56 - పురుషోత్తమ మహాత్మ్యమ్

వసురువాచ :-

అన్యచ్చృణు మహాభాగే తస్మిఞ్రచ్రీ పురుషోత్తమే

తీర్థప్రజం మహత్ పుణ్యం దర్శనాత్పాపనాశనమ్

అనన్తాఖ్యం వాసుదేవం దృష్ట్వా భక్త్యా ప్రణమ్య చ

సర్వపాపవినిర్ముక్తో నరో యాతి పరం పదమ్

శ్వేత గంగాం నరస్స్నాత్వా యః పశ్యేచ్వ్యేత మాధవమ్

మత్స్యాఖ్యం మాధవం చైవ శ్వేత ద్వీపం స గచ్ఛతి

తుషార ప్రతిమం శుద్ధం శంఖ చక్రగదాధరమ్

సర్వ లక్షణ సంయుక్తం పుండరీకాయతేక్షణమ్

శ్రీవత్స వక్షసా యుక్తం సుప్రసన్నం చతుర్భుజమ్

వనమాలావృతోరస్కం ముకుటాంగదధారిణమ్

పీతవస్త్రం సుపీనాంసం కుండలాభ్యా మలంకృతమ్

కుశాగ్రణాపి రాజేన్ద్ర శ్వేతగాంగేయమేవచ

స్పృష్ట్వా స్వర్గం గమిష్యంతి విష్ణుభక్తాస్సమాహితాః

యస్త్వీమాం ప్రతిమాo పశ్యే న్మాధవాఖ్యాం శశిప్రభామ్

శంఖగోక్షీర సంకాశా మశేషాఘవినాశినీమ్

తాం ప్రణమ్య సకృద్భక్త్యా పుండరీక నిభేక్షణమ్

విహాయ సర్వకామాన్యై విష్ణులోకే మహీయతే

మన్వన్తరాణి తత్రైవ దేవకన్యాభిరావృతః

గీయమానశ్చ గంధర్యై సిద్ధవిద్దాధరార్చితః

భునక్తి విపులాన్భోగా న్యధేష్టం దైవతైస్సహ

చ్యుత స్తస్మాదిపగత్య మానుష్యే బ్రాహ్మణో భవేత్

వేదవేదాంగ విద్దీమాన్ భోగవాంశ్చర జీవితం

గజాశ్వరధ యానాడ్యో ధనధాన్యవృతశ్ఛుచిః

రూపవాన్భహు భాగ్యశ్చ పుత్ర పౌత్ర సమన్వితః

పురుషోత్తమం పునః ప్రాప్య వటమూలేధ సాగరే

త్యక్త్యా దేహం హరిం స్మృత్వా తతశ్శాంతం పదం వ్రజేత్

శ్వేత మాధవ మాలోక్య సమీపే మత్స్య మాధవమ్

ఏకార్ణవే జలే పూర్వం రూపం రోహిత మా స్థితః

వేదానాం హరణార్థాయ రసాతల తలేస్థితః

చింతయిత్వా క్షితిం మత్స్యం తస్మింస్థానే వ్యవస్థితమ్

ఆధాయ తరుణం రూపం మాధవం మత్స్య మాధవమ్

ప్రణమ్య ప్రయతో భూత్వా సర్వానష్టాన్విముంచతి

ప్రయాతి పరమం స్థానం యత్రదేవో హరిస్స్వయమ్

కాలే పునరిహాయాతో రాజా స్యాత్పృధివీతలే

మత్స్య మాధవ మాసాద్య దురాధర్షో భవేన్నరః

దాతా భోక్తా భవేద్యోద్దా వైష్ణవ స్సత్య సంగరః

యోగం ప్రాప్య హరేః పశ్చాత్ తతో మోక్షమవాప్నుయాత్

మత్స్య మాధవ మహాత్య్మం మయా తే పరికీర్తితమ్

యం దృష్ట్యా బ్రహ్మతనయే సర్వాన్కామానవాప్నుయాత్

వసువు పలికెను :

శ్రీపురుషోత్తమ క్షేత్రమున మహాపుణ్య ప్రదమగు మరియొక తీర్థ వ్రజమును గూర్చి చెప్పెదను విముము. ఈ తీర్థ రాజ సందర్శనము పాపనాశకము. ఇచట అనన నామముతో నున్న వాసుదేవుని దర్శించి భక్తితో నమస్కరించి సర్వపాప వినిర్ముక్తుడై పరమ పదమును చేరును. శ్వేతగంగలో స్నానమాడి శ్వేతమాధవుని దర్శించవారు ఉత్తమగతిని పొందెదరు. మత్స్యనామముతో ఉన్న మాధవుని దర్శించిన వారు శ్వేతద్వీపమును పొందెదరు. తుషార ప్రతిముడు, శంఖచక్రగదాధరుడు, సర్వలక్షణ సంయుక్తుడు, పుండరీకాయతేక్షణుడు, శ్రీవత్స వక్షుడు, సుప్రసన్నుడు,చతుర్భుజుడు, వనమాలాకృతోరస్కుడు, ముకుటాంగదధారి, పీతవస్రుడు, సుపీనాంసుడు, కుండలాలంకృతుడు, అగు మత్స్య నామ మాధవుని దర్శించవలయును. శ్వేతగంగాజలమును కుశాగ్రముచే స్పృశించిననూ సావధానులగు విష్ణుభక్తులు స్వర్గమును చేరెదరు. ఇచట శశిప్రభగలది శంఖగోక్షీర సంకాశము, సకల పాపవినాశిని, యగు ఈ ప్రతిమను దర్శించి ఒకసారి భక్తిచే నమస్కరించి సర్వకామనలను విడిచి విష్ణులోకమున విరాజిల్లును. అచటనే అన్ని మన్వన్తరములు దేవకన్యలచే కూడి గంధర్వ గానములతో సిద్ద విద్యాధర పూజితుడై యధేష్టముగా దేవతలతో కలిసి సకల భోగములననుభవించును. పుణ్యక్షయమున ఆటనుండి భూలోకమున కొచ్చి మానవులలో బ్రాహ్మణునిగా పుట్టును. వేదవేదాంగములను తెలిసినవాడు, ధీమంతుడు, భోగి, దీర్ఘాయుష్యము కలవాడు, గజాశ్వరధవాహనముల పై వెళ్ళు వాడు, ధనధాన్య సమన్వితుడు, పవిత్రుడు, రూపవంతుడు, బహు భాగ్యవంతుడు, పుత్రపౌత్ర సమన్వితుడుగా నుండును. మరల పురుషోత్తమ క్షేత్రము చేరి సాగరమున నున్న వట వృక్షమూలమున శ్రీహరిని స్మరించుచు దేహమును విడిచి శాంతిధామమును చేరును. శ్వేతమాధవుని చూచి, తత్సమీపమున రోహిత రూపమును ధరించి వేద హరణము కొరకు రసాతలమున నుండెను. భూమి పై ఈ స్థానమున మత్స్య రూపముగా నున్న స్వామిని ధ్యానించి తరుణరూపముతో మత్స్య మాధవునిగా నున్న మత్త్యుని భక్తి చే నమస్కరించి సకల కష్టలములనుండి విముక్తుడగును. సాక్షి 'త్తుగా శ్రీహరీయున్న పరమ పదమును చేరును. యధాకాలమున మరల ఇటకొచ్చి భూమండలమున రాజుగా పుట్టును. మరల మత్స్య మాధవమును చేరి దురాధరుడగును. దాత, భోక్త, యోద్ద, విష్ణుభక్తుడు, సత్యపాలకుడు, అగును. తరువాత శ్రీహరి యోగమును పొంది మోక్షమును పొందును. ఇట్లు నీకు మత్స్య మాధవ మాహాత్మ్యమును వివరించితిని. ఈ క్షేత్రమును దర్శించిన వారు సర్వాభీష్టములను బడయగలరు.

మార్జనం తత్ర వక్ష్యామి మార్కండేయ హ్రదే శుభే

భక్త్యా తు తన్మనా భూత్వా పురాణం పుణ్యముక్తిదమ్

మార్కండేయ హ్రదే స్నానం సర్వకాలం ప్రశస్యతే

చతుర్ధశ్యాం విశేషేణ సర్వ పాప ప్రణాశనమ్

తద్వత్స్నానం సముద్రస్య సర్వకాలం ప్రశస్యతే

పౌర్ణమాస్యాం విశేషేణ హయమేధ ఫలం లభేత్

పూర్ణిమా జ్యేష్ట మాసస్య జేష్టాఋక్షం యదాభవేత్

తదాగచ్చే ద్విశేషేణ తీర్థరాజం పరం శుభమ్

కాయవా జ్మన సైశ్శుద్ధ సద్భావోనన్య మానసః

సర్వద్వన్ద్వ వినిర్ముక్తో వీతరాగో విమత్సరః

కల్ప వృక్షం వటం రమ్యం యత్ర సాక్షాజ్ఞనార్ధనః

ప్రదక్షిణం ప్రకుర్వీత త్రీన్వారాన్సు సమాహితః

దృష్ట్వా నశ్యతి యత్పాపం సప్త జన్మ సముద్భవమ్

పుణ్యం ప్రాప్నోతి విపులం గతిమిష్టాం చ మోహిని!

తస్య నామాని వక్ష్యామి సప్రమాణం యుగే యుగే

వటం వటేశ్వరం శాంతం పురాణ పురుషం విదుః

వట స్యేతాని నామాని కీర్తితాని కృతానీతు

యోజనం పాదహీనంచ యోజనార్థం తదర్థకమ్

ప్రమాణం కల్పవృక్షస్య కృతాదిషు యధాక్రమమ్

పూర్వోక్తేన తు మంత్రేణ నమస్కృత్వా చ తం వటమ్

దక్షిణాభిముఖో గచ్ఛే ద్ధన్వంతరశతత్రయమ్

యత్రాసౌ దృశ్యతే చిహ్నం స్వర్గద్వారాo మనోరమమ్

సాగరాంతస్సమాకృష్టం కాష్ఠం సర్వగుణాన్వితమ్

ప్రణిపత్య తతస్తిష్ఠే త్పరిపూజ్య తతః పునః

ముచ్యతే సర్వపాపౌఘై సధా పాప గ్రహాదిభిః

ఉగ్రసేనః పురా దృష్ట్వా స్వర్గద్వారేణ సాగరమ్

గత్వాచమ్య శుచిస్తత్ర ధ్యాత్వా నారాయణం పరమ్

న్యసేదష్టాక్షరం మంత్రం పశ్చాద్దస్త శరీరయోః

ఓం నమో నారాయణాయేతి యం వదన్తి మనీషిణః

కిం కార్యంబహుభిర్మంత్రై ర్మనో విభవకారకైః

నమో నారాయణాయేతి మన్త్రస్సర్వార్థసాధకః

ఆపో నరస్య సూనుత్వా న్నారా ఇతి హ కీర్తితాః

విష్ణోస్తాస్త్వాలయం పూర్వం తేన నారాయణ స్మృతః

నారాయణ పరా వేదా నారాయణ పరా ద్విజా

నారాయణ పరం జ్ఞానం నారాయణ పరా క్రియా

నారాయణ పరో ధర్మో నారాయణ పరం తపః

నారాయణ పరం దానం నారాయణ పరం వ్రతమ్

నారాయణ పరా లోకా నారాయణ పరాస్సురాః

నారాయణ పరం నిత్యం నారాయణ పరంపదమ్

నారాయణ పరా పృధ్వీ నారాయణ పరం జలమ్

నారాయణ పరో వహ్నిః నారాయణ పరం నభః

నారాయణ పరో వాయు ర్నారాయణ పరం మనః

అహంకారశ్చ బుద్ధిశ్చ ఉభే నారాయణాత్మకే

భూతం భవ్యం భవిష్యచ్చ యత్కించి జ్జీవ సంజ్ఞితమ్

స్థూలం సూక్ష్మం పరం చైవ సర్వం నారాయణాత్మకమ్

నారాయణాత్పరం కించిత్ నేహ పశ్యామి మోహిని!

తేన వ్యాప్త మిదం సర్వం దృశ్యాదృశ్యం చరాచరమ్

ఆపోహ్యాయతనం విష్ణో స్సచా సావంభసాం పతిః

తస్మాదప్సు స ఇత్యేవం నారాయణ మఘాపహమ్

స్నానకాలే విశేషేణ చోపస్థాయ జలే శుచిః

స్మరేన్నారాయణం ధ్యాయే ద్దస్తే కాయే చ విన్య సేత్

ఓంకారం వామ కట్యాం తు సాకారం దక్షిణే తథా

రాకారం నాభిదేశేతు యకారం వామ బాహుకే

ణాకారం దక్షిణే న్యస్య యకారం మూర్ద్ని విన్య సేత్

అధశ్చోర్ద్వం చ హృదయే పార్వతః పృష్ఠతో గ్రతః

ధ్యాత్వా నారాయణం పశ్చా దారభేత్కవచం బుధః

ఇక ఇపుడు శుభప్రదమగు మార్కండేయ ప్రదమున చేయదగిన మార్జనమును వివరించేదను. ఈ మార్జనము భక్తిచే తన్మనస్కులై పుణ్యమును ముక్తిని ప్రసాదించు పురాతనమగు మార్జనమును చేయవలయును. మార్కండేయ ప్రదమున అన్నికాలములందు స్నానము విశేష ఫలప్రదముగా చెప్పబడినది. విశేషించి చతుర్దశీస్నానము సర్వపాపప్రణాశనముగా పేర్కొనబడినది. ఇట్లే సముద్ర స్నానము కూడా సర్వకాలములందు విశేష ఫలప్రదమే. పౌర్ణమిన సముద్రస్నానము అశ్వమేధ యాగ ఫలప్రదము. జ్యేష్ఠ పూర్ణిమన జ్యేష్ఠా నక్షత్రయోగమున్న నాడు విశేషించి ఈ తీర్థ రాజమునకు వెళ్ళ వలయును. కాయ వాజ్మానసములచే పరిశుద్దుడై, రాగమును వీడి, మాత్సర్యమును వదిలి, రమ్యమగు వట కల్ప వృక్షమును సాక్షాత్తుగా జనార్థన రూపమున నున్న దానిని సావధానముతో మూడు మార్లు ప్రదక్షిణము నాచరించవలయును. ఈ కల్ప వృక్షదర్శన మాత్రమున ఏడు జన్మల పాపములు నశించును. విపుల మగు పుణ్యము ఉత్తమ గతి లభించును. ఈ కల్ప వృక్షమునకు ప్రతియుగమున ప్రసిద్ధిని పొందిన నామములను చేప్పెదను. వటము, వటేశ్వరము, శాంతము, పురాణ పురుషుడు, ఈ నాముముల కృతాది యుగములందు చెప్పబడినవి. యోజనము, పాదహీనయోజనము, యోజనార్థము, తదర్ణము, కృతాదియుగములలో వట వృక్ష విస్తార ప్రమాణములు. పూర్వోక్త మంత్రముచే వట వృక్షమును నమస్కరించి, దక్షిణాభిముఖముగా మూడు వందల ధనుః ప్రమాణ దూరమును వెళ్ళవలయును. అచట మనోహరమగు స్వర్గ ద్వార చిహ్నము సాగరాంతర్గామమున ఆకర్షించబడు సర్వగుణాన్వితమగు కాష్ఠము కనిపించును. ఆ కాష్ఠమునకు నమస్కరించి చక్కగా పూజించి నిలువ వలయును. ఇట్లు ఆచరించినచోసర్వపాపముల నుండి పాపగ్రహాదులనుండి విముక్తుడగును. పూర్వ కాలమున ఉగ్రసేనుడు స్వర్గ ద్వారముచే సాగరమును సందర్శించి వెళ్ళి ఆచమనము చేసి శుచియై పరుడగు నారాయణుని ధ్యానము గావించి హస్త శరీర భాగములందు అష్టాక్షర మంత్రన్యాసమును గావించ వలయును. ‘ఓం నమో నారాయణాయ’ అను మంత్రమును జపించిన వారికి మనోవిభవ కారకములగు ఇతర మంత్రములచే పని యేముండును. ఓం నమో నారాయణాయ అను మంత్రము సర్వార్థసాధనము. జలములు నరసముత్పన్నములు కావున నారములనబడును. పూర్వము నారములే శ్రీ మహావిష్ణువునకు నివాస స్థానము కావున విష్ణువునకు నారాయణ నామము కలిగినది. వేదములు. నారయణ పరములు. బ్రాహ్మణులు నారాయణ పరులు. నారాయణ పరము జ్ఞానము. ప్రతికార్యము నారాయణ స్వరూపము. ధర్మము నారాయణ పరము. తపస్సు నారాయణ పరము. దానము నారాయణ పరము. వ్రతము నారాయణ పరము. సర్వలోకములు నారాయణ పరములు. దేవతలు నారాయణ పరులే. నిత్యము నారాయణ పరము. ప్రతిస్థానము నారాయణ పరము. భూమి నారాయణ పరమే. జలము అగ్ని, ఆకాశము, వాయువు నారాయణ పరములే. మనస్సు నారాయణ పరమే. బుద్ధి, అహంకారములు నారాయణ పరములే. భూతభవ్యభవిష్యత్తులు, సకల జీవ సంజ్ఞకములు, స్థూల సూక్ష్మములు, పరము అంతయూ నారాయణాత్మకమే. ఈ సృష్టిలో నారాయణునకంటే పరమైన దేదియూ లేదు. దృశ్యాదృశ్యము చరాచరమంతయు నారాయణునిచే వ్యాపించ బడియున్నది. శ్రీ విష్ణువునకు నివాసము జలములు. కావున శ్రీమహావిష్ణువు జలాధిపతి. కావుననే జలములలో శ్రీహరి యుండును. కావున నారాయణ స్వరూపములగు జలము సర్వపాపప్రణాశకము. విశేషించి స్నానకాలమున జలమున శుచియై నారాయణుని స్మరించి ధ్యానముచేసి హస్తములందు శరీరమునందు న్యాసమును గావించ వలయును. పోమకటియందు ఓంకారమును, దక్షిణకటియందు నాకారమును, నాభి దేశమున రాకారమును, వామ బాహువు నందు యకారమును, దక్షిణ భాహువు నందు సాకారమును, శిరస్సునందు యకారమును న్యాసమును చేయవలయును. అధోభాగమున, ఊర్థ్వ భాగమున హృదయమున, పార్శ్వములండు, పృష్ఠ భాగములందు, అగ్రభాగమున న్యాసమును కావించ వలయును. తరువాత నారాయణుని ధ్యానము చేసి, కవచము నారంభించవలయును.

పూర్వే మాం పాతు గోవిందో దక్షిణే మధుసూదనః

పశ్చిమే శ్రీధరో దేవః కేశవస్తు తథోత్తరే

పాతు విష్ణుస్తథాగ్నేయే నైరుతే మాధవోఽవ్యయః

వాయవ్యేతు హృషీకేశ స్తధేశానే చ వామనః

భూతలే పాతు వారాహ స్తధ్వోర్థ్వేచ త్రివిక్రమః

కృత్వైవం కవచం పశ్చా దాత్మానం చింతయేత్తతః

అహం నారాయణో దేవ శంఖ చక్రగదాధరః

ఏవం ధ్యాత్వా తదాత్మానం ఇమం మన్త్రము దీరయేత్

త్వమగ్నిర్ద్విపదాం నాధ రేతోధాః కామదీపనః

ప్రధాన స్సర్వ భూతానాం జీవానాం ప్రభురవ్యయః

అమృతస్యారణిస్త్వం హి దేవయోని రపాం పతే

వృజినం హర మే సర్వం తీర్థరాజ నమోస్తుతే”

ఏవముచ్ఛార్య విధివ తతస్స్నానం సమాచరేత్

అన్యధా బ్రహ్మ తనయే స్నానం తత్ర న శస్యతే

కృత్వాచాబ్ధైవతైర్మన్త్రై రభిషేకం చ మార్జనమ్

అంతర్జలే జపన్పశ్చా త్త్రిరావృత్యాఘమర్షణమ్

హయమేధో యధా దేవి! సర్వపాప హరః క్రతుః

తధాఘ మర్షణం చాత్ర సూక్తం సర్వాఘమర్షణమ్

ఉత్తీర్య వాససీ దౌతే నిర్మలే పరిధాయ చ

ప్రాణానాయమ్య చాచమ్య సంధ్యాం చోపాస్య భాస్కరమ్

ఉపొతిష్ఠేత్తతశ్చోర్ద్వం క్షిప్త్వాపుష్ప జలాంజలిమ్

ఉపస్థాయోర్ధ్వ బాహుశ్చ తల్లింగైర్భాస్కరం తతః

గాయత్రీం పావనీం దేవీం జపేదష్టోత్తరం శతమ్

అన్యాంశ్చసౌరమంత్రాన్హి జప్త్వా తిష్ఠన్సమాహితః

కృత్వా ప్రదక్షిణం సూర్యం నమస్కృత్యోపవిశ్యచ

స్వాధ్యాయం ప్రాజ్ముఖః కృత్వా తర్పయేద్దేవ మానవాన్

ఋషీన్ పితౄన్హి స్వీయాంశ్చ విధివన్నామగోత్రవిత్

తోయేన తిలమిశ్రేణ విధివత్సు సమాహితః

శ్రాద్దే హవన కాలే చ పాణినైకేన నిర్వపేత్

తర్పణేతూ భయం కుర్యా దేష ఏవ విధిస్సదా

అన్వారబ్ధేన సత్యేన పాణినా దక్షిణేన తు

తృప్యతామితి సువ్యక్తం నామగోత్రేణ వాద్యతః

కాయస్థీర్యస్తీలైర్మోహా త్కరోతి పితృతర్పణమ్

తర్పితాస్తేన పితర స్త్యజ్మాంస రుధిరాస్థిభిః

జలే స్థిత్వా స్థలే దత్తం స్థలే స్థిత్వా జలేర్పితమ్

నోపతిష్ఠతి తత్తోయం యధ్భూమ్యాం న ప్రదీయతే

పితృణామక్షయం స్థానం మహీ దత్తా విరించినా

తస్మాత్తత్రైవ దాతవ్యం పితృణాం ప్రీతిమిచ్ఛతా

భూమిస్తేన సముత్పన్నా భూమ్యాం చైవ తు సంస్థితమ్

భూమ్యాం చైవ లయం యాంతి భూమౌ దద్యాత్తతో జలమ్

ఆస్తీర్య కుశాన్సాగ్రా నావాహ్య స్వస్వమంత్రతః

ప్రాచీనాగ్రేషు వై దేవా న్యామ్యాగ్రేషు తథా పితృన్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తర భాగే మోహినీవసు సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే షట్పాంచాశత్తమోఽధ్యాయః.

పూర్వదిక్కున గోవిందుడు, దక్షిణమున మధుసూదనుడు, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున కేశవుడు కాపాడుగావుత. ఆగ్నేయమున విష్ణువు, నైరుతమున మాధవుడు, వాయవ్యమున హృషీకేశుడు, ఈశాన్యమున వామనుడు కాపాడు గావుత. భూతలమున వరాహస్వామీ, ఊర్థ్యమున త్రివిక్రముడు కాపాడు గావుత. ఇట్లు కవచమును ఆచరించి తరువాత ఆత్మస్వరూపమును చింతించవలయును. నేను శంఖచక్ర గదాధరుడగు నారాయణ దేవుడను. ఇట్లు ఆత్మ ధ్యానమును గావించి ఈ మంత్రమును పఠించవలయును.

“త్వమగ్ని ర్ద్విపదాం నాధ రేతోధాః కామదీపనః

ప్రధానస్సర్వ భూతానాం జీవానాం ప్రభురవ్యయః

అమృతస్యారణీ స్త్వంహి దేవయోని రపాం పతే

వృజినం హర మే సర్వం తీర్థరాజ నమోస్తుతే ”

అనునది మంత్రము. ఓద్విపాత్ పతీ! నీవు అగ్నివి. కామదీపకమగు రీతో నివాసము నీవే. సర్వభూతములలో ప్రధానుడవు. జీవులకు ప్రభువు నీవే. నీవు అవ్యయుడవు. అమృతమును ఉత్పత్తి స్థానము. దేవతలకు కారణ భూతుడవు. జలాధిపతివి నీవే. కావున నా సర్వ పాములను హరించుము. ఓ తీర్థ రాజా ! నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థము. ఇట్లు యధావిధిగా మంత్రమునుచ్చరించి తరువాత స్నానమును ఆచరించవలయును. ఇట్లు ఆచరించక చేసిన స్నానము సఫలము కాజాలదు. జలదేవతా మస్రములచే అభి షేకమును, మార్జనమును ఆచరించి నీటిలో అఘమర్షణ మంత్రమును మూడు మార్లు జపించ వలయును. అశ్వమేధ యాగము సర్వపాహరమగునట్లు అఘమర్షణ సూక్తము సర్వపాపహరము. తరువాత జలమునుండి తీరమునకు వచ్చి దౌతములు నిర్మలమగు వస్త్రములను ధరించి, ప్రాణాయామము నాచరించి, ఆచమనము గావించి, సంధ్యావందనము చేసి సూర్యుని పూజించి, ఊర్థ్యమునకు పుష్ప జలాంజలిని చల్లి ఉపాసన గావించ వలయును. ఇట్లు ఉపస్థానము గావించి, ఊర్థ్వ బాహువుగా నిలిచి సూర్యుని ఆ చిహ్నములతో సేవించి, పరమ పవిత్రమగు గాయత్రీ మంత్రమును నూటా ఏనిమిది మార్లు జపించవలయును. సావధానముగా నిలిచి ఇతర సౌర మంత్రములను జపించి ప్రదక్షిణము నాచరించి, సూర్యునికి నమస్కరించి, కూర్చొని ప్రాజ్ఞునిగా స్వాధ్యాయమును అధ్యయనము గావించి దేవతలకు, మానవులకు తర్పణము గావించవలయును. స్వఋషులను, పితరులను యధావిధిగా నామగోత్రములతో నువ్వులు కలిపిన జలముచే తర్పణముగావించవలయును. హవన కాలమున, శ్రాద్ధ కాలమున ఒక హస్తముతో తర్పణము గావించవలయును. తర్పణమునుమాత్రము రెండు హస్తములచే చేయవలయును. ఇదియే అన్నివేళలలో విధి. సవ్యముగా అన్వారబ్దమగు దక్షిణహస్తముతో నామగోత్రములను చ్చరించి తృప్తి చెందుగాక అని పలికి. వాజ్నియమముచే, స్థిర కాయముచే తిలములచే తర్పణము గావించిన త్వఙ్మాంసరుధిరాస్తులచే తృప్తి పొందెదరు. నీటిలోఉండి భూమి పై నిచ్చిన తర్పణము, భూమి పై నుండి జలమున నిచ్చిన తర్పణము పితరులకు చేరదు. కావున భూమి మీద నిలిచి భూమి మీదనే తర్పణమును గావించవలయును. పితరులకు అక్షయ స్థానము భూమి అని బ్రహ్మ భూమిని ప్రదానముగావించెను. కావున పితరుల ప్రీతిని గోరువారు భూమి మీదనే తర్పణమును గావించవలయును. నీటిలోనుండియే భూమి పుట్టినది. భూమియందే జలముండును. భూమియందే జలము లీనమగును. కావున జలమును భూమియందే విడువవలయును. కొనలున్న దర్భలను భూమియందు పరిచి స్వస్వమంత్రములచే ఆవాహన చేయవలయును ప్రాచీనాగ్రములగు దర్బలందు దేవతలను, దక్షిణాగ్ర దర్బములందు పితరులను ఆవాహన చేయవలయున

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగమున మోహినీవసు సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యాబది యారవ అధ్యాయము.