బ్రహ్మాండ మహా పురాణము
21 - భండాసురాహంకారో
శ్రీబ్రహ్మాండపురాణమున సుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున భండాసురాహంకారమను నిరువదియొకటవ యధ్యాయము.
శ్రీ లలితాదేవి యొక్క దండయాత్రా ధ్వనిని విని భండాసురపుర నివాసులు గొప్ప క్షోభమును బొందిరి-1. దురాశగలవాడు, దుర్బుద్ధియునైన భండాసురుని పురము మహేంద్ర పర్వత సమీపమున మహా సముద్రపుటొడ్డునగలదు-2. అది శూన్యకమనుపేర ముల్లోకముల బ్రసిద్ధము. విషంగునియన్న భండాసురుని కది నిత్యావాసమయ్యెను-3. నూరు యోజనముల విస్తారముగల యాపురమునందు శ్రీదేవి వచ్చునేమోయని సంభ్రాతిచే రాక్షసులందరు భయముజెందిరి-4. నూరు యోజనముల విశాలమైన యారాక్షసు లందరు భయము జెందిరి-4. నూరు యోజనముల విశాలమైన యా రాక్షస పురమంతయు ఉత్పాత సూచకముగా నేర్పడిన పొగలచే మాటిమాటికీ గప్పబడినట్లయ్యెను-5. ఆ రాక్షస పట్టణమున గోడలు అకాలముననే బీటలు వారి తీరిగినవి. ఆకాశము నుండి మహోల్కలు తీరుగుచు తిరుగుచుపడుచున్నవి-6. ఉత్పాతములలో మొదటిదైన భూకంపము జరిగినది. ఆ శూన్యకపత్తనమున భూమియంతయు మండిపోయినది-7. రాక్షసపురనివాసులకు ఆకాలముననే గుండెలదరినవి. ధ్వజాగ్ర (జెండా చీవర)మున గూర్చున్నవై రాబందులు, గద్దలు, కొంగలు, తక్కిన పక్షులును-8. సూర్యమండలమును జూచి జూచీ బిగ్గరగా నణచినవి. ఆపురమున మాంసభక్షములు కన్నులకు గనబడకుండగనే-9. పరుషములైన యాకాశవాణులతో మాటిమాటికి మాట్లాడినవి. అన్నీ దీక్కులయందును ధ్వజములు (జెండాలు) మాసిపోయినవిగా గనబడుచున్నవి-10. అవి పొగచూరినట్లు గనబడి దైత్య రాక్షసులకు క్షోభను గలిగించినవి. అకాలములోనే రాక్షస స్త్రీలయలంకారమాలలు జారిపడిపోయినవి-11. వారు బిగ్గరగా హాహాయనుచు కన్నీటితో నేడ్చిరి. అద్దములు, కవచములు, ధ్వజములు, ఖడ్గములు, సంపదలు-12. మణులు, వస్త్రములును మాటి మాటికి మలినముగాజొచ్చినవి. మేడలలో, వానిపైభాగములలో, క్రీడాభవనములలో-13. కోటబురుజులలో, పశువులకొట్టములలో, అంగళ్లలో, సభలలో, కోనేళ్లలో, తలవాకిట ప్రక్కనుండు గదులలో, ప్రోసోదపు. కిటికీలలో, సైన్యములలో-14. అన్ని దిక్కుల భద్రతగలిగిన నీవాసములలో, పడమటదప్ప తక్కిన మూడు దిక్కుల రాజగృహములలో, విచ్చందకములలో, సంక్షోభము జెందిన యంతఃపురపంక్తులలో, తూర్పు వాకిలిగల రాజ గృహములలో, అన్ని యంతర్బవనములలో-13. గోపురములలో, తలుపులలో, కౌగలలో, కిటికీలలో, కక్షలలో గదులలో) నివాసములలో, కళ్లములలో-16 అంతటను నగరవాసులైన జన సమూహములు గొప్ప ధ్వనులు గలిగిన పరుషములైన భూతముల దయ్యముల) మాటలను వినిరి-17. అంతటను బయలుదేరిన పచ్చని చెదలు భయంకర పర్ణములతో మిక్కిలి భయానకముగానున్నది. కాకులు అసహ్యమైన యరపులతో సూర్యుని జూచుచున్నవి. భూమీయందు కోట్ల కొలదిపుత్థాలు మహాధ్వనులతో పడుచున్నవీ-18. యజ్ఞములకై పరిష్కృతములైన వేదులలో రక్తజల బిందువులు పడుచున్నవి. అంతటను. పొగచూరిన వెంట్రుకల సమూహములు గూడపడినవి-19. ఇవి భౌమ (భూమికి సంబంధించిన) అంతరిక్ష (ఆకాశమునకు సంబంధించిన) ద్యవ్య (ద్యు లోకమునకు సంబంధించినవియునైన) ఉత్పాతముల సమూహములని, వానిని చూచి నగర వాసులందరు మిక్కిలి బాధనొందిరి. వీరు ప్రసిద్ధ వీరుడైన భండాసురునకు ఆయుత్పాతములన్నియు దేలిపిరి. -20. ఆ భండాసురుడును తీవ్రముగా బయటపడిన యాయుత్పాతసమూహములతో ధైర్యమును గోల్పోలేదు. మంత్ర స్థానమునకు (రాజ్య వీచారముజేయు స్థానమునకు) వచ్చేను-21. భండాసురుడు తన సింహాసనమున గూర్చుండెను. అది బహురత్నములు పొదిగిన సువర్ణమయము. అచటచట మారురూపము చెందిన మేరు పర్వతమా యన్నట్లున్నది. అంతకన్న గొప్పదైన సింహాసనము మరొకటిలేదు-22. తన కిరీటముననున్న దట్టమైన రత్నకిరణములచే దిక్కులనన్నింటిని వెలిగించుచున్న వాని వలె భండాసురుడు ప్రకాశించేను-23. ఆయాస్థానమండపము ఒక యోజన వైశాల్యము గలది. అందు సింహాసనముననున్న భండాసురుని అతని సోదరులు సేవించిరి-24. వారు విశుక్రుడు విషంగుడు అనువారు. మహా బలపరాక్రమవంతులు. వారి భుజదండములు ముల్లోకములకు మిక్కిలి భయంకరములైన ముండైనవి. -25. వారు అన్నగారియాజ్ఞలను ఏ మాత్రము జవదాటక పాలించుచు త్రైలోక్య విజయమున బొందిన మహాకీర్తి నెల్లప్పుడు వర్ధిల్ల జేయుచుండిరి-26. వారు తమ శిరస్సులను అన్నగారీ పాదపీఠమును దాకించి చేతులు జోడించి భూమీ మీద గూర్చుండీరీ-27. దేవశత్రుశ్రేష్ఠుడైన భండాసురుడాస్థానమునకనుండగా సమస్త సామంత రాక్షసరాజులు ఆతని జూచుటకు వచ్చిరి-28. వారి యొక్కొక సైన్యములకు లెక్కలేదు. వారు తమ తమ నామముల జెప్పుచు భండాసురనకు నమస్కరించిరి-29. భండాసురుడు వారిని తన ధీరమైన కనుచూపులతో పరీక్షించి సంభావించెను. అట్లే కొంతక్షణముండెను-30. ఇంతలో తమ్ముడైన విశుక్రుడు మథింపబడుచున్న సముద్రము వంటి ధ్వనితో అన్నయగు రాక్షసరాజుతో నిట్లనెను-31. దేవా! నీ భుజదండములచే, పాపులు, పామరాచారులు, దురాత్ములు నీచులునైన దేవతలయొక్క బలపరాక్రములు ధ్వంసము చేయబడినవి-32. రక్షణ యెక్కడను లభింపక దుఃఖితులైరి. మండుచున్న జ్వాలలచే వ్యాకులముగానున్న యగ్నియందు బడి నశించిపోయిరి-33. ఆ దేవుని (అగ్ని దేవుని) నుండి ఒకానొక స్త్రీ జనించి బలగర్వితయైనది. ఆమెను ఇంద్రాది దేవతలు స్వయముగా సృజించిరట. ప్రబలమైన యుత్సాహముగల యా దేవతలచేతనే ప్రోత్సహింపబడిన పరాక్రమములుగల బహు స్త్రీ పరివారములు గూడ సృజింపబడినవి. అవి వివిధాయుధములచే నలంకరింపబడినవి-35. వారు మనను జయించుటకు వచ్చుచున్నారట. అబలలగు స్త్రీల సమూహము బలవంతులమగు మనలను జయింపగలుగుటయా! హా! ఎంత కష్టము? వీధి యొక్క క్రౌర్యము!-36. అట్లినచో, చిగురాకుతో బండను బద్దలు గొట్టుటయే. ఇది యూహించుట పరిహాసమే యగును. మనసేనా ముఖముననుండు వీరభటులకు గూడ భయము గలుగుననుట వెక్కిరింపుగదా! సిగ్గు చేటు కాదా!-38. నాసైన్యమునకును ఆయుధములకును ఇంద్రాది దేవతలు భయముచెందీరి-39. బ్రహ్మాదులుగూడ ఆశ్చర్యముతో నిశ్చేష్టులైరి-39. ఇక విష్ణువు కథయేమీ చెప్పవలె: ఆ మహేశ్వరుడు గూడ భయపడెను. ఇతరుల మాట చెప్పవలెనా! ఆదిక్పాలురు పారిపోయిరి-40. కనబడకుండగనే శత్రు శరీరములపై బడు మన వాడి బాణములు కవచములంతట గ్రుచ్చగా దేవతలందరి మదము నీరుగారిపోయినది. అటువంటి మహాభుజపరాక్రమతేజము గల మనను జయించుటకొక స్త్రీ దండెత్తి వచ్చుచున్నది!-42. స్త్రీ యైన ఈమెను ఎప్పుడైనను తక్కువగా నెంచరాదు. “తన్ను తాను బాగుగా దెలిసిన జగీషువులు (శత్రువుల జయింపగోరువారు) అల్పునైనను శత్రువును తక్కువగా నెంచరాదు” అన్నది నీతి-43. కావున ఆమెను కదల్చివేయుటకు సేవకుల బంపవలె. మదమెక్కిన యామెను వెంట్రుకల బట్టి యీడ్చి తీసుకొని రావలె.-44. దేవా! నీ శుద్ధాంతః పురముననున్న లేడికంటి లేమలకు ఈ దుష్టురాలు చీరకాలపు చెలికత్తెగా నుండగలదు -45. మన సైన్యములలో నొక్కొక్క భటుని వలన శత్రువులును చరాచరములతో గూడిన మూడు లోకములును జంకుదురు-46. ఓదానవ రాజా! తక్కిన దానికీ దేవర చిత్తమే ప్రమాణము. (మీకే తెలియును) - అని నివేదించి విశుక్రుడు భండాసురుని కోపమును మరింతబెంచెను-47. తరువాత, మహా సత్వుడు విమర్శదెలిసినవాడు వివేకము గలవాడునైన విషంగుడు అన్న గారైన భండాసురినితో నిట్లనెను-48. ఓయరిమర్దనా దేవా కార్యమంతయు నీకే తెలియును. నీకు దెలుపదగిన నీతి మార్గములేదు-49. అంతయు విచారించి చేయవలె, రాజనీతి గతి విచారమే (సమాలోచనయే) మిక్కిలి ప్రాముఖ్యము గలదీ, సమాలోచనము జేయని కర్మ సమూలముగా కత్తిరించివేయును- 50. ప్రయత్నముతో శత్రు నగరమునకు గూఢచారుల బంపవలె. జయసిద్ధిని గోరినవాడు వారి బలా బలమును దెలిసికొనవలె-51. రాజు చారులే కన్నులు గలవాడుగావలె. దృఢమైన ప్రజ్ఞ గలవాడుగావలె. ఎప్పుడును పైకి అశంకితుడుగాగనబడుచునే లోపల శంకీత మనస్కుడుగావలే. (ఎవనినీ నమ్మరాదు) తన మంత్రులలో మాత్రమే గుప్తముగా మంత్రాలోచన ముండవలే-52. ఆటలు ఉపాయములను చక్కగా ప్రయోగించువాడు అంతట పూజ్యమైన పదమునందుండీ విజయమును బొందును. అవిచారితకర్మకారి వెంటనే వినాశమొందును-53. అవిమర్శగా జేయు నారంభము వినాశకారియగును. మంచి చెడులు విమర్శించి చేయుపనీ విశేషముగా జయమునిచ్చును. మగమని, స్త్రీయనీ, అల్పురాలని రోజులు శత్రువులను తక్కువగా నెంచరాదు. శక్తియంతటనుండును-55. స్తంభము నుండి బుట్టీ మృగ శరీరమును ధరించి సర్వ భూతములకు ప్రాణమైన యొకానొకనిచేత హిరణ్యకశిపుడు చంపబడెను-56. పూర్వము చండీకయను స్త్రీ మాయతో యుద్ధమున విజృంభించినదై నిశుంభ - శుంభులను (రాక్షసులను) మహిషాసురునీ జంపినది-57. ఆ సందర్భమున నామెచే పెక్కురు దైత్యులు చంపబడిరి. అందువలన స్త్రీ మాత్రయని తక్కువగా నెంచరాదని చెప్పుచున్నాను-58. శక్తియే యంతట విజయశ్రీకి కారణము- శక్తి యాధారమునందిన స్త్రీ పుంలింగములతో మనకు భయములేదు-59. స్వభావ సిద్దముగనే సంసారమంతట శక్తి ప్రకాశించుచుండును. అప్పుడు, నీవు ఆమె దురాశ యొక్క ప్రవృత్తిని దెలియవలె-60. ఈమె యెవరు? ఎవరి వలన బుట్టినది? ఏమి యాచారముగలది? ఏ యాశ్రయముగలది? ఏ బలముగలది? ఏ సహాయముగలది? ఓ దేవా! దీనిని విచారింపుడు (సమాలోచన సేయుడు)-61. అని విషంగుడు చెప్పగానే భండాసురుడిట్లనెను. మహౌజస్కులకు మహాతేజో వంతులకు విచారముతో పనిలేదు. మనసైన్యమున-62. మహాసత్తులైన అక్షౌహిణీ సేనాధిపులు నూరుగురుగలరు. వారు సముద్రములనైన త్రాగగలరు. త్రివిష్టపము (స్వర్గము)ను దంహించివేయగలరు. ఒరే పాప సమాచారముగలవాడా! విషంగా! స్త్రీలను వ్యర్థముగా శంకించెదవేల?-63. అది యంతయు నేరులద్వారా పూర్వమే చూచితిని. ముందు లలితయను పేరుగల ఒకానొక యామె జనించినది. ఆమె నిజముగా (త్రిలోక) సుందరియగుటచే ఆ పేరామెకు సార్థకము. ఆమె యాకారము పూవువలె సుకుమార సుందరము. సత్వములేదు. పరాక్రమము లేదు. యుద్దములలోనికెప్పుడును బోలేదు-65. ఆమె యవిచారసమూహముగలది విచారములేకయే బహుకార్యములజేయును. కాని మాయాపరాయణురాలు. ఆమె తన వలన సత్తహీనమైన స్త్రీ సమూహమునే పుట్టించినదీ-66. దానితో నీకేమి? ఇంత మాత్రముచే వికృత చేష్ట చేయరాదు. లేదా నీవన్న నీతి ప్రకారము ఆమెకు మహా బలముండుగాక-67. ముల్లోకములు దాటిన మహిమగల భండాసురునీ నేనడు జయింపగలడు?-68. ఇప్పటికీ గూడ నా బాహు బలసంమర్దనమున మూర్చజెందిన స్వర్గవాసులైన దేవతలు ఊపీరిని గూడ పీల్చుకొనలేకున్నారు-69. కొందరు పాతాల గర్భములలో, మరికొందరు పర్వతముల పొందరిండ్లలోను-70. భార్యా పిల్లలను సంపదలను వదలి మిక్కిలి భయముతో దాగియున్నారు. వారు అధికారముల గోల్పోయి పశువులై వేషములు గప్పికొని చరించుచున్నారు-71. ఇట్టి నా బాహుపరాక్రమమును ఆమె తెలియదు. మొన్న మొన్న బుట్టినయబలమైన యీమె మదముతో మత్తెక్కినదీ-72. మూడులైన స్త్రీలు నిజమును దెలియరు. వ్యర్థముగా సాహసముల గల్పించుకొందురు. చివరకు కార్యాకార్యముల దెలియక వినాశము వైపు పరుగెత్తుదురు -73. లేదా ఆమెను ముందడుకొని దేవతలు - (అనగా) మహోరగులు, సిద్ధులు, యుద్ద దుర్మదులైన సాధ్యులు-74. బ్రహ్మగాని, పద్మనాభుడు (విష్ణువు)గాని రుద్రుడుగానీ ఇంద్రుడుగానీ తక్కిన దిగధిపతులుగాని వచ్చినచో వారిని పిండి చేయుటకు నేను సమర్థుడను-75. అదికాక నా సేనలోని సేనా నాయకులు రణదుర్మదులు వారు శత్రువులను పండు దోసకాయను పిండినట్లు పిండివైచెదరు-76. కుటిలాక్షుడు, కురండుడు, కరంకుడు, కాలవాశితుడు, వజ్రదంతుడు, వజ్రముఖుడు, వజ్రలోముడు, (వజ్రము వంటి వెంట్రుకలు గలవాడు) లాహకుడు (మేఘమువంటివాడు)-77. సూచీ ముఖుడు (సూది ముఖముగలవాడు), ఫలముఖుడు, వికటుడు, వికటాననుడు. కరాలాక్షుడు, కర్కటకుడు (ఎండ్రకాయవంటివాడు). మదనుడు, దీర్ఘ జిహ్వకుడు-78. హంబకుడు, హలములుంచుడు, కర్కశుడు, కలివాహనుడు, పుల్కసుడు, పుండ్రకేతువు, చండబాహువు, కుక్కురుడు -79. జంబుకాక్షుడు, జృంభణుడు, తీక్షశృంగుడు, త్రికంటకుడు, చతుర్గుప్తుడు, చతుర్బాహువు, చకారాక్షుడు, చతుఃశిరుడు-80. వజ్రఘోషుడు, ఊర్థ్వకేశుడు, మహాహనువు, మఖశత్రువు, మఖాస్కంది, సింహఘోషుడు, శిరాలకుడు-81. అంధకుడు, సింథునేత్రుడు, కూపకుడు, కూపలోచనుడు, గుహాక్షుడు, గండగల్లుడు, చండధర్ముడు, యమాంతకుడు-82, డునుడు, పట్టి సేనుడు, పురజిత్తు, పూర్వమారకుడు, స్వర్గశత్రువు, స్వర్గబలుడు, దుర్గుడు, స్వర్ణ కంటకుడు-83. అతిమాయుడు బృహస్మోయుడు, ఉపమాయుడు, ఉలూకజీతత్తు, పురుషేణుడు, విషేణుడు, కుంతీషేణుడు, పురూషకుడు-84. మలకుడు, కశూరుడు, మంగలుడు, ద్రఘణుడు, కోల్లటుడు, కుజిలాశ్వుడు, దాసేరుడు, బభ్రువాహనుడు-85. దృష్టహాసుడు, దృష్టకేతువు. పరిక్షేప్త, అపకంచుకుడు, మహామహుడు, మహాదంష్ణుడు, దుర్గతి, స్వర్గమేజయుడు-86. షట్కేతువు, షడ్వసువు, షడ్జంతుడు, షట్రియుడు, దుఃశరుడు, దుర్వినీతుడు, ఛన్నకర్ణుడు, మూషకుడు-87, అట్టహాసి, మహాశి, మహాశీరుడు, మహోత్కటుడు, కుంభోత్కచుడు, కుంభనాసుడు, కుంభగ్రీవుడు, ఘటోదరుడు-88. అశ్వమేధ్రుడు, (అశ్వపురుషాంగము వంటి పురుషాంగముగలవాడు) మహాండుడు (అండము - వృషణము), కుంభాండుడు, పూత నాసికుడు (పూతీ ఉగ్రగంథము), పూతిదంతుడు, పూతి చక్షువు, పూత్యాస్యుడు, పూతీ. మేహనుడు (ఉగగ్రంథము గల పురుషాంగము గలవాడు)-89. వీరు మొదలుగా గల శూరులు హిరణ్యకశిపునకు సమానులు, హిరణ్యాక్షసములును నైననాపుత్రులు మహా బలులు-90. వారిలో ఒక్కొక్కరికి నూటికి మించిన పుత్రులు పుట్టిరి. నా సేనా నాయకులు మదముతో చెలరేగినవారు. వారిని నా పుత్రులు వెంబడించపరుగిడుదురు -91. వారు యుద్ధమున మిక్కిలి రెచ్చిన దేవాధములను నశింపజేయగలరు. నా సహస్రాక్షౌహిణీ నాయకులు కోపించినచో ఆ దేవతలు భస్మమగుదురు. అయ్యో! ఈయబల స్త్రీ విషయము చెప్పవలెనా? -92. ఆమె యొక్క యుద్ధ సీమలో నంతయు మాయా విలాసములు, మహామాయా వినోదములే జరుగును. మనసైన్యమువారు కోపించినచో వారి బలమంతయు భసీ భూతమగును-93. కావుననోవిషంగా! నీ మనస్సు వ్యర్థముగా శంకీంచి భగ్నముగా కుండుగాక - ఈ విధముగా జెప్పి భండాసుర రాజు రాజ సింహాసనమునుండి లేచి తన సేనాని మహాబలుడైన కుటిలాక్షునితో నిట్లనెను. ఓరేయి! లేవరా! సైన్యము నంతయు నంతట సిద్ద పరుపుము-95, శూన్యక పట్టణము- ద్వారములందంతటను సైన్యమునుంచుము. (నూరు వలలను పన్నుము)-96.మంత్రులతోను పురోహితులతోను దుష్టాభిచారములజేయవలె. నీవు శస్త్రములను సిద్దము జేయము. ఇదిగోయుద్దము వచ్చినదీ-97. సేనాపతులలో నొకరిని ముందెప్పుడు నడిపించుము. వాడక్కడనే సైన్యసమూహములతో గూడి భయంకరముగా నుండవలె-98. యుద్ధ సమయమున నొక్కుమ్మడిగా సైన్యముల దాడిచే జయింపబడిన యామెను దేవ బలముతో మదించిన మూర్ఖురాలిని సిగలాగి పట్టుకొనుము-99. అని మూడు వేల సేనకధిపతియై మహాసత్త్వుడైన కుటిలాక్షుడను సేనా నాయకునకు జెప్పి తాను (భండాసురుడు) అంతఃపురమునకు వెళ్లిను -100. అంత దాడి వెడలివచ్చుచున్న శ్రీ దేవియొక్క యాత్రాపటహధ్వనులు రాక్షసేంద్రులకు వినవచ్చినవి. అది వారి చెవులను బధిరముగా (చెవిటిగా) జేయుచున్నది.-101.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యనంవాదమున శ్రీలలితోపాఖ్యానమున భండాసురహంకారమను నిరువదియొకటవ యధ్యాయము.
Summary of chapter 133 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter details the fierce night battle where Vishaṅga, the cunning brother of Bhandāsura, attempted a sneaky night attack upon the Sakti camp. It describes how goddess Mantriṇī and goddess Daṇḍinī foresaw the deception, mounted a brilliant counter-attack, and decimated the enemy forces in the dark. The devout soul learns to remain spiritually vigilant at all times, trusting in the divine mother's all-seeing wisdom to expose and destroy hidden evils.