్వతముపై నున్న మేఘమువలె ఒప్పుచుండెను. సూచీముఖుడను రాక్షసరాజు సూదివంటి కలరెక్కలుగల కాకవాహనమునెక్కి కఠినమైన సమరమును జేసెను. ఆకాకము. మదించినది పర్వతశిఖరమువలెనున్నది, దండము వంటి ముక్కుగలగినది, యమదండమువలెనున్న పిక్కలతో భయంకరముగా నున్నది. పుష్కలావర్తక, మేఘమువలె నున్నది; బురుదతో సమానమైన కాంతిగలది. క్రోశమాత్రవిశాలములైన రెండు రెక్కలు గలిగినది. సూచీముఖరాక్షసేంద్రు నెక్కించుకొన్నది, కటువుగా నరచునది. అట్టి కాకవాహనము తనముక్కుపొడుపులతో శక్తిసేనల మహామండలమును: మర్ధించుచుండెను, తరువాత ఫాలముఖుడు (ములీకివంటి నోరుగలవాడు) అగు రాక్షసాధిపతి తనయాయుధమైన నాగటికeష్ణను దీసికొని, పర్వతమువలేనున్న రాబండినెక్కి యుద్ధమున బ్రకాశించెను, సేనాపతియైన వికర్ణుడను రాక్షసాధిపతి మహాబలుడై భేరుండ పక్షివాహనమెక్కి భయంకర యుద్ధమును జేసెను. చండకుకట్రము (కోడి) భయంకరమై యుద్ధమున - పట్టిశాయుధమును ధరించిన వికటాననుడను రాక్షసేంద్రునెక్కించుకొనెను. అదీ గర్జించుచు మేడపైని రోమములను (ఈకలను) నిక్కబొడిపించుచు మండుచున్న కన్నులు గలిగి శక్తి సైన్యమును జూచుచు దాని కెదురుగా కదిలేను, కరాలాక్షుడు రాక్షసరాజు ఆఅవ సేనాపతి. మిక్కిలి గొప్పవాడు, వజ్రము వంటి, కఠినమైన ధ్వని గలవాడు. అతడు ప్రేతవాహనుడై కదలెను. శ్మశానమంత్రశూరుడైన యీతడు పూర్వము భూతసమావిష్టమైన ప్రేతమును సంసాధిత (పశము జేసికొనెను. దానినిపుడు రణమున వాహనముగా జేసికొనెను, ఆప్రేతము క్రిందుగా ముఖముగలదీ. పొడవైన బాహువులు గలది. చాచీన పాదములుగలది, ఈ ప్రేతము. వాహనమై కరాలాక్షుని మేసెను. మరొకడు కరటకుడనువాడు దైత్యసేనానాయకుడు. ఈతడు బేతాళ పాహనుడై శక్తుల సైన్యము మర్ధించెను. ఆ వేతాళుడు యోజన విశాలమూర్తియై క్రూరలోచనుడై, శ్మశానభూమిలో నీ మంత్రముతో వశీభూతుడయ్యెను. ఆ మంత్రముచే నాదేశింపబడినవాడై వేతాళులు. శక్తిసేనను మర్దించుచుండెను. ఆవేతాలుని భుజభాగమున నున్న రాజై కరటక. దానవుడు శక్తులతో ననేక విధములుగా యుద్దముజేసెను. ఈ విధముగా నీచాత్ములైన యీ యేడుగురు సేనాపతులు. సప్తసముద్రముల బోలిన వారై యా యుద్ధముస విజృభించి శక్తుల సైన్యమును వ్యాకులము జేసిరీ. వారు పూర్వము. తపస్సుతో సూర్యుని సంతోషింపజేసిరి, వారి తపమునకు సంతసించిన సూర్యుడు - వారికీ వరమునొసంగెను. ఓకీకసాపుత్రులైన మహాభాగులారా! ఇపుడుమీ తపమునకు సంతసించితిని. మీకు భద్రమగుగాక, మీరు వరమునడుగుడు. అనిన, సూర్యుని తపముతో కృశించిన కీకసాపుత్రులు దుర్గాంతమైన యీ వరమును గోరుకొనిరి- యుద్ధములలో మా శత్రువులను దహించునీవు మా నేత్రములలోను కడుపులలోను ఉండవలెను. నీవుమా కన్నులలోనున్నపుడు మేము జూచినదంతయు ఓ ప్రభో నిశ్చేష్టముగావలెను, నీ సాన్నిధ్యముతో బ్రేరేపింపబడిన మాకన్నులతో జూడబడిన విరోధి సైనికులు స్తబ్ద (నిశ్చేష్టమైన) శస్త్రములు గలవారు గావలెను. మాచూపులతో శస్త్రములతోబాటు నిశ్చేష్టులైనచో మాచే సులభముగా జంపబడగలుగుదురు, అని పూర్వము కైకసేయులు సూర్యుని నుండి వరమును బొందిరి. కావున వారు యుద్ధములో మదముతో విజృంభించి చరించిరి. ఆ తరువాత, సూర్యుడావేశించిన కన్నులతో కైకసేయులు యుద్ధమున శక్తులను జూచెను. వెంటనే శస్త్రసమూహములతో బాటు శక్తులు నిశ్చేష్టలై విఫలోత్సాహలైరి. (ఉత్సాహమునకు తగినట్లు చరింపలేకుండిరి). ఆ విధముగా, బలశాలురైన ఏడుగురు కైకసేయులతో శస్త్రసమూహమలతోబాటు నిశ్చేష్టలైన శక్తులే ప్రయత్నమును జేయలేనివారైరీ . ఉద్యమము. (ప్రయత్నము) జేయబూనినను. మిక్కుటమైన శస్త్రస్తంభముతో. -శిరస్కరింపబడినహొరై కేవలము బుసకొట్టుచు సూరకయేయుండిరి, ఆ తరువాత ఈయవకాశమునుబొంది, స్వామిచే నాదేశింపబడి, అనేకాయుధములతో దండెత్తి శక్తి సైన్యమును మరించిరి. ఆ శక్తులుకూడ. శత్రు దైత్య సైన్యముతో నిర్వ్యాపారలుగను నీరాయుధలుగను జేయబడి, వజ్రకవచముల భేదించు వారి బాణములచే క్షుభితలైరీ. దైత్యశాస్త్ర సమూహములతో శక్తుల శరీరములు గుచ్చబడినవి గాయములనుండి రక్తములు గారుచున్నవి. అపుడు యుద్ధముననా శక్తులు చివురాకుతాడిగిన కంకోలలతికవలె బ్రకాశించిరి. నిశ్చేష్టితాయుధలైన యా సమస్తశక్తులు హాహాకారము జేయుచు లలితేశ్వరిని జేరిరి. ఆ తరువాత దండనాథయొక్క ప్రత్యంగరక్షిణియైన తిరస్కరిణికాదేవి దేవ్యాజ్ఞతో రణరంగమున పైకి లేచి బిలిచెను  ఆమె తమోలిప్తమను పేరుగలిగి అన్ని వైపుల ముఖములున్న విమానమునెక్కి మహామాయాశక్తి శక్తులందరికిని అభయము నొసంగెను, ఆమె శ్యామలమైన (నల్లని) యాకారముగలది. శ్యామలమైన కవచము ధరించినది. నల్లని కాంతి గలిగి చీకటీని బూసికొన్నట్లుగా నున్న నల్లని గుఱ్ఱమునెక్కినది, వాసమోహనమనుపేరు గలిగి నారితో మ్రోగుచున్న ధనువును చేత గ్రహించి సింహనాదమును జేసి సర్పముల పంటీ- బాణములను వర్షించెను. నల్లతాచుల కాంతులు గలిగీ, క్రిందరోకలి వలె నుండి, విరజిమ్మబడిన బాణములను రాక్షసులు సహింపలేకుండిరి. బలాహకుడు మొదలగు - ఆ నీచరాక్షసులు. మహామాయాదేవి బాణములచే ఇటునటు మర్దింపబడుచు మిక్కిలి ప్రకోపమును జేంద్రీ. ఆ తరువాత దండనాథయొక్క యాజ్ఞచే ఆ తిరస్కరీణ్యంది: అంధమను మహాస్త్రమును శత్రువుల గణమున వదిలేను, అప్పుడు సూర్యవరోద్ధతులైన బలాహకుడు మొదలగు. నేడుగురు తమ నేత్రములలో చీకటితో గప్పబడిరి. తిరస్కరణికా దేవియొక్క మహామోహన ధనువునుండి బయలు వెడలిన చీకటి చేత వారి కన్నులు బాధజెందినవి. గ్రుడ్డివారుగా జేయబడి పోరేమియు జూడజాలకుండిరి. వారి చూపులకు విఘాతము గలుగుటచే వీరి శస్త్రస్తంభము - వీడినది. ఆశక్తులు సింహనాదము జేసిరి. చేతులతో నాయుధములనెత్తి దైత్యుల జప సమర సన్నాహము జేసిరి మహాబలిష్ణురాలైన . తిరస్కరిణీదేవిని ముందుంచుకొని చక్కని యుపాయము లభించుటచే మిక్కిలి సంతసించి యుద్ధము జేసిరి. ఓ మహాభాగురాలవైన తిరస్కరణికాంబికా! బాగు! బాగు! ఈ దురాత్ములైన శత్రువులకు తగిన తిరస్కారము జేసితివి.. అదీ యుక్తము. నీవు దుర్జనుల నేత్రములను తిరస్కరింపజేయు (చూపు ప్రసరింపనట్లు చేయు) గోప్ప యౌషధివి. ఈ రాక్షస సమూహము (చక్రము) నీ చేత నరికట్టబడిన చూపుగలదైనది, అజేయులమైన మాబోటి వారలకే, వీరు ష్యసనము. గలగజేసిరి. కాని ఓదేవీ! నీవు దానినడ్డగించి యీ దేవకార్యమును చక్కగా నిర్వహించితివీ. కావున నీ చేతనే దురాచారులగు నేడుగురు మహాసురులు చంపబడుట వీని లలితాదేవి మిక్కిలి సంతసింపగలదు. నీ విట్లు చేయుటచే దండిని సంతసింపగలదు. మహాభాగయైన మంత్రిణి కూడ మిక్కిలియానంద మందగలదు కావున నీవే యీ యేడుగురిని రణరంగమున జంపుము. వీరి సైన్యము నంతటిని మాత్రము ఆయుధముల నెత్తిపోయి మేము నశింపజేయగలము. అని శక్తులు ప్రేరేపింపగా తిరస్కరణీకాంబిక యుద్ధకౌతుకమున తమోలిప్తమైన రథముతో బిలాహక బలముపై " దాడి వెడలేను." తమ పైకి వచ్చుచున్న యామెను జూచి యా యేడుగురు రాక్షసాధములు వెంటనే మరల తమకు సూర్యుడిచ్చిన వరమును స్మరించిరీ. చూచిన వారిని నశింపజేయు సూర్యతేజము పోరినేత్రములలో ప్రవేశించినను అది తిరస్కరణి తేజముతో తిరస్కరింపబడినది. సూర్యపరదానము చేతను అస్త్రముల చేతను శత్రువులపై కోపము చేతను కన్ను మిన్నుగానక గ్రుడ్డిదైన వాడును, మహాబల పరాక్రమవంతుడును, అస్త్రము చేతను రోషము చేత (కోపము చేత నాలోచనము గూడపోవుటచేతను గ్రుడ్డివాడైన బలోహకుడను మహాసురునీ సిగబట్టి డి యంతర్గదేవత తన కత్తితో కుత్తకను గత్తిరించెను. వానీవాహనమైన గ్రద్దయొక్క

శిరమును బాణముతో తెగవేసినది. తరువాత తిరస్కరణికాదేవి సూచీముఖునీ కభిముగా వెళ్లెను. ఆతని పట్టి శాయుధముతో కఠినమైన ". శిరమును ఖండించెను, మెల్లగా తక్కినయైదుగురిని కగూడ జంపివేచెను. అప్పుడే తిరసురణి దేవత ఆ యేడుగురి తలలును ఒండొంటి కేశముతో మాల లేడు యా ముండమాలను కంఠమున ధరించి పెద్దగా నాదము జేసేస్తు, శక్తులు క్రోధమూర్వీతలై సమస్త రాక్షససైన్యమును, జంపి వారి రక్తములతో నదులను బ్రవహింపజేసిరీ, మహామాయాంబిక చేసిన దిలాహక సైన్యముల దృష్టిరోధన వైభవమున గొప్పయాశ్చర్యము గలిగెను. శక్తులు చంపగా మీగిలిన కొందరు మిక్కిలి భయముతో వ్యాకులురై మిక్కిలి యార్తి జెంది యేడ్చుచు శూన్యకేశ్వరుడైన భండాసురుని శరణము బొందిరీ. దండినిని మహామాయను మాటిమాటికి ప్రశంసించిరి. ఏలనన వారు ఆమహా మాయయొక్క కంటినుండి యనుగ్రహమును బొంది తీకి సంతసించిరి అటనున్న శక్తులందరును తమ తలలూపుచు బాగు బాగు అని తిరస్కరణికాదేవిని అడుగడుగున బొగిడిరి.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరఖండమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యానమున బలాహకాదీసప్తసేనాపతివధమను నిరువదినాల్గవ యధ్యాయము.