76 -  అధ్యాయము

 నారద ఉవాచ :

కార్తవీర్యప్రభృతయో నృపా బహువిధా భువి,

జాయంతేథ ప్రలీయన్తే స్వస్వకర్మానుసారతః,

తత్కథం రాజవర్యోసౌ లోకే సేవ్యత్వమాగతః,

సముల్లంఘ్య నృపానన్యానేతన్మే నుద సంశయమ్.

నారద మహర్షి పలికేను : తమ తమ కర్మానుసారముగా కార్తవీర్యార్జునుని వంటి రాజులు పుట్టుచుందురు. గిట్టుచుందురు. అయినపుడు ఇతర రాజులను కాదని ఒక్క కార్తవీర్యార్జునుడే లోకమున సేవించదగినవాడెట్లగును .? నా ఈ సంశయమును తొలగించుము.

సనత్కుమార ఉవాచ :

శృణు నారద వక్ష్యామీ సందేహ నివృత్తయే,

యథా సేవ్యత్వమాపన్నః కార్తవీర్యార్జునో భువి.

యస్సుదర్శనచక్రస్యావతారః పృథ్వి వీతలే,

దత్తాత్రేయం సమారాధ్య లబ్ధావాం స్తేజ ఉత్తమమ్.

తస్య క్షితీశ్వరేన్ద్రస్య స్మరణాదేవ నారద !,

 శత్రూఞ్జయతి సంగ్రామే నష్టం ప్రాప్నోతి సత్వరమ్.

తేనాస్య మన్త్రపూజాది సర్వతంత్రేషు గోపితమ్,

తుభ్యం ప్రకాశయి ష్యేహా సర్వసిద్ధిప్రదాయకమ్.

వహ్నితారయుతా రౌద్రీ లక్ష్మీరవీన్దు శాంతియుక్,

వేధాధరేన్దుశాంత్యాడ్యో విద్రోయాసాన్నిబిందుయుక్.

పాశో మాయాంకుశం పద్మో వర్మాస్త్రే కార్తవీపదమ్,

రేఫోవాద్యాపనోఽనన్తో వహ్నిలౌకర్ణసంస్థితా,

మేషస్సదీర్ఘః పవనో మనురుక్తో హృదంతిమ,

ఊనవింశతి వర్ణోయం తారాదిర్నఖవర్ణకః.

దత్తాత్రేయో మునిశ్చాస్య చ్ఛన్దోనుష్టబుదాహృతమ్,

కార్తవీర్యార్జునో దేవో బీజశక్తిర్ర్ధువశ్చ హృత్.

శేషాఢ్యబేజయుగ్మేన హృదయం విన్య సేదధః,

శాంతియుక్తచతుర్దేన కామాద్యేన శిర్యోంగకమ్.

ఇంద్యాడ్యం వామకర్ణాధ్యమాయయోర్విశయుక్తయా,

శిఖామంకుశపద్మాభ్యాం సవాగ్భ్యాం వర్మ విన్య పేత్.

వర్మాస్త్రా బ్యామస్త్రయుక్తం శేషార్ణైర్వ్యాపకం చరేత్,

హృదయే జఠరే నాభౌ జఠరే గుహ్యదేశతః.

దక్షపాదే వామపాదే పక్ష్నీ జానుని జంఘయో,

విన్య సేద్బీజదశకం ప్రణవద్వయమధ్యగమ్.

తారాద్యానథ శేషార్ణాన్మస్తకే చ లలాటకే,

భ్రువోశ్శ్రుత్యోస్తథైవాజ్ఞోపి వక్త్రే గలేంసకే.

సర్వమంత్రేణ సర్వాంగే కృత్వా వ్యాపకమాదృతః,

సర్వేషాం సిద్ధయే ధ్యాయేత్కార్తవీర్యం జనేశ్వరమ్.

ఉద్యదరపహస్రాభల పర్వభూపతివర్ణితమ్,

దోర్భిః పంచాశతాదక్షైర్బాణాన్వామైర్ధనూషి చ.

దధతం స్వర్ణమాలాధ్యం రక్తవస్త్రసమావృతమ్,

చక్రావతారం శ్రీవిష్ణోర్యాయేదర్జున భూపతిమ్.

లక్ష మేకం జు పేన్మం దశాంశం జుహుయాత్తిలైః,

సతండులైః పాయ సేన విష్ణుపీఠే  యజేత్తు తమ్.

షట్కోణేషు షడంగాని తతో దీక్టు విదిళ్లు చ,

చౌరమదవిభంజనం మారీమదవిభంజనమ్.

అరిమదవిభంజనం దైత్యమదవిభంజనమ్,

దుష్టనాశదుఃఖనాశం దురితాపద్వినాశకమ్.

దీక్ష్వష్టశక్తయః పూజ్యా ప్రాచ్యాదిష్వపితప్రభాః,

క్షేమంకరీ వశ్యకరీ శ్రీకరీ చ యశస్కరీ.

ఆయుఃకరీ తథా ప్రజ్ఞాకరీ విద్యాకరీ పునః,

ధనకర్యష్టమీ పశ్చాల్లో కేశా అస్త్రసంయుతాః

ఏవం సంపాధితో మన్త్ర: ప్రయోగార్హః

 ప్రజాయతే, కార్తవీర్యార్జునస్యాథ పూజాయన్త్రమిహోచ్యతే.

సనత్కుమార మహార్షి పలికెను : ఓ నారదా ! నీ సందేహమును తొలగించుటకు కార్తవీర్యార్జునుడు ప్రాణులచే సేవించదగిన వాడెట్లాయెనో తెలి పెదను. వినుము. కార్తవీర్యార్జునుడు సుదర్శనావతారము. దత్తాత్రేయుని ఆరాధించి గొప్ప తేజస్సును పొందెను. ఆ కార్తవీర్యార్జునుని స్మరించుట మాత్రముననే యుద్ధమున శత్రువులను జయించును. నష్టవస్తువులు లభించును. కావున కార్తవీర్యార్జునుని మంత్రమును పూజాదికము అన్నితంత్రములలో రహస్యముగా రక్షించబడియున్నది. ఇట్లు సర్వసిద్ధి ప్రదాయకమగు కార్యవీర్యార్జున మంత్రాదీకమును నీకు తెలి పెదను. నహ్నితారయుతారౌద్రి అగ్నీందుశాంతియుతమగు లక్ష్మి, వేధాధరేందు శాంత్యాఢ్యము నిద్రాయాశాన్ని బిందుయుతము, పాశము మాయాంకుశము పద్మా వర్మాస్త్రములు కార్తవీర్యపదము, అనన్హాసనము వహ్నిజములు కర్ణ సంస్థితములు. దీర్ఘసహితమగు మేషము, పవనుడగు, హృదంతిమమగు మనమిది. ఈ మంత్రము పందొమ్మిది వర్ణములుగలది. ఈరాది నఖ వర్ణకము. దత్తాత్రేయుడు ముని. అనుష్టుప్పనస్సు. కార్తవీర్యార్జునుడు దేవత. బీజశక్తి ధ్రువ హృదయము శేషాగ్య భీజయుగ్మముచే అధోభాగమున హృదయన్యాసము గావించవలయును. శాంతియుక్త చతుర్థమగు కామాద్యముచే శిరోంగన్యాసమును గావించవలయును. ఇంద్వొడ్యమగు వామకర్ణాద్యము వీశయుక్తముచే న్యాసము చేయవలయును. అంకుశ పద్మములచే శిఖను, వాక్సహితములచే అస్త్రమును, శేషవర్ణములచే వ్యాపకమునాచరించవలయును. హృదయమున, జఠరమున, నాభియందు, గుహ్య దేశమున, దక్షిణపొదమున, వామపాదమున, సక్లియందు, జానువున, జంఘలయందు, ప్రణవద్వయమధ్యన నున్న బీజదశకమును న్యొ సించవలయును. తారాదులగు శేషవర్ణములను మస్తకమున, లలాటమున, కనుబొమలలో, కర్ణములలో, నేత్రములలో, నాసికయందు, వస్త్రమున, గలమున, భుజమున, సర్వమంత్రముచే సర్వాంగమున ఆదరముచే వ్యాపకము నాచరించి సకలాభీష్టసిద్ధికోటకు ఉద్యదరస హస్రసన్నిభుని సర్వభూతపతివందితుని అయిదువందల దక్షిణబాహువులచే బాణములను, అయిదువందల పామబాహువులచే ధనువులను ధరించిన వానిని, స్వర్ణమాలాశోభితుని, రక్తవస్త్రసమావృతుని, శ్రీవిష్ణుచక్రావతారము అగు కార్తవీర్యార్జునచక్రవర్తిని ధ్యానించవలయును. మస్త్రమును ఒక లక్ష జపించవలయును. దశాంశమును తండులమిశ్రములగు నువ్వులచే, పాయసముచే హోమము సౌచరించవలయును. విష్ణుపీఠమున పూజించవలయును. షట్కోణములందు షడంగములను, దిక్కులందు విదిక్కులందు చోరమదవీభంజనుని, మారీమద విభంజనుని, అరిమదవిభంజనుని, దైత్యమదవీభంజనుని, దుష్టనాశకుని, దుఃఖనాశకుని, దురితములను ఆపదలను నశింప చేయువానిని, పూజించి, దిక్కులయందు అసితప్రభలగు అష్టశక్తులను పూజించవలయును. క్షేమకరి, వశ్యకరి, శ్రీకరి, యశస్కరి, ఆయుఃకరి, ప్రజ్ఞాకరి, విద్యాకరి, ధనకరి, అనునది అష్టశక్తులు. తరువాత అస్త్రసంయుతులను లోకేశులను పూజించవలయును. ఇట్లు సాధించబడిన మంత్రము ప్రయోగార్హమగును. ఇక ఇపుడు కార్తవీర్యార్జునుని పూజా యంత్రమును చెప్పెదను.

స్వబీజేనాంగ ధ్రువవాకర్ణికం దిగ్ధలం లిఖేత్,

తారాదివర్మాన్తదలం శేషవర్ణదలాంతరమ్.

ఊష్మాస్త్యస్వరకింజల్కం శేషార్ణైః పరివేష్టితమ్, కోణాలంకృతభూతార్ణభూగృహంయన్త్రమీశితుః.

శుద్ధభూమావష్టగంధైర్లిఖిత్వా యన్త్ర మాదరాత్,

తత్ర కుంభం ప్రతిష్టాప్య తత్రావాహ్యార్చయేన్నపమ్.

స్పృష్ట్వా కుంభం జపేన్మన్త్రo సహస్రం విజితేన్ద్రియః

అభిషిం చేత్తదంభోభిః ప్రియం సర్వేష్ట సిద్ధయే.

పుత్రాన్యశోరోగనాశమాయుస్స్వజనరంజనమ్,

వాక్సిద్ధిం సుదృశః కుంభాభిషిక్తో లభతే నరః.

శత్రూపద్రవ ఆపన్నే గ్రామే వా పుటఛేదనే,

సంస్థాపయేదిదం యన్త్రo శత్రుభీతినివృత్తయే.

పసర్షపారిష్టలశునకార్పా సైర్మార్యతే రిపుః,

ధత్తూరైస్తభ్యతే నింభైర్ద్వేష్యతే వశ్యతేంబుజై:.

ఉచ్చాటనే విభీతస్య సమిద్భిః ఖదిరస్య చ,

కటుతైలమహిష్యాజ్యైర్హోమద్రవ్యాంజనం స్మృతమ్.

యవైర్హుతే శ్రియఃప్రాప్తి స్త్రీలై రాజ్యైరఘక్షయః,

తిలతండులసిద్దార్దజాలైర్వశ్యో నృపో భవేత్.

అపామార్గార్కదూర్వాణాం హోమో లక్ష్మీప్రదోఽఘనుత్,

శ్రీవశ్యకృత్ప్రియంగుణాం మురామం భూత శాంతిదః. అశ్వత్థోదుంబరప్లక్షవటబిల్వసముద్భవాః,

సమిధో లభతే హుత్వా పుత్రానాయుర్ధనం సుఖమ్.

నిర్మోక హేమసిద్ధార్థలవణైశ్చోరనాశనమ్,

రోచనాగోమయైస్తమ్భో భూప్రాప్తిశ్శాలిభిర్హుతైః.

హోమసంఖ్యా తు సర్వత్ర సహస్రాదయుతావధి,

ప్రకల్పనీయా మన్త్రజ్ఞేః కార్యగౌరవలాఘవాత్.

కార్తవీర్యస్య మంత్రాణాముచ్యతే లక్షణం బుధైః,

కార్యవీర్యార్జునం జేన్తం సర్వమంత్రేషు యోజయేత్.

స్వబీజాద్యో దశార్ణోసౌ అన్యే నవశివాదికా,

ఆద్యబీజద్వయేనాసౌ ద్వితీయే మన్త్ర ఈరితః.

స్వకామాభ్యాం తృతీయోసౌ స్వభూభ్యాం తు చతుర్థకః,

స్వపాశాభ్యాం పంచమోసా షష్ఠ స్స్వేన చ మాయయా.

స్వాంకుశాభ్యాం సప్తమస్స్యాత్స్వరమాభ్యామధాష్టమః,

స్వవాగ్భవాభ్యాం నవమో వర్మాస్త్రాభ్యామధాంతిమ:

ద్వితీయాదినవాంతేషు బీజమోస్స్యాద్వతిక్రమః

మంత్రే తు దశమే వర్ణా నవవర్మాస్త్రమధ్యగాః.

ఏతేషు మంత్రవర్యేషు స్వానుకూలం మనుం భజేత్,

ఏషామాద్యే విరాట్ఛన్దోఽన్యేషు త్రిష్టుబుదాహృతమ్.

దశమంత్రా ఇమే ప్రోక్తా యదా స్యుః ప్రణవాదికాః,

తదాదిమశ్శివార్లస్స్యాదన్యే తు ద్వాదశక్షరాః

త్రిష్టుప్ఛన్దస్తదాద్యే స్యాదన్యేషు జగతీ మతా,

ఏవం వింశతిమంత్రాణాం యజనం పూర్వవన్మతమ్.

దీర్ఘాఢ్యమూలబీజేన కుర్యాదేవం షడంగకమ్,

తారో హృత్కార్తవీర్యార్జునాయ వర్మాస్త్రఠద్వయమ్.

చతుర్దశార్ణో మంత్రోయమ ప్యేజ్యా పూర్వవన్మతా,

భూనేత్రసమనేత్రాక్షివర్ణైరస్యాంగపంచకమ్.

తారో హృద్భవాన్ జేన్తః కార్యవీర్యార్జునస్తథా,

వర్మాస్త్రాగ్ని ప్రియా మన్త్రః ప్రోక్తో హ్యాశ్టాదశార్ణకః.

త్రివేదపస్తయుగ్మాక్షి వర్ణైః పంచాంగకం మనోః,

నమో భగవతే శ్రీతి కార్తవీర్యార్జునాయ చ.

సర్వదుష్టాంతకాయేతి తపోబలపరాక్రమః,

పరిపాలితసప్తాంతే ద్వాపాయ సర్వరాపదమ్.

జన్యచూడామణాంతే యే మహాశక్తి మతే తతః,

సహస్రదహనప్రాంతే వర్మాస్త్రంతో మహామనుః.

త్రిషష్టివర్ణవాన్మోక్తః స్మరణాత్సర్వవిఘ్నహృత్,

రాజన్య చక్రవర్తీ చ వీరశ్శూరస్తృతీయకః.

మాహిష్మతీపతిః పశ్చాచ్చతుర్థస్సముదీరితః,

రేవాంబుపరితృప్తశ్చ కాణో హస్తప్రచాదితః.

హస్తైర్జలౌఘం రుంధన్తం ధ్యాయేన్మత్తం నృపోత్తమమ్,

ఏవం ధ్యాత్వా యుతం మన్త్రం జపేదన్యత్తు పూర్వవత్.

పూర్వం తు ప్రజ పేల్లక్షం పూజయోగశ్చ పూర్వవత్,

కార్తవీర్యార్జునో నామ రాజా బాహుపహప్రవాన్.

తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ సంవదేత్,

లభ్యతే మన్త్రవర్యోయం ద్వాత్రింశద్వర్ణసంయుతః.

పాదైస్సర్వేణ పంచాంగం ధ్యానపూజాది పూర్వవత్,

కార్తవీర్యాయ శబ్దాన్తే విద్మహే పదముచ్చరేత్.

మహావీర్యాయ వర్ణాంతే ధీమహీతి పదం వదేత్,

తన్నోఽర్జునః ప్రవర్ణాన్తే చోదయాత్పదమీరయేత్.

గాయత్రేషార్జునస్యోక్త ప్రయోగాదౌ జపేత్తు తామ్,

అనుష్టుబం మనుం రాత్రౌ జపతా చౌరపంచయాః.

పలాయన్తే గృహాద్దూరం తర్పణాద్ధవనాదపి అధో దీపవిధిం వక్ష్యే కార్తవీర్యప్రియంకరమ్.

స్వబీజానంగధ్రువవాక్కర్ణికముగా అష్టదలపద్మమును లిఖించవలయును. తారాది వర్మాంతదళమును, శేషవర్ణములను మధ్యదలములనుగా, ఊష్మాంత్యస్వరములు కింజల్కములుగా శేషార్ణపరివేష్టితముగా కోణములందు అలంకరించబడిన భూత వర్లగృహముగా కార్తవీర్యార్జు యంత్రమును పరిశుద్ద భూమియందు అష్టగంధములతో లిఖించి, ఆ యంత్రమున కుంభమును ప్రతిష్టించి, కుంభమున ఆవాహన గావించి రాజును అర్పించవలయును. కుంభమును స్పృశించి జితేంద్రియుడే ఒకవేయి జపించవలయును. ఆ కుంభోదకముచే అభి షేకము చేసినచో సర్వాభీష్టములు సిద్ధించును. పుత్రులు, కీర్తి రోగనాశము, ఆయుష్యము, స్వజనరంజనము, వాక్సిద్ధి, చక్కని నేత్రములు కుంభోదకాభి షేకముచే లభించును. శత్రువులవలన ఉపద్రవము సంభవించినపుడు, గ్రామమున ఉపద్రవములు సంభవించినపుడు. శత్రుభీతినివృత్తి కొరకు ఈ యంత్రమును స్థాపించవలయును. ఆవాలు, మినుములు, వుల్లి, పత్తి వీటి చే హోమముగావించినచో శత్రు సంహారము జరుగును. ఉమ్మేంతచే శత్రుస్తంభనము, నిమ్మకాయలచే ద్వేషము, పద్మములచే వశ్యత కలుగును. ఉచ్చాటనలో విభీతక సమిధలచే చంద్రసమిధలచే హోమమును చేయవలయును. కటు తైలమహిష్యాజ్యములను హోమద్రవ్యములుగా కూర్చుకొనవలయును. యవహోమముచే 'శ్రీప్రాప్తి, తీలలచే నేతిచే పాపనాశము, తిలతండుల సర్టపములచే రాజవశ్యత, ఉత్తరేణి దూర్వలచే హోమము చేసిన లక్ష్మీప్రదము పాపనాశము. ప్రియంగు హోమము స్త్రీ వశకరము. మురహోమము భూతశాంతి ప్రదము. రాగి, మేడి, జువ్వి మజ్జి, మారేడు సమిధలచే హోమము గావించిన పుత్రులు ఆయుష్యము ధనము, సుఖము లభించును. నిర్మోకముచే, హోమముచే, ఆవాలచే, లవణములచే హోమముగావించినచో చోరనాశము జరుగును. రోచనాగోమయములచే స్తంభనము, శాలిహోమముచే భూప్రాప్తి కలుగును. అంతట ఆయాకార్యలాఘవ గౌరవములననుసరించి హోమసంఖ్యను వేయి నుండి పదివేలు వరకు బుద్దిమంతులు నిర్ణయించుకొనవలయును. పండితులు కార్తవీర్యార్జున మంత్ర లక్షణము నిట్లు చెప్పుదురు. అన్ని మస్త్రములలో కార్తవీర్యార్జునొయ అని చెప్పవలయును. స్వబీజము ఆద్యముగా ఈ మంత్రము దశాక్షరము, మిగిలిన మంత్రములు నవ ఏకాదశాక్షరములు. ఆద్యబీజద్వయముచే ఇదియే రెండవ మంత్రమగును. స్వకామములచే తృతీయమన్త్రమగును. స్వభ్రువులచే చతుర్థము, స్వపాశములచే పంచమము. స్వమాయ షష్ఠము, స్వాంకుశములచే సప్తమము, స్వరములచే అష్టమము, స్వవాగృవములచే నవము, వర్మాస్త్రములచే దశమము. రెండవ మంత్రమునుండి తొమ్మిదవ మంత్రము వరకు బీజవ్యతిక్రమము జరుగును. దశమ మంత్రమున నవవర్మాస్త్రమధ్యగములు ఈ మంత్రములలో తమకు అనుకూలమగు మంత్రమును సేవించవలయును. ఆ మంత్రములలో మొదటి మంత్రముల విరాట్చనస్సు, మిగిలిన తొమ్మిదింటిలో త్రిష్టప్పందస్సు. ఈ దశమంత్రములు ప్రణవాదికములైనచో మొదటి మంత్రము ఏకాదశాక్షరి, మిగిలిన మంత్రములు ద్వాదశాక్షరులగును. ప్రణవాదికమైనపుడు మొదటి మంత్రము త్రిషుప్పందస్సు. మిగిలిన వాటిలో జగతి ఛందస్సుండును. ఇట్లు ప్రణవరహితములు పది, ప్రణవాదిమములు పది మొత్తము ఇరువది "మంత్రములకు పూజాదికమంతయు పూర్వమువలె నాచరించవలయును. ఈ మంత్రములకు దీర్జాడ్యమగు మూలబీజముచే షడంగ కల్పన చేయవలయును. తారము, హృదయము, కార్తవీర్యార్జునాయ అనునది కవచము. ఈ ద్వయము అస్త్రము. ఈ మంత్రము పదునొలుగక్షరములు కలది. దీని పూజాదికమంతయు పూర్వమువలే నాచరింపవలయును. 1, 3, 2, 3, 3 వర్ణములచే పంచొంగ కల్పన చేయవలయును. “ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హుం ఫట్ స్వాహా” అనునది పదినెనిమిదిక్షరములు గలది. 3, 4, 1, 2, 3 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలయును. “నమో భగవతే శ్రీకార్తవీర్యార్జునాయ సర్వదుష్టాన్లకాయ తపోబలపరాక్రమపరిపాలితసప్తద్వీపాయ సర్వరాజన్య చూడామణయే మహాశక్తిమతే సహస్ర దహన హుం ఫట్” అనునది మహామంత్రము. అరువది మూడు వర్ణములు కలది. ఈ మంత్రమును స్మరించినంతనే సర్వవిఘ్నములు తొలగిపొవును. రాజన్య చక్రవర్తీ, వీరః, శూర, మాహిష్మతీపతి, రేవాంబు పరితప్తః, హస్తప్రచాదిత దశాస్య?" అను ఈ ఆరుపదములకు చతుర్ధి విభక్యంతములుగా షడంగకములను కల్పించవలయును. నర్మదా నదీ జలములలో యువతులచే నీరు చల్లబడగా ఆడుచున్న హస్తములచే జలప్రవాహమును అరికట్టుచున్న మదించిన రాజశేషుని ధ్యానించవలయును. ఇట్లు ధ్యానించి మంత్రమును పదివేలు జపించవలయును. మిగిలిన దంతయూ పూర్వము వలె నాచరించవలయును. మొదటి మంత్రమును లక్ష జపించవలయును. పూజోధ్యానాదికము పూర్వము వలెనే కార్తవీర్యార్జునుడను పేరుగల రాజు వేయి చేతులు కలవాడు. అతని స్మరించినంత మాత్రముననే, హరించబడినది నశించబడినది లభించును. ఈ మంత్రము ముప్పది రెండు వర్ణములు కలది. సర్వపోదములచే పంచొంగ కల్పన చేయవలయును. ధ్యానపూజాదికమంతయు పూర్వము వలె నాచరించవలయును. “కార్త వీర్యాయ విద్మహే మహావీర్యాయధీమహితన్న్వోర్టునః ప్రచోదయాత్” ఇది కార్తవీర్యార్జున గాయత్రి ప్రయోగాదులందు దీనిని జపించవలయును. అనుష్టుప్ మంత్రమును - రాత్రిపూట జపించినచో చోరభయము నశించును. చోరులు ఆ ఇంటినుండి దూరముగా పారిపోవుదురు. తర్పణము గావించినను హోమము గావించిననూ చోరులు పారిపోవుదురు. ఇక ఇపుడు కార్తవీర్యార్జునునకు ప్రీతికరమగు దీపవిధిని చేప్పెదను.

వైశాఖే శ్రావణే మార్గే కార్తి కాశ్వినపౌషతః,

మాఘపాల్గునయో ర్మాసో ర్దీపారంభం సమాచరేత్.

తిధౌ రిక్త విహీనాయాం వారే శనికుజౌ వినా,

హస్తోత్తరాశ్విరౌద్రాయ పుష్యవైష్ణవవాయుభే,

ద్విదైవతే చ రోహిణ్యాం దీపారంభో వాలూవహాః,

చరమే చ వ్యతీపాతే ధృతో వృద్ధౌ సుకర్మణి.

ప్రీతా హర్షం చ సౌభాగ్యే శోభనాయుష్మ తోరపి,

కరణే విష్టిరహితే గ్రహణేరోదయాదిషు.

యోగేషు రాత్రౌ పూర్వాహ్ణో దీపారంభః కృతశ్శుభః,

కార్తి కే శుక్లసప్తమ్యాం నిశీధ్యేఽ తీవ శోభనః.

యది తత్ర రవేర్వార శ్శ్రవణం భం చ దుర్లభమ్,

అత్యావశ్యకకార్యేషు మాసాదీనాం న శోధనమ్.

ఆద్యే హ్యుపోష్యనియతో బ్రహ్మాచారీ స పేత కైః,

ప్రాతస్స్నాత్వా శుద్దభూమౌ లిప్తాయాం గోమయోదకైః.

ప్రాణానాయమ్య సంకల్ప్య న్యాసాన్పూర్వోదితాంశ్చరేత్,

షట్కోణం రచయేద్భూమౌ రక్త చన్హనతండులైః

అతస్స్మరం సమాలిఖ్య షట్కోణేషు సమాలిఖేత్,

న వార్ణైర్వేష్టయేత్తచ్చ త్రికోణం తద్భహిఃపునః.

ఏవం విలిఖితేయన్త్రే నిదద్ధ్యోద్దీపభాజనమ్,

స్వర్ణజం రజతోత్థం వా తామ్రజం తదభావతః.

కాంస్యపాత్రం మృణ్మయం చ కనిష్ఠం లోహజంమృతా,

శాంతయే ముద్దచూర్ణోత్థం సంధౌ గోధూమ చూర్ణజమ్.

ఆజ్యే పలసహస్రే తు పాత్రం శతపలం స్మృతమ్,

ఆజ్యేయుతపలే సాత్రం పలపంచాశతో స్మృతమ్.

పంచసప్తతి సంఖ్యేతు పాత్రం షష్టిపలం స్మృతమ్,

త్రిసాహస్రి ఘృతపలే శర్కరాఫలభాజనమ్.

ద్వీసాహస్ర్యం ద్విశతమి తంచ భోజనమిష్యతే,

శతేఽక్షిచరసంఖ్యాతమేవమన్యత్ర కల్పయేత్.

నిత్యదీ పే వహ్నిపలం పాత్రూజ్యం పలం స్మృతమ్,

ఏవం పాత్రం ప్రతిష్ఠాథ్య వర్తస్సూత్రశ్రితాః క్షి పేత్.

ఏకా తిస్యోధవా పంచ సప్తాద్యా విషమా అపి,

తిధిమానాదాసాహస్రం తంతుసంఖ్యా వినిర్మితా.

గోఘృతం ప్రక్షి పేత్తత్ర శుద్ధవస్త్రవిశోధితమ్,

సహస్రపలసంఖ్యాది దశాంశం కార్యగౌరవాత్.

సువర్ణాదికృతాం రమ్యాం శలాకాం షోడశాంగులామ్,

తదర్థం వా తదర్థం వా సూక్ష్మా గ్రాం స్థూలమూలికామ్.

విముంచేద్దాక్షిణే పాత్రమధ్యే చాగ్రే కృతార్రికామ్,

పాత్ర దక్షిణదిగ్ధేశే ముక్త్వాంగులచతుష్టయమ్.

అధోగ్రాం దక్షిణాధారాం నిఖనేచ్ఛురికాం శుభాయ్,

దీపం ప్రజ్వాలయేత్తత్ర గణేశస్మృతిపూర్వకమ్.

దీపాత్పూర్వత్రదిగ్భాగే సర్వతోభద్రమండలే,

తండులాష్టదలే వాపి విధివతాపయేద్ఘటమ్.

తత్రావాహ్య నృపాధీశం పూజయేత్పూర్వవత్సుధీః,

జలాక్షతాన్సమాదాయ దీపం సంకల్పయేత్తతః.

దీపసంకల్పమంత్ర్వోయం కథ్యతే ద్వీషు భూమితః,

 ప్రణవః పాశమాయే చ శిఖాకార్తాక్షరాణి చ.

వీర్యార్జునాయ మాహిష్మతీనాధాయ సహస్ర చ,

బాహవే ఇతి వర్ణాన్తే సహస్రపదముచ్చరేత్.

ఋతుదీక్షితహస్తాయ దత్తాత్రేయప్రియాయ చ,

ఆత్రేయాయానుసూయాంతే గర్బరత్నాయ తత్పరమ్.

నమో గ్రీవామకర్ణేన్దుస్థితౌ పాశ ఇమం తతః,

దీపం గృహోణ అముకం రక్ష రక్ష పదం పునః.

దుష్టాన్నాశయ యుగ్మం స్యాత్తథా పాతయ ఘాతయ,

శత్రూన్జహి ద్వయం మాయా తారం ప్వం బీజమాత్మ భూః

వహ్నిప్రియా అనేనాథ దీపవర్యేణ పశ్చిమా,

భీముఖినాముకం రక్ష అముకాంతే వరప్రద.

మాయాశద్వయం వామనేత్రచన్ద్రాయుతం శివా,

వేదాదికోమచాముండా స్వాహా తు పూసబిందుకా.

ప్రణవోఽగ్నిప్రియామంతరో నేత్రబాణాధరాక్షరః,

దత్తాత్రేయో మునిర్మాలా మంత్రస్య పరికీర్తితః.

ఛన్దోఽమితం కార్తవీర్యార్జునో దేవోభిలాషీకృత్,

చాముండయా షడంగాని చరేత్షడ్దీరయుక్తయా.

ధ్యాత్వా దేవం తతో మస్త్రం పఠిత్వాంతే క్షిపేజ్జలమ్,

గోవిన్దాడ్యో హలీ సేన్దుశ్చాముండీ బీజమీరితమ్.

తతో నవాక్షరం మన్త్రం సహస్రం తత్పురో జుపేత్,

తారాఽనంతో బిన్దుయుక్తో మాయాసం వామనేత్రయుక్.

కూర్మాగ్రీ శాంతి బిన్ద్వాడ్యౌ వహ్నిజాయాంకుశం ధ్రువమ్,

ఋషిః పూర్వోదితోనుష్టుప్ఛన్దోన్యత్పూర్వవత్పునః.

సహస్రం మన్త్రరాజం చ జపిత్వా కవచం పఠేత్,

ఏవం దీపప్రదానస్య కర్తాప్నోత్యఖిలేప్సితమ్.

దీపప్రబోధకాలే తు వర్జయేదశుభాం గిరమ్,

విప్రస్య దర్శనం తత్ర శుభదం పరికీర్తితమ్.

శూద్రాణాం మధ్యమం ప్రోక్తం మేచ్ఛస్య వధబంధనమ్,

ఆఖ్వోత్వోర్దర్శనం దుష్టం గవాశ్వస్య సుఖావహమ్.

 దీపజ్వాలాసమాసిద్ధ్యే వక్రా నాశవిధాయినీ,

సశబ్దా భయదా కర్తురుజ్జ్వలా సుఖదా మతా.

కృష్ణా శత్రుభయోత్పత్యై నమన్తీ పశునాశినీ,

కృతే దీ పే యదా పాత్రం భగ్నం దృశ్యేత దైవతః.

పక్షాదర్వాక్తదా గచ్ఛేద్యజమానో యమాలయమ్,

వర్త్యంతరం యదా కుర్యాత్కార్యం సిద్ద్యేద్విలంబతః.

నేత్రహీనో భవేత్కర్తా తస్మిపాంతరే కృతే,

అశుచిస్పర్శనే వ్యాధిద్దీపనాశే తు చౌరభీ:.

శ్వమార్జారాఖుషం భవేద్భూపతితో భయమ్,

పాత్రారంభౌ వసుపలైః కృతో దీపోఽఖిలేష్టదః.

తస్మాద్దీపః ప్రయత్నేన రక్షణీయోంతరాయతః,

అసమాప్తేః బ్రహ్మచర్యం చ భూశయః.

స్త్రీ శూద్రపతితాదీనాం సంభాషామపి వర్జయేత్,

జపేత్సహస్రం ప్రత్యేకం మంత్రరాజం నవాక్షరమ్.

స్తోత్రపాఠం ప్రతిదినం నిశీధిన్యాం విశేషతః

ఏకాపాదేన దీపాగ్రే స్థిత్వా యో మంత్రనాయకమ్.

సహస్రం ప్రజ పేద్రాత్రౌ సోఽభీష్టం క్షిప్రమాప్నుయాత్,

సమాప్య శోభనదినే సంభోజ్య ద్విజపత్తమాన్.

కుంభోద కేన కర్తారమంభిషించన్మనుం జపేత్,

కర్తా తు దక్షిణాం దద్యాత్పుష్కలాం తోష హేతవే.

గురౌ తుష్టే దదాతీష్టం కృతవీర్యసుతో నృపః,

గుర్వాజ్ఞయా స్వయం కుర్యాద్యది వా కారయేద్గురుః.

దత్వా ధనాదికం త స్మె దీపదానాయ నాగద,

గుర్వాజ్ఞామన్త్రరా కుర్యాద్యో దీపం స్వేష్ట సిద్ధయే.

సిద్దిర్న జాయతే తస్య హానిరేవ పదే పదే,

ఉత్తమం గోఘృతం ప్రోక్తం మధ్యమం మహిషీభవమ్.

తిలతైలం తు తాదృక్యొత్కవీయోఽజాదిజం ఘృతమ్,

ఆస్యరోగే సుగంధేన దద్యాత్తెలేన దీపకమ్.

సిద్ధార్థపంభవే నాథ ద్విషతాం నాశనాయ చ సహస్రేణ పలైర్దీపే విహితే చ న దృశ్యతే.

కార్య సిద్ధిస్తదా కుర్యాత్తివారం దీపజం విధిమ్,

తదా సుదుర్లభమపి కార్యం సిద్ద్యేన్న సంశయః దీపప్రియః

కార్తవీర్యో మార్తండో నతివల్లభః,

సుతిప్రియో మహావిష్ణుర్గణేశస్తర్పణప్రియః.

దుర్గార్చనాప్రియా నూనమభి షేకప్రియశ్శివః,

తస్మాత్తేషాం ప్రతోషాయ విదధ్యాత్తత్తద్దరాత్.

 ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే కార్తవీర్యమాహాత్మ్య మన్త్రదీప కథనం నామ షట్సప్తతితమోఽధ్యాయః.

వైశాఖ శ్రావణ మార్గశీర్ష కార్తిక ఆశ్వయుజ పౌష్య మాఘ ఫాల్గుణ మాసములలో దీపారంభము నాచరించవలయును. రిక్తవిహీనతిథియందు, శని మంగళ వారములు తప్ప మిగిలిన వారములలో, హస్త, ఉత్తర, అశ్విని, ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, అనూరాధ, విశాఖ రోహిణీ నక్షత్రములలో దీపారంభము శుభావహము. చరమమునందు, వ్యతిపాతనందు, ధృతి, వృద్ధి, సుకర్మ ప్రీతి, హర్ష సౌభాగ్య, శోభన ఆయుష్మత్ యోగములందు, విష్టిరహిత కరణమునందు గ్రహణమున అక్టోదయా యోగములందు రాత్రియందు కానీ, పూర్వాహ్లామున కాని దీపారంభమును చేసిన శుభావహము. కార్తీక శుద్ధ సప్తమీ నిశీధ కాలము అతిశుభప్రదము. ఆ దినమున ఆదివారము, శ్రవణా నక్షత్రముండుట అత్యంత శుభప్రదము కాని ఇట్లు కలియుట అతిదుర్లభము. అత్యావశ్యక కార్యములందు మాసాదులను చూడవలసిన అవసరములేదు. మొదటి దినమున ఉపవసించి, నియమ బద్ధుడై, బ్రహ్మ చారియై, ప్రాతఃకాలమున స్నానమాచరించి గోమయోదకములచే అలికిన పరిశుద్ధమైన భూమియందు, ప్రాణాయామముచేసి సంకల్పముచెప్పి పూర్వోక్తన్యాసములాచరించి రక్తచందన తండులములచే భూమియందు షట్కోణము నేర్పరిచి, దాని పై మన్మథుని లిఖించి షట్కోణములందు నవాక్షరములచే పరివేష్టించి, దాని వెలుపల త్రికోణమును లిఖించవలయును. ఇట్లు లిఖించిన యంత్రమునందు దీపపాత్రను ఉంచవలయును. బంగారు, వెండి, రాగి, కంచు, మట్టులలో దేనితోనైనను దీపపాత్రను చేయవచ్చును. ఇనుపపాత్ర అధమాధమము. శాంతికొఱకు పెసరుపిండి, సంధి విషయమున గోధుమ పిండిని చేయవలయును (పాత్రగా) వేయి పలముల నేయికి నూరు పలముల పాత్ర ఉండవలయును. పదివేల పలముల నేయికి అయిదొందల పలముల పాత్ర ఉండవలయును. మూడు వేల పలముల నేయి ఉన్నచో పాత్ర వేయి పలములది యుండవలయును. రెండు సహాస్రముల పలముల నేయికి రెండొందల పలముల పాత్రయుండవలయును. ఇట్లే ఇతర మానములను' కూడా ఊహించవవలయును. నిత్యదీపమున నాలుగు పలముల పాత్ర ఒక పలము నేయి ఉంచవలయును. ఇట్లు పాత్ర ప్రతిష్టచేసి సూత్రములనుండి ఏర్పరిచిన వత్తులనుంచవలయును. ఈ వత్తులు ఒకటి, మూడు అయిదు, ఏడు కొని - విషమ సంఖ్యలు గలవి, తిధి మానము ననుసరించి వేయివరకు తంతుసంఖ్య ఉండవచ్చును. శుద్ద వస్త్రశోధితమగు గోఘృతమును ఆ పాత్రలో నుంచవలయును. కార్య గౌరవ లాఘవముల ననుసరించి వేయి పలముల నుండి నూరు పలముల వరకు నేయిని ఉంచవలయును. సువవదులచే చేయబడిన సుందరమగు పదునొరంగుళముల శలాకను కొని ఎనిమిదంగులముల శలాకను కాని, నాలుగంగుళముల శలాకను కొని సూక్ష్మా గ్రము, స్థూలమూలము గలదానిని పాత్ర మధ్యమున దక్షిణ భాగమున నుంచవలయును. పాత్ర దక్షిణ దిగ్భాగమున అంగులచతుష్టయమును వదిలి దక్షిణాధారముగా అధోగ్రముగా ఛూరికను భూమిలో నుంచవలయును. గణేశుని స్మరించుచు దీపమును వెలిగించవలయును. దీపమునకు పూర్వదిగ్భాగమున సర్వతో భద్రమండలమున కొని తండులరచితమైన అష్టదల పద్మమున కాని యథావిధిగా కుంభమును ప్రతిష్ఠించవలయును. ఆ కుంభమున కార్తవీర్యార్జునుని ఆవాహనగావించి పూర్వమువలే పూజించవలయును. జలాక్షతలను తీసుకొని దీపసంకల్పమును చేయవలయును. ఇది దీపసంకల్పమంత్రము, ప్రణవము, పాశమాయలు, శిఖా తరువాత “కార్తవీర్యార్జుసాయ మాహీష్మ తీనాధాయ సహస్రబాహవే సహస్రక్రతుదీక్షితహస్తాయ దత్తాత్రేయప్రియాయ ఆత్రేయాయానసూయాగర్భ రత్నాయ నమః” అని పలికి గ్రీవామకర్లేన్దుస్థితములుగా పాశమును ఏర్పరిచి, “ఇమం దీపం గృహాణ అముకం రక్ష రక్ష, దుష్టాన్నాశయ నాశయ పాతయ పాతయ, ఘాతయ ఘాతయ, శత్రూన్జహిజహి” అని పలికి మాయాతారము స్వబీజము ఆత్మ భూ స్వాహా" అను మంత్రముచే పశ్చిమాభిముఖముగానున్న దీపరాజముచే “అముకం రక్ష అముకంప్రద” అనవలయును. మాయా ఆకాశద్వయము, వామనేత్ర , చన్దయుతము శివా వేదాది కామ చాముండలు స్వాహా పూ, బిందుకొ, ప్రణవము, స్వాహా కలిసిన మంత్రము నేత్ర బాణాధరాక్షరము. ఈ మాలామంత్రమునకు దత్తాత్రేయుడు ముని. అమిత ఛందస్సు కార్తవీర్యార్జునుడు దేవత. అఖిలాభీష్టదుడు చాముండచే షడంగములను కల్పించవలయును. ఇట్లు కార్తవీర్య దేవుని ధ్యానించి మంత్రమును పఠించి జలమును విడువవలయును. గోవిందాడ్యుడు గుహలి సెందును, చాముండీ బీజము. తరువాత నవాక్షరమంత్రమున వేయి జపించవలయును. తారము అనంతము బిన్దుయుక్తము మాయాస్వము వామనేత్రయుతము కొర్మాగ్రి శాంతిబింద్వాఢ్యములు స్వాహా అంకుశము ధ్రువము. పూర్వోక్త ఋషి అనుష్టుపుందస్సు. మిగిలినదంతయు పూర్వోక్త ముగా చూడవలయును. మంత్రమును వేయి మార్లు జపించి కవచమును పఠించవలయును. ఇట్లు దీప ప్రదానము గావించినవాడు సకలాభీష్టములను పొందును. దీపము వెలుగుచున్న సమయమున అశుభమును మాటలాడరాదు. దీపము వెలుగుచున్నపుడు బ్రాహ్మణదర్శనము శుభప్రదము. శూద్రదర్శనము మధ్యమము. మేచ్చ దర్శనము వధ బంధాదికమును కలిగించును. ఎలుకను 'పిల్లిని చూచుట అశుభము. గోవును, అశ్వమును చూచుట శుభప్రదము. దీపజ్వాల సమముగానున్నచో సిద్దికలుగును. వక్రముగానున్నచో నాశకరము. ధ్వని కలిగినచో భయమునిచ్చును. చక్కగా ప్రకాశమున్నచో సుఖమునిచ్చును. నలుపు వర్ణము కలదైనచో శత్రు భయమును కలిగించును. నేయిని కక్కుచున్నచో పశునాశకము. దీపముంచినపుడు దైవవశమున పాత్ర భగ్నమైనచో పది హేను రోజులలో పే యజమాని యమాలయము చేరును. దీపమున మరియొక వత్తి చేర్చినచో కార్య సిద్ధి విలంబమగును. ఆ దీపమున మరియొక దీపమును వెలిగించినచో కర్త నేత్రహీనుడగును. అపరిశుద్దుడు స్పృశించినచో వ్యాధి కలుగును. దీపము వెలిగినచో చోరభయము కలుగును. కుక్క, పిల్లి, ఎలుకలు స్పృశించినచో రాజభయము కలుగును. పాత్రారంభమున ఎనిమిది పలములచే చేసిన దీపము అఖిలాభీష్టప్రదము. కావున దీపమునకు విఘ్నము కలుగకుండ ప్రయత్నించి రక్షించవలయును. వ్రత సమాప్తివరకు బ్రహ్మ చర్యమును, భూశయనమును అనుష్ఠించవలయును. స్త్రీ శూద్ర పతితులచే మాటాడరాదు. నవాక్షర మంత్రరాజమును సహస్రము జపించవలయును. ప్రతిదినము స్తోత్రమును పఠించవలయును. నిశీధకాలమున పఠించినచో విశేష ఫలప్రదము. దీపము ముందర ఒంటి పాదముచే నిలిచి రాత్రిపూట మంత్రమును వేయిమార్లు జపించినచో అభీష్టమును త్వరగా పొందును. శుభదినమున సమాప్తి చేయు బ్రాహ్మణులకు భోజనదొనము కావించి, మంత్రమును జపించుచు కుంభోదకముచే కర్తను అభి షేకించవలయును. కర్త బ్రాహ్మణులను సంతోషింప చేయుటకు సమృద్ధిగా దక్షిణనీయవలయును. గురువు సంతోషించినచో కార్తవీర్యార్జునుడు ఇష్టమును ప్రసాదించును.. గురువాజ్ఞచే తాను కూడా చేయవచ్చును. లేదా గురువు చేయించవచ్చును. గురువునకు ధనాదికమునిచ్చి చేయించవలయును. గురువాజ్ఞ లేనిదే స్వేసిద్ది కొఱకు కర్త ఆచరించినచో కార్య సిద్ధి కలుగక పోగా ప్రతి క్షణము హాని కలుగుచుండును. దీపమునకు గోఘృతము ఉత్తమము, మహేషీ ఘృతము మధ్యమము. నువ్వుల నూనె కూడా మధ్యమమే అజాది ఘృతము అధమము. ఆస్యరోగము సంభవించినపుడు సుగంధ తైలముచే దీపము నుంచవలయును. శత్రునాశమునకు ఆవాల నూనెచే దీపమునుంచవలయును. సహస్ర పలముల ఘృతముచే దీపమును వెలిగించిననూ కార్యసిద్ధి కలుగనిచో మూడు మార్లు దీపమును వెలిగించిననూ కార్య సిద్ధి కలుగనిచో మూడు మార్లు దీపవిధి నాచరించవలయును. అపుడు అతిదుష్కరమగు కార్యము కూడా సిద్ధించియే తీరును. కార్తవీర్యార్జునుడు దీప ప్రియుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. మహా విష్ణువు స్తుతి ప్రియుడు. గణేశుడు తర్పణ ప్రియుడు. దుర్గా అర్చనా ప్రియురాలు. శివుడు అభిషేక ప్రియుడు. కావున వారి వారి సంతోషము కొఱకు ఆయావిధుల నార్చించవలయును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున కార్తవీర్యమాహాత్మ్యమౄదీపకథనమును డెబ్బది యార -  అధ్యాయము సమాప్తము.