బ్రహ్మాండ మహా పురాణము
8 - మానస సృష్టి
బ్రహ్మదేవుని మానస సృష్టి - దేవతలు, ఋషులు, పితృదేవతలు, మానవులు సృజింపఁబడిరి.
సూతుఁడిట్లు పలికెను :
బ్రహ్మ అభిధ్యానము చేయుచుండఁగనే, ఆతని శరీరము నుండి ఉత్పన్నములయిన కార్యములచే, కారణములచే మానస సృష్టియైన ప్రజలుదయించిరి.
బుద్ధిమంతుఁడయిన బ్రహ్మయొక్క విశ్వమయ శరీరము నుండి, (క్షేత్రమునుండి) క్షేత్రజ్ఞులు (ప్రత్యేక వ్యక్తులు) బయలు దేరిరి. తరువాత చతుర్విధములయిన దేవతల, అసురుల, పితరుల, మానవుల సహస్ర సహస్రములను సృజింపవలయుననీ యీతనికి కోరిక కలిగిను. ఆసృష్టి యందు నియతాత్ముఁడై ప్రజాపతి సృష్టిని గూర్చి ధ్యానించేను. అట్లు ధ్యానించుటలో ఆతనిలోని తమో మాత్ర (అజ్ఞాన భావన యొక్క మాత్ర - లేశము) సముద్భవించెను. అట్టి ప్రజాసృష్టి చేయు ప్రజాపతీ జఘన భాగము నుండి మున్ముందుగా అసురులు కుమారులుగా నుదయించిరి. (4) అసువు - అనఁగా - ప్రాణమనీ విజ్ఞులు తలంచిరి. అందుచే తన్మూలమున జన్మించిన వారు (అ + సురాః = అసురాః. ఇది ప్రసిద్దార్థము. కాని వేటిక విధముగా అర్థమీందు ప్రతిపాదింపఁబడుట గ్రహీంపఁదగినది) అసురులయిరి. అసురులయుత్పాదనమునకు కారణమయిన యా, భౌతిక శరీరమును ప్రజాపతీ విసర్జించెను. (5) ఆతనిచే పరిత్యజింపఁబడిన యా భౌతిక దేహము వెంటనే రాత్రియయ్యెను. ఆ రాత్రీ తమో బహుళము. శ్రీయామ కలితమయిన రాత్రి తమో బహుళమయ్యెను. రాత్రి - త్రియామ - యామమనంగా మూడు గంటల ప్రమాణము గల కాలము ఈ త్రియాయు కాలములో చీకటి బహుళము.(6)
అందుచే స్వయముగా ప్రజలు రాత్రి యందు చీకంటిచే ఆవృతులు. తరువాత సురలను సృష్టించి యతఁడు వేశాక శరీరము నొందెను?(7) ఆ శరీరరము సత్త్వగుణ బహుళము. తరువాత నా శరీరముతోఁ దాను కలిసియుండెను. ఆ శరీరముతో సంపృక్తుఁడు కాగా అయ్యది ఆ ప్రభువునకు ప్రియమయ్యెను. (8) అంత సత్త్వగుణ బహుళత్వముచే ప్రకాశవంతమయిన ఆ స్వయంభువుని ముఖము నుండి దేవతలు (స్త్రీ పురుషులు) ఆవిర్భవించిరి. వారందరు ప్రకాశించుచు పుట్టి యుండుటచే వారందఱు దేవతలు (దీవ్యంతే ఇతి దేవాః)గా కీర్తింపఁబడిరి. (9): (దీవ్ అనుధాతువు 'దీప్త్యాం, క్రీడాయాం' ఉపయోగీంపఁబడును. 'దివ్' అను ధాతువు 'క్రీడయందు'పయోగింపఁబడును). అందుచే దేవతలు ప్రకాశముగా దీప్తిమంతమయిన శరీరము నుండి పుట్టిరి. అందుచే దేవతలయిరి. (10) దేవతలను సృష్టించి ప్రభువు ఆ దివ్యమయిన శరీరమును. త్యజించెను. ఆతనిచే పరిత్యక్తమయిన శరీరము “అహస్సు” (పగలు) అయ్యెను. (11) అందుచేతనే పగటిపూట చేయంబడు కర్మలచే దేవతలు సేవింపఁబడుదురు. దేవతల సృష్టించి తద్రహ్మ వేతాక శరీరమును పొందెను. (12) అంతనతఁడు సత్వమాత్రాత్మికమయిన యన్యమయిన దేహమును భజించెను. (దేహమును దాల్చెను). తన్ను తండ్రిగా దలంచుచు నాతఁడు వారలను పుత్రులనుగా భావించెను. (13) ఆ శరీరము నుండి దీపోరాత్రుల సంధ్యలో పితరులుదయించిరి. అందుచే పితరులు దేవతలు. వారియందు పితృత్వము సంస్మరింపఁబడినది. (14) పితరులుదయించిన శరీరమును తాను పరిత్యజించెను. ఆతనిచే విడువఁబడిన శరీరము వెంటనే ‘సంధ్య' అయ్యెను. (15) అందుచే పగటి , ప్రొద్దు దేవతలకు సంబంధించినదిగాను, రాత్రి ప్రొద్దు రాక్షసులకు చెందినదిగాను సంస్మరింపఁబడినది.
దివారాత్రులకు మధ్యనున్న “పైత్రీ” (పితృదేవతాత్మకమయిన శరీరము) శ్రేష్ఠతమ మయినది. (16) అందుచేతనే దేవతలు, అసురులు, ఋషులు, మానవులు యోగాభ్యాస యుక్తులయి, దివారాత్రముల మధ్య గల సంధ్యను (సూర్యోదయ రాత్రులకు మధ్య తనువును) పూజింతురు. (17) అందుచేతనే బ్రాహ్మణులు రాత్రికి దివమునకు మధ్య భాగమయిన సంధ్య యందు సంధ్యావందన మాచరించెదరు. ఆ తరువాత బ్రహ్మ మరల వేతాక తనువును నాశ్రయించెను. (18) మనసా తద్ర్బహ్మ సృజించిన యా తనువు రజోగుణమాత్రాత్మిక. మనసా సృజింపఁబడిన యాతని సంతానము ప్రజలయిరి. (19) మనుష్యులు బ్రహ్మయొక్క (ప్రజాపతియొక్క) మనస్సు యొక్క సృష్టియగుట ప్రజలుగా ప్రఖ్యాతి వహించిరి. వారు మనమున మనుష్యులు జననము వలన జపలునైరి. ప్రజలను సృష్టించి యితఁడు తన శరీరమును పరిత్యజించెను, (20) ఆ పరిత్యక్తమయిన యాతనీ తనువు నుండి వెంటనే జ్యోత్స్న (వెన్నెల) సముద్భవించెను. జ్యోత్స్న యొక్క యుద్భవము వలన ప్రజలు సంతోషవంతులగుదురు. (21) ప్రజలను సృజించిన వెనుక బ్రహ్మ తన తనువును పరిత్యజించెను. ఆతనిచే వీడువబడిన శరీరము వెంటనే రాత్రి, పగలు, సంధ్య, జ్యోత్స్న (చంద్రిక) యయ్యెను. (22) అందుచే జ్యోత్స్న, సంధ్య, పగలు - ఈ మూఁడును ఆ బ్రహ్మయొక్క సత్త్వగుణమాత్రచే సృజింపఁబడినవి. రాత్రి తమోమయాత్మికయగు మాత్రచే కేవలము సృజింపఁబడినది. అందుచే నది “నీయామిక” (ఆత్రీయామికయే 'నియామీక' గా నైయుండును) (23) అందుచే దేవతలు సంతోషముతో ప్రకాశవంతమయిన శరీరము నుండి సృజింపఁబడిరి. వారి క్రీడా పరత్వము ముఖము నుండి కలిగెను, వారీ జననము పగటియందు జరిగియుండుటచే వారు పగటి ప్రొద్దు బలవంతులు. (24) బ్రహ్మ అసురులను రాత్రివేళ తన ప్రాణముల నుండిజఘన భాగము వలన సృజించి యుండుటచే వారు రాత్రులందు దుర్ధరులయిరి.
జ్యోత్స్న, రాత్రి, పగలు, సంధ్య అను నీ నాలుగు భవిష్యత్కాలములో సురలతో కూడ దేవతలకు, పితృదేవతలకు, ఇంతకు బూర్వము గతించిన మన్వంతరములందు, ఇక ముందు రానున్న మన్వంతరముల యందు నిమిత్తములు ఆరంభమునకు కారణములగును. ఈ నాలుఁగును వ్యాపించి యందు ప్రకాశించు కారణమున నీటికి అంభస్సులని పేరు వచ్చినది. 'భా' అను ధాతువు వ్యాపించుట, ప్రకాశించుట యన్న అర్గములో నుపయోగింపఁబడినది, {26, 28ఎ) అంభస్సులను (నీటినీ సృష్టించి, ప్రభువు తరువాత దేవతలను దానవులను, మనుష్యులను, పితరులను అట్లే ఇతరులయిన ప్రజానీకమును సృజించెను. అంత ప్రభువు {ప్రజాపతి) తన (శరీరమును) జ్యోత్స్నను పరిత్యజించి, తరువాత ప్రధానముగా రజోగుణ తమోగుణములచే నుద్రిక్తమయిన వేటిక భౌతిక శరీరమును పొందెను. తరువాత నా శరీరమునందే యాతడుండి షోయెను. అందుచే క్షుద్బాధా పీడితులయిన ఇతర ప్రజను అంధకారమున నాతఁడు సృజించెను. (29, 30) స్పష్టింపబడిన ఆ ప్రజలు క్షుధా కృష్ణులయి అంభస్సులను గ్రహించుటకు నుద్యుక్తులయిరి. ఆ ప్రజలు “మేము అంభస్సులను రక్షించెదము' అనీన వారు రాక్షసులుగా స్మరింపం బడిరి. నిశాచరులు (రాత్రి సంచరించువారు) క్షుద్బాధితోత్ములయి, “మనమీ నీటిని అంధస్సులను) నాశనము చేయుదుము. మనము పరస్పరము (సాంగత్యమున) సంహృష్టులమగుదుము" అనిన వారు వారీ దయారహిత కర్మచే యక్షులు క్రూరకర్ములయిన గుహ్యాకులు నయిరి. 'రక్ష' అనుధాతువునకు రక్షించుటయందు, పాలనము నందు అర్థము. “క్ష్మి" అను ధాతువునకు 'క్షణము' నాశనముచేయుటయందు అర్థము. వారు రక్షించిన రక్షణాత్) కారణమున రాక్షసులనంబడిరి. 'క్షపణాత్' నాశనము చేయుటవలన వారు యక్షులనంబడిరి (31,34) క్రూరకర్ములయిన యక్షులను చూచి మనీషి యాత్మనిష్ఠుఁడయిన యా ప్రభువు అసంతుష్టుఁడయ్యెను. అసంతుష్టుఁడగుటచే ఆతని కేశములు (వేంట్రుకలు) జీర్ణములు వికీర్ణములయ్యెను. ఆ విడివడిన (కీర్ణములయిన) వెండ్రుకలు పైకి పొడమీ మరల మరల ఆరూఢములయ్యెను.
తలనుండి రాలిపోయిన వెంట్రుకలు, చలించి పైకి ప్రాకెను (బాల, వాల పదములు శిరోజ పర్యాయ పదములు) అయ్యవి మొదట పోలములు (శిరోజములు) అగుటచే, వానిని వ్యాలములుగా స్మరించిరి. అయ్యవీశీర్షము నుండి రాలిపోయిన వగుటచే (హీనత్వాత్) అహి = పాము) అహులుగా నయినవి. అయ్యవి చలించీ, ఇటునటు కదలాడుటచే సవి పన్నగములయినవి అవి (ప్రసర్పణము) ప్రొకుటచే సర్పము అయినవి. సూర్యచంద్ర మేఘముల క్రింద షథీవీలో ఆ సర్పములకు నిలయము (37) బ్రహ్మయొక్క అగ్నిగర్భము, సుదారుణము సయిన క్రోధము నుండి యుద్భవించిన విషాత్మకమయిన (విషము) వానితో సహోత్పన్నములయిన సర్పములయందు ప్రవేశీంచెను. (38) తన క్రోధము నుండి బ్రహ్మ సర్పములను సృజించి, క్రోధాత్ములు, (భయస్వరూపులు), మాంసాశనులు, స్వభావతః ఉగ్రులు నయిన వానిని సృజించెను. వానికి కపిశ వర్ణము కలిగేను. (39) అయ్యవి ప్రభూతములయిన కారణముచే (భూతత్వాత్) భూతములుగా స్మరింపఁబడినవి. మాంసమును తినుటచే (పిశితాశనాత్) పిశాచములయిరి. బ్రహ్మపదములను గానము చేయుచుండగా పుట్టినవారు గంధర్వులు సుతులుగా నుద్భవించిరి. (40) 'ధయ్' అను ధాతువు కవులచే పానార్థము నందు చదువబడుచున్నది. (సంగీత ప్రదములయిన) పదములను వినుచు త్రాగుచు) పుట్టుటచే వారు గంధర్వులయిరి. (41) దేవయోనులందు ఆ యెనమండ్రు భూతములను సృజించి, అతఁడు సుప్రీతుఁడగుటచే (ఛందతః) ఛందస్సును కల్పించెను. తన (వయసా) వయస్సుచే పక్షులనతడు సృజించెను. పక్షులను సృజించిన పిమ్మట పశుగణముల నా బ్రహ్మ సృజించెను. అతడు మేకలను తన ముఖము నుండి గొఱ్ఱలను వక్షస్థలము నుండి యుత్పాదించెను. [43] బ్రహ్మ గోవులను తన యుదరము నుండీ, ఆశ్వములను, గాడిదలను, గషయ మృగములను, లేళ్ళను, ఒంటెలను, వారాహములను, కుక్కలను, ఏనుగులతో సహితముగా ఈ పార్వభాగముల నుండి, పాదముల నుండి సృజించెను. ఇతరములయిన జంతు సంతతులను కూడ నాతఁడు సృజించెను. ఓషధులు, మూలికలు, లశలు, ఫలములతో ప్రేక్షతో సహితముగా ఆతని శిరోజలముల నుండి ఆవిర్భవించెను.
పూర్వము, ఈ కల్పారంభమున, త్రేతాయుగారంభమున, ఆ బ్రహ్మ ఐదు విధములయిన ఓషధులను సృజించెను. తరువాత యజ్ఞక్రియల యందు నిమగ్నుఁడయ్యెను. (46) గోవులు, మేకలు, పురుషులు, గొణేలు, అశ్వములు, గార్ధభములు, కంచర గాడిదలు - ఈ ఏడును గ్రామ్య (జంతువులుగా)ములుగా స్మరింపఁబడినవి. ఇవి కాక మరియేడు - ఆరణ్యకములు, క్రూర జంతువులు (మాంసమును దీనునవి) వ్యాఘములు, ఏనుగులు, వానరములు, ఐదవ వర్గముగను, పక్షులు, నీటి జంతువులు ఆరవ వర్గముగా, సరీసృపములు (ప్రాకు జంతువులు) ఏడవ వర్గముగా గణింపబడినవి. మహేషములు (దున్నపోతులు, గేదేలు) గవయ మృగములు, ఉష్ణములు(ఒంటెలు) డెక్కలు గల జంతువులు, శరభములు (ఎనిమిది కాళ్లు గలిగిన జంతువు), ఏనుగులు,మర్కటములతో ఏడు వర్గములు ఆరణ్యక జంతువులు. (49) బ్రహ్మ తన మొదటి ముఖము నుండి గాయత్రినీ, ఋక్కును, త్రివృత్సోమమును రథంతరమును, యజ్ఞసంబంధమయిన అగ్నిష్టోమమును సృజించెను. (50) (50 - 53 (శ్లోకములలో) వేదవాజ్మయము, వేదచ్చందస్సులు ప్రత్యేకములయిన యాగములు బ్రహ్మ ముఖము నుండి యుత్పన్నములయినీవనీ వర్ణింపం ఐడీనవీ. త్రివతోమము = వృతమయిన స్తోమము. అండు - మొదటి ప్రతి త్రిచ నుండి మొదటి మూఁడు ఋక్కులు కలిపి చదువబడును. తరువాత రెండవ సూక్తము, తరువాత తుదను మూఁడవ సూక్తము పఠింపఁబడును).
దక్షిణ ముఖము నుండి, యజుర్వేదమును, త్రిష్టుభఛందస్సును, పంచదశ స్తోమమును, బృహత్సోమమును బ్రహ్మ సృజించెను. (51) పశ్చిమ ముఖము నుండి, సామ సూక్తములను, జగతీ ఛందస్సును, సప్తదశస్తోమమును, చైరూప్యమును, అతిరాత్రమును (ఇది జ్యోతిష్ణోమము యొక్క భాగము) సృజించెను. (82) నాలుగవ ముఖము నుండీ, ఏక వీంశ స్తోమమును, అథర్వ వేదమును, ఆస్తోర్యానమును అనుష్ట ఏ ఛందమును వైరాజ ఛందమును సృజించెను. (53) వీఖ్యాతముయన పర్జన్యమను మేఘమును సృజించిన వెనుక, మెతలుపులతో, వడగండ్లతో ఉరుములతో గర్జనలతో రోమాత (ఎని) వద్దము గలిగిన ఆంధ్ర ధనువులను గలిగిన మేఘములను సృజించినది వీశ్రుతమే కదా. (54) యజ్ఞసిద్ధికోటకు, బ్రహ్మ ఋగ్వేదయజుర్వేద సామవేద మంత్రముల సృజించేను. పెద్దవి చిన్నవి (ఉన్నతములయినవి నీచములయినవి) యగు భూతములనేకములు బ్రహ్మ గాత్రము నుండి (అవయవముల నుండి) పుట్టినవి. (56) ప్రజాపతి చతుర్విధములయిన, దేవతలను, ఋషులను, పితరులను, మానవులను మొట్టమొదట సృజించుచు, కదలడనట్టివీ, కదలడనట్టవీ (చరోచరములయిన) (రథంతరములు - సామగానము ననుసరించీ చదువబడునట్టి దిక్కులు. (ఆపస్తోమ మనునీదీ యొకక సోమాక్రతువును సృజించేను.
భూతములను సృజించెను. దక్షలను, శాచులను, గళర్వులను, అనురకతశు, మానవులను, కిన్నరులను, రాక్షసులను, పక్షులను, జంతువులను, హరిణములను, సళ్ళములను, స్మారీచి బ్రహ్మా తరువాత, అవ్యడుములు (మార్పు సౌందనీవీ) వ్యయములు (మార్పు చెందునట్టివి) వానీతో సహచరములు, అచరములునయిన భూతములను సృజించెను. (58) ఈ భూతములు పునః పునః సృష్టింపబడినను, వారు ఏ కర్మలను పూర్వజన్మల యందోచరించియుండిరో, వానినే యవలంబించిరి. (59) పూర్వజన్మ లక్షణములయిన హింసా హింసలు, క్రూర స్వభావము, ధర్మా ధర్మములు, సత్యానృతములు, మొదలగు వానినే వారు పొందిరి. అందుచే వారు సహజముగా పరస్పర మొండొరుల యెడ నీష్టమును (ప్రీతినీ) గలిగియుండిరి. (60) భూతములయందు నాసాత్వ గుణలక్షణమును, వోని వివిధ భౌతిక దేహములను, ఆ శరీరములు ఇంద్రియములచే వారినీ పొందుటను, వానీ విని యోగమును, బ్రహ్మయే వీధించి సృజించెను. (61) కొందఱు పురుషకారమే (మానవ ప్రయత్నమే) కర్మ సిద్ధికి కారణమందురు. పండితులయిన ఇతరులు పురుషకారము కాదు 'దైవ' మని యందురు. కొందతో భూతముల గూర్చి యాలోచించువారు అయ్యది స్వభావము, అంతర్నిష్ణమై యున్న దందురు. (62) పౌరుషమునకు దైవమునకు కార్య ప్రవృత్తి ఫలసిద్ధి విషయమై భేదము లేదందురు. ఆ ఫలవృత్తి స్వభావ సిద్ధమయి కలుగునందురు. ఇయ్యది ఒకరన్నట్లు పురుషకార జన్యము కాదు, దైవకృతముకాదు, స్వభావ ఘటితము కాదు, సత్వస్థులు సమదర్శనులు, ప్రపంచము స్వకర్మవిషయమయినదని యందురు.
ఆరంభమున వేదశబ్దముల ననుసరించి భూతములను వివిధములయిన రూపములతో, వివిధ లక్షణములతో, మహేశ్వరుఁడు (బ్రహ్మ) సృజించెను. దేవతలయందు ఆర్షములయిన సామములు దృష్టి భేదములు ఎన్నికనవచ్చు చున్నవో, వానిని అవ్యయుఁడు, అజాతుఁడు, నయిన పరమాత్మ శర్వర్యంతమున (నిశాంతమున) ప్రసూతులయిన (పుట్టిన వారికి) నిర్ణయించును.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున పూర్వ భాగము నందు ద్వీతీయానుషంగపాదమున మానవ సృష్టి వర్ణనమనియెడి అష్టమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 8 of the Brahmānda Mahā Purana is as follows:
Through an awe-inspiring narrative, this section portrays the supreme creator Brahmā bringing forth life purely through the immense power of his divine thought. It lovingly describes the birth of luminous gods, venerable sages, revered ancestors, and humble human beings, all born from the boundless intellect of the creator. This celestial origin story fills the reader with deep devotion, reminding humanity of its divine lineage and its sacred duty to uphold eternal cosmic righteousness.