బ్రహ్మాండ మహా పురాణము
14 - ప్రియవ్రతవంశాను కీర్తనము
సూతుఁడిట్లు పలికెను :
జరిగిపోయిన రానున్న అన్నిమన్వంతరములందు, ప్రజలందరు (మన్వంతరములన్నీంటిలో నుద్భవించినవారు సమాన వ్యక్తీకరణము కలవారు. వారి నామరూపములును సమానములు.) తుల్యాభిమానములతో తుల్యనామ రూపములతో జన్మించిరి. (1) దేవతలు ఎనిమిది విధములు. వారే మన్వంతరమున ప్రభువులు, ఋషులు, మనువులు తుల్యప్రయోజనములనే సాధించిరి. (2) మహరుల సృష్టి యింతకుంబూర్వము వివరింపఁబడినది. ఇప్పుడు స్వాయంభువమనువంశము, వివరణముగా సక్రమముగా చెప్పబడుచున్నది వినుము. (3) స్వాయంభువమనువునకు తత్సమానులు పదిమంది పౌత్రులు. వారిచే సప్తద్వీపములతో గూడినది, పట్టణములతో నొప్పినది, సముద్రములతో, ఖనులతో నొప్పినదియునైన యీ పృథివి స్వాయంభువ మన్వంతరమున మొదటి త్రేతాయుగమున సర్వఖండములతో (వరములతో) నివసింపఁబడినది. వారందరీ పృథివీ ఖండమును స్వాధీన పరచుకొని అందు వసించిరి. (5) ఈ పృథివి ప్రియవ్రతుని పుత్రులచే పౌత్రులచే, వారి పుత్రులచే, సంతతిచే ఆక్రమింపఁ బడినది. వీరందరు బలవంతులు తపశ్శీలురు. ప్రియవ్రతుఁడు స్వాయంభువునీ పౌత్రుఁడు. (6) కర్దమ ప్రజాపతి కూతురు కర్గమ. ఈమె మహాభాగ్య శాలిని. ఈమె వలన ప్రియవ్రతుఁడు వీర్యవంతులును, ప్రజావంతులును నయిన పుత్రులను బడసెను. (7) ఆమెకిరువురు పుత్రికలు, వారు సమ్రాట్, కుక్షియు. వీరిరువురు శోభనయుతలు. ఆమెకు (కర్ధముకు) పదిమంది కుమారులు కూడనుదయించిరి. ఈ సోదరులు శూరులు, ప్రజాపతి సములు. వారు - అగ్నీధ్రుఁడు, అగ్నిబాహువు, మేధ, మేధాతిథి, వసువు (వపుష్మాన్ అని తరువాత చెప్పఁబడెను). జ్యోతిష్మంతుఁడు, ద్యుతిమంతుఁడు, హవ్యుడు, సవనుఁడు, సత్రుఁడు.
ప్రియవ్రతుఁడు ఆ ఏడుగురు రాజులను విధి పూర్వకముగా ఏడు ద్వీపములయందు ప్రభువులుగా నభిషేకించెను. ఆ యేడుగురను ఏడు ద్వీపములను తెలిసికొనుము. సుమహాబలవంతుఁడయిన అగ్నీధ్రుని జంబూద్వీపమునకు నధిపతంజేసెను. ప్లక్ష ద్వీపమునకు మేధాతిథిని ప్రభువుగా, నతఁడొనర్చెను. (11) శాల్మల ద్వీపమునకు వపుష్మంతుని రాజుగా నభిషేకించెను. (వపుష్మంతుఁడే 'వసువుగా చెప్పఁబడినాడు). కుశద్వీపమునకు, ప్రియవ్రతుఁడు, జ్యోతిష్మంతుని రాజును చేసెను. (12) క్రౌంచ ద్వీపమునందు ద్యుతిమంతుని రాజు గావించెను. శాక ద్వీపమునకు హవ్యుని ప్రియవ్రతుఁడు రాజు చేసెను. (13) పుష్కరద్వీపమున కధిపతిగా సవనునీ ప్రియవ్రతుడు చేసెను. పుష్కర ద్వీపమున తరువాత సవనునికీఇరువురుపుత్రులు కలిగిరి. వారు మహావీతుఁడు ధాతకీయును. (14) వీరిరువురు తల్లిదండ్రులు మొచ్చుకోదగిన బిడ్డలు ఆ మహాత్ముఁడయిన - మహావీతుని నామముననే ఆవర్భము (ద్వీపము) తరువాత మహావీత వర్షమయినదీ. (15) అట్లే ధాతకి ఏలు ఖండము తన్నామమున ధాతకీ ఖండమయినది. శాక ద్వీపేశ్వరుఁడయిన హవ్యుఁడు ఏడుగురు పుత్రులను కనెను. వారు - జలదుఁడు, కుమారుఁడు, సుకుమారుఁడు, మజీవకుఁడు, కుసుమోత్తముడు, మోదకుఁడు - ఇంక ఏఁడవ వాఁడు మహాద్రుముఁడు. (శాక ద్వీపమునందలి ఏడు భాగములు) హవ్యుని. ఏడుగురు కుమారుల నామాలతో వ్యవహరింపఁబడినవి.) మొదటి వర్షము జలదము. అది జలదుని వరము. రెండవది రెండవ వాఁడయిన కుమారకుని పేర కుమార వర్షమయినదీ. (18)
సుకుమారుని పేరు మీదుగా మూడవది సుకుమార వరమయ్యెను. నాలుగవది మడీవకము. అది నాలుగవ వాఁడయిన మజీవకునీ వర్షము. (19) ఐదవది యయిన కుసుమోత్తమ వర్షము కుసుమోత్తముని పేరునయ్యెను. ఆరవదియైన మోదాక వరము ఆరవ పొఁడయిన మోదకుని పేర ప్రఖ్యాతమయినదీ. (20) ఏడవది మహాద్రుమ వరము. అది యేఁడవ వాడయిన మహాద్రుమునీ పేర ప్రఖ్యాతమయినది. ఆ ఏడు నామములు ఆ యేడ్లురు వలనను గలిగినవీ. (21) క్రౌంచ ద్వీపేశ్వరుఁడయిన ద్యుతీమంతునకు ఏడుగురు పుత్రులు : వారు - కుశలుం డు, మనోనుగుఁడు, ఉష్ణుఁడు, పావనుఁడు, అంధకారకుఁడు, ముని, మటియు దుందుభి. వీరు ద్యుతిమంతుని పుత్రులు. వారివారి నామములతో మంగళకరములయిన క్రౌంచద్వీప భాగముల నాశ్రయించి యుండిరి. (23) కుశలునీ దేశమయిన కౌశలము మిక్కిలి ప్రఖ్యాతవంశ మయినది, మనోనుగుని దేశము మనోనుగ దేశముగ ప్రసిద్ధమయినది. (24) ఉష్ణుని దేశము ఉష్ణదేశముగా, పావనుని దేశము పావనముగా, అంధకారుని దేశము అంధకార దేశముగా ప్రకీర్తింపబడినవి. ముని యొక్క దేశము మౌనిదేశము; దుందుభి దేశము దుందుభి దేశముగా వ్యక్తమయినవి. ఆ ఏడు దేశములు (జనపదములు) క్రౌంచ ద్వీపమున మిక్కిలి ప్రసిద్ధములు భాస్వంతములు.
కుశద్వీపమునందు జ్యోతిష్మంతునకు ప్రతాపవంతులయిన ఏడుగురు కుమారులు కలిగిరి. వారు - ఉద్భిజ్ఞుఁడు, వేణుమంతుఁడు, వైరథుఁడు, లవణుఁడు, ధృతి - ఆరవ పోఁడు ప్రభాకరుఁడు, ఏడవవాఁడు కపిలుఁడుగా స్మరింపఁబడిరి. (27) ప్రథమ మండలము ఉద్భిజ్జము అనీ పిలుపఁబడినది; రెండవది వేణు మండలము; (28) మూఁడవది వైరథాకారము. నాలుగవ మండలము లవణము; పంచమ మండలము ధృతిమంతము; ఆరవ వరము ప్రభాకరము. ఏడవది కపిల వర్షము. కపిలుని వలె కీర్తిమంతము. కుశద్వీపమున నీ భూమి భాగములు సమాన నామములే కలిగి యున్నవి. (30) శాల్మలదేశ ప్రభువులు ఆశ్రమాచార యుక్తులయిన ప్రజలచే సమలంకృతులు. వారు వపుష్మంతుని యొక్క ఏడుగురు కుమారులు. (31) ఆ ఏడుగురు - శ్వేతుఁడు, హరీతుఁడు, జీమూతుఁడు, రోహితుఁడు, వైద్యుతుఁడు, మానతుఁడు, సుప్రభుఁడు, శ్వేతుని దేశము శ్వేతము; హరితుని దేశము సుపరీతము; జీమూతునిది జీమూత దేశము; రోహితునిది రోహితదేశము; వైద్యుతునిది వైద్యుత దేశము; మానసునిది మానస దేశము. సుప్రభునిది సుప్రభదేశము. ఆ ఏడుగురు ఆ సప్తదేశపాలకులు. (34) జంబూద్వీపము యొక్క కథానంతరము ప్లక్షద్వీపమును గూర్చి చెప్పెదను. మేధాతిథికి ఏడుగురు పుత్రులు. పోరు ప్లక్షద్వీపమును పాలించు నృపులు. (35) మేధాతిథి పుత్రులు ; జ్యేష్ణుం డు శాంతభయుఁడు; రెండవవాఁడు శిశిరుఁడు; తృతీయుఁడు సుభోదయుఁడు; నందుఁడు నాలుగవ పోఁడు
పంచముఁడు శివనాముఁడు; పొరీలో ఆరవవాఁడు క్షేమకుఁడు; ఏడవవాఁడు ధ్రువుఁడు. వీరందరు మేధాతిథి పుత్రులుగా ప్రఖ్యాతులు. (37) ఆ సప్తవర్షములు (దేశీయులు) ఆసప్తకుమారుల నామముల ప్రఖ్యాతములు. వీరందరు సుప్రసిద్ధులు. శాంతభయుఁడు, శిశిరుఁడు, సుఖోదయుఁడు, ఆనందుఁడు శివుఁడు, క్షేమంకరుఁడు, ధ్రువుఁడు. ఆవర్షసప్తకము పరస్పరము సమానములు. (35) పూర్వము స్వాయంభువమన్వంతరమున మేధాతిథి యొక్క పుత్రుల చేతను వివిధ భాగములలో ఆక్రమింపఁబడి వలస చేయఁబడినవి. ఆ మేధాతిథి పుత్రులే ప్లక్ష ద్వీపేశ్వరులు, ప్రభువులు. (40) ప్లక్ష ద్వీప ప్రజలందరు వర్ణాశ్రమాచార యుక్తులుగా చేయబడిరి. ప్లక్ష ద్వీపముతో నారంభించి శాకద్వీపముతో ముగియు దేశీయులందు, (మొత్తమయిదు ద్వీపములలో) వర్ణాశ్రమ విభజనమునకు “ధర్మమే" ప్రధాన క్షణముగా గ్రహింప బడినది. (ఆ పంచద్వీపములు - ప్లక్ష, శ్యామల, కుశ, క్రౌంచ, శాకములు), ఈ పంచ ద్వీపముల యందు, సుఖము, ఆయుర్దాయము, రూపము, బలము, ధర్మము, ఎల్లప్పుడును ప్రజలకు సర్వసాధారణ లక్షణములుగా చెప్పుదురు. (43) ప్లక్ష ద్వీపము వర్ణింపబడినది. ఇక జంబూద్వీపము నెఱుంగుఁడు. (44) కామ్యాపుత్రుఁడు, మహాబలవంతుఁడు, జ్యేష్ఠదాయాదియునైన అగ్నీధ్రుని ప్రియవ్రతుఁడు జంబూ ద్వీపమునకు ప్రభువుగా నభిషేకించెను. (44) ఆతనికి ప్రజాపతి సమానులు తొమ్మండ్రు కుమారులు. వారిలో జ్యేష్టుడు నాభి. అతని సోదరుఁడు (అనుజుఁడు) కింపురుషుఁడు; హరివరుఁడు తృతీయుఁడు; ఇలా వృతుఁడు చతుర్థుఁడు; రమ్యుఁడు, పంచముఁడు; హిరణ్వంతుఁడు ఆరవపాండు.
వారిలో కురువు ఏండవవాఁడు. భద్రాశ్వుఁడు ఎనిమిదవవాఁడు. కేతుమూలుఁడు తొమ్మిదవవాఁడు. ఇక వారి రాజ్యముల నెఱుంగుము. (47) నాభికి హిమాఖ్యమయిన దక్షిణ వర్షమును తండ్రి యొసంగెను. హేమకూటమను వర్షమును (దేశమును) కింపురుషునకు నిచ్చెను, నైషధమని పేరొందిన (విదితమయిన) వర్షమును హరివరుడను మూఁడవవానికి తండ్రి యొసంగెను. ఇలా వృతునకు మధ్యమమునందున్న మేరు వర్షము నొసంగేను. (49) రమ్యునకు నీలమని పేరొందిన వర్షమును తండ్రి యొసంగెను. హిరణ్వతునకు నీలవర్షమునకుత్తరము నందున్న శ్వేతవర్షమును తండ్రి యొసంగెను. (50) కురువునకు శృంగవంతమునకుత్తరముననున్న వర్షము నొసంగెను. అట్లే భద్రాశ్వునకు మాల్య వంతమను వరము నొసంగెను. (51) కేతుమాలునకు గంధమాదనవర్షము నొసంగేను, ఒకదాని తరువాత నోకటిగా తొమ్మిది వరములు నాచే చెప్పబడినవి. (52) ఆ (యుప) వర్షములో ఆగ్నీధ్రుండు తనకుమారులను యధాక్రమము అభిషేకించెను. ఆపుణ్యాత్ము ఁడు తరువాత తపోనియుక్తుఁ డయ్యెను. (53) ఈ విధముగా స్వాయంభువుని మనుమలు, ప్రియపుత్రుని పుత్రులునగు నేడుగురు సప్తద్వీపములందును ప్రతిష్టితులయిరి. (54) ప్రళయమువచ్చి సర్వనాశనముకాగా, ఈ సప్తవర్షములు సప్తవర్షరాజులచే మరల మరల ప్రతిష్ఠితములగు చుండును. ఇదీయే వర్షములయొక్క ద్వీపములయొక్క సంభవనివేశముల స్వభావము. ఇక కింపురుష వర్షముతో నారంభమగు ఎనిమిది వర్షముల గూర్చీ ఈ విషయములు శ్రుతములగుచున్నవి. (56)
వాని సిద్ది సహజము, అప్రయత్నముగ వారందరు సుఖప్రాయులు. వారికి విపర్యయముకాని ప్రళయముకాని లేదు. వారికి జరామృత్యు భయము కూడలేదు. (57) వారీలో ధర్మములేదు, అధర్మములేదు, ఉత్తమాధమమధ్యములు కూడా లేవు. ఈ యెనిమిది అష్టవరములయందు క్షేత్రములయందు) యుగావస్థ (యుగముల పరిణామము) లేదు. (56) హిమవర్షమున నాభియొక్క సంతానమునుగూర్చి వివరించెదను. వినుఁ డు. నాభికి మేరుదేవి వలన మహాద్యుతిమంతుఁడయిన కుమారుఁడు కలిగెను. ఆతఁడు ఋషభుఁడు, అతఁడు పార్థివశ్రేష్ఠుఁడు; ఈతఁడే సర్వక్షత్రియులకును ముందు జన్మించినవాఁడు. ఋషభునకు వీరుఁడయిన భరతుఁడు జన్మించెను. ఈతఁడాతని పుత్రశతములో జ్యేషుఁడు. (60) ఋషభుఁడు పుత్రుడయిన భరతుని రాజ్యమునందభిషేకించి తాను'1) మహాప్రవ్యజ్యమునందు (మహాప్రస్థానమున) సుస్థితుఁడయ్యెను ((1) మహాప్రవ్రజ్యము - సర్వసంగపరిత్యాగము చేసి తపస్థితుడై మరణోన్ముఖుడైయుండుట) ఆతఁడు దక్షిణ వర్షములను (దేశములను) భరతునకొసంగెను. (61) అందుచే ఇది భారతవరమని పేరొందినదనీ బుధులు తెలిసికొనీరీ, భరతుని కుమారుఁడు సుమతి. అతఁడు ధార్మికుఁడు. విద్వాంసుఁడు, భరతుఁడాతనిని ఆదేశమునకభిషేకించెను. ప్రభుఁడయిన భరతుఁడు సర్వసంపదను పుత్రునకు సంక్రమింపఁజేసి యరణ్యములకేగెను. ఆసుమతికొడుకు తేజసుఁడు. ఆతఁడు ప్రజాపతి. శత్రువులజయించినవాఁ డు. ఆ తేజసుని కుమారుడు ఇంద్ర్యదుమ్నుఁడు. అతడు విద్వాంసుఁడు. (64)
అతనికుమారుఁడు పరమేష్ఠి. ఇతఁడు తండ్రి మరణానంతర ముదయించెను. పరమేష్ఠి కుమారుఁడు ప్రతిహారుఁడు. ఆతనిపేరుతో ఆవంశము ప్రఖ్యాతమయినది. ఆతనికి ప్రతిహర్తయనేడు కుమారుఁడు. ధీమంతుఁడయిన ప్రతిహర్త యొక్క కుమారుడు ఉన్నత. " ఆతని కుమారుఁడు. “భూముఁడని ప్రసిద్ధుఁడు. ఆతని కుమారుడు ఉద్దీథుఁడు. ఉద్దీథుని పుత్రుడు ప్రస్తావి. ప్రస్తావి కుమారుఁడు విభుఁడు; విభుని కుమారుడు పృథువు. (67) పృథుని సుతుఁడు నక్తుండు; నక్తుని సుతుఁ గయుఁడు. గయుని పుత్రుండు నరుఁడు; నరుని కుమారుం డు విరాట్టు. (68) విరాట్సుతుఁడు మహావీర్యుండు; మహావీర్యుని కుమారుఁడు ధీమంతుడు; ధీమంతుని కుమారుడు మహంతుడు; ఆతనికుమారుఁ డు భౌవనుఁడు (69) భౌవనుని పుత్రుఁడు త్వష్ట, ఆ త్వష్టకుమారుఁడు విరజుఁడు, విరజుని పుత్రుండు రజస్సు. ఆతని కుమారుఁడు శతజిత్. (70) ఆశతజిత్తునకు నూర్గురు పుత్రులు. అందరు రాజులే. వారిలో ప్రధానుఁడు విశ్వజ్యోతియనువాఁడు. వారి నుండియ ప్రజలందరు వృద్ధినొందిరి. (71) సప్తద్వీపాంకితమయిన యీ భారతవర్షము వారిది. తద్వంశీయులచే నీ భారతవర్షము పూర్వత్రేతాయుగమనుభవింబడినది. (72) ఒక్కొక్కయుగము కృతవ్రేతాదులచే కూడియున్నది. ఈ మన్వంతరమజీడెబ్బదియొక్కయుగములచే కూడియున్నది. స్వయంభువమన్వంతరములో వారీ వంశీయులే రాజులుగానేలిరి. వారు శతాధికముగా సహస్రాధికముగా నున్నారు. ఇది స్వాయంభువ వంశము. తద్వంశముచే నీయుగము నిండి యున్నది. వారు ఋషులు, దేవతలు, పితరులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, భూతములు, పిశాచములు మనుష్యులు, మృగపక్షులు, ఇదియంతయు వారిసృష్టి, ఇది యుగములు మారుచుండ పరిణామము చెందుచుండును,
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహా పురాణమున పూర్వభాగమున ద్వీతీయమయిన అనుషంగపాదములో ప్రియవ్రతవంశానుకీర్తనమను చతుర్ధాధ్యాయము.
Summary of chapter 14 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter affectionately chronicles the noble dynasty of king Priyavrata, a righteous monarch whose legendary chariot wheels shaped the very continents of the earth. His divine life and the glorious deeds of his descendants are narrated to inspire devout hearts with ideals of perfect dharma, selfless leadership, and unwavering faith. The story serves as a beautiful testament to how temporal power, when guided by pure devotion to the supreme lord, can transform the mortal realm into a reflection of celestial harmony.