బ్రహ్మాండ మహా పురాణము
44 - చతుశ్చత్వారింశోధ్యాయః
హయగ్రీవుడనేను : జపస్థానమున బ్రవేశించి, తనయాసనమును దెచ్చి, మంత్రములతో శాస్త్రీయముగా అభ్యుక్షణమును జేసి, గురువు చెప్పిన క్రమయోగమును బట్టి-1. స్వాత్మగా దేవతామూర్తిని ధ్యానముజేయవలె. (తనకు దేవతామూర్తికిని భేదములేని విధముగా ధ్యానింపవలె). అప్పుడు ప్రాజ్ముఖుడై (తూరుపుమొగమై యుండవలె. పద్మాసనమున గూర్చుండవలే, అన్యబుద్ధిరానీక ఏకాగ్రబుద్ధీయే యుండవలె-2. శ్రీఖండముద్రను జూపవలె, గురువు మొదలగువారినభినందింపవలె రెండుమారులు పలికిన బౌలామంత్రబీజాక్షరములను నడిమి వేలివరుసలో -3. రెండు చేతుల వేళ్లపై కరన్యాసముగానుంచి కరశుద్ధిపూర్వకముగా ఆర్నీ ప్రాకారము వఱకు మంత్రవేత్త స్వాస్త్రముతో జేయవలె-4. ప్రతి లోమముతో పాదాద్యమును, అనులోమముతో కోరికమును జేయవలె. పోగవాదులతో వ్యాపకన్యాసమునారోపించి వ్యాపించి జేయుచు-5. వ్యక్తములతో కారణ-సూక్ష్మ-స్థూల శరీరములను కల్పింపవలె. తరువాత, నాభియందు, హృదయమందు, భ్రూమధ్యయందును బాలా బీజములనుంచవలె-6, మూలముతో సంపుటీకృతమైన మాతృకను నాభ్యాదులలో క్రమముగా నుంచవలె. ఆబాలా బీజములనే రెండు మారులావర్తించి యుంచవలె.(7) మధ్యమము మొదలగు వ్రేళ్లయందు రెండేసి తలములపైనుంచవలె తరువాత నాభి మొదలగువాని యందును. తఱువాత రెండు పాదములందును ఉంచవలె-8. మోకాళ్లయందు, తొడలయందు, పిరుదలందు, స్త్రీపురుషావయములందు, మూలాధారము(గుదము)నందు, బొడ్డునందు, హృదయమునందు, శిరస్సునందు క్రొత్త యాసనములను కల్పించి వరుసగా బ్రహ్మను, విష్ణువును, రుద్రుని, ఈశ్వరుని సదాశివుని, సూర్యుని, తూలికను, ప్రకాశకమును, విద్యాసనమునుంచి తరువాత హృదయమున పద్మ త్రిఖండ-యోనులను ముద్రలను దర్శింపవలెను-10. ఓష్ణపుటముతో (పెదవులతో) వాయువును నింపవలె. “హుం హుం హుత్” అని కుండలినిని మేలుకొలుపవలె-11. మంత్రశక్తితో దానిని పైకి రప్పించవలె. ద్వాదశాంతమున శివైకత్వమును భవించ వలె. మరల నాకుండలినిని న్యస్థానమున బ్రవేశింప జేయవలె-12. వాగ్భవబీజములను మూలాధార-హృదయ -బాహువులందుంచవలె, రెండు చేతులను వ్రేళ్ల పైభాగము వరకు, మొత్తము శిరమునందు బాహువుల యొక్క మూల-మధ్య అగ్రములైన యవయవములందును ఉంచవలె, హృదయాదులందు గూడనుంచీ కుంకుమన్యాసముజేయవలె-14, పవిత్రమైన మాతృకను తృతీయ బీజముతో సంపుటితముగా జేయవలె. మొదట రెండు బీజములనుంచి తరువాత అంత్యబీజమునుంచవలె-15. తరువాత కొద్దీ వీస్తరముగా భూతలవిన్యాసము జేయవలె.. మూలాధారమున, నాభియందు, హృదయమున, కంఠమునను వర్గాష్టకమునుంచవలె-16. ముందు ఈ మూలాధార-హృదయ-శిరస్సులందు. శషసలనుంచవలె. తరువాత, చంకలు, నడుము, భుజములు, ఎడమ భుజము, నడుము, హృదయము-వీనియందుంచవలె-17. ప్రభూతములైన (పెద్దవియైన) క్రిందీ యాంగములందు దాదివర్గములనుంచవలె. ఋషి శబ్దబ్రహ్మ భూతలిపి ఛందము-18. ఈ మంత్రమునకు శ్రీమూలప్రకృతీ దేవత ఎత్తైన అక్షమాల-పుస్తకములు పుష్పబాణములు విల్లును-19, వరము అభయమును చేతులలోధరించినది, సాటిలేనిది, రక్షణకోఆంకైన అక్షమాలను కంఠదేశమున ధరించినది-20. కంఠహారములు, భుజభూషణములు, కంకణములు, మీనిచే గప్పబడిన వీరవీభూషణములు గలది, దీవ్యమైనమైపూతతోను మణికుండలములతోను అలంకరింపబడినది-21. “లిపి కల్పద్రుమము” యొక్క క్రింద రూపము దాల్చి యున్నకమలముననున్నది. భక్తవత్సలయైనది. సాక్షాత్తులిసీమయి-ఇట్టి భైరవీనీధ్యానించవలె-22. అనేక కోటిదూతులతోనంతట నలంకరింపబడిన యామెను ఈ విధము ధ్యానించి మరల అక్షరక్రముననుసరించీ భూతలముననుంచవలె-25. తరువాత మూలాధారము మొదలు ఆజ్ఞాచక్రావసానమువరకు వర్గాష్టకము నుంచవలె. శషసలను శిరస్సుననుంచి స్వరముల (అచ్చులను గూడ వీనిలోనే యుంచవలెను-24. హాదులను ఊర్ద్వము మొదలు ఐదు ముఖములందును, అగ్రమున; మూలమున, మధ్యమున, అంగుళీమూలమున, మజీబంధమున, బాహువులందున, పాదములందున-25. జఠరమున, కుడియెడమ, ప్రక్కలందు, నాభియందు, వీపునందును ఉంచవలె, శషసలను లాదీకములను మూలస్థానమున హృదయమున, శిరముననుంచవలెను-26. ఐదుహ్రస్వాచ్చులు (అణఉబలు) సంధ్యచ్చులు నాలుగు (ఏఐఓటి) “హయర'లు 'వల'లు 'అక'లు ఖగ-నగ-ఇది. శిష్టవర్ధకమున క్రమము-27. శషసలు-వీయన్నీయు నలుబడిదిండు అక్షరములు. మొదటిది ఐదక్షరముల వర్గము, రెండవది నాలుగక్షరముల వర్గము-28 పంచాక్షరి షడ్వరి తొమ్మిదవది త్రివర్ణము అనబడినది. బ్రహ్మ విష్ణువు - రుద్రుడు - కుబేరుడు- ఇంద్రుడు - యముడు- వరుణుడు, సోముడు- శక్తిత్రయము- వీరు వరుసగా తొమ్మండుగురు-వర్ణములకీశ్వరులు అనబడిరి. ఇది భూతలిపియొక్క క్రమము-30. ఈ విధముగా సృష్టియందుపాఠము విపరీతము. సంహృతియందు ఇవియే స్థానములు. వర్ణాంతములుగా విసర్గ బిందువులను చేర్పవలెను-31. ధ్యానమునకన్న పూర్వము ప్రాజ్ఞుడు రత్యాదిన్యాసమునాచరింపవలె. తరువాత మందారపు పూవువలెను-కుంకుమవలేను ఎఱ్ఱని యాకారముగలవారును-32. కాముని (కామేశ్వరుని) వామ భాగముననున్న వారు. విల్లమ్ముల ధరించినవారు ధ్యానింపదగినవారు. రతి ప్రీతియుతుడైన కాముడు కామినికి కాంతుడుగా కోరబడును-83. కాంతిమంతుడు, మోహినీయుక్తుడు కామాంగుడు విలాసీనితో గూడినవాడై కలహప్రియురాలినీ కామచారములతోననుసరించును-34, కాముడు కల్పలతతోగూడినవాడు. కాముకుడు: శ్యామవర్ణతో గూడినవాడు. కాముడు శుచిస్మితతో గూడినవాడు. బంధకుడు విస్మస్మితాయుతుడు-35, రమణుడు విస్మీతాక్షితో గూడినవాడు. ఈ రాముడు లేలిపోనతోగూడిన వాడు. రతినాథుడు (కాముడు)రమణితో గూడినవాడు, రతిప్రియుడు (కాముడు) దిగ్వస్తతో (దిగంబరితో) నొప్పినవాడు-56, రతినాథుడు వామన కుంజతో గూడినవాడు. అతడే ధరతోగూడినవాడు. రమాకాంతుడు రమచేనుపాసింపదగినవాడు. ఆమెను రమించుచు నిశాచరుడు. (రాత్రియంతయు రమించువాడు)-37. కల్యాణుడు మోహినీకి నాథుడు. సందకుడు ఉత్తమతోగూడిన వాడు. నంది. సురోత్తమతోనొప్పినవాడు. నందనుడు స్త్రీలనునందింపజేయువాడు-38. మంచి లావణ్యతో గూడినవాడు పంచబాణములుగలవాడు. బాలనిధీశ్వరుడు కలహప్రియతో గూడినవాడు అట్లే రతీయే సఖిగాలవాడు-39, పుష్పధనుడు గూడ ఏకాక్షితో గూడినవాడు. మహాధనుష్కడు సుముఖకు ఈశుడు. నల్లనివాడు జటలుగలవాడు క్రమముగా భ్రమణుడు వీడు పాలినికీపతి-40. భ్రమించువాడు శివకు కాంతుడు, భీముడు ముగ్గచే భ్రాంతుడు-భామకుడు - రమచేపొందబడినవాడు. వాడు భ్రమితుడై భృంగమనబడును-41. భాంతాచారుడు లోచనతోగూడిన వాడు, భ్రమావహుడు దీర్ఘజిహ్వికతో గూడిన వాడు. మోహనుడు రతిప్రియను అనుసరించును-42- మోహకుడు. పలాశాక్షితోగూడువాడు. అతనికి గృహిణియందే మోహమనబడినది. మోహధరుడు వికటకీశుడు. వర్ధనుడు ధరాయుతుడు-43. అనూపముడు మదకునాథుడు, మన్మథుడు మలయతోగూడినవాడు, మాదకుడు ప్రదీనితోగూడినవాడు. ఈ విధముగా గోరుచు విశ్వతోముఖియగును-44. భృంగపూర్వుడు నాయకుడు గాయకుడు నందినితోగూడినవాడు. గణకుడు సామతోగూడినవాడు. నర్తకుడు. కాలీ(ళి)తో గూడినవాడు. జైల్లకుడు కాలకర్ణితోగూడినవాడు. కందర్పుడు మత్తుడనబడును. నర్తకుడు శ్యామలకు కాంతుడు విలాసవంతుడు రషతోగూడినవాడు -46.కామవర్ధనుడు ఉన్మత్త నుసంగమించి యానందిచును. తరువాత ధ్యానపూర్వకముగా శ్రీకంఠాదిన్యాసమునుజేయవలె-47. సిందూరవర్ణము కాంచనవర్ణము-సమముగాను భయభాగములందును గలవాడును, పార్వతీ పరమేశ్వరులయలంకార చిహ్నములు గలవాడును, రెండుపాశములు, అక్షమాల వరాభయము హస్తములందుగలవాడునునైన యర్థనారీశ్వరుని స్మరించి కోరిన కోరికనే నెరవేరుటకై లిపీస్థానములలోనుంచవలె-48. శ్రీకంఠుడు, అనంతుడు, సూక్ష్ముడు, త్రిమూర్తి, అమరేశ్వరుడు, ఉర్వీశుడు భారభూతి, అతిధీశుడు, స్థాణుకుడు, హరుడు-49. చండీశుడు, భౌతికుడు, సద్యోజాతుడు, అనుగ్రహేశ్వరుడు, అక్రూరుడు, మహాసేనుడు-వీరు వరమూర్తులు-50. అట్లే ఏకరుద్రుడు, కూర్ముడు, ఏకనేత్రుడు, చతురాననుడు-51. అజేశుడు, శర్వుడు, సోమేశుడు, హరుడు, లాంగలి, దారుకుడు, అర్థనారీశ్వరుడు, ఉమాకాంతుడు, పాండ్యుడు, దండి-52. అత్రి, మీనుడు, మేషుడు, రౌహితుడు, శిఖి, ఖడ్లదండుడు ద్విదండుడు, సుమహాకాలుడు, వ్యాళి-53. భుజంగేశుడు పినాకి, ఖడ్గశుడు, బకుడు, శ్వేతుడు, అభ్రుడు, లకులీశుడు, శివుడు, సంవర్తకుడును నరమూర్తులు-54. పూర్ణోదరి, విరజ, మూడవదీశాల్మీలి, లోలాక్షి, వర్తులాక్షి దీర్ఘఘాణ-55. సుదీర్ఘముఖి, గోముఖి, తొమ్మిదవది దీర్ఘజిహ్విక. కుంజరీ, ఊర్ధ్వకేశ, ద్విముఖి, వికృతానన-56. సత్యలీల, కల, వీధ్యమొదలగువారు. సర్వశక్తులు. సర్వసిద్దులతోగూడిన మహాకాళీ-సరస్వతులు-57. గౌరి, త్రైలోక్యవిద్య, మంత్రాత్మశక్తిక, లంబోదరీ, భూతమత, ద్రావీణి, సొగరి-58, ఖేచరి, మంజరీ, రూపిణీ, వీరిణి, కోటర, పూతన, భద్రా, కాళి, యోగిని-59. శంఖిని, గర్జిని, కాలరాత్రి, కూర్గిని, కపర్దిని, వజ్ర, జయ, సముఖేశ్వరి-60.. రేవతీ, మాధవి, వారుణి, వాయవి, రక్షావధారిణి, తక్కిన సహజాహ్వయ-61. లక్ష్మీ, వ్యాపిని, మాయ, వీరందరు వర్ణశక్తులనబడినారు. దేవతాత్మాత్వసిద్దికొకు కేవలము రెండు మారులుచ్చరించిన పోలా మంత్రము యొక్క వర్ణములతో రంగమును జేసి పదునాలుగాన్యాసము జేయవలె. అచట ఓఘ్నశుడు మొదలగు వారిని మొదట ధ్యానపూర్వకముగా విన్యాసము జేయవలె-63. వారు బాలసూర్యకాంతిగలవారు. గజముఖముగలవారు. మూడుకన్నులుగలవారు, పాశము-అంకుశము-వర-అభీతులు, హస్తములందుగలవారు. శక్తిసమన్వితులు-64 విఘ్నేశుడు, విఘ్నరాజు, వినాయకుడు, శ్రీవోత్తముడు, విప్నుకృత్తు, విఘ్నహంత, విఘ్నరాట్టు, గణనాయకుడు -65 ఏకదంతుడు, ద్విదంతుడు, గజవక్రుడు, నిరంజనుడు, కపర్దవంతుడు, దీర్ఘముఖుడు, శంకుకర్ణుడు, వృషధ్వజుడు,-66. గణనాథుడు, గజేంద్రాస్యుడు, శూర్పకర్ణుడు, త్రిలోచనుడు, లంబోదరుడు, మహానాదుడు, చతుర్మూర్తి, సదాశివుడు -67 ఆమోదుడు, దుర్మదుడు, సుముఖుడు, ప్రమాదకుడు, ఏకపాదుడు, ద్విపాదుడు, శూరుడు, వీరుడు, షణ్ముఖుడు, -68 వరదుడు, నామదేవుడు, వక్రతుండుడు, ద్వీదంతకుడు, సేనాని, గ్రామణి, మత్తుడు, మత్తమూషకవాహనుడు -69 జటి, ముండి, ఖద్ధి, వరేణ్యుడు,వృషకేతనుడు. భక్ష్యప్రియుడు, గణేశుడు, మేఘనాదుడు, గణేశ్వరుడు, -76- వీరు వరుసగా ఏబది వర్ణములకు గణేశులు, శ్రీ స్త్రీ, పుష్టి శాంతి, తుష్టియు, సరస్వతి,-71 రతి, మేధ, కాంతి, కామిని, మోహిని, తీవ్ర, జ్వాలినీ, నంద, సుయశ, కామరూపిణి -72 ఉగ్ర, తేజోవతి, సత్య, విఘ్నేశాని, స్వరూపిణి, కామార్త, మదజిహ్వ, వికట, ఘూర్జీతానన, -73 భూతి, భూమి, ద్విరమ్య, అమారూప, మకరధ్వజ, వికర్ణభ్రుకుటి, ఆజ్ఞ, దీర్ఘమౌణీ, ధనుర్ధరీ, -74 యామిని, రాత్రీ, చంద్రకాంత, శశిప్రభ, లోలాక్షి, చపల, ఋజ్వి, దుర్బగ, సుభగ, శివ,-75. దుర్గ, గుహప్రియ, కాలి, కాలజిహ్వ - వీరు శక్తులు, ధ్యానపూర్వకముగా సమాహీతుడై, తరువాత గ్రహన్యాసముజేయవలె-76, వరద -అభయ, చిహ్నములుగల చేతులతో నొప్పినవారు, శక్తిచే ఆలింగింపబడిన విగ్రహముగల వారు, కుంకుమ క్షీరము, రక్తము, మల్లెమొగ్గ, బంగారము, శంఖము వీనితోను, మేఘము-ధూమము- చీకటీ-వీనితోనుపోలిన వారినిగా సూర్యాదులను తొమ్మండుగురిని స్మరింపవలె. హృదయముక్రింద సూర్యునుంచవలె. శిరమున చంద్రునుంచవలె. కన్నులలో కుజునుంచవలె-78. హృదయమున శుక్రుని, హృదయమధ్యమున బుధుని, కంఠమున పృహస్పతిని, నాభియందు శనైశ్చరుని, ముఖమున రాహువును, పదద్వయమున కేతువును ఉంచవలె-75.తరువాత, మండుచున్న కాలాగ్నితో సమానులు, వరద-అభయ చిహ్నములు హస్తములందుగలవారును, సర్వాభరణముల చేనలంకరింపబడినవారునునైన తారలను ధ్యానించుచు న్యసించవలె-80. నుదుట కన్నులలో, చెవులలో, ముక్కురంధ్రములలో, కంఠమున, భుజములపైనను, తరువాత మోచేతులలో, మణికట్టులలోను-81. స్తనములలో,నాభియందును, నడుమునందును, తొడలయందును, మోకాళ్లయందును, పిక్కలయందును, పాదములయందును శుద్దుడైయోగినీ న్యాసముజేయవలె. అట్లే హృదయమున-82, నాభియందు, స్వాధిష్టానమందును మూలాధారమందును, భ్రూమధ్యమున, శిరమున క్రమముగా పద్మ-ఇందుకర్ణికల మధ్యన దళములందు వర్ణశక్తులను, -83.తరువాత దళాగ్రములందు పద్మము యొక్కశిరమున అన్నిశక్తులను వ్యిన్యసిపంపలే అమృత, నందిని, ఇంద్రాణి, ఈశానీ, అత్యుమ-84 ఉర్ధ్వకేశి, ఋద్విదుషి, (అచ్చుకారిక, ఏకపాదాత్మక,ఐశ్వర్యాకారిణీ, ఔషధాత్మిక-85. అంబిక, రక్షాత్మక, అనునవి పదునాలు శక్తులు. కాలిక, ఖేచరి, గాయత్రీ, ఘంటాధారిణి-86. నాదాత్మక, చాముండ, ఛత్రిక, జయ, ఝుంకారిణి, సంజ్ఞ, టంకహస్త, ఓంకారి మీరు క్రమముగా పండ్రెండుగురు శక్తులు. ఢంకారి, టంకారిణి, జామీని, తామసీ, ధంకారిణి, దయ, ధాత్రి, నాదిని, పార్వతి, ఫటికారిణీ, ద్వయ పన్నగశక్తులు(పదుగురు శక్తులు)-89. వర్దిని, భద్ర, మజ్జ, యశస్వినీ, రమ, లామనీ, వరుసగా నీయాఱుగురు శక్తులు-90. . నారద, శ్రీ, షండ, శశ్వతీ- ఇవి ఈ నాలుగు శక్తులు, హాకిని, క్షమ ఇవి రెండు శక్తులు-1, తరువాత పాదమున, భీంగమున, కడుపునందు, హృదయమున, బాహువులందు, శిరమున, కుడినుండి యొడమపాదముచివరి వరకు మేషాదిరాశులను విన్యసింపవలె-92. తరువాత ఏబదీ ఫీఠములు, ఒక చక్రమము-మనస్సు--వీనిని విన్యసింపవలె. వారాణసి, కామరూపము, నేపాలము, పౌండ్రవర్థనము-93. కాన్యకుబ్జము వరస్థిరము, పూర్ణశైలము, అర్బుదము. ఆమ్రతకేశ్వరము ఏకామము, త్రీస్తోతము, కామకోర్ధకము-4 కైలాసము భగునగరము, కేదారము చంద్రపుష్కరము, శ్రీపీఠము, ఏకవీర, జాలంధ్రము, మాలవము-95. కులాన్నము, దేవికోటము, గోకర్ణము, మారుతేశ్వరము, అట్టహాసము, విరజము, రాజవేశ్మము, "మహాపథము-96. కోలాపురము, ఏలాపురము, కాలేశ్వరము, జయంతిక, ఉజ్జయిని, చిత్రీ, క్షీరకము, హస్తినాపురము-97. ఉడీర, ప్రయాగ, షష్టిమాయాపురము, గౌరీశము, సలయము, శ్రీశైలము, మరువు -98. గిరివరము, తరువాత మహేంద్రము, వామనగిరి, హిరణ్యపురము, మహాలక్ష్మీపురము-69. పురోద్యానము, ఛాయాక్షేత్రమునుగూడ విద్వాంసులు చెప్పుదురు. వీనిని లిపిక్రమసమాయుక్తములుగా జేసి లీపిస్థానములలో విన్యసింపవలె-100. తరువాత, లీపీసంక్రమమువల్ల చెప్పిన స్థానములలో తక్కిన వానిని గూడ విన్యసింపవలె. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిన షోడాన్యాసము నాచే చెప్పబడినది-101. ఈ విధముగా విశ్వసించిన దేహముగలవాడు దేవతా విగ్రహుడేయగును. తరుపోత ముందు అణు విభాగములు చేసి శ్రీ చక్రన్యాసమునాచరింపవలె-102. అంశాలగాయిత్తు 'ఆనంద్యమూర్తివరకు మంత్రములతో వ్యాపకమును చేయవలె, చక్రేశ్వరుని, చక్రసమర్పణ మంత్రములను హృదయమునన్యసింపవలె-103. తరువాత తక్కినవానిని చెప్పిన స్థానములలో గణపతి మొదలగు వారిని న్యసింపవలె కుడితొడకు సమముగా ఎడమతొడనుంచి అందరి నచట క్రమముగా విన్యసంపవలే -104 గణేశుని క్షేత్రపాలుని, యోగినిని, బటుకుని నుంచవలె, మొదట. నీంద్రాదులను కాలిబొటనవ్రేళ్ల చీవరలలోను-105. మోకాలు ప్రక్కభుజములుశిరము-ముఖము-ప్రక్కమోకాళ్ళు, శిరములు వీనితోను ఉంచవలె. మూలాధారమున పద్యణిమాది సిద్దులనుంచవలె-106. తరువాత (వానినే భుజములు బాహువులు- వీపు- రొమ్ము- పాదాగ్రములు, పిరుదులు, బాహుదేశములు- వెన్ను-శిరము. రెండుపాదములు వీనియందు క్రమముగానుంచవలె-107, అజీమ-లఘిమ- మూడవది మహిమ- ఈశిత్వము- వశిత్వము- ప్రాకామ్యము- ప్రాప్తిఇచ్చాసిద్ది -రససిద్ది- మోక్షసిద్ధి ఇవి పండ్రెండు సిద్ధులనబడినవి-108. తరువాత ఓ బ్రాహ్మణా! అగస్త్యా బుద్ధిమంతుడు ఎనిమిది మాతలను క్రమముగా కాలి బొటన వ్రేళ్లజంటలోను, కుడిప్రక్కన, శిరమున, ఎడమ వైపున;ఎడమ మోకాలిలోను, కుడిమోకాలిలోను, కుడియెడమ భుజములలోను-110. (ఉంచవలె) బ్రాహ్మి-మహేశ్వరి- కౌమారి-వైష్ణవి-వారాహీ ఇంద్రాణీ- ఏడవది చాముండ మహాలక్ష్మి-వీరు క్రమముగా ఏడుగురు మాతలు అని బుధులు దెలియవలె. వీనియందే ఎనమండుగుర ముద్రాదేవతల నుంచవలె, వీనిలోనే అయిరువురినుంచవలె-112. శిరమున పాదమున సర్వసంక్షోభిణీ-సర్వవిద్రావిణి ముద్రలు తరువాత సర్వార్ణాకర్షిణి-113, సర్వాద్యవశకరిణి, సర్వాద్యప్రియకారిణి, సర్వాద్యమహాంకుశి, సర్వాధ్యఖేచరి-114. త్రిఖండ సర్వబీజ, సర్వప్రపూరికాముద్ర యోనిముద్ర అని తెలియవలె, అచట చక్రేశ్వరి నుంచవలె-115, త్రైలోక్యమోహనమైన చక్రమును సమర్పించీ శరీరమున వ్యాపకము జేయవలె. తరువాత వరుసగా పదునాలు నిత్యకళలునుంచవలె-116, కామాకరణరూప, శబ్దాకర్షణరూపిణి, అహంకారాకర్షిణి, శబ్దాకరణరూపిణి-117. స్పర్శాకర్షణరూప రూపాకరణరూపిణి. రసాకర్షణరూప గంధాకర్షణరూపిణి-118 చిత్తాకర్షణరూప ధైర్యాకర్షణ రూపిణీ, స్కృత్యాకర్షణ రూప హృదయాకర్షణరూపిణి-119 శ్రద్దాకర్షణరూప ఆత్మాకర్షణరూపిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణిగా చెప్పబడినది. -120. స్థానములు- ఎడమచెవి, వీపు, భుజము, మోచేయి, కుడిచేతి పైన-వీపు, పిరుదు-మోకాళ్ళు- పీక్కలు-121. పాదాగ్రములు, ఎడపాదాగ్రములు మొదలుకొని విలోమముగ చక్రేశ్వరిని న్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాపనము జేయవలె-122. తరువాత ఎనమండుగురును అనంగకుసుమదేవ్యాదులను నొసలు, మూపుయొక్కసంధులు, తొడలు, పిక్కలు, న్యసింపవలె. ఎడమవైపున ప్రతిలోమముగా న్యసింపవలె-123. అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర -124, అనంగరేఖ, వేగయను అనంగపూర్విక, అనంగాంకుశ, అనంగాధారమాలిని-125. చక్రేశ్వరి వీనిని విన్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాపకకర్మచేయవలె. ఆ తరువాత సర్వంక్షోభిణ్యాదులైన శక్తి దేవతలను విన్యసింపవలె. -126 నొసట, చెక్కిళ్లయందు, భుజమునందు, పాదమూలమునందు మోకాలియందు పిక్కపైన క్రిందను, ఎడమవైపున విలోమముగ న్యసింపలె-127. సర్వసంక్షోభిణీ శక్తి, సర్వవిద్రావిడి, సర్వాద్యాకర్షిణీశక్తి, సర్వప్రహ్లాదీని, సంమోహినీశక్తి, సర్వాద్యోస్తంభిని, సర్వాద్యాజృంభిశక్తి, సర్వాద్యావశకారిణి-124 సర్వాద్యారంజనీశక్తి, సర్వాద్యోన్మాదిని, సధినీశక్తి, సర్వాశాపూరిణీ-130. సర్వమంత్రమయీశక్తి, సర్వద్వంద్వక్షయంకర. చక్రేశ్వరిని విన్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాకపము జేయవలె-131. తరువాత సర్వసిద్ధి ప్రదాదుల పదుగురిని విన్యసింపవలె. కుడివైపున ముక్కుపుటమున, దంతమూలమున కుడిస్తనమున-132. మోచేతియందు, మణికట్టునందు, విన్యసింపవలె. ఎడమవైపున విలోమముగానుంచవలె. నిత్యము సర్వసిద్ధిప్రద సర్వసంపత్ర్పద-133. సర్వప్రియంక్వారాదేవి, సర్వమంగళకారిణి, సర్వాఘమోచనీశక్తి, సర్వదుఃఖవిమోచిని-134. సర్వమృత్యుప్రశమిని, సర్వవిఘ్నవినాశిని, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయినీ-135. చక్రేశ్వరిని వీస్యసించి, చక్రము నర్చించి, శరీరమున వ్యాకపము జేయవలె. తరువాత, సర్వాజ్ఞాద్యులను - తొమ్మున, దంత స్థలమున విన్యసింపలే, -136 సర్వజ, సర్వశక్తి, సర్వజ్ఞానప్రద, సర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశినీ-137. సర్వాధారస్వరూపక సర్వపాపహర, సర్వానందమయీదేవి, . సర్వరక్షాస్వరూపిణి, పదవది సర్వేప్సిత ఫలప్రద-138. చక్రేశ్వరిని విన్యసించి చక్రము నర్చించి శరీరమున వ్యాపకము చేయవలె, ముందు (తూర్పున) వామాదులను విన్యసించి తరువాత పక్షిణ్యాదుల విన్యసింపలలె. 139 కుడివైపున - గదవయందు, కంఠమున, స్తనమున, నాభియందు, ప్రక్కలందు, పామా, వినోదిని, విద్య, వశిత, కామిక-140 కామేశ్వరి, పరా, మోహిని విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని, అని ఆశక్తులనామములను పండితులు చెప్పిరి. -141. చక్రేశ్వరిని విన్యసింపవలె. చక్రమునర్చించి శరీరమున వ్యాపకమును జేయవలె. హృదయమున త్రికోణమును సంభావించి తూరుపు మొదలగుదిక్కులందు వరుసగా-142. వీన్యసింపవలె. బుద్ధిమంతుడు వానికి వెలుపలగూడ నాలుగాయుధములను ఆగ్నేయది మూలలందు విన్యసీంవలె, మధ్యన నాలుగు పీఠములనుంచవలె-148. మధ్యవృత్తమును న్యసించి నిత్యాషోడశికను న్యసింపవలె. నిత్యాకామేశ్వరి, నిత్యాభగమాలిని-144, నిత్యక్లిన్న, నిత్యాభేరుండినీ నిత్యావహ్నివాసినిక, నిత్యామహావజ్రేశ్వరి-145, నిత్యాదూతీ, నిత్యాత్వరిత, నిత్యాకులసుందరీక, -146. నిత్యానీలపతాక, నిత్యాపరావీజయ, నాత్యామంగల-147. నిత్యాప్రభామాలినిక, నిత్యాచిత్ర-వీరిని త్రికోణాంతరముగా ఏమనుండీ హృదమయమువరకు విన్యపింపవలె-148. నిత్యాప్రమోదిని, నిత్యాత్రిపురసుందరి, హరిమధ్యన అఖండజగదాత్మకమైనదేవిని విన్యసింపవలె-149. చక్రేశ్వరిని హృదయమున విన్యసించి, చక్రమును పైకెత్తబడిన దానినిగా జేసి యోని ముద్రను ప్రదర్శించి, సర్వానందమంత్రమును జపించవలె. -150. ఈ విధముగ ఆత్మచక్రమునకు చక్రదేవి దేవిగాగలదు. -151.
ఇది శ్రీ బ్రహ్మాండమహా పురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున నలుబదీ నాల్గవ అధ్యాయమున లిలితోపాఖ్యానము సమాప్తము.
శ్రీమత్పతాపగడపత్తనమధ్యముననుండు శ్రీరామగథ నివాసియైన రఘునాథునిచే సంశోధింపబడిన యీ నిఖిలమాన్య బ్రహ్మండపురాణము మొత్తము విద్వన్మోదము గూర్చుగాత. రఘునాథునిచే శోధించడినను ఎచటనైనను సంశుద్ధము గానీది ఉన్నచో దయతో ఆ మొత్తమును క్షమింపగోరెద.
Summary of chapter 156 of the Brahmānda Mahā Purana is as follows:
Bringing the entire Brahmāṇḍa Purāṇa to a glorious, blissful conclusion, this final chapter offers profound blessings to all who read, listen to, or preserve this divine scripture. It summarizes the ultimate message of devotion, righteousness, and self-realization, bestowing health, prosperity, peace, and final liberation upon all faithful souls. The devoted reader bows in deep prostration before the supreme creator and the divine mother, their heart overflowing with eternal love, peace, and supreme gratitude.