బ్రహ్మాండ మహా పురాణము
4 - జయాభివ్యాహారము - (జయలను దేవతలను శపించుట)
సూతుఁడిట్లు చెప్పెను.
(ఈ ప్రకరణము యొక్క అభిప్రాయమిది. ఒకే వర్గమునకు చెందిన దేవతలు ప్రతి మన్వంతరమున పుట్టుదురు. ఆధిపత్యము వహింతురు. దీనికి కారణము ఈ పురాణ కర్తయిట్లు చెప్పుచున్నాఁడు. మొదటీ మన్వంతరమున ‘జయ’ అను దేవతావర్గము భగవదోజ్ఞను పాటించి ప్రజాసృష్టి నొనరింపలేదు. వారు మోక్ష మార్గము నవలంబించిరి. అందుచే బ్రహ్మ వారలను ప్రతి మన్వంతరమున 7 సార్లు జన్మించవలయునని శపించెను. ఇప్పటి మన్వంతరమువరకు అది వైవస్వత మన్వంతరము. అందుచే ప్రతి మన్వంతరమునను 'జయ'లను ఏడు వర్గముల దేవతలు పుట్టిరి. జయవర్గము -1 (పురాణముల ననుసరించి) యాములు, (స్వాయంభువ మన్వంతరమున) 2. తుషితులు - (స్వారోచిషమున) 3. సత్యులు (ఉత్తమమన్వంతరమున) 4. హరులు (తామస మన్వంతరమున) 5. వైకుందులు వైవస్వత మన్వంతరమున) 6. సాధ్యులు - చాక్షుష మన్వంతరమున, 7. ఆతిథ్యులు - వైవస్వతమన్వంతరమున) జయదేవతలు బ్రహ్మయొక్క ముఖము నుండీ, ప్రజల సృష్టింపవలయునను కోరికతో సృజింపం బడిరి. వారందరు భిన్నభిన్న మన్వంతరములలో 'మంత్రము'లే శరీరముగా గలవారు (వారు మంత్ర శరీరులు). దర్శలు, పూర్ణమాసలు, బృహత్తులు, సామములు, రథంతరములు. చేతులు, సుచీతులు, ఆకూతులు, కూతులు, (2) విజ్ఞాతలు, విజ్ఞాతలు, మనస్సులు యజ్ఞములు అను 12 గురు వివాహమాడి భార్యను గ్రహించి అగ్నిహోత్రములను పాటించుకొనుచు మీ యజ్ఞముల నాచరింపుడు. జయదేవతలతో ఇట్లాడి అచ్చటనే ఆ ప్రభువు అంతర్జానుఁడయ్యెను. అంత వారు (ఆజయలు) పరమేష్టియయిన బ్రహ్మవాక్కులను అంగీకరింపలేదు. (4) కర్మల యందు దోషమును గమనించి, వారు కర్మలు విసర్జించిరి. వాసనలను గూడ పరిత్యజించిరి. (వాసనలు - కోరికలు - లేదా అజ్ఞాత లోకాభీ రుచులు. వాసనలు కర్మసంజాతములు. వారు యమాది సాధన చతుష్టయమునకు సంయుక్తులయిరి. కర్మల ఫలము క్షయాతిశయ యుక్తము - (నాశనముతో నధికముగా గూడినవి). ప్రసూతి విషయమున (సంతాన విషయమున- ప్రజాసృష్టి) జుగుప్సావంతులయిరి. వారు నిస్సత్తులయిరి, నిర్మములు (వాంఛారహితులు) నయిరి. వారు జన్మరాహిత్యమును కాంక్షించిరి. కర్మలాచరించుట వలనఁగలుగు దోషదర్శనముచే కర్మపరీత్యాగము చేసిరి, వారు అర్ధ,కామములను ధర్మమును విసర్జించిరి. తురీయ పురుషార్థమయిన మోక్షమునందు వ్యవస్థితులైరి. (7) వారు పరమమైన జ్ఞానము పొంది, దానిని సంక్షిప్త మొనరించి యందే సుసంస్థితులయిరి. (8) వారి యభిప్రాయమును గ్రహించి బ్రహ్మ కుపితుఁడయ్యెను. తరువాత నిరుత్సాహవంతులయిన దేవతలను చూచి, బ్రహ్మ “మీరందరు పూర్వము నాచే ప్రజా సృజనార్థము సృజింపఁబడితిరి. మరియొక దానికి కాదు. అధికముగా ప్రజలను కనుఁడు. యజ్ఞములను విశేషముగా చేయుఁడు. అంతియేకాక ఇంతకు పూర్వము మీకిది చెప్పియే యుంటిని”. మీరు నా వాక్యమును అనాదరించీతీరి, వైరాగ్యమును స్వీకరించితిరి. మీరు మీ జన్మlడ జుగుప్సావంతులయితిరి. సంతానము నభినందింప కుంటిరి. మీరు కర్మలయందు అకృతాభ్యాసులు. దీనికి కారణము మీ మోక్షేచ్ఛ. అందుచే మీకు ఏడు పర్యాయములు జన్మములు కలుగును” అనెను. (11) ఈ విధముగా ఆ జయదేవతలు బ్రహ్మచే శపింపఁబడి, ఆ బ్రహ్మను ప్రసన్నుని చేసికొనిరి. “ఓ మహాదేవ! అజ్ఞానజములయిన మా దోషములను క్షమించుము”. అని ప్రార్థించిరి. వారందరు బ్రహ్మకు సాష్టాంగప్రణామమాచరించి, తనముందు మోకరిల్లిన వారిని చూచి బ్రహ్మ సానునయముగా నిట్లనెను. ప్రపంచమున ప్రతివ్యక్తి ప్రతివస్తువును ఒక పరిమితికి (హద్దుకు) లోనే అనుభవింపవలయును. అంతియేకాని, కర్మబంధముల నుండి యెవ్వడు స్వాతంత్ర్యమనుభవించును? అంతయు నాచే వ్యాప్తమయి యున్నది. ఎల్లవారు ప్రపంచమున మంచిదియో చెడ్డదియో నా యిచ్ఛానుసారముకాక వేరుగా నెట్లు ఆచరింపఁగలరు? శుభవంతముకాని అన్యముకాని ఈ ప్రపంచమున నున్న యెల్ల పదార్థము, బుద్యాత్ముం డనైన నాచే పరివ్యాప్తమై యున్నది. (15)
సర్వము నాకెఱుక. లోకమున నెవ్వఁడు నన్ను దాటి పోవంగలుగును? భూతములు కోరునట్టిది నేనేఱుఁగుదును. ఆ భూతములు ఊహించినది యెఱుంగుదును. వారు దేని నాచరించుదురో అదియు కూడ నెంగుదును. స్థావర జంగమాత్మకమయిన యీ సర్వజగత్తు ఆశా మయమయిన బంధముచే నాచే నీగళింపఁబడినది. ఎవ్వఁడు దీనిని ఛేదింపగుత్సహించును? దృవుఁడయినవాఁడు గర్వాంధుఁడు) తనతో సర్వార్థముల గ్రహించి పోఁదలంచును. కర్మల నాచరింప మొదలుపెట్టక స్వతంత్రవిధాన మోక్షము పొందగోరును. ఆ జయాది దేవతలతో నీ విధముగా సంభాషించెను. జయాది దేవతలో ఆధ్యాత్మచేతస్కులు. వారల మరల వీక్షించి బ్రహ్మ జయాదులందరును నీచముగా దండ్యార్థులు. ఓ దేవతలారా! నాతో చెప్పకయే మీరు మోక్షాభిప్రాయమును (సన్న్యాసము నందు అభిరతిని) వహించితిరి. అందుచే నాచే వీపులమయిన కార్యాచరణము ఆచరింపఁబడినది. ఇయ్యది మీకు సుఖోదరముగా పరిణమించుత. ఆ భావము దివ్యత్వముచే పుట్టునుగాక. (21) ఓ సురో త్తములారా ! మీ మీ యిచ్చానుకూలముగా (తదాత్మీయ ఛందేన) జన్మమగుగాక. ఏడు మన్వంతరములయందు మీరు సీదులుగా ఆవర్బివింతురు. ఆ మన్వంతరములు స్వాయంభువ మన్వంతరములో ఆరంభమయి వైవస్వత మన్వంతరముతో సమాప్తము నొందును. ఇట్లు చెప్పి బ్రహ్మ పురాతనమైన యొక శ్లోకమును వినిపించెను. (23) “మూఁడు వేదములు, బ్రహ్మమయప్రసూతి. శ్రాద్ధము, తపము యజ్ఞము, అనుప్రదానము (కానుక (దానము) లొసంగుట, వీనితో నిత్యమయిన రజోగుణముతో ప్రభువు కూడియుండును (?) ఈ విధముగా విభుఁడు శ్లోకార్థమును చెప్పి జయాది దేవతలతో ఇట్లు పలికెను. (అర్థమును కూడ వివరించిన పిమ్మట) మీరందరు వైవస్వత మన్వంతరము గతించిన తర్వాత నా సమీపమునకు వచ్చెదరు.” అని చెప్పి అకుతోభయుఁడు (ఎందు, ఎవరి వలనను భయమన్నది లేని ప్రభువు బ్రహ్మ అయిన బ్రహ్మ అంతర్థానము నొందెను, ఆ బ్రహ్మ ఆద్యమయిన ధారణమును వహించి యోగబలాన్వితుఁడై తిరోహితుఁడయ్యెను. (26) అంత పండ్రెండుగురయిన అజితులు కోపముతో శపింపఁ బ్రడిరి. ఈ విధముగా జయులు (విజయులు) అనీ ఖ్యాతి పొందిన జయాదులు పరాజితులయిరి. (27) స్వాయంభువ మన్వంతరము గడచిన తరువాత, స్వారోచిష మన్వంతరములో ఆ దేవతలు తుషితులుగా పుట్టిరి. పోరు ఉత్తముఁడయిన మనువునకు కుమారులుగా సత్యయును భార్యయందు పుట్టిరి. అందుచే సత్యులు ఔత్తమ మన్వంతరమున సత్యులుగా జ్ఞాపకముంచుకొనంబడిరి, (29) ఆ పండ్రెండుగురు. దేవతలు (తుషితులు) హారిణియందు జన్మించిరి. వీరు హరులను నామములతో యజ్ఞభాక్కులయిరి. యజ్ఞహోమాదుల స్వీకరించిరి.
అరిష్టవ మన్వంతరము రాగా రైవత?) ఆ ఉత్తములయిన దేవతలయిన హరులు వికుంఠయందు జన్మించిరి. (31) ఐదవ మన్వంతరమున వారు వైకుంఠులనంబడిరి. చాక్షుష మన్వంతరము ప్రాపింపగా వైకుంఠులను ఆ దేవతలు సాధ్యులుగా జన్మించిరి. చాక్షుష మన్వంతరము సమాప్తమయినది. వైశ్వానరమనువుయొక్క సృష్టి ఆరంభమయ్యెను, అసాధ్యులు, స్వకీయములయిన యంశలచే, మరీచి కుమారుఁడయిన కశ్యపునకు అదితికిని గలిగిరి. వర్తమాన మన్వంతరమున ఆ దేవతలు పండ్రెండుగురు ఆదిత్యులుగా పుట్టిరి. (34) ఈ ద్వాదశామరులు చాక్షుష మన్వంతరమున సముత్పున్నలుకాగా, వారు స్వయంభువుఁడైన బ్రహ్మచే శపింపఁబడిరి. వారు ఆ ద్వాదశాదిత్యులు సాధ్యులుగా కీర్తింపఁబడిరి. (35) ఏ మర్త్యుండీ నామములను వినునో అతనికి జయము సర్వదా సంపన్నమగును. ఆతనికి జయాది దేవతలయందు భక్తి ప్రపత్తులు కలుగును.
ఇంక మనము మఱొక అధ్యాయమునకుఁబోవుదము. ఈ ఏడు వృత్తులు దేవతా లక్షణములు. వారి వృత్తాంతము నేడు మీకు వినిపించితిని. ఇంక నేది మీరు నా వలన వీనంగోరెదరో చెప్పుఁడు.
ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండమునందు మధ్యమభాగమున తృతీయమైన యుపోద్ఘాతపాదమున జయాభివ్యాహారమను నాలుగవ అధ్యాయము.
Summary of chapter 42 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the sacred chronicle, this chapter lovingly details the holy lineages born from the seven great seers, tracing the spiritual families that populated the early universe. It illustrates how divine knowledge and ascetic power were passed down through generations of enlightened seers. The devout reader is reminded of the sacred value of spiritual lineage, recognizing that pure wisdom flows continuously like a holy river to enlighten seeking souls.