45 - బృహదుపాఖ్యానమ్

 సూత ఉవాచ :-     

సనందనవచశ్శ్రుత్వా మోక్షధర్మాశ్రితం ద్విజాః

 పునః పప్రచ్ఛ తత్త్వజ్ఞో నారదోఽధ్యాత్మసత్కథామ్

సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా! సనందనమహర్షి చెప్పిన మోక్షధర్మా క్రితమగు అధ్యాత్మ సత్కథను వినిన తత్త్వజ్ఞుడగు నారదుడు మరలనిట్లు పలికెను.

నారద ఉవాచ :-

శ్రుతం మయా మహాభాగ ! మోక్షశాస్త్రం త్వయోదీతమ్

 న చ మే జాయతే తృప్తిర్భూయో భూయోఽపి శృణ్వతః

  యథా సముచ్యతే జంతురవిద్యాబంధనాన్మునే

తథా కథయ సర్వజ్ఞ !మోక్షధర్మం సదాశ్రితమ్

 నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా !నీవు చెప్పిన మోక్షశాస్త్రమును చక్కగా వింటిని కాని ఎన్ని మార్లు వినిననూ నాకు తృప్తి కలుగుట లేదు. ఓ సర్వజ్ఞుడా ! అవిద్యాబంధమునుండి జీవుడు విముక్తుడగు మోక్షధర్మమును ఇంకనూ తెలుపుము.

సనందన ఉవాచ :-

అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్

 యథా మోక్షమనుప్రాప్తో జనకో మిథిలాధిపః

జనకో జనదేవస్తు మిథిలాయా అధీశ్వరః

ఔర్థ్వదేహికధర్మాణామాసీద్యుక్తో వీచింతనే

 తస్య శతానామాచార్యా వస తి సతతం గృహే

దర్శయంతః పృథగ్ధర్మాన్నానా పాషండవాదినః

 స తేషాం ప్రేత్యభావే చ త్య జాతా వినిశ్చయే

 ఆగమస్థస్స భూయిష్ఠమాత్మవత్త్వేన తుష్యతి

 తత్ర పంచశిఖో నామ కాపిలేయో మహాముని:

పరిధావన్మ హీం కృత్స్నాం జగామ మిథిలామథ

 సర్వసన్యాసధర్మాణస్తత్వజ్ఞానవినిశ్చయే

సుపర్యవ సితార్ధశ్చ నిర్ద్వన్ద్వో నష్టపంశయః

 ఋషీణామాహురేకం యం కామాదవసితం నృషు

 శాశ్వతసుఖమత్యంతమన్విచ్ఛన్న సుదుర్లభమ్

యమాహుః కపిలం సాంఖ్యా పరమర్షిం ప్రజాపతిమ్

 స మన్యే తేన రూ పేణ విభ్యాసయతి హి స్వయమ్

ఆసురేః ప్రథమం శిష్యం యమహుశ్చిరజీవినమ్

 పంచ స్రోతసి యస్సత్రమాస్తే వర్షసహస్రకమ్

 పంచస్రోతసమాగమ్య కాపీలం మండలం మహత్

పురుషావస్థమవ్యక్తం పరమార్థం న్యవేదయత్

ఇష్టమంత్రేణ సంయుక్తో భూమశ్చ తపసాసురిః

 క్షేత్రక్షేత్రజ్ఞయోర్వ్యక్తిం విబుధే దేహదర్శనః

 యత్తదేకాక్షరం బ్రహ్మ నానారూపం ప్రదృశ్యతే

ఆసురిర్మండలే తస్మిన్ ప్రతి పేదే తమవ్యయమ్

తస్య పంచశిఖశ్శిష్యో మానుష్యా పయసా భృతః

 బ్రాహ్మణీ కాపిలీ నామ కాచిదా సీత్కుటుంబినీ

 తస్యాః పుత్రత్వమాగత్య స్త్రీయాస్స పిబతి స్తనౌ

తతశ్చ కాపిలేయత్వం లేభే బుద్ధిం చ నైష్ఠికీమ్

ఏతన్మే భగవానాహ కాపిలేయస్య సంభవమ్

తస్య తత్కాపిలేయత్వం సర్వవిత్వమనుత్తమమ్

సామాత్యో జనకో జ్ఞాత్వా ధర్మజ్లో జ్ఞానినం మునే

ఉ పేత్య శతమాచార్యాన్మోహయామాస హేతుభిః

జనకస్త్వభిసంరక్తః కపిలేయానుదర్శనమ్

ఉత్సృజ్య శతమాచార్యాన్ పృష్ఠతోఽనుజగామ తమ్

 తస్మై పరమకళ్యాణం ప్రణతాయ చ ధర్మతః

 అబ్రవీత్సరమం మోక్షం యత్తత్సాంఖ్యం విధీయతే

 జాతినిర్వేదముక్త్వా స కర్మనిర్వేదమబ్రవీత్

కర్మనిర్వేదముక్త్వా చ సర్వనిర్వేదమబ్రవీత్

 యదర్థం ధర్మసంసర్గః కర్మణాం చ ఫలోదయః

 తమనాశ్వాసీ కం మోహం వినాశి చలమధ్రువమ్

 దృశ్యమానే వినాశే చ ప్రత్యక్షే లోకసాక్షి కే

 ఆగమత్పరమస్తీతి బ్రువన్నపి పరాజితః

అనాత్మా హ్యాత్మనో మృత్యుః క్లేశో మృత్యుర్జరామయః

 ఆత్మానం మన్యతే మోహాత్ తదసమ్యకృరం మతమ్

అథచేదేవమవ్యక్తి యల్లోకే నోపపద్యతే

 అజరోఽయమమృత్యుశ్చ రాజే మన్యతే యథా

 ఆస్తి నాస్తితి చా ప్యేతత్త స్మిన్న సితలక్షణే

కిమధిష్టాయ తద్బ్రూయాత్ లోకయాత్రావినిశ్చయమ్

ప్రత్యక్షం హ్యేతయోర్మూలం కృతాంతో హ్యేతయోరపి

ప్రత్యక్షో హ్యాగమో భిన్నః కృతాంతో వా న కించన

యత్ర తత్రానుమానేఽస్మిన్కృతం భావయతేఽపి చ

అన్యో జీవశ్శరీరస్య నాస్తికానాం మతే స్థితః

 రేతో వటకణికాయాం ఘృతపాధివాసనమ్

 జాతిస్మృతిరయస్కాంతః సూర్యకాంతంబుభక్షణమ్

ప్రేతభూతప్రియ శ్చైవ దేవతా హ్యుపయాచనమ్

 మృతకర్మవీవృత్తిం చ ప్రమాణమితి నిశ్చయః

నన్వేతే హేతవస్సన్తి యే కేచిన్మూర్తసంస్థితాః

 అమూర్తస్య హి మూర్తేన సామాన్యం నోపలభ్యతే

 ఆవిద్యా కర్మ తృష్ణా చ కేచిదాహుః పునర్భవమ్

తస్మిన్నష్టే చ దగ్ధే చ చిత్తే మరణధర్మిణి

అనోఽస్మాఙ్ఞాయతే మోహస్తమాహుస్సత్త్వసంక్షయమ్

యదా స్వరూపతశ్చాన్యో జాతీతశుద్ధితోఽర్ధతః

కథమస్మిన్స ఇత్యేవ సంబద్దస్యాదసంహితః

ఏవం సతి చ కా ప్రీతిః జ్ఞానవిద్యాతపోబలైః

 యదస్యా చరితం కర్మ సామాన్యాత్ప్రతిపద్యతే

 అపి త్వయమి హైవాన్యైః ప్రాకృతైర్దుఃఖితో భవేత్

సుఖితో దుఃఖితో వాపి దృశ్యాదృశ్యవినిర్ణయః

యథా హి ముసలైర్హన్యుశ్శరీరం తత్పునర్భవేత్

వృథా జ్ఞానం యదన్యచ్చ యే నైతన్నోపలభ్యతే

 ఋతుసంవత్సరౌ తిష్య: శీతోష్ణోఽథ ప్రియాప్రియే

 యథా తాపాని పశ్యంతి తాదృశస్సత్వసంక్షయః

 జరయాభిపరీతస్య మృత్యువా చ వినాశితమ్

దుర్బలం దుర్బలం పూర్వం గృహ స్యేవ వినశ్యతి

ఇంద్రియాణి మనో వాయుః శోణితం మాంసమష్ఠి చ

 ఆనుపూర్వ్యా వినశ్యంతి స్వం ధాతుముపయాంతి చ

 లోకయాత్రావిఘాతశ్చ దానధర్మఫలాగమే

 తదర్ధం వేదశబ్దాశ్చ వ్యవహారాశ్చ లౌకికాః

 ఇతి సమ్యజ్మన స్యేతే బహవస్సంతి హేతవః

 సనందన మహర్షి పలికెను :-  ఈ విషయమున మీథిలాధిపతియగు జనకుడు మోక్షమును పొందిన పురాతనమగు ఇతిహాసమును ఉదాహరించేదరు. మీథిలాధిపతియగు జనకుడు పారలౌకికధర్మములను చింతించుచుండెడివాడు. ఆ జనకుని ఇంటిలో ఎల్లపుడూ చాలామంది ఆచార్యులు నివసించుచుండెడివారు. పాషండ ధర్మములను వాదించువారు పృధగ్గర్మములను బోధించువారు పలు విధములుగా నుండెడివారు. ఆ జనకమహారాజు పరలోకస్థితియందు, పరలోక గమనమునందు జాత్యాది నిశ్చయము నందు విశ్వాసము కలవాడు జ్ఞాని కావున వారి వాదములను విని సంతోషించుచుండెడివాడు. కపిల మహర్షి వంశీయుడు పంచశిఖుడను మహర్షి భూమండలమునంతయూ తిరుగుచూ మిధిలా నగరమునకు వెళ్ళెను. సర్వసన్యాస ధర్మములను తెలిసిన వాడు తత్త్వజ్ఞాననిశ్చయమునందు అర్థ పరిష్కారము చేయగలవాడు ద్వంద్వ భావమునధిగమించినవాడు సంశయరహితుడు ఋషులలో ముఖ్యుడు, తన సంకల్పముచే మానవులందు అవతరించినవాడు నగు కపిలేయుడు బహుదుర్లభమగు శాశ్వేతానందమును అన్వేషించుచున్నవాడు సాంఖ్యులచే కపిల మహార్షి ప్రజాపతియని చెప్పబడువాడు ఆరూపములో తనను తాను ప్రసిద్ధిని పొందించుకొనెను. ఈ కాపిలేయుడు ఆధురిమహర్షికి మొదటి శిష్యుడు చిరంజీవిగా పేర్కొనబడినవాడు పంచనదీ ప్రాంతమున సహస్ర వర్షాత్మకమగు సత్రము నాచరించుచుండెడివాడు. కాపిలేయాశ్రమమున్న పంచనదీ ప్రాంతమునకు ఆధురిమహర్షి వచ్చి మహాజ్ఞానియగు కాపీలేయునికి అవ్యక్త స్వరూపమును పురుష స్వరూపమును బోధించు పరమార్థమును తెలియజేసెను. యాగమంత్రోచ్చారణచే తపస్సుచే ఆసురి క్షేత్ర క్షేత్రజ్ఞుల స్వరూపమును శరీరాత్మజ్ఞానము కలవాడు కావున తెలిసియుండెను. ఏకాక్షరము నానారూపముగా కనపడు బ్రహ్మను ఆసురీ ఆశ్రమమండలమున సాక్షాత్కారమును పొందకలిగెను. ఆయాసురి శిష్యుడే పంచశిఖుడను పేరుగలవాడు మానవ స్క్రీస్తన్యముతో పోషించబడినవాడుండెను. కావలి అను పేరుగల బ్రాహ్మణిస్త్రీకి పుత్రత్వమును చెంది కాపీలి స్తన్యపానమును చేసెను. కావున అతనికి  కాపీలేయుడను పేరు కలిగెను, స్థిరమగు బుద్దిని కూడా పొందెను. ఇది కాపిలేయుని పుట్టుక. నాకు భగవంతుడు తేలి పెను. అతని కాలేయత్వమును సాటిలేని సర్వజ్ఞత్వమును తెలియ చేసెను. మంత్రులతో కలిసి జనకమహారాజు కపిలేయుని రాకను తెలిసి ధర్మజుడు కావున ఎదురేగి అతిథి పూజగావించి అతని వేంటనున్న ఆచార్య శతమును హేతువాదముచే మోహింపచే సెను. జనకమహారాజు కాపీలేయుని దర్శించగోరి ఆచార్య శతమును విడిచి కాపీలేయుని వెంట వెళ్ళెను. ఇట్లు తననాశ్రయించిన జనకమహారాజునకు పరమకళ్యాణప్రదమగు మోక్షధర్మమును కాలేయుడు బోధించేను. ఈ జ్ఞానమునే సాంఖ్యమందురు. జాతి జ్ఞానమును, కర్మజ్ఞానమును, సర్వజ్ఞానమును బోధించెను. ధర్మ సంబంధము కర్మఫలప్రాప్తి దేనికోజుకు చేయుచున్నామో ఆ దేహము అశాశ్వతము, వినాశము, చలము, అధ్రువము, లోకసాక్షికముగా ప్రత్యక్షముగా నశించుచున్ననూ శాస్త్ర జ్ఞానముచే ఉన్నది అని పలికిననూ పరాజితుడే అగును. ఆత్మ జ్ఞానము లేక పోవుటయే ఆత్మకు మృత్యువు. శరీరమునకు జరాస్వరూపమగు కష్టము మృత్యువు. శరీరమునే ఆత్మయనుకోనుట మోహముచేతనే కాని సత్యము సముచితము కాదు. ఇదీయిట్లున్ననూ లోకమున సంభవముకొనీది. ఆత్మ అజరము అమరము. అట్లు దేహమును భావించుట రాజసభావము. ఇదియున్నది. ఇది లేదు అని తమౌలక్షణమగు శరీరమున లోకవ్యవహారమున దేనినాధారముగా చేసుకొని చెప్పవలయును? ఈ భావాభావమూలము మూలమగు నిశ్చయము ప్రత్యక్షమే. ప్రత్యక్షము శాస్త్రము ఈ రెండు భిన్నములు. కావున ఏ నిశ్చయమూ కలుగదు. కావున ప్రత్యక్షము సంభవించదు కావున అనుమానముచే నిశ్చయించవలయును. కాని నాస్తికమతమున శరీరము కంటే భిన్నుడుగా జీవుడు కనపడడు. రేతశోణిత సంయోగమే ఘృతపాకస్థితివంటిది. జాతి జ్ఞానము అయస్కాంతము వంటిది. అంబు భక్షణము సూర్యకాంతము, ప్రీతభూత ప్రియత్వము దేవయాచనము మృతులకు కర్మ నివృత్తి ప్రమాణమని నాస్తికుల నిశ్చయము. ఈ హేతువులన్నియూ మూర్తిమంతయుల విషయమున చెప్పబడినవి. స్వరూపము లేనిదానికి స్వరూపమున్నదానితో సంబంధమే లభించదు. అవిద్య, కర్మ, ఆశ పునర్జన్మకు కారణములని కొందరందురు. ఆ శరీరము నశించిననూ దహించినను. ఇక ఉండెడిదేదియును లేదు. ఆ య "విద్య నశించిననూ దానినుండి మరియొక మోహము పుట్టును. దీనినే సత్త్వసంక్షయమందురు. ఆత్మ శరీరమునకంటే స్వరూపముచే జాతిచే శ్రుతిచే అర్థముచే భిన్నమైనపుడు ఈ శరీరమున ఆయాత్మయే యున్నదని' ఎట్లు నిశ్చయింతుము. ఇట్లు నిశ్చయించలేనిచో జ్ఞానవిద్యాతపోబలముచే ఏమి ప్రయోజనము? ఈ దేహసంబంధముచే చేయబడిన కర్మ ఇతనిదే అయినచో ఇతనే ఇక్కడే ఇతరులమైన ప్రకృతి ధర్మములచే ఎట్లు దుఃఖమును పొందును. సుఖముగలవాడు దుఃఖము గలవాడు అని చెప్పబడువాడు దృశ్యుడా? అదృశ్యుడా? అను నిర్ణయము జరుగవలయును. రోకళ్ళచే కొట్టి చంపబడిన శరీరము మరల ఎట్లు పుట్టును? కావున జ్ఞానము వృథా. కర్మలు తపస్సు వృథా. వాటిచే శరీరము లభించుట లేదు కదా? ఋతువు సంవత్సరము, "మాసము -శీతోష్ణములు ప్రియా ప్రియములు వచ్చును, పోవును. వాటిని చూచుట చూడకపోవుట అనునది లేకుండుటయే సత్త్వసంక్షయము. వార్ధక్యముచే జీర్ణమైనది మృత్యువుచే నశించినది. గృహమున మొదటి దుర్బలమైనది నశించునట్లు శరీరమునకూడా దుర్బలమైనదే నశించును. ఇంద్రియములు, మనసు, వాయువు, రక్తము, మాంసము, అస్థులు క్రమముగా నశించి తమతమధాతువులను చేరును. దొనధర్మములచే ఫలము లభించినచో లోకయాత్రకు విఘాతము కలుగును. కావున వేదశబ్దములు వ్యవహారములు కూడా లౌకికములే. ఇట్లు ప్రాణి తన మనసున పలువిధములైన హేతువులను కల్పించుకొని ఆలోచించుచుండును.

ఏతదస్తీతి నాస్తితి న కశ్చిత్ప్రతిదృశ్యతే

తేషాం విమృశతామేవ తత్సమ్యగభిధావతామ్

క్వచిన్నివసతే బుద్దిస్తత్ర జీర్యతి వృక్షవత్

ఏవం త్వర్ధైరనర్ధైశ్చ దుఃఖితాస్సర్వజంతవః

ఆగమైరపకృష్యంతే హస్తి పైర్హస్తినో యథా

ఆర్థాంస్తథా హంతి సుఖావహారశ్చ లీహంత ఏతే బహవోపశుష్కాః

మహత్తరం దుఃఖమభిప్రపన్నా హిత్వా మిషం మృత్యువశం ప్రయాంతి

వినాశినో హ్యధ్రువజీవినః కిం కేంబంధుభిర్మి త్రపరిగ్రహైశ్చ

విహాయ యో గచ్చతి సర్వమేవ క్షణేన గత్వా న నివర్తతే చ

భూవ్యోమతోయానలయవోఽపి సదా శరీరం ప్రతిపాలయంతి

ఇతీదమాలక్ష్య రతిః కుతో భవేత్ వినాశినాప్యస్య న శర్మ విద్యతే

ఇదమనుపధివాక్యమచ్ఛలం పరమనిరామయమాత్మ సాక్షికమ్

నరపతిర భివీక్ష్య విస్మితః పునరనుయోక్తుమిదం ప్రచక్రమే

ఇది యున్నది, ఇది లేదు అని ఏ ఒక్కడూ నిశ్చయించలేడు చక్కగా జ్ఞానము ననుసరించి విమర్శించు వారికి ఒకచోట బుద్ది నిలుచును. శరీరము మాత్రము వృక్షము వలె జీర్ణించును. ఇట్లు అర్ధములచే అనర్థములచే అన్ని ప్రాణులు దుఃఖితులై మావటివానిచే ఏనుగు వలె ఆశలచే ఆకర్షించబడుదురు. ఇట్లు సారములేని ఆశలచే ఆస్వాదించబడుచు సుఖములను కలిగించు పురుషార్ధములను స్వయముగా నశింపచేసుకొందురు. గొప్ప దుఃఖమును సౌంది ఆహారమును విడిచి మృత్యువును పొందెదరు నశించునది శాశ్వతము కాని జీవితము గల ప్రాణులకు బంధువులతో మిత్రులతో ఏమి ప్రయోజనము? అంతటిని అన్నిటిని వదిలి క్షణములో వెళ్ళి మళ్ళీ తిరిగిరాడు కదా? ఈ శరీరమును భూమ్యాకాశ జలాగ్ని వొయువులు ఎపుడూ కొపొడుచుండును. ఈ విషయమును తెలిసినవాడేట్లు ఆనందించగలడు. వినాశియగు ఈ శరీరములో సుఖమునేట్లు పొందగలడు? ఇట్లు ఉపాధిరహితము కల్మషరహితము పరమనిరామయమగు మహర్షి వాక్యమును వినిన జనకమహారాజు ఆశ్చర్యమును చెంది మరల తెలియుటకీటు పలి కెను.

జనక ఉవాచ :-

భగవన్యది న పేత్య సంజ్ఞా భవతి కస్యచిత్

ఏవం సతి కీమజ్ఞానం జ్ఞానం వా కిం కరిష్యతి?

సర్వముచ్ఛేదనిష్ఠం స్యాత్ పశ్య చైతద్ద్విజోత్తమ !

అప్రమత్తః ప్రమత్తో వా కిం విశేషం కరిష్యతి?

అసంసర్గో హి భూతేషు సంసర్గో వా వినాశిషు

కస్మై క్రియత కల్పేత నిశ్చయః కోఽత్ర తత్త్వతః

జనక మహారాజు పలికెను :- ఓ మహర్షీ ! మృతి చెందిన తరువాత ఎవ్వరికీ జ్ఞానముండనిచో జ్ఞానాజ్ఞానములచే ప్రయోజనమేమి? సిద్దాంతమంతయూ భంగము కావలసి వచ్చును. దీనిని చక్కగా పరిశీలించుడు. అప్రమత్తునికి ప్రమత్తునికి విశేషమేమి యుండును? భూతములయందు అసంగముకొని ప్రాణములయండు సంపదలయందు సంబంధముకొని ఎవరికోజుకు చేయబడుచున్నది? దేని కోటకు చేయబడుచున్నది. ఈ విషయమున సిద్ధాన్త మెట్లుండును?

సనందన ఉవాచ :-

తమసా హి మతిచ్ఛత్రం విభ్రాంతమివ చాతురమ్

పునః ప్రశమయన్వొక్యైః కవిః పంచశిఖోబ్రవీత్

సనందన మహర్షి పలికేను :- అజ్ఞానముచే ఆవరించబడిన బుద్ధి కలిగి భ్రాంతుడై ఆతురుడైయున్న జనకుని మంచిమాటలచే శాంతింపచేయుచు పంచశిఖుడిట్లు పలి కెను.

పంచశిఖ ఉవాచ :-

ఉచ్చేదనిష్ఠా నేహాస్తి భావనిష్ఠా న విద్యతే

అయం హ్యాపి సమాహారశ్శరీరేంద్రియచేతనేమ్

వర్తతే పృథగన్యోన్యమప్యుపాశ్రిత్య కర్మసు

ధాతవః పంచధా తోయం ఖే వాయుర్జ్యోతిష్ణో ధరా

తేషు భావేన తిష్ఠన్తి వియుజ్యంతే స్వభావతః

ఆకాశం వాయురూష్మా చ స్నేహో యశ్చాపి పార్థివః

ఏష పంచసమాహారః శరీరమపి నైకధా

జ్ఞానమూష్మా చ వాయుశ్చ త్రివిధః కాయసంగ్రహః

ఇంద్రియాణీందియార్దాశ్చ స్వభావ శ్చేతనా మనః

ప్రాణాపానౌ వికారాశ్చ ధాతవశ్చాత్ర నిస్సృతాః

శ్రవణం స్పర్శనం జిహ్వా దృష్టిరాసా తథైవ చ

ఇంద్రియాణీతి పంచైతే చిత్తపూర్వాగమా గుణాః

తత్ర విజ్ఞానసంయుక్తా త్రివిధా చేతనా ధ్రువా

సుఖదుఃఖేతి యామాపురసౌ దుఃఖసుఖేతి చ

శబ్దస్పర్శశ్చ రూపం చ మూర్త్యర్థమేవ తే త్రయః

ఏతే హ్యామరణాత్పంచ సద్గుణా జ్ఞాన సిద్ధయే

తేషు కర్మాణి సిద్ధిశ్చ సర్వతత్త్వార్థనిశ్చయః

తమాహుః పరమం శుద్ధం బుద్ధిరిత్యవ్యయం మహత్

ఇమం గుణసమాహారమాత్మ భావేన పశ్యతః

అసమ్యగ్దర్శనైర్దుఃఖమనంతం నోపశామ్యతి

అనాత్మేతి చ యద్దృష్టం తేవాహం న మమేశ్యపి

వర్తతే కిమధిష్టానాత్ ప్రసక్తా దుఃఖసంతతిః

తత్ర సమ్యగ్జినో నామ త్యాగశాస్త్రమనుత్తమమ్

శృణుయాత్తచ్చ మోక్షాయ భాష్యమాణం భవిష్యతి

త్యాగ ఏవ హి సర్వేషాముక్తానామపి కర్మణామ్

నిత్యం మిధ్యా వినీతానాం క్లేశ దుఃఖావహో మతః

ద్రవ్యత్యాగే తు కర్మాణి భోగత్యాగే వ్రతాని చ

సుఖత్యాగే తపో యోగం పర్వత్యాగే సమాపనా

తస్య మార్గోఽయమద్వెథస్సర్వత్యాగస్య దర్శితః

విప్రహాణాయ దుఃఖస్య దుర్గతిర్హి తథా భవేత్

పంచ జ్ఞానేన్ద్రియాణ్యుక్త్వా మనష్టాని చేతసి

బలపష్ఠాని వక్ష్యామి పంచ కర్మేంద్రియాణి తు

హస్తౌ కర్మేంద్రియం జ్ఞేయం అథ పాదౌ గతీంద్రియమ్

ప్రజనానందయోర్మేడ్రో విసర్గో పాయురింద్రియమ్

వాక్చ శబ్దవి శేషార్ధమితి పంచాన్వితం విదుః

ఏవమేకాదశైతాని బుద్ధ్వా త్వవపృజన్మనః

కర్ణౌ శబ్దశ్చ చిత్తం చ త్రయశవణ సంగ్ర హే

తథా స్పర్శే తథా రూ పే తథైవ రసగంధయోః

ఏవం పంచత్రికా హ్యేతే గుణాస్తదుపలబ్ధయే

యేనాయం త్రివిధ భావః పర్యాయాత్సముపస్థితః

సాత్త్వికో రాజసశ్చాపి తామసశ్చాపి తే త్రయః

త్రివిధ వేదనా యేషు ప్రసృతా సర్వసాధినీ

ప్రహర్షః ప్రీతిరానన్దః సుఖం సంశాన్త చిత్తతా

అకుతశ్చిత్కుతశ్చిద్వా చిత్తతసాత్త్వికో గుణః

అతుష్టిః పరితాపశ్చ శోకో లోభస్తథా క్షమా

లింగాని రజసస్తాని దృశ్యంతే హేత్వ హేతుతః

అవివేకస్తథా మోహప్రమాదస్స్వప్నతంద్రితా

కథంచిదపి వర్తంతే వివిధస్తామని గుణాః

ఇమాం చ యో వేద విమోక్షబుద్ధిం ఆత్మానమన్విచ్ఛతి చాప్రమత్తః

న లిప్యతే కర్మఫలైరనిష్టైః పత్రం విష స్త్వైవ జలేన సిక్తమ్

దృడైర్హి పాశైర్వివిధైర్విముక్తః ప్రజానిమిత్తైరపి దైవతైశ్చ

యదా హ్యసౌ దుఃఖసౌభ్యౌ జహాతి ముక్తస్తదాన్ర్యం గతిమేత్యలింగః

శ్రుతిప్రమాణాగమమంగలైశ్చ శేతే జరామృత్యుభయాదతీతః

క్షీణే చ పుణ్యే విగతీ చ పాపే తనోర్నిమిత్రే చ ఫలే విన ష్టే

అలేపమాకాశమలింగమేవమాస్థాయ పశ్యంతి మహత్యశక్తో

యథోర్ణనాభిః పరివర్తమానస్తంతుక్షయే తిష్ఠతి యాత్యమానః

తథా విముక్తః ప్రజహాతి దుఃఖం విధ్వంసతే లోష్టమివాది మృచ్చన్

యథా రురుశ్శృంగమథో పురాణం హిత్వా త్వచం వాప్యురగో యథా చ

విహాయ గచ్ఛన్ననవేక్షమాణస్తథా విముక్తో విజహాతి దుఃఖమ్

మత్స్యం యథా వాప్యుదకే పతంతముత్సృజ్య పక్షీ నీపతత్యశక్తః

తథా హ్యసౌ దుఃఖసౌఖ్యే విహాయ ముక్తః పరార్ద్వాం గతిమేత్యలింగః

ఇదమమృతపదం నిశమ్య రాజా స్వయమిహ పంచశిఖేన భాష్యమాణమ్

నిఖిలభిసమీక్ష్య నిశ్చితార్ధః పరమసుఖీ విజహార వీతశోకః

అపిచ భవతి మైధిలేన గీతం నగరముపహితమగ్నినాభివీక్ష్య

న ఖలు మమ హి దహ్యతేఽత్ర కించిత్ స్వయమిదమాహ కిల స్మ భూమిపాలః

ఇమం హి యః పఠతి విమోక్షనిశ్చయం మహామునే సతతమవేక్షతే తథా

ఉపద్రవాననుభవతే హ్యాదుఃఖితః ప్రముచ్యతే కపిలమివేత్య మైథిలః

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే పంచచత్వారింశత్తమోఽధ్యాయః

పంచశిఖ మహర్షి పలికెను :- ఈ విషయమున ఉచ్చేదనిష్కొని భావనిష్కొని లేదు. ఇది శరీరేంద్రియ మనస్సుల సమాహారము. ఈ మూడు విడివిడిగా ఒకదానిని మరియొకటాశ్రయించి యుండును. జలము ఆకారము వాయువు అగ్ని భూమి యనునవి అయిదు ధాతువులు. అయిదింటిలో భావముతో నిలుచును. స్వభావముగా విడిపోవును. ఆకాశము వాయువు వేడి పార్థివము జలము ఈ అయిదింటి సమాహారము శరీరము. ఈ శరీరముకూడా పలువిధములు. జ్ఞానము వేడి వొయువు అను మూడు వొయసమూహము. ఇంద్రియములు, ఇంద్రియార్థములు, స్వభావము చేతనో, మనస్సు, ప్రాణాపానములు, వికారము. ఇచట ధాతువులు బయల్పడును. శ్రవణము, స్పర్శనము, జిహ్వా, దృష్టి, నాస అను నీ అయిదు ఇంద్రియములు చిత్తమునకు పూర్వమున కలుగు గుణములు. ఇచట విజ్ఞానసంయుక్తమగు చేతన ధ్రువము త్రివిధము. సుఖము, దుఃఖము, అసుఖదుఃఖము అని శబ్దము స్పర్శ రూపము అను మూడు మూర్తి కొఱకే ఏర్పడును. ఈ అయిదు సద్గుణములు మరణపర్యంతము జ్ఞాన సిద్ది కొఱకుండును. ఈ సద్గుణములయందే కర్మలు సిద్ది సర్వతత్వార్ధ నిశ్చయముండును. దీనినే పరమము, శుద్ధము, బుద్ధి అవ్యయము మహత్ అందురు. ఇట్లు గుణ సమాహారమును ఆత్మ భావముతో చూచువానికి చెడును మాత్రమే చూపించు అజ్ఞానముచే అంతులేని దుఃఖము శాంతించదు. నేనుకాను నాది కాదు అని అనాత్మగా చూడబడినదానికి అధిష్టానమేది? దుఃఖసంతతి ఎటనుండి వచ్చుచున్నది? ఈ విషయము మంచి జ్ఞానమనగా సాటిలేని త్యాగ శాస్త్రము మాత్రమే. దానిని ఇతరులు చెప్పునపుడు మోక్షముకొఱకు వినపయును. చెప్పబడిన అన్ని కర్మలను విడుచుటయే బూటకపు వినయము గలవారికి దుఃఖమును కలిగించు కష్టము. ద్రవ్యమును త్యాగముచేసినచో కర్మలు, భోగములను త్యజించినచో వ్రతములు, సుఖమును త్యజించినచో తపము యోగము సిద్ధించును. అన్నిటిని విడిచిన వానికి అన్నియు ముగియును. ఇట్లు సర్వత్యాగమునకున్న ఏకైకమార్గమును వివరించితిని. దుఃఖనాశమునకు త్యాగమే ఏకైక మార్గము. త్యాగములేనిచో దుర్గతి ఏర్పడును. మనసుతో కలిసి ఆరగు పంచ జ్ఞానేంద్రియములను చెప్పి, ఇపుడు బలముతో ఆరగు పంచ కర్మేంద్రియములను చెప్పెదను. హస్తములు కర్మేంద్రియములు పాదములు గమనేంద్రియములు. మేడ్రము జనన ఆనందేంద్రియము, పొయువు మలవిసర్జనేంద్రియము వాక్కు శబ్లేంద్రియము. ఇవి అయిదు కర్మేంద్రియములు. ఇట్లు పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనుసుతో కలిసి ఏకాదశేంద్రియములగును. ఈ ఏకాదశేంద్రియములు బుద్ధితోకలిసి అన్ని వ్యవహారములను నడుపును. కర్ణములు శబ్దము చిత్తము అను మూడు శ్రవణ సంగ్రహమందురు. అట్లే స్పర్శరూపము, రసగంధములు అనువాటికి కూడా ప్రాకముండును. ఈ త్రికము గుణోపలబ్దిని కూర్చును. ఈ త్రికముచే పర్యాయముగా భావత్రయముండును. సాత్త్విక రాజస తామసములను మూడుభావములే మూడు వేదనలను కలిగించును. ఈ వేదనలే సంసారమున అన్నింటినీ సాధించును. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము శాంతచిత్తత సకారణముగా అకారణముగా చిత్తములో కలుగుట సాత్త్విక గుణము. అసంతోషము, పరితాపము, శోకము, లోభము, అసహనము ఇవికూడా అకారణముగా సకారణముగా కలుగుట రజోగుణమువలన కనిపించును. అవివేకము, మోహము,ప్రమాదము, నిద్ర, సోమరితనము మొదలగునవి సహేతుకముగా నిర్ణేతుకముగా కలుగుట తమోగుణ చిహ్నములు. ఇట్లు అప్రమత్తుడై విముక్తి మార్గమును తెలిసినవాడు జల సిక్తమైన పత్రము విషలిప్తముకానట్లు అనిష్టములైన దుఃఖములతో సంబంధమును కలిగియుండుడు. దృఢములు పలువిధములగు పాశములనుండి విముక్తుడు కావలయును. ఈ పాశములు ప్రజానిమిత్తములు కావచ్చును. దైవనిమిత్తములు కావచ్చును. ఇట్లు విముక్తుడై సుఖదుఃఖములను విడిచినచో శరీరత్యాగముచే ఉత్తమగతిని పొందును. శ్రుతిస్మృతి శాస్త్రప్రమాణములచే జ్ఞానమును సంపాదించి జరామృత్యువులకు అతీతుడై శరీరమునకు నిమిత్తములగు పుణ్యపాపములు నశించగా నిర్లేపము నిర్లింగము అగును ఆకాశమును మహత్తత్త్వమున దర్శింతురు. సాలెపురుగు తాను సృజించిన సూత్రము నశించిన తరువాత భ్రమణమును ఆపి స్థిరముగా నిలుచునట్లు జీవుడు స్థిరుడగును. ఇట్లు విముక్తుడై దుఃఖమును పరిత్యజించును. లోష్టమునకు అంటుకొనియున్న మట్టి వదులునట్లు వదులును, జింక తన పాత కొమ్మును వదిలినట్లు, పాము కుబుసమును వీడుచునట్లు జీవుడు విముక్తుడై దుఃఖమును విడుచును. నీటిలోనున్న పక్షిని అందుకొనుటకు నీటిలోనికి వచ్చిన పక్షి మత్స్యమును గ్రహించలేక దానిని వదిలినచో ఆకాశమున కేగురును. అట్లు కదలనిచో పక్షి కూడా నీటిలోపడి నశించును. అట్లే జీవుడు సంసారవిషయములను వదిలినచో దుఃఖవిముక్తుడగును. సంగమును వీడనిచో సంసారమున పడును. ఇట్లు పంచశిఖమహర్షి ఉపదేశించిన తత్త్వజ్ఞానమునువిని నిశ్చితార్ధము కలవాడై శోకమునువీడి పరమానందముతో విహరించెను. మరియు ఒక సనుయమున శత్రువులు నగరమును ముట్టడించి నిప్పంటించి తగులబెట్టుచుండగా ఆ వార్త వినిన జనకమహారాజు నాదంటూ ఏదీలేదు నావస్తు వేదీ దహించుటలేదు అని నీసంగముగా పలికెను. ఇట్లు పంచఖమహర్షి ఉపదేశించిన ఈ మోక్షమార్గమును చదివినవాడు తెలిసిన దానిని యథావిధిగా ఆచరించి ఆపదలనుకూడా దుఃఖించకనే అనుభవించి కపిలుని ఆశ్రయించిన జనకునివలె విముక్తుడగును.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బహదుపాఖ్యానమున నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.