బ్రహ్మాండ మహా పురాణము
39 - భార్గవ పరశురాముని కథ
వసిష్ఠుఁడు చెప్పెను :-
మత్స్యరాజు యుద్ధమున మరణించెను. యుద్ధవిశారదుఁడు, మహాబలుఁడునైన కార్తవీర్యుఁడు రాజేంద్రులను యుద్ధమునకు ప్రేరేపించేను. బృహద్బలుఁడు, సోమదత్తు విదర్భరాజు, మిథిలేశ్వరుఁడు, నిషధాధిపతి, మగధాధిపతియు, హైహయాధిపుని ఆజ్ఞచే భార్గవేంద్రునితో యుద్ధము చేయ సమరమునకు శరజాలములను కురింపిచుచు వచ్చిరి. వారందరు నానాయుద్ధవిశారదులు. వీరాభిమానులు. జ్వలదగ్ని శిఖోపముఁడయిన భార్గవుఁడు పినాకహస్తుఁడై శరోత్తమమయిన, నాగపాశము నభిమంత్రించి విసరెను. సంగ్రామమూర్ధమున భార్గవేంద్రునిచే విడువబడిన అస్త్రమును మహాబలుఁడయిన సోమదత్తుఁడు గారుడాస్త్రముతో ఖండించెను. మహాభాగుండు శత్రువీదారణుఁడునైన రాముడంత క్రుద్ధుఁడయ్యెను. రుద్ర దత్తమయిన శూలముతో నతనిని చంపెను. గదాప్రహారముతో బృహద్బలుని, పిడికిలిపోట్లచే విదర్భరాజును ముద్దరాయుధముతో మైథిలుని, నిషధాధిపతిని, శక్తితో, చరణాఘాతములచే మాగధుని, అస్త్రజాలములచే సైనికులను, నిఖిల సేనను, చంపి, మహాబలుఁడయిన, జామదగ్ని, ప్రళయకాలాగ్ని సదృశుఁడై కార్తవీర్యుని వెన్నంటి తరిమెను. యుద్ధ మొనరింప వచ్చి పడుచున్న రామునిచూచి మహాబలురయిన ఇతర రాజులు, కార్యాకార్యజ్ఞులు. హైహయాధిపతిని పృష్ఠభాగమున వెనుక నుంచుకొని ఆతని యందలి సౌహృదభావమును ప్రదర్శించుచు రామునితో యుద్ధము చేసిరి, కాస్యకుబ్జాధిపతులు, సౌరాష్ట్రులు, అవంతి దేశీయులు వందలాది రాముని చుట్టుముట్టి తమ శరజాలములచే ఆతనిని నింపివైచిరి. ఆ యుద్దములో వారీ శరజాలములచే నావృతుఁడయి రాముఁడు, ఓ రాజేంద్ర ! చూచువారీ కగుపంచనేలేదు. అప్పుడు అకృతవ్రణుఁడు పూర్వము హరీణముచే చెప్పబడిన రామచరితమును స్మరించెను. అకృతప్రణుఁడు భార్గవేంద్రుఁడయిన రామునకు క్షేమము కలుగవలెనని హరిని యాచించెను. ఆ సమయమున, శస్త్రాస్త్రకోవిదుడు మంత్రమేదియునయిన రాముఁడు శత్రుశరజాలములను వాయవ్యాస్త్రముతో చెదరగొట్టెను. వెంటనే రణాకాంక్షియై మంచునుండి విడివడ్డ సూర్యునివలె ఆతడు నిలబడెను.
బలవంతుఁడైన రాముఁడా సైన్యముతో మూఁడు రాత్రులు యుద్ధము చేసెను. స్వకీయ యుద్ధలాఘవ విక్రమముచే రాముఁడు ద్వాదశాక్షౌహిణీ సేనను అచిరకాలములో చేదించి విడిచెను. పరశ్వధ వరాయుధుడు సుమహాత్ముఁడు అయిన రామునిచే శత్రుభూషవర్గము సర్వము వారి యొక్క మహాసైన్యము అరటి స్తంభముల వనమువలె ఖండింపబడుట చూచి, మహావీర్యుఁడు, సూర్యవంశజుఁడు లక్ష రాజమ్యలతో సంయుక్తుఁ డు ఏడు ఆక్షౌహిణీ సేనా సంయుతుఁడు నయిన సుచంద్రుఁడు యుద్ధమునకు వచ్చెను. మహావీరులయిన ఆతని సైనికులు మేఘములవలె గర్జించుచు, భూమినీ కంపింపం జేయుచు, భార్గవునితో యుద్దము సలిపిరి. ఓ రాజా ! వారందరు ప్రయోగించిన శస్త్రములను, మహాస్త్రములను, ప్రతావంతుఁడయిన భార్గవరాముఁడు క్షణకాలములో నాశన మొనర్చెను. దివ్యము యమోపమును నయిన పరశువును చేతబట్టి సర్వ సైనికులను భృగునందనుఁడు ఛేదించెను. వ్యవసాయదారుఁడు పండిన సస్యమును, కలుపు మొక్కలను తన కొడవలితో ఎట్లు కోసివేయునో అట్లు రాముని యుద్ధవిహార ముండెను. లక్ష రాజన్య సైన్యము రామునిచే ఖండింపఁబడుట సుచంద్రుఁడు చూచి, తాను యుద్దమాచరించెను. మునీశ్వరుం డయిన రాముఁడు నృపతీశ్వరుఁడయిన సుచంద్రుఁడు ఉభయులు, మహావీరులు నానాశస్తాస్త్ర కోవిదులు పరస్పరము యుద్ధము చేసిరి. యుద్దమునందు పండితుఁడయిన సుచంద్రుఁడు, ఆతనిపై రాముడే యే అస్త్రమును శస్త్రములను ప్రయోగించి విడిచెనో, వాని నెల్ల ఛేదించి వైచెను. రాముఁడు యుద్ధమున క్రుద్ధుఁడయ్యెను రాముఁడు వృథివీశ్వరుఁడైన సుచంద్రుని శత్రువు విషయమున చేయ వలసిన, ప్రతీక్రియాదులఁ దెలిసినవానిగా నెటింగెను అంత ఆచమనము చేసి జలముల ఉపస్పృశించి వారించుటకు వీలుకాని నారాయణాస్త్రమును రాముఁడు సంధానించెను. శతసూర్య ప్రభా సంయుతమయి, ధీమంతుఁడయిన రామునిచే విడువఁబడి వచ్చుచున్న దానిని చూచి, సుచంద్రుం డు సంహృష్ణుఁడయ్యెను, వెంటనే రథము నుండి క్రిందకు దిగెను. దానికి ప్రణామ మాచరించెను. ఆ యస్త్రము సర్వాస్త్ర పూజ్యము నారాయణ వినిర్మితము. నమస్కరించు సుచంద్రునీ విడిచి యా యస్త్రము నారాయణాంతికము చేరేను, యుద్దమున శత్రుసూదనుఁడు రాముఁడు ఆ మహాస్త్రము వ్యర్థమగుట సుచంద్రుడు చెక్కు చెదరక స్వస్థుఁడై యుండెను అది చూచి రాముడు విస్మితుఁడయ్యెను.
అంత కోపముతో రాముఁడు శక్తిని, ముసలాయుధమును, తోమరమును, పట్టిసమును, గదను, పరశువును సుచంద్రుని శీర్భముపై విసరెను. సుచంద్రుఁడో వాని నన్నింటిని విలాసలీలగా గ్రహించెను. రాముఁడు శివశూలమును రాజుపై విసరెను. ఆ శూలము ఆ రాజు కంఠమున పుష్పమాలయై యలంకరించెను. అతని ముందు జగత్సృష్టి కారణమైన భద్రకాళిని చూచేను. ఆమె పుల్లెల మాలను ధరించి యుండెను.. ఆమె ముఖము వికటముగా నుండెను. భయంకరముగా నుండెను. ఆమె సింహ వాహనస్థయై విరాజిల్లెను. త్రినేత్రములు కలిగి త్రిశూలమును ధరించి యుండెను ఆమెను రాముఁడు చూచెను. శస్త్రాస్త్రముల నేల విడిచి నమస్కరించెను. ఇట్లు స్తుతించెను :-
రాముడనేను :
శంకర వల్లభయైన నీకు నమస్కారము, జగత్సృష్టి కర్రియగు నీకు నమస్కారము, సమలంకృతకు, నానావిభూషితకు, పింహవాహనకు, తన్ను ఆర్తులై చేరిన ప్రపన్నులను రక్షించు విహితమయిన యుద్యమము గలదానికి, దక్షుని కూతునకు, హిమవంతునికి పుట్టిన దానికి, మహేశ్వరుని అర్ధాంగియై యున్నట్టి దానికీ, నమస్కారము. కాళికి, కలానాథుఁడయిన చంద్రుని కళను ధరించునట్టి దానికి భక్త ప్రియురాలికి, సర్వ భువన రక్షానిధీకి (తార -బౌద్దమత దేవతలలో నొకతె' తంత్ర రచయితలచే దుర్గగా పరిగణింపఁబడినది. తారా తంత్రము, తారా రహస్యములు కలవు. 'తార' అను నామముచే పూజింపఁబడు దానికి నమస్కారము. గణేశ్వరునిచే నారాధింపఁబడిన పాదుకలు కలిగినదానికి, శివుని యందు భక్తి గలిగిన దానికీ, పరాత్పరురాలికి, పరమేష్ఠిదకు, తాపత్రయమును ఉన్మూలించుటకై యోచించ దానికి, జదగ్గితము కొఱకు త్రీపురములను నాశనమొనర్చిన కాళీకి, బాలాది నామములతో నొప్పుదానికీ, త్రిపురాభిధను వహించిన దానికీ, సమస్త విద్యా విలాసముల ప్రసాదించుదానికి, జగజ్జననికి, శత్రువుల నాశనము చేయుదానికి, ఒక (కొంగ)ము యొక్క ఆననము కలిగిన దానికి నమస్సుమాంజలులు.
బహుసౌఖ్యదాయికి, నాశనము చేయఁబడిన సమస్త సురదానవులు కలిగినదానికీ, వర, అభయ, లక్షణములచే అలంకృతమైన భుజద్వయము కలదానికి, సర్వదేవతలచే నమస్కరింపఁబడు దానికీ, పీతాంబరము దాల్చు తల్లికి, నమస్కరింపఁబడు దానికీ, పీతాంబరము దాల్చు తల్లికి, పవన తుల్యవేగము గలదానికి, శుభప్రదకు, శివసంస్తుతకు సింహాధిరూఢయై పోవు దానికి, ఇక్షు ఖండ రసమునా స్వాదించుదానికి నీలాచలతుల్య వర్ణముగల అంగములచే ప్రకాశించుదానికి, లఘుగమనము గలదానికి తొందరగా నడుచుదానికి) లలితాభి ధానము గల దానికి, లేఖాధిపకు, దయా సముద్రురాలికి, లోలేక్షణకు, నాశరహితకు, లాక్షారసాలంకృతపాదపద్మకు, రమాభిధకు, రతిప్రియకు, రోగముల నాశనము చేయునట్టిదానికీ, సర్వ ప్రపంచ వస్తు రచయిత్రికి, రాజ్యప్రదకు, రమణోత్సుకకు, రత్నకాంతియుతకు, రుచిరాంబరకు నమస్కారము. ఓ తల్లీ నీకు ముందు భాగమున వెనుక, సర్వత్ర ఊర్ల భాగమున నమస్కారము. ఎల్లప్పుడు సర్వత్ర ‘నమోనమః’ అఖిల విగ్రహ రూపిణీవైన నీకు నమోనమః ఓ దేవేశి ! ప్రసన్నురాలవు కమ్ము, ఓ భద్రకాళీ పూర్వము నేచేసిన ప్రతిజ్ఞను పాలింపుము. మూఁడు లోకములకు నీవే తల్లివి, నీవే తండ్రివి. నమో భద్రకాళి !
వసిష్ఠుడిట్లనెను :-
ఈ విధముగా స్తుతింపఁబడి తరస్విని (శక్తిమంతురాలు) యగు భద్రకాళీ వరదాన కృతోత్సవయై ప్రీతురాలై భార్గవునితో నిట్లనెను.
భద్రకాళి ఇట్లు పలికెను :-
ఓ వత్స ! రామ ! ఓ మహాభాగ నీ వలన ప్రీతురాలనయితిని. నీవేయది హృదయమున నభ్యర్థించుచుంటివో నావలన ఆ వరమును , వేదుకొనుము.
రాముడిట్లనెను :-
ఓ జననీ ! భక్తవత్సలే ! నీ వేదయిన వరమును నాకీయ దలంచినచో, సుచంద్రుని యుద్ధమున నేను జయింపవలేను సుచంద్రుండో యుద్ధమున నీకు అనుగ్రహభాజనుఁడు. తల్లీ ! సంప్రీత మనస్సుతో నాకభిహితము చేయుము. ఏ యుపాయము చేతనైన సుచంద్రు నే జయింపవలెను. ఓ జగన్మాత నీకు నమస్సుమాంజలులు.
భద్రకాళి ఇట్లనెను :
ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి రాజేంద్రుఁడయిన సుచంద్రుని మద్ధృహమున కంపుము,
ఇదీ నా కత్యంత ప్రియము. ఆతఁడో సాకు పారదుఁడు (పరిచారకుడగుగాక) వసిష్ఠుఁడు :-
ఇట్లు జనని పలుక, భార్గవేంద్రుఁడు వీని దేవికి ప్రియమునాచరింప ప్రయత్నించెను. ప్రాణముల నియమించెను. ప్రాణాయామము జేసెను. ఆచమన మొనర్చెను. సుచంద్రు నుద్దేశించి తన బాణమును సంధానించెను. రాజును వధించుటకై రామునిచే ప్రయుక్తమయిన అస్త్రము, భూతమయమయిన ఆతని శరీరమును దహించి, ఆతనిని పరదేవతాలోకమున కంపెను. అంత రాముఁడు తల్లికి నమస్కరించెను. భద్రకాళి జగదాదిసమస్తమును సృజించు నట్టిది, అంతర్షితురాలయ్యెను. జామదగ్నియైన రాముఁడు కార్తవీర్యుని చంపగా నభిలషించి యుద్ధరంగమున ఆతనికై నిరీక్షించు చుండెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవ చరీతమున ముప్పది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 77 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter details Parashurāma's arrival at the divine gates of Mount Kailāsa, where he was met by lord Ganesha, the noble elephant-headed guardian of the sacred realm. It describes the intense conversation and spiritual confrontation between these two mighty divine personalities, each executing their sacred duty with unwavering determination. The reader contemplates the mysterious play of divine wills, recognizing that every cosmic interaction unfolds according to supreme divine purpose.