నారద మహా పురాణము
57 - పురుషోత్తమమాహాత్యము
వసురువాచ :-
దేవానృషిన్పిత్రూoశ్చాన్యా న్సంతర్యాచమ్య వాగ్యతః ।
హస్తమాత్రం చతుష్కోణం చతుర్ద్వారం సుశోభనమ్
పురం విలేఖ్య విధిజే తీరే తస్య మహోదధేః ।
మధ్యే తత్ర లిఖేత్పద్మం అష్టపత్రం సకర్ణికమ్
ఏవం మండల మాలిఖ్య పూజయేత్తత్రమోహిని! ।
అష్టాక్షర విధానేన నారాయణమజం విభుమ్
అధ తే సంప్రవక్ష్యామి కాయశోధనముత్తమమ్ ।
క్షకారం హృదయే చిన్త్యం రక్తం రేఫ సమన్వితమ్
జ్వలంతం త్రిశిఖంచైవ దహంతం పాప సంచయమ్ ।
చంద్ర మండలమధ్యస్థ మేకారం మూర్ద్ని చింతయేత్
శుక్లవర్ణం ప్రవర్షన్తం దివ్యదేహస్తతోభవేత్
అష్టాక్షరం తతో మన్త్రం న్యసేద్దేహాత్మనోర్భుధః ।
వామపాదం సమారభ్య క్రమశశ్చైవ విన్య సేత్
పంచాంగం వైష్ణవం చైవ చతుర్వ్యూహం తథైవ చ ।
కరశుద్ధిం ప్రకుర్వీత మూలమంత్రేణ సాధకః
ఏకైకం చైవ వర్ణం తు అంగులీషు పృధక్పృధక్ ।
ఓంకారం పృధివీ శుక్లం వామ పాదేతు విన్యసేత్
నకారస్తు భువశ్యామో దక్షిణేతు వ్యవస్థితః ।
మోకారం కాలమేవాహు ర్వమ కట్యాం నిధాపయేత్
నాకారం పూర్వ బీజం తు దక్షిణస్యాం వ్యవస్థితమ్ ।
రాకారస్తే జ ఇత్యాహు ర్నాభిదేశీ వ్యవస్థితమ్
వాయవ్యోఽయం యకారస్తు వామస్కంధే సమాశ్రితః ।
ణాకార స్సర్వదా జ్ఞేయో దక్షిణాంసే వ్యవస్థితః
యకారో యం శిరస్థశ్చ యత్ర లోకా వ్యవస్థితాః ।
ఓంకారం హృదయే న్యస్య వికారం వా శిరస్యధ
ష్ణకారం వై శిఖాయాంతు వేకారం కవచే న్యసేత్ ।
నకారం నేత్రయో స్తు స్యా న్మకారం చాస్త్రమీరితమ్
లలాటే వాసుదేవస్తు శుక్లవర్ణ స్సమాశ్రితః ।
రక్తస్సంకర్షణశ్చైవ ముఖే వహ్నంక సన్నిభః
ప్రద్యుమ్నో హృదయే పీతోఽ నిరుద్దో మేహనే స్థితః ।
సర్వాంగే సర్వశక్తిశ్చ చతుర్వ్యూహార్చితో హరిః
మమాగ్రే వస్థితో విష్ణుః పృష్ఠతశ్చాపి కేశవః ।
గోవిందో దక్షిణే పార్శ్వే వామే తు మధు సూదనః
ఉపరిష్టాత్తు వైకుంఠో వారాహః పృధివీతలే ।
అవాంతర దిశో యాస్తు తాసు సర్వాసు మాధవః
గచ్ఛతస్తిష్ఠతో వాపి జాగ్రతస్స్వపతోఽపి వా ।
నరసింహకృతా గుప్తి ర్వాసుదేవమయోహ్యహమ్
ఏవం విష్ణు మయో భూత్వా తతః కర్మ సమారభేత్ ।
యధా దేహే తధా దేవే సర్వతత్త్వాని యోజయేత్
ఫకారాస్త్రం సముద్ధిష్టం సర్వవిఘ్నహరం శుభమ్ ।
తత్రార్క చన్ద్రవహ్నినాం మండలాని విచింతయేత్
పద్మ మధ్యే న్య సే ద్విష్ణుం భువన స్యాంతరస్యతు ।
తతో విచింత్య హృదయే ప్రణవం జ్యోతిరుత్తమమ్
కర్ణికాయాం సమాసీనం జ్యోతీ రూపం సనాతనమ్ ।
అష్టాక్షరం తతో మన్త్రం న్యసే చైవ యధాక్రమమ్
తేన వ్యస్త సమస్తేన పూజనం పరమం స్మృతమ్ ।
ద్వాదశాక్షర మంత్రేణ యజేద్దేవం సనాతనమ్
వసువు పలికెను :-
దేవతలను, ఋషులను, పితరులను ఇతరులను తృప్తి పరిచి, ఆచమనము గావించి పొజియమముతో హస్తమాత్రముగా చతుష్కోణము, చతుర్ద్వారము, సుందరమగు పురమును, సముద్ర తీరమున లిఖించి పురమధ్యమున అష్టపత్రము కర్ణికా సహితముగా పద్మమును లిఖించవలయును. ఇట్లు మండలమును లిఖించి ఆ మండలమున అష్టాక్షర విధానము చే అజుడు విభుడగు నారాయణుని పూజించవలయును. ఇక ఇప్పుడు నీకు ఉత్తమమగు కాయ శోధనమును గురించి చెప్పెదను. రక్తము రేఫ సమన్వితమగు క్షకారమును హృదయమున చింతించవలయును. జ్వలించునది త్రిశిఖము, పాప సంచయమును దహించునది, చంద్ర మండల మధ్యస్థమగు ఏకారమును శిరసున చింతించవలయును. శుక్లవర్ణము కలది, భూమిని తడుపుచు అమృతమును వర్షించు చున్న ఏకారమును శిరమున చింతించ వలయును. ఇట్లు కాయ శుద్ధిచే పాపములు నశించి దివ్య దేహము కలవాడగును. తరువాత దేహము నందు ఆత్మయందు అష్టాక్షర మంత్రమును న్యాసము చేయవలయును. పోమపాదమున ఆరంభించి క్రమముగా న్యాసము గావించవలయును. పంచాంగమును, వైష్ణవమును, చతుర్వ్యూహము నుంచవలయును. తరువాత సాధకుడు మూలమంత్రముచే కరశుద్ధిని చేయవలయును. విడి విడిగా అన్ని వేళ్ళయందు ఒక్కొక్క దానిని ఒక్కొక్క వర్ణముతో నుంచవలయును. శ్యామ వర్ణముగల భూబీజముగు నకారమును దక్షిణపాదమున నుంచవలయును. కాలరూపమగు మోకారమును వామకటియందు ఉంచవలయును. పూర్వ బీజమగు నాకారమును దక్షిణ కటియందుంచ వలయును. తేజో బీజమగు రాకారమును నాభిదేశమునందుంచవలయును. వాయు బీజమగు యకారమును వామ స్కంధమున నుంచవలయును. జాకారమును దక్షిణ భుజమున నుంచవలయును. సకలలోకములుండు శిరస్సున యకారముండును. ఓంకారమును హృదయమున నుంచి వికారమును శిరస్సున నుంచి ప్లకారమును నేత్రములందుంచవలయును. వేకారము అస్రముగా చెప్పబడినది. శుక్లవర్లుడగు వాసుదేవుడు లలాటమున నుండును రక్తవర్ణుడు వహ్ని సన్నిభుడగు. సంకర్షణుడు ముఖమున నుండును. పీత వర్ణుడగు ప్రద్యుమ్నుడుహృదయమున, అనిరుద్దుడు మేహనేంద్రియమున, సర్వాతిగములందు సర్వశక్తి చతుర్వూహుడగు శ్రీహరి ఉండును. నాకు ముందు భాగమున శ్రీవిష్ణువు, వెనుక భాగమున కేశవుడు, దక్షిణ పార్వమున గోవిన్దుడు, వామ పార్శ్వమున మధు సూదనుడుండును. ఊర్థ్వభాగమున వైకుంఠుడు, అధో భూగమున వరాహస్వామి, అవాంతర దిశలయందు మాధవుడుండును. నడుచు, నిలుచు, మేలుకున్న నన్ను నరసింహ స్వామి కాపాడును. ఇట్లు విష్ణుమయుడై, కర్మనారంభించవలయును. దేహమునందున్న విధముగా దేవునియందు అన్నితత్త్యములను న్యాసమును చేయవలయును. సర్వ విఘ్నహరము, శుభమగు ఫకారాన్తము వర కు న్యాసము ఉద్దేశించబడినది. ఇచటనే అర్క చన్ద వహ్నిమండలములను ధ్యానించవలయును. భువనాంతర్భాగమున పద్మమధ్యమున విష్ణున్యాసమును చేయవలయును. తరువాత హృదయమున ఉత్తమ జ్యోతి రూపమగు ప్రణవమును చింతించి, సనాతన జ్యోతిరూపమును కర్ణికయందు ఆసీనమైనట్టు భావించి తరువాత యధాక్రమముగా అష్టాక్షర మన్తమును యధాక్రమముగా న్యాసమును గావించవలయును. ఇట్లు వ్యక్తముగా సమస్తముగా చేయునది ఉత్తమ పూజగా పేర్కొనబడినది. తరువాత ద్వాదశాక్షర మంత్రముచే సనాతన దేవుని పూజించవలయును.
తతోఽవధార్య హృదయే కర్ణికాయాం బహిర్న్యసేత్ ।
చతుర్భుజం మహాసత్త్వం సూర్యకోటి సమప్రభమ్
చింతయిత్వా మహాయోగం తత శ్చావాహయ త్ర్కమాత్ ।
మీనరూపావహశ్చైవ నరసింహశ్చ వామనః
ఆయాంతు దేవా వరదా మమ నారాయణాగ్రతః ।
సుమేరుః పాదపీఠం తే పద్మకల్పిత మాసనమ్
సర్వతత్త్య హితార్థాయ తిష్ఠ త్వం మధుసూదన! ।
పాద్యం తే పాదయోర్దేవ పద్మనాభ సనాతన!
విష్ణో కమల పత్రాక్ష గృహాణ మధుసూధన! ।
మధుపర్కం మహాదేవ బ్రహ్మద్యైః కల్పితం మయా
నివేదితం చ భక్త్యార్ఘ్యం గృహాణ పురుషోత్తమ ।
మందాకిన్యాస్తతో వారి సర్వపాపహరం శివమ్
గృహాణాచమనీయం త్వం మయా భక్త్యా నివేదితమ్ ।
త్వమాపః పృధివీ చైవ జ్యోతిస్త్వం వాయురేవ చ
లోక సంధృతి మాత్రేణ వారణా స్నాపయామ్యహమ్ ।
దేవతంతు సమాయుక్తే యజ్ఞవర్ణ సమన్వితే
స్వర్ణవర్ణ ప్రభే దేవ! వ్యాసీప్రతి గృహ్యతామ్ ।
శరీరం చ న జానామి చేష్టాం చ తవ కేశ
మయా నివేదితం గంధం ప్రతి గృహ్య విలిప్యతామ్ ।
ఋగ్యజుస్సామమంత్రేణ త్రివృతం పద్మయోనినా
సావిత్రీగ్రంధి సంయుక్త ముపవీతం తపార్ప్యతే ।
దివ్యరత్న సమాయుక్తా! వహ్నిభాను సమప్రభాః
గాత్రాణి శోభయిష్యన్తి అలంకారాస్తు మాధవ! ।
సూర్యాచన్ద్రమసోర్జ్యోతి ర్విద్యుదగ్న్యోస్తథైవచ
త్వమేవ జ్యోతిషాం దేవ దీపో యం ప్రతిగృహ్యతామ్ ।
వనస్పతి రసో దివ్యో గంధాఢ్యసురభిశ్చతే
మయా నివేదితో భక్త్యా ధూపోఽయం ప్రతి గృహ్యతామ్ ।
అన్నం చతుర్విధం స్వాదు రసై ష్షడ్భిస్సమన్వితమ్
మయా నివేదితం భక్త్యా నైవేద్యం తవ కేశవ ।
పూర్వే దలే వాసుదేవం యామ్యే సంకర్షణం న్యసేత్
ప్రద్యుమ్నం పశ్చిమే కుర్యా దనిరుద్ధం తధోత్తరే ।
వారాహం చ తధాగ్నేయే నరసింహం చ నైర్రఋతే
వాయవ్యాం మాధవం చైవ తదేశానే త్రివిక్రమమ్ ।
తధాష్టాక్షర దేవస్య గరుడం పరితో న్యసేత్
వామపార్శ్వే తథాచక్రం శంఖం దక్షిణతో న్యసేత్ ।
తథామహాగదాం చైవ న్యసేద్దేవస్య దక్షిణే
తతశ్శార్ఘధనుర్విద్వా న్న్యసే ద్దేవస్య వామతః ।
దక్షిణే చేషుధీ దివ్య ఖడ్గం వామే చ విన్యసేత్
శ్రియం దక్షిణత స్థా ప్య పుష్టిముత్తరతో న్యసేత్ ।
వనమాలాంచ పురత స్తత శ్రీవత్సకౌస్తుభే
విన్యసే ద్ధృదయాదీని పూర్వాదిషు చతుర్వపి ।
తతోఽ స్త్రం దేవదేవస్య కోణే చైవ తు విన్యసేత్
ఇన్ద్ర మన్నిం యమం చైవ నైఋతిం వరుణం తధా ।
వాయుం ధనదమీశానం అనన్తం బ్రహ్మణా సహా
పూజయేత్తా న్యకైర్మoత్రై రధశ్చ్వాం తథైవ చ ।
ఏవం సంపూజ్య దేవేశం మండలస్థం జనార్ధనమ్
పూజితం యస్తు పశ్యేత్స ప్రవిశేద్విష్ణు మవ్యయమ్ ।
సకృదప్యర్చితో యేన విధానానేన కేశవః
లభేదభిమతో న్కామా న్నరో నాస్త్యత్ర సంశయః ।
అనేనైవ విధానేన మండలస్థం జనార్ధనమ్
జన్మమృత్యు జరాస్తీర్త్వా విష్ణోః పదమ వాప్నుయాత్ ।
యస్స్మరేత్సతతం భక్త్యా నారాయణ మతంద్రితః
అన్వహం తస్య వాసాయ శ్వేత ద్వీపః ప్రకీర్తితః ।
ఓంకారాది సమాయుక్తం నమస్కారం తదీయకమ్
సనామ సర్వతత్యానాం మన్త్ర ఇత్యభిధీయతే ।
అనేనైవ విధానేన గంధపుష్పం నివేదయేత్
ఏకైకస్య ప్రకుర్వీత యధోద్దిష్టం క్రమేణ తు ।
ముద్రిస్తతోనిభగ్నీయా ద్యభోక్తి క్రమవేదితమ్
జపం చైవ ప్రకుర్వీత మూలమంత్రేణ తత్త్వవిత్ ।
అష్టావింశతి మష్టౌ వా శతమష్టోత్తరం తథా
కామ్యేషు చ యధోక్తం స్యా ద్యధాశక్తి సమాహితః ।
పద్మం శంఖంచ శ్రీవత్సం గదాం గరుడమేవ చ
చక్రం ఖడ్గం చ శార్జంచ అష్టౌ ముద్రా! ప్రకీర్తితాః ।
గచ్ఛ గచ్ఛ పరం స్థానం పురాణ పురుషోత్తమ!
యన్న బ్రహ్మాదయో దేవా విదంతి పరమం పదమ్ ।
అర్చనం యేన జానన్తి హరేర్మన్త్రైర్తర్యధోదితమ్
తే త్వత్ర మూలమంత్రేణ పూజయన్త్యచ్యుతం శుభే
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తర భాగే వసు మోహినీ సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే సప్తపంచాశత్తమోఽధ్యాయః.
ఇట్లు హృదయావధారణ తరువాత కర్ణికయందు బహిర్బాగమున నుంచవలయును. చతుర్బుజుని మహాసత్త్యుని సూర్యకోటి సమప్రభుని ధ్యానించి మహాయోగమును క్రమముగా అవాహన చేయవలయును. మీన రూపధారి, నరసింహ స్వామి, వామనుడు, వీరందరు నాకు నారాయణుని అగ్రభాగమున రావలయును. నీకు సుమేరువు పాదపాఠము. పద్మ కల్పితమగు ఆసనము. సర్వతత్త్యహిత ము కొరకు మధుసూధనా నీవుండుము. ఓ సనాతనా! పద్మనాభా! నీ పాదములకు పాద్యమును, కమల పత్రాక్షా! మధుసూధనా! శ్రీవిషూ! బ్రహ్మాదులచే కల్పించ బడిన పాద్యమును నాచేత స్వీకరించుము. ఓ పురుషోత్తమా? భక్తిచే నివేదించు అర్యమును గ్రహించుము. సర్వపాపహారీ, శుభప్రదము అగు, మందాకినీ జలమును నాచే భక్తి పూర్వకముగా నివేదించబడు ఆచమనీయమును స్వీకరించుము. నీవే జలము. నీవే పృథివి. నీవే అగ్నివి. నీవే వాయువు. లోకాచారము ననుసరించి జలముచే స్నానము చేయించు చున్నాను. దేవతంతు సమాయుక్తములు, యజ్ఞవర్ణసమన్వితములు స్వర్ణ వర్ల ప్రభలు అగు వస్త్రములను స్వీకరించుము. నాకు నీ శరీరము తెలియదు. చేష్ణ తెలియదు. నేను నివేదించు గంథమును స్వీకరించి లేపనము చేసుకొనుము. ఋగ్యజుస్సామమంత్రములచే బ్రహ్మచేత్రి వృతమగు, సావిత్రీ గ్రంథి సంయుక్తమగు ఉపవీతమును నీకర్పించు చున్నాను. దివ్యరత్న సమాయుక్తములు, వహ్ని భాను సమప్రభలు అగు అలంకారములు నీ అవయవములను అలంకరించును. సూర్య చంద్రుల మెరుపు అగ్నుల జ్యోతి నీ స్వరూపమగుచుము. వనస్పతీరసము, దివ్యము, గంధాడ్యము, సురభియగు ధూపమును నేను అర్పించు వానిని స్వీకరించుము. షడ్రస సమన్వితము స్వాదు యగు నాచే సమర్పించబడు చతుర్విధాన్నమును నైవేద్యముగా స్వీకరించుము. పూర్వదలమున వాసుదేవుని, దక్షిణదలమున సంకర్షణుని, పశ్చిమమున ప్రద్యుమ్నుని, ఉత్తరమున అనిరుద్ధుని న్యాసము గావించవలయును. ఆగ్నేయమున వరాహస్వామిని నైఋతి దిక్కున నరసింహుని వాయవ్యమున మాధవుని, ఈశాన్యమున త్రివిక్రముని న్యాసము చేయవలయును. అష్టాక్షర మంత్రమునకు చుట్టూ గరుడన్యాసముగావించ వలయును. వామ పార్శ్వమున చక్రమును, దక్షిణ పార్శ్వమున శంఖమును, దేవునకు దక్షిణమున మహాగదను వామ భాగమున శార్హధనువును న్యాసము గావించవలయును. దక్షిణమున అమ్ముల పొదను, వామభాగమున ఖడ్గమునుంచవలయును. దక్షిణమున శ్రీని, ఉత్తరమున పుష్టిని ముందు వనమాలను, తరువాత శ్రీవత్సకౌస్తుభములనుంచవలయును. పూర్వాది చతుర్దశలయందు హృదయాదిన్యాసము గావించవలయును. తరువాత మూలలందు దేవదేవుని అస్రన్యాసమును గావించవలయును. ఇంద్రుని, అగ్నిని, యముని, నైఋతిని, వరుణుని, వాయువును, కుబేరుని, ఈశుని బ్రహ్మతో అనస్తుని ఊర్ధ్వాభాగములందు అయా మంత్రములచే పూజించవలయును. ఇట్లు మండలస్థుడగు జనార్ధనుని పూజించి, పూజలనందిన శ్రీహరిని దర్శించిన వారు శ్రీహరిలో ప్రవేశించేదరు. ఈ విధానము ననుసరించి మండలస్థుడగు జనార్ధనుని ఒకమారు పూజించిననూ అభిమతకామనలను పొందును. జన్మ మృత్యు జరాభయములను విడిచి శ్రీవిష్ణు పదమును పొందును. సర్వకాలములందు భక్తిచే ఏమరుపాటు లేక నారాయణుని స్మరించు వానికి నివాసమునకు శ్వేతద్వీపము లభించును. ఓంకారాది సమాయుక్తమగు తదీయనమస్కారము నామ సహితము సర్వ తత్త్యములను మన్తముగా చెప్పబడును. ఈ విధానముతోనే గంధపుష్పాదులను నివేదించవలయును. ఒక్కొకరికి యధోద్దిష్టముగా యధాక్రమముగా నాచరించవలయును. యధోక్త క్రమముగా ముద్రలను ప్రదర్శించలయును. మూల మంత్రము చే జప మును చేయవలయును. అష్టావింశతికాని, అష్టకాని, అష్టోత్తర శతమును కాని జపించవలయును. కామ్య కర్మలందు యధోక్తమును యధాశక్తీ సావధానముగా జపించవలయును. పద్మము, శంఖము, శ్రీవత్సము, గద, గరుడము, చక్రము ఖడ్గము, శార్ణము, అను ఎనిమిది ముద్రలు చెప్పబడినవి. ఓ పురాణ పురుషోత్తమా! పరమ స్థానమునకు వెళ్ళుము. నీ స్థానమును బ్రహ్మాదిదేవతలు కూడా తెలియరు. మన్త పూర్వకముగా యధోక్త విధిగా అర్చనము తెలియని వారు ఇచట మూలమంత్రముచే అచ్యుతుని పూజింతురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యాబదియేడవ అధ్యాయము.
Summary of chapter 184 of the Nārada Mahā Purana is as follows:
పరమాత్మకు అత్యంత ప్రియమైన పవిత్ర తులసీ దేవి ఆవిర్భావము మరియు దివ్య మాహాత్మ్యము ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. తులసీ దళములతో శ్రీహరిని పూజించుట, తులసీ వనమును దర్శించుట మరియు తులసీ కాష్ఠ మాల ధారణ వలన సిద్ధించే అమోఘ పుణ్యఫలము ఇక్కడ నిరూపించబడినది.