27 -  గణనాథపరాక్రమో  

బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యాసమున గణనాథపరాక్రమమను - నిరువది యేడవ యధ్యాయము.

ఆ తరువాత, పుత్రులు నశింపగా శోకాగ్నితో జుట్టబడి కులక్షయము జరిగినదని తలచి భండాసురుడు విలపించెను-1. హా! పుత్రులారా! హా! గుణోదారులారా! హా! నాయందే ముఖ్యముగానాసక్తులారా! హా! నా కన్నుల సుధా ఫూరములారా! హా! నాకుల వివర్ధను లారా!-2. హా! సమస్త దేవతా శ్రేష్ఠుల మదముల భగ్నము జేయుటలో తత్పరులారా! హో! సమస్తసురస్త్రీల యంతరంగముల మోహింపజేయు మన్మథులారా!-3. నాకు మారుపలుకుడు. ఇపుడు నా తోడపై నెగురుడు. మీరేలయిపుడీ తండ్రిని వదిలి సుఖముగా వెళ్లితిరి?-4. ఓ నా పుత్రులారా! మీరు లేక నా యీ రాజ్యములు శోభించుచు లేవు. నా భవనములు శూన్యములు. నా రాజసభయు శూన్యము-5 దురాశయురాలిచే నీ విధముగా నీఃశేషముగా జంపబడితిరి? తిరస్కరీంపబడిన భుజ బలములు గలిగి నాకులాంకురములైన మిమ్ములను ఒకేమారు ఆ దుష్టవనిత సంగరమున నెట్లు వధించినది?-7. నా సౌఖ్యములు నశించినవి. నా కుల స్త్రీలు నశించినారు. కులక్షయముగాగా నా సాహసములును, సుఖములును నశించినవి. నా పూర్వ జన్మమున జేయబడిన పుణ్యములచేతను మీ పుణ్యములచేతను మీమ్ముల బోండితిని. అట్టి మీకు నాశము జరిగినందున నేను నష్టుడనైతిని-8. హా! హతుడనైతిని, ఆపద జెందితినీ. పుత్రకులారా! మంద భాగ్యుడనైతిని. ఈవిధముగా శోకమున నావరింపబడుచు, ఏడ్చుచు చెదరిన తల వెంట్రుకలు గలిగి మూర్ఛచే లోపించిన హృదయము గలవాడై రాజు ఆసనమునుండి క్రిందబెడను-9. విశుక్రుడు, విషంగుడును, కుటిలాక్షుడును ఆ సభలో ఇవి దైవము యొక్క కుటిల క్రమములని భండాసురునోదార్చిరి-10.

విశుక్రుడనెను - దేవ! పామరుని వలె నేల శోకమునకు వశుడవైతివి? మహాయుద్దమున (వీర) మరణముజెందిన పుత్రుల గూర్చి నీవేడ్చుచుంటివి-11. వీరులకిది ధార్మికమై శాశ్వతమైన మార్గము. వారు యుద్ధమున పూజ్యమనదగిన మృత్యువు నందిరి. అది దుః - భీంపదగినది కాదు-12. ఒక స్త్రీ మన నాశము కొఱకే. వచ్చి రణమున హఠాత్తుగా మన సుభటులను జంపుట శల్యమువలె నామనమును  బాధించుచున్నది-13. ఈ విధముగా విశుక్రుడు చెప్పగా భండాసురుడు పుత్ర శోకమును వదిలెను. కాలాగ్నితో సమానమైన కోపమును వహించెను-14. ఆతడు కోశము నుండీ భయంకరమై యమునివలెనున్న ఖడ్గమును పైకి దీసెను. తన రెండుకన్నులను పెద్దవిగా జేసెను. తేజముతో మిక్కిలి ప్రకాశించేను-15. ఇపుడే దుష్టురాలినీ యుద్ధమున నాయీ ఖడ్గముతో ముక్కముక్కలుగా చేసి బంధువులతో సహా విశ్రాంతిని బొందెదను-16. అపుడాతని వర్ణములు రోషముతో స్టలితములగుచుండెను. బుసకొట్టుచున్న నాగుబామువలె నుండెను.  ఖడ్గమును విదిలించుచు. మిక్కిలి మదించిన వానివలె పైకిలేచి కదిలెను-17. సమస్తదానవ శ్రేష్ఠులు సంక్రాంతులై యాతని నడ్డిరి.  మిక్కిలి క్రోధమున మండిపడుచు లలితను గూర్చి యిట్లనిరి-18. ప్రభూ ఆమె కొరకు ఇటువంటి సంభ్రమము అవసరములేదు. మా బలములతో గూడుకొని మేము రణోత్సాహమున వెడలెదము-19. మీ చిన్నియాజ్ఞను బొంది అకస్మాత్తుగా భువనమంతయు మర్దింపగలము. ఆ ముగ్గురాలైన స్త్రీ ఒక లెక్కయా?-20. ఏడు సముద్రముల నొక్కమారుగా జుట్టవలెనా? లేదా. సప్తకుల పర్వతములను చూర్ణము చేయవలెనా? ఈ ముల్లోకములను తల్లక్రిందులుచేయవలెనా?-21. సమస్త దేవతలను ఛేదించెదము. వెరీ భవనములను భేదించెదము. దీక్పాలురను పిండి చేసేదము, ఓ మహామతీ! ఆజ్ఞనీండు-22, మహాహంకార గర్వముతో బలికిన యీ మాటలను వినీ, కోపించి, కోపమున కన్నులెల్లజేసెను-23. ఓ విశుక్రా! మాయచే, అదృశ్యమైన యాకారముతో వెళ్లి శత్రు రాజధానిలో జయవిఘ్నమను మహాయంత్రమును స్థాపించుము. ఈ మాటలు విని విశుక్రుడు కోపోద్విగ్నుడయ్యెను. మాయచే-  అదృశ్యమైన శరీరము గలవాడై లలితాదేవి సైన్యములోనికి వెళ్లాను-25, వాడు పోవుట కుద్యుక్తుడుగాగానే సూర్యుడస్తమించెను. అస్తమించిన సూర్య కిరణములచే దీక్కుల ముఖములన్నియు నెఱ్ఱనైనవి-26. అనురాగ వతియైన సంధ్య పాతాళమను పొదరింటిలో రమించుటకా యనునట్లు ఉత్సుకురాలై  కిరణమాలలు ధరించిన సూర్యుని వెంబడించేను-27, అస్తసముద్రమున వేగముగా బడుచున్న సూర్యుని తాకిడికి లేచిన నీటిబిందువులు  చుక్కలా యన్నట్లు బ్రకాశించినవి-28. ఆ తరువాత కాటుకవలె నల్లనైన చీకటి తనతో సమానమైన వర్ణముగల కత్తులకు తోడ్పాటు చేయుటకా యన్నట్లు వచ్చేను-29. మాయారథమునెక్కి గూఢమైన కటిక చీకటితో నావరింపబడి. అదృశ్యమైన యాకారము గలిగిన యా నీచుడగు వీశుక్రుడు లలితా రాజధానీ నగరమును జేరెను-30. అచటికి వెళ్లి యా దుర్మతి విశుక్రుడు మండుచున్న జ్వాలలు గలదియు, నూరు యోజనముల విస్తారముగలదియు నైన అగ్ని ప్రాకార (కోటగోడ) మండలమును జూచెను-31. అచట లలితా దేవి యింటి చుట్టు తిరుగుచు అవకాశము లభింపగనే దక్షిణ ద్వారమును జేరి క్షణ కాల ముద్దతుడై చింతించెను-32. అచట, మహాసత్త్వలు, సావధానలు, ఆయుధముల ధరించినవారు, వాహనములనెక్కినవారు, కప్పుకొనిన కవచములు గలవారు, ద్వార దేశమునన్న వారునైన-33. స్తంభిని మొదలగు శక్తులను జూచెను. వారు ఇరువది యక్షౌహిణీ, సేనలతో గూడిరి. దండనాథ వారినెల్లప్పుడు ద్వార రక్షణకై నియోగించేను-34 ఇది చూచి యాశ్చర్యపడి చాలసేపాలోచించి, యపుడో లలితాదేవియింటి వెలుపలనే యుండి (విఘ్న) యంత్రమును విస్తరింపజేసెను -35. రెండు కోసుల పొడవు రెండు కోసుల వెడల్పు (విస్తరముగల మక్కిలి గోప్పనైన శిలాపట్టమున నాయుత్తమ యంత్రమును వ్రాసేను-36. ఎనిమిది దిక్కులలో అష్ట శూలములు గలిగి, సంహారాక్షరములు మౌళియందు గలిగిన యెనిమిది దేవతలతో గూడిన యంత్రమును చక్కగా వ్రాసెను -37. ఆయష్ట దేవతలు - అలస, కృపణ, దీన, నీతంద్ర, ప్రమాలిక, క్లీబ, నిరహంకార - యనువారు -38. మాయావి విశుక్రుడు ఈ యెనిమిది దేవతలను ఎనిమిది శూలముల పుటములపైన నియోగించి వ్రాసిన యంత్రమును చక్కగా మంత్రించేను-39. ఆ యంత్రమునకు మేకపోతులు మొదలగు వానితో బలిపూజలను చేసి యా యంత్రమును శత్రునగరమున రణమున నుంచేను-40. ప్రాకారము వెలుపల నున్నయా దుర్బద్ధి విశుక్రుడుంచీన యా యంత్రము దుమీకి రణమున కటకాంతరమున బడెను-41. ఆ యంత్రము యొక్క వికారముచే కటకములోనున్న శక్తులందరును దీనమనస్కులై శస్త్రములవదిలి శస్త్ర సన్యాసము జేసిరి-42. “చచ్చిన రాక్షసులేమీ చేయలేరు. కావున శస్త్రాస్తాదుల యుద్దమికచాలు. అథ వా జయముతో సిద్ధించిన ఫలమేమి? కావున యుద్దమున యుభయ ప్రాణుల హింసతో పాపము సంపాదించుట మాత్రము జరుగును-43, దేవతల కై చేసిన యీ యుద్ధయున మనకేమి లాభము కలుగును? వ్యర్థముగా కలకలముచే సెడి యుద్ధ కర్మచే ఫలితము శూన్యము-44. స్వామిని యైన మహారాజ్ఞయెవరు? ఈ దండనాయిక యెవరు? ఈ శ్యామయైన మంత్రిణి యెవరు? ఇక మన సేవకత్వమెట్టిది?-45. ఇట సేవికలమైన మన యంగిరకి నొక్కరితయ స్వామిని. ఆమె పనీలో మనకేమీ గొప్పతనము కలిసి వచ్చును-46, ఇతరుల మర్మములను ఛేదించు నాయుధములతో బ్రయోజనములేదు. మన దేహములకు శస్త్రముల దెబ్బలతో గాయముల నిచ్చుయుద్దము శమించుగాక-47. యుద్ధమున మరణము గలుగును. అట్లు మన జీవితములు వ్యర్థములగును. యుద్ధమున మరణము తప్పక కలుగుననుటలో యథార్థతలేదు -48. ఉత్సాహముతో ఫలములేదు. నిద్ర యొక్కటియే సుఖావహము. ఆలస్యముతో సమానముగా చిత్త విశ్రాంతి నిచ్చు మరొకటిలేదు-49. ఇట్టి వారినిగా దెలిసికొన్న యా రాజ్ఞియేమి చేయగలదు? ఆమె రాజీత్వము మన సమూహముచేత నేర్పడినది-50. ఈ విధముగా మనము పేక్షించినచో నామే నష్టబలురాలగును, నష్ట బలురాలైన రాజ్ఞిమననెవ్వరిని శిక్షింపగలదు-"51". ఈ విధముగా రణారంభమును వదిలి, ఆయుధముల విడిచి, శక్తులు నిద్రచే ద్వారమున తిరుగుచున్న వారివలె నుండిరి-52. కార్యములందంతటను మాంద్యము వచ్చేను. గొప్పయాలస్యము గూడవచ్చేను. శక్తుల యొక్క మహాకటకము(సగరము) శిథిలమయ్యెను-53. ఈ విధముగా విశుక్రుడు జయవిఘ్నమును మహా యంత్రమును జేసి దాని ప్రభావముతో నగరమంతయు మథింపదలచి, రెండవదివసము యొక్కయర్థరాత్రి దాటగా-55, మరలముప్పది అక్షౌహిణీసేనలతో గూడి విశుక్రుడు శత్రు నగరము పైకి వచ్చేను- 56. అంత రణభేరీ నాదములు వినబడెను. అయినను ఆ శక్తులు నగరముననే యుద్ధ ప్రయత్నము లేక యూరక యుండిరి-57. అపుడు మహా ప్రభవతులగుటచే మంత్రదండనాథలను ఆ వీఘ్నయంత్ర వికారములు తాకలేదు. కాని తక్కిన శక్తులు ఆ వికారములకు వశులగుటచే మిక్కిలి చింతించిరి-58. ఆశ్చర్యము. అయ్యో మహాకష్టమైన భయము వచ్చిపడినది. దేని వికారముచే సైనికులు నిర్గతోద్యోగులైరి?-59. వారి యందా యుద్ధ సంరంభమస్తమించినది. నీద్రాలసలై తిరుగుచున్నారు. మా వాక్యములను గౌరవించుటలేదు, మహేశ్వరి నర్చించుటలేదు. ఔది సీన్యమును వహించుచున్నారు. మొత్తముపైన శక్తులందరు నిస్పృహలైనారు ఎందులకు?-60. అని యీ విధము మంత్రీడీదండనాథలు చింతా పరాయణలై చక్రరథమునెక్కి మహారాజ్ఞితో నిట్లనిరి-61.

మంత్రిణి యనెను:- ఓ దేవి! ఇది దేని వికారము? శక్తులు రణప్రయత్నము లేనివారైరి, ఓ మహారాజ్ఞి! విశ్వమంతట పాలింపబడిన నీ యాజ్ఞను ఈ శక్తులు వినుటలేదు-62. ఒండొరులు విరక్తలు. సర్వ కర్మలకు పరాజ్ముఖులు (పెడమొగము బెట్టినవారు). నిద్రతో తూగుచు ముడుచుకొనీపోయినవారు. దుర్వాక్యముల విస్తరింపజేయుచున్నారు-68. దండిని యెవరు? మంత్రిణి యెవరు? మరి మహారాజ్ఞి యెవరు? యుద్దము గూడనెట్టిది? అను నిందలను విస్తరింపజేయుచున్నారు-64. ఇంతలోనే మహాబలుడైన శత్రువు ఉద్దండ భేరీ  నాదములచే భూమ్యాకాశముల బ్రద్దలు గొట్టుచున్నాడాయనునట్లు వచ్చేను-65. ఇచట సంభవించిన దానిని మహా రాజ్ఞి తెలిసికొనుగాక.  - అనీ చెప్పి దండినితో సహా మంత్రీడీ లలితాదేవికి నమస్కరించెను-66. అంతూ లలితాదేవి కామేశ్వర ముఖమున చూపు నిలిపి  మిక్కిలి యెఱని దంత పంక్తి గలదై చక్కగా చిరునవ్వు నవ్వెను-67. ఆమె యొక్క చిరునవ్వు కాంతిపుంజమున ముఖము మాత్రము ఏనుగ ముఖముగా, గండ స్థలమునను భుజమధ్యమునను స్రవించుచున్న మదముగల యొకడు గజాననుడు) విజృంభించెను-68. ఆతడు, మందారపు పూల గుంపువలె నేఱనైనవాడు, బాల చంద్రుని శిరమున దాల్చీనవాడు, బీజపూర్, మాదీ, ఫలగదను చేజకు విల్లును శూలమును సుదర్శన చక్రమును-69. కమలమును పాశమును వరిచేరును వరదమును అంకుశమును రత్న కుంభమును తన పది హస్తములతో ధరించినవాడు -70. బొజ్జకడుపువాడు, చంద్రుడు సిగలో గలవాడు, మంద్రమైన బృంహిత ధ్వని (ఘీంకారధ్వని) గలవాడు, సిద్ది లక్ష్మితో కౌగిలింపబడినవాడు, అట్టి గణేశ్వరుడు మహేశ్వరికి నమస్కరించెను-71. ఆమెతో నాశీస్సులను బొందిన యా మహాగణనాధుడైన గజాననుడు జయవిప్ను మహాయంత్రమును ఛేదించుటకై, వేగముగా బయలుదేరెను-72. రాచనగరు లోపలనే తిరుగుచున్న . గజాననుడు గూఢముగా నొక చోట నంటియున్న జయ విఘ్న యంత్రమును జూచెను-73.  ఆ గజాననదేవుడు తన భయంకర దంతములతో తీవ్రముగా బొడిచి క్షణములో జయవిఘ్నశిలను చూర్ణము గావించేను-74. ఆ యంత్రముననున్న దుష్ట దేవతలతోబాటు మొత్తమును దుమ్ముదుమ్ముగా జేసి యా యంత్రమును ఆకాశమునకు విసిరివైచెను-75 అంత కిలకిలా రావముజేసి, ఆలస్యమును వదీలి, శస్త్రపాణులై శక్తులు యుద్ధము జేయ సుద్యుక్తలైరి-76. అట్లే  ఆ గజాననుడు కంఠమున నేదురులేని పెద్ద ధ్వని జేయుచు విశుక్రుడు సృష్టించిన జయయంత్రమును రాత్రిలో ధ్వంసము జేసెను-77. ఈ వృత్తాంతమును విని భండాసురుడు క్షోభము జెందెను. గజాననుడు తన రూపములుగల బహు గజముఖులను సృజించెను-78. వారీ గండ స్థలముల నుండియు భుజాంతరముల నుండియు స్రవించు మదమునకు వచ్చిన తుమ్మెదలు గుంపులుగా వచ్చి వారి మహోదయమును.వలే గానము జేయుచెండును-79. వారు ప్రకాశించు దాడిమీ పుష్ప కింజల్కము వంటి కాంతి గలవారు. ఎల్లప్పుడు రత్నాకరములను. (సముద్రములను) ఒక్క హేలతో రక్షించుటకుద్యుక్తులైనవారు-80. ఆమోదుడు మొదలగువారు. బుద్ధి మొదలగు శక్తులచే సేవింపబడినవారు. ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు -81. అరిఘ్నుడు, విఘ్నకర్త, ఈ యారుగురు.. విఘ్న నాయకులు. వారు ఏడు కోట్ల హేరంబులకు (శౌర్య గర్వితులకు) నాయకులు -82. వారు మహా గణపతి యొక్క రణమున ముందుగా బోయి, అగ్ని ప్రాకారవలయము నుండి బయలువెడలి-83.  క్రోథ హుంకారములతో అనేక ముఖముగా దానవులపై బడిరి. భయంకరమైన ఫూత్కారముతో లోకములు చెవుడు బారినవి-84 ఈ విధముగా గణమండలములతో గూడిన సైన్యగణము రాక్షస సైన్యములపై బడెను. ఆ గణనాథుడు . వాడి బాణములతో దానవులను ఛేదించెను-85. గణనాథునకును, మహౌజస్కుడైన విశుక్రునకును తమ తమ హుంకారములే ధనుష్టంకార ధ్వనులను భేదింపగా యుద్ధము జరిగెను-86. ఒక చక్రముగా కనుబొమ్మలను ముడిచి కరచుటచే పెదవి యెఱగాగా విశుక్రుడు గణనాథునితో యుద్ధము జేసెను-87. దానవుల శస్త్రముల తాకిడి ధ్వనులును హుంకార ధ్వనులును చేలరేగినవి. దానవుల గుఱ్ఱముల గిట్టలు భూమిని బొడిచి  త్రవ్వుచున్నట్లుగా నున్న ధ్వనులును చెలరేగినవి-88. గజేంద్రముల ఘీంకారములును, భయాక్రందనలును, గుజముల సకిలింపులును, రథచక్రముల ధ్వనులును-89. ధనువుల నారీ ధ్వనులును, చక్రముల ఛీత్కార ధ్వనులును -90, బాణముల ‘జుయ్’ అను ధ్వనులును, వీరుల సంభాషణ సమూహములుసు, అట్టహాసములును, మహేంద్రుల సింహనాదములును అంతట-91. దిగంతరములను క్షోభింపజేసినవి. ముప్పది యక్షౌహిణుల విశుక్రునిసేన ఇట్టి యుద్ధతమైన యుద్దమును జేసెను,-92. మహారథులైన గణనాథులు గూడ ప్రతి యొక్కని కొకరై యుద్ధము జేసిరి. దంతములతో బొడిచి చీల్చుచుండిరి. తొండములతో జుట్టి వేయుచుండిరి-98, పుష్కలావర్తక మేఘములతో సమానమైన చెవులతో కోపమున గొట్టి వేయుచుండిరి. పరుషములైన (తొండపు) ముక్కు శ్వాసలతో శత్రుసేన నంతయు చెల్లాచెదరు - చేయుచుండిరి-54 కొండ నెత్తముల వంటి యురములతో సేనను మగ్గించుచుండిరి. పాదాఘాతములతో పిండిచేయుచుండిరి. బలిసిన కడుపులతో జంపుచుండిరి-95. శూలములతో బొడిచి చీల్చుచుండిరి. చక్ర ప్రయోగములతో కత్తిరించుచుండిరి. శంఖముల మహా ధ్వనితో సేనను భయపెట్టుచుండిరి-96. గణనాథుని ముఖమునుండి వేలకొలదిగా బుట్టిన గజాననులు గొప్పగా విజృంభించి రాక్షస సైన్యమును దుమ్ము దుమ్ముగా మిగిల్చిరి-97. ఆ తరువాత కోపావిష్టుడై విశుక్రుడు తన సైన్యము ముందురాగా గజాసురుని జంపెను-98. ఆ గణేశ్వరుడు ఏడక్షౌహిణీ సైన్యములతో గూడి, దుర్బుద్ధియై, భయంకర సింహనాదము జేయు గజాసురునితో యుద్దము జేసెను-99. గజాసురునీ భు బలము తగ్గుచున్నది. గణేశ్వరుని పరాక్రము వృద్ధి జెందుచున్నది. అది చూచి విశుక్రుడు పారిపోయెను-100. అపుడు ఎలుక వాహనముగా గలిగిన గణేశ్వరుడు ఒకే వీరశ్రేష్ఠుడై ఏడక్షౌహిణుల సైన్యముతోనున్న గజాసురుని మర్దించెను-101. గజాసురుడు చావగా విశుక్రుడు పారిపోగా, మహాగణపతి రణరంగము నుండి లలితాదేవి యంకమున జేరెను-102. రాక్షసులకా రాత్రి కాలరాత్రిగా తెల్లవారెను. లలితాదేవి గణేశ్వరుని పరాక్రములకు మిక్కిలి ప్రీతి జెందినది-103. మహాగణపతియెడ సంతసించి దేవతలందరి పూజలకు ముందు పూజింపబడుటను వరముగా నొసగెను. అదియుత్తమమైన వరము-104.

ఇది శ్రీబ్రహ్మాండమహా పురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున గణనాథపరాక్రమమను నిరువది యేడవ యధ్యాయము రెండవ దివసయుద్దము సమాప్తము.