బ్రహ్మాండ మహా పురాణము
38 - మంత్రరాజసాధనప్రకారకధనం
అగస్త్య ఉవాచ :
అగస్త్యుడనెను : దేవి యొక్క గొప్పనైన ఆవిర్భావము మొదలగు మహావృత్తమును భండాసరువధయు, శ్రీనగరమున నామేయునికియు వింటిని-1. ఇప్పుడామే మంత్రముయొక్క సాధనమును. ఆమంత్రముల యొక్క లక్షణమును ఇదియంతయు దెలుపుము.
హయగ్రీవుడనేను : ఓ మునీ! అన్ని పదార్థముల కన్న శబ్దము గొప్పది. అన్ని శబ్దములకంటే వేదరాశి గొప్పది-3, సర్వవేదములలో వేదమంత్రములు గొప్పవి. సర్వమంత్రములలో విష్ణుమంత్రములు గొప్పవి-4 వానికంటె దుర్గామంత్రములు గొప్పవి. వానికన్న గణపత మంత్రములు మిక్కిలి వీర్యవంతములు. వానికన్న లక్ష్మీ మంత్రములు, వానీకన్న సరస్వతి మంత్రములు శ్రేష్ఠములు-6. వానికన్న గిరిజా (పార్వతీ) మంత్రములు, వానీకన్న ఆమ్నాయ భేదమున గలిగిన మంత్రములు, సర్వామ్నాయ మంత్రముల కన్న వరాహ మంత్రములు - శ్రేష్టములు-7. వానీకన్న శ్యామా మంత్రములు శ్రేష్ఠములు విశిష్టములు. ఓ ఇల్వల సంహారీ! వానికన్న పది విభేదములుగల లలితా మంత్రములు శ్రేష్ఠములు-8. వానిలో రెండు మంత్రరాజములు. వరిష్టములు. ఓ వింధ్యగర్వాపహారీ! అవి లోపాముద్ర-కొమారాజములుగా ఐసిద్దీకెందినవి-9. ప్రహాదియైనది (హ్ర(హ)వర్ణము మొదటనున్నది)(2) లోపాముద్రమంత్రము. కాదికయైనది (కవర్ణము మొదటనున్నది) 10. అవీ హంసాదులకు వాచ్యమును (అర్థమును బొందినవి. కామరాజు మహేశ్వరుడు. దేవియేన లలితాంబిక స్మరాదులకు వాచ్యత్వమును (అర్థమగుటను) బొందినది. హాది మంత్రమునకును కాది మంత్రమునకును మూడు వర్ణముల వలన - కలిగినదే భేదము ఏ ఈహ -11: ఆరెంటిలో కామరాజమను నీమంత్రము భక్తితో నొప్పినవారికి సిద్దినిచ్చునది. 18వునిచే (క) (5) శక్తిచే(ఏ),కామునిచే (ఈ), క్షితిచే(ల),మాయచే(హ్రీం), హంసచే (హ), భృగువుచేస), కామునిచే (క) శశిమౌళిచే(హ), శుక్రునిచే(ల), భువనేశునిచే (ప్రీం), చంద్రునిచే (స), మనోభవునిచే (క) క్షితిచే (ల), హృల్లేఖచే (హ్రీం) క ఏ ఈ ల హ్రీం, హసకహలహీం, సకలహీం-అనుమంత్రము నూతనమంత్రముగా సౌందర్యలహరిలో 32 పద్యముయొక్క (వావిళ్ల ప్రతి) వారి వ్యాఖ్యలో నుట్టింకింపబడినది. ఆదీయిచట సరిపోవుచున్నది.. కావున హంసరాజమం త్రమదియే నేమో! పాఠకులు ఉపాసకులు సరిచూచుకొందురుగాక) హంసాది మంత్రరాజము చెప్పబడినది. కామాది మంత్రరాజమైతే (1) స్కర (ఐం), యోని (హ్రీం) శ్రీ (శ్రీం)లు. (2) హాదియైనది (హవర్ణము మొదటనున్నది. హసకహల హ్రీం, సకలహీం-అనునది) (3) క. ఏ ఈల హ్రీం, హసకహల హ్రీం, సకల. హీం - అనునది. ముఖమునందుండును-14 లలితాంబను ప్రవచించు పంచత్రిక మహావిద్య యగునీ మంత్రమును బూజించిన భాగ్యవంతులకు సర్వత్ర సిద్దికలుగును-15, మూడైదు వర్ణములతో పరిష్కృతమైన యీ మంత్రమును (పంచదశిని) సద్గురువు నుండి పొంది విద్వాంసుడైనవాడు చెప్పబోవు ప్రకారమున చక్కగా సాధింపవలెను-16. దానిని క్రముగా జెప్పెదను, ఓ మునీ! సావధానుడవై వినుము.. ప్రొద్దుననే లేచి, ఉజ్జ్వలమై వేయిదళములశోభగూడి, కింజల్కములు మధ్యన దుద్దును గలిగిన కమలమును శిరముననున్నట్లు తలంపవలెను. అచట (ఆ కమలమున) ప్రసన్నుడు కరుణామయుడైన శ్రీమద్గురువును ధ్యానింపవలెను-17, 18. తరువాత వెలుపలికి వచ్చి శౌచాదిక క్రియలను - నిర్వర్తింపవలె. తరువాత వచ్చి పరిమళవంతమైన తైలమును శరీరమునకుపట్టించి-19. శుద్ధమైన వేడినీళ్లతో సాన్నముజేయవలె సహజముగనే జలములు పవిత్రములు. ఇక కాచిన నీళ్ల విషయమున జెప్పబనిలేదు. కావున వేడినీటితో స్నానము జేయవలె. అది లేనిచో దొరికిన నీటితో స్నానము జేయవలె-20. శుద్ధములై కుసుమపూవువలె లేయెరుపువిగాని యెల్లనివిగానీయైన రెండు వస్త్రములను (క్రిందివస్త్రము పైవస్త్రము) గప్పుకొనవలె. ఆచమనముజేసి నీయతుడై విద్వాంసుడై హృదయమున పరాంబికను ధ్యానము జేయవలె-21. ఊర్ధ్వ పుండ్రమునుగాని (నొద్దుట నిలువుగా రేఖలతో బెట్టుకొనుబొట్టు, గంధముతోగానీ కుంకుమతోగాని) త్రిపుండ్రమునుగాని (అడ్డముగా నొదుట మూడు భస్మరేఖలుగాని), పట్టవర్ధనము గాని వైష్ణవులునొదుటబెట్టు -తిరుమణికాపు నామములుగాని, అగస్త్య పత్రాకారపు (అగిసే యాకు ఆకారపు) బొట్టుగాని తమ మతానుసారముగా నొదుట బెట్టుకొనవలెను. చాటుగా (ఏకాంతుడుగా)నుండి శుద్దాత్ముడై సంధ్యావందనము జేయవలె-42. ధర్భలు అక్షతలు పూవులు చందనమును గలిపిన నీరుగల రాగియాకునాకారమున నుండు చెంబుతో సూర్యునకు. అర్ఘ్యమునెత్తి విడువవలె-43. . ఆ విధముగా నర్ఘ్యభావదేవతయైనందున (సూర్య స్వరూపిణియైనందున) లలితాదేవికి మూర్యములిచ్చి, యథాశక్తిగా మూలమంత్రముతో లలితేశ్వరికి తర్పణమొసగవలె-24. దేవగణమునకు, ఋషిగుణమునకు పితృవర్గమునకు విధి విధానముగా తర్పణముజేయవలె. సూర్యునకును సూర్యబింబగతమైన దేవికిని ఎదురుగా నిలిచి ఉపస్థానము జేయవలె. (సూర్యోపస్థానమంత్రముల పఠించవలె)-27. మౌనమువహించీ, విశుద్ధహృదయుడై ముఖమందిరమున బ్రవేశించవలె, సుందరమైన కర్పూర, చందనాదులను బూసికొనవలె-26, అలంకారములతో శరీరమునలంకరించుకొనవలె. మంచి శృంగారవేషమును ధరింపవలె. సుగంధపుషములచే తలవెంట్రుకలనలంకరించుకొనవలె-27. లేదా చక్కని సొమ్ముల ధరించినట్లుగా భావింపవలె లేదా తనయైశ్వర్యముకొలదీయైన నలంకరించుకొనవలె. పూజాఖండమున జెప్పబోవు విధముగా న్యాసాదులను క్రమముగాజేసి-28. మొత్తనియాసనమున గూర్చొని మహాశ్రీనగరమును ధ్యానింపవలె. అనేక వృక్షములు గల మహోద్యానము మొదలుకొని లలితాదేవి వరకుగల-29. దివ్యమైన శ్రీనగరమును ధ్యానింపవలె. బహిరంతస్సులలో శుచియై పూజాఖండములో జెప్పిన విధముగా పూజించి విలక్షణుడై (విశిష్టస్థితినంది)-30. అక్షమాలను (అనుండి క్షవరకు గల వర్ణములను ఒక్కొక్షపూసయందు ఉచ్చరించుచు ప్రతిష్టించిన స్ఫటికాదిమాలను) దీసికొని తూరుపుమొగమై కాని ఉత్తరము మొగమైగాని కర్పూరముతోను. కస్తూరితోను సువాసితయైన సింహాసనేశ్వరిని జపింపవలె. ముప్పదియాఱు లక్షల జపముతో విద్యా(మంత్ర) రూపిణి ప్రసన్నురాలగును-31. దానిదశాంశము హోమముజేయవలె. దానిలోని - దశాంశము తర్పణము జేయవలె. దానిలో దశాంశము బ్రాహ్మణ భోజనము జేయింపవలె అని చెప్పబడినది-32.
ఈ విధముగా సిద్ధమంత్రుడై యాతడు మరల కామ్యమైన జపమును జేయవలె, లక్ష జపించి మనుష్యుల వశపఱచుకొనును-33. రెండు లక్షల జపమున: సమస్త స్త్రీలను వశపచుకొనును. మూడు లక్షల జపమున సమస్త రాజుల వశపచుకొనును-84. నాలుగు. - లక్షల జపమున నాగకన్యకలు క్షోభజెందుదురు, ఐదు లక్షల జపమున పాతాళసీలందరు వశమగుదురు -5. ఆు లక్షల జపమున భూలోక సుందరీ వర్గము వశమగును. ఏడు లక్షల జపమున స్వర్గలోకపుమచ్చెకంటులు క్షోభజెందుదురు-36: ఎనిమిది లక్షల జపమున దేవయోనిభవులందరు వశముగుదురు, తొమ్మిది లక్షల జపమున సమస్త గీర్వాణులను (దేవతలను) వశపరచుకొనును-37. పదునొకండు లక్షల జపమున బ్రహ్మవిష్ణుమహేశ్వరులను, పండ్రెండులక్షల జసమున అష్టసిద్ధులను వశపచుకొనును.
ఈ మంత్రమున పూర్వమున ఇంద్రునకింద్రత్వము వచ్చినది. విష్ణువునకు విష్ణుత్వము, శివునకు శివత్వమును వచ్చినవి-39. చంద్రునకు చంద్రత్వము, సూర్యునకు సూర్యత్వమును ఈ మంత్రము చేతనే వచ్చినవి. సమస్త దేవతలకును ఆయా ఉజ్జల్వములైన సిద్ధులు ఈ మంత్రముననే వచ్చినవి-అని తెలియుము-40.
ఈ మంత్రమును జపించువాడు సర్వపాపముల విడివడినవాడు. త్రిలోక సుందరాకారుడు. మన్మధునకుగూడ మోహమును గలుగజేయువాడు-41. సర్వసిద్ధులు చేరినవాడు. సర్వము దెలిసినవాడు. సర్వులు పూజించినవాడు. దర్శనమాత్రమున అందరి లోటులను పూరించువాడు-42. మాటలో బృహస్పతి సముడు. సంపదలో శ్రీపతి (విష్ణు) సముడు. ఐలమున వాయుసముడు. స్థిరత్వమున హిమాలయసముడు-43. ఎత్తున మేరు పర్వతసమానుడు. గాంభీర్యమున మహాసముద్ర సముడు, తన యాకారముతో గ్రామములలో, పల్లెలలో, పురములలోను (స్త్రీలలో) క్షోభమును గలుగజేయువాడు-44. కొద్దిపాటి బొమ్మముడితో దుష్టులను స్తంభింపజేయువాడు విజృంభింపజేయువాడు, ఉచ్చాటనముజేయువాడు, మోహింపజేయువాడు చీవరకు చంపువాడును-45, కోపించినవాడుగూడ అతని దర్శనమున సంతసించి హఠాత్తుగా ప్రసన్నుడగును. పదునెనిమిది విద్యలలో నిరూఢమైన పటిమను బొందును-46. అతని మాట గంగా ప్రవాహము వలె మధురమైయడు లేక సాగుచుండును. సర్వశాస్త్రములలో అతనికి తెలియనిదేదియునుండదు-47. సమస్త తత్త్వశాస్త్రములను రచించుటకుగాని ఖండించుటకు గాని యాతడు సమర్థుడు. సమస్తమైన తత్త్వమును దెలియును. సర్వజ్ఞత్వమును బొందును - 48, అతని హృదయము సర్వజంతువులయందును దయార్థమైయుండును. ఈ జగత్రయముగూడ అతనికోపాగ్నికి విషయముగాలదు-49.
అతనిని దర్శించు సమయమున లేడికన్నులు గల సుందరాంగులకు కోకముడులు విచ్చుకొనును. మొలనూళ్ళు కుండల సమూహములు జారిపడును-50. చెమటబిందువుల వరుసలు వారి శరీరములపై ముత్యాలవరుసలుగా నలంకరించును, వారి వాలు కన్నుల కొనలు మిక్కుటమైన రాగమున చంచలములగుచుండును-51, కమలమువలె నున్న వారి చేతులనుండి మణికంకణముల, జారిపడును. ఊరుస్తంభముతో (తొడలు స్తంభీభావము జెందుటచే) కదలకుందురు. సిగ్గు చేతలవంచుకొందురు -52. వారియోనులు ద్రవీభావము జెందును. కామభావనతోవారు పూర్వముకంటే వేరుగా మరొక యాకారముదాల్చినట్లుందురు -53, రాగజ్వాలాసమూహములతో మండిపోవుచుందురు. మన్మథబాణాగ్నివరముచే మండిపోవుచుందురు -54. ఉత్కంఠతో పీడింపబడుచుందురు. వేడిక్కిన శరీరముతో దుఃఖించుచుందురు. శ్రమజలములచేత తడిసిపోవుచుందురు సిగ్గుచే (అడ్డగుచున్నదని) దుఃఖించుచుందురు. -55, కులమును, జాతిని, శీలమును, లజ్ఞను, కుటుంబమును, లోకమువలనీభయమును, బంధువులవలనీ భయమును, పరలోక భయమును వదులుచు హృదయమున నాలలితామంత్ర జపము చేసినవాని కోరుచుందురు. వాడరణ్యమునగాని, పత్తనమునగానీ, దేవాలయమఠములందుగాని మరెచ్చటనున్నును ఈ లేడి కన్నుల వన్నెలాడులు వాని వెంట పరుగిడుచుందురు. -52. నీట గట్టిగా కొట్టిన నీటి బిందువులు భ్రమించునట్లే లలితామంత్రము జపించినవానిని జూడగనే (చక్కని కనుబొమ్మలు గల) స్త్రీలయొక్క చిత్తములు భ్రమించును -58. వినీతావినీతుల వీర్రావణమే (కరిగి యేకమైపోవుటయే) ఫలముగా గల యా లలితామంత్రజప్తను సమస్త విద్యలు వరుసగా సేవించును. (సమస్తవిద్యలాతనిని కోరికోరి. చేరును) - 59, ఓమునీ లలితా జాపకుని దర్శనమున సూర్యచంద్రులు స్తనమండలములుగా బ్రకాశించు త్రిలోకలలన (ముజ్జగమనుసుందరి) వానియందనురక్తురాలగును ఇక యితర చిల్లర స్త్రీల విషయము చెప్పవలెనా ఇట సౌందర్యలహరిలోని నరం వరీమాంసం నయనవిరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధవంతి శతశః గళద్వేజీడీబంధాః కుచకలవీశ్రస్తసిచయా? హఠాత్త్యుత్కాంచో విగళితదుకూలా యువతయః అను పద్యము ఏతన్మూలకమాయనిపించును. పత్తనములలో, వీధులలో, చౌరస్తాలలో, వనములలో, పుణ్యమైన ఆతని కీర్తి హోషణ యెల్లప్పుడు కల్పవృక్షమగును. (ఆతనిస్తుతి కోరికల నీడెర్చును) -61. ఆతని దర్శనమున పాపులపాపజాలములు నశించును. కవిపుంగవులు ఆతని గుణములనే ఘోషింతురు. -62, ఆయావర్ణములతో, ఆయాయాయుధములతో, ఆయావాహనభూషణములతో మహాదేవిని ధ్యానించిన యాయాజనులకు ఆయాసిద్దులు. లభించును. -63. మంత్రము యొక్క మొదటి ఖండము మల్లెమొగ్గవలెను. చంద్రునవలెను తెల్లని కాంతిగల దేవీ స్వరూపము. దానిని అపశ్చక్రమున మండుచున్న జ్వాలలుగల దానినిగా మూలకమున ధ్యానింపవలె. ఇక మంత్రముయొక్క రెండవఖండము ఆర్ర పురుగులవలె కుంకుమవర్ణమైన దేవీ స్వరూపము. దానిని ఆహశ్చక్రమున వెంట్రుకల : చివరివరకు మండుచున్న జ్వాలలుగలదానీనిగా ధ్యానింపవలె. తరువాత మంత్రము యొక్క మూడవ ఖండము సర్వపాపనాశనమైనది, దానిని వెంట్రుకల మొదటిలోనున్న రెండుదళములుగల పద్మముయొక్క గుహలో ముక్తిస్వరూపిణియై వెన్నెలవలె తెల్లనియాకారముగల అంబికను ధ్యానింపవలె. వశీకరణ కర్మలో రక్త సంధ్యాకాంతిగలదిగా ధ్యానింపదగినది-67. సర్వసంపత్తిని పొందగోరినప్పుడు శ్వామలాంగినీ - ధ్యానింపవలె. “మూకీ కరణమున (మూగవారిని జేయుటకు) నీలవర్ణగా ధ్యానిషవలె.. స్తంభింపజేయుటకు పసుపుపచ్చని వర్ణములో ధ్యానింపవలె -68. కవిత్వమునకై స్ఫటికముపలె తెల్లని యాకారములో ధ్యానింపవలె. ధనలాభమునకై, లలితాంబికను సువర్ణవర్ణగా ధ్యానింపవలె. “69, మూలము మొదలుకొని (మూలాధారము మొదలుకొని) బ్రహ్మబిలమువలకు (సహస్రార బ్రహ్మరంధ్రమువరకు) - జ్వలించు మణి ద్వీపమువలె ఆ లలితా దేవి తేజఃపుంజమును ధ్యానించువారు చక్కగా సిద్ధించిన సిద్ధులు గలపోరగుదురు -70. ఓ అగస్త్యమునీ! ఈ విధముగా బహువిధములైన ధ్యానభేదములతో శ్రీదేవిని ధ్యానించిచూచువారు - మహాసంపల్లక్ష్మిని బొందగలరు. సజ్జనులేయీమెను బొందగలరు. దుర్జనులామెను బొందలేరు -71. తీవ్రమైన తపము జేయువారే యామినాత్మలో ధ్యానింపగలరు. ఆట్లుధ్యాతకు మరుజన్మయుండదు. ధ్యానమున శంకరాత్మభావమునందనిపోడు లలితా పరమేశ్వరిని ఆమేవిద్యను బోందలేడు. -72. వంశములో నేయొక్కడైనను లలితామంత్ర జపియైనచో ఆవంశమువారందరును తృప్తులు ముక్తులునగుదురు. సంశయములేదు. -73. ఈ మంత్రము సర్వశాస్త్రములలో రహస్యాతిరహస్యమైనదని నిశ్చయింపబడినది. వేదములు సమస్త శాస్త్రములును. లలితా పరమేశ్వరిని స్తుతించును. -74. ఈమెయే పరమాత్మ ఈమెయే పరాగతి. ఈమెయే మహాతీర్థము. ఈమెయే మహాస్థలము -75, మునులీమెను - గానము జేయుదురు. సనకాదులీమెను ధ్యానింతురు. బ్రహ్మాదులు ఈపంచసిద్ధులనిచ్చు లలితాదేవినర్చింతురు -76. కుచరిత్రులు కుత్సితులు, . కుటిలాశయులు, దైవబాహ్యులు, వృధాతర్కము జేయువారు. విభ్రమించిన బుద్దీగల వారు -77. నష్టు (స్వధర్మనష్టులు)లు, శీలహీనులు, ఉచ్చిష్టులు (తిరసరింపబడినవారు), కులభ్రష్టులు, నీష్ణులు (కఠినులు), దేవదర్శనమును ద్వేషించుపోరు, పాపస్వభావులు, ఆచారనిందకులు,-78. ఉద్దతులు (ఎగసిపడు వారు) ఉర్దతాలాపులు (గొప్పలు ఏలుకువారు) దాంభికులు లేనిగొప్పతనమును ప్రదర్శించువారు) అమానులు (మిక్కిలియభిమానము గలవారు) ఇటువంటి మర్యులుగాని దేవతలుగాని లలితాదేవిని బొందలేరు. -79. ఓమునీ, ఈమె దేవతలుగూడ పూజింపదగినదని చెప్పబడినది. ఈమె భండాసుర వధకై జ్ఞానాగ్ని నుండి పుట్టినది-80, మహాత్రిపురసుందరి యొక్క మూర్తీ తేజస్సుతో విజృంభించియుండును. బ్రహ్మ కామాక్షిని లలితగానే బ్రస్తుతించెను.... పరాదేవియైన లలితాంబికను ధ్యానించు సదాశివుని యొక్క మనస్సును లాలించుటచే నామొలలితయైనది --81,82 ఆమె చేసిన దంతయు నివేదింపబడినది. శాసోక్తమార్గమున ఆమె పుజావిధానము నంతటిని మహాద్భుతమైన యామె విలాసమును ఖండాంతరమున చెప్పేదను-83.
ఇది శ్రీబ్రహ్మండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున మంత్రరాజసాధనప్రకారకథనమను ముప్పదియెనిమిదవయధ్యాయము 38.
Summary of chapter 150 of the Brahmānda Mahā Purana is as follows:
This sacred chapter introduces the Śrī Lalitā Trishatī Stotra, a highly potent hymn comprising three hundred divine names organized around the fifteen syllables of the Pañcadashākṣarī mantra. It presents the esoteric conversation where lord Hayagrīva imparts this most secret stotra to sage Agastya after seeing his total devotion. The seeking practitioner approaches this hymn with utmost purity, realizing it as a direct key to unlocking the deepest mysteries of Sri Vidyā.