12 - ధర్మాఖ్యానమ్

నారద ఉవాచ:-

శ్రుతం తు గంగామాహాత్మ్యం వాంఛితం పాపనాశనమ్

అధునా లక్షణం బ్రూహి భ్రాతర్మే దానపత్రాయోః

నారదుడు పలికెను :- ఓ భ్రాతా ! నేను కోరిన, పాపములను నశింపచేయు గంగామాహాత్మ్యమును వింటిని. ఇపుడు దాన లక్షణమును పాత్రలక్షణమును చెప్పుము.

సనక ఉవాచ:-

సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణః పరమో గురుః

తస్మై దానాని దేయాని దత్తస్యానన్త్యమిచ్ఛతా

బ్రాహ్మణః ప్రతిగృహ్ణీయాత్సర్వతో భయవర్జితః

న కదాపి క్షత్రవిశే గృహ్ణీయాతాం ప్రతిగ్రహమ్

చండస్య పుత్రహీనస్య దంభాచారరతస్య చ

కర్మ త్యాగినశ్చాపి దత్తం భవతి నిష్ఫలమ్

పరదారతస్సాపీ పరద్రవ్యాభిలాషిణః

నక్షత్రసూచకస్యాపి దత్తం భవతి నిష్ఫలమ్

అపూయావిష్టమనసః కృతఘ్నస్య చ మాయినః

ఆయాజ్యయాజనస్యాపి దత్తం భవతి నిష్పలమ్

నిత్యం యాచ్ఞాపరస్యాపి హింసకస్య ఖలస్య చ

రసవిక్రయిణ శ్చైవ దత్తం భవతి నిష్ఫలమ్

గానేన జీవికి యస్య యప్య భార్య చ పుంశ్చలీ

పరోపతాపిశ్చాపి దత్తం భవతి నిష్పలమ్

వేదవిక్రయిణశ్చాపి స్మృతివిక్రయిణస్తథా

ధర్మ విక్రయిణో విప్ర దత్తం భవతి నిష్ఫలమ్

అసీజీవీ మషీజీవీ దేవలో గ్రామయాజకః

ధావకో వా భవేత్తేషాం దత్తం భవతి నిష్పలమ్

పాకకర్తుః పరస్యార్దే కవయే గదహారిణే

అభక్ష్యభక్షస్యాపి దత్తం భవతి నిష్పలమ్

శూద్రాన్నభోజనశ్చైవ శూద్రాణాం శవదాహినః

పౌంశ్చలాన్నభుజశ్చాపి దత్తం భవతి నిష్పలమ్

నామవిక్రయిణో విష్ణోః సంధ్యాకర్మోజ్ఘితస్యచ

దుష్ప్రతిగ్రహదగ్ధస్య దత్తం భవతి నిష్ఫలమ్

దివాశయనశీలస్య తథా మైధునకారిణః

సంధ్యాభోజన ఏవాపి దత్తం భవతి నిష్ఫలమ్

మహాపాతకయుక్తస్య త్యక్తస్య జ్ఞాతిబాంధవైః

కుండస్య చాపి గోలస్య దత్తం భవతి నిష్ఫలమ్

పరివితేః శఠస్యాపి పరివేత్తుః ప్రమాదితః

స్త్రీజితస్యాతిదుష్టస్య దత్తం భవతి నిష్ఫలమ్

మద్యమాంసాశినశ్చాపి స్త్రీవిటస్యాతిలోభినః

చౌరస్య పిశునస్యాపి దత్తం భవతి నిష్ఫలమ్

యే కేచిత్పాపనిరతా నిన్దితాః సుజనైః సదా

న తేభ్యః ప్రతిగృహ్ణీ యాన్న చ దద్యాద్ద్విజోత్తమ

సత్కర్మనిరతయాపి దేయం యత్నేన నారద

సనక మహర్షి పలి కెను :- అన్ని వర్ణములలో బ్రాహ్మణ వర్ణము ఉత్తమము. ఇచ్చిన దానము అక్షయము కావలయునని తలచువారు బ్రాహ్మణునకే ఈయవలయును. బ్రాహ్మణుడు భయములేనివాడై అందరి నుండి దానమును తీసుకొనవలయును. క్షత్రియులు, వైశ్యులు ఎప్పుడూ దానమును తీసుకోరాదు. తీవ్రస్వభావము కలవానికీ, పుత్రులు లేని వానికి, డాంబికా చొరమును అవలంబించిన వానికి, తన కర్మలను విడచిన వానికి ఇచ్చినది నిష్పలమగును. పరభార్యల యందు ఆసక్తి కలహానికి, పరద్రవ్యమును అభిలషించువానికి, జ్యోతిష్యము చూచువానికి, ఇచ్చినది నిష్పలమగును. అసూయ నిండిన మనసు గలవానికి, కృతఘ్నునికి, కపటికీ, యాగమునకు అనర్హుడైన వానిచే యాగము చేయించువానికి, ఇచ్చినది నిష్పలమగును. ఎపుడూ యాచించు వానికి, హింసకునికి, ఖలునికీ, రసములను అమ్మువానికి ఇచ్చునది నిష్పలమగును. వేదములను స్మృతులను అమ్ముకొను వానికీ, ధర్మమును అమ్ముకొను వానికి, ఇచ్చినది నిష్పలమగును. గానముతో జీవించువానికి, వ్యభిచారము చేయు స్త్రీ భార్యగా - కలవానికి, ఇతరులను పీడించు వానికి ఇచ్చినది నిష్పలమగును. ఖడ్గముతో జీవించువానికి, సిరాతో జీవించువానికి, దేవాలయమున ధనమును తీసుకొని అర్చించువానికీ, గ్రామపురోహితునికి, గ్రామాధికారము చేయువానికి, ఇచ్చునది నిష్పలమగును. ఇతరులకు వంట చేయువానికి, కలికి, వైద్యునికి, తినరాని వాటిని తిను వానికి ఇచ్చినది. నిష్పలమగును. శూద్రుల అన్నమును తిను వానికి, శూద్ర శవములను దహనము చేయువానికి, వ్యభిచారిణుల అన్నము తినువానికి, ఇచ్చునది నిష్పలమగును. విష్ణునామములను అమ్మువానికి, సంధ్యావందనమును చేయని వానికి, దుష్టదానములను స్వీకరించువానికి ఇచ్చునది నిష్పలమగును. పగలు నిద్రించు వానికి, పగలు సంభోగము చేయువానికి, సంధ్యాసమయమున తినువానికి ఇచ్చునది నిష్పలమగును. మహాపాతకములు కలవానికి, జ్ఞాతులు బంధువులు వీడచిన వానికి విధవాపుత్రునికి, వ్యభిచారిణి పుత్రునికి ఇచ్చినది నిష్పలమగును. తన కంటే ముందు పెళ్లి చేసుకొన్న వాని అన్నకు, అన్నకు వివాహము కాకమునుపే వివాహము చేసుకొన్న వానికి, స్త్రీల వశములో నున్న వానికి అతిదుష్టునికి ఇచ్చినది నిష్పలమగును. మద్యమాంసములను తినువానికి, స్త్రీవిటులకు, అతిలోభికి తస్కరునికి, చాడీలు చెప్పువానీకి ఇచ్చినది నిష్పలమగును. పాపనిరతులకు ఇతరులచే నిందించబడువారికి ఈయరాదు. వారి నుండి తీసుకోరాదు. సత్కర్మనిరతునకే ప్రయత్నముచేసి ఈయవలయును.

యద్దానం శ్రద్ధయా దత్తం తథా విష్ణుసమర్పణమ్

యాచితం వాపి ప్రాత్రేణ భవేత్తద్దానముత్తమమ్

పరలోకం సముద్దిశ్య హ్యైహికం వాపి నారద

యద్దానం దీయతే పాత్ర తత్కామ్యం మధ్యమం స్మృతమ్

దంభేన చాపి హింసార్థం పరస్యావిధినాపి చ

క్రుద్ధేనాశ్రద్ధయా పాత్రే తద్దానం మధ్యమం స్మృతమ్

అధమం బలితోషాయ మధ్యమం స్వార్థ సిద్ధయే

ఉత్తమం హరిప్రీత్యర్థం ప్రాహుర్వేదవిదాం వరాః

దానభోగవినాశాశ్చ రాయస్స్యుర్గతయస్త్రీధా

యో దదాతి చ నో భుజ్కే తద్ధనం నాశకారణమ్

ధనం ధర్మఫలం విప్ర ధర్మో మాధవతుష్టికృత్

తరవః కిం న జీవ న్తి త్వేఽపి లోకే పరార్థాకాః

యత్ర మూలఫలైర్వృక్షా పరకార్యం ప్రకుర్వతే

మనుష్యా యది విప్రాగ్ర్య న పరార్దాస్తదా మృతాః

పరాకార్యం న యే మర్త్యాః కాయేనాపి ధనేన వా

మనసా వచసా వాపి తే జ్ఞేయాః పాపకృత్తమాః

అత్రేతిహాసం వక్ష్యామి శృణు నారద తత్త్వతః

శ్రద్దతో ఇచ్చినది, విష్ణువునకు అర్పించినది, యోగ్యుడైనవాడు అడిగినపుడు ఇచ్చినది, ఉత్తమ దానమనబడును. పరలోక ఫలము కొఱకు ఇహలోకమున యోగ్యునికి ఫలాకాంక్షతో నిచ్చు దానము మధ్యమము. డాంబికము కొఱకు, హింసించుటకు విధిరహితముగా, కోపముతో అశ్రద్దతో. అయోగ్యుడైన ఇతరునికి ఇచ్చునది మధ్యమము. అధమ దానము బలిచక్రవర్తి ప్రీతి కొఱకు, మధ్యమ దానము స్వార్థ సిద్ధికీ, ఉత్తమదానము హరిప్రీతికొఱకు అని వేదార్థములు తెలిసిన వారు చెప్పెదరు. ధనమునకు దానము, అనుభవము, వినాశము అని మూడు గతులుండును. దానము చేయని, అనుభవించని ధనము వినాశకారణమగును. ధనము ధర్మఫలము కావలయును. ధర్మమును శ్రీహరి సంతోషము కొఱకాచరించవలయును. చెట్లు బ్రతుకుచున్నవి కదా ! కాని అవికూడా పరార్థము కొఱకే జీవించు చున్నవి. మూలములతో (గడ్డలతో)ఫలములతో చెట్లు పరులకు ఉపకారమే చేయుచున్నవి. ఇతరుల కొఱకు జీవించనీ మనుజులు చనిపోయిన వారితో సమానులే. శరీరముతో, మనసుతో, మాటతో పరోపకారము చేయని మనుజులు పాపులు. ఓ నారదా ! ఈ విషయమున నీ కొక కథను చెప్పెదను వినుము.

యత్ర దానాదికానాం తు లక్షణం పరికీర్తితమ్

గంగామాహాత్మ్యసహితం సర్వపాపప్రణాశనమ్

భగీరథస్య ధర్మస్య సంవాదం పుణ్యకారణమ్ ఆసీద్భగీరథ రాజా సగరాన్వయసంభవః

శశాస పృథివీమేతాం సప్తద్వీపాం సాగరామ్

సర్వధర్మరతో నిత్యం సత్యసంధః ప్రతాపవాన్

కందర్పసదృశో రూపే యాయజూకో విచక్షణః

ప్రాలేయాధ్రిసమో ధైర్యే ధర్మే ధర్మసమో నృపః

సర్వలక్షణసంపన్నః సర్వశాస్త్రార్ధపారగః

సర్వసంపత్సమాయుక్తః సర్వానన్దకరో మునే

ఆతిథ్యప్రయతో నిత్యం వాసుదేవార్చనే రతః

పరాక్రమీ గుణనిధిర్మైత్రః కారుణికస్సుధీః

ఏతాదృశం తం రాజానం జ్ఞాత్వా హృష్టో భగీరథమ్

ధర్మరాజో ద్విజశ్రేష్ఠ ! కదాచిద్ధ్రష్టుమాగతః

సమాగతం ధర్మరాజమర్హయామాస భూపతిః

శాస్త్రదృష్టేన విధినా ధర్మః ప్రీత ఉవాచ తమ్

ఈ కథలోనే దానాదికముల లక్షణములు గంగామహాత్మ్యము చెప్పబడినది. ఈ కధ అన్ని పాపములను నశింపచేయును. భగీరథయమధర్మరాజ సంవాదము అన్ని పుణ్యములను కలిగించును. సగరవంశమున బుట్టినవాడు భగీరథుడను పేరుగల వాడొక రాజుండెను. సప్తద్వీపములతో సప్తసాగరములతో కూడిన ఈ భూమండలమునంతయు పరిపాలించెను. అన్ని ధర్మములందు ప్రీతి కలవాడు, సత్యవ్రతము గలవాడు, అమిత పరాక్రమము కలవాడు, రూపమున, మన్మథుని బోలువాడు, యజ్ఞములను చేయువాడు, వివేకము కలవాడు, ధైర్యమున హిమాద్రిని బోలినవాడు ధర్మమున ధర్మరాజుతో సమానుడు అన్ని లక్షణములు కలవాడు, అన్ని శాస్త్రార్ధములు తెలిసినవాడు, అన్ని సంపదలు కలవాడు అందరికీ ఆనందమును కలిగించువాడు, ఎల్లప్పుడు అతిథులను పూజించుటయందే ఆసక్తి కలవాడు, శ్రీమన్నారాయణుని పూజించుటలో మనసు కలవాడు, అన్ని మంచి గుణములకు నిధి స్నేహశీలి, భూతదయ కలవాడు, మంచి బుద్ధి గలవాడు. ఇంతటి ఉత్తముడైన భగీరథ చక్రవర్తిని గూర్చి తెలుసుకొని సంతోషించిన యమధర్మరాజు ఒకప్పుడు చూచుట కొచ్చెను. భగీరథ చక్రవర్తి వచ్చిన ధర్మరాజును యథావిధిగా పూజించేను. భగీరథుని పూజలంది సంతోషించిన యమధర్మరాజు అతనితో ఇట్లు పలికెను.

ధర్మరాజు ఉవాచ :-

రాజన్దర్మవిదాం శ్రేష్ఠ ! ప్రసిద్ధోఽసి జగత్త్రయే

ధర్మరాజోఽధ కీర్తిం తే శ్రుత్వా త్వాం ద్రష్టుమాగతః

సన్మార్గనిరతం సత్యం సర్వభూతహితే రతమ్

ద్రష్టుమిచ్ఛన్తి విబుధాస్తవోత్కృష్టగుణప్రియాః

కీర్తిర్నీతిశ్చ సంపత్తిర్వర్తతే యత్ర భూపతే

వసన్తి తత్ర నియతం గుణాః సన్తశ్చ దేవతాః

అహో రాజన్మహాభాగ ! శోభనం చరితం తవ

సర్వభూతహితత్వాది మాదృశామపి దుర్లభమ్

ఇత్యుక్తవంతం తం ధర్మం ప్రణిపత్య భగీరధః

ప్రోవాచ వినయావిష్టః పంహృష్టః శ్లక్షయా గిరా

ధర్మరాజు పలికెను :- “ఓ రాజా ! ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్టుడవని ప్రసిద్ది చెందితివి. ఈ మూడు లోకములలో విస్తరించిన నీ కీర్తిని విని ధర్మరాజునైన నేను నిన్ను చూచుటకు వచ్చితిని. సన్మార్గమునందు ఆసక్తుడైన వాడవు, సత్యసంధుడవు అన్నీ ప్రాణులకు హితమును చేయలయునని కోరువాడవు అయిన నిన్ను నీ ఉత్తమ గుణములయందలి ప్రీతిచే దేవతలు చూడ గోరుచున్నారు. ఓ రాజా ! కీర్తి, నీతి, సంపద, ఉన్న చోట సద్గుణములు సత్పురుషులు దేవతలు తప్పకనుందురు. ఓ రాజా ! నీ చరితము అత్యాశ్చర్యకరము. సుందరము. అన్ని ప్రాణులకు హితమును చేయవలయుననేడు, బుద్ది మావంటి వారికి కూడా దుర్లభమే.” ఇట్లు పలుకుచున్న ధర్మరాజును “భగీరధ చక్రవర్తి నమస్కరించి వినయముతో సంతోషముతో మృదుమధురమైన మాటలతో ఇట్లు పలి కెను.”

భగీరథ ఉవాచ :-

భగవన్సర్వధర్మజ్ఞ ! సమదర్శిన్ ! సురేశ్వర ! కృపయా పరయా విష్ణో యత్పృచ్ఛామి వదస్వ తత్

ధర్మాః కీదృగ్విధాః ప్రోక్తాః కే లోకా ధర్మశాలినామ్

కియత్యో యాతనాః ప్రోక్తాః శేషాం తాః పరికీర్తితాః

త్వయా సంమాననీయా యే శాసనీయాశ్చయే యథా

తత్సర్వం మే మహాభాగ ! విస్తరాద్వక్తుమర్హసి

అన్ని ధర్మములు తెలిసిన భగవానుడా ! సమదర్నీ ! సురేశ్వరా ! నా మీద పరమకృప కలవాడవై నేనడిగిన వాటిని చెప్పుము. ధర్మములు ఎటువంటివి ? ధర్మశీలురకు లభించులోకములేవి ? నరకములెన్ని ? ఆ నరకములెవరికి ప్రాప్తించును ? నీవు ప్రేమతో ఆదరించునదెవరిని ? శాసించునదేవరిని ? దీనినంతటిని నాకు విస్తరముగా తెలుపుము.

ధర్మరాజ ఉవాచ :-

సాధు ! సాధు ! మహాబుద్ధే ! మతిస్తే విమలోర్జితా

ధర్మాధర్మాన్ప్రవక్ష్యామి తత్త్వతః శృణు భక్తితః

ధర్మా బహువిధాః ప్రోక్తాః పుణ్యలోకప్రదాయకాః

తథైవ యాతనాః ప్రోక్తా అసంఖ్యా ఘోరదర్శనాః

విస్తరాద్గదితుం నాలమపి వర్షశతాయుతైః

తస్మాత్సమాసతో వక్ష్యే ధర్మాధర్మ నిదర్శనమ్

వృత్తి దానం ద్విజానాం వై మహాపుణ్యం ప్రకీర్తితమ్

తథైవాధ్యాత్మవిదుషో దత్తం భవతి చాక్షయమ్

కుటుంబినం వా శాస్త్రజ్ఞం శ్రోత్రియం వా గుణాన్వితమ్

యో దత్త్వా స్థాపయేద్వత్తిం తస్య పుణ్యఫలం శృణు

మాతృతః పితృత శ్చైవ ద్విజః కోటికులాన్వితః

నిర్విశ్య విష్ణుభవనం కల్పం తత్రైవ మోదతే

గణ్యన్తే పాంసవో భూమేః గణ్యన్తే వృష్టిబన్దవః

న గణ్యన్తే విధాతాపి బ్రహ్మవృత్తిఫలాని వై

సమస్తదేవతారూపో బ్రాహ్మణః పరికీర్తితః

జీవనం దదతస్తస్య కః పుణ్యం గదితుం క్షమః

యో విప్రహితకృన్నిత్యం స సర్వాన్కృతవాన్మ ఖాన్

స స్నాతః సర్వతీర్ధేషు తప్తం తేనిఖిలం తపః

యో దదస్వేత విప్రాణాం జీవనం ప్రేరయేత్పరమ్

సోఽపి తత్ఫలమాప్నోతి కిమన్త్యైర్బహుభాషితైః

తటాకం కారయేద్యస్తు స్వయమేవాపరేణ వా

వక్తుం తత్పుణ్యసంఖ్యానం నాలం వర్షశతాయుషా

ఏక శ్చేదధ్వగో రాజంస్తడాగస్య జలం పిబేత్

తత్కర్తుస్సర్వపాపాని నశ్యన్త్యేవ న సంశయః

ఏకాహమపి యతుర్యాద్భూమిస్థముదకం నరః

స ముక్తస్సర్వపాపేభ్యశ్శతవర్షం వ పేద్దివి

కర్తుం తడాగం యో మర్త్యస్సాహ్యకశ్శక్తితో భవేత్

సోఽపి తత్పలమాప్నోతి తుష్టః ప్రేరక ఏవ చ

మృదం సిద్దార్థమాత్రం వా తడాగాద్యో బహిఃక్షి పేత్

తిష్ఠత్యబ్దశతం స్వర్గే విముక్తః పాపకోటిభిః

దేవతా యస్య తుష్యన్తి గురవో వా నృపోత్తమ

తడాగపుణ్యకృచ్చ స్యాదిత్యేషా శాశ్వతీ శ్రుతిః

ధర్మరాజు పలికెను :- “ఓ మహాబుద్దీ ! బాగు ! బాగు ! నీ బుద్ధి నిర్మలమైనది ప్రసన్నమైనది. ధర్మాధర్మములను గూర్చి చెప్పెదను. భక్తితో వినుము. పలువిధములుగా ధర్మములుండును ఈ ధర్మములు పుణ్యలోకములను ప్రసాదించును. భయంకరములైన ఆ ధర్మములు కూడా బహువిధములు. లక్షసంవత్సరముల కాలమున కూడా ధర్మాధర్మములను విస్తరముగా చేప్ప శక్యముకొదు. కావున ధర్మాధర్మ విషయములను సంగ్రహముగా చెప్పెదను. బ్రాహ్మణులకు బ్రతుకు తెరువును కల్పించుట మహాపుణ్యమని చెప్పబడినది. అట్లే ఆధ్యాత్మజ్ఞానికి దానము చేసిన ఫలము తరగనిదెను. శాస్త్రములు తెలిసిన కుటుంబిని, సద్గుణ వంతుడైన శ్రోత్రియుని బ్రతుకుతెరువు కల్పించి గ్రామమున ఉంచినచో తల్లివంశములు తండ్రి వంశములు కోటి తరములు విష్ణుభవనమున ప్రవేశించి ఒక కల్పము నివసించును. భూరేణువులను లెక్కించవచ్చును. వర్షబిందువులను, లెక్కించవచ్చును. బ్రాహ్మణునికి వృత్తి కల్పించిన పుణ్యములను బ్రహ్మ కూడా లెక్కించలేడు. బ్రాహ్మణుడు సమస్త దేవతా స్వరూపుడుగా చెప్పబడుచున్నాడు. అటువంటి బ్రాహ్మణునికి బ్రతుకుతెరువునిచ్చిన వాని పుణ్యమును ఎవడు చెప్పగలడు ? బ్రాహ్మణులకు హితమును చేయువాడు. అన్ని యజ్ఞములను చేసినవాడే. అన్ని పుణ్యతీర్థములలో స్నానము చేసినవాడు, అన్ని తపములను చేసిన వాడూ అగును. బ్రాహ్మణునకు బ్రతుకుతెరువును కల్పించమని ఇతరులను ప్రోత్సహించిన వానికి కూడా అంతియే ఫలము కలుగును. ఇక వేయి మాటలేల ? స్వయముగా చెరువును తవ్వించిననూ, ఇతరులచే తవ్వింప చేసిననూ అతని పుణ్యఫలమును నూరేండ్లకాలములోనైనను చెప్పలేము. ఒక్క బాటసారి అయిననూ ఆ చెరువులో నీరు త్రాగినచో చెరువును త్రవ్వించిన వాని పాపములన్నియూ నశించును. సంశయములేదు. ఒక దినమునకు సరిపోవు నీటిని చెరువులో ఉంచగలవాడు అన్ని పాపముల నుండి విముక్తుడై స్వర్గమున నూరు సంవత్సరములు నివసించును. చెరువును త్రవ్వించువానికి శక్తి కొలది సాయము చేయువాడు, ఆకార్యమును చూచి ఆనందించువాడు, చెరువును త్రవ్వించమని ప్రోత్సహించువాడు కూడా అంతియే. ఫలమును పొందును. ఆవగింజంత మట్టిని చెరువునుండి తీసి బయట పడవేసినవాడు అన్ని పాపముల నుండి విముక్తుడై నూరు సంవత్సరములు స్వర్గములో నివసించును. దేవతలను గురువులను సంతోషింపచేసిన వాడు చెరువును త్రవ్వించినవాని పుణ్యమును పొందును అని శ్రుతి చెప్పుచున్నది.

ఇతిహాసం ప్రవక్ష్యామి తవాత్ర నృపసత్తమ ! యం శ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః

గౌడదేశేఽతివిఖ్యాతో రాజా సీద్విరభద్రవః

మహాప్రతాపీ విద్యావాన్ సదా విప్రప్రపూజకు

వేదశాస్త్రకులాచారయుక్తో మిత్రవివర్ధనః

తస్య రాజ్ఞీ మహాభాగా నామ్నా చంపకమంజరీ

తస్య రాజ్ఞో మహామాత్యాః కృత్యాకృత్యవిచారణాః

ధర్మాణాం ధర్మశాస్త్రేస్తు సదా కుర్వన్తి నిశ్చయమ్

ప్రాయశ్చిత్తం చికిత్సాo చ జ్యోతిషే ధర్మనిర్ణయమ్

వినా శాస్త్రేణ యో బ్రూయాత్తమాహుః బ్రహ్మఘాతకమ్

ఇతి నిశ్చిత్య మనసా మన్వాదీరితధర్మకాన్

ఆచార్యేభ్యస్సదా భూపశ్శృణోతి విధిపూర్వకమ్

న కోఽప్యన్యాయవర్తీ చ తస్య రాజ్యేఽవరోఽపి చ

ధర్మేణ పాల్యమానస్య తస్య దేశస్య భూపతేః

ఓ రాజా! ఇచట నీకు ఒక కథను చెప్పెదను వినుము. ఈ కథను వినినచో అన్ని పాపములు నశించును. గౌడదేశమున వీరభద్రుడను ప్రసిద్ది చెందిన మహారాజు కలడు. మహాప్రతాపము కలవాడు, - విద్యావంతుడు, ఎప్పుడూ బ్రాహ్మణులను పూజించువాడు. వేదశాస్త్రకులాచారములు కలవాడు. మిత్రులను పెంచువాడు. అతని భార్య మహానుభావురాలు చంపకమంజరి. వీరభద్రుని మంత్రులు కృత్యాకృత్యవిచారములు కలవారు. ధర్మశాస్త్రములచే ధర్మములను నిర్ణయించువారు. ప్రాయశ్చిత్తమును, చికిత్సను, జ్యోతిషశాస్త్రమును, ధర్మ నిర్ణయమును, శాస్త్రము ప్రమాణముగా లేక చెప్పువాడు బ్రహ్మఘాతకుడగును. ఇట్లు మన్వాదులు చెప్పిన ధర్మములను ఎప్పుడూ గురువుల నుండి విధి. పూర్వకముగా వినుచుండును. వీరభద్రుని రాజ్యమున అన్యాయముగా ప్రవర్తించువాడొక్కడునూలేడు. తక్కువ వాడు కూడా రాజ్యమున లేడు. ఆ రాజు ధర్మ బద్ధముగా రాజ్యపాలన చేయుచుండెను.

జాతం సమత్వం స్వర్గప్య సౌరాజ్యస్య శుభావహమ్

స చైకదా తు నృపతిర్మృగయాయాం మహావనే

మక్త్యాదిభిః పరివృతో బభ్రమ మధ్యభాస్కరమ్

దైవాదాఖేటశూన్యస్య హ్యతిశ్రాన్తస్య తత్ర వై

నృపరీతస్య సంజాతం సరసో దర్శనం నృప

తతః శుష్కిం తు సరసీం దృష్ట్వా తత్ర వ్యచిన్తయత్

కిమియం సరసీ శృజ్గే భువః కేన వినిర్మితో

కథం జలం భవేదత్ర యేన జీవేదయం నృపః

తతో బుద్ధిస్సమభవత్థాతే తస్యా నృపోత్తమ

హస్తమాత్రం తతో గర్తం ఖాత్వా తోయమవాప్తవాన్

తేన తోయేన పీతేన రాజ్ఞస్తృప్తిరజాయత

మన్త్రిణశ్చాపి భూమీశ బుద్ధిసాగరసంజ్ఞినః

ప బుద్ధిసాగరో భూపం ప్రాహ ధర్మార్థకోవిదః

రాజనియం పుష్కరిణీ వర్షాజలవతీ పురా

అద్యైనాం బద్ధవపాంచ కర్తుం జాతా మతిర్మమ

తద్భవాన్మోదతాం దేవ దత్తాదాజ్ఞాం చ మేఽనఘ

ఇతి శ్రుత్వా వచస్తన్య మన్త్రిణో నృపసత్తమః మముదేఽతిత్తరాం భూపః స్వయం కర్తుం సముద్యతః

తమేవ మన్త్రిణం తత్ర యుయోజ శుభకర్మణి

తతో రాజాజ్ఞయా సోఽపి బుద్ధిసాగరకో ముదా

సరసీం సాగరం కర్తుముద్యతః పుణ్యకృత్తమః

ధనుషాం చైవ పంచాశత్సర్వతో విస్తృతాయతామ్

సర సీం బద్దసుశీలాం చకారాగాధశంబరామ్

తాం వినిర్మాయ సరసీం రాజ్ఞే పర్వం న్యవేదయత్

తస్యాం తతఃప్రభృతి వై సర్వేపి వనచారిణః

పాంధాః పిపాసితా భూప లభన్తేష్మ జలం శుభమ్

వీరభద్రుని సౌరాజ్యము స్వర్గముతో సమానమాయెను. ఒక మారు వీరభద్రమహారాజు మంత్రులతో కలిసి వేటకు బయలుదేరి మహారణ్యమున మధ్యాహ్నము వరకు తిరిగెను. దైవ వశమున వేటాడు మృగములు లభించక మిక్కిలి అలసిన మహారాజు పరివారముతో వెళ్ళి ఒక సరస్సును చూచెను. కాని ఆ సరస్సు నీరు లేక ఎండిపోయి యుండుట జూచి ఈ భూమి పై ఎత్తు ప్రాంతమున ఇట్లు సరసునెవరు నిర్మించిరి ? ఈ సరస్సులో నీరెట్లు లభించును ? ఆ నీరును త్రాగి ఈ రోజు ఎట్లు బ్రతుక వలయును ? అని (మంత్రి) చింతించెను. అపుడు ఆతనికి ఈ సరసును త్రవ్వవలయునని ఆలోచన కలిగెను. వెంటనే ఒక మూర లోతు సరస్సును త్రవ్వగా నీరు వచ్చెను. ఆ నీటిని త్రాగి రాజు తృప్తి చెందెను. బుద్దిసాగరుడను పేరుగల మంత్రికూడా నీరు త్రాగి తృప్తి చెందెను. తరువాత బుద్దిసాగరుడు రాజుతో నిట్లు పలికెను. “ఓ మహారాజా! ఈ సరస్సు వర్షపునీటితో మాత్రమే నిండియుండును. వర్షములు లేనపుడు ఎండిపోయి యుండును. కావున ఈ సరస్సును లోతుగా త్రవ్వలయునని నాకు ఆలోచన వచ్చినది. కావున మీరు దీనిని ఆమోదించి నాకొజ్జనీయుడు.” ఈ మాటలను వినిన వీర భద్రమహారాజు మిక్కిలి సంతోషించి తాను కొడా అట్లు త్రవ్వించ సంకల్పించెను. అట్లు ఆ సరస్సును చక్కగా త్రవ్వించు శుభకార్యమున ఆ బుద్దిసాగరునే నియమించెను. అపుడు రాజాజ్ఞను పొందిన పుణ్యాత్ముడైన బుద్ధిసాగరుడు సంతోషముతో ఆ సరస్సును సాగరమును. చేయుట సిద్దపడెను. అట్లు ఆ సరస్సును మూడువందల అడగులలోతు అంతయే వెడల్పుగా త్రవ్వించి చుట్టూ రాతిగోడ కట్టించి చాలా లోతుగా సరస్సును నిర్మింపచే సెను. అట్లు సరస్సును నిర్మించి బుద్ధిసాగరుడు వీరభద్రమహారాజునకు నివేదించెను. అప్పటి నుండి ఆ యరణ్యములో నుండు వారు బాటసారులు దప్పిగొనినపుడు ఆ సరస్సులోని నీరు త్రాగుచుండెడివారు.

కదాచిత్స్వాయుషశ్చాన్తే స మన్త్రి బుద్ధిసాగరః

ప్రమృతో గతవాంశ్లోకం లోకశాస్తుర్మమ ప్రభో

తదర్ధం తు మయా పృష్టో ధర్మో ధర్మలిపింకరః

చిత్రగుప్తస్తు తత్కర్మ మహ్యం సర్వం న్యవేదయత్

ఉపదేష్టా స్వయం చాసౌ ధర్మ కార్యస్య భూపతేః

తస్మాద్ధర్మ విమానం తు సమారోడుమిహార్హతి

ఇత్యుక్తే చిత్రగుప్తేన సమాజ్ఞప్తా మయా నృప !

విమానం ధర్మసంజ్ఞం తు ఆరోడుం బుద్ధిసాగరః

అథ కాలాన్తరే రాజన్ స రాజా వీరభద్రక

మృతో గత మమ స్థానం నమశ్చక్రే ముదాన్వితః

మయా తు తత్ర తస్యాపి పృష్టం కర్మాఖిలం నృప !

కథితం చిత్రగుప్తేన ధర్మం సరసి సంభవమ్

తదా సమ్యజ్మయా రాజా బోధితోఽభూద్యథా శృణు

అధిత్యకాయాం భూపాల పైకతస్య గిరేః పురా

లావ కేనామునా చంచ్వా ఖాతం ద్వ్యంగులమమ్బుని

తతః కాలాన్తరే తేన వారాహేణ నృపోత్తమ

ఖానితం హస్తమాత్రం తు జలం తుండేన చాత్మనః

తత్వోన్యదాముయా కాల్వా హస్తయుగ్మమితః కృతమ్

ఖాతే జలే మహారాజ తోయం మాసద్వయం స్థితమ్

పీతం క్షుద్రైర్వనచరైస్సత్తెస్తృష్ణాసమాకులైః

తతో వర్షత్రయాన్తే తు గజతానేన సువ్రత

హస్తత్రయమితః ఖాతః కృతస్తత్రాధివం జలమ్

మాసత్రయే స్థితం తచ్చ పయో జీవైర్వనేచరైః

భవాంస్తత్ర సమాయాతో జలశోషాదనన్తరమ్

మాసే తత్ర తు సంప్రాప్తం హస్తం ఖాత్వా జలం నృప

తతస్తస్యోపదేశేన మంత్రిణే నృపతే త్వయా

పఞ్చాశద్దనురుశాతం జాతం తత్ర మహాజలమ్

పునశ్శిలాభిస్సుదృఢం బద్ధం జాతం మహత్సరః

వృక్షాశ్చ రోహితాస్తత్ర సర్వలోకోపకారిణః

తేన స్వ స్వేన పుణ్యేన పంచైతే జగతీపతే !

విమానం ధర్మ్యమారూఢస్త్వమ ప్యేనం సమారుహా

ఇతి వాక్యం సమాకర్ణ్య మమ రాజా స భూమిప !

ఆరురోహ విమానం తత్షష్ఠో రాజా సమాంశభాక్

ఇతి తే సర్వమాఖ్యాతం తడాగజనితం ఫలమ్

శ్రుత్వేతన్ముచ్యతే పాపాదాజన్మమరణాన్తికాత్

యో నరః శ్రద్దయా యుక్తో వ్యాఖ్యాతం శృణుయాత్పఠేత్

సోఽప్యాప్నోత్యభిలం పుణ్యం సరో నిర్మాణసంభవమ్

ఇతి శ్రీబృహన్నారదీయ పురాణే పూర్వభాగే ప్రథమపాదే ధర్మాఖ్యానే ద్వాదశోఽధ్యాయః .

కొంతకాలమునకు ఆయుష్యము పూర్తి కాగా బుద్ధిసాగరుడు మరణించి లోకపాలకుడైన నా లోకమునకు వచ్చెను. ధర్మలిపిని వ్రాయు చిత్రగుప్తుని నేను బుద్ధిసాగరుని విషయమున అడిగితిని. అపుడు చిత్రగుప్తుడు సాతో బుద్ధిసాగరుడు చేసిన దానిని తెలి పెను. ఈ బుద్ధిసాగరుడు మహారాజునకు ధర్మ కార్యమునుపదేశించెను. కావున ఇతను ధర్మవిమానము నధిరోహించుటకు యోగ్యుడు. ఇట్లు చిత్రగుప్తుడు తెలుపగా ధర్మ విమానమునధిరోహించమని నేను బుద్దిసాగరుని ఆజ్ఞాపించితిని. మరికొంతకాలమునకు ఆ వీరభద్రమహారాజు మరణించి నాలోకమునకు వచ్చి సంతోషముతో నాకు నమస్కరించెను. నేను ఆ రాజు విషయమున కూడా చిత్రగుప్తుని అడిగితిని. అపుడు చిత్రగుప్తుడు రాజు త్రవ్వించిన సరస్సు ధర్మమును తెలి పెను. అపుడు నేను రాజును గూర్చి ఇట్లు సరస్సు చరిత్రను తెలిపితిని” వినుము. సైకతపర్వత శిఖరము పై ఈ లకుముకి సీట్ల తన ముక్కుతో నీటిలో రెండంగుళములను త్రవ్వను. “తరువాత కొంతకాలమునకు ఈ వరాహము తన తుండముతో ఒక మూరలోతు త్రవ్వను. తరువాత కొంతకాలమునకు ఈ వరాహము రెండు మూరలు త్రవ్వను. అట్లు త్రవ్విన దానిలో నీరు రెండు నెలలుండెను. దప్పిగొనిన చిన్న జంతువులు ఆ నీరు త్రాగినవి. తరువాత మూడు సంవత్సరములకు యేనుగుల గుంపొచ్చి మూడు మూరలు త్రవ్వినది. ఎక్కువ నీరు వచ్చినది. ఆ నీరు మూడు మాసములున్నవి. చిన్న చిన్న జంతువులు ఆ నీటిని త్రాగి బ్రతికినవి. ఆ నీరేండి పోయిన తరువాత నీవచటికోచ్చితివి. నీవు ఒక మూరత్రవ్వి నీటిని పొందితివి. తరువాత మంత్రి - ఉపదేశముతో మూడువందల అడుగుల లోతు తవ్వించితివీ. అందులో చాలా నీరు వచ్చినది. రాతితో చక్కగా కట్టించినందున గొప్ప సరసాయేను. దాని తీరమున లోకులకుపకరించు చెట్లను నాటించితివి. కావున పొరి వారి పుణ్యములతో ఈ అయిదు ప్రాణులు ధర్మ విమానమును అధిరోహించినవి. నీవు కూడా ఈ విమానమునధిరోహించుము.” ఇట్లు చెప్పిన నా మాటలను వినిన వీరభద్రవమహారాజు ధర్మ విమానమధిరోహించి ఆరవ భాగమును స్వీకరించెను. ఇట్లు నీకు తటాకమును నిర్మించుట వలన కలుగు ఫలమునంతయు తెలిపితిని. ఈ కథను వినిన వారు పుట్టిన నాటి నుండి మరణించువరకు చేసిన పాపములనుండి విముక్తిని పొందెదరు. ఈ చరితమును శ్రద్దతో వినినవారు చదివిన వారు కూడా తటాకమును నిర్మించుట వలన కలుగు ఫలమును పొందెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున ధర్మాఖ్యానమున పన్నెండవ అధ్యాయము సమాప్తము.