నారద మహా పురాణము
80 - బృందావనమాహత్మ్యం
మోహిన్యువాచ:-
మధురాయాస్తు మాహాత్మ్యం వనానాం చాపి మానద! ।
శ్రుతం బృన్దావనస్యాపి రహస్యం కించిదీరయ
బృష్ణారణ్యం భువో బ్రహ్మ శీర్తిరూపం రహోగతమ్ ।
తత్ర్చోతుం మమ వాంఛాప్తి తన్నిరూపయ విస్తరాత్.
మోహిని మలికెను:- గురువర్యా! మధురా మాహాత్మ్యమును వనముల మాహాత్మ్యమును చక్కగా వింటిని. బృందావన రహస్యమును కూడా కొంచెము చెప్పుము. భూమియొక్క కీర్తిరహస్య భూతము బృష్ణావనము. దానిని వినుటకు నాకు కోరిక గలదు. కావున విస్తరముగా వర్ణింపుము.
వసురువాచ:-
శృణు దేవి రహస్యం మే బృన్దారణ్యసముద్భవమ్ ।
యన్నక స్మైచిదాఖ్యాతం మయా ప్రాప్య గురూత్తమాత్
గురవే కధితం భద్రే నారదేన మహాత్మనా ।
బృందయా నారదాయోక్తం రహస్యం గోపికాపతేః
తత్తేహం సంప్రవక్ష్యామి జగదుద్ధారకారణమ్ ।
ఏకదా నారదో లోకా న్పర్యటన్భగవత్రియః
బృందారణ్యం సమాసాద్య తస్థా పుష్పసరస్తటే ।
పశ్చిమోత్తరతో దేవి మాధురే మండలే స్థితమ్
బృష్ణారణ్యం తురీయాంశం గోపికేశరహస్థలమ్ ।
గోవర్ధనో యత్ర గిరిః సఖస్థలసమీపతః
బృష్ణాయాస్తత్తపోరణ్యం నందిగ్రామానుయామునమ్ ।
తటే తు యామునే రమ్యే రమ్యం బృన్దావనం సతి
పుణ్యం తత్రాపి సుభగే సుపుణ్యం కౌసుమం సరః !
బృందాయాస్తు తటే రమ్యే ఆశ్రమాఃతిసుఖావహః
నిత్యం విశ్రమతే యత్ర మధ్యాహ్నా సఖిభిర్హరిః ।
ముహూర్తం స తు విశ్రమ్య స్నిగ్ధ ఛాయాతరోసృలే
శీతలం పుష్పసరసో వార్యుపప్టైశ్య నారదః ।
కృత్వా మాధ్యాహ్నికం కర్మ తస్థా తత్ర సరస్తటే
తత్ర బృష్ణాశ్రమే రమ్యే గోప్యో గోపాశ్చ మోహిని ।
ఆయాని వర్గశో యాన్తి నారదస్వ విపశ్యతః
అదైవం యామమేకం తు తత్సస్థిత్వా తు నారదః ।
ప్రహరార్థివశిష్టీఆహ్ని వివేశాశ్రమమద్భుతమ్
యత్ర బృష్ణా స్థితా దేవీ కృష్ణభక్తి పరాయణా ।
సమాగతానాం సత్కారం విదధానా ఫలాదిభిః
నమస్కృత్య వినమ్రాంగో నిషసాద ధరాతలే
తతస్సా ధ్యానయోగాంతే సమున్మీల్య విలోచనే ।
ఆసనం సందిదేశాధ్ తిధయే నారదాయ
వై తతస్సనారదస్తత్ర సత్కృతో బృన్దయావసత్ ।
రహస్యం గోపికేశస్య తస్యా జిజ్ఞాసురాదరాత్
తయా కృతాం సత్కృతిం తు స్వీకృత్య విధినందనః ।
సుప్రసన్నాంతరం బృందాం జ్ఞాత్వా హార్దం
వ్యజిజ్ఞపత్ సాతు తద్వాంఛితం జ్ఞాత్వా ధ్యానయోగేన భామిని ।
స్వసఖీం మాధవీం తత్ర సమాహూయాబ్రవీదిదమ్ .
మాధవి ప్రియమేతస్య నారదస్యమహాత్మనః ।
సంపాదయ యధా మహ్యం ఆశ్రమస్య సుపుణ్యతా
స్వాశ్రమం హ్యాగతస్యైవ యో న సంపాదయేత్రియమ్ ।
నిష్ఫలో హ్యాశ్రమస్తస్య ఫేరురాజగృహాపమః
అధ సా మాధవీ దేవీ నత్వా నారదమాజ్ఞయా ।
స్వాధిష్ఠాత్ర్యాస్తు బృన్జియా సరస స్తటముత్తమమ్
పశ్చిమోత్తరతస్తస్మి నాతుం తం సందిదేశ హ ।
తతస్తదాజ్ఞయా భద్రే నారదో దేవదర్శనః
నిమమజ్జ జ లేతస్మిన్ ధ్యాయన్నీకృష్ణసంగమమ్ ।
నిమజ్జమానే సరసి నారదే మునిసత్తమే
యయా బృన్దాస్తికం భద్రే సంవిధాయ తదీప్సితమ్ ।
అధాసా నారదస్తత్ర సన్నిమజ్జ్యోధతస్తదా
దదర్శ నిజమాత్మానం వనితారూపమద్భుతమ్ ।
తతస్తు పరితో వీక్ష్య నారదీ సా శుచిస్మితా
పూర్వోత్తరాయాం తిష్ఠనీ ఆహ్వయంతీ కరేంగితైః
వసువు పలికెను:- మోహినీ! బృన్దారణ్య రహస్యమును చెప్పెదను. వినుము. నేను గురువు వలన పొంది ఇంతవరకు ఎవ్వరికీ తెలుపలేదు. నారదమహర్షి నా గురువునకు తెలి పేను. నారదమహర్షికి గోపికాపతిరహస్యమును బృష్ణ చెప్పెను. అట్టి జగదుద్దార కారణమగు బృన్హా మాహాత్మ్యమును ఇపుడు నీకు చెప్పెదను. భగవత్రియుడగు నారదమహర్షి లోకములను పర్యటించుచు ఒకప్పుడు బృన్దావనమును చేరి పుష్పసరసీరమున నిలిచెను. ఈ సరస్సు మధురామండలమున నైఋతిదిశగా నున్నది బృందావనము మధురామండలమున నాలుగవస్థానము. గోపికాపతిరహస్య ప్రదేశము. ఇచటికి సమీపముననే గోవర్ధన పర్వతము కలదు. యమునానదీ తీరమున నందిగ్రామసమీపమున బృన్దాదేవి తపః ప్రదేశము. యమునా నదీ తీరమున సున్దరమగు బృన్గావనము కలదు. అచట పరమ పావనమగునది పుష్పసరస్సు. యమునానదీ తీరమున బృనా ఆశ్రమము అతి సుఖప్రదము. ఇచటనే చెలులతో శ్రీహరి విశ్రమించును. నారదమహర్షి దట్టమగు చెట్టునీడలో ముహూర్తకాలము విశ్రమించి, పుష్పసరోవరపు శీతల జలమును ఆ చమనము గావించి, మాధ్యాహ్నిక కర్మనాచరించి ససస్తీరమున నిలిచెను. సున్దరమగు ఆ బృన్దాశ్రమమున గోపాలకులు, గోపికలు నారదమహర్షి చూచుచుండగా బృందములుగా వచ్చుచుండిరి. ఇట్లు అచట ఒక రూము నిలిచి ఒకటిన్నరరము పగలుండగా అద్భుతమగు బృన్దాశ్రమమున ప్రవేశించెను. ఇచటనే కృష్ణభక్తి పరాయణురాలగు బృన్గా దేవి యుండును. అచటికి వచ్చినవారికి ఫలాదులతో సత్కారములను చేయుచుండును. సాధుసమ్మతుడగు నారదమహర్షి బృన్గాదేవిని ధ్యానయోగాంతమున కనులు తెరిచి అతిధియగు నారదునకు ఆసనమును అర్పించెను. బృందాదేవిచే సత్కరించబడిన నారదుడు ఆసనముపై కూర్చుండెను. గోపికాపతి రహస్యమును అతి రహస్యమును ఆదరముతో తెలియగోరెను. బృందాసత్కారమును స్వీకరించి బృందప్రసన్నురాలని తెలిసి హృదయభావమును తెలి పెను. బృన్గాదేవి ధ్యానయోగముతో నారదుని అభిమతమును తెలుసుకొని తన సఖియగు మాధవిని అచటికి పిలిచి ఇట్లు పలికెను. మహాత్ముడగు నారద మహర్షికి ప్రియమును చేకూర్చుము. ఈ ఆశ్రమమునకు పావనత్వమును చేకూర్చి నాకు ప్రీతిని కలిగించుము. తన ఆశ్రమమునకు వచ్చినవారికి ప్రీతిని కలిగించని ఆశ్రమము నక్కల ఇల్లువలె నిష్పలమగును. అంతట ఆ మాధవీదేవి బృన్గాదేవి ఆజ్ఞచే నారధుని తీసుకొని సరసీరమునకు వెళ్ళి వాయవ్య భాగమున స్నానము చేయుమని చెప్పెను. మాధవీదేవి ఆజ్ఞచే దేవర్షియగు నారదుడు శ్రీకృష్ణసంగమమును ధ్యానించుచు జలమున మునిగెను. నారద మహర్షి నీట మునుగు చుండగా మాధవీదేవి బృన్డేప్సితమును నెరవేర్చి బృన్దాస మీపమునకు వెళ్ళేను. అంతట నారద మహర్షి మునిగి లేచి తనను వనితారూపముగా చూచి ఆశ్చర్యమును చెందెను. అంతట శుచి స్మితయగు నారదీదేవి ఈశాన్య కోణమున నున్న ఉత్తమ భూషణాలంకృతమై చేసన్నదే తనను పిలుచుచున్న సౌందర్యవతియగు వనీతను చూచెను.
తతస్తయా సమాహూతా నారదీ సా తదంతికమ్ ।
ప్రాప్తా విశ్వాసితా స్వస్థా నీతా చాపి స్థలాంతరమ్ ।
రత్నప్రాకారఖచితే భవమేవనితాకులే ।
ప్రాపయ్య తాం నివృత్తాసా సాపి తాభిస్సుసత్కృతా
విశాఖాదిసఖిబ్బన్లై రాశ్వాస్యాలైకయా తతః ।
పితాభ్యన్తరం దేవి సా పశ్యదోపికేశ్వరమ్ దూత్యాం
తస్యాం నివృత్తాయాం సమాహూతా ప్రియేణ సా ।
నారదీ ప్రణిపత్యేశం లజ్జానమ్రాంతికం యయా
రసికేన సమాశ్రిష్య రమయిత్వా విసర్జితా ।
క్రమేణేవ తు సంప్రాప్తి సా పునః కౌసుమం సరః
సా పునస్తత్ర మాధవ్యా మజ్జితా దక్షపశ్చిమే ।
పుంభావమభిసంప్రాప్తో నారదో విస్మితోకబ్రవీత్
తతో బృందాజ్ఞయా తత్ర సరసః పూర్వదక్షిణే ।
ఏకాం తప ఆస్థాయ తస్థా తత్ర్పేక్షత్సుకః
ఏవం తపస్యతస్తస్య నారదస్య మహాత్మనః ।
వృన్దయా పేషితైర్వత్తిం నిజాకల్పయత ఫలైః
ఏకదా నారదస్తత్ర విచరన్నాశ్రమాంతరే ।
శుశ్రావ సౌభగం శబ్దం కయాచిత్సముదీరితమ్
తచ్చుత్వా కౌతుకావిష్ణో నారదోధ్యాత్మదర్శనః ।
విచిన్వన్వనమాస్థాయ న దదర్శ చ తత్పదమ్
తతస్స విస్మయా విష్ణో వృందాం పప్రచ్ఛ సాదరమ్ ।
సాపి తస్మై సమాచఖ్యా కుబ్జవృత్తాంతమాదితః
భూమ్యంతర గుహస్థానా కుబ్జనారీ వరావిభో ।
కామమేకాంతకే స్వేశం సముపాచరతి స్వయమ్
నతాం కోపి మునిశ్రేష్ఠ విజానాతి మయా వినా ।
తతస్సంక్షేపతో వక్ష్యే యాం దిదృక్షుస్తపోచరః
ప్రాతః ప్రబోధితో మాత్రా స్నాత్వా భుక్త్యానుగాన్వితః ।
గోచారణాయ విపినే బృష్ణావన ఉపావిశత్
సఖిభిరోపకై క్రీడాం కుర్వన్సంచారయంశ్చ గాః ।
ద్వితైః ప్రియసఖైరత్ర మమాశ్రమ ఉపావ్రజత్
మయా ప్రకల్పితైర్వత భవనౌ సార్వకామికే ।
ఫలమూలాదిభిర్బకై సర్పితః ప్రియయాస్వపత్
సుసఖ్యా రాధ తత్ర సేవ్యమానో వ్రజప్రియః ।
సార్థయామం విహరతి నికుంజేషు పృథక్తృధక్
రాధాదిభిక్షత్ర సుప్తా వీజితశ్శయనం గతః !
సార్థయామే స్వయం బుద్ధో నిజాస్సంమాన్య తాః ప్రియాః ।
గో పైరోభిర్వత సాయం వ్రజం యాతి ప్రహర్షితః ।
సఖ్యస్సఖిస్థలం ప్రాప్య ప్రియాం సంచయ
రాధికామ్ తయా సహ విశాలాక్ష్యః స్వగేహాన్యాని చాన్వహమ్ ।
ఏవం గతాగతం కుర్వం బ్లీలా నిత్యముపాగతః
మయైవ దృశ్యతే వత్స నాపి బ్రహ్మభవాదిభిః ।
మయాప్యలక్షితం వత్స కుబ్జాసంకేతవైభవమ్
ప్రీతిప్రియోక్త్యా జానామి సుగోప్యం ప్రవదామి తే ।
అంగరాగార్పణంపు ణ్యా త్ర్పాప్తా సంకేతముత్తమమ్
సదా సా సేవనవ్యగ్రా సైకైకేనాప్యనేకధా ।
శతకోటిమితాన్యేవం మిథుని వసన్తి హి
కుబ్జకృష్ణానురూపాణి నానాక్రీడాపరాణి చ ।
సంభూతాన్యాద్యమిధునా స్థావరం భాషయన్యపి
గతాగతవిహీనాని నిత్యం నవనవాని చ ।
తదగమ్యం తృతీయస్య ద్వితీయ స్యైకతాం
గతమ్ రూపం విలక్షణం విప్ర సృష్టిస్థితిలకలమ్ ।
ఏకైవాహం విజానామి శ్రుతం శ్రుత్వా త్వమప్యధ దగ్గః
షట్కర్లగో మంత్ర ఇత్యుక్తం సముపాచర ।
శ్రుత్వేతద్దుర్లభం స్కోపి బృశ్లోక్యా నారదో మునిః
ఉభయం చిన్తయన్రాప్లో మునిసతైవ తత్పరమ్ ।
ఏతద్రహస్యం విధి విషయం గురు శిష్యయోః
నైవకోప్యపరో వేత్తి ధర్మస్సైవావయోరపి ।
ఏకైవ సా విజానాతి వక్తుశ్రోతైకత శ్శుభౌ
తదేకం తత్యమేవాస్తి నేహ నానాస్తి కించన ।
గదితం తే మహాభాగే రహస్యం గోపికేశితుః
అట్లు ఆమెచే పిలువబడిన నారది ఆమెను సమీపించినది. ఆ వనిత నారదీ దేవికి నమ్మకము కలిగించి ఓదార్చి మరొక ప్రదేశమునకు తీసుకొని వెళ్ళేను. అచట రత్నప్రాకారఖచితము వనితాకులమగు భవనమున చేర్చి వనిత మరలిపోయేను. నారదీదేవి కూడా అచటి వనితలచే సత్కరించబడినది. విశాఖా మొదలగు సఖ్పీన్షముచే ఓదార్చబడినది. వారిలో ఒక చెలి నారదీదేవిని అంతఃపురమునకు గొనిపోయినది. అచట నారది గోపికాపతిని దర్శించెను. దూతి వెడలిపోగానే ప్రియుడగు గోషికానాథుడు పిలువగా నారదీదేవి నమస్కరించి లజ్జుచే తలవంచి సమీపించెను. రసికుడగు గోపికాపతి చక్కగా ఆలింగనము చేసుకొని రమింపచేసి విడిచిపుచ్చాను. నారదీదేవి క్రమముగా మరల పుష్పసరస్సును చేరినది. అచట నున్న మాధవీదేవి నైఋతి కోణమున స్నానము చేయించెను. స్నానము చేసిన వెంటనే పుంభావమును పొందిన నారదుడు ఆశ్చర్యమును చెందెను. తరువాత బృన్గాదేవి ఆజ్ఞచే నారదమహర్షి సరస్సునను ఆగ్నేయ కోణమున తపము నాచరించుచు శ్రీకృష్ణ దర్శనమును కోరుచుండెను. ఇట్లు తపమునాచరించుచు బృన్గాదేవి పంపిన ఫలములచే జీవనమును గడుపుచుండెను. ఒకపుడు నారదమహర్షి ఆశ్రమమున తిరుగాడుచు ఒక యువతి పలికిన మధుర శబ్దమును వినెను. అధ్యాత్మ జ్ఞానముగల నారదమహర్షి ఆ శబ్దమును విని కుతూహలముతో వెత కుచు వనమును చేరి ఆమె స్థానమును చూడజాలక పోయెను. అంతట ఆశ్చర్యమును చెందిన నారదమహర్షి ఆదరముతో బృన్గాదేవిని అడిగెను. బృందాదేవి నారద మహర్షికి మొదటి నుండి కుబ్జవృత్తాంతమును తెలి పెను. భూమ్యంతరగుహస్థితయగు కుబ్జాదేవి ఉత్తమన్రీ. శ్రీకృష్ణభగవానునకు అత్యంత ప్రియురాలు. ఏకాంతమున స్వామికి పరిచర్యలను చేయించుచుండును. కుబ్జాదేవిని నేను తప్ప ఎవరూ తెలియ జాలరు. నీవు ఎవరిని చూడగోరి తపమునాచరించు చుంటివో ఆకుబ్జ వృత్తాంతమును సంక్షేపముగా తెలి పెదను. శ్రీకృష్ణభగవానుడు ప్రాతఃకాలమున తల్లి లేపగా లేచి స్నానమాడి భుజించి అనుచరులతో కలిసి గోవులను మేపుటకు అరణ్యమునకు చేరి బృందావనమున విశ్రమించేను. స్నేహితులగు గోపాల కులతో క్రీడించుచు ఆవులను త్రిప్పుచు ఇద్దరు మువ్వురు ప్రియమిత్రులతో నా ఆశ్రమమున కు వచ్చేను.సర్వారామప్రదమగు భవనమున నాచేకల్పించబడిన ఫలమూలాదులచే తృప్తి చెంది ప్రియురాలితో కలిసి పరుండెను. అత్యంత ప్రియురాలగు రాధచే సేవించబడుచు గోపికా ప్రియుడు ఆయా పొదలలో వేరువేరుగా ఒక ఝామున్నర విహరించును. అచట పరుండిన స్వామిని రాధాదులు వింజామరలచే వీచుచుందురు. ఝామున్నరకు స్వయముగా మేల్కాంచి తన ప్రియురాళ్ళను లాలించి గోపాలకులతో గోవులతో సాయంకాలమున సంతోషముతో ఇల్లు చేరును. చెలులందరూ తమ ప్రదేశమున చేరి ప్రియురాలగు రాధాదేవిని వెతకి ఆమెతో కలిసి వారందరూ ప్రతిదినమూ తమ తమ గృహములకు వెళ్ళేదరు. ఇట్లు ప్రతిదినము ఈ లీలలనే చేయుచుండును. ఈ లీలలను నేను మాత్రమే చూచుచుందును. బ్రహ్మ రుద్రాదులు కూడా చూడజాలరు. కుబ్జాసంకేత వైభవమును నేను కూడా చూడజాలకపోతిని. ప్రీతిప్రియుల మాటలచే తెలిసితిని. నీకు అతి రహస్యమును తెలుపుచున్నాను. పవిత్రమగు అంగరాగార్పణము వలన కుబాదేవి ఉత్తమ సంకేతమును పొందగలిగినది. కుబ్జాదేవి ఎప్పుడూ సేవించుటలోనే మునిగియుండును. ఒక్కడే యగు గోపికాపతిని పలువిధములుగా సేవించుచుండును. ఇచట ఇట్లు శతకోటి మిథునములు నివసించుచుండును. కుబ్జకృష్ణాను రూపములు నానా క్రీడాపరములుగా నుండి ఆద్యమిథునము నుండి పుట్టి ఇచటి వనమునకు శోభనిచ్చుచుండును. ఈ మిథునములు గతాగత రహితములు. నిత్యనూతనములు. తృతీయమునకు అగమ్యమై ద్వితీయమున ఐక్యమును పొందిన విలక్షణ రూపము సృష్టిస్థితిలయములకు ఏక మూలస్థానము. ఈ విషయమును నేనొక్కదానినే తెలియుదును. ఇపుడు నా నుండి విని నీవు కూడా తెలియుదువు. షట్కర్లగతమగు దుగ్ధమంత్రమును చక్కగా ఉపాసించుము. ఇట్లు బృన్దాదేవి తెలుపగా దుర్లభమగు విషయమును తెలిసి దుర్లభమగు ఆ మిథునమును చింతించుచూ అచటనే యుండెను. ఓ బ్రహ్మపుత్రా! ఇది గురు శిష్యుల రహస్యము. ఇతరులు తెలియజాలరు. మనధర్మము కూడా ఇదియే. మొదట ఒకడే తెలియును. తరువాత వినువాడు తెలియును. ఇదియే ఒకటే తత్యము కలదు. ఇచట నానా తత్యస్వరూపము లేదు. ఇట్లు నీకు అతి రహస్యమగు గోపికాపతి చరితమును తెలిపితిని.
ప్రకాశాచ్చరితం చాపి వక్ష్యే సమ్యజ్నిశామయ ।
యత్ర సందర్శితం తత్వం త్వత్పితే విధినందిని
తద్ర్బహ్మకుండమేతద్ది పుణ్యం బృష్ణావనే వనే ।
తత్ర యస్నాతి మనుజో మూలవేషం విభావయన్
వైభవం పశ్యతే కించి దేవం నిత్యవిహారిణః ।
శత్రేణ జ్ఞాతతత్యేన గోవినో యత్ర చిన్తితః
గోవిన్దకుండం తద్భధ్ర స్నాత్వా తత్రాపి తల్లభేత్ ।
ఏకానేకస్వరూపేణ యత్ర కుంజావిహారిణా
వల్లవీభి స్సమారభో రాసస్తదపి తద్విధమ్ ।
యత్ర నన్హాదయో గోపా దదృశుర్వైభవం
విభో తచ్చ తత్యప్రకాశాఖ్యం తీర్థం శ్రీయమునాజలే ।
దర్శితం యత్ర సోపానాం కాలియస్య విమర్ధనమ్
తచ్చ పుణ్యం సమాఖ్యాతం తీర్థం పాపాపరాంనృణామ్ ।
దావాగ్నేర్మోచితా యత్ర స స్త్రీ బాలధనారకాః గోపాః
కృషైన తత్పుణ్యం తీర్థం స్నానాదఘాపహమ్ ।
యత్ర కేశీ హత సేన లీలయైవ హయాకృతిః ।
తత్ర స్నాతస్తు మనుజో లభతే ధామ వైష్ణవమ్ !
యత్ర దుష్టావృషస్తేన హతస్తత్రాభవచ్ఛుచిః
అరిష్టకుండం విఖ్యాతం స్నానమాత్రేణ ముక్తిదమ్ !
ధేనుక్కోమౌ బకో వతో వ్యోమో లంబాసురోపి చ హతా:
కృషైన లీలాసు తత్ర తీర్థాని యాన్యపి ।
తేషు స్నాత్వా నరో భక్త స్సన్తర్ప్య పితృదేవతాః
లభతే వాంఛితాన్కామా శ్రోపాలస్య ప్రసాదతః ।
సుప్తం భుక్తం విచరితం శ్రుతం దృష్టం విలక్షణమ్
కృతం యత్ర చ తత్ క్షేత్రం స్నానాత్స్వర్గగతిప్రదమ్ ।
శ్రుతస్సంచిన్దితో దృష్టా నతశిష్టస్ముతోర్థితః
యత్ర పుణ్యనరైర్భధ్ర తచ్చ తీర్థం గతిప్రదమ్ ।
యత్ర శ్రీరాధయా భద్రే తపస్తప్తం సుదారుణమ్
తచ్ఛీ కుండం మహత్పుణ్యం స్నానే దానే జపాదికే ।
వత్సతీర్థం చన్ల సర సదైవాప్సరసాం సరః
రుద్రకుండం కామకుండం పరమం మందిరం హరేః ।
విశాలాలకనందాడ్యా నీపఖండం మనోహరమ్
విమలం ధర్మకుండం చ భోజనస్థలమేవ చ ।
బలస్థానం బృహత్సామః సంకేతస్థానకం హరేః
నంద్రోగ్రామః కిశోర్యాశ్చ కుండం కోకిలకాననమ్ ।
శేషశాయి పయోఃబ్దిశ్చ క్రీడాదేశోక్షయో వట:
రామకుండం చీర చౌర్యం భద్రభాండీరబిల్వకమ్ ।
మానాహ్వం చ సరః పుణ్యం పులినం భక్త భోజనమ్
అక్రూరం తార్క్ష్యగోవిందం బహులారణ్యకం శుభే ।
ఏతద్బన్గావనం నామ సమంతాత్పంచయోజనమ్
సుపుణ్యం పుణ్యకృఙుష్టం దర్శనాదేవ ముక్తిదమ్ ।
యస్య సందర్శనం దేవా వాంఛని చ సుదుర్లభమ్
లీలా మాభ్యంతరీం ద్రుష్టుం తపసాపి న చ క్షమాః ।
సర్వత్ర సంగముత్సృజ్య యస్తు బృన్దావనం శ్రయేత్
న తస్య దుర్లభం కించిత్ త్రిషు లోకేషు భామిని ।
బృందావనేతి నామాపి యస్సముచ్చరతి ప్రియే
తస్యాపి భక్తిర్బవతి సతతం నన్దనన్దనే ।
యత్ర బృందావనే పుణ్యే నరనారీప్లవంగమాః
కృమికీటపతంగాద్యాః ఖగా వృక్షా నగా మృగాః ।
సముచ్చరంతి సతతం రాధాకృ షైతి
మోహిని కృష్ణ మాయాభిభూతానాం కామకశ్మలచేతసామ్ ।
స్వప్నేఃపి దుర్లభం పుంసాం మన్యే బృందావనేక్షణమ్
బృందారణ్యం తు యొర్దృష్టం నరైస్సుకృతిభిశుభే ।
తైః కృతం సఫలం జన్మ కృపాపాత్రాణి తే హరేః
కిం పునర్బహునోక్తేన శ్రుతేన విధినందిని ।
సేవ్యం బృన్దావనం పుణ్యం భవ్యం ముక్తిమభీప్సుభిః
దృశ్యం గమ్యం చ సంసేవ్యం ధ్యేయం బృన్దావనం సదా ।
నాస్తి లోకే సమంతస్య భువి కీర్తివివర్ధనమ్
ఇక ఇపుడు ప్రకాశమగు చరితమును చెప్పెదను. చక్కగా వినుము. ఈ తత్త్యమును నీ తండ్రికి చూపెను. చూపిన ప్రదేశమీ బ్రహ్మకుండమే. బృన్దావనమున ఈ కుండము పరమ పావనము. ఇచట స్వామి మూల రూపమును ధ్యానించుచు స్నానమాడినవారు నిత్య విహారియగు గోపికాపతి వైభవమును చూడగలడు. ఇచటనే తత్త్యమునెరిగిన ఇంద్రుడు గోవిందుని ధ్యానించెను. ఇట్లు ధ్యానించిన ప్రదేశమే గోవిన్ద కుండము. ఇచట స్నానమాడినవారు కూడా గోవిన్ద వైభవమును దర్శించగలరు. - ఏకరూపములో, బహురూపములతో గోపికలతో పొదలిండ్లలో క్రీడించిన రాసక్రీడ కూడా అత్యద్భుతము. పరమపావనము. ఇచటనే నందాది గోపాలకులు శ్రీహరి వైభవమును దర్శించిరి. ఇదియే తత్త్యప్రకాశతీర్థము. శ్రీయమునా జలమున కలదు. గోపాలకులకు కాలియమర్దనము చూపిన ప్రదేశము సర్వపాపాపహతీర్థము. గోపగోపీ జనమును దావాగ్నినుండి కాపాడిన ప్రదేశము కూడా పరమ పావనము. స్నానమాత్రమున సర్వపాపహారము. శ్రీకృష్ణ భగవానుడు విలాసముగా హయాకారమున నున్న కేశియను రాక్షసుని సంహరించిన ప్రదేశమున స్నానమాడినవారు శ్రీహరిలోకమును చేరెదరు. దుష్టుడగు వృషాసురుని సంహరించిన ప్రదేశము అరిష్టకుండము. స్నానమాత్రమున ముక్తి ప్రదము, ధేనుకాసురుడు, అఘాసురుడు, బకాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, లంబాసురుడు శ్రీకృష్ణభగవానునిచే లీలగా చంపబడిన ప్రదేశములన్నియూ పవిత్ర తీర్థములే. వీటిలో స్నానమాడి పితృదేవతలకు తర్పణము లిడినవారు శ్రీకృష్ణానుగ్రహము వలన సకలాభీష్టములను పొందగలరు. శ్రీకృష్ణ భగవానుడు నిదురించిన, భుజించిన, సంచరించిన, వినిన, చూచిన ప్రదేశములన్నియూ విలక్షణ క్షేత్రములే. వీటిలో అశీతితమోధ్యాయః స్నానమాడినవారికి స్వర్గము లభించును. పుణ్యాత్ములకు గోపాలకులు స్వామి చరితమును వినిన ప్రదేశము, ధ్యానించిన, దర్శించిన, నమస్కరించిన, ఆలింగనము చేసుకోబడిన, స్తుతించబడిన, యాచించబడిన ప్రదేశములన్నియూ పరమ పావనములు. ఉత్తమగతి ప్రదములు. శ్రీ రాధాదేవి తపమునాచరించిన ప్రదేశము శ్రీ కుండమనబడును. ఇది పరమ పావనము. ఇచట స్నానదాన జపాదికములు అక్షయగతి ప్రదములు. వత్సతీము, చన్దసరస్సు, అప్పరస్పరస్సు, రుద్రకుండము, కామ కుండము, శ్రీహరి మందిరము, అలకనంద పొదలో నున్న విశాల, మనోహరమగు నీపఖండము, ధర్మకుండము, భోజనస్థలము, బలస్థానము, బృహత్సానువు, శ్రీహరి సంకేతస్థానము, నందిగ్రామము, కిశోరమండము, కోకిలకాననము, శేషశాయిపయోఃబ్ది, క్రీడాదేశము, అక్షయవటము, రామకుండము, చీర చౌర్యము, భద్రభాండీరబిల్వకము, మానసరస్సు, వలినము, భక్త భోజనము, అక్రూరము, తార్క్ష్యగోవిన్ద ము బహులారణ్యకము, ఇవన్నియూ కలిసి బృందావనకమండలమనబడును. ఇది యంతయూ పంచయోజన విస్తీర్ణము. పరమపావనము. పవిత్ర జన సేవితము, దర్శన మాత్రమున ముక్తి ప్రదము. సుదుర్లభమగు బృన్గావనమును దేవతలు కూడా చూడగోరెదరు. శ్రీహరి రహస్యలీలలను చూడగోరి తపస్సునాచరించియు చూడజాలక పోయిరి అని సంగములను విడిచి బృన్దవనమునాశ్రయించిన వారికి మూడులోకములలో దుర్లభమగునదేదియును లేదు. బృన్గావననామమును పలికిన వారికి కూడా నన్దనన్దనునియందు భక్తి కలుగును. బృన్దావనమునందు నరులు, నారీజనము, వానరులు, కృమికీటపతంగాదులు, పక్షులు, వృక్షములు, పర్వతములు, మృగములు, ఎప్పుడూ రాధాకృష్ణ నామమును జపించుచుందురు. కృష్ణమాయాభి భూతులు, కామకశ్మల చిత్తులు అగువారికి స్వప్నములలో కూడా బృన్తావన దర్శనము లభించదు. బృన్దావనమును దర్శించిన వారు సఫలమగు జన్మను పొందెదరు. శ్రీహరి కృపాపాత్రులయ్యెదరు. ఇంకనూ ఏమి చెప్పవలయును. ముక్తిని కోరువారు శుభప్రదము, పుణ్యప్రదమగు బృన్దావనమును సేవించవలయును. దర్శించవలయును. ధ్యానించవలయును. దీనిలో సరూపమగు కీర్థివర్ధకమగు మరియొక క్షేత్రము ఈ భూమండలముననే లేదు.
యత్ర గోవర్ధనో నామ ద్విజకల్పే పురాతనే ।
విరక్తస్సర్వసంసారా తప్తవాన్సరమంతపః
తద్దత్వా దేవి దేవేశో భగవాన్విష్ణురవ్యయః ।
క్రీడాస్థానం నిజం ప్రాప్తో వరం దాతుం
ద్విజన్మనే తం దృష్ట్వా దేవదేవేశం శంఖచక్రగదాధరమ్ !
విలసత్కౌస్తు భోరస్కం మకరాకృతి మండలమ్
సుకిరీటం సుకటకం కలనూపురభూషితమ్ !
వనమాలానివీతాంగం శ్రీవత్సాంకితవక్షసమ్ ।
పీతకౌశేయ వసనం నవాంబుదసమప్రభమ్ !
సునాభిం సుందరగ్రీవం సుకపోలం సునాసికమ్
సుద్విజం సుస్మితం సుష్టు జానూరు భుజమధ్యగమ్ !
కృపొర్లవం ప్రముదితం సుప్రసన్నముఖాంబుజమ్
దృష్ట్వా స సహసోత్థాయ ననామ భువి దండవత్ !
వరం బ్రూహీతి నిర్దిష్ణో ప్రాహ గోవర్ధనో హరిమ్
పద్భ్యామాక్రమ్య మతస్థీ తిష్ట చేష వరో మమ ।
తచ్భుత్వా భక్తవశ్యో వై విచిన్య చ పునః పునః
తస్థా తత్సమాక్రమ్య తదా భూయో ద్విజో?బ్రవీత్ !
నాహం త్వాముత్స హే దేవ నిజపృష్ఠ జగత్పతే
అవతారయితుం తస్మా దేవమేవ స్థిరోభవ !
తతః ప్రభృతి విశ్వాత్మా త్యక్త్యా గోవర్ధనం ద్విజమ్
గిరిరూపధరం యాతి నిత్యం యోగివనం క్వచిత్ ।
కృష్ణావతారే భగవాన్ జ్ఞాత్వా గోవర్ధనం ద్విజమ్
సంప్రాప్తం నిజసారూప్యం నందాద్యైస్సమభోజయత్ ।
అన్న కూటేన దోహేన తర్పయిత్వా చలం
ద్విజమ్ తృటరీతం సమాజ్ఞాయ నవమేఘానపాయయత్ ।
మిత్రం స వాసుదేవస్య సంజాతం తేన కర్మణా
తం యో భక్త్యా నరో దేవి పూజయదుపచారకైః !
ప్రదక్షిణం పరిక్రామే న్నతస్యపునరుద్భవః గోవర్ధనో గిరి:
పుణ్యో జాతో హరినివాసతః !
తం దృష్ట్యా దర్శనేనాల మన్యపుణ్యాచలస్య చ
యమునం పులినం రమ్యం కృష్ణవిక్రీడనాంచితమ్ ।
త్వమేవ బ్రూహి సుభగే క్వాన్యత్ర జగతీతలే
తస్మాత్సర్వప్రయత్నేన త్యక్త్యావననదీగిరీన్ !
సుపుణ్యాన్పుణ్యదానూణాం సేవ్యం బృన్దావనం సదా
యమి పుణ్యా నదీ యత్ర పుణ్యో గోవర్ధనోగిరి: ।
తత్కింబృష్ణావత్పుణ్యం అరణ్యం భువి విద్యతే .
కలికల్మషభీతానాం విషయాసక్తచేతసామ్ ।
నాన్యం బృష్ణావనాత్సేవ్య మస్తి లోకేష్వపి త్రిషు
నారద పురాణమ్ యస్మిన్నిత్యం వి
చరతి హరిక్టోపగోగోపికాభిః !
బర్హాపీడే నటవరవపుః కర్ణికారావతం సీ
వంశీహూసీస్వనజితరవో వైజయన్త వృతాంగో !
వందస్యాంగార్హత మణిగణీ యశ్చ హంస్కో హమాఖ్య:
యస్య ధ్యానం న గజనియుతోహర్లెశం పై గిరీశో !
భక్తికైన్నో రహసి కురుతే హ్యర్థనారీశ్వరాఖ్య:
గాయత్రీం శ్రీం హృదయకుహరే పద్మయోనిర్విధత్తే ।
నేతైరిన్లోదశశతమితై ర్వీక్షతే వైశచీతామ్
అశ్రోత్రేశో రహసి వనితాం రక్షతి స్వాం రసజ్జా !
వంశీనాధశ్రవణజభియా కాన్య వార్తా జనానామ్ భేదం
శోషం తదను దహనం భేదనం ప్రాప్య యాసీత్ !
శ్రీ గోపీశాధరజనిసుధాం సాదరం శీలయత్తీ
యాభిరన్తావనమనుగతో నందసూనుఃక్షపాసు ।
రేమే చక్రాంశుకలితసముద్యోత భద్రేనికుంజే.
తాసాం దిష్టం కీమహమధునా, వర్ణ వల్లవీనాం ।
యాసాం సాక్షాచ్చరణజరజశ్రీశవిధ్యాద్యలభ్యమ్
యత్ర ప్రాప్తాతృణమృగఖగా యే కృమిప్రాణిబృన్దా !
బృన్దారణ్యే విధిహరరమాభ్యర్హణీయా భవస్తి
తత్సంప్రాప్యాద్వయపదరతో బ్రహ్మభూయం గతః కౌ !
ప్రేమస్నిగ్ధ విహరతి సుఖాంభోధి కల్లోలమగ్న:
యత్ర క్రూరా సహజమసుభద్ర్వాత జాతాం విసృజ్య !
వైరం స్వైరం సుహృదివ తత్సౌఖ్యమేవాశ్రయస్తే
తత్కింప్రాప్య ప్రభుమివ జనస్సంపరిత్యజ్య గచ్ఛన్ ।
క్వాప్యన్యత్రప్రభవతి సుఖీ కృష్ణ మాయాకరంసే
బృందారణ్యం తదఖిలధరాపుణ్యరూపం శ్రయన్మే ।
స్వాంతం ధ్వాన్తం జగదిదమధః కృత్య వర్వర్తి
శశ్వత్ గోపీనాధ: ప్రతిపదమపి ప్రేమసంక్లిన్నచేతా !
నీచం వొచ్చం న చ గణయతి ప్రోద్భరత్యేవ భక్తాన్
గోపాన్లోపీ: ఖగమృగనగాగోష్ఠ గోభూరజాంసి ।
స్మృత్వాదృష్ట్వా ప్రణమతి జనే ప్రేమరఙ్ఞానిబద్ధ:దాస్యం
భక్తీ కలయత్తరాం తత్కమన్యం వ్రజేశాత్ !
సేవ్యం దేవం గణయ విధిజేహంతు జానామి నైవ
ఏతత్సంక్షేపతః ప్రోక్తం బృన్దారణ్యసముద్భవమ్ ।
మాహాత్మ్యం విధిజే తుభ్యం వక్తవ్యం నావశేషితమ్
సంసారభృతైర్మనుజై తదేవ సదాన ఘః !
శ్రోతవ్యం కీర్తనీయం చ స్మర్తవ్యం ధ్యేయమేవ
చ బృందారణ్యస్య మాహాత్మ్యం యశృణోతి నరశ్శుచిః ।
కీర్తయేద్వాపి విధిజే స్కోపి విష్ణుర్నసంశయః
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే బృహదుపాఖ్యానే ఉత్తరభాగే వసుమోహినీసంవాదే శ్రీ బృన్దావనమాహాత్మ్యం నామ అశీతితమోధ్యాయః॥
పురాతన కల్పమున గోవర్ధనుడను ద్విజుడు సర్వసంసారమునుండి విరక్తుడై ఉత్తమ తపమునాచరించెను. అవ్యయుడగు శ్రీహరీ భగవానుడు తన క్రీడాస్థానమగు భూమండలమునకు వచ్చి బ్రాహ్మణునకు వరమునీయ సంకల్పించెను. దేవదేవేశుడు, శంఖచక్రగదాధరుడు, విలసత్కాస్తుభోరస్కుడు, మకరకుండలధారి, సుకిరీటుడు, సుకటకుడు, కలనూపుర భూషితుడు, వనమాలానిరీతాంగుడు, శ్రీవత్సాంకితవక్షసుడు, పీతకేశేయవస్రుడు, న వాంబుద సమప్రభుడు, సునాభి, సుందరగ్రీవుడు, సుక పోలుడు, సు నానీ కుడు, సుదంతుడు, సుస్మితుడు, సుజానువక్షస్మలుడు, కృపాసాగరుడు, పృషుడు, సుప్రసన్నముఖాంబుజుడు, అగు శ్రీహరిని చూచి సంభ్రమముతో లేచి భూమి పై దండవత్రణామములాచరించెను. వరమును కోరుమని స్వామి యడుగగా గోవర్ధనుడిట్లు పలికెను. పాదములనుండి నామూపుననుండుము. ఇదియే నాకు వరము. ఆ మాటలను విని గోవిన్దుడు మాటిమాటికాలోచించి గోవర్ధనుని పృష్టము నాక్రమించి నిలిచెను. అపుడు మరల గోవర్ధనుడిట్లు పలికెను. ఓ దేవా! నేను నిన్ను నాపృష్ఠమునుండి దించుటకు ఉత్సహించను. కావున ఇచట ఇట్లే స్థిరముగా నుండుము. అప్పటినుండి శ్రీహరి గోవర్ధన ద్విజుని విడిచి గిరిరూపధరుడగు గోవర్ధనమునకు వెళ్ళి నిలిచెను. శ్రీకృష్ణావతారమున శ్రీహరి గోవర్ధన పర్వతమును ద్విజునిగా తన సారూప్యమును పొందినవానిగా తెలిసి నందాదులచే భజింపచేసెను. ఇట్లు అన్నకూటముచే క్షీరానిదోహనముచే పర్వతరూపుడగు ద్విజునకు తృప్తి కలిగించి దాహము గొనినాడని తెలిసి నవమేఘములచే వర్షింప చేసి నీరుత్రాగించెను. అప్పటినుండి గోవర్ధనుడు వాసుదేవునకు మిత్రుడాయెను. గోవర్ధన పర్వతమును భక్తి కలిగి ఉపచారములచే పూజించిన వారు, ప్రదక్షిణముల నాచరించిన వారు మరల పుట్టరు. గోవర్ధన పర్వతము శ్రీహరినివాసము వలన పుణ్యప్రదమాయెను. గోవర్ధనపర్వతమును దర్శించిన, ఇతర పుణ్యపర్వతములను దర్శించ పనిలేదు. యమునాతీరము సుందరము కృష్ణక్రీడావిభూషితము. భూమండలమున ఇంత పవిత్రమైనది ఎచట కలదో నీవే చెప్పుము. కావున ఇతర వననదీపర్వతములను విడిచి సర్వ ప్రయత్నముతో బృన్దావనమును సేవించవలయును. ఇచట పవిత్రమగు యమునానది, పావనమగు గోవర్ధన పర్వతము కలదు. కావున బృన్గావకముకంటే పవిత్రమగు నది ఈ భూ మండలమున ఏది కలదు? కలికల్మషభీతులకు విషయాసక్తచిత్తులకు బృందావనముకంటే సేవించదగినది ఈ మూడు లోకములలో మరియొకటి లేదు. ఈ బృన్దావనమున నన్దగోపుత్రుడు, నెమలిపింఛమును ధరించినవాడు, నటవరవేషధారి, కర్ణికారభూషణుడు, వేణు నాదముతో హంసీరవమును గెలిచినవాడు, వైజయన్త మాలావృతాంగుడు అహంపదార్థభూతుడు హంసస్వరూపుడగు శ్రీ కృష్ణభగవానుడు గోపాలులతో గోపికలతో ప్రతినిత్యము విహరించుచుండును. పార్వతీ సహితుడగు పరమేశ్వరుడు అర్ధనారీస్వరూపుడు భక్తి పరవశుడై రహస్యముగా శ్రీకృష్ణ భగవానుని ధ్యానించు చుండును. బ్రహ్మ గాయత్రీ స్వరూపముతో నున్న స్త్రీ మూర్తిని హృదయ కుహరమున నిలుపుకొనును. ఇంద్రుడు వేయి కనులతో నిత్యము శశీ రూపమున దర్శించుచుండును. ఆదిశేషుడు రసజ్ఞుడు. కావున తన ప్రియురాలిని వేణు నాదశ్రవణము నుండి రహస్యముగా కాపాడుచుండును. అనగా ఇతరుల విషయమేమి చెప్పవలయును? భేదమును, శోషణమును, తాపమును, భేదమును పొంది గోపిక శ్రీ గోపీనాధాధరసుధను సాదరముగా పానము చేయుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు బృన్దావనమును చేరి రాత్రులందు చంద్రుని వెన్నెలలచే కాంతివంతమగు పొదలలో గోపికలతో క్రీడించేను. ఆ గోపికల అదృష్టమును ఏమని చెప్పవలయును. వీరి చరణ పరాగము బ్రహ్మాదులకు కూడా దుర్లభమే. బృందావనమున గల తృణమృగఖగకృమిప్రాణి బృందములు బ్రహ్మ రుద్రేందాదులచే పూజింపదగినవగును. అట్టి బృందావనమును చేరి బ్రహ్మభూతుడగు శ్రీహరి సుఖాంభోధికల్లోలమగ్నుడై ప్రేమస్నిగ్ధుడై విహరించుచుండును. ఈ బృన్దావనమున క్రూరప్రాణులు సైతము సహజముగు క్రౌర్యమును వైరమును విడిచి యధేచ్చముగా మైత్రితో సుఖముగా నుందురు. కావున మానవులు శ్రీకృష్ణుని కంటే ఇతరుల నాశ్రయించి ఎక్కడ ఆనందించగలరు? ఇట్లు సకల భూమండల పుణ్యరూపముగా నున్న బృన్దా వనమును చేరినా మనస్సు అంధకారమును, ఈ జగత్తును తృణీకరించి ఎప్పుడూ ఆనందించుచున్నది. ఇచట గోపీనాథుడు ప్రతి పదమున (పేమార్ధహృదయుడై ఎక్కువ తక్కువలను లెక్కించక భక్తులనుద్దరించుచుండును. గోపాలకులను, గోపికలను, ఇచటి ఖగమృగ నగములను, గోపగోభూరజమును తలచి దర్శించి ప్రేమపాశబద్ధుడై నమస్కరించుచుందురు. భక్తియందు మనస్సులగ్నమగును. కావున గోపికాపతికంటె సేవించదగిన వారెవరో నాకు మాత్రము తెలియదు. ఇట్లు బృందావనమాహాత్మ్యమును సంక్షేపముగా చెప్పితిని. ఇక చెప్పవలసిన దేమియూ లేదు. సంసారభూతులకు మనుజులు ఈ బృందావనమాహాత్మ్యమునే వినవలయును. అనవలయును. స్మరించవలయును, ధ్యానించవలయును. ఈ బృందావనమాహాత్మ్యమును శుచియై వినిననూ చదివిననూ వారు విష్ణుతుల్యులగుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తరభాగమున వసుమోహినీసంవాదమున శ్రీ బృన్దావనమాహాత్మ్యమను ఎను బదియవ అధ్యాయము.
Summary of chapter 207 of the Nārada Mahā Purana is as follows:
శ్రీ నారద మహాపురాణ ముగింపు అధ్యాయంలో ఈ దివ్య మహాపురాణ సమగ్ర పారాయణ, శ్రవణ, మనన మరియు ప్రతిలేఖన ఫలశ్రుతి అత్యంత భక్తిరసభరితంగా గానము చేయబడినది. పవిత్రమైన ఈ శ్రీ నారద మహాపురాణమును భక్తితో పఠించే వారికి, వినే వారికి శ్రీలక్ష్మీ సమేత నారాయణ ప్రభువు సమస్త అభీష్టములను సిద్ధింపజేసి ఆత్యంతిక మోక్షమును అనుగ్రహించునని ప్రబోధించుటతో శ్రీ నారద మహాపురాణము మంగళకరంగా సంపూర్ణమైనది.