నారద మహా పురాణము
61 - అధ్యాయము
సనత్కుమార ఉవాచ:-
అశోకం శోకనాశార్థం శాస్త్రం శాంతికరం శివమ్,
నిశమ్య లభ్యతే బుద్ధిర్లబ్ధాయాం సుఖమేధతే.
హర్షస్థానసహస్రాణి శోకస్థానశతాని చ,
దివ పే దీవ పే మూఢమావిశంతి న పండితమ్.
అనిష్టసంప్రయోగాచ్ఛ విప్రయోగాతీయస్య చ,
మనుష్యా మాన పైర్లుఖైర్యుజ్యత్తే యోల్పబుద్ధయః.
ద్రవ్యేషు సమతీతేషు యే గుణాన్తోన్న చింతయేత్,
తాననాద్రియమాణశ్చ స్నేహబంధాద్వీముచ్యతే.
దోషదర్శీ భవేత్తత్ర యత్ర రాగః ప్రవర్తతే,
అనిష్టబుద్ధితాం యచ్ఛేత్తతః క్షిప్రం విరాజతే.
నార్ధో న ధర్మో న యశో యోతీతమనుశోచతి,
అస్యాభావేన యుజ్యేత తచ్చాస్య తు నివర్తతే.
గుణైర్భూతాని యుజ్యంతే తథైవ చ న యుజ్యతే,
సర్వాణి నైతదేకస్య శోకస్థానం హి విద్యతే.
మృతం వా యది వా నష్టం యోతీతమనుశోచతి,
దుఃఖేన లభతే దుఃఖం మహానర్థం ప్రపద్యతే.
దుఃఖోపఘాతే శారీరే మాన సే చాప్యుపస్థితే,
యస్మిన్న శక్యతే కర్తుం యత్నస్తన్నానుచింతయేత్.
భేషజ్యమేతద్దుఃఖస్య యదేచన్నానుచింతయేత్,
చింత్యమానం నవ్యేతి భూయశ్చాభిప్రవర్థతే.
ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచ్ఛారీరమౌషధైః,
ఏతద్వాజ్ఞాయ సామర్థ్యం నవాన్యెస్సమతామియాత్.
అనిత్యం జీవితం రూపం యౌవనం ద్రవ్యసంచయః,
ఆరోగ్యం ప్రియసంవాసం న మృ ష్యత్పండితః క్వచిత్.
నాజ్ఞానప్రభవం దుఃఖమేకం శోచితుమర్హతి,
అశోచనతికుర్వీత యది పశ్యేదుపక్రమమ్.
సుఖాతియతరం దుఃఖం జీవితే నాత్రసంశయః,
జరామరణదుఃఖేభ్యః ప్రియమాత్మానముద్ధరేత్.
భజంతి హి శరీరాణి రోగాశ్శారీరమానసాః,
సాయకా ఇవ తీగ్రాః ప్రయుక్తా దృఢధ్వభిః.
వ్యాధితస్య చికిత్సాభిస్యతో జీవితైషిణః,
ఆమయస్య వినాశాయ శరీరమనుకృష్యతే.
సంసంతి న నివర్తంతే ప్రోతాంసి సరితామివ,
ఆయురాదాయ మర్త్యానాం రాత్ర్యహాని పునఃపునః.
అపయంత్యయమత్యన్తం పక్షయోశ్శుక్షకృష్ణయోః,
జాతం మర్త్యం జరయతి నిమిషం నావతిష్ఠతే.
సుఖదుఃఖాభిభూతానామజరో జరయత్యసూన్,
ఆదిత్యో హ్యస్తమభ్యేతి పునఃపునరుదేతిచ.
అదృష్టపూర్వానాదాయ భావానపరిశంకితాన్,
ఇష్టానిష్టామనుష్యాణాం మతం గచ్ఛత్తి రాత్రయః.
యో యదిచ్ఛేద్యథాకొమం కామాం తత్తదాప్నుయాత్,
యది స్యాన్న పరాధీనం పురుషస్య క్రియాఫలమ్.
సంయతా శ్చైవ దక్షాశ్చ మతిమంతశ్చ మానవాః,
దృశ్యంతే నిష్ఫలాస్సంతః ప్రహీనాశ్చ స్వకర్మభిః.
అపరే నిష్ఫలాస్సంతో నిర్గుణాః పురుషాధమాః,
ఆశాభిరప్యసంయుక్తా దృశ్యంతే సర్వకామినః.
భూతానానుపరః కశ్చిద్ధిరసాయాం సతతోత్థాతః,
వంచనాయాం చ లోకేషు స సుఖీ ష్వేవ జీయతే.
అచేష్టమానమాసీనం శ్రీః కించదుపతిష్ఠతి,
కశ్చిత్కర్మాణి కురుతే న ప్రాప్యమధిగచ్ఛతి.
అపరాధాన్సమాచష్టుం పురుషస్య స్వభావతః,
శుకమన్యత్ర సంభూతం పునరన్యత్ర గచ్ఛతి.
తస్య యోనౌ ప్రసక్తస్య గర్భో భవతి మానవః,
ఆమ్రపుష్పోపమా యస్య నివృత్తిరుపలభ్యతే.
కేషాం చిత్పుత్రకామానామనుసంతాన మిచ్ఛతామ్,
సిద్ధే ప్రయతమానానాం నైవాండముపజాయతే.
గర్భాదుర్విజమాసానాం క్రుద్ధాదాశీ విషాదివ,
ఆయుష్మాన్షియతే పుత్రః కథం పేతః పితేవ సః,
దేవానిష్ట్వా తపస్తప్త్వా కృపడైః పుత్ర హేతుభిః,
దశ మాసాన్పరిధృతా జాయతే కులపాసనాః.
అపరే ధనధాన్యాని భోగాంశ్చ పితృసంచితాన్,
విమలానభిజాయనే లబ్ద్వి తైర్వ మంగలైః.
అన్యోన్యం సమభిపేత్య మైధునస్య సమాగమే,
ఉదద్రవ ఇవాదృష్ణో యోనౌ గర్బః ప్రపద్యతే.
స్నిగత్వాదింద్రియార్దేషు మోహాన్మరణమప్రియమ్,
పరిత్యజతి యో దుఃఖసుఖమప్యుభయం నరః.
అత్యేతి బ్రహ్మ సోఒత్యంతసుఖమప్యశ్నుతే పరమ్,
దుఃఖమర్దా హి త్యజ్యంతే పాలనే చ న తే సుఖాః.
శ్రుత్వేవ నాధిగమనం నాశమేషాం న చింతయేత్,
అన్యామన్యాం ఘనావస్లాం ప్రాప్య వైశేషికా నరాః.
అతృప్తా యాంతి విధ్వంసం సంతోషం యాంతి పండితాః,
సర్వే క్షయాంతా నిచయాః పతనాంతా స్సముచ్ఛ్రయాః.
సంయోగా విప్రయోగాంతా మరణాన్తంహి జీవితమ్,
అంతో నాస్తి పిపాసాయాస్తుష్టిస్తు పరమం సుఖమ్.
తస్మాత్పంతోషమేనేహ ధనం శంపస్తి పండితాః,
నిమేషమాత్రమపి హి యోధిగచ్ఛన్న తిష్ఠతి.
సనత్కుమార మహర్షి పలికెను:- శోకము నశించుటకు శోకరహితమైన, శాంతిని కలిగించు శుభప్రదమైన శాస్త్రమును అభ్యసించినచో బుద్ది లభించును. బుద్ధి లభించినచో ఆనందము వృద్ధి చెందును. వేలకొలది ఆనంద స్థానములు వందలకొలది దుఃఖ స్థానములు ప్రతినిత్యము మూడునికి ఎదురగును. పండితునికి కావు. అనిష్టము కలుగుట వలన, ప్రియము దూరమగుట వలన అల్పబుద్దులగు మానవులు మానసిక దుఃఖమును పొందెదరు. నశించిన ద్రవ్యములలోని మంచిగుణములను - గూర్చి విచారించరాదు. నశించిన వాటిని ఆదరించనివాడు స్నేహబంధము నుండి విడివడును. ఒక విషయమున రాగము కలిగినచో దానిలో దోషమును దర్శించువాడగును. కావున అన్ని వస్తువులలో అనిష్టబుద్ధిని కలిగియుండవలయును. అపుడే విరక్తుడు కాగలడు. నశించిన దానిని విచారించినచో అర్థము ధర్మము కీర్తి కలుగవు. నశించినదీ లేదనుకొన్నచో బుద్దీ నుండి తొలగిపోవును. ప్రాణులు గుణములతో కలిసియుందురు. విడిపోవుదురు. ఇవన్నియూ లేనివే. కలిసియున్నపుడు శోకస్థానమొక్క ఓ యుండును. మరణించిన వానిని, నశించిన దానిని, గడిచిపోయిన దానిని విచారించువాడు దుఃఖ పరంపరలను పొందును. మహానర్ణమున బాధపడును. శారీరికము మానసికము అయిన దుఃఖము ప్రాప్తించినపుడు ప్రతిక్రియ చేయశక్యము కానిచో దాని గురించి చింతించరాదు. దుఃఖమును గురించి చింతించకపోవుటయే దుఃఖమునకు ఔషధము. చింతించినచో తొలగకపోగా వృద్ధి చెందుచుండును. మానసిక దుఃఖమును జ్ఞానముచే శారీరిక దుఃఖమును ఔషధములచే తొలగించు కొనవలయునని తెలుసుకొని ఇతర సామ్యమును పొందరాదు. జీవితము రూపము, యౌవనము, ద్రవ్యసంపాదన, ఆరోగ్యము, ప్రియులతో కలిసియుండుట అనిత్యములు. పండితుడు వాటిని పట్టించుకొనరాదు. అజ్ఞానము వలన కలిగిన దుఃఖమును గూర్చి విచారించరాదు దుఃఖము మొదలైనచో చింతించక ప్రతీకారము చేయరాదు. జీవితమున సుఖము కంటే దుఃఖమే ప్రియకరము. ప్రియమైన ఆత్మను జరామరణ దుఃఖముల నుండి ఉద్దరించవలయును. దృఢమైన ధనువు కలవాడు విడిచిన తీక్లబాణముల వలె శారీరిక మానసిక రోగములు శరీరమున ప్రవేశించును. బ్రతుక గోరువాడు వ్యాధిని పొందినపుడు చికిత్సలచే కూడా భయపడు చుండును. రోగనాశము కొఱకు శరీరము కృశించును. అయినను రోగములు నదీ ప్రవాహముల వలె జారిపోవుచుండును. కాని నశించవు. శుక్ల కృష్ణపక్షములలో రాత్రింబవళ్ళు మానవుల ఆయుష్యమును తీసుకొని వచ్చిపోవుచుండును. పుట్టిన మనిషిని జీర్ణింపచేయు నిమిషము నిలిచి యుండదు. సుఖదుఃఖములచే మునిగియున్నవానికి యౌవనమే ప్రాణములను జీర్ణింపచేయును. సూర్యుడు మాటిమాటికి ఉదయించుచుండును. అస్తమించుచుండును. ఊహించలేని కొత్త కొత్త భావములను తీసుకొని, మానవుల ఇష్టానిష్టములను కూర్చుచు వేరు చేయుచు రాత్రులు వచ్చిపోవుచుండును. కామములలో యథేచ్చముగా ఎవడేది కోరునో దానిని పొందుచుండును. క్రియాఫలము పరాధీనము కానపుడు మాత్రమే పొందగలడు. నిగ్రహము, సామర్థ్యము, బుద్దీగల మానవులు కర్మ హీనులై నిష్పలులగుట చూచుచున్నాము. కొందరు ఇతరులు పురుషాధములు గుణహీనులు ఆశారహితులై కామితార్థములను పొందుచున్నారు. ప్రాణులలో కొందరు ఎప్పడూ హింసలో ప్రవర్తించుచు లోకములను వంచింపచేయచు సుఖములలోనే జీవించుచుందురు. ఏ పనులను చేయక ఉదాసీనముగా కూర్చుండువానిని సంపదలు వచ్చి చేరును. పనులు చేయుచున్నవానికి కూడా ఇష్టములు లభించుట లేదు. పురుషుడు సహజముగా అపరాధములనే చేయుచుండును. ఒకచోట పుట్టిన వీర్యము మరియొక చోట చేరును ఆ వీర్యమే యోనిలో చేరినపుడు గర్పరూపమును ధరించును. మామిడి పూవు వంటి నివృత్తిలభించును. సంతానమును కోరి ప్రయత్నించువారికి సంతానము కలుగదు. గర్భమంటే పామును చూచినట్లు భయపడు వారికి సంతానము కలుగును. సంతానము కొఱకు దేవతలను పూజించి, తపసులను చేసి, పుత్రుల కొఱకు ఎన్నో దుఃఖములను అనుభవించువారికి కులమును చెడగొట్టు పుత్రులు కలుగుదురు. ఇతరులు తండ్రి సంపాదించిన ధనధాన్యములను భోగభాగ్యములను తల్లితండ్రుల పుణ్యములతో అనుభవించుటకు పుట్టుదురు. ఒకరినొకరు కోరుకొని స్త్రీపురుషులు సంగమించినచో కనపడని ఉపద్రవము వలె గర్భము ప్రాప్తించును. ఇంద్రియములు స్నేహసంయుక్తములు కావున మానవునికి మరణము అప్రియమగును. మానవుడు సుఖమును దుఃఖమును రెంటిని వీడుచును. సుఖదుఃఖముల నతిక్రమించినవాడు బ్రహ్మ భూతుడై అత్యంత సుఖమును పొందును. దుఃఖమును కలిగించు అర్థములను వదిలి పెట్టవలయును. అర్దములను పోషించినచో సుఖము నీయజాలవు. అర్థప్రాప్తిని గూర్చి వినుట కూడా నిషిద్ధమే. అర్థ నాశమును గూర్చి చింతించరాదు. వేరు వేరు ధనావస్థను పొందిన విశిష్టమానవులు తృప్తి పొందలేక నశించెదరు. పండితులు సంతోషమును పొందెదరు. సంపాదించిన వాటి నాశమే చివరిమెట్టు. అన్ని అభివృద్దులకు పతనమే చివరి హద్దు. ప్రతి కలయిక విడిపోవుటతో ముగియును. జీవితము మరణముతో అంతమగును. ఆశకు అంతులేదు. తృప్తి చెందుటయే ఉత్తమసుఖము. కావున పండితులు సంతోషమే ఉత్తమధనమని చెప్పెదరు. సంతోషమును ఒక నిమిషము పొందిననూ కృతకృత్యుడగును. పొందజాలని వాడు నిమిషము కూడా నిలువజాలడు.
స శరీరేష్వనిత్యేషు నిత్యం కిమనుచింతయేత్,
భూతేషు భావం సంచిన్త్య యే బుద్ద్యా తమసః పరమ్.
న శోచంతి గతాధ్వానః పశ్యంతి పరమాం గతిమ్,
సంచిన్వన్నేకమేవైనం కామానమవిశృప్తకమ్.
వ్రాఘః పశుమివాసాద్య మృత్యురాదాయ గచ్ఛతి,
అథాప్యుపాయం సంప శ్యేద్దుఃఖస్యాస్య విమోక్షణే.
అశోచన్నారఖేన్నైవ యుక్తశ్చావ్యసనీ భవేత్,
శబ్ధే స్పర్శే రమే రూపే గంగే చ పరముల తథా.
నోపభోగాత్పరం కించిద్ధనినో వ్వాధనస్య వా,
వాక్సంప్రయోగాద్భూతానాం నాస్తి దుఃఖమనామయమ్.
విప్రయోగశ్చ సర్వస్య న వాచా న చ విద్యయా,
ప్రణయం పరిసంహృత్య సంస్తుతేష్విత రేషు చ .
విచరేదసమున్నద్ధస్ససుఖీ స చ పండితః,
అధ్యాత్మ గతమాలిన్యో నిరపేక్షో నిరామిషః.
ఆత్మ నైవ సహాయేన యశ్చ రేత్స సుఖీ భవేత్ ,
సుఖదుఃఖవిపర్యాసో యదా సముపపద్యతే.
నైనం ప్రజ్ఞా సునియతం త్రాయతే నాపి పౌరుషమ్,
స్వభావాద్యత్నమతి ఫేద్యత్సవాన్నావసీదతి.
ఉపద్రవ ఇవానిష్ణో యోనిం గర్భః ప్రపద్యతే,
తాని పూర్వశరీరాణి నిత్య మేకం శరీరిణామ్.
ప్రాణినాం ప్రాణసంరోధే మాంస శ్లేష్మ విచేష్టితమ్,
నిర్దగం పరదే హేన పరదేహం బలాబలమ్.
వినశ్యతి వినాశాంతే నావి నావమివాచలామ్,
సంగత్య జఠరేన్యస్తం రేతో బిందుమచేతనమ్.
కేన యత్నేన జీవంతం గర్భంత్వమిహ పశ్య సి,
అన్నపానాని జీర్యంతే యత్ర భక్ష్యాశ్చ భక్షితాః.
తస్మి న్నేవోదరే గర్భః కిం నాన్నమివ జీర్యతే,
గర్భే మూత్రపురీషాణాం స్వభావనీయతా గతిః,
ధారణే వా విసర్గే చ న కర్తుం విద్యతేవశ,
ప్రభవంత్యుదరే గర్భా జాయమానాస్తథాపరే.
ఆగమేన మహాన్యేషాం వినాశ ఉపపద్యతే,
ఏతస్మాద్యోనిసంబంధ్యా జీవన్సరముచ్యతే.
పూజాం న లభతే కాంచిత్పునర్ద్వంద్వేషు మజ్జతి,
గర్భస్య సహ జాతస్య సప్తమీమీదృశీం దశామ్.
ప్రాప్నువంతి తతః పంచ న భవంతి శతాయుషః,
నాభ్యుద్ధానే మనుష్యాణాం యోగాస్యురాత్ర సంశయః.
వ్యాధిభిశ్చ వివధ్యంతే వ్యాఘైః క్షుద్రముగా ఇవ,
వ్యాధిభిర్భక్ష్యమాణానాం త్యజతాం విపులం ధనమ్.
వేదనాం నాపకర్హంతి యతమానాశ్చికిత్సకాః.
తే చాపి వివిధా వైద్యాః కుశలా సంమతౌషధిః,
వ్యాధిభిః పరికృష్యంతే మృగావ్యాఘ్రరివార్దితాః.
తే పిబన్లీ కషాయాంశ్చ సరీంషి వివిధాని చ,
దృశ్యన్తో జరయా భగ్నా నాగేర్నాగా ఇవోత్తమాః.
కైర్వా భువి చికిత్స్యంతే రోగార్తా మృగపక్షిణః,
శ్వాపదాశ్చ దరిద్రాశ్చ ప్రామో నార్తా భవంతి తే.
ఘోరానపి దురాధర్షాన్నృపతీనుగ్రతేజసః,
ఆక్రమ్య రోగ ఆదత్తే పశూన్పశుపచో యథా.
ఇతి లోకమనాక్రందం మోహశోకపరిప్లుతమ్,
ప్రోతసా మహతా క్షిప్రం ప్రియమాణం బలీయసా,
న ధనేన న రాజ్యేన నోశ్రేణ తపసా తథా,
స్వభావా హ్యతివర్తంతే యే నిర్ముక్తాశ్శరీషు.
ఉపర్యుపరి లోకస్య సర్వో భవితుమిచ్ఛతి,
యతతే చ యథాశక్తి న చ తద్వర్తతే తథా.
న మైయేరన్న జీర్యేరన్ సర్వీస్స్యుస్సార్వకామికాః,
నాప్రియం ప్రతిపద్యేరనుత్థానస్య ఫలం ప్రతి.
ఐశ్వర్యమదమత్తాశ్చ మానాన్మయమదేన చ,
అప్రమత్తాశ్మరాః క్రూరా విక్రాంతాః పర్యుపాసతే.
శోకాః ప్రతినివర్తంతే కేషించిదసమీక్షతామ్,
స్వం స్వం చ స్థునరన్యేషాం న కంచిదతిగచ్ఛతి.
మహచ్చ ఫలవైషమ్యం దృశ్యతే కర్మసంధిషు,
వహస్తి శిబికామన్యే యాన్త్యన్యే శిబికారుహః.
సర్వేషామృద్ధికామానామన్యేరథపురస్సరాః,
మనుజాశ్చ గతశ్రీకాశ్శతశో వివిధాయః .
ద్వంద్వారామేషు భూతేషు గచ్ఛన్త్యకైకశో నరాః,
ఇదమన్యత్సరం పశ్య నాత్ర మోహం కరిష్యసి.
ధర్మం చాపి త్యజాధర్మం త్యజ సత్యానృతాం ధియమ్,
సర్వం త్యక్త్వా స్వరూపస్థస్సుఖీ భవ నిరామయః.
ఏతత్తే పరమం గుహ్యం ఆఖ్యాతమషిసత్తమ,
యేన దేవాః పరిత్యజ్య మర్త్యలోకం దివంగతాః.
శరీరము మొదలగునవన్నియు అనిత్యములైనపుడు దేనిని నిత్యమని భావించును. ప్రాణులలో పుట్టుకను విచారించి. బుద్ధితో తమస్సును దాటవలయును. దారిలో నడిచి వెళ్ళినవారు విచారించరు. పరమగతిని చూడగలరు. కోరికలను తృప్తి లేదని తెలిసి ఒకటిగా నున్న ఆత్మను పరిశీలించవలయును. వ్యాఘ్రము పశువును తీసుకొని పోవునట్లు మృత్యువు ప్రాణములను తీసుకొనిపోవును. అయినను ఈ దుఃఖము నుండి విడివడు ఉపాయమును చూడవలయును. శబ్దస్పర్శరసరూపగంధముల విషయమున ఆలోచించరాదు. ఆరంభించరాదు. కూడియుండరాదు. న్యామోహమును కలిగియుండరాదు. ధనవంతుడైనను, నిర్జనుడైనను అనుభవమున కంటే వేరేమియూ ఉండదు. ప్రాణులకు వాకృంప్రయోగము వలన దుఃఖముండదు. అన్నిప్రాణులను ఎడబాటు వొక్కుచే కాని విద్యచే 'కొని కలుగదు. మంచివాటియందు చెడువాటియందు ప్రీతిని విడిచి, వ్యాకులతను బోనాడి సంచరించువాడే సుఖవంతుడు పండితుడు. ఆధ్యాత్మమార్గమును అవలంబించి, ఆసక్తి లేనివాడై అనుభూతిలేనివాడై ఆత్మ సహాయముచే సంచరించువాడు సుఖమునుపొందగలడు. అపుడు సుఖము దుఃఖమగును. దుఃఖమే సుఖమగును. నియమబద్ధుని ప్రజ్ఞకొని పౌరుషముకొని కాపాడజాలదు. సహజము కావున ప్రయత్నమును చేయవలయును. ప్రయత్నశీలి నశించజాలడు. అనిష్టమగు ఉపద్రవము వలె గర్భము యోనిని పొందును. పూర్వశరీరములు చాలా ఉన్ననూ శరీరిమాత్రము ఒకడే నిత్యుడు. ప్రాణులకు ప్రాణసంరోధమేర్పడినపుడు మాంస శ్లేష్మాదులతో కూడియున్నది, ఇతర దేహముచే దగ్గమైనది, బలయుతమైన బలహీనమైన ఇతరదేహము నశించును. వినాశము తరువాత నావ లోని శరీరము నశించిననూ సంజ్ఞ వలె అచలమగును. సంగమముచే గర్భమున ఉంచిన అచేతనమగు రేతోబిందువు ఏ ప్రయత్నముచే గర్భముగా జీవించుచున్నదనుకుందువు. అదే గర్భమున భక్షించిన ఆహారము, త్రాగిన పానీయములు జీర్ణములగుచున్నవి. కాని ఆ గర్పమున నున్న రేతస్సు అన్నము వలె ఎందుకు జీర్ణమగుట లేదు. ఉదరమున మూత్ర పురీషములుండుట సహజము.మూత్ర పురీషములను ధరించుటలోను, విడుచుటలోను నీ వశములేదు. ఉదరమున కొన్ని గర్బములు ఏర్పడుచున్నవి.. మరికొందరు పుట్టుచున్నారు. వచ్చుటతోనే పోవుట పుట్టును. కావున బ్రతికున్నపుడే ఈ యోని సంబంధమును విడిచినవాడు సుఖమును పొందగలడు. ఎట్టి గౌరవమును పొందజాలకున్నను సుఖదుఃఖాది జంటలలో మునిగియుండును. ద్వంద్వములతో కలిసి పుట్టిన గర్భమునకు ఇది ఏడవదశ కలిగితీరును. తరువాత మరొక అయిదు దశలను పొందుదురు. అనగా పంచత్వమును పొందుదురు. శతవత్సరాయుష్యమును పొందజాలరు. మానవులకు ఉత్థాన దశలో యోగములు కలుగవు. ఈ విషయమున సంశయములేదు. వ్యాఘములతో కుద్రమృగములు వధించబడునట్లు మానవులు, వ్యాధులచే వధించబడుదురు. వ్యాధులచే భక్షింపబడుచు, విపుల ధనసంపదను వ్యయము చేసి ప్రయత్నముచే చికిత్స చేయు వైద్యులు కూడా బాధలను తొలగించలేరు. గొప్పఔషధములు కలవారు, నేర్పరులగు వైద్యులు కూడా వ్యాఘములతో బాధపడు మృగములవలె వ్యాధులచే బాధపడుచుందురు. ఆ వైద్యులు కూడా కషాయములను రసములను త్రాగుచుందురు. ఏనుగులచే ఏనుగులు భగ్నమగునట్లు వారు కూడా వార్ధక్యముచే కృశింతురు. గార్డులను మృగములను పక్షులను, పశువులను దరిద్రులను ఎవరు చికిత్స చేయుచున్నారు. వారు ఎక్కువగా రోగార్తులగుట లేదే? క్రూరులు, బలశాలులు, తేజశ్నాలులు ఆగు రాజులను కూడా కసాయి వారు పశువులను ఆక్రమించునట్లు రోగములు ఆక్రమించి బాధ పెట్టుచున్నవి. ఇట్లు లోకము శోకమోహములలో మునిగి గొప్ప ప్రవాహముచే బలముచే వేగముగా హరించబడుచుండును. ధనముచే రాజ్యముచే, ఉగ్రతపస్సుచే శరీరులలో నిర్ముక్తులైన వారు కూడా స్వభావములను దాట జాలరు. లోకమున ఉన్నత స్థానమునధిరోహించ వలయునని ప్రతివాడు కోరును. శక్తి కొలది ప్రయత్నించును. కాని అట్లుండజాలడు. ఉత్థాన ఫలము మరణము జరాతొలగి, అందరికి అన్ని కోరికలు తీరి అప్రియమును పొందకుండుటయే ఐశ్వర్య మదమత్తులు, అభిమానమదమత్తులు, శరులు క్రూరులు, బలశాలులు అయిన వారిని అప్రమత్తులు కూడా సేవించుచున్నారు. ఆలోచనా శూన్యులగు. వారికి కూడా శోకములు తొలగిపోవుచున్నవి. తనను తానుగా కాని ఇతరులకు కాని చెందుచున్నవి. ఎవరిని ఏది అతిక్రమించదు. కర్మ సంధులలో గొప్ప ఫలవైషమ్యము కనపడుచున్నది. కొందరు పల్లకిని మోయుచున్నారు. కొందరు పల్లకిలో కూర్చొనుచున్నారు. అందరూ సంపదలను కోరువారే. కానీ కొందరు మాత్రము రథమునకు ముందు నడుచుచున్నారు. మానవులు చాలామంది ఐశ్వర్య హీనులుగా కనపడుచున్నారు. స్త్రీలు కూడా అప్లెయున్నారు. మానవులు ఒక్కొక్కరూ సుఖదుఃఖాదిద్వంద్వములలో ఆనందించువారుగా ప్రవర్తించుచున్నారు. ఈ విషయమును చాలా జాగ్రత్తగా పరిశీలించుము. ఈ విషయమున , మోహగ్రస్తుడవు కాజాలవు. ధర్మాధర్మములను సత్యాసత్యములను విడిచి అన్నిటిని విడిచి స్వరూపముతో నున్నచో సుఖమును ఆనందమును పొందగలవు. నీకు ఈ పరమరహస్యమును చెప్పితిని. దీనిని తెలుసుకొని దేవతలు భూలోకమును విడిచి స్వర్గమును పొందిరి.
సనందన ఉవాచ:-
ఇత్యుక్త్వా వ్యాసతనయం సమాపృచ్ఛ్య మహామునిః,
సనత్కుమారః ప్రయయౌ పూజిత స్తేనే సాదరమ్.
శుకో పి యోగినాం శ్రేష్ఠస్సమ్యగ్జత్వా హ్యావ స్థితమ్,
బ్రహ్మణః పదమన్వేష్టుముత్సుకః పితరం యయా.
తతః పిత్రా సమాగమ్య ప్రణమ్య చ మహామునిః,
శుకః ప్రదక్షిణీకృత్య య కైలాసపర్వతమ్.
వ్యాసస్త్వరహాద్ధూనః పుత్ర స్నేహసమావృతః,
క్షణికం క్లీయతాం పుత్ర ఇతి చుక్రోశ దుర్మనాః.
నిర పేక్షశ్శుకో భూత్వా ని స్నేహా ముక్తబంధనః,
మోక్షమేవానుసంచిస్త్య గత ఏవ పరం పదమ్.
ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే ఏకషష్ఠితమోఽధ్యాయః.
సనందన మహర్షి పలికెను :- మహాముని యగు సనత్కుమారమహర్షి శుకయోగికి ఇట్లు బోధించి, శుకయోగిచే ఆదరముతో పూజించబడి వెళ్ళిపోయెను. యోగి శ్రేషుడగు శుకమహర్షి కూడా స్థితిని తెలుసుకొని బ్రహ్మపదమును అన్వేషింపదలచి తండ్రి వద్దకు వెళ్ళేను. తండ్రిని కలిసి నమస్కరించి ప్రదక్షిణము చేసి కైలాస పర్వతమునకు వెళ్ళెను. వ్యాసమహర్షి పుత్ర విరహముచే పరితపించుచు ఒక్కక్షణము నిలువుము పుత్రా అని ఆక్రోశించెను. శుకయోగి మాత్రము నిరపేక్షుడు ని స్నేహడు అయి ఆన్ని బంధములను విడిచి మోక్షమునే ధ్యానించుచు పరమపదమునకు వెళ్ళెను.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున అరువది యొకట - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 62 of the Nārada Mahā Purana is as follows:
ద్వితీయ పాదము యొక్క ముగింపు అధ్యాయంలో వివిధ పవిత్ర తిథులందు ఆచరించవలసిన దివ్య వ్రతముల సమగ్ర స్వరూపము వర్ణించబడినది. విధిపూర్వకంగా ఆచరించే తిథివ్రతముల వలన శ్రీహరి అనుగ్రహము సిద్ధించి సర్వ పాపములు నశించునని నిరూపించబడినది.