81 - వసు చరిత్ర నిరూపణమ్

వసురువాచ:-

యదేతత్కీర్తితం దేవి తీర్థమాహాత్మ్యముత్తమమ్

తల్లభస్య మహాభాగే! చరిత్వా తీర్థమండలమ్

అహం బ్రహ్మాణ మామగ్ర్య పితరం చ నరేశ్వరి! !

బృన్గావన ముపాగమ్య చరిష్యామి మృగైస్సహ

వసువు పలికెను :- ఓ మోహినీ! ఇపుడు నీకు చెప్పిన తీర్థమాహాత్మ్య విధిని అనుసరించి తీర్థమండలమును పర్యటించి ఫలమును పొందుము. నేను కూడా నీ తండ్రి యగు బ్రహ్మతో సంభాషించి బృన్దావనమును చేరి మృగములతో కలిసి సంచరించేదను.

సూత ఉవాచ :-

ఇత్యుక్త్యా మోహినీం విప్రా వసుస్తస్యాః పురోహితః !

 సత్కృత్య పూజితో భీక్షం బ్రహ్మలోకం యయా తధా

స గత్వా తత్ర ధాతారం బ్రహ్మణం జగతాం విధిమ్

ప్రణమ్య మోహినీ వృత్తం తం కార్యైన న్యవేదయత్

తచ్భుత్వా వచనం. బ్రహ్మ బ్రాహ్మణస్య వసోర్డిజాః !

ప్రసన్న: ప్రాహ తం వత్స సుకృతం హి త్వయా కృతమ్

యా మయా మోహినీ విప్ర దేవకార్యార్ధ మాత్మజా !

 నియుక్తా కృతకార్యా సాత్వయా శప్తా క్షయం గతా

భూ మమాజ్ఞయా వత్స త్వయామోసా జీవితాధునా

నీతా కృతార్ధం తస్మా తోఇన్యస్త్యతో ధిక: కృతీ

యత్యయా మహ్యమాఖ్యాతం మోహినీ వృత్త ముత్తమమ్

ప్రసన్న స్తేన దాస్యామి బ్రూహి తుభ్యం వరం

ద్విజ ఇత్యుక్త స్స ద్విజస్తేన బ్రహ్మణా లోకభావినా !

ప్రణమ్య వన్దే న వరం బృన్దారణ్య నివాసనమ్

తచ్భుత్వా జగతాం ధాతా స్మయమాన శ్చతుర్ముఖః

ప్రాహ ప్రపన్నార్తిహర స్తధ్యాతి మునీశ్వరా:

స ప్రణమ్య విధాతారం వసుఝష్ట మనస్తత:

బృనావన ముపామ్రాజ్య తప శ్చక్రే సమాహితః

తపతస్తస్యలు వసో సంవత్సర గణా ద్విజా !

'వ్యతీయుః పంచసాహస్రా స్తతస్తుష్ణో హరి స్వయమ్ గో పై:

ప్రియసఖైర్వితై ర్యుతో భ్యాహ ద్విజోత్తమమ్

బ్రూహి కిం వృణుషే విప్ర తుష్టాహం తపసా తవ

తతస్స వసురుత్థాయ అష్టాంగాలింగితావని:

ప్రాహ బృన్తావనే దేవ వాసమిచ్ఛామి సర్వదా

అధ విష్ణుద్ద్విజ శ్రేష్టా వరం తద్వాంఛితం దదౌ !

తేనాభి వందితో భూయో హ్యంతరాన ముపాగతః

సద్విజస్త త్ర్పభృత్యేవం స్వే- రూపధర స్మిత:

చిత్త యన తతం దేవం బృన్దారణ్య కుతూహలమ్

కదా చిద్యమునాతీరే నివిష్ట స్తం విచిత్త యన్

దదర్శ నారదం ప్రాప్తం బృష్ణారణ్యం విధస్సుతమ్

స తం దృష్ట్యా నమస్కృత్య పరమం గురు మాత్మనః

పప్రచ్ఛ వివిధ స్థర్మాన్ భగవద్భక్తి వర్ధనాన్

సతే నైవం సుసంపృష్టో నారదో: ధ్యాత్మదర్శనః

తస్మై ప్రోవాచ నిఖిలం భవిష్య చ్చరితం హరేః

సూత మహర్షి పలికెను :- పురోహితుడగు వస్తువు మోహినితో ఇట్లు చెప్పి మోహినిచే చక్కగా పూజాసత్కారములు చేయబడినవాడై బ్రహ్మలోకమునకు వెళ్ళేను. అచట జగద్విధియగు బ్రహ్మకు నమస్కరించి మోహినీ చరిత్ర నంతటిని జరిగినది. జరిగినట్టుగా విన్నివించెను. వసువు మాటలను వినిన బ్రహ్మ సంతోషించి నీవు మంచి పని చేసితివి. నేను మోహినిని దేవకార్యార్థము నియోగించితిని. కాని దేవకార్యము చేయకమునుపే నీచే శపించబడి మృతి చెందెను. మరల నాయాజ్ఞచే నీవామెను బ్రతికించితివి కృతార్థుశాలను చేసితివి. కావున నీ కంటే అధిక పుణ్యాత్ముడెవడు? ఇపుడు నీవు నాకు చెప్పిన మోహినీ చరితమును విని ప్రసన్నుడనైతిని. కావున నీకు వరము నిచ్చెదను. ఏమి కావలయునో కోరుము అని పలికెను. లోకభావియగు బ్రహ్మా ఇట్లు పలుకగా బ్రాహ్మణోత్తముడగు వసువు ప్రణామమునాచరించి బృన్దావననివాసమును వరముగా కోరెను. ఆ మాటలను వినిన బ్రహ్మ చిరునవ్వు నవ్వి అట్లే కానిమ్మని పలికెను. అంతట వసువు సంతోషముతో బ్రహ్మకు నమస్కరించి బృష్ణావనమును చేరి తపము నాచరించెను. వసువు తపస్సు చేయుచుండగా ముగ్గురు ప్రియ మిత్రులతో కూడి శ్రీహరి సాక్షాత్కరించి వస్తువుతో ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా నేను నీ తపస్సునకు సంతోషించితిని ఏమి కావలయునో కోరుము. అంతట వసువు లేచి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి దేవా! ఎల్లపుడూ బృన్గావన నివాసమును కోరుచున్నాను అని పలికెను. శ్రీహరి వసువు కోరికను తీర్చి నమస్కారములనంది అంతర్థానమును చెందెను. ఆ వసువు అప్పటి నుండి స్వేచ్చారూపధరుడై బృన్దావనమున నుండెను. బృందారణ్యకుతూహలయగు శ్రీకృష్ణ భగవానుని ధ్యానించి చుండెను. ఒకపుడు యమునాతీరమున కూర్చొని శ్రీకృష్ణ భగవానుని చింతించుచు బ్రహ్మమానస పుత్రడగు నారద మహర్షిని దర్శించేను. తనకు పరమ గురువగు నాదర మహర్షిని చూచి నమస్కరించి భగవద్భక్తి వర్దకములగు పలు ధర్మముల నడిగెను. వసువు ఇట్లడుగగా అధ్యాత్మజ్ఞానము గల నాదర మహర్షి శ్రీహరి భవిష్యచ్చరితమును వసువునకు తెలిపెను.

ఏకదాహం గతో విప్ర దేవం కైలాస వాసినమ్

ద్రుష్ణుం ప్రష్టుం భవిష్యచ్చ బృష్ణావన రహస్యకమ్

తతః ప్రణమ్య దేవేశం తతస్సిద్ధే స్సమావృతమ్

మహేశం స్వమహివ్యాప్త సర్వ బ్రహ్మండ గోలకమ్

అపృచ్ఛ మాప్సితం భద్రం స మాం ప్రాహ స్మయ న్షరః

వైధాత్ర యత్యయా పృష్టం హరేర్వత్తమనాగతమ్

తతే బ్రవీమి యత్పూర్వం శ్రుతం సురభి వక్రతః

ఏకదా సురభిర్డృష్ణా మయా గోలోక మధ్యగా

స్వసంతాన సమాయుక్తా సుప్రీతా స్నిగ్ధ మానసా

తతః పృష్ణా భవిష్యాధే గవాం మాతా పయస్వినీ

మహ్యం ప్రోవాచ దే వర్ష భవిష్య చ్చరితం హరేః !

సుఖమాస్తేః ధునా దేవః కృష్ణో రాధా సమన్వితః

గోలోక్కేస్మి న్మహే శాన గోపగోపీ సుఖావహః

స దాచిద్దరాలోకే మాధురే మండలే శివ

ఆవిర్భూయాద్భుతాం క్రీడాం బృన్దారణ్యే కరిష్యతి

వృషభానుసుతా రాధా శ్రీరామానం హరేః

ప్రియా సఖాయం విరజాగేహ ద్వాసం క్రుద్ధా శపిష్యతి

తతస్కోపీ మహాభాగ రాధాం ప్రతిశపిష్యతి యాహి

త్వం మానుషం లోకం మిధ శాపాద్ధరాం తతః !

ప్రాప్స్యత్యధ హరి: పశ్చా ద్రహ్మణా ప్రార్థితః

క్షితా భూభార హరణాయైవ వాసుదేవో భవిష్యతి

వసుదేవ గృహే జన్మ ప్రాప్య యాదవ నందనః

కంసాసురభియా పశ్చా ద్వజం నన్తస్య యాస్యతి

తత్ర యాతో హరిః ప్రాప్తం పూతనాం బాలఘాతినీమ్

వియోజయిష్యతి ప్రాణే శ్చక్రవాతం చ దానవమ్

వత్సాసురం మహాకాయం హనిష్యతి సురార్ధనమ్

దమిత్వా కొలియం నాగశిం యమ్యా ఉచ్చాటయిష్యతి

దుస్సహం ధేనుకం హత్వా బకం తద్వదఘాసురమ్

దావం ప్రదానంచ తధా, ప్రలంబం చ హనిష్యతి

బ్రహ్మాణ మీన్దం వరుణం ప్రమత్తా ధనదాత్మజా

విమదాన్స విధాయేనో హనిష్యతి వృషాసురమ్

శంఖ చూడం కేశినం చ వ్యోమం హత్వా ప్రజే

వసన్ ఏకాదశ సమాస్తత్ర గోపీభిః క్రీడయిష్యతి

తతశ్చ మధురాం ప్రాప్య రజకం సంనిహత్య

చ కుబ్జ మృజ్వీం తతః కృత్వా ధనుర్భంక్యా గజోత్తమమ్ !

హత్వా కువలయా పీడం మల్లాంశాణూర కాదికాన్

కంసం స్వమాతులం కృష్ణో హనిష్యతి తతః పరమ్

విముచ్య పితరౌ బద్దె యవనేశం నిహత్య చ

జరాసంధ భయాత్కృష్ణో ద్వారకాయాం సముష్యతి

రుక్మిణీం సత్యభామాంచ సత్యాం జాంబవతీం తధా

కైకేయీం లక్ష్మణాం మిత్ర విందాం కాలిందికాం విభుః

దారానోడ శసాహస్రా భౌమం హత్వోద్వహిష్యతి

పౌండ్రకం శిశుపాలం చ దంతవక్రం విదూరధమ్ !

శాల్వంచ హత్వా ద్వివిదం బల్వలం ఘాతయిష్యతి .

 వజ్రనాభం సునాభం చ సార్ధం వై షట్సురాలయైః

త్రి శరీరం తతో దైత్యం హనిష్యతి వదోర్జితమ్

కౌరవా నాండవం శ్చాపి నిమిత్తమీతరేతరమ్

కృత్వా హనిష్యతి శివో భూభారహరణోత్సుక:

యదూన్యదుభిర న్యోన్యం సంహృత్య స్వకులం హరిః !

పునరేతన్నిజం ధామ సమేష్యతి చేసానుగః

ఏతత్తే భిహితం శంభో భవిష్యచ్చరితం హరేః !

గచ్చ ద్రక్ష్యసి తత్సర్వం జగతీతలగే హరె

ఎనితచ్భుత్వా సురభేర్వాక్యం భృశం ప్రీతో విధాతృజ

స్వస్థానం పునరయాత స్తుభ్యం చాపి మయోచితమ్

త్వం చ ద్రక్ష్యసి కాలేన చరితం గోకులేశితు:

తచ్చుత్వా శూలినో వాక్యం వసుర్ఘృష్ట తనూరుహః

గాయన్మాద్యా న్విభుం తంత్ర్యా రమయామ్యాతురం జగత్

ఏతద్బవిష్య కథితం మయా తుభ్యం ద్విజోత్తమ

యధా తు గౌతమస్తద్వ దహం చాపి హితే రత:

ఓ బ్రాహ్మణోత్తమా! ఒకసారి నేను కైలాసవాసియగు శంకరుని దర్శించుటకు భవిష్యద్బన్టావన రహస్యమును అడుగుటకు కైలాసమునకు వెళ్ళితిని. అప్పుడే నేను సిద్దసమావృతుడు తన మహిమచే జగత్తునంతటినీ వ్యాపించియున్న శంకరునికి నమస్కరించి నా ఈప్సితమును అడిగితిని. అంతట శంకరుడు చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికెను. ఓ నారదా! నీవిపుడడిగిన శ్రీహరి భవిష్యచ్చరిత్రను నేను సురభివదనమునుండి వింటిని, ఇపుడు దానిని నీకు చెప్పెదను. ఒకపుడు నేను గోలోకమధ్యలో నున్న, స్వసంతానసహిత, సుప్రీతురాలు, సుస్నిగ్ధమానస యగు సురభిని చూచితిని. అపుడు నేను పయస్విని యగు గోమాతను " శ్రీహరి భవిష్యచ్చరితమును అడిగితిని. అపుడు నాకు సురభి శ్రీహరి భవిష్యచ్చరితమును తెలి పెను. ఓ శంకరా ఇపుడు శ్రీకృష్ణ భగవానుడు రాధాసమన్వితుడై గోపాలక గోపికలకు సుఖమును కలిగించుచు ఈ గోలోకమున ఆనందముగా నున్నాడు. అతను కొంతకాలమునకు భూలోకమున మధురా మండలమున ఆవిర్భవించి బృన్దారణ్యమున క్రీడించును. వృషభాను సుతయగు శ్రీహరి ప్రియురాలగు రాధ విరజాగేహద్వారస్థుడగు శ్రీహరి మిత్రుని శ్రీరాముని కోపించి శపించును. శ్రీరాముడు కూడా నీవు మానుషలోకమున పుట్టుమని శపించును. ఇట్లు ఇద్దరూ శాపముచే భూలోకమున పుట్టెదరు. తరువాత బ్రహ్మ ప్రార్థనచే శ్రీహరి భూభారమును హరించుటకు భూలోకమున వసుదేవ పుత్రునిగా అవతరించును. వసుదేవుని ఇంటిలో పుట్టి తరువాత కంసునీ భయముచే వ్రేపల్లెకు చనును. అచట నుండి శ్రీహరి కంసుని పంపున వచ్చిన బాలఘాతిని యగు పూతనను, సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుని సంహరించును. అట్లే మహాకాయుడు దేవపీడాకరుడగు వత్సాసురుని సంహరించును. బ్రహ్మను, ఇంద్రుని, వరుణుని, మదించిన కుబేర పుత్రులను గర్వరహితులను చేసి వృషాసురుని సంహరించును. శంఖచూడుని, కేశిని, వ్యోమాసురుని సంహరించి వ్రేపల్లెలో నివసించుచు పదకొండు సంవత్సరములు గోపికలతో క్రీడించును. తరువాత మధురానగరమును చేరి రజకుని సంహరించి, కుబ్జను చక్కగా చేసి, దనుర్భంగము గావించి కువలయాపీడమను గజమును సంహరించి చాణూరాది మల్లులను పరిమార్చి తన మేనమామయగు కంసుని సంహరించును. కారాగారబద్ధులగు తన తలిదండ్రులను విడిపించి, కాలయవనుని సంహరించి, జరాసంధ భయము వలన ద్వారకానగరమున నివసించును. రుక్మిణిని, సత్యభామను, సత్యను, జాంబవతినీ, కైకేయిని, లక్ష్మణను, మిత్రవిందను, కాలిందిని వివాహమాడును. తరువాత నరకాసురుని సంహరించి పదునారు వేల రాజ కన్యలను విమాహమాడును. పౌండ్రకుని, శిశుపాలుని, దంత వక్రుని, విదూరధుని శాల్వుని, ద్వీవీధుని సంహరించును. వజ్రనాభుని, సునాభుని, షట్సురాలయులతో, త్రిశిరదైత్యుని సంహరించును. కౌరవపాండవులకు పరస్పరము కలహమును కలిగించి భూభారహరణమును కోరి సంహరించును. యాదవులకు యాదవులచే పరస్పరము వైరమును కలిగించి స్వకులమును హరింప చేయును. అపుడు మరల తన నివాసమునకు చేరును. ఓ శంకరా! ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీకు చెప్పితిని. ఇక నీవు వేళ్ళుము. శ్రీహరి భూతలమునకు వెళ్ళినపుడు దీనినంతటిని చూడగలవు. ఇట్లు సురభి చెప్పిన శ్రీహరి చరితమును విని నో నివాసమునకు చేరితిని. దానినే ఇపుడు నీకు చెప్పితిని. నీవు కూడా ఈ సమయమున శ్రీ గోపీపతి చరితమును చూడగలవు. ఇట్లు తెలిపిన శంకరుని మాటలను వినిన వసువు సంతోషముచే పులకితగాత్రుడయ్యెను. వీణానాదముచే శ్రీహరిని గానము చేయుచు ఆనందించుచు జగత్తును ఆనందింపచేయుచున్నాను అని నారదుడు పలికెను. ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీ హితమును కోరి నీకు తెలిపితిని.

సూత ఉవాచ:-

ఇత్యుక్త్యా నారదస్తస్మై వసవే స ద్విజన్మనే జగామ

వీణాం రణయం శ్చిన్తయన్యదునందనమ్ !

సవుస్తద్వచశ్రుత్వా ప్రజే సుప్రీతమానసః

ఉవాస సర్వదా విప్రాః కృష్ణక్రీడేక్షణేత్సుకః

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే బృహదుపాఖ్యానే ఉత్తరభాగే వసుమోహినీ సంవాదే

వసుచరిత్ర నిరూపణం నామ ఏకాతితమోంధ్యాయ

సూతమహర్షి పలికెను: ఇట్లు నారదమహర్షి బ్రాహ్మణోత్తముడగు వస్తువునకు తెలిపి, వీణా నాదము గావించుచు, యదునందనుని ధ్యానించుచు వేడలేను. ఆ వస్తువు కూడా నారదమహర్షి మాటలను విని బృందావనమున పరమప్రీతిచే నివసించెను. అచట ఎల్లకాలము బ్రాహ్మణులు శ్రీ కృష్ణభగవానుని క్రీడలను చూడగోరుచుందురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున వసుచరిత్ర నిరూపణమను ఎనుబడియొకటవ అధ్యాయము.