వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 83

 

భద్రాశ్వములు, కేతుమాలములు అనువాని స్థితిని విస్తరముగా వర్ణించితిమి. నైషధమను పర్వతమునకు పడమరగా ఉన్న కుల పర్వతములను, మహా నదులను తెలియ జెప్పుదుము. విశాఖము, కంబలము, జయంతము, కృష్ణము, హరితము, అశోకము, వర్ధమానము అనునవి ఆ ఏడు కుల పర్వతముల పేర్లు. వాని నుండి కోట్ల కొలది నదులు పుట్టినవి. వాని ఒడ్డున నివసించు జనపదములకు అవియే పేర్లుగా చూచుకొన వలయును.

 

 

సౌర గ్రామము, అత్తసాంతపము, కృతసుర, శ్రవణము, కంబలము, మాహేయము, అచల కూటము, వాస మూలము, తప క్రౌంచము, కృష్ణాంగము, మణి పంకజము, కృష్ణపాటవిదము, కపిలము, కర్ణికము, మహిషము, కుబ్జము, కరనాటము, మహోత్కటము, శుకనాసము, గజభూమము, కకురంజనము, మనాహకిము, కిసపౌర్ణము, భౌమకము, చోరకము, ధూమజన్మము, అంగారము, జతీవనము, జీవలౌకిలము, వాచాంసహము, అంగ మధురేయము, శుకేచకేయము, శ్రవణ మత్తము, కాసికము, గోదావామము, కులపంజ, వర్జహము, మోదము, అలకము, అను ఈ జనపదములు పర్వతముల నుండి పుట్టిన నదుల జలములను త్రావును.

 

ప్లక్ష, మహాకదంబ, మానసి, శ్యామ, సుమేధ, బహుల, వివర్ణ, పుంఖ, మాల, దర్భవతి, భద్రానది, శుకనది, పల్లవ, భీమ, ప్రభంజన, కాంబ, కుశావతి, దక్ష, కాసవతి, తుంగ, పుణ్యోద, చంద్రావతి, సుమూలావతి, కకుద్మిని, విశాల, కరంటక, పీవరి, మహామాయ, మహిషి, మానుషి, చండ ఇవి ప్రధాన నదులు, తక్కిన చిన్న నదులు వేల కొలదిగా గలవు.