నారద మహా పురాణము
52 - పురుషోత్తమమాహాత్మ్యమ్.
మోహిన్యువాచ :
ధన్యోసి విప్రవర్య త్వం కృపాలుః సర్వదేహిషు ।
యచ్చ్రుతం తో ముఖాంభోజా త్కాశీమహాత్మ్య ముత్తమమ్
అధునాహం కృతార్థాస్మి త్వయా హి ప్రతిబోధితా ।
కృపాలునా నిపతితో భ్యుద్దృతా భవసాగరాత్
అధునా శ్రోతుమిచ్ఛామి హరేః క్షేత్రస్య మానద ।
మహాత్మ్యం యత్ర గమనా త్కృతార్దో జాయతే నరః
పురుషోత్తమ విష్ణోస్తు క్షేత్రం ముక్తి విధాయకమ్ ।
శ్రష్ట్రయతే హి పురాణేషు వర్ణితం మునిభిర్ద్విజైః
తత్కథ్యతాం మహాభాగ శిష్యాహం యది తే ప్రియా ।
సాధవః సర్వలోకస్య సతతోపకృతౌ స్థితా
మోహిని పలికెను :
నీవు సర్వప్రాణులందు దయచూపు చున్నావు కావున ధన్యుడవు. ఓ బ్రాహ్మణోత్తమా? నీ ముఖ పద్మములనుండి ఉత్తమమగు కాశీ మహాత్మ్యమును వింటిని. నీచే బోధించబడిన. నేను ఇపుడు కృతార్థురాలనైతిని. దయగల నీవు సంసారసాగరము నుండి నన్నుద్దరించితివి. ఇపుడు శ్రీహరి క్షేత్ర మాహాత్మ్యమును విన గోరుచున్నాను. హరిక్షేత్రమునకు వేళ్ళిన నరుడు కృతార్థుడగును. పురుషోత్తముడగు శ్రీహరి క్షేత్రము ముక్తి విధాయకమని పురాణములలో మునులు చెప్పుచుందురు. నేను నీకు ప్రియశిష్యురాలనేని పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యమును చెప్పుడు. సాధుజనులు సర్వకాలములందు సకలలోకోపకారమునే చేయుచుందురుకదా.
వసురువాచ :
శృణు దేవి ప్రవక్ష్యామి తుభ్యం మాహాత్మ్యముత్తమమ్ ।
పురుషోత్తమ నామ్నస్తు క్షేత్రస్య బ్రహ్మణోదితమ్
పృధివ్యాం భారతే వర్షే దక్షిణోదధితీరగః
ఉత్కలేతి సమాఖ్యాతః స్వర్గమోక్షప్రదాయకః ।
సముద్రాదుత్తరం తావ ద్యావద్విరజమండలమ్
దేశోఽసౌ పుణ్యశీలానాం గుణైః సర్వైలంకృతః ।
సర్వతీర్థాని పుణ్యాని పుణ్యాన్యాయతనానిచ
ఉత్కలేతు విశాలాక్షి వేదితవ్యాని తాని తు ।
సముద్రస్యోత్తరే తీరే తస్మిన్దేశేఽఖిలోత్తమే
ఆస్తే గుహ్యం పరం క్షేత్రం ముక్తిదం పాపనాశనమ్ ।
సర్వత్ర వాలుకా కీర్ణే పవిత్రం ధర్మకామదమ్
దశయోజనవిస్తీర్ణం క్షేత్రం పరమ దుర్లభమ్ ।
నక్షత్రాణాం యథా సోమః సరసాం సాగరో యథా
తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్ ।
వసూనాం పావకో యద్వ ద్రుద్రాణాం శంకరాయడా
తథా శ్రేష్ఠం హి తీర్థానాం సర్వేషాం పురుషోత్తమమ్ ।
వర్ణానాం బ్రాహ్మణో యద్వ ద్వైనతేయశ్చ పక్షిణామ్
తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్ ।
సేనానీనాం యథా స్కంథః సిద్ధానాం కపిలో యథా
ఐరావతో గజేంద్రాణాం మహర్షిణాం భృగుర్యథా ।
మేరుః శిఖరిణాం యద్వ న్నగానాం చ హిమాలయః
ఉచ్చైః శ్రనా యధాశ్వానాం కవీనా ముశనా యథా ।
మునీనాంచ యథా వ్యాసః కుబేరో యక్షరక్షసామ్
ఇంద్రియాణాం మనో యద్వ ద్భూతానామవనీ యథా ।
అశ్వత్థః సర్వవృక్షాణాం పవనః పవతాం యథా
అకారః సర్వవర్ణానాం గాయత్రీ ఛందసాం యథా
సర్వాంగేభ్యో యథా శ్రేష్ఠ ముత్తమాంగం విధాతృజే ।
యథా సమస్త విద్యానాం మోక్షవిద్యా పరా స్మృతా
మనుష్యాణాం యథా రాజా ధేనూనాం కామధుగ్యధా ।
సువర్ణం సర్వధాతూనాం సర్పాణాం వాసుకిర్యధా
ప్రహ్లాదః సర్వదైత్యానాం రామః శస్త్ర భృతాం యథా ।
ఝుషాణాం మకరో యద్వ న్మగాణాం మృగరాడ్యధా
వరుణో యాదసాం యద్వ ద్యమః సంయమీనాం యథా ।
క్షీరోదః సాగరాణాం చ దేవర్షిణాం చ నారదః
పురోధసాం యధా జీవః కాలః కలయతాం యధా ।
గ్రహాణాం భాస్కరోయద్వ న్మంత్రాణాం ప్రణవో యధా
కృత్యానాం ధర్మకార్యం చ తద్వచ్చ్రీపురుషోత్తమమ్ ।
పురుషాఖ్యం సకృద్దృష్ట్వా సాగరాంతః సకృన్మతః
బ్రహ్మవిద్యాం సకృజ్జ్ఞాత్వా గర్భవాసో న విద్యతే ।
ఏవం సర్వగుణోపేతం క్షేత్రం పరమ దుర్లభమ్
ఆస్తే యత్రవరారోహే విఖ్యాతం పురుషోత్తమమ్ ।
జగద్వ్యాపీ స విశ్వాత్మా దేవేశః పరుషోత్తమః
జగద్యోనిర్జగన్నాథ సత్ర సర్వం ప్రతిష్ఠితమ్ ।
అజః శక్రశ్చ రుద్రశ్చ దేవాశ్చాగ్ని పురోగమాః
నివసంతి మహాభాగే తస్మిన్దేశే సదైవ హి ।
గంధర్వాప్సరసః సిద్ధాః పితరో దేవమానుషాః
యక్షా విద్యాధరాశ్చైవ మునయః శంసితవ్రతాః ।
ఋషయో వాలఖిలాద్యాః కశ్యపాద్యాః ప్రజేశ్వరాః
సుపర్ణాః కిన్నరా నాగా స్తధాన్యే స్వర్గవాసినః ।
సాంగా వేదాశ్చ చత్వారో శాస్త్రాణి వివిధాని చ
ఇతిహాసపురాణాని యజ్ఞాశ్చ బహుదక్షిణాః ।
నద్యశ్చ వివిధాః పుణ్యా స్తీర్ధాన్యాయతనానిచ
సాగరాశ్చ యధా శైలా స్తస్మిన్దేశే వ్యవస్థితాః ।
ఏవం పుణ్యతమే దేశే దేవర్షిపితృసేవితే
సర్వోపభోగ సహితే వాసః కస్య న రోచతే ।
శ్రేష్ఠత్వం తస్య దేవస్య కించాన్యదధికం తతః
ఆస్తే యత్ర జగద్దేవో ముక్తిదః పురుషోత్తమః ।
ధన్యాస్తే విబుధ ప్రఖ్యా యే వసంత్యుత్కలే నరాః
తీర్థ రాజజలే స్నాత్వా పశ్యంతి పురుషోత్తమమ్ ।
స్వర్గే వసంతి తే మర్త్యా న తు తే రాజసాలయే
యే వసంత్యుత్కలే క్షేత్ర పుణ్యే శ్రీ పురుషోత్తమే ।
సఫలం జీవితం తేషా మౌత్కలానాం సుమేధసామ్
యే పశ్యంతి సుతామ్రాష్ట్ర ప్రసన్నాయతలోచనమ్ ।
చారు భ్రూకేశ ముకుటం చారు కర్ణలతాంచితమ్
చారుస్మితం చారుదంతం చారుకుండల మండితమ్ ।
సునాసం సుకపోలంచ సులలాటం సులక్షణమ్
త్రైలోక్యానంద జననం కృష్ణస్య ముఖ పంకజమ్ ।
పురా కృతయుగే దేవి శక్రతుల్య పరాక్రమః
బభూవ నృపతిః శ్రీమా నింద్రద్యుమ్న ఇతి శ్రుతః ।
సత్యవాదీ శుచిర్ధక్షః సర్వశస్త్ర భృతాం వరః
రూపవాన్సుభగః శూరో దాతా భోక్తా ప్రియంవదః ।
యష్టా సమస్త యజ్ఞానాం బ్రహ్మణ్యః సత్య సంగరః
ధనుర్వేదే చ వేదేచ శాస్త్రే చ నిపుణః కృతీ
వల్లభో నరనారీణాం పౌర్ణమాస్యాం యథా శశి
ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో మధురశ్చంద్రమా ఇవ ।
వైష్ణవః సత్య సంపన్నో జితక్రోధో జింతేంద్రియః
అధ్యాత్మవిద్యానిరతో యుయుత్సుర్థర్మ తత్పరః ।
ఏవం సపాలయత్పృధ్వీం రాజా సర్వగుణాకరః
తస్య బుద్ధిః సముత్పన్నా విష్ణోరారాధనం ప్రతి ।
కథమారాధయిష్యామి దేవ దేవం జనార్దనమ్
కస్మిన్క్షేత్రేఽ థవా తీర్దే నదీ తీరే తథాశ్రమే ।
ఏవం చింతాపరః సో ధ నిరీక్ష్య మనసా మహీమ్
ఆలోక్య సర్వతీర్థాని యాని పాపహరాణి చ ।
తాని సర్వాణి సంచింత్య జగామ మనసా పునః
విఖ్యాతం పరమం క్షేత్రం ముక్తిదం పురుషోత్తమమ్ ।
స గత్వా నృపతిస్తత్ర సమృద్ధ బలవాహనః
అయజచ్ఛాశ్వమేధేన విధివద్భూరి దక్షిణః ।
కారయిత్వా మహోత్సధం ప్రాసాదం భూరి దక్షిణమ్
తత్ర సంకర్షణం కృష్ణం సుభద్రాం స్థాప్య వీర్యవాన్ ।
పంచతీర్థం చ విధివ త్కృత్వా తత్ర మహీపతిః
స్నానం దానం తపః హోమం దేవతా ప్రేక్షణం తథా ।
భక్త్యాచారాధ్య విధివ త్ప్రత్యహం పురుషోత్తమమ్
ప్రసాదాద్దేవ దేవస్య తతో మోక్షమవాప్తవాన్
వసువు పలికెను :-
ఓదేవీ! ఇపుడు నీకు బ్రహ్మ చెప్పిన పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమును చేప్పెదను. ఈ భూమండలమున భారత వర్షము కర్మభూమిగా ప్రసిద్ధి గాంచినది. ఈ భారత వర్షమున దక్షిణ సముద్ర తీరమున ఉత్కలమను తీర్థము స్వర్గమోక్ష ప్రదాయకము కలదు. సముద్రమునకుత్తర భాగమున విరజమండలము వరకు వ్యాపించి యున్నది. ఈ ప్రదేశము పుణ్యశీలుల పవిత్ర గుణములచే అలంకరించబడి యున్నది. సకల పుణ్య తీర్థములు, సకల పుణ్యాయతనములు ఉత్కల తీర్థముననే చూడవలయును. సముద్రమునకు ఉత్తర తీరమున సర్వోత్తమ ప్రదేశమున పరమ రహస్యమగు మోక్ష ప్రదము పాపనాశనమగు క్షేత్రము కలదు. ఈ క్షేత్రము అంతటా వాలుకా కీర్ణము. పవిత్రము. ధర్మకామ ప్రదము. ఈ క్షేత్రము పరమ దుర్లభము. దశయోజన విస్తీర్ణము. నక్షత్రములలో చంద్రుడు, సరస్సులలో సాగరము శ్రేష్ఠమైనట్లు ఈ పురుషోత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో వరిష్ఠము. వసువులలో పావకుని వలె రుద్రులలో శంకరుని వలే ఈ పురుషోత్తమ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము. వర్ణములలో బ్రాహ్మణుని వలె, పక్షులలో వైనతేయుని వలె, సేనానులలో స్కందుని వలె, సిద్దులలో కపిలుని వలే, గజేంద్రములలో ఐరావతము వలె, మహరులలో భృగువువలె, అశ్వములలో ఉచ్చైశ్రవము వలె, కవులలో శుక్రునివలె, మునులలో వ్యాసునివలే, యక్షరాక్షసులలో కుబేరుని వలె, ఇంద్రియములలో మనసువలె, భూతములలో భూమివలే, వృక్షములలో అశ్వత్థాము వలె, వీచువాటిలో గాలి వలె స్త్రీలలో అరుంధతి వలె, శస్త్రములలో వజ్రాయుధము వలె అన్ని వర్ణములలో అకారము వలె, ఛందస్సులో గాయత్రి వలే, అన్ని అవయవములలో శిరస్సువలే, అన్ని విద్యలలో మోక్ష విద్యవలె, మనుష్యులలో రాజువలె, ధేనువులలో కామధేనువు వలే, అన్ని ధాతువులలో సువర్ణము వలె, సర్పములలో వాసుకి వలె, దైత్యులలో ప్రహ్లాదుని వలే, శస్త్ర ధారులలో రాముని వలె, ఝషములలో మకరమువలె, మృగములలో సింహము వలె, యాదసులలో వరుణుని వలె, సంయములలో యముని వలె, సముద్రములలో క్షీరసాగరము వలె, దేవరులలో నారదుని వలే, పురోహితులలో బృహస్పతివలే, కలుపు వాటిలో కాలము వలే, గ్రహములలో సూర్యుని వలె, మంత్రములలో ప్రణవము వలె కృత్యములలో ధర్మకార్యము వలె, పురుషోత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో శ్రేష్ఠము. ఒకసారి పురుషోత్తమ క్షేత్రమును దర్శించి, సాగరాంతమును ఒకసారి దర్శించి, ఒకసారి బ్రహ్మవిద్యను తెలుసుకొని మర లజన్మను పొందడు. ఇట్లు సర్వగుణోపేతము, పరమ దుర్లభమగు. నిది పరుషోత్తమ క్షేత్రము. ఈ క్షేత్రము జగద్వ్యాపి, విశ్వాత్మ, దేహేశుడు, పురుషోత్తముడు, జగత్కారణము, జగన్నాథుడు అన్నియూ ప్రతిష్ఠించబడినవి. బ్రహ్మ ఇంద్రుడు, రుద్రుడు, అగ్నిమొదలగు దేవతలు ఈ క్షేత్రమున ఎల్లపుడూ నివసించుచున్నారు. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, పితరులు, దేవతలు, మనుష్యులు, యక్షులు, విద్యాధరులు, వ్రతపరులగు మునులు, వాలఖిల్యాది ఋషులు, కశ్యపాది ప్రజాపతులు, సుపర్ణులు, కిన్నరులు, నాగులు, ఇతర స్వర్గవాసులు, సాంగ చతుర్వేదములు, వివిధ శాస్త్రములు, ఇతిహాస పురాణములు, బహుదక్షిణలగు యజ్ఞములు, వివిధ పవిత్రనదులు, వివిధ తీర్థములు, ఆయతనములు, సాగరములు, శైలములు ఇచటనే ఉన్నవి. ఇట్టి పుణ్యతమము, దేవర్షి పితృసేవితము, సర్వోపభోగ సమితమగు క్షేత్రమున ఎవరు నివసించరు? జగద్దేవుడు ముక్తి ప్రదుడగు పురుషోత్తముడు స్వయముగా నివసించుట కంటే క్షేత్ర మాహాత్మ్యము ఏమి కావలయును? ఉత్కలమున నుండు దేవ సన్నిభులగు నరులు ధన్యులు. తీర్థ రాజజలమున స్నానము చేసి పురుషోత్తముని దర్శించు చుందురు. పవిత్రమగు ఉత్కల దేశమున స్నానము చేసి పురుషోత్తమ క్షేత్రము. నివసించు వారు స్వర్గమున వసింతురు. కాని నరకమునకు వెళ్ళరు. ఉత్కల క్షేత్ర వాసులు సుబుద్ధులు. వీరు నిత్యము సుతామ్రాష్ట్రప్రసన్నాయతలోచనుని, చారు భూకేశము కుటుని, చారు కర్ణలతాంచితుని, చారుస్మితుని, చారుదంతుని, చారు కుండల మండితుని, సునాసుని, సుకపోలుని సులలాటుని, సులక్షణుని త్రైలోక్యానంద జనకుని, పద్మముఖుడగు శ్రీకృష్ణుని దర్శించు చుందురు. పూర్వకాలమున కృతయుగమున ఇంద్రతుల్య పరాక్రముడగు ఇంద్రద్యుమ్నుడను మహారాజుండెను. సత్యవాది, శుచి, దక్షుడు, సర్వ శస్త్ర ధారులలోశ్రేష్ఠుడు, రూపవంతుడు, సుందరుడు, శూరుడు, దాత భోక్త, ప్రియవాది, సమస్త యజ్ఞకర్త, బ్రాహ్మణ భక్తుడు, సత్యసంగరుడు, ధనుర్వేదమున, వేదమున, శాస్త్రములలో నిపుణుడు, కార్యశీలి, నరనారీ ప్రియుడు, పున్నమ చంద్రుని వంటివాడు. సూర్యుని వలే చూడశక్యము కానివాడు, చంద్రుని వలె మధురుడు, విష్ణుభక్తుడు, సత్య సంపన్నుడు, జితక్రోథుడు, జింతేంద్రియుడు, అధ్యాత్మ విద్యా నిరతుడు, యుయుత్సువు, ధరతత్పరుడు, సర్వగుణాకరుడగు ఇంద్రద్యుమ్నమహారాజు పృధ్విని పాలించుండెను. ఇతనికి మహావిష్ణువును ఆరాధించవలెనని కోరిక కలిగెను. దేవదేవుడగు జనార్ధనుని ఎట్లారాధించవలయును? ఏక్షేత్రమున, ఏ తీర్థమున, నదీతీరమున, లేదా ఆశ్రమమున ఆరాధించవలయును? ఇట్లు విచారించుచు మనసుచే భూమండలమునంతటిని సమీక్షించెను. పాపాపహములగు సకల తీర్థములను గూర్చి మానసికముగా చింతించి మోక్షప్రదమని ప్రసిద్ధి గాంచిన పురుషోత్తమ క్షేత్రమునకు సబల వాహనుడై వెళ్ళి భూరి దక్షిణలతో అశ్వమేధ యాగము నాచరించెను. ఇట్లు యాగమును పూర్తి చేసి భూరిదక్షిణలనిచ్చి సంకర్షణుని, శ్రీకృష్ణుని, సుభద్రను--ప్రతిష్టించి, యధావిధిగా పంచతీర్థము నాచరించి (స్నానము, దానము, తపము, హోమము దేవతా పేక్షణము ప్రతిదినము భక్తిచే పురుషోత్తము నారాధించి, దేవదేవుని అనుగ్రహము వలన మోక్షము పొందెను.
మోహిన్యువాచ :-
తస్మిన్ క్షేత్రే వరే పుణ్యే వైష్ణవే పురుషోత్తమే
కిం తత్ర ప్రతిమా పూర్వం సుస్థితా వైష్ణవీ ప్రభో ।
యేనాసౌ నృపతిస్తత్ర గత్వా సబల వాహనః
స్థాపయామాస కృష్ణంచ రామం భద్రాం శుభప్రదామ్ ।
సంశయోక్తి మహాంస్తత్ర విస్మయశ్చ ద్విజోత్తమ
శ్రోతుమిచ్ఛామి తత్సర్వం బ్రూహి తత్కారణం చ యత్
మోహిని పలికెను :
ఇట్లు శ్రేష్ఠము పావనము అగు పురుషోత్తమ క్షేత్రమున పూర్వము విష్ణు ప్రతిమ యుండెనా? ఇపుడు ఇంద్ర ద్యుమ్నమహారాజు సబల వాహనుడై వెడలి కృష్ణుని రాముని సుభద్రను ఎందుకు ప్రతిష్టించెను. ఈ విషయమున నాకు సంశయము ఆశ్చర్యము కూడా కలగుచున్నవి. కావున దీని నంతటిని వినగోరుచున్నాను. దీని కారణమును దయచేసి తెలుపుము.
వసురువాచ :-
శృణుష్వ పూర్వ వృత్తాంతం కధాం పాపప్రణాశినీమ్
ప్రవక్ష్యామి సమాసేన శ్రియా పృష్టంచ యత్పురా ।
సుమేరోః కాంచనే శృంగే సర్వాశ్చర్య సమన్వితే
తత్ర స్థితం జగన్నాధం జగత్స్రష్టారమవ్యయమ్ ।
ప్రణమ్య శిరసా దేవీ లోకానాం హితకామ్యయా
పప్రచ్ఛేదం మహాప్రశ్నం భూమౌ స్థానమనుత్తమమ్
వసువు పలికెను :
ఇచటి పూర్వ వృత్తాంతమును సంగ్రహముగా తెలిపెదను. పాప ప్రణాశిని యగు ఈ కథను పూర్వమిచట శ్రీనివాసమును వినుము. సర్వాశ్చర్య సమన్వితమగు సుమేరు శృంగమున ఉన్న జగత్ర్సష్ణ అవ్యయుడగు జగన్నాథునీ లోకహిత కామనచే నమస్కరించి భూమిలో నివాసమును కోరుచు ఇట్లు అడిగెను.
శ్రీరువాచ :-
బ్రూహిత్వం సర్వలోకేశ సంశయం మే హృది స్థితమ్
మర్త్యలోకే మహాశ్చర్యే భూమౌ కర్మ సుదుర్లుభే ।
లోభమోహమహా గ్రాహే కామక్రోథమహార్ణవే
యేన ముచ్యేత ఆత్మేశ దుర్గ సంసార సాగరాత్ ।
త్వామృతే నాస్తి లోకే స్మి న్వక్తా సంశయ నిర్ణయే
శ్రుత్వైవం వచనం తస్యా దేవదేవో జనార్ధనః ।
ప్రోవాచ పరయా ప్రీత్యా పరం సారామృతోపమమ్
సుఖోపాయం సుసాధ్యం చ నిరాయాసం మహాఫలమ్
మహాలక్ష్మి అడిగెను. సర్వలోకేశా? నా మదిలో నున్న సంశయమును తొలగించుము. మహాశ్చర్యకరము, కర్మ దుర్లభము, లోభమోహ మహాగ్రహములు కలది, కామక్రోధ మహాసాగరము అగు మర్త్యలోకమున.దుర్లమమగు సంసార సాగరము నుండి మానవుడు ఎట్లు విముక్తి పొందును? ఈ సంశయమును తొలగించ గలవాడు నీకంటే ఇతరుడు లేడు. దేవదేవుడగు జనార్థనుడు ఈమాటలను విని అత్యంత ప్రీతితో అమృతోపమము, సుఖోపాయము, సుసాధ్యము, ఆయాసము మహాఫలప్రదమగు మార్గమును బోధించెను.
శ్రీభగవానువాచ:-
ఆస్తే తీర్థవరం దేవి విఖ్యాతం పురుషోత్తమమ్
న తేన సదృశం కించిత్రి షు లోకేషు విద్యతే ।
కీర్తనాద్యస్య దేవేశి ముచ్యతే సర్వ పాతకైః
న విజ్ఞాతో నరైః సర్యై ర్నదైత్యైరచ దానవైః ।
మరీచ్యాద్యైర్ముని వరై ర్ధర్శితో యం వరాననే
దక్షిణస్యోదధేస్తేరే న్యగ్రోధో యత్ర తిష్ఠితి ।
యస్తుకల్పే సముత్పన్నే మహదుల్కానిబర్హణే
వినాశం నైవ చా భ్యేతి స్వయం తత్రైవ సంస్థితః ।
దృష్టమాత్రే వటే తస్మి ఞ్చాయామాశ్రిత్య చాసకృత్
బ్రహ్మహత్యా ప్రముచ్యేత పాపేష్వన్యేషు కా కథా ।
ప్రదక్షిణం కృతం మైస్తు నమస్కారైస్తు జంతుభిః
సర్వే విధూత పాపా స్తే గతా వై కేశవాలయమ్ ।
న్యగ్రోధస్యోత్తరే కించి ద్దక్షిణీ కేశవస్య తు
ప్రాసాదే తత్ర తిష్ఠేత్తు పరం ధర్మమ యం హితత్ ।
ప్రతిమాం తత్ర తాం దృష్ట్వా స్వయం దేవేన నిర్మితామ్
అనాయాసేన వై యాంతి భవనం మే తతో నరాః ।
గచ్చన్నేవ తు తం దృష్ట్వా ఏకదా ధర్మరాట్ స్వయమ్
మదంతిక మనుప్రాప్య ప్రణమ్య శిరసాబ్రవీత్ ।
నమస్తే భగవన్దేవ లోకనాధాయ తేజసే
క్షీరోదవాసినం దేవం శేషభోగోరు శాయినమ్ ।
వరం వరేణ్యం వరదం కర్తారం హ్యక్షయం ప్రభుమ్
విశ్వేశ్వరమజం విష్ణుం సర్వజ్ఞ మపరాజితమ్ ।
నీలోత్పలదళశ్యామం పుండరీకనిభేక్షణమ్
సర్వగం నిర్గుణం శాంతం జగద్ధాతారమవ్యయమ్ ।
సర్వలోక విధాతారం లోకనాధం సుఖావహమ్
పురాణపురుషం వేద్యం వ్యక్తావ్యక్తం సనాతనమ్ ।
పురాపురాణం స్రష్టారం లోకతీర్థం జగద్గురుమ్
శ్రీవత్స వక్ష సా యుక్తం వనమాలా విభూషితమ్ ।
పీతవస్త్రం చతుర్బాహుం శంఖచక్రగదాధరమ్
హారకేయూర సంయుక్తం ముకుటాంగదధారిణమ్ ।
సర్వలక్షణసంయుక్తం సర్వేంద్రియ వివర్జితమ్
కూటస్థ మచలం సూక్ష్మం జ్యోతీరూపం సనాతనమ్ ।
భావాభావ వినిర్ముక్తం వ్యాపినం ప్రకృతేః పరమ్
తం నమస్యే జగన్నాథ మీశ్వరం సుఖదం ప్రభుమ్ ।
ఇత్యేవం ధర్మరాజస్తు పురా న్యగ్రోధసన్నిధౌ
స్తుత్త్వా నానావిధైః స్తోత్రైః ప్రణామమకరోత్తదా ।
తం దృష్ట్వా చ మహాభాగే ప్రణతం ప్రాంజలిం స్థితమ్
స్తోత్రస్య కారణం దేవి పృష్టవానహ మంతకమ్ ।
వైవస్వత మహాబాహో సర్వదేవమయో హ్యసి
కిమర్థం స్తుతవానిష్ఠం సంక్షేపాత్ బ్రూహి తన్మమ
శ్రీహరిపలికెను:-
దేవీ! సర్వతీర్థ శ్రేష్ఠము సుప్రసిద్ధమగు పరుషోత్తమమను తీర్థము కలదు. మూడు లోకములలో ఇటువంటి క్షేత్రము మరియొకటి లేదు. ఈ క్షేత్ర నామ కీర్తనము వలన సర్వపాతకములు నశించును. ఈ క్షేత్రమును దైత్య దానవులు నరులు తెలియలేరు. మరీచ్యాది మునిశ్రేషులు దీనిని చూపిరి. దక్షిణ సముద్రతీరమున న్యగ్రోధ వృక్షము కలదు. గొప్ప ఉల్కలను వర్షించు చున్న ప్రళయ కాలమున కూడా ఈ వృక్షము నశించక యట్లే యుండును. ఈ వట వృక్షమును చూచినంతనే బ్రహ్మహత్యా పాతకము కూడా నశించు నన్న ఇక ఇతర పాపములమాటేల? ఈ వట వృక్షమునకు నమస్కారములతో ప్రదక్షిణములు చేసిన వారు సర్వపాపములు తొలగి శ్రీహరిలోకమును చేరెదరు. న్యగ్రోధ వృక్షమునకు ఉత్తర భాగమున కొద్ది దక్షిణమున కేశవ ప్రాసాదము కలదు. ఇది పరమ ధర్మమయము. ఇచట నివసించవలయును. ఇచట స్వయముగా దేవ నిర్మితమగు ప్రతిమను దర్శించి సులభముగా నాలో కమునకు వచ్చెదరు. ఒకసారి యమ ధర్మరాజు అటు వెళ్ళుచు ఆ ప్రతిమను దర్శించి నా వద్దకు వచ్చి శిరసుచే నమస్కరించి ఇట్లు పలికెను. ఓదేవా, లోకనాధా! తేజోరూపా నీకు నమస్కారము శ్రేష్టుని, వరదుని, కర్తను, అక్షయుని, ప్రభువును, విశ్వేశ్వరుని, అజుని, విష్ణుని, సర్వజ్ఞుని, అపరాజితుని, నీలోత్పల దలశ్యాముని, పుండరీక నీళేక్షణుని, సర్వగతుని, నిర్గుణుని, శాంతుని, జగద్ధాతను, అవ్యయుని, సర్వలోక విధాతను, లోకనాధుని, సుఖావహుని, పురాణ పురుషుని, వేద్యుని, వ్యక్తావ్యక్తుని, సనాతనుని, పురాణస్రష్ఠను, లోక తీర్డుని, జగద్గురువును, శ్రీవత్సవక్షుని, వనమాలా విభూషితుని, పీతవస్రుని, చతుర్బాహుని, శంఖచగ్రగదాధరుని, హారకేయూర సంయుక్తుని, మకుటాంగదధారిని, సర్వలక్షణ సంయుక్తుని, సర్వేంద్రియ వివర్జితుని, కూటస్థుని, అచలుని, సూక్ష్ముని, జ్యోతీరూపుని, సనాతనుని, భాషా భావ వినిర్ముక్తుని, వ్యాపిని, ప్రకృతిపరుని, జగన్నాధుని, సుఖప్రదుడగు ప్రభువును నమస్కరించు చున్నాను. ఇట్లు పూర్వము యమధర్మరాజు వటవృక్ష సమీపమున నానావిధ స్తోత్రములచే నమస్కరించేను. ఇట్లు స్తుతించి చేతులు జోడించి నమస్కరించు యమధర్మరాజును స్తోత్రకారణము నడిగితిని. ఓవైవస్వతా? మహాబాహో నీవు సర్వదేవమయుడవు. నీవెందుకిట్లు స్తుతించితివో సంక్షేపముగా తెలుపుము అని.
యమ ఉవాచ :-
అస్మిన్నాయతనే పుణ్యే విఖ్యాతే పురుషోత్తమే ।
ఐంద్రీనీలమయీ దృష్టా ప్రతిమా సర్వకామికీ
తాం దృష్ట్వా పుండరీకాక్ష భావేనైకేన శ్రద్ధయా ।
శ్యేతాఖ్యం భువనం యాంతి నిష్కామాశ్చైవ మానవాః
అతశ్చైవం న శక్నోమి వ్యాపారమరి సూదన ।
ప్రసీద త్వం మహాదేవ సంహర ప్రతిమాం విభో
శ్రుత్వా వైవస్వత స్యైత ద్వాక్యం తమహముక్తవాన్ ।
యమైతాం గోపయిష్యామి సి కతాభిః సమంతతః
తతః సా ప్రతిమా దేవి వల్లీభిర్గోపితా తథా ।
యథా తత్ర న పశ్యంతి మనుజాః స్వర్గ కాంక్షిణః
ప్రచ్ఛాద్య వల్లికైర్దేవి జాతరూప పర్చిదైః ।
యమం ప్రస్థాపయామాస తాం పురీం దక్షిణాం దిశమ్
గుప్తాయాం ప్రతిమాయాం తు ఇంద్రనీలస్య వైతదా ।
తస్మిన్క్షేత్ర వరే పుణ్యే విఖ్యాతే పురుషోత్తమే
యత్కృతం తత్ర వృత్తాంతే దేవదేవో జనార్థనః ।
తత్సర్వం కథ యామాస స తస్మై భగవాన్పురా
ఇంద్రద్యుమ్నస్య గమనం క్షేత్ర సందర్శనం తథా ।
క్షేత్రస్య వర్ణనం చైవ వ్యష్టిం తస్య చ మోహిని
దర్శనం బలదేవస్య కృష్ణస్య చ విశేషతః ।
సుభద్రాయాశ్చ తత్రైవ మహాత్మ్యం చైవ సర్వశః
దర్శనం నరసింహస్య వ్యుష్టి సంకీర్తనం తథా ।
అనంతవాసు దేవస్య దర్శనం గుణ కీర్తనమ్
శ్వేత మాధవ మాహాత్మ్యం స్వర్గ ద్వారస్య వర్ణనమ్ ।
ఉదధేర్దర్శనం చైవ స్నానం తర్పణమేవచ
సముద్ర స్నాన మాహాత్మ్య మింద్రద్యుమ్నస్య చాపివై ।
పంచతీర్థ ఫలం చైవ మహాజ్యేష్ట్యాం తథైవ చ
స్నానం కృష్ణస్య హలినః సర్వత్రాఫలం తథా ।
వర్ణనం విష్ణులోకస్య క్షేత్రస్యచ పునః స్వయమ్
పూర్వం కధిత వాం స్తథ్యం తస్మైస పురుషోత్తమః
ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే వసు మోహినీ సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే ద్వీపంచాశత్తమోఽధ్యాయః.
యమధర్మరాజు పలికెను :
పురుషోత్తమ తీర్థముగా ప్రఖ్యాతి గాంచిన ఈ పుణ్యాయ తనమున ఇంద్రనీలమయమగు సర్వకామ ప్రదయగు ప్రతిమ సృజించ బడినది. ఆ ప్రతిమను నిశ్చల భావముచే దర్శించిన వారు కామనా రహితులై శా శ్వాతలోకమును చేరుచున్నారు. కావున నా కర్తవ్యమును నేను చేయ జాలమన్నాను. కావున నాయందు దయతలచి ప్రతిమనుప సంహరించుకొనుము. అని ఈయముని వాక్యమును విని నేనిట్లు పలికితిని. ఓయమ ధర్మరాజా! ఈ ప్రతిమను సైకతము చే కప్పివేతును. అని అప్పుడంతట వల్లుల చే ఆ ప్రతిమను కప్పి పుచ్చితిని. అచట మానవులు ఈ ప్రతిమను చూడజాలరు. బంగారు వన్నెగల లతలచే ప్రతిమను కప్పి యముని పంపివేసెను. ఇట్లు ప్రసిద్ధిగాంచిన పురుషోత్తమ క్షేత్రమున ఇంద్రనీలమయ ప్రతిమను దాచిన తరువాత జరిగిన వృత్తాంతమును దేవదేవుడగు జనార్దనుడు వివరించెను. ఇంద్రద్యుమ్నుడు వెళ్ళుట, క్షేత్ర సందర్శనము, క్షేత్ర వర్ణము, క్షేత్ర మహాత్మ్యము, బలదేవ కృష్ణ సుభద్రా దర్శనము, నరసింహ దర్శనము, వ్యుష్టి సంకీర్తనము, అనంత వాసుదేవ దర్శనము, గుణకీర్తనము, శ్వేత మాధవ మాహాత్మ్యము, స్వర్గద్వార వర్ణనము, సముద్ర దర్శనము, స్నానము, తర్పణము, సముద్రస్నాన మహాత్మ్యము, ఇంద్రద్యుమ్నుడాచరించిన పంచతీర్థఫలము, మహాజ్యేష్టి విశేషము, కృష్ణ బలరాముల స్నానము, సర్వయాత్రా ఫలము, విష్ణులోక వర్ణనము, క్షేత్ర వర్ణనము దీనినంతటిని పూర్వము మహాలక్ష్మీదేవికి పురుషోత్తముడు వివరించెను.
ఇది శ్రీబ్రహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీసంవాద మున పురుషోత్తమ మాహాత్మ్యమను యాబది రెండవ అధ్యాయము.
Summary of chapter 179 of the Nārada Mahā Purana is as follows:
కార్తిక మాసంలో శ్రీహరి ఆలయములందు, తులసీ బృందావనంలో మరియు పవిత్ర నదీ తీరాలలో ఒనర్చు దివ్య దీపదాన మహిమ ఈ అధ్యాయంలో వర్ణించబడినది. దీపదానము వలన అజ్ఞాన అంధకారము నశించి సూర్యమండలమును ఛేదించుకుని వైకుంఠమును చేరుకుంటారని నిరూపించబడినది.