22 - మాసోపవాసవర్ణనమ్

సనక ఉవాచ :

అన్యద్వ్రతవరం వక్ష్యే తచ్ఛృణుష్వ సమాహితః

 సర్వపాపహరం పుణ్యం సర్వలోకోపకారకమ్

ఆషాఢ శ్రావణేవాపి తథా భాద్రపదేఽపి చ

తథైవాశ్వినకే చూపి కుర్యాదేతద్ర్వతం ద్విజ

ఏతేష్వన్యతమే మాసే శుక్లపక్షే జితేన్ద్రియః

 ప్రాశయేత్పంచగవ్యం చ ప పేద్విష్ణుసమీపతః

తతః ప్రాతస్సముత్థాయ నిత్యకర్మ సమాప్య చ

 శ్రద్ధయా పూజయేద్విష్ణుం వశీ క్రోధవివర్జితః

 విద్వద్భిస్సహితో విష్ణుమర్చయిత్వా యథోచితమ్

 సంకల్పం తు తతః కుర్యాత్స్వస్తివాచనపూర్వకమ్

 మాసమేకం నిరాహారో హ్యద్యప్రభృతి కేశవ

 మాసాన్తం పారణం కుర్వే దేవదేవ తవాజ్ఞయా

తపోరూప నమస్తుభ్యం తపసాం ఫలదాయక

 నుమాభీష్టప్రదం దేహి సర్వవిఘ్పాన్నివారయ

ఏవం సమర్ప్య దేవస్య విష్ణోర్మాసవ్రతం శుభమ్

తతః ప్రభృతి మాసాన్తం నివ సేద్ధరిమందిరే

 ప్రత్యహం స్నాపయేద్దేవం పంచామృతవిధానతః

 దీపం నిరస్తరం కుర్యాత్త సిన్మా సే హరేర్గృహే

 ప్రత్యహం ఖాదయేత్కాష్ఠం హ్యాపామార్గసముద్భవమ్

 తత స్స్నాయీత విధివన్నారాయణపరాయణః

 తతస్సంస్నాపయేద్విష్ణుం పూర్వవత్ప్రయతోఽర్చయేత్ బ్రాహ్మణాన్భోజయేచ్ఛక్త్యాభక్తియుక్తస్సదక్షిణమ్

 స్వయం చ బంధుభిస్వార్ధం భుంజీత ప్రయతేంద్రియః

ఏవం మాసోపవాసాంశ్చ ప్రతీ కుర్యాత్త్రయోదశ

వర్షాన్తే వేదవిదు షే గాం ప్రదద్యాత్సదక్షిణామ్

భోజయేద్భ్రహ్మణాంక్షత్ర ద్వాదశైవ విధానతః

 శక్త్యా చ దక్షిణాం దద్యాద్ బహూన్యాభరణానిచ మాసోపవాసత్రితయం యఃకుర్యాత్సంయతేన్ద్రియః

ఆప్తోర్యామస్య యజ్ఞస్య ద్విగుణం ఫలమశ్నుతే

చతుః కృత్వః కృతం యేన పారాకం మునిసత్తమ

సలభేత్పరమం పుణ్యమష్టాగ్నిష్టోమసంభవమ్

పంచకృత్వో వ్రతమిదం కృతం యేన మహాత్మనా

 అత్యగ్నిష్టోమజం పుణ్యం ద్విగుణం ప్రాప్నుయాన్నరః

మాసోపవాసషట్కం యః కరోతి సుసమాహితః

జ్యోతిష్టోమస్య యజ్ఞస్య ఫలం సోఽష్టగుణం లభేత్

 నిరాహారస్సప్తకృత్వో నరో మాసోపవాసకాన్

అశ్వ మేధస్య యజ్ఞస్య ఫలమష్టగుణం లభేత్

 మాసోపవాసాన్యః కుర్యాదష్టకృత్వ మునీశ్వర

 నరమేధాఖ్యయజ్ఞస్య ఫలం పంచగుణం లభేత్

 యస్తు మాసోపవాసాంశ్చ నవకృత్వసమాచరేత్

 గోమేధమఖజం పుణ్యం లభతే త్రిగుణం నరః

దశకృత్వస్తు యః కుర్యాత్పర్కం మునిసత్తమ

 స బ్రహ్మ మేధయజ్ఞస్య త్రిగుణం ఫలమశ్నుతే

 ఏకాదశపరాకాంశ్చ యః కుర్యాత్సంయతేన్ద్రియః

 స యాతి హరిసారూప్యం సర్వభోగసమన్వితమ్

 త్రయోదశపరాకాంశ్చ యః కుర్యాత్ప్రయతో నరః

స యాతి పరమానందం యత్ర గత్వా న శోచతి

 మాసోపవాసనిరతా గంగాస్నానపరాయణాః

ధర్మమార్గప్రవక్తారో ముక్తా ఏవ న సంశయః

అవీరాభిశ్చ నారీభిర్యతిభిర్భ్రిహ్మ చారిభిః

మాసోపవాసః కర్తవ్యో వనస్థైశ్చ విశేషతః

నారీ వా పురుషో వాపి వ్రతమేతత్సుదుర్లభమ్

కృత్వా క్షమవాప్నోతి యోగినామపి దుర్లభమ్

గృహస్ధో వానప్రస్ధో వా ప్రతి వా భిక్షు రేవ వా

మూర్ఖోవా పండితో వాపి శ్రుత్వేతన్మోక్షభాగ్భవేత్

ఇదం పుణ్యం వ్రతాఖ్యానం నారాయణపరాయణః

శృణయాద్వాచయేద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే వ్రతాఖ్యానే మాసోపవాస వర్ణనం నామ ద్వావింశోఽధ్యాయః

సనకమహర్షి పలికెను : అన్ని పాపములను హరించునది పవిత్రమైనది సర్వలోకోపకారకమగు మరియొక వ్రతమును చెప్పెదను. సావధానముగా వినుము. ఆషాడ, శ్రావణ, భాద్రపద, అశ్వయుజ మాసములలో ఏదో ఒక మాసమున నీవ్రతము నాచరించవలయును. ఈ మాసములలో ఏదో ఒక మాసమున శుక్లపక్షమున ఇంద్రియ నిగ్రహము కలవాడై పంచగవ్య ప్రాశనముచేసి శ్రీమహావిష్ణు సమీపమున శయనించవలయును. ప్రాతఃకాలమున లేచి నిత్యకర్మలను ముగించి కోపమును వదిలి ఇంద్రియ వశము కలిగి శ్రద్దతో శ్రీమహావిష్ణువును పూజించవలయును. పండితులతో కలిసి యథావిధిగా శ్రీహరిని పూజించి స్వస్తివాచన పూర్వకముగా సంకల్పమును చేయవలయును. “ఓ కేశవా!ఈ దీనము నుండి ఒకనెల నిరాహారముగా . నుండి, నీ యాజ్ఞచే , మాసాన్తమున పారణ చేసెదను. ఓ తపస్స్వ రూపా ! తపః ఫలప్రదాయకా ! సర్వవిఘ్నములను నివారించి నా అభీష్టమును ప్రసాదించుము.” ఇట్లు శుభప్రదమైన మాసవ్రతమును శ్రీహరికి సమర్పించి అప్పటినుండి ఒకమాసము హరీమందిరమున నివసించవలయును. ప్రతి దినము పంచామృత విధానముతో శ్రీహరికి అభిషేకమును చేయవలయును. ఈనెల లో హరిమందీరమున అఖండదీపము నుంచవలయును. ప్రతిదినము ఉత్తరేణికాషముతో దంతధావనము చేసుకొని శ్రీమన్నారాయణుని ధ్యానముచేయుచు యథావిధిగా స్నానము చేయవలయును.  భక్తి శ్రద్దలతో యథావిధిగా శ్రీహరికి అభి షేకము చేసి అర్చన చేయవలయును. భక్తితో, బ్రాహ్మణులకు భోజనమును దక్షిణను సమర్పించవలయును. ఇంద్రియ నిగ్రహము కలిగి తాను కూడా బంధువులతో కలిసి భోజనము చేయవలయును. ఇట్లు పదమూడు మాసోపవాసములను చేయవలయును. సంవత్సరము ముగిసిన తరువాత వేదవిదుడైన బ్రాహ్మణునకు గోదానమును చేయవలయును. దక్షిణ నీయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనమీయవలయును. శక్తి ననుసరించి దక్షిణలను ఆభరణములను సమర్పించవలయును. ఇట్లు ఇంద్రియ నిగ్రహముతో మూడుమార్లు మాసోపవాసవ్రతము నాచరించినవారు ఆప్తోర్యామ యజ్ఞమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. నాలుగుమార్లు ఈ వ్రతము నాచరించినవారు ఎనిమిది అగ్నిష్టోమ యాగముల ఫలితమును పొందెదరు. అయిదుమార్లు ఈ వ్రతమునాచరించిన వారు అత్యగ్నిష్టోమ యాగమునకు రెట్టింపు ఫలితమును పొందెదరు. ఆరుమార్లు మాసోపవాసవ్రతమునాచరించినవారు జ్యోతిష్టోమ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలితమును పొందుదురు. ఈ వ్రతము నేడుమార్లాచరించినవారు అశ్వమేధ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలమును పొందుదురు. ఎనిమిదిమార్లు ఈ వ్రతమునాచరించిన వారు నరమేధ యాగమునకు అయిదు రెట్లు ఫలమును, తొమ్మిది మార్లాచరించినవారు గోమేధమునకు మూడు రెట్లు ఫలమును, పదిమార్లాచరించినవారు మూడు బ్రహ్మ మేధముల ఫలమును, పదకొండు మార్లు ఆచరించినవారు సర్వభోగసమన్వితమైన హరిసారూప్యమును, పదమూడుమార్లాచరించిన వారు దుఃఖస్పర్శలేని పరమానందమును పొందెదరు. మాసోప వాసవ్రతమును చేయువారు, గంగాస్నానమును చేయువారు ధర్మ మార్గ ప్రవక్తలు ముక్తులగుదురు. సంశయముతో పనిలేదు. పతి పుత్రులులేని స్త్రీలు, యతులు, బ్రహ్మ చారులు విశేషించి వాన ప్రస్థులు ఈ మాసోప వాసవ్రతము నాచరించవలయును. స్త్రీ కాని పురుషుడు కాని దుర్లభమైన ఈ వ్రతమునాచరించి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెదరు. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, భిక్షుకుడు, మూర్ఖుడు, పండితుడు ఎవరైనను ఈ వ్రత విధానమును వినినచో మోక్షమును పొందును. నారాయణ భక్తుడు పవిత్రమైన ఈ వ్రతమును వినిననూ చెప్పిననూ అన్ని పాపముల నుండి విముక్తుడగును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున వ్రతాఖ్యానమున మాసోపవాసవర్ణనమను ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.