బ్రహ్మాండ మహా పురాణము
13 - లలితాస్తవరాజోనామ త్రయోదశోఽధ్యాయః
దేవతలనిరి : జగన్మాతవైనయోదేవీ : నీకు జయమగుగాక సర్వోత్కృష్టవై వర్ధిల్లుదువుగాక. పరమున కంటెను పరమైన దానా! నీకు జయమగుగాక. కల్యాణములకు శుభములకు నిలయమైనదానో, నీకు జయమగుగాక, కామకలాత్మికవైన దానా! నీకు జయమగుగాక. జయమును గలుగజేయుదానిమ్. సుందరమైన కన్నులు గలదానివి. సుందర స్వరూపిణివి. అఖిల దేవతలకు ఆరాధింపదగినదానవు. కామేశ్వరివి (కామేశ్వరుని పత్నివి కామమునకీశ్వరీవి) మానదవు (దురభిమానమును జీల్చుదానవు, సదభిమానమును సమానమును ఇచ్చుదానవు) ఇట్టి నీకు జయమగుగాక-2. బ్రహ్మ మయవు (బ్రహ్మము నీండిన దానవు) నారాయణ పరవు. మోక్షనిలయుడైన హరియందు ఆసక్తవు. ఆనందింపజేసిన సమస్త భువనములు గలదానవు. అట్టినీకు జయము-3. విషకంఠుడయిన శివునికి ప్రియురాలవు నీకు జయము. శ్రీలతవు ధనమునకు శోభకును లతవు అల్లుకొని పోవుదానివి అంబికవు (తల్లివి) నీకుజయము. శ్రీవిజయవు (ధన శోభలజయించి వశమునందుంచుకొన్నదానవు) విజయశ్రీ సమృద్ధి నిచ్చుదానవు. నీకు జయము-4. జన్మించిన వాని యొక్కయు జన్మించుచున్న వాని యొక్కయు, వారు చేయు యజ్ఞములకును, త్రవ్వించు చెలువులు మొదలగువానికి కారణమైనదానవు, నీకు జయము, ఓ పరమునకంటెను పరమైన దానా. ముజ్జగముల బాలించునట్టి నీకు నమస్కారము-5. అనంతముఖనేత్రములు గలదానా. సవిభాగకాల స్వరూపిణివైన నీకు నమస్కారము. (కాష్ట (12 కనురెప్పపాట్లకాలము) కల=30 కాష్టలు, క్షణము=50 కలలు, ముహూర్తము=12 క్షణములు, దీనము. మాసము. ఋతువు సంవత్సరము)-6. అనంతహస్తాబ్దములతోను, అనంతపాద పంకజములతోను శోభించినదానా! అణువున కన్నో చిన్ననియణువై మహత్తుకంటే మహత్తైనయో దేవీ నీకు నమస్కారము-7. పరముకంటే మిక్కిలి పరమైన దానా! తేజోవంతములకును తేజ స్వరూపిణియైన దానా! నీకు నమస్కారము. అతలము నీ పాదములు, వితలము నీ పిక్కలు-8. రసాతలము పాతాలము నీ నడుము. భూమి నీ కడుపు. భువర్లోకము నీ హృదయము స్వర్లోకము నీ ముఖము. చూపులు చంద్రసూర్య అగ్నులు. (త్రిలోచనము), దీక్కులు నీ బాహువులు. వాయువులు నీవు పీల్చు ఉచ్చ్వాసలు. నీ వాక్కులు సమస్త వేదములు. లోకముల సృష్టి నీయాట. నీచెలికాడు. చిన్మయుడైన శివుడు. నీహారము సదానందము. నీవాసము సజ్జనుల హృదయము-11. ఈ భువనములు (లోకములు) నీ కనబడికనబడని స్వరూపములు. నీతల వెంట్రుకలు మేఘములు, చుక్కలు అందలిపూలు-12. ధర్మాదులు బాహువులు అధర్మాదులు ఆయుధములు యమములు (ఇంద్రియాదుల నిగ్రహములు) నియయములు (ఉపవాసాది ప్రతనియములు) చేతులలోను పాదములలోను మొలచిన గోళ్లు-13. నీస్తనములు లోకములనుజ్జీవింపజేయు స్వాహాస్వకారములు ప్రాణాయామములు నీముక్కు సరస్వతి నీ నాలుక-14. విషయ వ్యావృత్తి. (ప్రాంచిక సుఖములనుండి మరలుట) ప్రత్యాహారము నీయింద్రియములు. ధ్యానమే నీ సత్తమమైన బుద్ధి. ధారణాశక్తియే మనస్సు. సమాధిస్థితియే నీ హృదయము-15. వృక్షలతాదులు నీ శరీరముపైని వెంట్రుకలు. ప్రభతమే (తెల్లవారుటయే)నీ వస్త్రము. భూత-భవిష్యద్-వర్తమానములు నిత్యమైన నీ విగ్రహము-16. యజ్ఞస్వరూపిణివి జగమును ధరించుదానవు. విశ్వస్వరూపిణివి, పావనివి. మొదట దయగలదై నిఖిల ప్రజలను సృజించునది.-17. లోకుల హృదయమునందున్నను అదృశ్యురాలై మోహింపజేయునదీ-18. లీల చేతనే తాను సృజించిన దానికి నామ రూప విభాగములజేయును, అనామరూపములను అధిష్ఠించి (తన యధీనమందుంచుకున్న స్వామినియై వానియందేమాత్రము సక్తురాలు కానిదై) లోకులకర్థకామములనిచ్చునది. అట్టి సర్వశక్తి స్వరూపిణియైన యామహాదేవికి నమస్కారము-19. ఆమె యాజ్ఞతోనే అన్నీ సూర్యుడు-వాయువును, పృథివ్యాది వంచభూతములును విశ్వమున నడచుకొనుచునవి. అట్టియా మహాదేవికి నమస్కారము. సృష్టి స్థితిలయములలో మొదటిదైన సృష్టినే విశాలముగ నిచ్చిన ఆది బ్రహ్మను ఆమెనే సృజించెను-20. ఆ సృజించిన ధరణినంతయు తానొక్కతయే ధరించెను. అట్టియా మహాదేవికి నమస్కారములు-21. ఆమె ధరణీని వలెనే సూర్యుడుదయించు నమేయమైన (అంతులేని) యాకాశమును ధరించెను -22. ఆమె యందే జగమంతయు బుట్టును. ఆమెయందే నిర్భరముగా నిలచును. చివరకామేయందే లయముజెందును. అట్టియాదేవికి నమస్కారములు-23. జన్మమున (సృష్టిలో) రజోరూపిణియైన నీకు నమస్కారములు. స్థితిలో సాత్త్విక రూపిణియైన నీకు నమస్కారములు. లయమున తమస్వరూపిణియై హరించునట్టి నీకు నమస్కారములు. రజస్సత్వతమస్సులు లేక నిర్గుణాత్మక శివ స్వరూపిణివైన నీకు నమస్కారములు-24. జగమునకు ఒకే ఒక మాతృరూపిణియై, పితృరూపిణియైన నీకు నమస్కారములు. అఖిలరూపములకు తంత్రరూపీణియై, అఖిలయంత్రరూపిణివైన నీకు నమస్కారములు-25. లోకగురుప్రధానమైన నీకు నమస్కారములు. అఖిలవాక్కులయైశ్వర్యస్వరూపిణివైన నీకు నమస్కారములు. లక్ష్మికి, జగత్తునకేయానందరూపిణికి, శంభుపత్నకి, సర్వశక్తి స్వరూపిణికిని నీకు నమస్కారములు-26. ఓయంబా! నీ ప్రభావము ఆది-మధ్య-అంతములు లేనిది, పృథివ్యాది పంచభూతలములచే సృష్టింపబడనిది, వాక్కునకును మనస్సునకు అందనిది. ఊహింపనలవిగాని వైభవముగలది, రూపములేనిది. రెండుగానిది, దృష్టికి గనబడనిది. దానిని నేనెట్లు వర్ణింపగలను-27. ఓ విశ్వేశ్వరి! విశ్వముచే నమస్కరింపబడినదానా, విద్యలకీశ్వరివైనదానా, వేదస్వరూపిణీ మాయామయీ! మంత్రమేయాకారమైనదానా సర్వేశ్వర సర్వరూపిణీ! మాయెడ ప్రసన్నురాలవగుము-28. అని యీ విధముగా ఇంద్రునితో గూడి దేవతలందరు ఆ మహాదేవిని స్తుతించి మరల మరల నమస్కారములు జేసి వెంటనే దేవిని శరణము జొచ్చిరీ-29. అంతనమస్కరించిన యింద్రుని జూచి ప్రసన్నురాలై యఖిల ప్రాణులకు వరముల నిచ్చు మహాదేవి వరములను గోరు కొమ్మనెను.-30. ఇంద్రుడనెను: “ఓ కళ్యాణి! నీవు సంతుష్టురాలవై వరము నీయదలచినచో నేనింతవరకు భండాసురునిచే పీడితుడను. నా జీవితము దుర్భరమైనది. అట్టిమాకు యథాపూర్వసుఖజీవితమునిమ్ము మేమందరము దేవతలము నీరక్షణము గోరితిమి. దానిని ప్రసాదించుము-31. శ్రీదేవియనెను : నేనే దైత్యకులమున బుట్టిన భండాసురుని జయించి తొందరలోనే నీకు సచరాచరమైన త్రైలోక్యరాజ్యము నిచ్చెదము-32. నన్ను ఈ స్తుతితో స్తుతించిన సమస్త దేవగణము నీర్భయముగా సంతోషముతో నుండుగాక, అట్లే ఈ స్తుతితో నన్ను స్తుతించిన మానవులు గూడ నిర్భయముగా సంతోషముతోనుందురు. వారు ధర్మమునకు, సీరులకును, యశస్సులకును ఎల్లప్పుడును స్థానమగుదురు. విద్యావినయ సంపన్నులగుదురు. రోగములేని వారై దీర్ఘకాలము జీవించువారును అగుదురు-34. నాయనుగ్రహమున పుత్రులతో, మిత్రులతోను, కలత్రముతోను ఒప్పియుందురు. ఈ విధముగా వరమును బొందిన దేవతలతో బాటు ఇంద్రుడును మహాబలుడై-35. ఆ మహాదేవిని పలుమారులు చూచి పరమానందమునందిరి-36.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున ఉత్తరభాగమున లలితోపాఖ్యానమున లలితాస్తవరాజమను పదమూడవ యధ్యాయము.
Summary of chapter 125 of the Brahmānda Mahā Purana is as follows:
Tracing the cosmic origins of darkness, this chapter narrates how the demon Bhandāsura was born from the ashes of Kāmadeva burned by lord Śiva's fiery third eye. It details Bhandāsura's immense penance, his boons of invincibility, and his conquest of all three worlds that brought sorrow to the gods. The narrative reminds the faithful that ego and delusion arise from misdirected energy, requiring the supreme mother's grace to be completely dissolved.