38 - గంగామాహాత్మ్యవర్ణనమ్

వసిష్ట ఉవాచ:

సవసుర్నృపశార్దూల మోహినీం యాజ్యకామినీమ్

ఉవాచ శ్లక్షయా వాచా సర్వలోకహితే రతః

వసురువాచ:-

శృణు మోహిని వక్ష్యామి తీర్థానాం లక్షణం పృథక్

యేన విజ్ఞాతమాత్రేణ పాపినాం గతిరుత్తమా

సర్వేషామపి తీర్థానాం శ్రేష్ఠా గంగా ధరాతలే

న తస్యా సదృశం కించిత్ విద్యతే పాపనాశనమ్

తచ్ఛృత్వా వచనం తస్య వసోః స్వస్య పురోధసః

ప్రణతా మోహినీ ప్రాహ గంగాస్నానకృతాదరా

మోహిన్యువాచ:

భగవన్వాడవశ్రేష్ఠ గంగామాహాత్మ్యముత్తమమ్

సర్వేషాం చ పురాణానాం సంమతం వద సాంప్రతమ్

శ్రుత్వా మాహాత్మ్యమతులం గంగాయాః పాపనాశనమ్

పశ్చాతాపవినాశిన్యాం స్నాతుం యాస్యే త్వయా సహ

తచ్చృత్వా మోహినీవాక్యం వసుః సర్వపురాణవిత్

మాహాత్మ్యం కథయామాస గంగాయాః పాపనాశనమ్

వసిష్ఠమహర్షి పలికెను:- వసువు శుద్ధిపొందదలచిన మోహినిని సర్వలోక హితమును కోరి మృదువుగా ఇట్లు పలికెను.

వసువు పలికెను:- ఓ మోహినీ వేరు వేరుగా తీర్థ లక్షణములను చెప్పెదను వినుము. ఇవి తెలిసినంతనే పాపులకుత్తమగతి లభించును. భూలోకమున అన్ని తీర్థములలో శ్రేష్టమైనది గంగాతీర్థము. గంగతో సమానమగు పాపనాశకతీర్థము మరియొకటి లేదు. ఆ మాటను వినిన మోహిని గంగా స్నానము చేయదలచి వసువుతో ఇట్లు పలికెను.

మోహిని పలికెను:- ఓ బ్రాహ్మణ శ్రేష్టా! సర్వపురాణ సమ్మతమగు ఉత్తమగంగా మహాత్మ్యమును ఇపుడు చెప్పుము. పాపనాశకమగు గంగా మహాత్మ్యమును విని నీతో కలిసి పాపనాశినిలో స్నానము చేయుటకు వెళ్ళేదను. ఆ మోహినీ వాక్యమును వినిన సర్వపురాణ విదుడగు వసువు పాపనాశకమగు గంగా మహాత్మ్యమును చెప్పసాగెను.

వసురువాచ:-

తే దేశాస్తే జనపదా స్తేశైలా స్తేఽపిచాశ్రమాః

యేషాం భాగీరధీ పుణ్యా సమీపే వర్తతే సదా

తప్ప సా బ్రహ్మచర్యేణ య జ్ఞైస్త్యాగేన వా పునః

తాం గతిం న లభేత్ జంతుర్గంగాం సంసేవ్య యాం లభేత్

పూర్వే వయసి పాపాని కృత్వా కర్మాణి యే నరాః

శేషే గంగాం నిషేవంతే తేఽపి యాంతి పరాం గతిం

తిషేద్యుగసహస్రం తు పాదేనేకైన యః పుమాన్

మాసమేకం తు గంగాయాం స్నాతస్తుల్యఫలావుభౌ

తిష్ఠేతార్వాక్శిరా యస్తు యుగానామయుతం పుమాన్

తిషేద్యధేష్టం యశ్చాపి గంగాయాం స విశిష్యతే

భూతానామిహ సర్వేషాం దుఃఖోపహతచేతసాం

గతిమన్వేషమాణానాం న గంగాసదృశీ గతిః

ప్రకృష్టైః పాతకైర్ఘోరైః పాపిన పురుషాధమాన్

ప్రసహ్య తారయేద్గంగా దినాని దశ మోహిని

శుక్లప్రతిపదాదేశ్చ దినాని దశ సంఖ్యయా

పాతాళే సన్నిధానం తు కురుతే స్వయమేవ హీ

ఆరభ్య శుక్లైకాదశ్యా దినాని దశ యాని తు

పంచమ్యంతాని తాంస్వర్గే భవేత్సన్నిహితా సదా

కృతేతు సర్వతీర్థాని త్రేతాయాం పుష్కరం పరమ్

ద్వాపరేతు కురుక్షేత్రం కతౌ గంగా విశిష్యతే

కలౌతు సర్వతీర్థాని స్వం స్వం వీర్యం స్వభావతః

గంగాయాం ప్రతిముంచంతి సా తు దేవి న కుత్రచిత్

గంగాంభః కణదిగ్ధస్య వాయోః సంస్పర్శనాదపి

పాపశీలా అపి నరాః పరాం గతిమవాప్నుయుః

యోసౌ సర్వగతో విష్ణు శ్చిత్స్వరూపీ జనార్దనః

స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః

బ్రహ్మహా గురుహా గోఘ్నః స్తేయీచ గురుతల్పగః

గంగాంభసాచ పూయంతే నాత్ర కార్యా విచారణా

క్షేత్రస్థముద్ధృతం వాపి శీతముష్ణమథాపి వా

గాంగేయం తు హరేత్తోయం పాపమామరణాంతికమ్

వర్జ్యం పర్యుషితం తోయం వర్జ్యం పర్యుషితం దలమ్

న వర్జ్యం జాహ్నవీతోయం న వర్జ్యం తులసీదళమ్

మేరోః సువర్ణస్య చ సర్వరత్నైః సంఖ్యోపలానాముదకస్య వాపి

గంగాజలానాం న తు శక్తిరస్తి వక్తుం గుణాఖ్యాపరిమాణమత్ర

తీర్థయాత్రావిధిం కృత్స్నం ఆ కుర్వాణోపి యో నరః

గంగాతోయస్య మాహాత్మ్యాత్ సోఽప్యత్ర ఫలభాగ్భవేత్

చింతామణి గుణాచ్చాపి గంగాయాస్తోయబిందవః

విశిష్టా యత్ప్రయచ్ఛంతి భక్తేభ్యో వాంఛితం ఫలమ్

గండూషమాత్రతో భక్త్యా సకృద్గంగాంభసా నరః

కామధేనుస్తనూ ద్భూతాన్ భుంక్తే దివ్యరసాన్దివి

శాలగ్రామశిలాయాం తు యస్తు గంగాజలం క్షిపేత్

అపహత్య తమస్తీవ్రం భాతి సూర్యో యధోదయే

మనోవాక్కాయజైర్గ్ర స్తః పాపైర్బహువిధైరపి

వీక్ష్య గంగాం భవేత్పూతః పురుషో నాత్ర సంశయః

గంగాతోయాభిషిక్తాం తు భిక్షామశ్నాతియః సదా

సర్పవత్కంచుకం ముక్త్యా పాపహీనో భవేత్సవై

హిమవద్వంద్యసదృశా రారయః పాపకర్మణామ్

గంగాంభసా వినశ్యంతి విష్ణుభక్త్యా యధాపదః

ప్రవేశమాత్రే గంగాయాం స్నానార్థం భక్తితో నృణామ్

బ్రహ్మహత్యాది పాపాని హాహేత్యుక్త్యా ప్రయాంత్యలమ్

గంగాతీరే వసేన్నిత్యం గంగాతోయం పిబేత్సదా

యః పుమాన్సవిముచ్యత పాతక్తెః పూర్వసంచితైః

యో వైగంగాం సమాశ్రిత్య నిత్యం తిష్ఠతి నిర్భయః

స ఏవ దేవైర్మర్యైశ్చ పూజనీయో మహర్షిభిః

కిమష్టాంగేన యోగేన కిం తపోభిః కిమధ్వరైః

కిం యజ్ఞైర్భ హభిర్జాప్యైః కింతపోభిర్థ నార్పణైః

స్వర్గమోక్షప్రదా గంగా సుఖసేవ్యా యతః స్థితా

యజ్ఞైర్యమైశ్చనీయమైః దానైః సంన్యాసతోపివా

న తత్ఫలమవాప్నోతి గంగాం సేవ్య యదాప్నుయాత్

ప్రభాసే గోసహస్రేణ రాహుగ్రస్తే దివాకరే

యత్ఫలం లభతే మర్త్యో గంగాయాం తద్దినేనవై

అన్యోపాయాంశ్చ యస్త్యక్త్యా మోక్షకామః సునిశ్చితః

గంగాతీరే సుఖం తిష్ఠేత్ సవై మోక్షస్య భాజనం

వారాణస్యాం విశేషేణ గంగా సద్యస్తు మోక్షదా

ప్రతిమాసం చతుర్దశ్యాం అష్టమ్యాం చైవ సర్వదా

గంగాతీరే నివాససశ్చ యావజ్జీవం చ సిద్ధిదః

కృచ్చ్రాణి సర్వదా కృత్వా యత్ఫలం సుఖమశ్నుతే

సదా చాంద్రాయణం చైవ తల్లభేజ్జాహ్నావీ జలే

గంగా సేవాపర స్యేహ దివసార్థేన యత్పలమ్

న తచ్ఛక్యం బ్రహ్మసుతే ప్రాప్తం క్రతుశతైరపి

సర్వయజ్ఞతపోదాన యోగస్వాధ్యాయకర్మభిః

యత్ఫలం తల్లభేద్భక్త్యా గంగాతీరనివాసతః

యత్పుణ్యం సత్యవచనై ర్నైష్ఠిక బ్రహ్మచారిణామ్

యదగ్నిహోత్రిణాం పుణ్యం తత్తు గంగానివాసతః

స మాతృపితృదారాణాం కులకోటి మనంతకమ్

 గంగాభక్తిస్తారయతే సంసారార్ణవతో ధృవమ్

సంతోషః పరమైశ్వర్యం తత్వజ్ఞానం సుఖాత్మనామ్

వినయాచార సంపత్తిః గంగాభక్తస్య జాయతే

కృతకృత్యో భవేన్మర్త్యో గంగాం ప్రాస్యైవ కేవలమ్

తద్భక్తః తత్పరశస్యాత్ మృతో వాపి న సంశయః

భక్త్యా తజ్జలసంస్పర్శీ తజ్జలం పిబతే చ యః

అనాయాసేన హి నరో మోక్షోపాయం స విందతి

దీక్షితః సర్వయజ్ఞేషు సోమపానం దినే దినే

సర్వాణి యేషాం గంగాయాః తోయైః కృత్యాని సర్వదా

దేహం త్యక్త్యా నరాస్తేతు మోదంతే శివసన్నిధౌ

దేవాః సోమార్కసంస్థాని యధా శక్రాదయో మఖైః

అమృతాన్యుపభుంజంతి తథా గంగాజలం నరాః

కన్యాదానైశ్చ విధివత్ భూమిదానైశ్చ భక్తితః

అన్నదానైశ్చ గోదానైః స్వర్ణదానాదిభిస్తథా

రథాశ్వగజదానైశ్చ యత్పుణ్యం పరికీర్తితమ్

తతః శతగుణం పుణ్యం గంగాంభశ్చులుకాశనాత్

చాంద్రాయణసహస్రాణాం యత్పలం పరికీర్తితం

తతోధికఫలం గంగా తోయపానాదవాప్యతే

గండూషమాత్రపానేతు అశ్వమేధఫలం లభేత్

స్వచ్ఛందం యః పిబేత్ అంభః తస్య ముక్తిః కరేస్థితా

త్రిభిః సారస్వతం తోయం సప్తభిస్త్యధ యామునమ్

నార్మదం దశభిర్మాసై ర్గాంగం వర్షేణ జీర్యతి

శాస్త్రేణాకృతతోయానాం మృతానాం కాఽపి దేహినామ్

తదుత్తరఫలావాప్తి ర్గంగాయామస్థియోగతః

చాంద్రాయణసహస్రంతు యశ్చరేత్కాయశోధనం

యః పిబేత్తు యధేష్టం హి గంగాంభః స విశిష్యతే

గంగాం పశ్యతి యః స్తౌతి స్నాతి భక్త్యా పిబేజ్జలమ్

స స్వర్గం జ్ఞానమమలం యోగం మోక్షం చ విందతి

యస్తు సూర్యాంశునిష్టప్తం గాంగేయం పిబతే జలం

గోమూత్రయావకాహారాత్ గంగాపానం విశిష్యతే

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే మోహినీవసుసంవాదే గంగామాహాత్మ్యవర్ణనం నామ అష్టత్రింశత్తమోఽధ్యాయః.

వనువు పలికెను:- గంగానదీ సమీవ ముననున్నవి మాత్రమే దేశములు, జనపదములు, పర్వతములు ఆశ్రమములనబడును. గంగా సేవనముచే లభించు సద్గతి తపస్సుచే, బ్రహ్మచర్యముచే, యజ్ఞములచే, త్యాగముచే లభించదు. యౌవనమున పాపకర్మలను చేసిన వారు కూడా వృద్దాప్యమున గంగను సేవించినచో ఉత్తమ గతిని పొందేదరు. వేయి యుగములు ఒంటికాలు పై నిలిచి తపమును చేసినవాడు ఒక మాసము "గంగను సేవించిన వాడు సమాన ఫలమును పొందును. పదివేల యుగములు తలక్రిందులుగా తపస్సు చేసినవాడు యధేచ్చగా గంగయందు నీలిచినవానికంటే తక్కువ స్థితిలో నుండును. దుఃఖోపహతచేతస్కులగు ఉత్తమగతిని అన్వేషించు సమస్త ప్రాణులకు గంగను మించిన గతి లేదు. ప్రకృష్టములు ఘోరములగు పాపముల నాచరించిన, అపవిత్రమగు నరకమునకు వెళ్ళు పరమపాపులను కూడా సహించి నిరోధించి గంగ తరింప చేయును. గంగను ఎప్పుడూ వెళ్ళి సేవించువారు మునులతో ఇంద్రాది దేవతలతో సమానులు. అంధులను జడులను ద్రవ్యహీనులను కూడా విశ్వరూ బృహతి యను గంగ పావనము చేయును. ఇంద్రాది దేవతలచేత మునులచేత మానవుల చేత తమ సమృద్ధి కొజుకు సర్వకాలములందు సేవించబడుచున్నది. పక్షాదియందు, కృష్ణపక్షమున అమావాస్యనుండి వెనుకకు పది దినములు గంగ భూమియందు సన్నిహితముగా నుండును. శుక్ల ప్రతిపత్తు నుండి పది దినములు పాతాళమునకు సన్నిహితముగా నుండును. శుదైకాదశి నుండి పది దినములు అనగా బహుళ పంచమి వజుకు స్వర్గమునకు సన్నిహితముగా నుండును. కృతయుగమున అన్ని తీర్థములు పావనములే. త్రేతాయుగమున పుష్కరతీర్థము, ద్వాపరయుగమున కురుక్షేత్రము, కలియుగమున గంగాతీర్థము విశిష్టము. కలియుగమున అన్ని తీర్థములు తమ తమ శక్తులను గంగలో నిక్షేపించును. గంగ మాత్రము ఎచటా నిక్షేపించదు. గంగాజల కణమును తాకిన వాయువును స్పృశించిననూ పాపశీలులగు నరులు కూడా ఉత్తమ గతిని పొందెదరు. సర్వగతుడు జ్ఞాన స్వరూపుడు అగు జనార్ధనుడే ద్రవరూపమున గంగాజలముగా నిలిచేను. ఈ విషయమున సంశయముతో పనిలేదు. బ్రహ్మహత్య చేసిన వాడు, గురుహంతకుడు, గోహంతకుడు, చోరుడు, గురుతల్పగతుడు గంగా జలముచే పావనులగుదురు. ఇచట విచారించవలసిన పనిలేదు. క్షేత్రస్థమగు జలము, ఉద్ధృతమగు జలము శీతమైనను ఉష్ణమైననూ గంగా జలమైనచో మరణము వరకు చేసియున్న పాపములను హరించివేయును. ఫర్యుషితమగు జలమును వర్ణించవలయును. పర్యుషితదలమును వర్ణించవలయును. కాని గంగాజలమును తులసీదళమును వర్ణించవలసిన పనిలేదు. మేరు పర్వతగుణములను, సువర్ణ గుణములను, సర్వరత్న గుణములను, పాషాణ సంఖ్య, ఉదకసంఖ్య, గంగాజలగుణ సంఖ్య చెప్పశక్యము కానిది. సకల తీర్థయాత్రా విధి నాచరించని వారు కూడా గంగా జల సేవన మాహాత్మ్యమున ఉత్తమ గతిని పొందగలుగును. చింతామణి గుణములకంటే భక్తులకు వాంఛితార్థమును ప్రసాదించు గంగా జలబిందువులు విశిష్టములు. భక్తిచే గండూషమాత్రగంగాజల సేవనము కామధేనువు సృజించు దీవ్యభోగములననుభవించ గలుగును. శాలగ్రామశలయందు గంగాజలమును ప్రోక్షించినవాడు తీవ్రమగు అజ్ఞానమును హరించి ఉదయకాలసూర్యుని వలె ప్రకాశించును. మనోవాక్కాయపాపములు చేసినవాడు కూడా గంగా జలమును దర్శించినచో పావనత్వమును పొందును. గంగా జలాభిషిక్తమగు భిక్షను భుజించినవాడు పాము కుబుసమును విడుచునట్లు పాపములను విడుచును. హిమాలయ వింధ్య పర్వతములంతటి పాపరాశులు కూడా గంగా జలముచే విష్ణుభక్తిచే ఆపదలు తొలగునట్లు తొలగిపోవును. భక్తితో స్నానమునకై నరులు గంగా జలమున ప్రవేశించినంతనే బ్రహ్మహత్యాది పాపములు హాహాయనుచు పారిపోవును. నిత్యము గంగాతీరమున నివసించవలయును. గంగా జలమును పానము చేయవలయును. ఇట్లు చేసిన మానవుడు పూర్వ జన్మ సంచిత పాపముల నుండి కూడా విముక్తుడగును. నిత్యము .గంగనాశ్రయించి నివసించు వాడు దేవతలకు, మానవులకు, మహర్షులకు కూడా పూజించదగినవాడు. అష్టాంగ యోగముతో, తపములచే, యాగములచే ప్రయోజనము లేదు. గంగా తీరవాసమే విశిష్ట ఫలప్రదము. కాలహరణమును చేయు బహుయజ్ఞములచే, తపస్సులచే, ధనార్పణలచే ఏమి ప్రయోజనము. సర్వమోక్ష ప్రదయగు గంగ సులభ సేవ్యముగా నున్నది కదా. యజ్ఞ యమ నియమ దాన సన్యాసములచే కూడా గంగా సేవఫలము లభించజాలము. రాహుగ్రస్త సూర్యగ్రహణకాలమున ప్రభాస తీర్థమున గోసహస్రదానము చేసిన లభించు ఫలము గంగా సేవనముచే లభించును. మోక్షమును కోరువాడు అన్యోపాయములను విడిచి గంగాతీరమున ఆనందముగా నుండవలయును. ఆ గంగాతీరమే మోక్ష భోజనము. విశేషించి వారాణసీలో నున్న గంగ సద్యోమోక్షప్రదము. ప్రతిమాసమున చతుర్దశినాడు అష్టమినాడు యావజ్జీవము గంగా తీరవాసము సిద్ధిని ప్రసాదించును. ఎల్లపుడు కృచ్చవ్రతముల నాచరించి పొందు వలము, సదా చాంద్రాయణమునాచరించు వాడు పొందు వలము జాహ్నవీతీరవాసమున పొందగలుగును. సగము దినము గంగా సేవా పరుడైన వాడు పొందు వలమును, నూరు యాగములనాచరించువాడు కూడా పొందజాలడు. సర్వయజ్ఞతపోదాన యోగ స్వాధ్యాయకర్మలచే పొందు ఫలమును గంగా తీరనివాసి పొందకలుగును. సత్యవచనమున, నైష్టికబ్రహ్మచర్యమున, నిత్యాగ్నిహోత్రులకు లభించు పుణ్యము గంగాతీర నివాసులకు లభించును. మాతృపితృదారలను కోటికులమును అనంతముగా గంగాభక్తి సంసారసాగరము నుండి తరింప చేయును. సంతోషము పరమేశ్వర్యము, తత్వజ్ఞానము, వినయము, ఆచార సంపత్తి గంగా భక్తునికి సమకూరును గంగాజలమును పానము చేసినవాడు కృతకృత్యుడగును. నరుడు మృతుడైనను గంగాభక్తుడు గంగాపరుడుగనే ఉండవలయును. భక్తిచే గంగా జలమును పానము చేసినవాడు, గంగా జలమును స్పృశించువాడు సులభముగా మోక్షోపాయమును తెలియును. గంగా జలముచే సర్వకార్యముల నాచరించువాడు సర్వయజ్ఞ దీక్షితుడు, ప్రతినిత్యము సోమపానము చేసినవాడగును. సూర్యచంద్రాదులు ఇంద్రాదిదేవతలు అమృతమును పానము చేసినట్లు గంగా జలపానమును చేసిన వారు దేహమును విడిచి శివుని సన్నిధిలో ఆనందింతురు. భక్తిచే కన్యాదానమును, భూదానమును, అన్నదానమును, గోదానమును, స్వర్ణదానాదులను, రధాశ్వగజదానములను, చేసినవారికి కలుగు పుణ్యమునకు నూరురెట్లు ములుకమాత్ర గంగాజల ప్రాశనముతో కలుగును. సహస్ర చాంద్రాయణ వ్రతములనాచరించిన వారికి కలుగును. సహస్ర చాంద్రాయణ వ్రతముల నాచరించినవారికి కలుగు ఫలమునకంటే అధిక ఫలము గంగా జలపానము వలన కలుగును. గండూషమాత్ర గంగా జలపానముచే అశ్వమేధ యాగఫలము లభించును. ఇష్టపూర్వకముగా గంగా జలపానము చేసిన వారికి మోక్షము కరతలామలకముగా నుండును. మూడు మాసములు సరస్వతీ తోయము, ఏడు మాసములు యమునాజలము పది మాసములతో నర్మదా జలమును సంవత్సరము గంగా జలమును సేవించ వలయును. మరణించిన వారికి శాస్త్రవిధి. ననుసరించి తర్పణమును చేయువారి అస్తులను గంగాతోయమున కలిపినచో ఉత్తమగతులు లభించును. కాయశోధనమును చేయు సహస్ర చాంద్రాయణ వ్రతముల నాచరించిన వారికంటే యధేష్టముగా గంగా జలపానమును చేసిన వాడు విశేష ఫలమును పొందును. గంగను దర్శించినవాడు, స్తుతించినవాడు, గంగా స్నానము చేసినవాడు, భక్తిచే గంగా జలమును పానము చేసి నవాడు, స్వర్గ మును, వ విత్ర జ్ఞానమును, ఉత్తమ యోగ మును, మోక్షమును పొందును. గోమూత్రయావకాహారముకంటే సూర్యకిరణ పరితప్తమగు గంగాజలపానము విశేషఫలమునిచ్చును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున గంగా మహాత్మ్యవర్ణనమను ముప్పది యెనిమిదవ అధ్యాయము.