9 - గంగామహాత్మ్యమ్

నారద ఉవాచ :-

శప్తః కథం వసిష్ఠేన సౌదాసో నృపసత్తమః

 గంగాబిన్హ్వభి షేకేణ పునః శుద్ధోభవత్కథమ్

 సర్వమేతదశే షేణ భ్రాతర్మే వస్తుమర్హసి

 శృణ్వతాం వదతాం చైవ గంగాఖ్యానం శుభావహమ్

నారదమహర్షి పలి కెను:- “ఉత్తమ భూపాలుడైన సౌదాసుడు వసిష్ఠమహర్షి శాపమునేట్లు పొందెను? గంగా బిన్హ్వభి షేకముతో మరల ఎట్లు శుద్దుడాయెను దీని నంతటిని వివరముగా నాకు చెప్పుము. గంగా చరితమును వినినవారలకు. చెప్పినవారలకు శుభములు కలుగును”.

సనక ఉవాచ :-

సౌదాసః సర్వధర్మజ్ఞః సర్వజ్ఞో గుణవాన్ శుచిః

బుభుజే పృథివీం సర్వాం పితృవద్రజ్ఞయనజాః

 సగ రేణ యథాపూర్వం మహీయం సప్తసాగరా

 రక్షితా తద్వదమునా సర్వధర్మావిరోధినా

 పుత్రపౌత్రసమాయుక్తః సర్వేశ్వర్యసమన్వితః

 త్రింశదష్టసహస్రాణి బుభుజే పృథివీం యువా

సౌదాస కదా రాజా మృగయాభిరత్వినమ్

వివేశ సబలః  సమ్యక్ శోధితం హ్యాప్తమంత్రిభిః

నిషాదైః  సహితస్తత్ర వినిఘ్నన్మృగసంచయమ్

 ఆససాద నదీం దేవాం ధర్మజ్ఞః స పిపాసితః

 సుదాసతనయస్తత్ర స్నాత్వా కృత్వా హ్నికం మునే

భుక్త్వా చ మంత్రిభిసార్థం తాం నిశాం తత్ర చావసత్

 తతః ప్రాతస్సముత్థాయ కృత్వా పౌర్వాహ్లికీం క్రియామ్

 బభ్రమ మస్త్రీసహితో నర్మదాతీరకే వనే

వనాద్వవానరం గచ్ఛన్నేక ఏవ మహీపతిః

 ఆకర్ణకృష్ణబాణః సత్కృష్ణసారం సమన్వగాత్

 దూర సైన్యోశ్వమారూఢః స రాజానువ్రజన్మ గమ్

 వ్యాఘద్వయం గుహాసస్థమపశ్యత్సురతే రతమ్

 మృగపృష్ఠం పరిత్యజ్య వ్యాఘ్రయోః  సంముఖం యయా।।

ధనుస్సంహితబాణీన తేనాసౌ శరశాస్త్రవిత్

 తాం వ్యాఘ్రం పాతయామాస తీక్షణాగ్రనతపర్వణా

 తమా నాతు సా వ్యాఘ్ షట్లింశద్యోజనాయతా

తటిద్వద్గోగనిర్ధోషా రాక్షసీ వికృతాభవత్

 పతితాం స్వప్రియాం వీక్ష్య ద్వేషన్స వ్యాఘరాక్షసః

 ప్రతిక్రియాం కరిష్యామీత్యుక్త్వా చాంతర్గధే తదా

రాజా తు భయసంవిగ్నో వనే సైన్యం సమేత్య చ

 తద్వృత్తం కథయన్సర్వానాం పురీం సన్యవర్తత

 శంకమానస్తు తద్రక్షః కృత్యాద్రౌజా సుదాసజః

 పరితత్యాజ మృగయాం తతః ప్రభృతి నారద !

 సనకమహర్షి పలికేను :- సౌదాసుడు సర్వధర్మములు తెలిసినవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. గుణవంతుడు. పవిత్రుడు. తండ్రివలె ప్రజలను రంజింపచేయుచు పృథివిని అనుభవించుచుండెను. ఏడు సముద్రములతో కూడియున్న ఈ భూమిని పూర్వము సగరచక్రవర్తి పరిపాలించినట్లు సౌదాస మహారాజు ఏ ధర్మమునకు భంగము కలుగని విధముగా పరిపాలించుచు పుత్రులతో పౌత్రులతో కలిసి అన్నిసంపదలు కలవాడై అనుభవించెను.

సౌదాసమహారాజు ఒకమారు వేటయందు కోరిక గలవాడై ఆప్పులైన మంత్రులు ముందుగా పరీక్షించిన అరణ్యమున ప్రవేశించెను. వేటగాళ్ళతో కలిసి మృగసమూహములను చంపుచు ధర్మము తెలిసిన సౌదాసుడు దప్పిగొని రేవానదిని చేరెను. సౌదాసమహారాజు దేవానదిలో స్నానముచేసి సంధ్యావందనాదికములను ముగించుకొని మంత్రులతో కలిసి భోజనము చేసి ఆ రాత్రి అచటనే గడి పెను. మరల ప్రొద్దుననే లేచి ప్రాతఃకాలకృత్యములను ముగించుకొని మంత్రులతో కలిసి రేవానదీ తీరప్రాంతారణ్యములలో తిరిగెను. తరువాత ఒక్కడే ఒక అరణ్యమునుండి మరొక అరణ్యమునకు వెళ్ళుచు చెవివరకు నారిని లాగి బాణమును ఎక్కు పెట్టి జింకవెంట వెళ్ళెను. అట్లు జింక వెంట గుజ్జముమీద వెళ్ళుచున్న రాజు సైన్యమునకు చాలా దూరముగా వెళ్ళెను. అచట ఒక గుహలో సంభోగము చేయుచున్న పులుల జంటను చూచెను. జింకను విడచి పులుల కెదురుగా వెళ్ళెను. ఎక్కు పెట్టియున్న బాణముతో ఆడపులిని పడవైచెను. ఆ యాడపులి పడుచు ముప్పది యారు యోజనముల విశాలమగు శరీరము కల రాక సీగా మారి ఉరుమువలె భయంకరముగా . ఆరిచెను. పడిపోయిన తన ప్రియురాలిని చూచి ఆ వ్యాఘాసురుడు రాజును ద్వేషించి “ప్రతీకారమును చేసెదను.” అని పలికి అచటనే అంతర్థానమును చెందెను. సౌదాసమహారాజు భయమును చెంది అరణ్యమున తన సైన్యమును చేరి జరిగినదంతయూ వారికి తెలిపి నగరమునకు తిరిగి వెళ్ళెను. రాక్షసుని ప్రతీకారమును శంకించుచు సౌదాస మహారాజు అప్పటినుండి వేటను మానుకొనెను.

గతే బహుతిథే కాలే హయమేధమఖం నృపః

 సమారేభే ప్రసన్నాత్మా వసిష్ణాద్యమునీశ్వరైః

తత్ర బ్రహ్మాదిదేవేభ్యో హవిర్హత్వా యథావిధి

 సమాప్య యజ్ఞనిషాంతో వసిష్ఠః స్నాతకోపీ చ

ఆత్రాన్తరే రాక్షసోసౌ నృపహింసితభార్యకః

 కర్తుం ప్రతిక్రియాం రాజ్ఞే సమాయాతో రుషాన్వితః

 స రాక్షసస్తస్య గురౌ ప్రయాతే వసిష్ఠవేషం తు తదైవ ధృత్వా

 రాజానమణ్యేత్య జగాద భోజ్యే మాంసం సమిచ్ఛామ్యహమిత్యువాచ

భూయస్సమాస్థాయ స సూదవేషం

పక్ష్వామీషం మానుషమస్య ప్రాదాత్

 స్థితశ్చ రాజాపి హిరణ్యపాత్రే

 ధృత్వా గురోరాగమనం ప్రతీక్షన్

 తన్మాంసం హేమపాత్రస్థం సౌదాసో వినయాన్వితః

 సమాగతాయ గురవే దదౌ తస్మైతు సాదరమ్

 తం దృష్ట్వా చింతయామాస గురుః కిమితి విస్మితః

నవమోధ్యాయః అపశ్యన్మానుషం మాంసం పరమేణ సమాధినా

 అహోస్య రాజ్ఞో దౌశ్శీల్యమభక్ష్యం దత్తవాన్మమ

 ఇతి విస్మయమాపన్న: ప్రమన్యురభవన్మునికి

 అభోజ్యం మద్విఘాతాయ దత్తం హి పృథివీపతే !

 తస్మాత్తవాపి భవతు హ్యేతదేవ హి భోజనమ్

 నృమాంసం రక్షసామేవ భోజ్యం దత్తం మమ త్వయా

తద్యాహి రాక్షసత్వం త్వం తదోహారోచితం నృప

 ఇతి శాపం దదత్య స్మి నౌదాసౌ భయవిహ్వలః

 ఆజ్ఞవో భవతైవేతి సకంపోస్య వ్యజిజ్ఞపత్

 భూయశ్చ చింతయామాస వసిష్ఠ సేన నోదితః

 రక్షసా వంచితం భూపం జ్ఞాతవాన్ దివ్యచక్షుషా

 రాజాపి జలమాదాయ వసిష్ఠం శప్తుముద్యతః

 సముద్యతం గురుం శపుం దృష్ట్వా భూయో రుషాన్వితమ్

 మదయంతీ ప్రియా తస్య ప్రత్యువాచాథ సువ్రతా

చాలా దినములు గడిచిన తరువాత ప్రసన్నమైన మనస్సుగల సౌదాస మహారాజు వసిషాది మహర్షులతో అశ్వమేధయాగము చేయ నారంభించెను. ఆ యాగమున బ్రహ్మాది దేవతలను హవిస్సునిచ్చి యజ్ఞమును సమాప్తి గావించి, స్నానము చేయుటకై వసిష్ఠ మహర్షి (నదికి) వెళ్లాను. ఇంతలో సౌదాసునిచే భార్యను పోగొట్టుకొన్న వ్యాఘరాక్షసుడు కోపముతో ప్రతీకారమును చేయుటకు వచ్చేను. ఆ రాక్షసుడు వసిష్ఠ మహర్షి వెళ్ళిన తరువాత వసిష్ఠ మహర్షి వేషమును ధరించి రాజు వద్దకు వచ్చి భోజనములో మాంసము కావలయునని పలికెను. తరువాత ఆ రాక్షసుడు వంటవాని వేషముతో మనిషి మాంసమును వండి రాజునకిచ్చెను. ఆ మాంసమును బంగారు. పాత్రలో ఉంచి గురువుగారి రాకను ఎదురు చూచుచుండెను. వసిష్ఠ మహర్షి వచ్చిన వెంటనే సౌదాస మహారాజు ఆదరముతో ఆ మాంసమునుంచేను. దీనిని చూచిన వసిష్ఠ మహర్షి ఆశ్చర్యముతో ఏమిటిది అని ఆలోచించెను. పరమ సమాధీతో అది నరమాంసమని తెలుసుకొనెను. “ఈ సౌదాసుని దుష్టత్వమేంత వింత. తినరాని దానిని నాకు భోజనముగా పెట్టెను !” ఇట్లు ఆశ్చర్యమును చెంది మిక్కిలి కోపించెను. “ఓ రాజా ! నేను చెడిపోవుటకు తినరాని దానిని ఇచ్చితివి. కావున నీకు కూడా ఇదియే భోజన మగుగాత, రాక్షసుల కొహారమైన నరమాంసమును నాకు ఇచ్చితివి కావున ఆ ఆహారమునకు తగిన రాక్షసత్వమునే నీవు పొందుము.” ఇట్లు వసిష్ఠమహర్షి శాపమిచ్చుచుండగా సౌదాస మహారాజు భయముతో వణుకుచు మీరే మాంసాహారము నీయమని ఆజ్ఞాపించితిరి కదా అని పలికెను. ఆ మాటలను వినిన వసిష్ఠ మహర్షి మళ్ళీ ఆలోచించి దివ్యదృష్టితో రాక్షసుడు రోజును మోసగించెనని తెలుసుకొనెను. సౌదాస మహారాజు కూడా వసిష్ఠ మహర్షిని శపించుటకు జలమును తీసుకొనెను. చాలా కోపముతో వసిష్ఠ మహర్షిని శపించుటకు సిద్దపడిన సౌదాసమహారాజును చూచి ఆతని ప్రియపత్ని మదయంతి ఇట్లు పలి కెను.

మదయంత్యువాచ :

భో ! భో ! క్షత్రియదాయాద ! కోపం సంహర్తు మర్హసి

త్వయా యత్కర్మ భోక్తవ్యం తతాప్తం నాత్ర సంశయః

గురుం తుంకృత్య హుంకృత్య యో వదేన్మూఢధీర్నరః

 అరణ్యే నిర్జలే దేశే స భవేదహ్మరాక్షసః

 జితేన్జియా జితక్రోధా గురుశుశ్రూషణే రతాః

 ప్రయాస్తి బ్రహ్మ సదనమీతి శాస్త్రీషు నిశ్చయః

 తయోక్తో భూపతిః కోపం త్యక్త్వా భార్యాం ననన్ద చ

 జలం కుత్ర క్షిపొమీతి చిన్తయామాస చాత్మనా

తజ్జలం యత్ర సంసిక్తం తద్భవేద్భస్మ నిశ్చితమ్

 ఇతి మత్వా జలం తత్తు పాదయో ర్యక్షిపత్ స్వయమ్

 తజ్ఞలస్పర్శమాత్రేణ పాదౌ కల్మాషతాం గతౌ

 కల్మాషపాద ఇత్యేవ తతః ప్రభృతి విశ్రుతః

కల్మాషపాదో మతీమాన్ ప్రియయాశ్వాసితస్తదా

 మనసా సోతిభీతస్తు వవన్డే చరణే గురోః

 ఉవాచ చ ప్రపన్నస్తం ప్రాంజలిర్నయకోవిదః

 క్షమప్ప భగవన్సర్వం నాపరాధః కృతో మయా

తచుత్వోవాచ భూపాలం మునిర్నిశ్వస్య దుఃఖితః

 ఆత్మానం గర్హయామాస హ్యవివేక పరాయణమ్

 అవివేకో హి సర్వేషామాపదాం పరమం పదమ్

 వివేకరహితో లోకే పశురేవ న సంశయః

 రాజ్ఞా త్వజానతా నూనమేతత్కర్మచితం కృతమ్

వివేకరహితోజోహం యతః పాపం సమాచరమ్

 వివేకనియతో యాతి యో వా కో వాపి నిర్వృతిమ్

 వివేకహీన ఆప్నోతి యో వా కో వాప్యనిర్వతిమ్

 ఇత్యుక్త్వా చౌత్మనాత్మానం ప్రత్యువాచ మునిరృపమ్

నాత్యన్తకం భవేదేతద్ద్వాదశాబ్దం భవిష్యతి

 గంగాబిన్హ్వభిషిక్తస్తు త్యక్త్వా వై రాక్షసీం తనుమ్

పూర్వరూపం సమాపన్నో భోక్ష్యసే మేదినీమిమామ్

తద్భిందు షికసంభూతజ్ఞానేన గతకల్మషః

 హరి సేవాపరో భూత్వా పరాం శాంతిం గమిష్యపి

 మదయంతి పలికెను :- “ఓ మహారాజా ! కోపమును ఉపసంహరింపుము. నీవు అనుభవించవలసిన దానినే పొందితివి. ఈ విషయమున సందేహముతో పనిలేదు. గురువును తిరస్కారముతో దూషించు మూరుడు అరణ్యమున నిర్జల ప్రదేశమున బ్రహ్మరాక్షసుడుగా పుట్టును. ఇంద్రియములను, క్రోధమును జయించినవారు, గురువు సేవలో ఆసక్తులైనవారు బ్రహ్మ లోకమును పొందెదరని శాస్త్ర నిర్ణయము.” ఇట్లు మదయంతి మాటలను వినిన సౌదాస మహారాజు కోపమును విడిచి పెట్టి మదయంతిని అభినందించెను. శాపమునకు గ్రహించిన జలమును ఎక్కడ చల్లవలయునని ఆలోచించెను. ఆ నీటితో చల్లిన ప్రదేశము భస్మమగుట నిశ్చితము. ఇట్లు నిశ్చయించి ఆ జలమును తన పాదముల పై చల్లుకొనెను. ఆ జలము తాకగానే సౌదాస మహారాజ పొదములు కాలి మాడి కల్మషము లాయెను. అప్పటినుండి సౌదాసునికి కల్మాషపాదుడను పేరు ప్రసిద్ధిగాంచేను. బుద్ధిమంతుడగు కల్మాషపాదుడు మదయంతిచే ఓదార్చబడి మనసులో చాలా భయపడుచు గురువు పాదములకు నమస్కరించెను. శరణువేడి చేతులు జోడించి వినయముతో నీతికోవిదుడైన కల్మాషపాదుడు “ఓ మహానుభావా ! క్షమించుము. నేను ఆపరాధమును చేయలేదు” అని పలికెను. ఆ మాటలను వినిన వసిష్ఠ మహర్షి బరువుగా నిట్టూర్చి దుఃఖించినవాడై అవివేకపరాయణుడైన తనను తాను నిందించుకొనెను. “అన్ని ఆపదలకు మూలకారణము అవివేకమే. ఈ లోకమున వివేకము లేనివాడు పశుతుల్యుడే. సంశయముతో పనిలేదు. తెలియని రాజు ఉచితమైన పనినే చేసెను. వివేకరహితుడను. ఆజ్ఞడనైన నేను పాపమును ఆచరించితిని. వివేకము కలవాడు ఏదో ఒక ఆనందమును పొందగలడు. వివేకము లేనివాడు ఏదో ఒక దుఃఖమును పొందగలడు.” ఇట్లు తనను తాను నిందించుకొని వసిష్ఠ మహర్షి “ఈ రాక్షసత్వము శాశ్వతము కాదు పన్నెండు సంవత్సరములుండును. గంగా బిందువులో స్నానమాడి రాక్షసత్వమును విడిచి మొదటి రూపమును పొంది రాజ్యమును పాలించగలవు. గంగాబిందుస్పర్శచే కలిగిన జ్ఞానముచే పాపములు తొలగి శ్రీహరి సేవాపరుడవై ఉత్తమశాంతిని పొందగలవు.” అని పలికెను.

ఇత్యుక్త్వా ధర్వవిదూపం వసిష్ఠః స్వాశ్రమం యయౌ

 రాజాపి దుఃఖసంపన్నో రాక్షసీం తనుమాశ్రితః

 క్షుత్పిపాసావిశేషాల్తో నిత్యం క్రోధపరాయణః

 కృష్ణక్షపాద్యుతిర్భీమో బభ్రమ విజనే వనే

 మృగాంశ్చ వివిధాంస్తత్ర మానుషాంశ్చ సరీసృపాన్

 విహంగమాన్ ప్లవంగాంశ్చ ప్రశస్తాంస్తానభక్షయత్

 అస్థిభిర్భహుభిర్భూయః పీతరక్తకలేవరైః

 రక్తనపేతకే శైశ్చ చిత్రా సీద్ఫూర్భయంకరీ

 ఋతుత్రయే స పృథివీం శతయోజన విస్తృతామ్

 కృత్వాతి దుఃఖితాం పశ్చాదనాన్తరముపాగమత్

 తత్రాపి కృతవాన్నిత్యం నరమాంసాశనం సదా

 జగామ నర్మదాతీరం మునిసిద్ధని షేవితమ్

అధర్వవేదమును బాగుగా తెలిసిన వసిష్ఠమహర్షి ఇట్లు పలికి తన ఆశ్రమమునకు వెడలిపోయెను. రాజు కూడా దుఃఖముతో రాక్షస శరీరమును పొంది మిక్కిలి ఆకలిదప్పులచే బాధపడుచు ఎల్లపుడూ కోపము కలవాడై కృష్ణపక్ష రాత్రివలె భయంకరరూపుడై జనులు లేని అరణ్యమున తిరుగుచుండెను. పలువిధములైన మృగములను, మానవులను, పాములను, పక్షులను, వానరులను భక్షించుచుండెను. పచ్చని ఎఱ్ఱని శరీరములతో చాలా ఎముకలతో ఎఱ్ఱని కొనలు గల కేశములతో భూమి విచిత్రముగా భయంకరముగా మారెను. ఆరునెలలు నూరు యోజనముల విశాలమైన భూమిని బాధించి దుఃఖింపచేసి తరువాత మరొక అరణ్యమునకు వెళ్ళెను. అచట కూడా ప్రతిరోజు నరమాంసభక్షణము చేయుచు మునులు సిద్ధులు సేవించుచున్న నర్మదాతీరమును చేరెను.

విచరన్నర్మదాతీరే సర్వలోక భయంకరః

 అపశ్యత్కంచన మునిం రమన్తం ప్రియయా సహ

కుధానలేన సంతప్తస్తం మునిం సముపాద్రవత్

 జగ్రాహ చాతివే న వ్యాధో మగశిశుం యథా

బ్రాహ్మణీ స్వపతిం వీక్ష్య నిశాచరకరస్థితమ్

 శిరస్యంజలిమాధాయ ప్రోవాచ భయవిహ్వలా

అన్ని లోకములకు భయమును కలిగించువాడై సౌదాసుడు నర్మదాతీరమున తిరుగుచు ప్రియురాలితో రమించుచున ఒక మునిని చూచెను. ఆకలి అనేడు అగ్నిచే పరితపించుచున్న ఆ సౌదాసుడు ముని కొఱకు పరుగెత్తి వేటగాడు మృగశిశువును పట్టుకొనినట్లు పట్టుకొనెను. ఆ ముని భార్య రాక్షసుని చేతిలో నున్న - తన భర్తను చూచి భయముతో తొట్రు పడుచు చేతులు జోడించి రాక్షసునితో ఇట్లు పలికెను.

బ్రాహ్మణ్యువాచ :-

భో ! భో ! నృపతిశూర్దూల ! త్రాహి మాం భయవిహ్వలామ్

ప్రాణప్రియప్రదానేన కురు పూర్ణం మనోరథమ్

నామ్నా మిత్రసహస్త్వం హి సూర్యవంశసముద్భవః

న రాక్షసస్తతోఽనాథాం పాహి మాం విజనే వనే

యా నారీ భర్తృరహితా జీవత్యపి మృతోపమా

తథాఽపి బాలవైధవ్యం కిం వక్ష్యామ్యరిమర్దన !

న మాతాపితరా జానే నాపి బంధుం చ కంచన

పతిదేవ పరో బంధుః పరమం జీవనం మమ

భవాన్వేత్త్యథిలాన్డర్మాన్యోషితాం వర్తనం యథా

త్రాయస బంధుర హితాం బాలాపత్యాం జనేశ్వర !

కథం జీవామి పత్యాస్మినీనా హి విజనే వనే

దుహితాహం భగవతస్రాహి మాం పతిదానతః

ప్రాణదానాత్పరం దానం న భూతం న భవిష్యతి

వదన్తతి మహాప్రాజ్ఞిః ప్రాణదానం కురుష్వ మే

ఇత్యుక్త్వా సా పపాతాస్య రాక్షసస్య పదాగ్రతః

ఏవం సంప్రార్ద్యమానోఽపి బ్రాహ్మణ్యా రాక్షసో ద్విజమ్

అభక్షయతృష్ణసారశిశుం వ్యాఘ్ర యథా బలాత్

తతో విలప్య బహుధా తస్య పత్నీ ప్రతివ్రతా

పూర్వ శాపహతం భూపమశపతోధితా పునః

పతిం మే సురతాసక్తం యస్మాష్ఠింసితవానలాత్

తస్మాత్ స్త్రీ సంగమం ప్రాప్తస్త్వమపి ప్రాప్య సే మృతిమ్

శప్వెవం బ్రాహ్మణీ క్రుద్ధా పునశ్శాపాన్తరం దదౌ

రాక్షసత్వం ధ్రువం తేఽస్తు మత్పతిర్భక్తితో యతః

సోపి శాపద్వయం శ్రుత్వా తయా దత్తం నిశాచరః

ప్రమన్యుః ప్రాహ విసృజన్కోపాదంగారసంచయమ్

దుష్టే కస్మాతదత్తం మే వృధా శాపద్వయం త్వయా ఏక సేవాపరాధస్య శాప స్వేకో మమోచితః

యస్మాత్ క్షిపసి దుష్టాగ్యే ! మయి శాపాన్తరం తతః

పిశాచయోనిమధ్యేవ యాహి పుత్రసమన్వితా

తేనైవం బ్రాహ్మణీ శక్తే పిశాచత్వం తదా గతా

క్షుధార్తా సుస్వరం భీమా రురోదాపత్యసంయుతా

రాక్షసశ్చ పిశాచీ చ క్రోశంతౌ నిర్జనే వనే

జగ్మతుర్నర్మదాతీరే వనం రాక్షస సేవితమ్

బ్రాహ్మణి పలికెను :- “ఓ రాజ శ్రేష్ఠా ! భయముతో వణుకుచున్న నన్ను కాపాడుము. నా ప్రాణప్రియుని నాకిచ్చి నా కోరికను నెరవేర్చుము. నీవు సూర్యవంశమున పుట్టినవాడవు. మిత్రసహుడు అను పేరు గలవాడవు. జాతిచే రాక్షసుడవుకావు. నిర్జనమైన అరణ్యములో అనాధగా ఉన్న నన్ను కాపాడుము. భర్త లేని స్త్రీ బ్రతికున్ననూ మరణించిన దానితో సమానమే. అందులో చిన్నతనములో వైధవ్యము మరీ సహించరానిది. నాకు తలిదండ్రులు లేరు. బంధువులు లేరు. నాకు భర్తయే బంధువు. భర్తయే జీవనము. నీకు అన్ని ధర్మములు తెలియును. స్త్రీ జీవనము తెలియును. కావున బంధువులు లేని దానిని చిన్న పిల్లవాని తల్లిని అయిన నన్ను కాపాడుము. భర్త లేనిదే ఈ నిర్జనారణ్యమున ఎట్లు బ్రతుకగలను ? నేను నీకు కూతురు వంటిదానను. ప్రతిదానము చేసి, నన్ను కాపాడుము. ప్రాణదానమును మించిన దానము ఇదివరకు లేదు. ఇకముందు ఉండబోదు. ఇట్లు ప్రాజ్ఞలు చెప్పెదరు. కావున నాకు ప్రాణదానమును చేయుము.” ఇట్లు పలికి ఆ బ్రాహ్మణి రాక్షసుని పాదాలముందు పడిపోయెను. ఆ ముని భార్య ఇట్లు ప్రార్థించుచున్ననూ రాక్షసుడు మునిని లేడి పిల్లను పెద్దపులి వలె భక్షించేను. తరువాత ముని భార్య పలువిధములుగా విలపించి ఇదివరకే శాపముననుభవించుచున్న రాజును కోపముచే మరల శపించెను. సంభోగములోనున్న నా భర్తను హింసించితివి కావున నీవు కూడా స్త్రీ సంగమసమయమున మృతి చెందేదవు. ఇట్లు శపించిననూ కోపము చల్లారక మరల ఇంకొక శాపమునిచ్చెను. నా భర్తను భక్షించితివి కావున నీవు రాక్షసత్వమునే ఎప్పటికీ వహించి యుండుము. ఈ రాక్షసుడు కూడా శాపద్వయమును విని బాగా కోపించి కనులనుండి నిప్పులను చెఱుగుచు ఇట్లు పలికెను. “ఓ దుష్టురాలా! నాకు రెండు శాపములను వ్యర్థముగా నిచ్చితివి. ఒక అపరాధమునకు ఒక శాపము యోగ్యము. నీవు రెండవ శాపమును ఇచ్చితివి కావున పుత్రునితో పాటు నీవు పిశాచత్వమును పొందుము.” ఇట్లు రాక్షసుని శాపమును పొందిన ఆ బ్రాహ్మణి వెంటనే పిశాచత్వమును పొందెను. ఆ బ్రాహ్మణి పిశాచరూపముతో ఆకలితో పీడించబడి భయంకరముగా రోదించెను. ఆ నిర్జనారణ్యమున రాక్షసుడు, పిశాచి అరచుచు నర్మదాతీరమున రాక్షస సేవితమైన అరణ్యమునకు వెళ్ళిరి.

ఔదాసీన్యం గురౌ కృత్వా రక్షాసీం తనుమాశ్రితః

తత్రా స్తే దుఃఖసంతప్తః కశ్చిల్లోకవిరోధకృత్

రాక్షసం చ పిశాచీం చ దృష్ట్వా స్వవటమాగతౌ

ఉవాచ క్రోధబహులో వటస్లో బ్రహ్మరాక్షసః

క్రీమర్థమాగతో భీమౌ యువాం మత్ స్థానమీప్సితమ్

ఈదృశా కేన పాపేన జాతా మే బ్రువతాం ధ్రువమ్

సౌదాసస్తద్వచశుత్వా తయా యచ్చాత్మనా కృతమ్

సర్వం నివేదయిత్వాస్మై పశ్చాదేతదువాచ హ

గురువును ఉపేక్షించి రాక్షస దేహమును పొంది దుఃఖించుచు లోక విరోధమును చేసిన ఒక బ్రాహ్మ రాక్షసుడు ఆ యరణ్యమున ఉండెను. తానున్న మట్టి చెట్టువద్దకు వచ్చిన రాక్షసుని, పిశాచిని చూచి కోపముతో ఇట్లు పలికెను. “భయంకరులైన మీరు నా మట్టిచెట్టువద్ద కెందుకు వచ్చితిరి. ఈ రూపమును ఏ పాపముతో పొందితిరో నాకు నిజమును చేప్పుడు.” ఆ బ్రహ్మరాక్షసుని మాటలను వినిన సౌదాసుడు తాను, పిశాచీ చేసిన దానినంతయు తెలిపి తరుపోత ఇట్లు పలికెను.

సౌదాస ఉవాచ :-

కస్త్వం వద మహాభాగ ! త్వయా వై కిం కృతం పురా !

సఖ్యుర్మమాతి స్నే హేన తత్సర్వం వస్తుమర్హసి

కరోతి వంచనం మిత్రే యో వా కో వాపి దుష్టధీః

స హి పాపఫలం భుంజే యాతనొస్తు యుగాయుతమ్

జన్తూనాం సర్వదుఃఖాని క్షీయన్డే మిత్రదర్శనాత్

తస్మాన్మితేషు మతిమాన్న కుర్యాద్వంచనం సదా

కల్మాషపాదేనేత్యుత్తో వటస్థో బ్రహ్మ రాక్షసః

ఉవాచ ప్రీతిమాపన్నో ధర్మ వాక్యాని నారద

సౌదాస మహారాజు పలికెను :- “ఓ మహానుభావా ! నీ వెవరవు ? పూర్వము నీవేమి చేసితివి. . మిత్రుడవైన నాకు మిక్కిలి స్నేహముతో దీనినంతటిని వివరించుము. మిత్రుని విషయమున మోసమును చేసినవాడు పాపఫలమును అనుభవించును. పదివేల యుగములు యాతనలననుభవించును. మిత్రుని చూచుట వలన ప్రాణులకు అన్ని దుఃఖములు తొలగిపోవును. కావున బుద్ధిమంతులెవ్వరూ మిత్రుని విషయమున మోసమును తల పెట్టరు.” ఇట్లు కల్మష పాదుడు చెప్పిన మాటలను విని మట్టిచెట్టు మీదున్న బ్రహ్మ రాక్షసుడు ప్రీతిచెంది ధర్మ వాక్యమును పలికెను.

బ్రహ్మరాక్షస ఉవాచ :-

అహమాసం పురా విప్రో మాగధో వేదపారగః

సోమదత్త ఇతి ఖ్యాతో నామ్నా ధర్మపరాయణః

ప్రమత్తోఽహం మహాభాగ విద్యయా వయసా ధనైః

ఔదాసీన్యం గురోః కృత్వా ప్రాప్తవానీదృశీం గతిమ్

న లభేఽహం సుఖం కించిఱితాహారోఽతిదుఃఖితః

మయా తు భక్షితా విప్రాః శతశోఽథ సహస్రశః

కుత్పిపాసాపరో నిత్యమన్తస్తా పేన పీడిత

జగత్తాసకలో నిత్యం మాంసాశనపరాయణః

గుర్వవజ్ఞా మనుష్యాణాం రాక్షసత్వప్రదాయినీ

మయానుభూతమేతద్ది తతశ్శ్రీమాన్న చాచరేత్

బ్రహ్మరాక్షసుడు పలికెను :- “నేను పూర్వము వేదములను బాగుగా అధ్యయనము చేసిన బ్రాహ్మణుడను. మగధదేశనివాసిని. నా పేరు సోమదత్తుడు. నేను ధర్మపరాయణుడనుగా ఉంటిని. విద్యచేత, ధనముచేత, యౌవనములచేత బాగుగా మదించిన నేను గురువుగారిని ఉపేక్షించి ఈ గతిని పొందితిని. ఆహారమును జయించికూడా సుఖమును పొందలేక దుఃఖమునే పొందుచున్నాను. నేను మొదట నూర్లకొలది వేలకొలది బ్రాహ్మణులను భక్షించితిని. ఎల్లప్పుడూ ఆకలిదప్పుల బాధతే మనస్తాపముచే జగత్తునకు భయమును కలిగించుచు మాంసాహారమునందొసక్తుడనైతిని. మానవులు గురువును అవమానించినచో రాక్షసత్వము ప్రాప్తించును. నేను దీనిని అనుభవించితిని. కావున శ్రేయోభిలాషి గురువును అవమానించరాదు.”

కల్మాషపాద ఉవాచ :-

గురుస్తు దృశః ప్రోక్తః కస్త్వయా శ్లాఘితః పురా

తద్వదస్వ సఖీ పర్వం పరం కౌతూహలం హి మే

కల్మాషపాదుడు పలికెను :- “గురువు ఎటువంటివాడు ? నీవు కొనియాడినదేవరిని ? దానినంతటిని నాకు తెలుపుము. వినవలయుననీ చాలా  కుతూహలమున్నది.”

బ్రహ్మరాక్షస ఉవాచ :-

గురవస్సంతి బహవః పూజ్యా వన్ద్యాశ్చ సాదరమ్

తానహం కథయిష్యామి శృణు ష్వెకమనాస్సఖే

అధ్యాపకశ్చ వేదానాం వేదార్థయుతిబోధకః

శాస్త్రవక్తా ధర్మవక్తా నీతిశాస్త్రోపదేశకః

మన్తోపదేశవ్యాఖ్యాకృద్వేదసందేహహృత్తథా

వ్రతోపదేశక శ్చైవ భయత్రాతాఽన్నదో హి చ

శ్వశురో మాతుల శ్చైవ జ్యేష్ఠభాతా పితా తథా

ఉపనేతా ని షేక్తా చ సంస్కర్తా మిత్రపత్తమ

ఏతే హి గురవః ప్రోక్తాః పుజ్యా వంద్యాశ్చ సాదరమ్

బ్రహ్మరాక్షసుడు పలికెను :- ఓ, మిత్రమా ! పూజించదగినవారు, ఆదరముతో నమస్కరించదగినవారు, చాలామంది గురువులున్నారు. వారిని గూర్చి నేను వివరముగా చెప్పెదను. ఏకాగ్రమనస్సుతో వినుము. వేదములను అధ్యపనము చేయువారు, వేదార్థమునకు సంగతిని బోధించువారు, శాస్త్రమును చెప్పువాడు, ధర్మమును చెప్పువాడు, నీతిశాస్త్రము ఉపదేశించువాడు, మస్త్రమును ఉపదేశించువాడు, మస్త్రములను వ్యాఖ్యానము చేయువాడు, వేదములలో కలుగు సందేహములను పరిహరించువాడు, వ్రతములనుపదేశించువాడు, భయమునుండి కాపాడువాడు, అన్నము పెట్టువాడు, కన్యాదానమును చేసినమామ, మేనమామ, పెద్దలన్న, కన్నతండ్రి, ఉపనయనము చేసినవాడు, ని షేకమును చేసినవాడు, సంస్కరించినవాడు వీరందరూ గురువులే. వీరిని ఆదరముతో పూజించవలయును. నమస్కరించవలయును.

కల్మాషపాద ఉవాచ :-

గురవో బహవః ప్రోక్తా ఏతేషాం కతమో వరః

తుల్యాః సర్వేఽప్యుత సఖీ తద్యథావద్ధి బ్రూహి మే

కల్మాషపాదుడు పలికెను :- “ఓ ! మిత్రమా ! చాలామంది గురువులను గూర్చి చెప్పితివి. వీరందరిలో ఎవరు శ్రేష్ఠులు లేదా అందరూ సమానులేనా ? ఈ విషయమును నాకు యథావిధిగా తెలుపుము.”

బ్రహ్మరాక్షస ఉవాచ :-

సాధు ! సాధు ! మహాప్రాజ్ఞ ! యత్ పృష్టం తద్వదామి తే

గురుమాహాత్మ్యకథనం శ్రవణం చానుమోదనమ్

సర్వేషాం శ్రేయ ఆధత్తే తస్మాద్వక్ష్యామి సాంప్రతమ్

ఏతే సమానపూజార్హస్సర్వదా నాత్రసంశయః

తథాపి శృణు వక్ష్యామి శాస్త్రాణాం సారనిశ్చయమ్

ఆధ్యాపకశ్చ వేదానాం మన్తవ్యాఖ్యాకృతస్తథా

పితా చ ధర్మవక్తా చ విశేషగురవస్మృతాః

ఏతేషామపి భూపాల శృణుష్వ ప్రవరం గురుమ్

పర్వశాస్త్రార్థతత్వజ్ఞర్భాషితం ప్రవదామి తే

యః పురాణాని వదతి ధర్మయుక్తాని పండితః

సంసారపాశవిచ్ఛేదకొరణాని స ఉత్తమః

దేవపూజార్లకర్మాణి దేవతాపూజనే ఫలమ్

జాయతే చ పురాణేభ్య స్తస్మాత్తానీహా దేవతాః

సర్వవేదార్థసారాణి పురాణానీతి భూపతే

వదని మునయశ్చైవ తద్వక్తి పరమో గురుః

యస్సంసారార్ణవం తర్జుముద్యోగం కురుతే నరః

శృణుయాత్స పురాణాని ఇతి శాస్త్ర విభాగకృత్

ప్రోక్తవాన్సర్వధర్మాంశ్చ పురాణేషు మహీపతే

తర్కస్తు వాద హేతుస్యాన్నీతి స్వెహికసాధనమ్

పురాణాని మహాబుద్ధే ఇహాముత్ర సుఖాయ హి

యః శృణోతి పురాణాని సతతం భక్తిసంయుతః

తస్య స్యాన్నిర్మలా బుద్ధిర్భూయో ధర్మపరాయణా

పురాణశ్రవణాద్భక్తిర్ఘాయతే శ్రీపతా శుభ

విష్ణుభక్తనృణాం భూప ! ధర్మే బుద్ధిః ప్రవర్తతే

ధర్మాతాపాని నశ్యత్తి జ్ఞానం శుద్ధం చ జాయతే

ధర్మార్థకామమోక్షాణాం యే ఫలాన్యభిలిప్సవః

శృణయు స్తే పురాణాని ప్రాహురిత్థం పురావిదః

అహం తు గౌతమమునేః సర్వజ్ఞాదహ్మవాదినః

శ్రుతవాన్సర్వ ధర్మార్థం గంగాతీరే మనోరమే

కదాచిత్పరమేశస్య పూజాం కర్తుమహం గతః

ఉపస్థితాయాపీ త స్మె ప్రణామం నహ్యకారిషమ్

స తు శాన్తో మహాబుద్ధిరౌతమ స్తేజం నిధిః

మంత్రోదితాని కర్మాణి కరోతీతి ముదం యఙా

యస్త్వర్చితో మయా దేవః శివస్సర్వజగద్గురుః

గుర్వనజొ కృతా యేన రాక్షసత్వే నియుక్తవాన్

జ్ఞానతోఽజ్ఞానతో వాపి యాఽవజ్ఞాం కురుతే గురోః

తస్యైవాశు ప్రణశ్యప్తి ధీవిద్యార్థాత్మజాః క్రియాః

శుశ్రూషాం కురుతే యస్తు గురూణాం సాదరం నరః

తస్య సంపద్బవేదూప ఇతి ప్రాహుర్విపశ్చితః

తేన శా పేన దగ్గఽహమన్త శ్చైవ క్షుధాగ్నినా

మోక్షం కదా ప్రయాస్యామి న జానే నృపసత్తమ !

ఏవం వదతి విప్రేన్ద్ర వటస్థేఽస్మి నిశాచరే

ధర్మ శాస్త్రప్రసంగేన తయోః పాపం క్షయం గతమ్

బ్రహ్మరాక్షసుడు పలికెను. :- “ఓ ! ప్రాజ్ఞుడా ! బాగుగా అడిగితివి. నీవడిగిన దానిని చేప్పెదను. గురువు మహాత్మ్యమును చెప్పుట, వినుట, ఆమోదించుట అందరికి మేలును చేకూర్చును. కావున నేను చెప్పెదను. నేను మొదట చెప్పిన గురువులు అందరు సమానముగా పూజించదగిన వారే. ఈ విషయమున సందేహము లేదు. అయిననూ సకలశాస్త్రనిశ్చయసారమును చెప్పెదను వినుము. వేదాధ్యాపకులు, మస్త్రములకు వ్యాఖ్యానము చేయువారు, తండ్రి, ధర్మమును చెప్పువారు విశ్లేషించి గురువులు. వీరిలో కూడా శేషులను చేప్పెదను వినుము. ఈ విషయమును అన్ని శాస్త్రార్థముల తత్త్వము తెలిసిన వారు చెప్పిన దానినే తెలి పెదను. సంసార పాశములను ఛేదించగల ధర్మములతో కూడిన పూరాణములను చెప్పువారు ఉత్తమ గురువులు. దేవతలను పూజించుటకు తగిన కర్మలు, దేవతలను పూజించుటవలన కలుగు ఫలము పురాణముల వలన కలుగును. కావున పురాణములే దేవతలు. ఓ రాజా ! పుణ్యములు అన్ని వేదార్థసారములని మునులు కూడా చెప్పుచున్నారు. కావున పురాణములను చేప్పువారు. పరమ గురువులు. సంసార సాగరమను దొటుటకు ప్రయత్నము చేయువారు పురాణములను వినవలయుననీ శాస్త్ర విభాగములను చేసినవారు చెప్పుచున్నారు. ఓ రాజా ! పురాణములలో అన్నిధర్మములను చెప్పియున్నారు. తర్కశాస్త్రము పాదమునకు కారణము. నీతి శాస్త్రము ఇహఫలసాధనము. పురాణములు ఇహపరములలో సుఖదోయకములు. ఎపుడూ భక్తితో పురాణములను వినువారలకు ధర్మ పరాయణమైన, నిర్మలమైన బుద్ధి కలుగును. పురాణములను వినుటవలన శ్రీహరియందు, శుభకరమైన భక్తి కలుగును. విష్ణుభక్తి గల వారలకు ధర్మమునందు బుద్ధి ప్రవర్తించును. ధర్మమువలన పాపములు నశించును. జ్ఞానము శుద్ధమగును. ధర్మార్థకామమోక్షముల ఫలములను పొందగోరువారు పురాణములను వినవలయునని ప్రొజులు చెప్పేదరు. నేను బ్రహ్మవొది సర్వజ్ఞుడు అయిన గౌతమమహాముని వలన సర్వధర్మార్థములను, సుందరమైన గంగాతీరమున వినియుంటిని. ఒకపుడు పరమేశ్వరుని పూజించుటకు నేను వెళ్ళితిని. అచటికి వచ్చిన గురువుగారికి నమస్కారమును చేయలేదు. తేజోనిధి, శాంతుడు, మహాబుద్దీయైన గౌతమ మహర్షి మంత్రప్రోక్తవీధుల నాచరించుచున్నాడని సంతోషించేను. కాని సర్వజగద్గురువైన శంకరుడు నా పూజలందుచు గురువు నవమానించినందున నొకు రాక్షసత్వమును ప్రసాదించేను. తెలిసికొని, తెలియక కానీ గురువును అవమానించిన వారికి బుద్ధి, విద్య, తాను చేసిన సుకృతములు అన్నియూ నశించును. గురువును సేవించువారికి అన్నిసంపదలు కలుగునని పండితులు చెప్పుదురు. ఆ శాపముతో పాటు ఆకలిచే దహింపబడుచుంటిని. ఈ రాక్షసత్వము నుండి ఎపుడు విముక్తుడనగుదునో తెలియను.” ఇట్లు మట్టిచెట్టు పైనున్న బ్రహ్మ రాక్షసుడు చెప్పుచుండగా ధర్మ శాస్త్రముల చర్చ జరిపిరి కావున వారి పాపము నశించినది.

ఏతస్మిన్నన్తరే ప్రాప్తః కశ్చిద్విపోఽతిధార్మికః

కళింగదేశసంభూతిః నామ్నా గర్గ ఇతి స్మృతః

వహన్దంగొజలం స్కంధే స్తువన్విశ్వేశ్వరం ప్రభుమ్

గాయన్నామాని తస్యైవ ముద్ హృష్టతనూరుహః

తమాగతం మునిం దృష్ట్వా పిశాచీ రాక్షసౌ చ తె

ప్రాప్తి నః పారణేత్యుక్త్వా ప్రాద్రవన్నూర్ధ్వబాహవః

తేన కీర్తితనామాని శ్రుత్వా దూరే వ్యవస్థితాః

అశక్తాస్త్రం ధర్షయితుమిదమూచుశ్చ రాక్షసాః

అహో విప్ర మహాభాగ ! నమస్తుభ్యం మహాత్మ నే

నామకీర్తనమాహాత్మ్యాద్రాక్షసా దూరగా వయమ్

అస్మాభిరక్షితాః పూర్వం విప్రాః కోటి సహస్రశః

నామప్రావరణం విప్ర రక్షతి త్వాం మహాభయాత్

నామశ్రవణమాత్రేణ రాక్షసా అపి భో వయమ్

పరాం శాస్త్రం సమాపన్నా మహిమ్నా హ్యచ్యుతస్య వై

సర్వథా త్వం మహాభాగ రాగాదరహితో హ్యాసి

గంగాజలాభి షేకేణ పాహ్యస్మాత్పాతకోచ్చయాత్

హరి సేవాపరో భూత్వా యశ్చాత్మానం తు తారయేత్

స తారయేజ్జగత్సర్వమితి శంసంతి సూరయః

అపహాయ హరేరామ హోరసంసారభేషజమ్

కేనోపాయేన లభ్యత ముక్తాస్సర్వత్ర దుర్లభా

లోహోడు పేన ప్రతరన్నిమజ్జన్యుదకే యథా

తథైవాకృతపుణ్యాస్తు తారయస్తి కథం పరాన్

అహో చరిత్రం మహతాం సర్వలోకసుఖావహమ్

యథా హి సర్వలోకానామానన్దాయ కలానిధిః

పృథివ్యాం యాని తీర్థాని పవిత్రాణి ద్విజోత్తమ

తాని సర్వాణి గంగాయాః కణస్యాపి సమాని న

తులసీదళసమ్మిశ్రమపి సర్షపమాత్రకమ్

గంగాజలం పునాత్యేవ కులానామేకవింశతిమ్

తస్మాద్విఘ్ర మహాభాగ ! సర్వశాస్త్రార్థకోవిద !

గంగాజలప్రదానేన పాహ్యస్మానాపకర్మిణః

ఇత్యాఖ్యాతం రాక్ష పైస్తైర్గంగామాహాత్మ్యముత్తమమ్

నిశమ్య విస్మయావిష్టో బభూవ ద్విజసత్తమః

ఇంతలో కళింగదేశమున పుట్టిన గరుడను పేరుగల అతి ధార్మికుడైన బ్రాహ్మణుడొకడు భుజముపై గంగా జలకలశమును మోయుచు జగన్నాథుడైన విశ్వేశ్వరుని స్తోత్రము చేయుచు, విశ్వేశ్వర నామ సంకీర్తనము చేయుచు ఆనందముచే వంటి పై పులకింతలు రాగా అచటికి వచ్చెను. అట్లు వచ్చిన బ్రాహ్మణుని చూచి ఆ ఇద్దరు రాక్షసులు, పిశాచి మాకాహారము దొరిగినదని పలికి చేతులు పైకెత్తి పరుగెత్తిరి. ఆ బ్రాహ్మణుడు కీర్తించు పేర్లను విని దూరములో నిలిచిరి. ఆ బ్రాహ్మణుని హింసించుటకు శక్తి లేనివారై ఆ రాక్షసులిట్లు పలికిరి. “ఓ మహానుభావా! బ్రాహ్మణోత్తమా ! మహాత్ముడవైన నీకు నమస్కారము. నామకీర్తన మహాత్మ్యముచే రాక్షసులమైన మేము దూరములో నుంటిమి. మేము ఇదివరకు వేలమంది బ్రాహ్మణులను భక్షించితిమి. నీవు కీర్తించు నామకవచము నిన్ను గొప్ప ఆపదనుండి కాపొడుచున్నది. నీవు కీర్తించు సొమములను వినినంతనే రాక్షసులమైన మేము కూడా శ్రీహరి మహిమచే గొప్పశాంతిని పొందితిమి. కావున నీవు అన్ని వేళలా రాగద్వేషాదులు లేనివాడవే. ఓ మహానుభావా ! గంగాజలమును మా పై చల్లి మమ్ములను పాపరాశినుండి కాపాడుము. హరి సేవాపరుడే తనను తరింప చేసుకొనినవాడు మొత్తము జగమును తరింపచేయునని జ్ఞానులు, చెప్పుదురు. భయంకరమైన సంసారమునకు ఔషధమైన హరి నామమును వదిలి పెట్టి అంతటా దుర్లభమైన ముక్తిని ఎట్లు పొందగలరు ? ఇనుముతో ఏర్పరిచిన పడవనెక్కి నదిని దాటగోరువారు నీట మునుగునట్లు పుణ్యములను చేయని వారు ఇతరులనెట్లు తరింప చేయగలరు ? మహానుభావుల చరిత్ర అన్నిలోకములకు ఆనందమునిచ్చును. చంద్రుడు లోకముల ఆనందము కొరకే కదా ఉదయించును. ఈ భూమండలమున పావనములైన పుణ్యతీర్థములన్నియు గంగా జలబిందువుతో సమానములు కావు. తులసీ దళముతో కలిసిన గంగోజల బిందువు ఆవగింజంతదైనను (21) ఇరువదియొక్క తరములను తరింపచేయును. కావున ఓ మహానుభావుడవైన బ్రాహ్మణోత్తమా ! అన్ని శాస్త్రార్థములు తెలిసినవాడా ! గంగా జలమునిచ్చి పొషములు చేసిన మమ్ములను కాపొడుము.” ఇట్లు రాక్షసులు చెప్పిన గంగా మాహాత్మ్యమును వినిన బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యమును పొందెను.

ఏషామపీదృశీ భక్తిర్గంగాయాం లోకనూతరి

కిము జ్ఞానప్రభావాణాం మహతాం పుణ్యశాలినామ్

అథాసౌ మనసా ధర్మం వినిశ్చిత్య ద్విజోత్తమః

సర్వభూతహితో భక్తః ప్రాప్నోతీతి పరం పదమ్

తతో విప్రః కృపావిష్ణో గంగొజలమనుత్తమమ్

తులసీదలసంమిశ్రం తేషు రక్షస్స్వ పేచయత్

రాక్షసా స్తేన పిక్తాస్తు సర్ఘపోపమబిందునా

విసృజ్య రాక్షసం భావమభజన్డేవతోపమాః

బ్రాహ్మణీ పుత్రసంయుక్తా సోమదత్తస్తథైవ చ

కోటిసూర్యప్రతీకాశా బభూవుర్విబుధర్షభాః

శంఖచక్రగదాచిహ్నహరిసారూప్యమాగతాః

స్తువంతో బ్రాహ్మణం సమ్యక్తీ జగ్ముర్జరిమందిరమ్

రాజా కల్మాషపాదస్తు నిజరూపం సమాశ్రితః

జగామ మహతీం చింతాం దృష్ట్వా తాన్ముక్తిగానఘాన్

తస్మిన్రాజ్ఞి సుదుఃఖార్తె గూఢరూసా సరస్వతీ

ధర్మమూలం మహావాక్యం బభాషేఽగోధయా గిరా

భో ! భో ! రాజన్మహాభాగ ! న దుఃఖం గంతుమర్హసి

రోజంస్తవాపి భోగానే నహచేయో భవిష్యతి

సత్కర్మధూతపొపొ యే హరిభక్తిపరాయణాః

ప్రయాస్తా నాత్ర సందేహస్తద్విష్ణోః పరమం పదమ్

సర్వభూతదయా యుక్తా ధర్మమార్గప్రవర్తినః

ప్రయాన్రీ పరమం స్థానం గురుపూజాపరాయణాః

ఇతీరితం సమాకర్ణ్య భారత్యా నృసపత్తమః

మనసా నిర్వతిం ప్రాప్య సస్మార చ గురోర్వచః

లోకమాతయైన గంగపై ఇటువంటి రాక్షసులకు కూడా ఇంతటి భక్తియున్నదనిన పుణ్యాత్ములు మహానుభావులు గొప్పజ్ఞానము కలవారి కేంతుండునో ఏమి చెప్పగలము ? అన్ని ప్రాణులకు హితమును కోరుభక్తుడు శ్రీవిష్ణువుయొక్క పరమపదమును చేరగలడను ధర్మమును మనసులో నిశ్చయించుకొనిన ఆ గర్గుడు పొరిపై దయకలవాడై సాటిలేని మహిమ గల, తులసీదళముతో కలిసియున్న గంగాజలమును ఆ రాక్షసులపై చల్లేను. ఆవగింజంత గంగాజల బిందువుచే తడుపబడిన ఆ రాక్షసులు రాక్షస భావమును విడిచి దేవతల రూపమును పొందిరి. పుత్రునితో కూడియున్న బ్రాహ్మణి, సోమదత్తుడు కోటి సూర్యప్రకాశముగలవారై దేవోత్తములయిరి. శంఖచక్రగదా చిహ్నములతో హరి సారూప్యమునుపొంది ఆ బ్రాహ్మణుని బాగుగా స్తుతించుచు హరి మందిరమును చేరిరి. కల్మాషపాదుడగు మహారాజు కూడా నిజరూపమును పొంది సోమదత్తుడు బ్రాహ్మణి ఆమె పుత్రుడు మోక్షమును పొందుట చూచి తాను పొందలేనందుకు విచారించుచుండెను. ఆట్లు రాజు చింతించుచుండగా రహస్య రూపమున సరస్వతీదేవి. ధర్మమూలమైన, మహావాక్యమును స్పష్టమైన, గాఢరూపములోనున్న వాక్కుచే ఇట్లు పలికెను. “మహానుభావుడవైన ఓ రాజా ! దుఃఖించదగవు. నీవు కూడా కర్మభోగములను అనుభవించిన తరువాత గొప్ప మేలును (ముక్తిని) పొందగలవు. సత్కర్మలచే పాపములు తొలగిన హరిభక్తి పరాయణులు పరమపదమును పొందెదరు. ఈ విషయమున సంశయించవలసిన పనిలేదు. అన్ని ప్రాణులయందు దయగలవారు ధర్మమార్గమున ప్రవర్తించువారు, గురుపూజా పరాయణులు పరమపదమును పొందగలరు.” ఇట్లు సరస్వతీదేవి చెప్పిన మాటలను వినిన రాజు మనసులో తృప్తిని పొంది గురువుగారి మాటలను తలచేను.

స్తువన్గురుం చ తం విప్రం హరిం చైవాతిహర్షితః

పూర్వవృత్తం చ విప్రాయ సర్వం తస్మై న్యవేదయత్

తతో నృపస్తు కాలింగం ప్రణమ్య వీధివన్మునిమ్

నామాని వ్యాహరన్విష్ణోః సద్యో వారాణసీం యయౌ

షణ్మాసం తత్ర గంగాయాం స్నాత్వా దృష్ట్వా సదాశివమ్

బ్రాహ్మణీదత్త శాపాత్తు ముక్తో మిత్రసహోఽభవత్

తతస్తు స్వపురీం ప్రాప్తో వసి ప్లేన మహాత్మనా

అభిషిక్తో మునిశ్రేష్ఠ స్వకం రాజ్యమపాలయత్

పొలయిత్వా మహీం కృత్స్నాం భుక్త్వా భోగాంశ్రియం వినా

వసిష్ణాతాప్య సంతానం గతో మోక్షం నృపోత్తమః

నైతచ్చిత్రం ద్విజశ్రేష్ఠ ! విష్ణోర్వారాణ సీం గుణాన్

గృణన్ శృణ్వన్ స్మరన్గంగాం పీత్వా ముక్తో భవేన్నరః

తస్మాత్మ హిమ్నో విపేన్ద గంగాయాః శక్యతే న హి

పారం గంతుం సురాధీశైర్బహ్మవిష్ణుశి వైరపి

యన్నామస్మరణాదేవ మహాపాతకకోటిభిః

విముక్తో బ్రహ్మసదనం నరో యాతి న సంశయః

గంగా గంగేతి యో నామ సకృదపుచ్యతే యదా

తదైవ పాపనిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణే పూర్వభాగే ప్రథమపాదే గంగా మాహాత్మ్య నవమోఽధ్యాయః

గురువగు వసిష్ఠమహర్షిని బ్రాహ్మణ శ్రేష్ఠుడగు ఆ గర్ణుని, శ్రీహరిని, స్తుతించుచు మిక్కిలి సంతోషముతో మొదట జరిగిన వృత్తానమునంతటిని ఆ బ్రాహ్మణునకు తెలియజేసెను. తరువాత మిత్రసహా మహారాజు కాళింగునికి నమస్కరించి శ్రీహరినామసంకీర్తనమును చేయుచు వెంటనే వారాణసీ పట్టణమునకు వెళ్ళెను. ఆ పట్టణమున ఆరుమాసములు నివాసముచేసి గంగలో స్నానముచేసి సదాశివుని దర్శించి బ్రాహ్మణీ శాపమైన శాశ్వత రాక్షసత్వమునుండి విముక్తుడాయెను. ఆ తరువాత తన నగరమును చేరి మహానుభావుడైన వసిష్ఠ మహర్షిచే రాజ్యమున ప్రతిష్టింపబడి తన రాజ్యమును పరిపాలించేను. సమస్త భూమండలమును పరిపాలించి స్త్రీభోగమును తప్ప అన్ని భోగములననుభవించి, వసిష్ఠ మహర్షి వలన సంతానమును పొంది మోక్షమును పొందెను. ఇది వింతయేమియు కాదు. వారాణసి గుణములను శ్రీమహావిష్ణువు గుణములను కీర్తించుచు, వినుచు, స్మరించుచు గంగోజలమును పానము చేయుచు మానవుడు మోక్షమును పొందును. కావున ఓ బ్రాహ్మణోత్తమా ! గంగా మాహాత్మ్యమును వివరించుటకు ఇంద్రుడు, బ్రహ్మ విష్ణుమ హేశ్వరులు కూడ శక్తులు కారు. గంగా నామస్మరణ మాత్రముననే మానవుడు పాతక రాశులనుండి విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. ఈ విషయమున ఎట్టి సంశయములేదు. ఒకసారైనా “గంగా గంగా” అని గంగా నామమును ఉచ్చరించినచో వెంటనే అన్ని పాపములనుండి విముక్తుడై బ్రహ్మలోకమున ప్రకాశించును.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామాహాత్మ్యమున తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.