నారద మహా పురాణము
64 - అధ్యాయము
సనత్కుమార ఉవాచ :-
అథ జీవస్య పాశాఘచ్ఛేదనాయేష్ట సిద్ధిదమ్,
దీక్షావిధిం ప్రవక్ష్యామి మస్త్రసామర్ధ్యదాయకమ్.
దివ్యం భావం యతో దద్యాక్ష్ త్కిణుయాద్దురితాని చ,
అతో దీక్షేతి సా ప్రోక్తా సర్వాగమవిశారదైః.
మననం సర్వవేదిత్వం త్రాణం పంపార్యనుగ్రహః,
మననాత్రాణధర్మత్వాన్మన్తమిత్యభిధీయతే.
స్త్రీపుంనపుంపకొత్మాన ప్లే మంత్రాస్తు త్రిధామతః,
స్త్రీమంత్రాస్తు ద్వితాస్త్రాప్స్యుః పుంమనా హుంఫడంతకాః.
క్లీబాశ్చెవ నమోంతాప్స్యూర్మంత్రాణాం జాతయప్స్మృతాః,
పుందైవతాస్తు మంత్రాస్స్యుర్విద్యాషీదైవతా మతాః.
షట్సుకర్మసు ప్రశస్త్రాస్తే మనవస్త్రి విధాః పునః,
తారాంత్య రేఫః స్వాహాపు తత్రాగ్నేయాస్సమీరితాః.
సౌమ్యాప్తు భృగుపీయూషబీజాఢ్యాః కథితా మునే,
అగ్నీషోమాత్మ కో హ్యేవం మంత్రా ప్లేయా మనీషిభిః.
బోధమాయాంతి చాగ్నేయా శ్వసనే పింగలాశ్రితే,
సౌమ్యాశ్చైవ ప్రబుధ్యంతే వామే వహతి మారుతే.
పర్వే మంత్రాః ప్రబుధ్యంతే వాయా నాడిద్వయాశ్రితే,
స్వాపకాలే తు మన్తస్య జహానర్థఫలప్రదః.
ప్రత్యేకం మస్త్రముచ్చార్య నావ్యానాం తానముచ్చరేశ్,
అనులోమే బిందుయుక్తా న్విలోమే పర్గపంయుతాన్.
జప్తో వై యది ప వై దైవం ప్రబుద్ధః క్షిప్రసిద్ధిదః,
అనయా మాలయా జట్టే దుష్టమంత్రోపి సిద్ధ్యతి.
క్రూరే కర్మణి చాగ్నేయాః సౌమ్యా సౌమ్యా ఫలప్రదాః,
శాంతజ్ఞానేతి రౌద్రౌయ శాంతిజాతిసనున్వితః.
శాంతోసి రౌద్రతామేతి హుం ఫట్ పల్లవయోజనాత్,
ఛిన్నాదిదోషయుక్తా మే నైవ రక్షంతి సాధనమ్.
చిన్నో రుద్దశ్శక్తిః హీనస్తత శ్చైవ పరాజ్ముఖః,
కర్ణహీనో నేత్రహీనః కీలితసుంఖితస్తథా.
దగ్ధపస్తశ్చ భీతశ్చ మలినశ్చ తిరస్కృతః,
భేదితశ్చ పుషుప్తశ్చ మదోన్మత్తశ్చ మూర్ఛితః.
హతవీర్యో భ్రాంతపంజ్ఞః ప్రధ్వస్తో బాలకస్తథా,
కుమారో యువా ప్రౌఢ వృద్ధో నిస్ప్రింశకర్తథా.
నిర్చీజ సిద్ధిహీనశ్చ మందః కూడో విరంశవః,
పత్త్వకోవః కేవరశ్చ బీజ హీనశ్చ ధూమితకి.
ఆలింగితో మోహితశ్చ క్షుధార్తశ్చాతిదీప్తకః,
అంగహీనశ్చాతివ్రుద్ధశ్చాతిక్రూరో క్రీడితిస్తది.
ప్రశాంతమానపస్థానభ్రష్టశ్చ వికల స్తధా,
అతివృద్ఘ్వాతిని స్నేహః పీడితశ్చ తథా పునః.
దోషి హ్యేతే పమాఖ్యాతా వక్ష్యామ్యేషాం చ లక్షణమ్,
పంయుక్తం వియుక్తం వా త్రిధా వా స్వరసంయుతమ్.
మనోర్యస్యాదిమధ్యాంతే వహ్నిబీజం తథోచ్యతే,
చతుర్ధా పంచధా వాపి ప మస్త్రశ్చిన్నసంజ్ఞకః.
మనోర్యస్యాదిమధ్యాంతే భూబీజద్వయముచ్యతే,
స తు రుద్దే మనుగ్లేయో హ్యతి క్లేశేన సిద్దిదః.
తారవర్మ త్రయా లక్ష్మీరేవం హీనస్తు యో మనుః,
శక్తి హీనస్స విజేయశ్చిరకాలఫలప్రదః.
కామబీజం ముఖే మాయా హ్యాంతే చైవాంకుశం తథా,
అసౌ పరాజ్ముఖో జేయో భజతాం చిరసిద్ధిదః.
ఆదిమధ్యావసానేషు పకారో దృశ్యతే యది,
పమనో బధిరః ప్రోక్తః క షైనాల్పఫలప్రదః.
పంచార్లో యది రేఫార్కబిందువర్జితవిగ్రహః,
నేత్రహీనపు విశ్లేయః క్లేశేనాపి న పిదః.
ఆదిమధ్యావసానేషు హంసః ప్రాసాదవాగ్ధమో,
హు పేన్దుర్వా పకారోవా ఫకారో వర్మ వా పునః.
మాప్రా నమామి చ పదం నాస్తి యస్మిన్స కేలితః,
ఏకం మధ్యే ద్వయం మూర్ధ్ని యస్మిన్న స్థలకారకౌ.
న విద్యేతే పమశ్రస్తు స్తంభితప్సిద్ధిరోధకృత్,
అగ్నిః పవనసంయుక్తో మనోర్యస్య తు మూర్ధని.
ససార్లో దృశ్యతే యస్తు స మంత్రో దగ్ధపంజ్ఞకు,
అస్త్రం ద్వాభ్యాం త్రిభిన్షడ్భిరష్టాభిర్దశ్యతేఋక్షరైః.
తస్తస్స మంత్రో విజ్జీయో ముఖే తారవివర్జితః,
హకారశ్శక్తిరథవా భీతో మస్త్రప్ప ఏవ హి.
మనోర్యస్యాదిమధ్యాంతే స్యాచ్ఛకారచతుష్టమమ్,
మలినస్తు ఏ విషైయో హ్యతి శేన సిద్ధిదః.
దార్ణో యస్య మనోర్మధ్యే మూర్ఖ క్రోధయుగం తథా,
అస్త్ర చాస్తిపమన్తస్తు తిరస్కృత ఉద్రితః.
మ్వోద్వయం హృదయం శీర్ష వశడౌషట్క మధ్యమః,
యస్యస్యాద్భేదితో మన్తస్త్యాజ్యః క్లిష్టఫలప్రదః.
త్ర్యక్షరో హుసహీనో యః సుషుప్తః కీర్తితస్తు సః,
విద్యా వాప్యథవా మంత్రో భవేత్సప్తదశాక్షరః.
షటకార పంచకాదిర్యో మదోన్మత్తస్తు ప స్మృతః,
యస్య మధ్యే స్థితం చాస్త్రం పమంత్రో మూర్ఛితస్స్మృతః.
విరామస్థానగం చాస్త్రం హతవీర్యస ఉచ్యతే,
మన్తస్యాదౌ చ మధ్యే చ మూఢి చాస్త్ర చతుష్టయమ్.
జ్ఞాతవ్యో భ్రాస్త ఇత్యేష యస్స్యాదష్టాదశాక్షరః,
పునర్వింశతివర్ణో వా యో మస్త్రాప్స్వరసంయుతః.
హృల్లేఖాంకుశబీజాఢ్యః ప్రధ్యస్తస్స తు కథ్యతే,
సప్తార్ణో బాలమంత్రస్తు కుమార్ వసువర్ణవాన్.
షోడశార్జ్ యువా ప్రౌఢశ్చత్వారింశతివర్ణకః,
త్రింశద్వర్ణశ్శతుష్టష్టివర్ణశ్చాపి శతాక్షరః.
చతుశ్శతాక్షరో మనో వృద్ధ ఇత్యభిధీయతే,
నవార్ణస్తారసంయుక్తో మనో నిస్ప్రింశ ఉచ్యతే.
యస్యాంతే హృదయం ప్రోక్తం శిరో మనోథ మధ్యగః,
శిఖావర్మ చ యస్యాంతే నేత్రమస్త్రం చ దృశ్యతే.
శివశక్త్యార్ణ హీనో వో నిర్జీజప్స మనుస్మృతః,
ఆద్యస్తమధ్యే ఫట్కాగష్ణోగా యస్మినదృశ్యతే.
సమనుస్సిద్ధిహీనస్స్యాత్ మందః పంక్త్యక్షగో మనుః,
కూట ఏకాక్షరో మస్త్రప ఏవోక్తో నిరంశకః.
ద్వివర్ణస్పత్తహీనస్స్యాత్కేకరశ్చతురక్షరః,
షడ్వర్ణో బీజహీనో వా సార్థసప్తాక్షర్వోపి వొ.
సార్ధద్వాదశవర్లో వా ధూమితో విన్షితస్తు పః,
పార్థబీజత్రయయుతో మంత్రో వింశతివర్ణవాన్.
త్రింశద్వర్ణ శ్చైవ వింశద్వర్ణశ్చాలింగితస్తు పః,
యో నుంతో దంతవర్ణస్తు మోహితస్స తు కీర్తితః.
చతుర్వింశతివర్ణో వా పస్తవింశతివర్ణవాన్,
క్షుధార్తస్స తు విషైయో మస్త్రసిద్ధివివర్జితః.
ఏకాదశాక్షరో వాపి పంచవింశతివర్ణకః,
త్రయోవింశతివర్ణో వా సమనుఝృప్తపంజ్ఞకః.
షడ్వింశత్యక్షరో వాపి షట్తోంశద్వర్ణక్వోపి వా,
ఏకోనత్రింశద్వర్లో వా మన్తో హీనాంగకప్స్మృతః.
అష్టావింశతివర్లో వా తథైకత్రింశదర్ణకః,
అతిక్రూరప్ప విజేయోభిలకర్మసు గర్తితః.
చత్వారింశత్సమారభ్య త్రిషష్ఠ్యంతస్తు యో మనుః,
క్రీడితస్స తు విజ్ఞేయస్సర్వకర్మసు న క్షమః.
పంచషష్ఠ్యక్షరా మన్హా జ్జీయా వై శాంతమానసాః,
పంచషష్ణర్ణమారభ్య నవనందాక్షరావధి.
యే మస్త్రాస్తే తు విష్ణోయాసానభ్రష్టా మునీశ్వర,
త్రయోదశార్ణా యే మన్హాషిధ్యర్థాశ్చ తథా పునః.
వీవలా స్తే సమాఖ్యాతాస్స్వరతస్త్రవిశారదైః,
శతం సార్థశతం వాపి శతద్వయమధాపీ వా.
ధ్వనవత్యేక హీనోవా శతత్రయమథా ఒపి వా,
యే మంత్రా వర్ణసంఖ్యాకా వి స్నేహా ప్రకీర్తితాః.
చతుశ్శతం సమారభ్య సహస్రాబ్లావధి ద్విజ,
అతివృద్ధాః ప్రయో గేషు శిధిలా ప్లే పమీరితాః.
పహప్రవర్ణాదధి మంత్రా స్తే పీడితాహ్వయాః,
తదూర్థ్వం చైవ యే మంత్రాసోత్రరుపొస్తు తే స్మృతాః.
ఏవంవిధాస్సమాఖ్యాతా మనవో దోషసంయుతాః,
దోషానేతానవిజ్ఞాయ మన్హానేతాన్షసంతి యే.
సిద్ధిర్న జాయతే తేషాం కల్పకోటిశతైరపి,
భిన్నాదిదోషదుష్టానాం మంత్రాణాం సాధనం బ్రువే.
సనత్కుమార మహార్షి పలికెను:- ఇపుడు జీవుని పొశబంధనచ్చేదనమును చేయు, ఇష్టసిద్ధిని కలిగించు, మంత్రసామర్థ్యదా యకమగు దీక్షావిధిని చెప్పెదను. దివ్యభావము నిచ్చునది. దురితములను క్షయింప చేయునది కావున సర్వాగమవిశారదులు దీక్ష యనుచున్నారు. మననమనగా సర్వార్ధ వేదిత్వము, త్రాణమునగా సంసారులను అనుగ్రహించుట. మననము చేయుట రక్షాధర్మము కలిగి యుండుట వలన మన్తమనబడుచున్నది. ఈ మంత్రములు స్త్రీపుంనపుంసకరూపములుగా మూడు విధములుండును. రెండు అకారములు అంతమందు గల మంత్రములు, స్త్రీ మంత్రములు. హుంఫట్ అనునది అంతమందు కలవి పుంమంత్రములు. నమః అను పదము అంతమందు కలవి క్లీబ మంత్రములు. పుందైవతములు మంత్రములని, స్త్రీ దైవతములు విద్యలని అనబడుచున్నవి. ఈ రెండు షట్కర్మలలో ప్రశస్తములు. ఈ మంత్రములు మరల మూడు విధములు. లూణాంత్య రేఫలు గలవి. స్వాహాకారములు కలవి ఆగ్నేయములుగా చెప్పబడుచున్నవి. భృగు షీయూష బీజమంత్రములు సౌమ్యములనబడుచున్నవి. అనగా సోమదేవతాత్మక మంత్రములు. ఇట్లు మంత్రములు అగ్నిషోమాత్మ కములని పండితులు తెలియుదురు. వాయువు పింగళనాడిని ఆశ్రయించినపుడు ఆగ్నేయమంత్రములు జాగృతములగును. సోమదేవతాక మంత్రములు వాయువు వామ భాగనాడుల నాశ్రయించు నపుడు మేల్కొనును. వాయువు నాడిద్వయము నాశ్రయించినపుడు అన్ని మంత్రములు ప్రబుద్దములగును. మంత్రము నిద్రించియున్నపుడు జపించుట వలన అనర్థ ఫలమును కలిగించును. ప్రత్యేక మంత్రమును ఉచ్చరించీ సవ్యములనుచ్చరించవలయును. అనులోమమున బిందుయుక్తములనుగా, విలోమమున విసర్గయుక్తముగా జపించినచో ఆ మంత్రము ప్రబుద్దమై శీఘ్రసిద్దిప్రదమగును. ఇట్లు ఈ మాలచే జపించినచో దుష్టమంత్రము కూడా సిద్ధి నొసంగును. క్రూర కర్మలయందు అగ్ని మంత్రములను, సౌమ్యకర్మలయందు సోమమంత్రములను జపించవలయును. శాంతములు రౌద్రములు అని మంత్రములు రెండు విధములు. శాంతమంత్రమైనను, హుంఫట్ అను దానిని చేర్చినచో రౌద్రత్వమును పొందును. భిన్నాది దోషయుక్తములైన మంత్రములు సాధకుని రక్షించజాలవు. భిన్నము, రుద్దము, శక్తి హీనము, పరాఙ్ముఖము, కర్ణహీనము, నేత్రహీనము, కీలితము, స్తంభితము, దగ్ధము, ప్రస్తము, భీతము, మలినము, తిరస్కృతము, భేదితము, సుషుప్తము, మదోన్మత్తము, మూర్ఛితము, హతవీర్యము, భ్రాంతసంజ్ఞము, ప్రధ్వస్తము, బాలకము, కుమారము, యువా, ప్రౌఢము, వృద్దము, నిస్ప్రింశకము, నిర్భీజము, సిద్ది హీనము, మందము, కూటము, నిరంశకము, సత్తహీనము, కేకరము, బీజ హీనము, ధూమీతము, ఆలింగితము, మోహితము, క్షుధార్తము, అతిదీప్తకము, అంగహీనము, అతిక్రుద్ధము, అతిక్రూరము, బ్రీడితము, ప్రశాంతమానసము, స్థానభ్రష్టము, వికలము, అతివృష్టము, అతని స్నేహము, పీడితము అని ఇవి నలుబది తొమ్మిది దోషములు. ఇపుడు ఈ దోషముల లక్షణములను చెప్పెదను. సంయుక్తము కాని వియుక్తము కాని మూడు విధముల స్వరములచే సంయుతమైనది మంత్రము యొక్క ఆదిమధ్యాంతములలో వహ్ని బీజము చెప్పబడినచో, ఈ బీజము కూడా నాలుగు విధములుగా కాని అయిదు విధములుగా కాని చెప్పినచో ఆ మంత్రము భిన్నమనబడును. మంత్రము యొక్క ఆదిమధ్యాంతములలో రెండు భూబీజములు చెప్పబడినచో ఆ మంత్రము రుద్దమనబడును., అతికష్టముచే సిద్ది నొసంగును. తారవర్మ త్రయము, లక్ష్మి లేని మంత్రము శక్తి హీనమనబడును. చాలాకాలమునకు ఫలము నొసంగును. ముఖమున కామబీజము, అంతమున మాయ అంకుశమున్నచో పరాజ్ముఖమనబడును. ఈ మంత్రము భజించు వారికి చాలాకాలమునకు సిద్దినిచ్చును. ఆదిమధ్యాంతభాగములయందు సకారము కనపడినచో ఆ మంత్రము బధీరమనబడును. చాలా కష్టముచే అల్ప ఫలమును ఇచ్చును. అయిదక్షరములు కలిగి, రేఫార్క బిందువులు లేని విగ్రహము కలదైనచో నేత్రహీనమనబడును. కష్టపడినను సిద్ధి నొసంగదు. ఆదిమధ్యాంతములలో హంసము ప్రాసాదవాగ్భవములు, హు పేందువు కాని సకారము కాని, ఫకారము కాని ..వర్మకాని మాప్రా, నమామి అను పదములు లేని మంత్రము కేలితమనబడును. మధ్యభాగమున ద్వయము, మూర్ధస్థానమున అస్త్రలకారములు లేని మంత్రము స్తంభితమనబడును. సిద్దిని అరికట్టును. మంత్రము యొక్క మూర్ధభాగమున పవనసంయుక్తమగు అగ్ని వర్ణములుండి, సార్లముగా నున్నచో దగ్గమనబడును. అస్త్రము, రెండు మూడు, ఆరు, ఎనిమిది అక్షరములు కలదిగా యుండినచో ఆ మంత్రము త్రస్తమనబడును.ఈ మంత్రము యొక్క ముఖము తారవర్జితముగా నుండును. హకారము శక్తిగా యున్న మంత్రము భీతమనబడును. ఆదిమధ్యాంత భాగమున నాలుగు మకారములున్నచో మలినమనబడును. అతి క్లేశమున సిద్ది కలుగును. మంత్రమధ్యము దొర్ణముగా నుండి, మూర్ధభాగమున క్రోధయుగము, అస్త్రమున్నచో తిరస్కృతమనబడును. ద్వయము హృదయము, శీర్షమున, మధ్యభాగమున వషట్ ఔషట్లు కలది భేదితమనబడును. అతి క్లేశముచే ఫలము నిచ్చును కావున భేదితమును విడువవలయును. మూడక్షరములు కలిగి హంసహీనమైనది సుషుప్తమనబడును. విద్యకాని మంత్రము కాని పదిహేడక్షరములు కలదిగా నుండవలయును. షట్కారపంచకము ఆది యందు కలది మదోన్మత్త మనబడును. మధ్యభాగమున అస్త్రములో కల మంత్రము మూర్ఛితమనబడును. విరామస్థానమున అస్త్రమున్నచో హతవీర్యమనబడును. మంత్రము యొక్క ఆదిమధ్య భాగములలో మూర్ధభాగమున నాలుగస్త్రములుడి పదునెనిమిది అక్షరములు కల దానిని భ్రాంతమందురు. ఇరువది వర్ణములు కలిగి స్వరసంయుతమై హృత్ ల్లేఖ అంకుశ బీజాడ్యముగా ఉన్న చో దానిని ప్రధ్వస్త మందురు. ఏడక్షరములగలది బాలమంత్రము. ఎనిమిదీక్షరములు కలది కుమార మంత్రము. పదునారక్షరములు కలది యువమంత్రము. నలుబది యక్షరములు కలది ప్రౌఢ మంత్రము. ముప్పది, అరువది నాలుగు, నూరు, నాలువందలు - అక్షరములు కల మంత్రము వృద్ద మంత్రము. తొమ్మిదక్షరములు కలిగి తార యుక్తమైనచో నిస్త్రింశమనబడును. అంతమున హృదయము, మధ్యన శిరోమంత్రము, అంతమున శిఖా, వర్మము, నేత్రము, అస్త్రము కలిగి, శివశక్తి కాని అర్థము కాని లేని మంత్రము నిర్చీజమనబడును. ఆద్యంతమధ్య భాగములలో ఫట్కారము ఆరువిధములుగా కనపడినచో సిద్ది హీనమనబడును. పంక్త్యక్షరములు కలమంత్రము మందమనబడును. ఏకాక్షరమంత్రము కూటమనబడును. దానినే నిరంశకమందురు. రెండక్షరములు కలది సత్తహీనమనబడునను. నాలుగక్షరములు కలది కేకరము. ఆరక్షరములు కలది బీజ హీనము. ఏడున్నర అక్షరములు కలది కూడా బీజ హీనమే. పన్నెండున్నర అక్షరములు కలది ధూమిత మనబడును. ఇది అతినిందితము. మూడున్నర బీజములు కలిగి ఇరువది, ఇరువది యొకటి, ముప్పది వర్ణములు కల మంత్రము ఆలింగీత మనబడును. దంత వర్ణములు కల మంత్రము మోహితమనబడును. ఇరువది నాలుగు, ఇరువది యేడు వర్ణములు కల మంత్రము క్షుధార్త మనబడును. ఈ మంత్రము సిద్ధికారకము కాదు. పదకొండు, ఇరువదియైదు, ఇరువది మూడు వర్ణములు కల మంత్రము దృప్తమనబడును. ఇరువది యారు అక్షరములు కలది కాని ముప్పదియారు వర్ణములు కలదీకాని, ఇరువది తొమ్మిది వర్ణములుగల మంత్రము హీనోంగకమనబడును. ఇరువది యెనిమిది, ముప్పది యొకటి వర్ణములు కల మంత్రము అతి క్రూరమనబడును. అన్ని కర్మలలో నిందీతము. నలుబది నుండి ఆరువది మూడు వర్ణములు గల మంత్రము వీడితమనబడును. ఈ మంత్రము అన్నీ కర్మలలోను ఉపయుక్తము కాదు. అరువది యెదకరములు కల మంత్రములు శాంత మానసములనబడును. అరువదియైదు నుండి తొంబది తొమ్మిది అక్షరముల వరకు గల మంత్రములు, వికలములనబడును. నూరు, నూట యాబది, రెండు నూర్లు, తొంబది రెండు, తొంబది యొకటి, మూడు నూర్లు వర్ణములు గల మంత్రములు నీస్స్నేహములనబడును. నాలుగు నూర్ల నుండి వేయి వర్ణముల వరకు గల మంత్రములు. అతివృద్ధములనబడును. ఈ మంత్రములు ప్రయోగదశయందు శిథిలములగునని చెప్పబడినది. వేయి కంటే ఎక్కువ వర్ణములు గల మంత్రములు పీడితములనబడును. ఇంకా అధిక వర్ణములు గల మంత్రములు స్తోత్రరూపములు. ఇట్లు మంత్రములు దోషయుక్తములని చెప్పబడినవి. ఈ దోషములను తెలియక మంత్రములను జపించువారలు కల్పకోటి శతములలో కూడ సిద్ధిని పొందజాలరు. భిన్నాదిదోషములు గల మంత్రములను సాధించు విధానమును చెప్పెదను.
యోనిముద్రాసనే స్థిత్వా ప్రజ పేద్యస్సమాహితః,
యం కంచిదపి వా నున్తం తస్య ష్యుస్సర్వ సిద్ధయః.
సవ్యపార్ణి గుద స్థాప్య దక్షిణం చ ధ్వజోసం,
యోనిముధ్రాబంధ ఏవం భవేదాసనముత్తమమ్.
అన్యోద్యత్ర ప్రకారోఒప్తి యోనిముద్రానిబంధనే,
తదగ్రే సరహస్యం తే కథయిష్యామి నారద.
పారంపర్యక్రమప్రాప్తో నిత్యానుష్టానతత్పరః,
గుర్వనుజ్ఞారతశ్శ్రమానభి షేకసమన్వితః.
సున్దరస్సుముఖశ్శాస్తః కులీనస్సులభో వశీ,
మంత్రతంత్రార్థతత్వజ్ఞో నిగ్రహానుగ్రహక్షమః.
నిరపేక్షో మునిర్ధాంతో హితవాదీ విచక్షణః,
తత్త్వనిష్కాసనే దక్షో వినయే చ సువేషనాన్.
ఆశ్రమీ ధ్యాననిరతస్సంశయచ్ఛిత్సుబుద్ధిమాన్,
నిత్యానుష్ఠానపంయుక్తస్త్వాచార్యః పరికీర్తితః.
శాంతో వినీతశుద్ధాత్మా సర్వలక్షణసంయుతః,
శమాదిసాధనోపేతశ్రద్ధా వాన్సు స్థిరాశయః.
శుద్ధదేహ్వోన్నపానాద్యైర్ధార్మి కశ్శుద్ధమానసః,
దృఢవ్రతసమాచారః కృతజ్ఞః పాపభీరుకః.
గురుధ్యానస్తుతికథా సేవనాసక్తమానసః,
ఏవంవిధో భవేచ్ఛిష్యస్త్వన్యధా గురుదుఃఖదః.
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే
చతుష్షష్టితమోధ్యాయః.
యోనిముద్రాసనమున కూర్చోని సావధానమనస్కుడై యే మంత్రమును జపించిననూ అన్ని సిద్ధులు కలుగును. ఎడమమడిమను గుదమున ఉంచి, కుడి మడిమను ధ్వజము పై యుంచి కూర్చొనుట యోనిముద్రాబంధమనబడును. ఇది ఉత్తమాసనము. ఈ యోనిముద్రాబంధమున మరియొక విధానము కూడా కలదు. ఆ విషయమును రహస్యములతో ముందు చెప్పగలను. పొరంపర్యక్రమముగా పొందినవాడు, నిత్యానుష్టానతత్పరుడు, గుర్వనుజ్ఞను పొందినవాడు, సంపద్యుక్షుడు, అభిషేకము చేయువాడు, సుందరుడు, సుముఖుడు, శాంతుడు, సత్కులజుడు, సులభుడు, ఇంద్రియనిగ్రహము కలవాడు, మంత్రతంత్రార్థ తత్త్వములు తెలిసినవాడు, నిగ్రహానుగ్రహసమర్దుడు ఆశలేనివాడు, ముని, అంతరింద్రియ నిగ్రహము కలవాడు, హితమును పలుకువాడు, వివేకము కలవాడు, తత్త్వమును తేల్చి చెప్పుటలో సమర్థుడు, వినయముగలవాడు, సజ్జనులను సేవించువాడు, ఆశ్రమవాసి, ధ్యాననిరతుడు, సంశయములను ఛేదించగలవాడు, మంచి బుద్ధికలవాడు, నిత్యానుష్టానము కలవాడు, ఆచార్యుడుగా చెప్పబడెను. శాంతుడు, వినయము కలవాడు, పరిశుద్ధాత్ముడు, సర్వలక్షణసంయుతుడు, శమాదిసాధనములు గలవాడు, శ్రద్దకలవాడు, స్థిరమైన సంకల్పము కలవాడు, శుద్ధమైన దేహము కలవాడు, శుద్ధమైన అన్నపానములు కలవాడు, ధార్మికుడు, పరిశుద్ధమనస్కుడు, ధృడవ్రతము. గలవాడు, కృతజ్ఞుడు పాపభీతి కలవాడు, గురుధ్యానమునందు, స్తోత్రమునందు కథా సేవనమునందు ఆసక్తి కలవాడు శిష్యుడు కావలయును. అట్లు కానివాడు గురువునకు దుఃఖమును కలిగించువాడగును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున అరువది నాలుగ - అధ్యాయము ముగిసినది.
Summary of chapter 65 of the Nārada Mahā Purana is as follows:
మంత్రోపదేశము అనుగ్రహించే సద్గురువు యొక్క దివ్య లక్షణములు మరియు దీక్షను స్వీకరించే ఉత్తమ శిష్యుని యోగ్యతలు ఈ అధ్యాయంలో నిరూపించబడినవి. గురుభక్తి వలన సాధకునికి సర్వ మంత్ర సిద్ధులు లభించునని ఇక్కడ స్పష్టంగా వర్ణించబడినది.