96 - శ్రీ మద్భాగవతానుక్రమణీ నిరూపణమ్

బ్రహ్మోవాచ :-

మరీచే శృణు వక్ష్యామి వేదవ్యాసేన యత్కృతమ్

శ్రీమద్భాగవతం నామ పురాణం బ్రహ్మ సమ్మితమ్

 తదష్టాదశసాహస్రం కీర్తితం పాపనాశనమ్

సురపాదపరూపోలియం స్కందైర్ధ్వాదశభిర్యుతః

 భగవానేవ విప్రేగ్ధ విశ్వరూపీ సమీరితః

తత్ర తు ప్రధమ స్కంధే సూతర్షణాం సమాగమే

వ్యాసస్య చరితం పుణ్యం పాండవానాం తధైవ చ

పారీక్షితముపాఖ్యానమితీదం సముదాహృతమ్

 పరీక్షిచ్ఛుకసంవాదే సృష్టిద్వయనిరూపణమ్

 బ్రహ్మనారదసంవాదే దేవతాచరితామృతమ్

పురాణలక్షణం చైవ సృష్టి కారణ సంభవః

 ద్వితీయోయం సముచిత స్స్కంధో వ్యాసేన ధీమతా

చరితం విదురస్యాథ మైత్రేయస్య సంగమః

సృష్టి ప్రకరణం పశ్చాద్ర్బహ్మణః పరమాత్మనః

కాపీలం సాంఖ్యమప్యత్ర తృతీయోయముదాహృతః

 సత్యాశ్చరితమాదౌ తు ధ్రువస్య చరితం తతః

పృధోః పుణ్యసమాఖ్యానం తతః ప్రాచీనబర్హిషమ్

 ఇత్యేష తుర్యో గదిలో విసర్జే స్కంధ ఉత్తమః

 ప్రియవ్రతస్య చరితం తద్వంశ్యానాం చ పుణ్యదం

బ్రహ్మండాంతర్గతానాం చ లోకానాం వర్ణనం తతః

నరకస్థితికిత్యేషా సంస్థానే పంచమో మతః

అజామిలస్య చరితం దక్ష సృష్టి నిరూపణమ్

వృత్రాఖ్యానం తతః పశ్చాన్మరుతాం జన్మపుణ్యదమ్

షష్ణోయముదితః స్కంధ వ్యాసేన పరిపోషణే

ప్రహ్లాద చరితం పుణ్యం వర్ణాశ్రమ నిరూపణమ్

 సప్తమో గదితో వత్స వా సనా కర్మకీర్తనే

గజేన్తమోక్షణాఖ్యానం మన్వన్తర నిరూపణే

 సముద్ర మథనం చైవ బలివైభవ బంధనమ్

మత్స్యావతార చరితమష్టమోయం ప్రకీర్తితః

 సూర్యవంశ సమాఖ్యానం సోమ వంశ నిరూపణమ్

 వంశానుచరితే ప్రోక్తో నవమోరియం మహామతే

 కృష్ణస్య బాల చరితం కౌమారస్య వ్రజస్థితిః

కైశోరం మధురాస్థానం యౌవనం ద్వారకాస్థితిః

 భూభార హరణం చిత్ర నిరోధే దశమ స్సృతః

నారదేన తు సంవాదో వసుదేవస్య కీర్తితః

 యదోశ్చ దత్తాత్రేయణ శ్రీ కృషైనోద్దవస్య చ

యాదవానాం మిధంతశ్చ ముక్తావేకాదశస్స్మృతః

భవిష్య కలినిర్దేశో మోక్ష రాజ్ఞః పరీక్షితః

వేదశాఖాప్రణయనం మార్కండేయతపః క్రియా

సౌరీవిభూతరుదితా సాత్వతి చ తతః పరమ్

పురాణసంఖ్యాకథన మాశ్రయే ద్వాదశో హ్యయమ్

ఇత్యేవం కథితం వత్స శ్రీ మద్భాగవతం తవ

వకుశ్నోతుశోపదేష్టురనుమోదితురేవ చ

 సాహాయ్యకర్తుర్గతం భక్తి భుక్తి విముక్తిదమ్

ప్రౌష్టాపద్యాం పూర్ణిమాయాం హేమసింహ సమన్వితమ్

దేయం భాగవతాయేదం ద్విజాయ ప్రీతి పూర్వకమ్

సంపూజ్య వస్త్ర హేమాద్యైర్భగవద్భక్తిమిచ్ఛతా

 యోప్యనుక్రమణిమేతాం శ్రావయేచ్చణుయాత్తథా

 స పురాణశ్రవణజం ప్రాప్నోతి ఫలముత్తమమ్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్థపాదే శ్రీ మద్భాగవతానుక్రమణీనిరూపణం నామ షణ్ణవతితమోధ్యాయః.

బ్రహ్మ పలికెను :-

ఓ మరీచీ ! వేదవ్యాస మహర్షిచే చేయబడి బ్రహ్మసమ్మితమగు శ్రీమద్భాగవత మహాపురాణమును చెప్పెదను వినుము. శ్రీ మద్భాగవతము పదునెనిమిది వేల శ్లోకములు కలది. సకల పాప నాశకము. కల్ప వృక్షము వంటిది. ద్వాదశ స్కంధములు కలది. భగవంతుడే విశ్వరూపముగా చెప్పబడినది. ప్రథమ స్కంధమున సూత మహాముని ఇతర ఋషుల సమాగమమున పవిత్రమగు వ్యాస చరితము, పాండవ చరితము పరీక్షిచ్చరితము చెప్పబడినది. ఇక ద్వితీయ స్కంధమున పరీక్షిచ్ఛుక సంవాదమున సృష్టి ద్వయ నిరూపణము, బ్రహ్మ నారద సంవాదమున దేవతా చరితామృతము, పురాణ లక్షణము, సృష్టికారణ సంభవము చెప్పబడినది. తృతీయ స్కంధమున విదుర చరిత్రము, విదురునకు మైత్రేయ సమాగమము, పరమాత్మయగు బ్రహ్మసృష్టి ప్రకరణము కాపిల సాంఖ్య యోగము చెప్పబడినది. నాలుగవ స్కంధమున సతీ చరితము, ధ్రువ చరితము, పృథుచరితము, ప్రాచీన బర్హిష చరిత్రము చెప్పబడినది. అయిదవ స్కంధమున ప్రియవ్రత చరితము, తద్వంశ చరితము, బ్రహ్మండాంతర్గ లోకవర్ణనము, నరకస్థితి చెప్పబడినది. ఆరవ స్కంధము ఆజామిల చరితము దక్ష సృష్టి నిరూపణము, వృత్రాసుర చరితము, మరుత్తుల జన్మ, చెప్పబడినది. సప్తమ స్కంధమున పవిత్రమగు ప్రహ్లాద చరిత్రము, వర్ణాశ్రమ నిరూపణము, చెప్పబడినవి. అష్టమ స్కంధమున గజేస్త్ర మోక్షోపాఖ్యానము, మన్వన్తర నిరూపణమున సముద్ర మథనము, బలివైభవము, బంధకము మత్స్యావతార చరితము చెప్పబడినది. నవమ స్కంధమున సూర్యవంశ చరిత్ర, చంద్ర వంశ నిరూపణము వంశాను చరితమున చెప్పబడినది. దశమ స్కంధమున కృష్ణ బాల చరితము కౌమారమున వ్రేపల్లెలో నుండుట, కైశోరములో మధురలో నుండుట, యావనమున ద్వారకా నివాసము, యుద్ధమున భూ భార హరణము చెప్పబడినది. ఏకాదశ స్కంధమున వసుదేవ నారద సంవాదము, దత్తాత్రేయ యదు సంవాదము, శ్రీ కృష్ణోద్ధవ సమాగము, యాదవాన్తము చెప్పబడినది. ద్వాదశ స్కంధమున భవిష్య కలి నిర్దేశము, పరీక్షిన్మోక్షము, వేద శాఖా ప్రణయనము, మార్కండేయ తపస్సు, సౌర విభూతి, సాత్వతీ వీభూతి, పురాణ సంఖ్యాకథనము చెప్పబడినది. ఇట్లు శ్రీ మద్బాగవతమును చెప్పితిని. చెప్పువానికి, ఉపదేశించు వానికి, వినువానికి, ఆమోదించువానికి, సహాయము చేయువానికి కూడా భక్తి భుక్తి ముక్తిని కలిగించును. భాద్రపద పూర్ణిమనాడు హేమ సింహాసన సమన్వితముగా భాగవతుడగు బ్రాహ్మణునకు దానము చేయవలయును. వస్త్ర హోమాదులచే పూజించి భగవద్భక్తిని కోరువాడు ఈ భాగవతాను క్రమణిని చెప్పిననూ వినిననూ భాగవత పురాణ శ్రవణ ఫలమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున శ్రీమద్భాగవతాను క్రమణీ నిరూపణమను తొంబది యారవ అధ్యాయము.