బ్రహ్మాండ మహా పురాణము
33 -పుష్పరాగ ప్రాకారాది ముక్తా ప్రాకారాంత సప్త కక్షాంతర కథనం
హయగ్రీవుడనేను:- శిల్పులు నిర్మించిన సప్తశాలముల లక్షణమును జెప్పితిని. ఇక రత్నమయములైన శాలములను జెప్పెద వినుము-1. సువర్ణమయ శాలమునకును, పుష్పరాగమయ శాలమునకును మధ్యాంతరము ఏడు యోజనములు మాత్రము-2, అచట సిద్ధులును, సిద్దుల స్త్రీలును మదవివశులై రసములతోను, రసాయనములతోను, ఖడ్గములతోను, పాదాంజనములతోను క్రీడింతురు-3. లలితాదేవియందు భక్తియుక్తులై మహాజనులను సంతృప్తిపరచుచు, నటనుందురు. అనేకములైన మదిరారసములను ద్రాగుదురు-4 పుష్పరాగాదీ మణులచే నిర్మించబడిన శాలములకు (భవనములకు) పూర్వమువలెనే ద్వార నిర్మాణములు, పుష్పరాగాది మణులచే నిర్మింపబడిన శాలములలో తలుపులు, గడియలు, గోపురములును పుష్పరాగాది మణులచేత నిర్మింపబడినవని తెలియవలె. అవి యున్నతములు. చంద్రసూర్యులవలె ప్రకాశించునవి-5. హేమ ప్రాకార చక్రమునకును పుష్పరాగ ప్రాకార చక్రమునకును మధ్యనున్న స్థలి(భూమి) కూడ పుష్పరాగమణి నిర్మితమే యనబడినది-6. చెప్పబోవు మహాశాల(భవనముల కక్షలన్నింటిలోను (గదులన్నింటిలోను-అంతః పురములన్నింటిలోను) ఆ వర్ణముల పక్షులును ఆవర్ణముల సరస్సులును ఉన్నవీ-7. ఆ వర్ణము గల జలములున్న నదులు, ఆ వర్ణములో మణినిర్మిత వృక్షములునున్నవి. పూర్వము సిద్దజాతులలో వివిధ పద్ధతులలో దేవినుపాసించి శరీరము- జాలించినవారు అంగనలతో గూడిన సిద్ధులై యటనున్నారు-8. లలితా మంత్రమును జపించుచున్నారు. లలిత యడుగుజాడలలో నడచుచున్నారు. లలితాదేవి నామసంకీర్తనము జేయుచున్నారు-9. పుష్పరాగ నిర్మిత మహాభవన మధ్యమున గాలీ వచ్చుటకై యంతటను చతురసమైన పద్మరాగమయ భవనము నిర్మింపబడినదీ-10. అచటి స్థలి (నేల) గోపురమును పద్మరాగమణి నిర్మితములు. అట చారణ దేశమున నున్నవారు పూర్వము తమ దేహము నశించిపోవుటచే దేవీ చరణ కమల సేవకులై సిద్ధిని పొందిరి. ఆ బోరణుల స్త్రీలుగూడ సుందరాంగులు మదలాలసలు. లలితాదేవి యొక్క గీతిబంధములను మాటిమాటికి గానము జేయుదురు-12 అచట కల్పవృక్షముల మధ్యన వేదికయందుండి భక్తులతో తోడుగా నుండి మధురమైన మధు (తేనె) ఆసవరసమును ద్రాగుదురు-13. చక్కని వాయు యోజనముగల పద్మరాగమణి నిర్మిత మహా భవనాంతరమున పూర్వ భవనములతో సహకారముగల గోమేదకరత్న నిర్మిత మహాభవనముగలదు. తరువాత మిక్కిలి - యెత్తైన వజ్రమణి నిర్మిత భవనము గలదు. ఆ రెంటి మధ్యన వజ్ర భూమిగలదు-14, ఓ అగస్త్యా. అచట దేవిని పూర్వజన్మలోనర్చించిన గంధర్వ శ్రేషులు అప్పరసల సమూహముతో బాటుదురు-15. వారు వీణానాదములతో మహారాజ్ఞియైన లలితాదేవి యొక్క గుణములను గానము జేయుచుందురు. వారు కేవలకామభోగమున రసికులు, కామునితో సమానమైన యాకారముగలవారు. సుకుమార స్వభావముగలవారు. శ్రీ దేవీ భక్తితో ప్రకాశించినవారు-16. గోమేదక రత్న నిర్మిత భవనము పూర్వ భవనములతో సమానమైనది. దానిలో కోట్ల యోగినులు భైరవులును ఉందురు. వారు భక్తితో కాల సంకరణియైన యంబను సేవింతురు-17. చక్కని వాయు యోజనముగల గోమేదక మహాభవనమున ఊర్వశి, మేనక, రంభ, అలంకుష-18, మంజుఘోష, సుకేశి, పూర్వచిత్రీ, ఘృతాచిక, కృతస్థల, విశ్వాచీ, పుంజికస్థల, తిలోత్తమ - అనుదేవవేశ్యలు, ఇటువంటి మలికోందరును గంధర్వులతో బాటు క్రొత్త కల్ప - వృక్షమధువులను-20. ద్రాగుచు, లలితా దేవినీ మాటి మాటికి ధ్యానించుచు, తమ సౌభాగ్య వృద్ధి కొఱకు లలితా మంత్రమును లెక్కతో జపించుచుందురు-21. పదునాలుగు స్థానములలో బుట్టిన యప్సరసలందరును సంతసించిన యాశయములు (హృదయములు) గలిగి దేవిని పూజించుచు అచటనే వసింతురు-22.
హయగ్రీవ ఉవాచ:-
అగస్త్యుడనేను - ఓ ప్రభూ! సర్వవిద్యల మహానిధీ! ప్రాజ్ఞా! ఆయప్సరసల పదునాలుగు జన్మలను జెప్పుము-23, హయగ్రీవుడనెను. బ్రాహ్మణుడు హృదయము, కాముడు మృత్యువు, భూమి, వాయువు, సూర్యకిరణములు, చంద్రకిరణములు, వేదములు, అగ్ని-24. విద్యుత్తు, అమృతము, దక్షకన్య. జలము - వీనిని విద్వాంసులు జన్మకు కారణములందురు-25. చక్కగా వెలుగుచున్న సౌభాగ్య సంపదగల దేవగణ సంబద్దులై స్త్రీలకు సంబంధించిన వారైన వీరందరు గంధర్వులతో బాటు చక్రిణిని లలితాదేవిని అర్చింతురు. ఓ మునీ! కిన్నరులు వారి వనితలతో గూడినవారై కింపురుషులు వారి స్త్రీలతో గూడినవారై వజస్థలము నాశ్రయించిరి-27. ఓ యగస్త్యా! మహారాజ్జీమంత్రజపములతో విదిల్చబడిన సమస్త పాపములు గలవారై నాట్యము చేయుచు గానము చేయుచు నుందురు-28. ఓ మునీ! అచటనే వజ్రస్థలిలో, వజ్రయను నదీ యెల్లప్పుడు ప్రవహించును. దాని యొడ్డులందు దట్టముగా వెలసిన వృక్షములు వజ్రాకారములు-29. దాని యందలి యిసుక వజ్రరత్నమయము. దానీ నీరు వజద్రవమయము: అదీ పవిత్రమై యంతటనెప్పుడును ప్రవహించును--30. ఓ కలశమున బుట్టిన యగస్త్యా! లలితాపరమేశానీభక్తులైన మానవోత్తములు దానియుదకములు ద్రావి వజ్రశరీరులు దీర్ఘాయుష్మంతులును రోగములు లేనివారును అగుదు-31. ఇంద్రుడు తాను ప్రయోగించిన వజ్రమును భండాసురుడు మ్రింగివైచెను. దానివలన వజ్రహీనుడై యింద్రుడు ఈ వజ్రనదీతీరమున వజ్రేశ్వరిని గూర్చి భక్తితో తపమాచరించెను-32. వజ్రనదీజలము నుండి లేచిన దేవి యింద్రునకు వజ్రమునిచ్చి యంతర్ధానము చెందెను. ఇంద్రుడును వజ్రాయుధమును బొంది ధన్యుడై స్వర్గమునకు వెళ్లాను-3, మారుత యోజనముగల . వజ్రభవనములోపల పూర్వమువలె గోపురముతో గూడినదై యెత్తైన వైడూర్యమణి నిర్మితమైన భవనముగలదు. అచట స్థలి కూడా వైడూర్య నిర్మితమై వెలుగుచుండును"34. పాతాళహౌసులైన శ్రీదేవ్యర్చన సాధకులు సిద్ధమూర్తులై నిరంతర సుఖులై యటనుందురు-35. శేషుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, వాసుకి, శంఖకుడు, తక్షకుడు, శంఖచూడుడు, మహాదంతుడు, మహాఫణుడు-36 ఈ మొదలగు సోగులు నాగస్త్రీలును అచట నుందురు. బలీంద్రుడు మొదలగు ధర్మవర్ణులైన రాక్షసుల యొక్క గణములు గూడ తమ స్త్రీలతో బాటు అచటనే నివసించును-37. లలితామంత్రమును జపించువారు, లలితాశాస్త్రమున దీక్షితులు, నిత్యము లలితను పూజించువారునైన యసురభోగులు అచటనుందురు-88. అచట వైదూర్యమణులచే నిర్మింపబడిన కక్ష యందు (భాగమునందు) చన్నీటీ నదులు, బెగ్గురు పక్షులతో నందమైన విమల జలసరస్సులు-39, వైదూర్యణినిర్మితములైన దివ్యభవనములు నున్నవి. వానిలో ఆ నాగులు, రాక్షసులును వారి స్త్రీలతో క్రీడింతురు-40. చక్కని వాయు యోజనము గల వైదూర్యమహాశాలలో మరొక చక్రపొలము వలెనున్న ఇంద్రనీలమణి నిర్మితమైన శాలము(భవనము) గలదు-41. ఓ మునీ! దానిమధ్య కక్షా భూమి నీలరత్నమయము. అచట గూడ మధురములైన నదులు , చల్లనీ సరస్సులునువి. సరసములై భోగ్యములైన నానావిధ వస్తువులు గూడ గలవు-42, లలితా మంత్రసాధకులైన భూలోకములోని మానవులు తమదేహాంతమున మరణమున) నిచటి ఇంద్రనీలమణి నిర్మితమైన కక్ష్యను (భవన భాగమును) జేరుదురు-43, అచట - స్త్రీలతోగూడి దివ్యవస్తువులననుభవింతురు. మధురమైన మద్యమును ద్రావి, భక్తినిండిన వారై నృత్యము జేయుదురు-44. ఓ యగస్త్యమునీ! అచట నదులలోను, సరస్సులలోను, సుందరమైన తీగపొదరిండ్లలోను, మహాసంపన్నమైన మందిరములలోను-45, నిత్యము శ్రీదేవిని జపించుచు తద్గుణముల పఠించుచు మహాభాగ్యవంతులు, స్త్రీలతో జుట్టబడి నివసింతురు-46. భూలోకమున జేసిన యాగాది కర్మల పుణ్యము క్షీణింపగనే మరల మానవులుగా భూమిలో జన్మింతురు. పూర్వవాసనతో గూడినవారై మరల చక్రిణిని వైష్ణవిని లలితను) బూజింతురు. మరల శ్రీనగరమున నిద్రనీల నిర్మితమైన మహాస్థలిని చేరుదురు-47. ఓ మునీ! ఆ స్థలముయొక్క సంపర్కము వలన రాగద్వేషములతో బుట్టిన నీలములైన (మలినములైన) భావములతో నెల్లప్పుడు గూడియుందురు-48. ఇంద్రియములను నియమించి, ద్వైతభావములేక, జ్ఞానులైన మర్త్యులు (మానవులు) ఆశ్చర్యముగా మహేశ్వరిలో బ్రవేశింతురు-49. వాయుయోజనముగల ఇంద్రనీలమణిశాలలో ముత్యములు నిండిన భవనము గలదు. దాని గోపురములు పూర్వము వంటివే-50, ఓ మునీ! వాని మధ్యమున స్వచ్చమై మిక్కిలి ప్రకాశించు చదరమైన నేల గలదు. అదియంతయు ముత్యములతో బోదగబడినదై చల్లనై మనోహరమైనదీ-51. ఆ మహాస్థలమున తామ్రపర్ణీ, మహాపర్జి, ముక్తాఫలోదక మొదలుగా గల మహానదులచట ప్రవహించును-52. దాని తీరములలోనందరు దేవలోక నివాసులుందురు. వారు పూర్వజన్మలో శ్రీదేవీ మంత్రసాధకులు- 53. ముక్తాశాల యొక్క చుట్టును తూరుపు మొదలు ఎనిమిది దిక్కులలో ద్వార ప్రదేశములనంటి ఇంద్ర-అగ్ని-యమ-నిరృతీ-వరుణ-వాయు-కుబేర-ఈశాన లోకములు గలవు -54, ముక్తాశాల-నీలిశాలల ద్వారముల మధ్యన తూరుపున నింద్రలోకముండును. కోణమున అగ్నిలోక భూమి యుండును. దక్షిణభాగమున యమపురము, అచట దండధరుడైన యముడుండును. అతడు అంతట లలితామంత్రమును జపించును. తీవ్ర స్వభావము గలవాడు-56. శ్రీదేవి యాజ్ఞను పాలించువాడు, చిత్రగుప్తుడు మొదలుగా గల యమభటులతో బాటు శ్రీదేవీ సమయమును గుహుడు నియమించును-57. గుహునిచే శపింపబడిన దురాచారులను, లలితా ద్వేషమును గలిగించువారిని కపట భక్తిపరులను, మూర్తులను, స్తబ్దులను (మొద్దులను) మిక్కిలీ గర్వించువారిని-58. మంత్రచోరులను, కుమంత్రముల జపించువారినీ, కువిద్యలు గలవారిని, పాపము నాశ్రయించువారిని, నాస్తికులను, పాపస్వభావులను, వ్యర్థముగా ప్రాణులను హింసినంచువారినీ- 59. స్త్రీలను ద్వేషించినవారినీ, లోకములు ద్వేషించినవారిని, పాషండులను పాలించువారిని, కామసూత్రమైన యమపాశమునను, గౌరవము, కుంభీపాకము అను నరకమున-60. భయంకరమైన రంపముల వనమున, కృములు దీనుచోటను, నూనె మొ॥వానిలో వేయంచుటయందును, లాలాజలపుబురుదలో బడవేయుచోటను, సూదులు గ్రుచ్చుచోటను అగ్నిలో బడవేయుచోటను-61. ఇటువంటి కష్టనరకములలోను ఆ మహౌజస్కుడైన యముడు ఆశ్రీదేవి యాజ్ఞచేత బడవేయును-62, అతనికి పశ్చిమభాగమును నిరృతి ఖడ్గమును ధరించి రాక్షసలోకము నాశ్రయించి లలితార్చకుడై యుండును-63. అతనికుత్తర భాగమున రెండు ద్వారముల మధ్యన వరుణలోకము నాశ్రయించి యెల్లప్పుడు వరుణుడుండును-64. అతడు వారుణిని (మద్యమును) ద్రావుటచే మత్తెక్కినవాడు. శుభ్రమై తెల్లనైన శరీరము గలవాడు. చేపవాహనముగా గలవాడు. ఎల్లప్పుడును శ్రీదేవీ మంత్రమును జపించువాడు. శ్రీక్రమమును (చక్రక్రమమును) సాధించువాడు-65, ఆతడు శ్రీదేవీ దర్శనమును ద్వేషించువారిని, పాశబంధనములతో బంధించి అధోమార్గమున జేర్చును. భక్తులకు మాత్రము బంధమోచనము జేయును-66. అతనికి ఉత్తరకోణములలో వాయులోకముండును. అది మహాతేజోవంతము. అచట పాయుశరీరులు, సత్తు యొక్క యానందముచే (సదానందముచే) మహాభివృద్ధి చెందినవారు -67. నైన సిద్ధులు, దీవ్యఋషులును యోగప్రాణాయామము నభ్యసించువారును, గోరక్షుడు మొదలైనవారును, యోగతత్పరులైన యోగులును-68. వీరందరితో గూడి మహాసత్త్వుడైన (బలవంతుడు సాత్వీకుడైన) మారుతేశ్వరుడు (ఈశ్వరుడైన వాయువు) అచట నుండును. ఓ యగస్త్యా! అతడెన్ని యేవిధముల వేర్వేరు ఆకారములు గలవాడై యుండును. (విశ్వములో ప్రతిప్రాణి అతని యాకారము). ఇడ-పింగళ-సుషుమ్ల అను మువ్వురు అతని శక్తులు. ఎప్పుడును మద్యమదమున వశము దప్పినవారు-70. వాయువు వారికి పతి. ధ్వజము చేతగలవాడు. మహామృగ శ్రేష్ఠవాహనము నెక్కినవాడు, లలితయొక్క యోగమును, ధ్యాసమును, క్రమపూజనమును జేయుటలో నిమగ్నుడు-71. ఆనంద మంగాంగముల నీండీ తొణికిసలాడుచున్న యితరశక్తులచే జుట్టబడినపాడు, ఆశ్రీమంతుడై యీశ్వరుడైన వాయువు ఎల్లప్పుడు చక్రస్వరూపిణియైన లలితను జపించును-72, ఆ బలముచేతనే వాయువు చరాచర రూపమయిన ముల్లోకమును క్షణములో దుమ్ముగాజేసి వినోదించును-73. అట్టి సత్వ (బలి) సిద్ధికొకే పాయువు సర్వాభరణముల నలంకరించుకొని, యా లలితాపరమేశ్వరినే పూజించుచూ భావించుచూ ఉండును-74. ఆలోకమునకు తూరుపు భాగమున నారెండు ద్వారములమధ్య నున్న యక్షలోకమున మహాతేజ స్వియై శ్రీమంతుడైన యక్షరాజు (కుబేరుడు) ఉండును-75, అతడు నవనిధులతోను, బుద్ధి వృద్ధి మొదలగు శక్తులతోను. గూడీ, లలితాభక్తులను ధనసంపదతో నింపుచుండును. అనుకూల ప్రవర్తనగలిగీ మనోహరమైన యక్షిణులతో గూడి అనేకములైన మద్యములతో చక్రస్వరూపిణియైన లలితాపరమేశ్వరిని చక్కగా బౌలించును-77. మణి భద్రుడు, మణీమంతుడు, మణికంధరుడు, అను మొదలగు యక్షసేనానులు గూడ నచటనే యుందురు-78. ఆలోకమునకు తూరుపు భాగమున మహాభివృద్ధిగల రుద్రలోకముగలదు. అమూల్యరత్నాలంకారములు గల రుద్రుడచట ఆదీ దైవము-79. ఆతడు ఎప్పుడును కోపముతో, మండువాడు. ఎప్పుడును భుజమున నమ్ములపొదిని గట్టినవాడు. తనతో సమానులు, మహా బలవంతులు, లోకములనిర్వహింప సమర్గులు--80, ధనుషులనెక్కు పెట్టి సమర్థులై పదునారావరణములలో నుండి, ముఖమున శ్రీదేవీ మంత్రమును ఎల్లప్పుడు జపించుచున్నవారిచే నెల్లపుడు చుట్టబడి యున్నవాడు -81, అతడు శ్రీదేవీ ధ్యానసంపన్నుడు. శ్రీదేవిని పూజించునుత్సాహముగలవాడు. అనేక కోటి రుద్రాణీగణమలంకరించిన పార్వభాగము గలవాడు-82. ఆరుద్రాణులు మిక్కిలి ప్రకాశించు శరీరము గలవారు. నవయౌవనమున గర్వించిన వారు. లలితాధ్యాన నిమగ్నలు సత్తనెడి మద్యమదముతో వశముదప్పిన వారు-83. వారందరితో బాటు ఆ శ్రీమంతుడైన మహారుద్రుడు త్రిశూలమును ధరించినవాడై హిరణ్యబాహువు మొదలగు ఇతర రుద్రులతో సేవింపబడినవాడై-84. లలితా దర్శనము జేయని వారిని, ఉద్ధతులను గురువులను ధిక్కరించిన వారిని శూలపుమొనచే ముక్కలుగా బొడిచి, తననేత్రమునుండి వెలువడిన తీవ్రమైన యగ్నులచే-85. గాల్చుచు, వారి భార్యలను సేవకులను సంతానములను నాశనముజేయుచు, ఓ అగస్త్యమునీ! లలితాజ్ఞా పాలకుడై మహావీరుడైన రుద్రుడు-86. మిక్కిలి సుందరమైన రుద్రలోకమున నివసించును, ఓ మునీ! ఆ మహా రుద్రుని యొక్క పరివారములు మిక్కిలి. మథించు వారు-87. ఆ రుద్రులు లెక్కకుమించిన వారు. వారి నెవడు చెప్పగలడు? భూమీలో నుండు రుద్రులు కోట్ల కొలది వారు-88. స్వర్గమున నుండు రుద్రులు గూడ కోట్లకొలదీ వారు. వారి యన్నము బాణము, వారి వాయువులు (ప్రాణములు) బాణములు-89. వారి వర్షము బాణములు, వారు ప్రదీప్తములై పింగళములైన కన్నులు గల వారు, సముద్రముపైనను, ఆకాశమునను గొప్ప ఓజస్సుగల పారైయుందురు-90, జడలు గలవారు. మధువులుగలవారు. నల్లని (వీషచ్చాయగల) కంఠముగలవారు (విశిష్టమైన యేలుపుగలవారు) ఎపుగాక తెల్లనైనవారు, భూతములకధిపతులు. బాణములు గలవారు. జటాజుటముగలవారు-91. పాత్రలలో ద్రాగుచున్నజనులను అన్నములలో ఉండి వేధించువారు. మార్గములలో రథములుగల పారు రుద్రులు. వారు తీర్థములలో నివసించువారు. (అర్థము సరిగా తెలియదు)-92. వేలుగానున్న తక్కినరుద్రులు బాణములుగలవారు (రత్నహారములు గలవారు), ధనుస్సులు గలవారు. ఈ రుద్రులు లలితాజ్ఞనుపాలించువారై దిక్కుల నెలకొనిరీ-93. వారందరు మంచిమహాత్ములు. క్షణములో విశ్వత్రయమును వహించువారు. (దహించువారు) వారు కృపాళువులై శ్రీదేవి యొక్క ధ్యానమున నిష్ణాతులైన వారిని, శ్రీదేవిమంత్రమును జపించువారిని పాలింతురు. ముత్యముల ప్రాకారమండలమున పదునారు ఆవరణములు గల చక్రములను ఆశ్రయించి హిరణ్యబాహుడు మొదలగునారుద్రులందరు మహోదయుడై, జ్వలించు కోపముగల యా మహారుద్రుని నుపాసింతురు-56.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున పుష్పరాగప్రాకారాదీముప్రాకారాంతసప్తకక్షాంతరకథనమను ముప్పదీ మూడవ యధ్యాయము. 33
Summary of chapter 145 of the Brahmānda Mahā Purana is as follows:
In glowing esoteric terms, this chapter reveals the secret meanings embedded within the Pañcadashākṣarī, the sacred fifteen-lettered mantra of Sri Vidyā. It explains how the three clusters of syllables correspond to the divine mother's head, torso, and lotus feet, as well as the three cosmic functions of creation, preservation, and absorption. Meditating upon this sacred equivalence, the devotee experiences the living presence of the goddess within the mantra itself.