52 - అధ్యాయము

సనందన ఉవాచ :-

అథ వ్యాకరణం వక్ష్యే సంక్షేపాత్తవ నారత !

సిద్ధరూపప్రబంధేన ముఖం వేదస్య సాంప్రతమ్

సుప్తిజన్తం పదం విప్ర సుపాం సప్త విభక్తయః

స్వౌజసః ప్రథమాః ప్రోక్తా సా ప్రాతిపదికాత్మితా

సంబోధనే చ లింగాదావుక్తే కర్మణి కర్తరి

అర్థవత్ప్రాతిపదికం ధాతుప్రత్యయవర్జితమ్

అమౌశసౌ ద్వితీయా స్యాత్తత్కర్మ క్రియతే చ యత్

ద్వితీయా కర్మణి ప్రోక్తాంతరాంతరేణ స యుతే

టా భ్యాం భిస్ తృతీయా స్యాత్కరణే కర్తరీరితా

యేన క్రియతే తత్కరణం సః కర్తా స్యాత్కరోతి యః

జే భ్యాం భ్యపశ్చతుర్ధి స్యాత్సంప్రదానే చ కార కే

య స్మై దిత్సా ధారయేద్వై రోచతే సంప్రదానకమ్

పంచమీ స్యాజ్ఞసి భ్యాం భ్యో హ్యపాదానే చ కారకే

యతోఽపైతి సమాదత్తే ఆపదతే చ యం యతః

జ సోనామశ్చ షష్ఠి స్యాత్స్వామిసంబంధముఖ్య కే

జ్యోస్సుపం సప్తమీ తు స్యాత్సాచాధికరణే భవేత్

ఆధారే చాపి విప్రేన్ద్ర రక్షార్ధానాం ప్రయోగతః

ఈప్సితం చానీప్సితం యత్తదపాదానకం స్మృతమ్

పంచమీ పర్యపాజ్యోగే ఇతరర్తేఽన్యదిజ్ముఖే

ఏతైర్యోగే ద్వితీయా స్యాత్కర్మప్రవచనీయకే

లక్షణేష్ఠంభూతోఽభీరభాగే చానుపరిప్రతి

అంతరేషు సహార్దే చ హీనే హ్యుపశ్చ కథ్యతే

ద్వితీయా చ చతుర్థి స్యాచ్చేష్టాయాం గతికర్మణి

అప్రాణిషు విభక్తీ ద్వే మన్యకర్మణ్యనాదరే

నమస్స్వస్తి స్వధా స్వాహాలం వషడ్యోగ ఈరీతా

చతుర్థి చైవ తాదర్ధ్యే తుమర్ధాద్భావవాచినః

తృతీయా సహయో గే స్యాత్కుత్సితేంఽగే విశేషణే

కాలే భావే సప్తమీ స్యాదేతైర్యోగే చ షష్ఠ్యపి

స్వామిస్వరాధిపతిభిః సాభిదాయాదసూత కైః

నిర్ధారణే ద్వే విభక్తి షష్ఠి హేతుప్రయోగ కే

స్మృత్యర్ధకర్మణి తథా కరోతేః ప్రతియత్న కే

హింసార్ధానాం ప్రయోగే చ కృతి కర్మణి కర్తరి

న కర్తృకర్మణోష్షష్ఠి నిష్ఠాదిప్రతిపాదికా

ఏతా వై ద్వివిధా జ్ఞేయా సుబాదిషు విభక్తిషు

భూవాదిషు తిజన్తేషు లకారా దశ వై స్మృతాః

తిప్తసంతతి ప్రథమో మధ్యమస్సీష్దస్తోత్తమః

మిబ్వస్మసః పరస్మైతు పాదానాం చాత్మ నే పదమ్

త ఆతేంతే ప్రథమో మధ్య స్సే ఆదే ధ్వేథాధోత్తమః

ఏవం హే మహా ఆదేశా జ్ఞేయా హ్యన్యే లిఙాదిషు

నామ్ని ప్రయుజ్యమానే తు ప్రథమః పురుషో భవేత్

మధ్యమో యుష్మది ప్రోక్త ఉత్తమః పురుషోఽస్మది

భూవాద్యాధాతవః ప్రోక్తా సనాద్యన్తాస్తథా తతః

లడీరితో వర్తమానే భూతేఽనద్యతనే తథా

మాస్మయోగే చ లజ్ వాచ్యో లోడాశిషి చ ధాతుతః

విధ్యాదౌ స్యాదాశిషి చ లజితో ద్వివిధో మునే

లిడతీతే పరోక్షే స్యాత్ శ్వస్తనే లుడ్భవిష్యతి

స్యాదనద్యతనే లృట్చ భవిష్యతి తు ధాతుతః

భూతే లుక్ తిప్ స్యపౌ చ క్రియాయాం లృజ్ ప్రకీర్తితః

సిద్దోదాహరణం విద్ధ పరహితాదిపురస్సరమ్

దండాగ్రం చ దధీదం చ మధూదకం పిత్రర్షభః

హోతౄకారాస్తథా సేయం లాంగలీషా మనీషయా

గంగోదకం తవల్కార ఋణార్ణం చ మునీశ్వర

శీతోర్తాశ్చ మునిశ్రేష్ఠ సేన్ద్రస్సౌకార ఇత్య

వధ్యాసనం పిత్రర్దో నాయకో లవణస్తథా

త ఆద్యా విష్ణవే హ్యత్ర తస్మా ఆర్ఘో గురా అఘః

హరేఽవ విష్ణోఽవేత్యేషా దసో మా దప్యమా అఘాః

శారీ ఏతా విష్ణూ ఇమౌ దుర్గే ఆమూనో అర్జునః

ఆ ఏవం చ ప్రకృత్యైతే తిష్ఠంతి మునిసత్తమ

షడత్ర షణ్మాతరశ్చ వాక్చూరో వాగ్ధరిస్తథా

హరి శ్నేతే విభుశ్చిన్యస్త చ్ఛేషో యచ్ఛరస్తథా

ప్రశ్నస్త్వథ హరిప్షష్ఠః కృష్ణష్టికత ఇత్య పి

భవాన్ షష్ఠశ్చ షట్సన్త షట్తే తల్లేస ఏవ చ

చక్రిం చ్చిన్ది భవాఞ్చారిర్భవాన్ శారిరిత్యపి

సమ్యజ్ఙనన్తోంచ్చాయా కృష్ణం వన్దే మునీశ్వర

తేజాంసి మంప్యతే గంగా హరిశ్ఛేత్తానురశ్శివః

రామకన్యుః కృపపూజ్యో హరిః పూజ్యోఽర్చ ఏవ హి

రామో దృష్టోఽబలా అత్ర పుప్తా ఇష్టో ఇమా యతః

విష్ణుర్న మ్యే రవిరయం గీఫలం ప్రాతరచ్యుతః

భక్తైర్వంద్యోంఽతరాత్మా భో భో ఏష హరిస్తథో

ఏష శార్జీ సైష రామసంహితైవం ప్రకీర్తితా

రామేణాభిహితం కరోమి సతతం రామం భజే సాదరమ్

రామేణాపహృతం సమస్తదురితం రామాయ తుభ్యం నమః

రామాన్ముక్తిరభీప్సితా మమ పదా రామస్య దాసోఽస్మ్యహమ్

రామే రంజత మే మనస్సవిశదం హే రామ తుభ్యం నమః

పర్వ ఇత్యాదికా గోపా స్సఖా చైవ పతిర్హరిః

సుశ్రీర్భానుస్స్వయంభూశ్చ కర్తారౌ గౌస్తు నౌరితి

అనడ్వాన్ గోధుగ్లిట్చ ద్వే త్రయశ్చత్వార ఏవ చ

రాజా పంథాస్తథా దండీ బ్రహ్మహా పంచ చాష్ట చ

అష్టౌ అయం మునే సమ్రాట్ పవిభ్రద్విట్ వపుర్మనః

ప్రత్యజ్ పుమాన్ మహాన్ ధీమాన్విద్వాన్షట్ పీసఠీశ్చతః

ఉశనాసావిమే పుంపి స్యురక్తలవిరామః

రాధా సర్వాగతిర్గోపీ స్త్రీశ్రీర్దేనుర్వధూప్స్వసా

గౌర్నౌరుపానదూద్యౌర్గోః క్షుత్కమత్సంవిత్తు వా క్వచిత్

రుగ్విడుద్భాః స్త్రీయాఃస్తపః కులం సోనుపకుక్షి చ

గ్రామణ్యంబ ఖల ప్యేవం కర్తృచాతీరివా తను

స్వనడుచ్చ విమలద్యు వాశ్చత్వారీదమేవ చ

ఏతద్భ్రహ్మశ్చ దండీ అన్యత్ క్కించిత్త్యదాదిచ

ఏతద్వే చిద్గవాక్ గవాజ్ గోఅక్ రోజ్ గోక్ గోజ్

తిర్యగ్య కృచ్చకుచ్చ్రైవ దదద్భవత్పచత్తుదత్

దీవ్యద్ధనుశ్చపి సతీః పయోదప్స పుమాపి చ

గుణద్రవ్య క్రియా యోగాం స్త్రీలింగాశ్చ కతి బ్రువే

శుక్తః కీలాలపశ్చైవ శుచిశ్చ గ్రానుణీస్సుధీః

పటుస్స్వయంభూః కర్తా చ మాతా చైవ పితాచనా

పత్యాసాగ్యుస్తథా పుంసో మతభ్రమరదీర్ఘపాత్

ధనాకృసోమౌ చాగర్హాస్తావిర్గృధాస్వర్ణన్బహూ

రిమపవ్విషాద్వందశాతానాహో తథాక్రమాత్

సర్వవిశ్వోభయే చోభౌ అన్యాంతరేతరాణి చ

ఉత్తరశ్చోత్తమో నేమస్వసమోఽథ పమా ఇషః

పూర్వోత్తరోత్తరా శ్చైవ దక్షిణశ్చోత్తరాధరౌ

అపరశ్చతురోఽప్యేతత్ యావత్తత్కిమసౌ ద్వయమ్

యుష్మదస్మచ్చ ప్రథమచరమోల్పస్తథార్ధకః

నోరః కతిపయే ద్వే చ త్రయో శుద్ధాదయస్తథా

స్వే కాబువిరోధపరివిపర్యయశ్చావ్యయా స్తథా

సనందన మహర్షి పలికెను :- ఓ నారదా ! ఇపుడు నీకు సంక్షేపముగా వ్యాకరణమును చెప్పెదను. ఈ వ్యాకరణము సిద్దరూపప్రబంధముగా వేదమునకు ముఖముగా నిర్ణయించబడినది. సుబన్తము తొజనము పదమనబడును. సుపులలో ఏడు విభక్తులున్నవి. సు, ఔ, జస్ అనునవి ప్రథమావిభక్తి ప్రత్యయములు. ఈ ప్రత్యయములకు ముందున్న ప్రకృతి ప్రాతిపదికమనబడును, ఎదుటివారిని ఉద్దేశించి మాట్లాడదలచినపుడు చేయు సంబోధనలో, స్త్రీ పుం నపుంసక లింగములలో కర్మ కర్త చెప్పబడినపుడు ధాతువు ప్రత్యయము కాక అర్ధవంతమగు శబ్దస్వరూపము ప్రాతిపదికమనబడును. అమ్, ఔట్, శస్ అనునవి ద్వితీయావిభక్తి ప్రత్యయములు. చేయబడుదానిని కర్మయందురు. కర్మ విషయమున ద్వితీయావిభక్తిని చెప్పుకొనవలయును. అంతరా, అంత రేణ అను శబ్దములు ప్రక్కనున్నపుడు కూడా ద్వితీయా విభక్తిని చెప్పుకొనవలయును. టా, భ్యాం, భిస్ అనునవి తృతీయా విభక్తి ప్రత్యయములు. కరణార్థమున కర్తర్ధమున తృతీయా విభక్తిని చెప్పుకొనవలయును. దేనిచే చేయబడునో అది కరణమనబడును. చేయునది కర్తయగును. జే, భ్యాం, భ్యస్ అనునవి చతుర్థి విభక్తి ప్రత్యయములు. సంప్రదొనకొరకమున చతుర్థి విభక్తిని చెప్పుకొనవలయును. ఎవరి విషయమున దొనము చేయవలయునను కోరిన కలుగునో వాడు, ఎవరి విషయమున, లేదో ఏ వస్తువు విషయమున రుచియుండునో వాడు అది సంప్రదానమనబడును. జసి, భ్యాం, భ్యస్ అనునవి పంచమీ విభక్తి ప్రత్యయములు. అపొదొన కొరక వివక్షలో పంచమీ విభక్తిని చేప్పుకొనవలయును. దేనినుండి విడివడునో, దేని నుండి స్వీకరించునో, దేని నుండి తొలగిపోవునో అది అపొగొనమనబడును. జస్, ఓస్, ఆమ్ అనునవి షష్ఠీ విభక్తి ప్రత్యయములు.” స్వస్వామి భావసంబంధమున షషీ విభక్తిని చెప్పుకొనవలయును. జీ, ఓస్, సుప్ అనునవి సప్తమీ విభక్తి ప్రత్యయములు. అధికరణ కారకమున సప్తమీ విభక్తిని చేప్పుకొనవలయును. ఆధారమును అధికరణమందురు. రక్షార్ధ ప్రయోగములలో ఈప్పితమున, అనీప్సితమున (ఇష్టాఇష్టములలో) నుండు దానిని కూడా అదానమందురు. పరి, అప, ఆజ్ అను ఉపసర్గలతో సంబంధమున్నపుడు పంచమీ విభక్తి వచ్చును. ఇతర బుత, అన్య, దిబ్ముఖ శబ్దములతో కర్మ ప్రవచనీయకములచే యోగమున్నపుడు ద్వితీయా విభక్తి వచ్చును. లక్షణ ఇత్తంభూతార్ధములలో అభి అను ఉపసర్గను చెప్పవలయును. విభాగము లేనపుడు అను, పరి, ప్రతి ఆను నుపసర్గలను చెప్పవలయును. అంతరార్థమున, సహార్థమున, హీనార్థమున ఉప అను ఉపసర్దను చెప్పవలయును. చేష్టార్లములో గతి కర్మలో ద్వితీయా చతుర్థి విభక్తులను చెప్పవలయును. ప్రాణి భిన్న వాచకములలో రెండు విభక్తులుండును. మన్యధాతువునకు కర్మ విషయమున, అనాదరార్థమున కూడా ఈ రెండు విభక్తులను చెప్పవలయును. నమః, స్వస్తి, స్వాహా, స్వధా, అలం, వషట్ అను పదములతో సంబంధమున్నపుడు తాదర్యమున, భావవాచకమగు తుమున్నద్ధమున కూడా చతుర్థివిభక్తిని ప్రయోగించవలయును. సహ అను పదముతో యోగమున్నపుడు కుత్సితాంగ విశేషణమున తృతీయా విభక్తిని ప్రయోగించవలయును. కొలార్గమున భావార్థమున, సప్తమీ విభక్తిని ప్రయోగించవలయును. కాల భావవాచకములతో సంబంధమున్నపుడు షషీ . విభక్తిని కూడా ప్రయోగించవచ్చును. స్వామి, ఈశ్వర, అధిపతి, సాక్షి దాయాద సూతక శబ్దార్థముల విషయమున, శబ్దముల విషయమున నిర్ధారణార్ధమున సప్తమీ షషీ విభక్తులను ప్రయోగించవచ్చును. హేతు శబ్దవిషయమున షష్ఠీ విభక్తిని ప్రయోగించవలయును. స్మృత్యర్ధ కర్మలో, కరోతి ధాతువునకు యత్నార్థమును చెప్పునపుడు, హింసార్ధక శబ్దములను ప్రయోగించినపుడు, కృతి కర్మలో, కృతికర్తలో పైన చెప్పిన రెండు విభక్తులను ప్రయోగించవలయును. నిషాదులను తెలియచేయు షష్ఠీ విభక్తి కర్తృకర్మల విషయమున ప్రయోగించరాదు. ఇట్లు సుబా విభక్తులలో ఇవి రెండు విధములుగా నుండును. భూ, వా మొదలగు తిజస్తములందు పది లకారములుండును. తిప్, తస్, అంత అనునవి ప్రధమ పురుష ప్రత్యయములు. సిప్, థస్, థ అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు. మిప్, వస్, మస్ అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ తొమ్మిది ప్రత్యయములు పర స్మెపదమున చెప్పబడినవి. ఇక ఆత్మనే పదమున త, ఆతే, అంతే అనునవి ప్రధమ పురుష ప్రత్యయములు. సే, ఆధే, ధ్వే అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు. ఏ, వ , మ హే అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ పద్దెనిమిది లకారములకు ఆదేశములుగా వచ్చును. నామవాచక శబ్దమును ప్రయోగించునపుడు ప్రధమ పురుషను చెప్పవలయును. యుష్మ చ్చబ్ద ప్రయోగసమయమున మధ్యమ పురుషను, అస్మ చబ్దప్రయోగమున ఉత్తమ పురుషను చెప్పవలయును. భూ, వా మొదలు వాటిని ధాతువులందురు. తరువాత సనాది ప్రత్యయాంతములుండును. వర్తమాన కాలమున -లట్ అను లకారమును చెప్పవలయును.

అనద్యతన భూతకాలమున, మా, స్మ అనువాటితో యోగమున్నపుడు ధాతువునకంటే పరముగా లబ్ లకారమును చెప్పవలయును. ఆశీర్వాదార్దములో ధాతువున కం టే పరముగా లోట్ లకారమును చెప్పుకొనవలయును. విధ్యాద్యర్థములలో ఆశీర్వాదార్థములో లిజ్ లకారముండును. అనధ్యతన భూతమున పరోక్షార్ధమున లిట్ లకారమును చెప్పుకొనవలయును. అద్యతన భవిష్యత్కాలమున లుట్ లకారముండును. అనధ్యతన భవిష్యత్కాలమున బ్ళట్ లకారముండును. భూతకాలమున లుజ్లకారముండును. క్రియార్థమున లజ్లకారముండును. అన్నిసంధులు వచ్చి పరిపూర్ణ రూపము ఏర్పడిన దానిని సిద్ధోదాహరణముగా తెలియుము. దండాగ్రం, దధీదం, మధూదకం, హోతృకారః అనునవి సవర్ణదీర్ఘసంధికి సిద్దోదాహరణములు. పిత్రర్షభః, సేయం, గంగోదకం, తవల్కారః అనునవి గుణసంధికి ఉదాహరణములు. ఇట్లే ఆయా సంధులేర్పడిన సిద్దోదాహరణములను కొన్నింటిని చూ పెదను. “ఋణార్ణం, గీతార్తః, సేన్దః, సౌకార, వధ్వాసనం, పిత్రర్థః, నాయకః, లవణం,” త ఆద్యా, విష్ణవే, తస్మా అర్ఘ, గురా అఘః, హరేఽవ, విష్ణోఽవ, శారీ ఏతో,విష్ణు ఇమౌ, దుర్గే ఆమూ నో అర్జునః, అను నొలుగు రూపములు ఆ ఏవం అనునది కూడా ఏ సందీగాక ప్రకృతి భావముతో నుండునని తెలియవు. షడత్ర, షణ్మాతగః, నొక్ఛూర, నాగదీః, హరి శ్శేతే, విభుశ్చిన్త్యః, తచ్ఛేషః, యచ్ఛరః, ప్రశ్నకి, హరిప్షష్ఠః, కృష్ణ షీకతే, భవాన్ షష్ణకి, షట్సన్తః, షట్ తే, తల్లేపః చక్రింశిని, భకోణ్చారీకి, భవాన్ శౌరిః, సమ్యక్ జనక్తః, అంగచ్చాయా, కృష్ణం వన్డే, తేజాంపి, మంస్యతే, హరి శ్ఛే, అమర శ్శివః రామ కామ్యః, కృష్ణ పూజ్యః, హరిః పూజ్యః, రామో దృష్టః, అబలా అత్ర, పుప్తా ఇష్టా, విష్ణురమ్యః, రవిరయం, గీగఫలం, ప్రాతరచ్యుతః, భక్తోర్వంద్యః వంద్యోంఽతరాత్మా, భో భో ఏషః, ఏష హరిః, ఏష శార్టీ, సైష ధామః, ఈ రూపములందున్న సంధులను “సం హితాయందురు. ఇపుడు విభక్తి ప్రయోగములకు ఉదాహరణములను చూపుచున్నారు. రామేణాభిహితం కరోమి (తృతీయా) రామం భజే (ద్వితీయా) రామేణా పప్పతం (తృతీయా, సంహిత) రామాయ తుభ్యం నమః (చతుర్ద) రామే రంజతే (సప్తమీ) రామాన్ముక్తిః (పంచమీ) కొమస్య దాసోఽస్మి (షష్ఠీ విభక్తి) హేరాను (సంబోధన) ఇక ఇపుడు సంధిలేని కేవల శబ్దవులను కొన్నింటిని చెప్పుచున్నొను. సర్వాది శబ్దములు, గోషా, సఖో, పతీ, హరి, సుశ్రా, భాను, స్వయంభూః, క, . గౌ, అనడ్వాన్, గోధుక్, లిట్, ద్వే, త్రయః, చత్వారః, రోజా, పంథాః, దండీ, బ్రహ్మ హా, పంచ, అష్ట, అష్టా, అయం, సమ్రాట్, చిభృత్ , ద్వీటా, వపుః, మనః, ప్రత్యజ్, ఫుమాన్, మహాన్, ధీనన్, విద్వాన్, షట్, పిపరీ, దోః, ఉశనా, అసౌ ఈ శబ్దములు పుంలింగములో ఉండును. రాధా, సర్వా, గతిః, గోసీ, స్త్రీ, శ్రీః, ధేనుకి, వధూళి, స్వసా, గౌ, నౌ, ఉపొనత్, ద్యౌః, గో, కుత్, కకుత్, సంవీత్, రుక్, విట్, భాః అనునవి లింగ శబ్దములు తపః, కులం, సోమపం, అక్షి, గ్రామణీ, ఖలపు, కర్త, తను, సనడుత్, విమలం, ద్యు, హౌః, చత్వారి, ఇదం, ఏతత్ , బ్రహ్మ , దండి, అన్యత్, కించిత్ , త్యదోది శబ్దములు ఏతత్, ద్వే, చిత్, గవాక్, గవాజ్, గోఅక్, గోజ్, గోక్, తిర్యక్, యకృత్, శక్సల్, దదత్, భవత్, పచల్, తుదత్, దీవ్యత్, ధనుః అనునవి నపుంసకలింగరూపములు. పిపరీః పయోదః అనునవి పుంలింగములో కూడా ఉండును. గుణద్రవ్య క్రియా యోగముచే శబ్దములు మూడులింగములలో నుండునని కొందరందురు. శుక్ల డీలాలప, శుచి, గ్రామణీ, సుధీ, పటు, స్వయం భూ, కర్తా, మాతా, పితా, నొ, సత్య ఈ శబ్దములు పుంలింగమున నుండును. మత, భ్రమర, దీర్ఘపాత్, ఘన, సోమ, గర్ణ, అని, గ్రంధ, స్వర్ణ, బహు, శబ్దములు రెండు లింగములలో నుండును. సర్వ, విశ్వ, ఉభయ, ఉభ, అన్య, అంతర, ఇతర, ఉత్తర, ఉత్తమ, నేమ, సర్వార్ధకమ సమ శబ్దము, ఇష, పూర్వ, ఉత్తర, దక్షిణ, ఉత్తర, అధర, అపర, చతుర, ఏతత్, యావత్, తత్, కిం, అసౌ, ద్వి, యుష్మత్, అస్మత్, ప్రథమ, చరమ, అల్ప, నోర, కతిపయ, ద్వి, త్రి, శుద్ధాది శబ్దములు, మూడు లింగములలో నుండును. స్వ, ఇక, ఆభు, గోధ, పరి, విపర్యయ శబ్దములు అవ్యయములు.

తద్ధితాశ్చాప్యపత్యార్ధే సౌండవాశ్శ్తైధరస్తథా

గార్గ్యో నాడాయసాత్రేయా గాంగేయః పైతృష్వషస్రీయః

దేవతార్దే చేదమర్దే హ్యేంద్రం బ్రాహ్మో హవిర్భలీ

క్రియాయుజోః కర్మ కర్త్రోః ధౌరేయ కౌంకుమం తథా

భవాద్యద్యర్దే తు కానీనః క్షత్త్రియో వైదికస్వకః

స్వార్దే చౌరస్తు తుల్యార్దే చంద్రవన్ముఖమీక్షతే

బ్రాహ్మణత్వం బ్రాహ్మణతా భావే బ్రాహ్మణ్యమేవ చ

గోమాన్దనీ చ ధనవాన్ అస్త్యర్ధే ప్రమితౌ కియాన్

జాతార్దే తుందిలశ్శధాలురౌన్నత్యే తు దంతురః

ప్రగ్వీ తపస్వీ మేధావీ మాయావ్యప్త్యర్ద ఏవ చ

వాచాలశ్చైవ వాచొటో బహుకుత్సితభాషిణి

ఈషదపరిసమాప్తే కల్పబ్దేశీయ ఏవ చ

కవికల్పః కవిదేశ్యః ప్రకారవచనే తథా

పటుజాతీయః కుత్సాయాం వైద్యపాశః ప్రశంసనే

వైద్యరూపో భూతపూర్వే మతో దృష్టచరో మునే

ప్రాచుర్యాదీష్వన్నమయో మృణ్మయస్త్రీమయస్తథా

జాతార్ధే లజ్జితోఽత్యర్దే శ్రేయాన్శ్రేష్టశ్చ నారద

కృష్ణతరశ్శుక్లసమ కిమ ఆఖ్యానతోఽవ్యయాన్

కతరాం చైవాతితరాల అభిహ్యుచ్చైస్తరామపి

పరిమాణే జానుదఘ్నం జానుద్వయసమిత్యపి

జానుమాత్రం చ నిర్ధారే బహూనాం చ ద్వయోః క్రమాత్

కతమః కతరస్సంఖ్యే య విశేషావధారణే

ద్వితీయశ్చ తృతీయశ్చ చతుర్థః షష్ఠపంచమౌ

ఏకాదశః కతిపయః కధః కతి నారద!

వింశశ్చ వింశతీతనుః తథా శతతమాదయః

ద్వేధా ద్వైధ ద్విధా సంఖ్యా ప్రకారేఽథ మునీశ్వర!

క్రియావృత్తా పంచకృత్వో ద్విస్త్రిర్బహుశ ఇత్యపి

ద్వితయం త్రితయం చాపి సంఖ్యాయాం హి ద్వయం త్రయమ్

కుటీరశ్చ శమీరశ్చ శుండారోఽల్పార్ధకే మతః

స్త్రైణః పౌంస్నస్తుండిభశ్చ వృందారకకృషీవలౌ

మలినో వికటో గోమీ భౌరికీవిధముత్కటమ్

అవటీటోఽవనాడే నిబడం చేక్షుశాఖినమ్

నిబిరీ సమేషు కరీ విత్తో విద్యాచ్చణస్తథా

విద్యాచంచుర్బహుతిధం పర్వతశ్శృంగిణస్తథా

స్వామీ విషమరూప్యం చోపత్యకాధిత్యకా తథా

చిల్లిశ్చ చిపీటం చిక్వం వాతూలః కుశపస్తథా

వల్లశ్చ హి మేలుశ్చ కహోడశ్చోపడస్తతః

ఊర్ణాయుశ్చ మరూత శ్చైకాకీ చర్మణ్వతీ తథా

జ్యోత్స్నా తమిస్రా ష్ఠీవశ్చ కక్షివద్యర్మణ్వతీ

ఆపందీవచ్చ చక్రీవత్తూష్ణికాం జల్పతక్యపి

కంభశ్చ కంయుః కంబశ్చ కేతిః కంతుః శంవస్తథా

శంతశ్శంతి శంయశతౌ శంయోహ్వంయుశ్చ శంభువత్

భవతి బభూవ భవితా భవిష్యతి భవత్వభవద్భవేచ్చాపి

భూయాదభూదభవిష్యల్లాదివేతాని రూపాణి

అత్తి జఘసొత్తాత్స్యత్యత్త్వదదద్యాద్ద్విరఘపదాత్స్యత్

జహోతి జుహావ జుహవాంచకార హోతా హోష్యతి జుహోతు

అజుహోజ్జుహుయాద్దూయాదహౌషీదహోష్యద్దీవ్యతి

దిదేవ దేవితా దేవిష్యతి చ ఆదీవ్యద్దీవ్యాద్వే

అదేవీదదేవీష్యత్సునోతి పుషావ సోతా సోష్యతి వై

మునోత్వసునోత్సునుయాత్సూయాదాసావీదసోష్యత్తుదతి చ

తుతోద తోత్తా తోత్స్యతి తుదత్వతుదత్తు దేత్తుద్యార్థి

అతౌత్సీదతోత్స్యదితి చ రుణద్ధి రురోధ రోద్ధా రోత్స్యతి వై

రుణద్ధు అరుణద్రుధ్యాదిత్సీదరోత్స్యచ్చ

తనోతి తతాన తనితా తనిష్యతి తనోత్వతనోత్తనుయాద్ధి

అతనొచ్చాతానీదతనిష్యత్క్రీణాతి చిక్రాయ క్రేతా క్రేష్యతి క్రీణాత్వితి చ

అక్రీణాత్క్రీణీయాత్క్రీయాదక్రైషీదకేష్యచ్చోరయతి చోరయామాస చోరయితా చోరయిష్యతి చోరయతు

అచోరయచ్చోరయేచ్చోర్యాదచూచురదరిష్యదిత్యేవం దశ వై గణాః

ప్రయోజకే భావయతి సనీచ్ఛాయాం బుభూషతి

క్రియాసమభిహారే తు పండితో భోభూయతే మునే

తథా యఙ్లుకి బోభవీతి చ పఠ్యతే

పత్రీయతీత్యాత్మనీచ్చాయాం తథాచారేఽపి నారద

అనుదాత్తఞితో ధాతోః క్రియావినిమయే తథా

నివిశాదేస్తథా విప్ర విజానీహ్యాత్మనే పదమ్

పరస్మై పదమాఖ్యాతం శేషాత్కర్తరి శాబ్దికై:

ఞిత్స్వరితేశశ్చ ఉభే యక్చ స్యాద్భావకర్మణోః

సౌకర్యాతిశయం చైవ యదా ద్యోతయితుం మునే

వివక్ష్యతే న వ్యాపారో లక్ష్యే కరుస్తథా పరే

లభంతే కర్తృతాo పశ్య పచ్యతే హ్యోదనప్స్వయమ్

సాధు వాపిశ్ఛి నత్త్యేవం స్థాలీ పచతి వై మునే

ధాతోస్సకర్మ కాద్భావే కర్మణ్యపీ లప్రత్యయాః

తస్మై వా కర్మ కాద్వీప భావే కర్తరి కీర్తితః

ఫలవ్యాపారయోగేకనిష్ఠతాయామకర్మకః

ధాతుస్తయోర్ధార్మిభేదే సకర్మక ఉదాహృతః

గౌణే కర్మణి ద్రుహ్యాదేః ప్రధానే నీహృకృష్యహామ్

బుద్ధిభక్షార్ధయోశ్శబ్దకర్మ కాణాం నిజేచ్ఛయా

ప్రయోజ్యకర్మణ్యన్యేషాం ణ్యంతానాం లాదయో మతాః

ఫలవ్యాపారయోర్దాతురాశ్రయే తు తిఙస్స్మృతాః

ఫలే ప్రధానం వ్యాపారస్త్రీజర్ధస్తు విశేషణమ్

ఏధితవ్యమేధనీయమితి కృత్యే నిదర్శనమ్

భావే కర్మణీ కృత్యాః స్యుః కృతః కర్తరి కీర్తితాః

కర్తా కారక ఇత్యాద్యా భూతే భూతాదికీర్తితమ్

గమ్యాది గమ్యే నిర్దిష్టే శేషమద్యతనే మతమ్

అధిస్త్రీత్యవయీభావే యథాశక్తి చ కీర్తితమ్

రామాశ్రితస్తత్పురు షే ధాన్యార్దో యూపదారు చ

వ్యాఘ్రభీ రాజపురుషోఽక్షశౌండో ద్విగురుచ్యతే

పంచగవం దశగ్రామీ త్రిఫలీతి తు రూఢతః

నీలోత్పలం మహాషష్ఠి తుల్యార్దే కర్మధారయః

అబ్రాహ్మణో నఞి ప్రోక్తః కుంభకారాదికః కృతా

అన్యార్దే తు బహువ్రీహౌ గ్రానుః ప్రాపోదకో ద్విజ

పంచగూ రూపవద్భార్యో మధ్యాహ్నసపుతాదికః

సముచ్చయే గురుం చేశం భజస్యానాచయే త్వట

భిక్షామానయ గాం చాపి వాక్యమేవానయోర్భవేత్

ఇతరేతరయోగే తు రామకృష్ణౌ సమాహృతౌ

రామకృష్ణం ద్విజ ద్వే ద్వే బ్రహ్మచేకముపాస్యతే

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే వ్యాకరణనిరూపణం నామ ద్వీపంచాశత్తమోఽధ్యాయః

అపత్యార్థమున తద్దితప్రత్యయములు అణాదులొచ్చినపుడు, పాండవాః, శ్రీధరః గార్గ్యః, నాడాయనః, ఆత్రేయః, గాంగేయః, పైతృష్వసీయః, అనురూపములు ఏర్పడును. దేవత అను నర్థమున, ఇదమను అర్ధమున ఐన్స్టం (హవిః) బ్రాహ్మం (హవిః) అను రూపము లేర్పడును. కర్మ కర్తలకు క్రియా యోగార్ధమున ధౌరేయః, కౌంకుమం అనురూపములేర్పడును. ‘భవ’(పుట్టుట) మొదలగు అర్ధములలో కానీనః (కన్యకు పుట్టినవాడు) కత్తియః, వైదికః స్వకః అనురూపములు ఏర్పడును. స్వార్థమున చౌరః అని, తుల్యార్థమున చంద్రవత్ ముఖమ్ అనీ రూపమేర్పడును. భావార్థమున బ్రాహ్మణత్వం, బ్రాహ్మణతా, బ్రాహ్మణ్యం అను రూపము లేర్పడును. అస్తి అను నర్థమున గోమాన్ ధనీ ధనవాన్ అనురూపములు సిద్ధించును. ప్రత్యర్ధమున (కొలత) కియాన్ అని ఏర్పడును. జాతార్ధమున తుందిలః, శ్రద్దాలుః అని, ఔన్నత్యార్ధమున (ఎత్తు) దంతురః అని ఏర్పడును. అస్త్యర్ధమున ణినిష్క్రయము రాగా స్రగ్వీ, తపస్వీ, మేధావీ, మాయావీ ఇత్యాది రూపములు సిద్దించును. బహుభాషణము కుత్సిత భాషణము అను నర్థమున వాచాలః, "వాచోటః అనురూపము లేర్పడును.

అసమాప్త్యర్ధమున, ఈషత్ అర్థమున కల్పప్ దేశీయ ప్రత్యయములొచ్చును. కవికల్పః, కవిదేశ్యః అనురూపములు, ప్రకారము అను అర్ధమున పటుజాతీయః అని, నిందార్దమున వైద్యపాశః అని, ప్రశంసార్ధమున వైద్యరూపః అని, భూతపూర్వార్ధమున దృష్టచరః అని సిద్ధించును. ప్రాచుర్యాద్యర్ధములలో అన్నమయః, మృణ్మయః స్త్రీమయః అనురూపము లేర్పడును. జాతార్ధమున లజ్జిత అని, అత్యర్ధమున శ్రేయాన్, శ్రేష్ఠః అను రూపములు సిద్దించును. కృష్ణతరః, శుక్లతమః కీమ అనునవేర్పడును. కింతరాం, అతితరాం, అభి, హి, ఉచ్చేస్తరిం అనునవి అవ్యయములు. పరిమాణార్థమున జానుదఘ్నం, జానుద్వయసం అని రూపము లేర్పడును. నిర్ధారణార్ధమున జానుమాత్రం అనురూపమునేర్పడును. చాలామందిలో, ఇద్దరిలో ఒకనిని చెప్పునపుడు వరుసగా కతమః, తరః అనురూపములుండును. లెక్క పెట్టదగిన వస్తువును చెప్పునపుడు ద్వితీయః తృతీయ, చతుర్దశి, పంచమః, షష్ఠః ఏకాదశః, కతిపయః, కతిధః, కతి అనురూపము లేర్పడును. ఇట్లే వింశః, వింతితమః, శతతమః మొదలగు రూపములుండును. సంఖ్యాప్రకారమును చెప్పునపుడు ద్విధా, ద్వేధా, ద్వేధా అనురూపములుండును. ఒకే పనిని ఎక్కువ మార్లు చేయునపుడు, పంచకృత్వం, ద్విః, త్రిః, బహుశః, ద్వితయం, త్రితయం అనురూపము లేర్పడును. సంఖ్యార్థమున ద్వయం, త్రయం అనురూపములు సిద్ధించును. అల్పార్థమున కుటీరః (చిన్న ఇల్లు, గుడి సె) శమీరః, శుండారః అనురూపములు సిద్ధించును. అట్లే సైణం పౌంస్నకి, తుండిభ, వృందారకః, కృషీవలః, మలినః, వికటః, గోమీ, భౌరీకీ అనురూపములు సిద్ధించును. అవటీటః, అవనాటః అనునవి నిబిడార్థములో నుండును. నిబిరీ, సమేషుకరీ అనురూపములు సిద్ధించును. విత్త, చణ అనురూపములు సామర్ధ్యార్ధమున నుండును. బహుతిధం, చంచుః, అనునవి సిద్దించును. శృంగిణ, పర్వతః అనురూపములు పర్వతార్థమున నుండును. పర్వత శిఖరములను చెప్పుటలో ఉపత్య కొ, అధిక్యకా అనురూపములేర్పడును. చిల్లః, , చిపీటం, చిక్వం, కాతూలః, కుతపః, వల్ల, హిమోలుః, కహోడు, ఉపడక, ఊర్ణాయుః, మరూత, ఏకాకీ, చర్మణ్వతీ జ్యోతా, తమిస్రా, కజ్జీవత్, యర్మణ్వతీ, ఆసందీవత్, చక్రీవత్, తూషీకా, జల్పతకీ ఇవియన్నియు విశేషరూపములు. ఇట్ల, కంభః, కంయుకె, కంబః, కేతిః, కంతుః, కంతః, కంపః శంవః, శంతః, శంతిః, శంయః, శంత, శంతి, శంయః, శంతః అనురూపములు విశేషార్ధములలో నుండును. హ్వయు శబ్దము శంభు శబ్దమువలె చెప్పవలయును. ఇక ధాతు రూపములను చెప్పుచున్నారు.

మొదట భాదిగణమున భూ సత్తాయాం అను ధాతువునకు పది లకారములలో భవతి, బభూవ, భవతా, భవిష్యతి, భవతు, అభవల్, భవత్, భూయాత్, అభూత్, అభవత్ అభవిష్యత్ అనురూపములు సిద్ధించును. ఇట్ల భ్వాదిగణములలోని ఇతర ధాతురూపములను ఊహించుకొనవలయును. అదాది గణమున అద భక్షణే అను ధాతువునకు పది లకొరములలో అత్తి, జఘాస, అత్తా, అత్యతి, అత్తు, ఆదత్ , అద్యాత్, అఘసత్, ఆత్స్యత్ అనురూపము లేర్పడును. జుహోత్యాదిగణమున జుహోతి, జుహావ జుహవాచకొర, హోతా, హోష్యతి, జుహోతు, అజుహోత్, జుహుయాత్, హూయాత్ , అహౌషీత్, అహోష్యత్ అను రూపములు సిద్దించును. దీవాది గణమున దీవ్యతి, దిదేవ, దేవితా, దేవిష్యత, అదీవ్యత్, దీవ్యేత్, దీవ్యాత్, అదేవీత్, అదేవిష్యత్ అనురూపములేర్పడును. స్వాదిగణమున సునోతి, సుషావ, సోడా, సోష్యతి, సున్తు, అసున్త్, సునుయాజ్, సూయాత్ , అసావీత్, అసోష్యత్ అను రూపములు ఏర్పడును. తుదాదిగణమున తుదతి, తుతోద, తోల్తా, తోత్సృతి, తుదతు, అతుదత్, తుదేత్, తద్యాత్, అతాతీత్, అతోత్స్యత్ అను రూపములు ఏర్పడును. రుధాది గణమున రుణద్ది, రురోద, రోహ్లి, రోత్స్యతి, రుణద్దు, అరుణత్, రుధ్యాత్, అగౌత్సిత్, అరోత్స్యత్ అను రూపములేర్పడును. తనాది గణమున తనోతి, తతాన, తని, తనిష్యతి, తనోతు, అతనోత్, తనుయాత్, అతనీత్, ఆతానీత్, అతనిష్యత్ అనురూపములు సిద్ధించును. క్ర్యాది గణమున క్రీజాతి, చిక్రయ, క్రేతా, శ్రేష్యతి, క్రీణాతు, ఆక్రీణాత్, క్రీణీయాత్, క్రీయాత్, అక్రెషీత్, ఆక్రోష్యత్ అనురూపములు సిద్ధించును. చురాది గణమున చోరయతి, చోరయామాస, చోరయితా, చోరయిష్యతి, చోరయతు, అచోరయత్, చోరయేత్, చోర్యాత్, అచూచురల్, అచోరిష్యత్ అనురూపములు సిద్ధించును.

ఇవి పదిగణములలోని మొదటి ధాతువులోని ప్రధమ పురుష ఏకవచనములోని రూపములు. ద్వివచనాది రూపములు ఇతర ధాతు రూపములు వ్యాకరణ శాస్త్ర గ్రంధములలో చూడవలయును.

ప్రయోజనార్థమున ధాతువున కంటే పరముగా ణిచ్ ప్రత్యయమువచ్చినచో భూధాతువులో లట్ రూపము భావయతి అని యగును. ఇచ్ఛార్థమున సన్ ప్రత్యయము వచ్చినపుడు బుభూషతి అనియగును. క్రియాసమభిహారార్థమున యజ్ ప్రత్యయమువచ్చినపుడు బోభూయతే అని యగును. యజ్ లుక్ ప్రకరణమున బోభవీతి అనియగును. తనలో ఇచ్చ అని అర్ధమున (“పుత్రం ఆత్మన ఇచ్చతి”) (పుత్ర ఇవ ఆచరతి) ఆచారార్ధమున పుత్రీయత (క్యచ్ ప్రత్యయాన్తము) అను రూపమేర్పడును. అనుదాత్తము ఇత్తుగాగల ధాతువునకం ఓ పరముగా జిత్తునకంటే పరముగా, క్రియా వినిమయాద్యర్ధమున, నివీశాదులకు ఆత్మ నే పదమొచ్చును. ఇతర ధాతువులకంటే సరముగా కర్తార్గమున పర స్మెపద మొచ్చును. ఇ కారణము ఇత్తుగా కల ధాతువున కంటే పరముగా, స్వగీతము ఇత్తుగా గల దౌతువున కంటే పరముగా పర సేపదము, ఆత్మనే పదము రెండు వచ్చును. భావ కర్మరూపొర్ధమున యక్ ప్రత్యయమొచ్చును. సౌకర్యాతిశయమును తెలియచేయుటకు కర్తవ్యాపారమును చెప్పదలచినపుడు కర్మయే కర్తయగును. అపుడు “పచ్యతే ఓదన స్వయమ్” (అన్నము స్వయముగా ఉడుకుచున్నది) అసిశ్చినత్తి (కత్తియే ఛేదించుచున్నది) స్థాలీ పచతి (స్థాలియే వండుచున్నది) ఇత్యాది ప్రయోగములుండును. సకర్మకమైన ధాతువునకం టే పరముగా భావార్థములో కర్మార్గములో కూడా లకారములు వచ్చును. అకర్మకమైన ధాతువునకంటే పరముగా భావార్థమున కర్తార్ధమున లకారములొచ్చును. ఫలము వ్యాపారము ఒకేదానిలో ఉన్నపుడు ధాతువు అకర్మ కమగును. ఆ ఫలవ్యాపారములకు ధర్మి భేదమున్నపుడు సకర్మ కధాతువగును. కర్మగౌణమైనపుడు, ద్రుహ్యాది ధాతువులు, ప్రధానమైనపుడు నీ హృ కృ మొదలగు ధాతువులు బుద్ది భక్షణార్థములలో, శబ్దకర్మక ధాతువులు వివక్షననుసరించి సకర్మ కములు అకర్మకములుగా మారును. ప్రయోజ్యకర్మ విషయమున ఇతర ణ్యంతములకు పరముగా లకోరాదులు రావచ్చును. ధాతువు ఫలచ్యాపారార్థములను చెప్పును. తాజ్ ఫలాశ్రయమగు కర్మను, వ్యాపారాశ్రయమగు కర్తను చెప్పును. ఫల వ్యాపారములలో వ్యాపారము ప్రధానము. తిజర్దము విశేషణమగును. కృత్యప్రత్యయములొచ్చినపుడు ఏధితవ్యం, ఏధనీయం అనురూపములేర్పడును. కృత్యప్రత్యయములు భావార్ధమున కర్మార్గమున వచ్చును. కృత్య యములు కర్తార్ధమున వచ్చును. కర్తా కారక అనునవి దృష్టాంతములు. భూతకాలమున భూత పదము వాడబడును. గమ్యాదులలో గమ్యాదులే నిర్దేశించబడును. మిగిలినదంతయూ అద్యతనమగును, అధి స్త్రీ యథాశక్తి మొదలగు రూపములు అవ్యయీభావసమాసములో నుండును. తత్పురుష సమాసమున రామాశ్రితః, ధాన్యార్ధః, యూపదారు, వ్యాఘభీః, రాజపురుషః, అక్షశాండః అనురూపములుండును.

పంచగవం, దశగ్రామీ, త్రిఫలా అనునవి ద్విగుసమాసమున నుండును. తుల్యార్ధమును చెప్పు కర్మధారయసమాసమున నీలోత్పలం మొదలగు రూపములుండును. “అబ్రాహ్మణః” అనునది నజ్ఞ తత్పురుష సమాసము. కుంభకొరః మొదలగు రూపములుండును. సమాసములో ఉన్న పదార్ధములు కాక అన్యపదార్థప్రధానమగు బహువ్రీహిసమాసమున “ప్రాప్తోదకో గ్రామః” పంచగు, రూపవద్భార్యః, ససుతః మొదలగు రూపములేర్పడును. సముచ్చయార్థమున గురుం చ ఈశం చ భజ అను ప్రయోగము, అన్వాచయార్ధమున “భిక్షామట, గాం చానయ” అను ప్రయోగములుండును. ఇతరేతరయోగ ద్వంద్వసమాసమున రామకృష్ణా ఇత్యాది ప్రయోగములుండును. రామకృష్ణులు అనగా ఇద్దరు, బ్రహ్మ అనగా ఏకరూపముగా ఉపాసించబడుదురు.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వీతీయపాదమున వ్యాకరణ నిరూపణమను యాబది రెండవ అధ్యాయము సమాప్తము.