నారద మహా పురాణము
71 - నృసింహోపాసనామంత్రగాయత్ర్యాది నిరూపణమ్
సనత్కుమార ఉవాచ :
శృణు నారద ! వక్ష్యామీ దీవ్యాన్నరహరేర్మనూన్,
యాన్సమారాధ్య బ్రహ్మద్యాశ్చక్రుస్సృష్ట్యాదికర్మ వై.
సంవర్త కశ్చంద్రమౌలర్మనుర్వహ్నివిభూషితః,
ఏకాక్షరస్మృతో మంత్రో భజతాం సురపాదపః.
మునిరత్రిశ్చ జగతీ ఛందో బుద్ధిమతాం వర ! దేవతా నృహరిః ప్రోక్తో వినియోగోఖిలాప్తయే.
క్షుం బీజం శక్తిరీప్రోక్తా షడ్దిర్ఘేణ షడంగకమ్,
అర్కేందునహ్నినయనం శరదిందురుచంక రైః.
ధనుశ్చక్రాభయవరాన్దధతం నృహరిం స్మరేత్,
లక్షం జపస్తద్దశాంశహోమశ్చ ఘృతపాయ సై.
యజేడ్పీ వైష్ణవే తు కౌసరేష్వంగపూజనమ్,
ఖగేశం శంకరం శేష శతానన్దం దిగాషు.
శ్రియం ప్రియం ధృతిం పుష్టం కోణపతేషు పూజయేత్,
దంతచ్ఛదేషు నృహరీం స్తావతః పూజయేతమాత్.
కృష్ణో రుద్రో మహార భీమో భీషణ ఉజ్జ్వలః,
కరాలో వికరాలశ్చ దైత్యాంతో మధుసూదనః.
రక్తాక్షః పింగలాక్షశ్చాంజన్ దీప్తరుచిస్తథా,
పఘోరకశ్చ సువనుర్విశ్వకో రాక్షసాంతకః.
విశాలకో ధూమ్ర కేశో హయగ్రీకో ఘనస్వనః,
మేఘవర్ణః కుంభకర్ణః కృతాంతతీవ్రతేజనీ.
అగ్నివర్లో మహోగ్రశ్చ తతో విశ్వవిభూషణః,
విఘ్నక్షమో మహా సేన సింహా ద్వాత్రింశదీరితాః.
తద్బహిః ప్రార్చయేద్విద్వాంల్లోకపాలానహోతికాన్,
ఏవం సిద్ధే మనౌ మస్త్రీ సాధయేదఖిలేప్సితాన్.
విష్ణుః ప్రద్యుమ్నయుక్ శారీ సాగ్నిర్వీరం మహాంస్తతః,
విష్ణుం జ్వలింతం భృశో జలం పద్మాసనం తతః.
హరిస్తు వాసుదేవాయ వైకుంఠ విష్ణుసంయుతః,
గదీ సేన్లు నృసింహం చ భీషణం భద్రమేవ చ.
మృత్యుమృత్యుం తతశ్శౌరిర్భానోర్నారాయణాన్వితః,
నృహరేర్టావింశత్వ్య యం మన్తసామ్రాజ్యదాయకః.
బ్రహ్మా మునిష్ణు గాయత్రీ ఛంద్యో_నుష్టబుదాహృతమ్,
దేవతా నృహరిశ్చాస్య సర్వేష్టఫలదాయకః.
హం బీజం ఇం తథాశక్తిర్వినియోగోఫిలాషయే వేదైశ్చతుర్బిర్వసుభి,
షడ్భిషడ్భిర్యుగాక్షరైః.
షడంగాని విధాయాథ మూర్థి బాలే చ నేత్రయోః,
ముఖబాహ్వంఘిసంధ్యశ్రేష్వధ కుక్షౌ తథాహృది.
గలే పార్శ్వద్వయే పృ ప్లే కకుదర్లాన్మనూద్భవాన్,
ప్రణవాంతరితానృత్వా న్య సేత్సాధకసత్తమః.
నృసింహసాంనిధ్యకరో న్యాసో దశవిధో యధా,
కలాంధ్ర్యష్టాద్యంగులీషు పృథగాద్యంతపర్వః.
సర్వాంగులీషు విన్యస్యావశిష్టం తలయోర్న్య సేత్,
శిరో లలాటే భ్రూమధ్యే నేత్రయోః కర్ణయోస్తథా.
కపోలకర్ణమూలే చ సిబుకోఠ్వాధరోష్ఠకే,
కండే మౌణే చ భుజయోత్తమౌ నాభిమండలే.
దక్షాన దోస్తలే కట్యాం మేథోర్యోద్ఘానుజంఘః ,
గుల్ఫౌ పాదకరాంగుల్యాస్సర్వసంధిషు రోమసు.
రక్తాస్థిమజ్ఞాసు తనౌ న్య సేద్వర్ణాన్విచక్షణః,
వర్ణానదే గుల్ఫజానుకటినాభిహృదిస్థలే.
బాబ్వాః కంఠేచ చిబుకే చౌషో గండే ప్రవిన్య సేత్,
కర్ణయోర్వదనే నాసా పుటే నేత్రే చ మూర్ధని.
పదాని తు ముఖే మూర్ఖ న్యస్య చక్టు షి కర్ణయోః,
ఆ స్యే చ హృదయే నాణె పాదాన్యర్వాంగకన్య సేత్.
అర్థద్వయం న్య సేన్నూ ఆహృత్పాదాత్తదంగకమ్,
ఉగ్రాదీని పదానీహ మృత్యుమృత్యుం నమామ్యహమ్.
ఇత్యంతాన్యాస్యణ చక్టుశ్రోత్రేషు పక్ష్మసు,
హృది నాభ్యైచ కట్యాదిపొదాంతం నమసు న్య సేత్.
వారాద్యానపి తాన్యేవ యథాపూర్వం ప్రవిన్య సేత్,
నృసింహాద్యాని తాన్యేవ పూర్వవద్విన్య పేత్సుధీః.
చంద్రాగ్ని వేదషడామనేదిగ్బాహుభూమితామ్,
విభక్తానపత్రవర్ణాంశ్చ క్రమాతా నేషు విన్య సేత్.
మూలే మూలాచ్చ నాభ్యంతం నాభ్యాదిహృదయావధి,
హృదయాదూయుగాంతం తు నేత్రత్రయే చ మస్త కే.
బాహ్యోరంగులిషు ప్రాణీ మూర్థాదిచరణావధి,
విన్య పేన్నామతో ధీమాన్హరిన్యాసోఒయమీరితః.
న్యాసస్యాస్య తు మాహాత్మ్యం జానాత్యేకో హరిస్స్వయమ్,
ఏవం న్యాసవిధిం కృత్వా ధ్యాయేచ్చ నృహరిం హృది.
సనత్కుమార మహర్షి పలికెను : ఓ నారదా ! దివ్యములగు నారసింహ మంత్రములను చెప్పెదను వినుము. ఈ మంత్రోపాసన చేతనే బ్రహ్మాది దేవతలు సృష్ట్యాది కర్మలను చేయగలుగుచున్నారు. సంవర్తకుడు చంద్రమౌళి మంత్రము వహ్ని విభూషితము. ఈ మంత్రము ఏకాక్షరము, సేవించు వారికి కల్పవృక్షము. ఈ మంత్రమునకు ముని అత్రిమహర్షి జగతీ ఛందస్సు నారసింహస్వామి దేవత అఖిలాభీష్టప్రాప్తికి వినియోగము. క్షం బీజము. ఈ శక్తి షడ్దర్షముతో షడంగన్యాసమును చేయవలయును. సూర్యచంద్రాగ్ని నేత్రుడు, శరచ్చంద్ర వర్ణుడు, చేతులలో చక్ర అభయ వరములను ధరించువాడు అయిన నృహరిని స్మరించవలయును.. లక్ష జపమును చేయవలయును. దశాంశమును ఘృత పాయసములచే హోమమును చేయవలయును. వైష్ణవ పీఠమున పూజించవలయును. కేసరములందు అంగపూజను గావించవలయును. దిక్కోణములందు గరుడుని, శంకరుని, ఆది శేషుని, బ్రహ్మను, శ్రీని, స్త్రీని, ధృతిని, పుష్టిని, కోణపత్రములందు పూజించవలయును. దంతచ్ఛదములందు నారసింహులను పూజించవలయును. కృష్ణుడు, రుద్రుడు, మహాఘోరుడు, భీముడు, భీషణుడు, ఉజ్జ్వలుడు, కరాలుడు, వికరాలుడు, దైత్యాంతకుడు, మధుసూదనుడు, రక్తాక్షుడు, పింగలాక్షుడు, అంజనుడు, దీప్తరుచి, సుఖోరకుడు, సుహనువు, విశ్వకుడు, రాక్షసాంతకుడు, విశాలకుడు, ధూమ్ర కేశుడు, హయగ్రీవుడు, ఘనస్వనుడు, మేఘవర్ణుడు, కుంభకర్ణుడు, కృతాంతుడు, తీవ్రతేజుడు, అగ్నివర్ణుడు, మహోగ్రుడు, విశ్వవిభూషణుడు, విఘ్నక్షముడు, మహా సేనుడు అని ముప్పది రెండు నారసింహులు చెప్పబడిరి. వీరికి వెలుపల ఆయుధములచే కూడిన దిక్పాలకులను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొంది అభీష్టములను సాధించవలయును. ప్రద్యుమ్నునిచే కూడిన విష్ణువు శార్జి సాగ్ని, వీరుడు మహాపద్ముడు, ప్రకాశించు విష్ణువును, భృగ్విశుడు జలము, పద్మాసనము. హరి వాసుదేవుడు, విష్ణుయుతుడగు వైకుంఠుడు, గదాధారి సేందువు, భయంకరుడు భద్రుడగు నృసింహుని, మృత్యుమృత్యువును, శౌరి నారాయణ సహితుడగు భానువు. ఇట్లు ఇరువది రెండు వర్ణములు గల మంత్రము నరసింహ మంత్రము సామ్రాజ్యప్రదము. ఈ మంత్రము సర్వేష్ట దాయకము. హుం బీజము ఇం అనునది శక్తి. అఖిలాప్తికి వినియోగము. నాలుగు నాలుగు ఎనిమిది ఆరు ఆరు జంట అక్షరములచే షడంగములనేర్పరిచి శిరస్సున, ఫాలమున, నేత్రములలో, ముఖ బాహ్వంఘి సంధ్యగములలో, కుక్షియందు, హృదయము నందు, గలమున, పార్శ్వద్వయమున, పృష్ఠమున, కకుత్తున మంత్రోద్భవ వర్ణములను ప్రణవాంతరితములను చేసి న్యాసము చేయవలయును. నృసింహస్వామి సన్నిధిని చేర్చు న్యాసము పది విధములు. కరచరణ అష్టాద్యంగుళుల యందు విడివిడిగా ఆద్యంత పర్వములలో, సర్వాంగుళులయందు న్యాసము చేసి మిగిలిన దానిని తలములయందు న్యాసము చేయవలయును. శిరమున, లలాటమున, భ్రూమధ్యమున, నేత్రములలో, కర్ణములలో, కపోలములందు, కర్ణమూలములందు, చిబుకమున, ఊర్ధ్వాధరోషములందు, కంఠమున, ఘోణమున, భుజములయందు, హృదయమున నాభిమండలమున, పాదములయందు, పాదతలములందు, కటియందు మేడ్రమున, ఊరువులందు, జాను జంఘలయందు, గుల్పమున, పాదకరాంగుళులందు, సర్వసంధులంగు, రోమములందు, రక్త స్థిమజ్జలందు, తనువునందు వివేకముకలవాడై న్యాసము చేయవలయును. వరణములను పదమునందు, గుల్బజానుకటికాభిహృదయ స్థలములందు, బాహువులందు, కంఠమునందు, చిబుకమునందు, ఓష్ఠమునందు, గండస్థలములందు 'న్యాసము చేయవలయును. కర్ణములందు, వదనములందు, నాసాపుటమున, నేత్రమున మూర్థలో న్యాసము చేయవలయును. పదములను ముఖమున, మూర్థలో, నాసికయందు నేత్రమునందు, కర్ణములందు, ఆస్యమునందు, హృదయమునందు, నాభియందు, పాదములను సర్వాంగములందు న్యాసము చేయవలయును. అర్థద్వయము మూర్థయందు, పాదము నుండి హృదయము వరకు తదంగములను, ఉగ్రాది పదములను న్యాసము చేసి మృత్యు మృత్యుం నమామ్యహం అనునది అంతమునందు కల వాటిని ఆస్యఘ్రాణచక్షుః శ్రోత్ర పక్ష్మలయందు, హృదయమున, నాభియందు, కట్యాది పాదాంతమున నవాంగవ్యాసము చేయవలయును. వారాది నారసింహులను కూడా మొదట చెప్పినట్లు న్యాసము చేయవలయును. నృసింహాదులను కూడా పూర్వోక్త విధముగా న్యాసము చేయవలయును. చంద్రాగ్ని వేద షడ్రామ నేత్ర దీగ్బాహు భూమితములగా వర్ణములను విభజించి పత్రవర్ణములను క్రమముగా ఆయా స్థానములలో నుంచవలయును. మూలమున మూలమునుండి నాభ్యంతము, నాభినుండి హృదయము వరకు, హృదయమునుండి భ్రూయుగ్మము వరకు, నేత్రత్రయమున, మస్త కమున, బాహువులందు, అంగుళులందు, ప్రాణమున మూర్ధాది పాద పర్యంతమున నామములననుసరించి న్యాసము చేయవలయును. దీనిని హరి న్యాసమందురు. హరి న్యాస ప్రభావమును ఒక్క శ్రీహరి మాత్రమే తెలియును. ఇట్లు న్యాసవిధిననుష్ఠించి హృదయమున నృహరిని ధ్యానమును చేయవలయును.
గలాసక్తలసద్భాహుప్పృష్టకేశోబ్దచక్రధృక్,
నఖాగ్రభిన్నదైత్యశో జ్వాలామాలాపమన్వితః.
దీప్తజిహ్వస్త్రినయనో దంష్ట్రాగ్రం వదనం వహన్,
నృసింహోఒస్మాన్సదా పాతు స్థలాంబుగగలోపగః.
ధ్యాత్వేవం దర్శయేన్ము ద్రాం నృసింహస్య మహాత్మనః,
జానునుధ్యగతా కృత్వా చిబుకోహ్లి సమావుభౌ.
హస్తా చ భూమిసంలగ్నౌ కంపమానః పునః పునః,
ముఖం విజృంభితం కృత్వా లేలిహానాం చ జిహ్వినామ్.
ఏషా ముద్రా నారసింహీ ప్రధానేతి ప్రకీర్తితా,
వామస్యాంగుష్ఠతో బద్ధా కనిష్ణామంగలీత్రయమ్.
త్రిశూలవత్ సంముఖోర్డ్వే కుర్యాన్ముద్రాం నృసింహగామ్,
అంగుష్ఠాభ్యాం చ కరయోస్తథాక్రమ్య కనిష్ఠ కే.
అధోముఖాభిశ్నిష్టాభిశ్శేషాభిర్న్పహరా తతః,
హస్తావధోముఖే కృత్వా నాభిదేశే ప్రసార్య చ.
తర్జనీభ్యాం నయేత్సంధౌ ప్రోక్తా చాంత్రణముద్రికా,
హస్తావూర్థ్వముభౌ కృత్వా తలే సంయోజ్య మధ్యమే.
అనామాయాం తు వామాయాం దక్షిణాం తు వినిక్టి పేత్,
తర్జన్యౌ పృష్ఠతో లగ్నౌ అంగుష్ణా తర్జనీ శ్రీతా.
చక్రముద్రా భవేదేషా నృహరేస్సన్నిధౌ మతా,
చక్రముద్రాం తథా కృత్వా తర్జనీభ్యాం తు మధ్యమే.
పీడయేద్దంష్ట్రముదైషా సర్వపాపప్రణాశినీ,
ఏతా ముద్రా నృసింహస్య సర్వమంతౌఘసంమతాః.
వర్ణలక్షం జపేన్మస్త్రం తద్దశాంశం చ పాయ సైకి,
ఘృతాక్లెర్జుహుయాద్వహ్నౌ పీకే పూర్వోదిత్యర్చయేత్.
అంగొన్యాదౌ సమారాధ్య దిరత్తేషు యజేత్పునః,
గరుడాదీన్ శ్రీముఖాంశ్చ విదికు లోకపాన్బహిః.
ఏవం పంపాధితో మన్తస్సర్వాన్కామానపూరయేత్,
సౌమ్యేనార్యే స్మ రేత్సౌమ్యం క్రూరం క్రూరే స్మరే ద్బుధః.
పూర్వమృత్యుపదే శత్రోర్నామ కృత్వా స్వయం హరిః,
నిశితైర్నఖదంష్ట్రాగ్రైః భాద్యమానం చ సంస్మరేత్.
అష్టోత్తరశతం విత్యం జపేన్మంత్రమతంద్రితః,
జాయతే మండలాదర్వాక్ శత్రుర్త్వై శమనాతిధిః.
ధ్యానభేదానధో వక్ష్యే సర్వసిద్ధిప్రదాయకాన్.
కంఠమున తగిలియున్న శోభించు బాహువులను తాకు కేశములు గలవాడు, పద్మమును చక్రమును ధరించువాడు, నఖాగ్రములచే రాక్షసాధిపతిని భేదించినవాడు, జ్వాలామాలా సమన్వితుడు. దీప్త జిహ్వుడు, త్రినేత్రుడు, దంష్ట్రాలచే భయంకరమగు వదనము కలవాడు అగు నృసింహుడు స్థలంబుగగనాదులలో ఉండువాడు మమ్ములను ఎప్పుడూ కాపాడు గోవుత. ఇట్లు ధ్యానము గావించి మహానుభావుడైన నృసింహాస్వామి ముద్రను చూపవలయును. చిబుకమును ఓష్ఠములను సమానముగా జానుమధ్యమున నుంచి, చేతులను భూమికి తగిలించి, మాటిమాటికి కంపించుచు, ముఖమును ఆవలించినట్లుగా తెరిచి నాలుకను బయటకు చాచవలయును. దీనిని నారసింహముద్ర యందురు. ఇది చాలా ప్రధానము. వామాంగుష్ఠమున కనిషాంగులిత్రయమును బంధించి త్రిశూలమువలె ఊర్థ్వముఖముగా చేసి నృసింహముద్రను చేయవలయును. అంగుషములచే రెండు చేతుల కనిష్టములను ఆక్రమించి, మిగిలిన వేళ్ళను అధోముఖములుగా చేయవలయును. రెండు చేతులను అధోముఖములుగా చేసి నాభిదేశమున చాచి, తర్జనలచే భుజములను తాకవలయును. దీనిని అంత్రణముద్రికయందురు. హస్తములను ఊర్థ్వముఖములుగా చేసి మధ్యమున తలములను యోజించి వామఅనామికయందు దక్షిణానామికను ఉంచవలయును. తర్జనులను వెనుక కలిపి అంగుష్ఠములను తర్జనియందు తాకించినచో చక్రముద్రయగును. ఈ చక్రముద్రను నృసింహస్వామి సమీపమున చూపవలయును. ఇట్లు చక్రముద్రనాచరించి తర్జనులచే మధ్యమములను పీడించవలయును. ఇది దంష్ట్రముద్రయన బడును. ఇది సర్వపాపములను నశింప చేయును. ఈ ముద్రలు నృసింహ మంత్రములన్నింటిలో సమ్మతములు. మంత్రమును అక్షరలక్ష జపించవలయును. దశాంశమును నేతితో కలిసిన పాయసములచే అగ్నిలో హోమమును చేయవలయును. పూర్వోక్త పీఠమున ఆర్చన గావించవలయును. మొదట అంగములనారాధించి దీక్పత్రములందు గరుడాదులను శ్రీప్రభృతులను పూజించి, వెలుపల విదిక్కులందు లోకపాలులను పూజించవలయును. ఇట్లు సాధించబడిన మంత్రము సర్వకామములను పూర్తి చేయును. సౌమ్య కార్యమున సౌమ్యుని స్మరించవలయును. క్రూరకర్యమున క్రూరుని సమర్పించవలయును. మృత్యు మృత్యుం అను మంత్రమున మొదటి మృత్యుపదమునకు మొదట శత్రునామమునుచ్చరించి శ్రీనృహరి నిశిత దంష్ట్రాగ్రములచే నములుచున్నట్లు స్మరించవలయును. ప్రతిదినము అష్టోత్తర శతమును జపించవలయును. ఇట్లు జపించినచో నలుబదిరోజులలో శత్రువు యమాతిధి కాగలడు. ఇక ఇపుడు ధ్యాన భేదములను సర్వసిద్ధిప్రదాయకములను చెప్పెదను. వినుము.
శ్రీకామప్సతతం ధ్యాయేత్పూర్వోక్తం నృహరిం సీతమ్.
వామాంకస్థితయా లక్ష్మ్యా లింగితం పద్మహస్తయా,
విషమృత్యుపరోగాదీసర్వోపద్రవనాశనమ్.
నరసింహం మహాభీమం కొలొనలసమప్రభమ్,
ఆంత్రమాలాధరం రౌద్రం కంఠహా రేణభూషితమ్.
నాగయజ్ఞోపవీతం చ పంచాననసుశోభితమ్,
చంద్రమౌళిం వీలకంఠం ప్రతివక్తం త్రినేత్రకమ్.
భుజైః పరిఘసంకాశైర్దశభిశ్చోపశోభితమ్,
అక్షసూత్రం గదాపద్మం శంఖం గోక్షీరసన్నిభమ్.
ధనుశ్చ ముసలం చైవ బిభ్రాణం చక్రముత్తమమ్,
ఖడ్గం శూలం చ బాణం చ నృహరిం రుద్రరూపిణమ్.
ఇంద్రగోపాభనీలాభం చన్హాభం స్వర్ణపన్నిభమ్,
పూర్వాది చోత్తరం యావదూర్దాస్యం సర్వవర్ణకమ్.
ఏవం ధ్యాత్వా జపేన్మస్త్రీ సర్వవ్యాధివిముక్తయే,
సర్వమృత్యుహరం దివ్యం స్మరణాత్సర్వ సిద్ధిదమ్.
ధ్యాయేద్యదా మహత్కర్మ తదా షోడశహస్తవాన్,
నృసింహస్సర్వలోకేశః సర్వాభరణభూషితః.
ద్వౌ విదారణకర్మాక్తో ద్వౌబాంత్రోద్ధరణాన్వితౌ,
శంఖచక్రధరౌ ద్వౌ తు ద్వౌ చ బాణధనుర్ధి.
ఖడ్గఖేటధరౌ ద్వౌ చ ద్వౌ గదాపద్మధారిణైః,
పాశాంకుశధరౌ ద్వౌ చ ద్వౌ రిపోర్ము కుటార్పితా.
ఇతి షోడశదోర్దండమండితం నృహరిం విభుమ్,
ధ్యాయేన్నీరదనీలాభం ఉగ్రకర్మణ్యనన్యధీః.
ధ్యేయో మహాతమే కార్యే ద్వాత్రింశద్ధస్తవాన్బుధైః,
నృసింహస్సర్వభూతేశస్సర్వ సిద్ధికరః పరః.
దక్షిణే చక్రపద్మే చ పరశుం పాశమేవ చ,
హలం చ ముసలం చైవ అభయం చాంకుశం తథా.
పట్టిశం భిన్డిపాలం చ ఖడ్గముద్ధరతోమరాన్,
వామభాగే వరైశ్శంఖం ఖేటం పాశం చ శూలకమ్.
అగ్నిం చ వరదం శక్తిం కుండికాం చ తతః పరమ్,
కార్ముకం తర్జనీముద్రాం గదాం డమరుశూర్పకో.
ద్వాభ్యాం కరాభ్యాం రిపోర్టానుమస్తకపీడనమ్,
ఊర్ధ్వీకృతాభ్యాం బాహుభ్యాం ఆన్తమాలాధరం విభుమ్.
అధసితాభ్యాం బాహుభ్యాం మీరణ్యకవిదారణమ్,
ప్రియకరం చ భక్తానాం వైత్యానాం చ భయంకరమ్.
నృసింహం స్మరేదిళ్లం మహామృత్యుభయాపహమ్,
ఏవం ధ్యాత్వా జు పేన్మస్త్రీ సర్వ కార్యార్థ సిద్ధయే.
అథోచ్యతే ధ్యానమన్యన్ముఖరోగహరం శుభమ్,
స్వర్ణవర్ణసుపర్ణస్థం విద్యున్మాలాసటాన్వితమ్.
కోటిపూర్ణీష్ణువర్ణం చ సుముఖం త్ర్యక్షి వీక్షణమ్,
పీతవ సోరుభూషాఢ్యం నృసింహం శాంతవిగ్రహమ్.
చక్రశంఖాభయవరాన్దధతం కరపల్లవైః,
క్ష్వేడరోగాదిశమనం ప్వెర్యానైస్సురవందితమ్.
శత్రో సేనానిరోధేన యత్నం కుర్యాచ్చ సాధకమ్,
అక్షకా షెరేధితేఒగ్నౌ విచిన్య రిపుమర్ధనమ్.
దేవం నృసింహం సంపూజ్య కుసుమాద్యుపచార కైః,
సమూలమూలైర్జుహుయాచ్ఛరైరర్థశతం పృథక్.
రిపుం ఖాదన్నిన జపేన్నిర్ణహన్నివ తం క్షి పేత్,
హుత్వా సప్తదినం మన్రో సేనామిష్టాం మహీపతేః.
ప్రస్థాపయేచ్ఛుభే లగ్నే పరరాష్ట్ర జయేచ్ఛయా,
తస్యాః పురస్తానృహరిం నిఘ్ననం రిపుమండలమ్.
స్మృత్వా జపం ప్రకుర్వీత యావదాయాతి సా పునః,
నిర్జిత్య నిఖిలాఇత్రూన్సహ వీరియా సుఖమ్.
ప్రీణయేన్మస్త్రాణం రాజా విభవైః ప్రీతమానసః,
రాజాశ్వరధరత్నేశ్చ గ్రామక్షేత్రధనాదిభిః.
యది మంత్రీ న తు ష్యేత తదానర్ధో మహీపతేః,
జాయతే తస్య రాష్ట్రీషు ప్రాణేభ్యో మహాభయమ్.
అష్టోత్తరశతం మూలమన్తమతభస్మనా,
నాశయేన్మూ షికాలూతా వృశ్చికాద్యుత్తితం విషమ్.
లిప్తంగస్సర్వరోగైశ్చ ముచ్యతే నాత్రసంశయః,
తేవంతీ కుసుమైర్హుత్వా మహతీం శ్రియమాప్నుయాత్.
ఔదుంబరసమిద్భిస్తు భవేద్దాన్యసమృద్ధిమాన్,
అపూపలక్షహోమే తు భవేద్వేశ్రవణోపమః.
క్రుద్ధస్య సన్నిధే రాజౌ జ పేదష్టోత్తరం శతమ్,
సద్యో నైర్మల్యమాప్నోతి ప్రసాదం చాధిగచ్ఛతి.
కుందప్రసూనైరుదయం మోచాభిర్విఘ్ననాశనమ్,
తులసీపత్రహోమేన మహతీం కీర్తిమాప్నుయాత్.
శాల్యుక్తసక్తుహోమేన వశయేదఖిలం జగత్,
మధూకపు షెరిష్టం స్యాత్నంభవం ధాత్రిఖండకైః.
దధిమధ్వాజ్యనిం తు గుడూచీం చతురంగులామ్,
జుహుయాదయుతం యోసౌ శతం జీవతి రోగజిత్.
శనైశ్చరదినేశ్వత్థం స్పృష్ట్వా చాప్టోత్తరం శతమ్,
జ పేజ్జత్వా సోపమృత్యుం శతవర్షాణి జీవతి.
సంపదను కోరువాడు పూర్వము చెప్పబడిన శుక్లవర్లుడగు నృసింహస్వామిని ధ్యానము చేయువలయును. ఆ నృసింహస్వామి వామాంకమున పద్మహస్తయగు లక్ష్మిచే ఆలింగనము చేయబడియున్నవాడుగా ధ్యానము చేయబడవలయును. విషమృత్యుపరోగాది ఉపద్రవాది శాంతికోటకు కాలానల సమప్రభుడు, మహాభయంకరుడు, పేగులను మాలగా ధరించినవాడు, రౌద్రుడు, కంఠహారములచే భూషితుడు, నాగయజ్ఞోపవీతుడు, పంచముఖములచే శోభితుడు, చంద్రమౌళి, నీలకంఠుడు, ప్రతివకూడు, త్రినేత్రములు గలవాడు పరిఘలవంటి పదిభుజములచే సుశోభితుడు, జపమాలను, గదను, పద్మమును, ఆవుపాలవంటి శంఖమును, ధనువును, ముసలమును, చక్రమును ధరించినవాడు, ఖడ్గమును, శూలమును, బాణమును ధరించి రుద్రరూపుడుగా నుండువాడు. ఇస్ట్రనీలమణికాంతిగలవాడు, చంద్రసన్నిభుడు, స్వర్ణకాంతిగలవాడు పూర్వాది ఉత్తర పర్యంతము ఊర్ద్వస్యము గలవాడు, సర్వవర్ణుడు అగు నృసింహస్వామిని ఇట్లు ధ్యానమును చేసినచో సర్వవ్యాధి నివారణకాగల సర్వమృత్యుహరుడు దివ్యుడు, స్మరణ మాత్రమున సర్వసిద్ధిప్రదుడగు అగు నృహరిని ధ్యానము చేయవలయును. మహాకార్యమును సంకల్పించినపుడు పదునారు హస్తములు కలవాడు సర్వలోకేశ్వరుడు, సర్వాభరణ భూషితుడగు నృసింహుని ధ్యానించవలయును. రెండు హస్తములు విదారణ కర్మ చేయునవి, రెండు హస్తములు పేగులను వెలికి తీయునవి, రెండు హస్తములు శంఖ చక్రములను ధరించునవి, రెండు హస్తములు ధనుర్బాణములను ధరించునవి, రెండు హస్తములు ఖడ్గఖేటములను ధరించునవి. గదాపద్మములను ధరించు హస్తద్వయము. పాశాయశధరములగు హస్తద్వయము, రెండు హస్తములు శత్రు ముకుటార్పీతములు. ఇట్లు పదునారు బాహువులు గల ప్రభువగు నృసింహస్వామిని నీలవర్లుని ఉగ్రకర్మలయందు అనన్య చిత్తముతో ధ్యానించవలయును. ఇంకను మహత్తమ కార్యమునందు ముప్పది రెండు బాహువులు గల నృహరిని ధ్యానించవలయును. సర్వభూతాధిపతి, సర్వసిద్ధికరుడు, పరుడు నృసింహస్వామియే. దక్షిణ బాహువులలో చక్రపద్మములను, పరుశువును, పొశమును, హలమును, ముసలమును, అభయమును, అంకుశమును, పట్టిశమును, బిందిపొలమును, ఖడ్గముద్ధర తోమరములను ధరించువాడు, వామభాగమున నుండు హస్తములలో శంఖమును, ఖేటమును, పొశమును, శూలమును, అగ్నిని, వరదముద్రను, శక్తిని, కుండికను, కార్ముకమును, తర్జనీముద్రను, గదను, డమరు శూర్పకములను, రెండు చేతులచే శత్రువుల జానుమస్తక పీడనమును చేయువాడు, పైన నున్న బాహువులచే అంత్రమాలను ధరించువాడు, క్రిందనున్న బాహువులచే హిరణ్యకశ్యపుని చీల్చువాడు, భక్తులకు ప్రియమును, దైత్యులకు భయమును కలిగిచువాడు అయిన మహామృత్యుభయమును తొలగించు నృసింహస్వామిని ఇట్లు స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి సర్వకార్యార్థ సిద్ధికి జపమును చేయవలయును. ఇక ఇపుడు శుభకరము, ముఖరోగహరమగు మరియొక ధ్యానమును చెప్పెదను. స్వర్ణవర్ణము గల గరుడుని పై నున్నవాడు, మెరుపు తీగలవంటి జటలు గలవాడు, కోటి పూర్ణేందువరుడు, సుముఖుడు, మూడునేత్రములతో చూచువాడు, పీతాంబరధారి, మహాభూషణభూషితుడు, శాంతవిగ్రహుడు, శంఖ చక్రాభయవరములను ధరించువాడు, కుష్టు వ్యాధి మొదలగు వ్యాధులను శమింప చేయువాడు, దేవతలచే వందనములను పొందువాడు, అయిన నృసింహుని ధ్యానము చేయవలయును. శత్రు సేనానిరోధమును చేయగోరువాడు ప్రయత్నముచే అక్షకాషములతో జ్వలింపచేసిన అగ్నిలో శత్రుమర్ధనుని ధ్యానించుచు, నృసింహదేవుని పుష్పాద్యుపచారములచే పూజించి మూలములతో కూడిన మూలశరములతో ఒక వేయి హోమమును చేయవలయును. శత్రువును భక్షించుచున్న స్వామిని జపించవలయును. శత్రువును దహింపచేయుచున్నట్లుగా క్షేపము చేయవలయును. ఇట్లు ఏడుదినములు హోమమునుచేసి రోజునకు ఇష్టమగు సైన్యమును యుద్ధమునకు పంపించవలయును. పురరాష్ట్రములను జయించు ఇచ్ఛగలవారు శుభలగ్నమున పంపవలయును. ఆ సైన్యముముందు భాగమున శత్రు సమూహమును వధించుచున్న నృసింహదేవుని స్మరించుచు సైన్యము శత్రువును జయించి విజయలక్ష్మితో ఆనందముగా తిరిగి వచ్చువరకు జపము చేయవలయును. తరువాత జయమును చేకొన్న రాజు జపము చేసిన మంత్రజ్ఞుని సంతోషముచే వైభవములతో ప్రీతిని పొందించవలయును. గజాశ్వరధరత్నములచే గ్రామ క్షేత్రధనాదులచే సంతోషపరచవలయును. జపము చేసినవాడు సంతోషించనిచో రాజునకు గొప్ప అనర్థము సంభవించును. రాజ్యభస్మమును లేపనము చేసికొనినచో మూషిక వృశ్చికొదులవలన భయము తొలగును. సర్వరోగములనుండు విముక్తిని పొందును. సేవంతీపుష్పములచే హోమమును గావించినచో మహా సంపదలను పొందును. మేడిసమిధలచే హోమమును గావించినచో ధావ్యసమృద్ది కలుగును. లక్ష అపూపములచే హోమమును గావించినచో కుబేరునితో సమానుడగును. కోపించిన రాజు సమీపమున అష్టోత్తరశతజపమును చేయవలయును. వెంటనే నిర్మలత్వమును పొంది అనుగ్రహమును సంపాదించగలుగును. మల్లెపూవులతో హోమమును గావించిన అభివృద్ధి. అరటి పూవులచే చేసిన విఘ్ననాశము సంభవించును. తులసీపత్రములచే హోమమును గావించిన గొప్ప కీర్తిని పొందును. వరిపొలములతో హోమమును గావించినచో సకలజగము వశమగును. ఇప్పపూవులతో హోమముగావించినచో సకల జగతంభనమును గావించగలుగును. దధిమధుఆజ్యమిశ్రమగు చతురంగుళ పరిమాణముగల గుడూచీచే పదివేలు హోమమును గావించినచో అన్ని రోగములను జయించి నూరు సంవత్సరములు జీవించును. శనివారమున రాగి చెట్టును తాకి అష్టోత్తరశతమును జపించినచో అపమృత్యువును జయించి నూరు సంవత్సరములు జీవించును.
అథ తే సంప్రవక్ష్యామి యంత్రం త్రైలోక్యమోహనమ్,
యస్య పంధారణాదేవ భవేయుస్సర్వసంపదః,
శ్వేత భూర్జే లిఖేత్పద్మం ద్వాత్రింశత్సింహాసంయుతమ్,
మధ్యే సిం హే స్వబీజం చ లిఖేత్పూర్వవదేవ తు.
శ్రీబీజేన తు సంవేద్య వలయత్రయసంయుతమ్,
పాశాంకుశైశ్చ సంవేష్ట్య పూజయేద్యంత్రముత్తమమ్.
త్రైలోక్యమోహనం నామ సర్వకామార్థసాధనమ్,
చక్రరాజం మహారాజం సర్వచక్రేశ్వరేశ్వరమ్.
ధారణోజ్జయమాప్నోతి పత్యం పత్యం న సంశయః,
అథ యంత్రాంతరం వక్ష్యే శృణు నారద పిర్దిదమ్.
అష్టారం విలిభేద్యంత్రం క్లక్షం కర్ణికయా యుతమ్,
మూలమంత్రం లిఖేత్తత్ర ప్రణవేన సమన్వితమ్.
ఏకాక్షరం నారసింహం మధ్యే చైవ ససాధ్యకమ్,
జు పేదష్టసహస్రం తు సూత్రేణా వేష్ట్య తద్బహిః.
స్వర్ణరౌప్యసుతామ్రశ్చ వేష్టయేతమశస్సుధీః,
లాక్షయా వేష్టితం కృత్వా పునర్మంత్రేణ మంత్రయేత్.
కంఠే భూజే శిఖాయాం వా ధారయేద్యంత్రముత్తమమ్,
నరనారీనరేంద్రాశ్చ సర్వేస్యుర్వశగా భువి.
దుష్టాస్తం నైవ బాధంతే పిశాచోరగరాక్షసాః,
య రాజప్రసాదేన పర్వత్ర జయమాప్నుయాత్.
అథాన్యత్సంప్రవక్ష్యామి యంత్రం పర్వవశంకరమ్,
ద్వాదశారం మహాచక్రం పూర్వవద్విలిఖేత్సుధీః.
మాత్రాద్వాదశసంభిన్నదలేవిలిభేద్బుధః,
మధ్యే మంత్రం శక్తియుక్తం శ్రీబీజేన తు వేష్టయేత్.
కాలాంతకం నామ చక్రం సురాసురవశంకరమ్,
చక్రముల్లేఖయేద్భూద్దే సర్వశత్రునివారణమ్.
యస్య ధారణమాత్రేణ సర్వత్ర విజయీ భవేత్,
అథ సర్వేష్టదం జ్వాలామాలిసంజ్ఞం వదామ్యహమ్.
బీజం హృద్భగవాన్ జేన్తో నరసింహాయ తత్పరమ్,
జ్వాలినే మాలినే దీప్తదంష్ట్రాయ అగ్నినే పదమ్.
త్రాయ సర్వాది రక్షోఘ్నాయ చ నస్సర్వ భూపదమ్,
హరిర్వనాశనాయాంతే సర్వజ్వరవినాశనః.
నామాంతే దహయుగ్మం చ పచద్వయముదీరయేత్,
రక్షయుగ్మం చ వర్మాస్త్రద్వయాంతో ధ్రువాదికః.
అష్టషష్ట్యక్షరైః ప్రోక్తో జ్వాలామాలీ మనూత్తమః,
పుణ్యాదికం తు పూర్వోక్తం త్రయోదశభిరక్షరైః.
పంక్తీభీ రుద్రసంఖ్యా కైరష్టాదశభిరక్షరై,
భానుభిః కరణేర్మంత్రీ వరైరంగాని కల్పయేత్.
పూర్వోక్తరూపిణం జ్వాలామాలినం నృహరిం స్మరేత్,
లక్షం జపో దశాంశం చ జుహుయాత్కపిలాఘృతైః.
రౌద్రౌపస్మారభూతాదినాశకోయం మనూత్తమః,
ప్రాణో మాయా నృసింహశ్చ సృష్టిరహ్మాస్త్రమీరితః.
షడక్షరో మహామంత్రస్సర్వాభీష్టప్రదాయకః,
మునీర్బహ్మా తథా ఛందః పంక్తిర్దేవో నృకేసరీ.
షడ్డీరభాజా బీజేన షడంగాని పమాచరేత్,
పూర్వోత్తేనైవ విధినా ధ్యానం పూజాం సమాచరేత్.
పిర్ధేన మనునానేన సర్వసిద్ధిర్భవేన్నృణామ్,
రమాబీజాదికోఽనుష్టుప్తయస్త్రింశార్ణవాన్మనుః.
ప్రజాపతిర్ము నిశ్ఛందోనుష్టుప్లక్ష నృకేసరీ,
దేవతా చ పదైప్సర్వేణాంగకల్పనమీరితమ్.
విన్య ప్యెవం తు పంచాంగః స్వాత్మరక్షాం పమాచరేత్,
సంస్పృశన్లక్షిణం బాహుం శరభప్య మనుం జపేత్.
ప్రణవో హృచ్ఛివాయేతి మహతే శరభాయ చ,
వహ్నిప్రీయాంతో మంత్రపు రక్షార్థ సముదాహృతః.
అథవా రామమంత్రాంతే పరం క్షద్వితయం పత్,
అథవా కేశవ్యాస్తు రక్షాం కుర్యాతయత్నతః.
కేశవః పాతు పాదౌమే జం మే నారాయణోవతు,
మాధవో మే కటిం పాతు గోవిందో గుహ్యమేవ చ
నాభిం విష్ణుశ్చ మే పాతు జఠరం మధుసూదనః,
ఊరూ త్రివిక్రమః పాతు హృదయం పాతు మే నరః.
శ్రీధరః పాతు కంఠం చ హృషీకేశో ముఖం మమ,
పద్మనాభస్తనౌ పాతు శీర్షం దామోదరోఒవతు.
ఏవం విన్యస్య చాంగేషు జపకాలే తు సాధకః,
నిర్భయో జాయతే భూతవేతాళగ్రహరాక్షసాత్.
పునర్న్య సేతయత్నేన ధ్యానం కుర్వన్సమాహితః,
పురస్తాత్కేశవః పాతు చక్రీ జాంబూనదప్రభః.
పశ్చాన్నారాయణశ్శంఖీ నీలజీమూతసన్నిభ,
ఊర్థ్వమిందీవరశ్యామో మాధవస్తు గదాధరః.
గోవిందో దక్షిణే పార్శ్వే ధన్వీ చౄప్రభో మహాన్,
ఉత్తరే హలధృగ్విషు పద్మ కింజల్కసన్నిభః.
ఆగ్నేయ్యామరవీందాక్షో ముసలీ మధుసూదనః,
త్రివిక్రమః ఖడ్గపాణి రైఋత్యాం జ్వలనప్రభ,
వాయవ్యం మాధవో వజ్జీ తరుణాదిత్యసన్నిభః,
ఐశాన్యాం పుండరీకాక్షశీధరః పట్టిశాయుధః.
విద్యుతభో హృషీ కేశ ఊర్జే పాతు సముద్గరః,
అథశ్చ పద్మనాభో మే సహస్రాంశుసమప్రభః.
సర్వాయుధస్సర్వశక్తి స్సర్వాద్యస్సర్వతో ముఖః,
ఇంద్రగోపప్రభః పాయాతాశహస్తో పరాజితః.
పబాహ్యాభ్యన్తరే దేహమవ్యాద్దామోదరో హరిః,
ఏవం సర్వత్ర నిశ్ఛిద్రం నామ ద్వాదశపంజరమ్.
ప్రవిష్ణోహం న మే కించిద్భయమస్తి కదాచన,
ఏవం రక్షాం విధాయాథ దుర్ధర్షా జాయతే నరః.
సర్వేషు నృపతేర్మస్త్రవధే ష్వేవం విధిర్మతః,
పూర్వోక్తవిధినా సర్వం ధ్యానపూజాదికం చరేత్.
జితం తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన,
నమస్తేస్తు హృషీ కేశ మహాపురుష తే నమః,
ఇత్థం పంప్రార్థ్య జప్త్వా చ పఠిత్వా విసృజేద్విభుమ్,
ఏవం సిద్దే మనౌ మంత్రీ జాయతే సంపదాం పదమ్.
ఇక ఇపుడు నీకు త్రైలోక్యమోహనయంత్రమును చెప్పెదను. ఈ యంత్రమును ధరించినంత మాత్రముననే అన్ని సంపదలు కలుగును. తెల్లని భూర్జపత్రమున ముప్పది రెండు సింహములు గల పద్మములను లిఖించవలయును. మధ్య సింహమున స్వబీజమును పూర్వమువలె లిఖించవలయును. శ్రీ బీజముతో చుట్టి వలయత్రయమును గూర్చి, పాశాంకుశములతో సంవేష్టనము గావించి ఉత్తమ యంత్రమును పూజించవలయును. త్రైలోక్యమోహనమను యంత్రము సర్వకామార్థసాధకము. సర్వ చక్రేశ్వరేశ్వరుడు, మహారాజు అగు చక్రరాజమును ధరించుట వలన సర్వ ప్రదేశములందు జయమును పొందును. ఇది ముమ్మాటికి నిశ్చయము. సంశయము లేదు. ఇక ఇపుడు మరొక యంత్రమును చెప్పెదను. ఇదీ సర్వసిద్ధిప్రదము. మృదువుగా సుందరముగా కర్ణికాయుతముగా అష్టదళయంత్రమును లిఖించవలయును. ప్రణవముతో కూడిన మూలమంత్రమున ఆ యంత్రమున లిఖించవలయును. మధ్యభాగమున నారసింహ ఏకాక్షరినీ లిఖించవలయును. ఆ యంత్రము వెలుపల దారముతో చుట్టి ఎనిమిది వేలు జపమును చేయవలయును. తరువాత బంగారము వెండి రాగులతో చక్కగా చుట్టవలయును. దాని పై లక్కపూత పూసి మరల మంత్రముచే మంత్రించ వలయును. కంఠమున కానీ, భూజమునకొని శిఖ యందు కానీ ధరించవలయును. ఇట్లు చేసినచో నర నారీజనము నరేంద్రులు అందరూ వశులగుదురు. దుష్టులగు పిశాచోరగ రాక్షసులు యంత్రధారకుని బాధించజాలరు. యంత్రరాజానుగ్రహమున అంతటా జయమును పొందును. ఇక ఇపుడు సర్వవశంకరమైన మరియొక యంత్రమును గూర్చి చెప్పెదను. ద్వాదశార మహాచక్రమును పూర్వము వలే లిఖించవలయును. ద్వాదశమాత్రసంపన్నదళముచే లిఖించవలయును. మధ్యభాగములో శక్తి యుక్తమగు మంత్రమును శ్రీ బీజముతో వేష్టనము చేయవలయును. సురాసుర వశంకరమగు కాలాంతకము చక్రమును సర్వశత్రునివారకమును భూర్జపత్రమున లిఖించవలయును. ఈ యంత్రమును ధరించినంత మాత్రమున అంతటా విజయమును పొందును. ఇక ఇపుడు సర్వేష్ట ప్రదమగు జ్వాలామాలియంత్రమును గూర్చి చెప్పెదను. చతుర్థానమగు భగవచ్చబ్దము బీజము హృదయము. తరువాత నరసింహాయ అని. జ్వాలినే మాలినే దీప్త దంష్ట్రాయ అగ్ని నేత్రాయ సర్వాది రక్షోఘ్నాయ సర్వ భూహారి వినాశనాయ, సర్వజ్వరవినాశనాయ దహదహ, పచపచ, రక్ష రక్ష అని కూర్చ వర్మ తీస్త ఈద్వయాంతముగా ధ్రువొదికమును చెప్పవలయును. ఈ జ్వాలా మాలీ మంత్రము అరువది యెనిమిది అక్షరములు కలది. పదమూడక్షరములచే పూర్వోక్తముగా పుణ్యాదికము నాచరించవలయును. పదకొండు పంక్తులచే పదునెనిమిది అక్షరములచే. పన్నెండు కరణములచే అంగములను కల్పించవలయును. పూర్వమున చెప్పిన రూపముగల జ్వాలామాలి నారసింహుని స్మరించవలయును. మంత్రమును లక్షజపించి దశాంశము కపిల గోఘృతముచే హోమమును గావించవలయును. ఈ మంత్రము రౌద్రౌపస్మార భూతా దీనాశకము. మాయ ప్రాణము నరసింహదేవుడు సృష్టి బ్రహ్మ స్రముగా చెప్పబడినది. ఈ మంత్రము షడక్షరము సర్వాభీష్టప్రదాయకము. ఈ మంత్రమునకు బ్రహ్మముని, పంక్తి ఛందస్సు. నరసింహస్వామి దేవత, షడీర్ఘయుతమగు బీజముచే "షడంగములనాచరించవలయును. పూర్వోక్తవిధానమున ధ్యానమును పూజను గావించవలయును. ఈ మంత్రము సిద్ధించినచో నరులను సర్వసిద్దులు కలుగును. రమాబీజాది బీజములు కలది, అనుష్టుప్పన్షస్సు, ముప్పది మూడు వర్ణములు కలది. ఈ మంత్రము ముని ప్రజాపతి. అనుష్టుప్చందస్సు. లక్ష్మీనరసింహస్వామి దేవత. అన్ని పదములచే గకల్పన గావించవలయును. ఇట్లు పంచాంగన్యాసమును గావించి ఆత్మరక్షణనాచరించవలయును. దక్షిణ బాహువును స్పృశించుచు శరభమంత్రమును జపించవలయును. ప్రణవము హృదయము శివాయ మహతే శరభాయ అనునది వహ్నిప్రియాంతమగు మంత్రము రక్షకోజుకు చెప్పబడినది. లేదా రామ మంత్రాంతమున రెండక్ట కొరములను పఠించవలయును. లేదా కేశ వాదినామములచే ప్రయత్నించి రక్షను చేయవలయును. కేశవుడు పాదములను, నారాయణుడు జంఘలము కాపాడుగావుత. మాధవుడు కటీని, గోవిందుడు గుహ్యమును, విష్ణువు నాభిని, మధుసూదనుడు జఠరమును త్రివిక్రముడు ఊరువులను, నరుడు హృదయమును, శ్రీధరుడు కంఠమును, హృషీ కేశుడు ముఖమును కాపొడుగోవుత పద్మనాభుడు స్తనములను, దామోదరుడు శిరస్సును కాపాడుగావుత. ఇట్లు సాధకుడు జపకాలమున అంగన్యాసమును గావించినచో భూతభేతాళగ్రహ రాక్షసులనుండి భయము లేనివాడగును. మరల సావధాన మనస్కుడై ధ్యానము చేయుచు న్యాసమును గావించవలయును. బంగారు కొంతీగల, చక్రాయుధుడగు కేశవుడు ముందు భాగమున కొపొడు గావుత, వెనుకభాగమున నీలమేఘశ్యాముడగు, శంఖధారియను నారాయణుడు, ఊర్ధ్వభాగమున ఇందీవరశ్యాముడు గదాదారియగు మాధవుడు, దక్షిణ పార్శ్వమున చంద్రప్రభుడు ధనుర్ధారియగు గోవిందుడు, ఉత్తర పార్శ్వమున పద్మ కింజల్కసన్నిభుడు హలధారియగు విష్ణువు, ఆగ్నేయ భాగమున అరవిందాకుడు ముసలధారియగు మధుసూదనుడు, నైఋత దిగ్భాగమున జ్వలనప్రభుడు ఖడ్గపాణియగు త్రివిక్రముడు, వాయవ్యభాగమున తరుణాదిత్య సన్నిభుడు వజ్రధారియగు మాధవుడు, ఈశాన్యదిగ్బాగమున పుండరీకాక్షుడు పట్టిశాయుధుడగు శ్రీధరుడు, ఊర్థ్వభాగమున ముద్ధర ధారయగు హృషీ కేశుడు, అధోభాగమున సూర్యసమప్రభుడగు పద్మ నాభుడు, సర్వాయుధుడు, సర్వశక్తి, సర్వాగ్యుడు, సర్వతోముఖుడు ఇంద్రనీల మణిప్రభుడు, అపరాజితుడు పాశహస్తుడు అగు దామోదరుడైన శ్రీహరి బాహ్యాభ్యంతరములందు కాపాడుగావుత. ఇట్లు అంతటా ఛిద్రరహితమగు ద్వాదశనామ పంజరమున నేను ప్రవేశించితిని. నాకు ఎప్పడూ ఏ భయమూ లేదు. ఇట్లు అంతటా రక్ష నేర్పరచుకొనినవాడు ఇతరులను దుర్ధరుడగును. అన్ని నారసింహమంత్రములలో ఈ విధియే ఆచరించవలయును. తరువాత పూర్వోక్తవిధిననుసరించి ధ్యాన పూజాదికము నాచరించవలయును. ఓ పుండరీకాక్షా ! నీవు అంతటా జయించువాడవు. ఓ విశ్వభావనా! నీకు నమస్కారము. ఓహృషీ కేశా మహాపురుషా ! నీకు నమస్కారము. ఇట్లు ప్రార్ధన చేసి, జీపించి పఠించి విసర్జన గావించవలయును. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినవాడు సర్వసంపదలకు నిలయుడగును.
జయద్వయం శ్రీనృసిం హేత్యష్టార్ణో మనుర్మతః,
మునిర్భ్రహ్మాథ గాయత్రీ ఛందః ప్రోక్తోప్య దేవతా.
శ్రీమాజ్ఞయ నరసింహస్తు సర్వాభీష్టప్రదాయకః,
పేందుదేలిందపూర్వేణ వియతా సేన్దునా పునః.
షడ్దర్ఘాఢ్యన కుర్వీత షడంగాని విశాలధీః,
తతో ధ్యాయేద్ధృది విభుం నృసింహచస్త్రశేఖరమ్.
శ్రీమన్న కేసరితనో జగదేకబంధో ! శ్రీ వీలకంఠ కరుణార్ణవ సామరాజ ! వహ్నీందుతీవ్రకరనేత్రపినాకపాణే,
శీతాంశు శేఖర రమేశ్వర పాహి విష్ణో !
ధ్యాత్వైవం ప్రజు పేల్లక్షాపకం మంత్రి దశాంశతః,
సాజ్యేన పాయసాన్నేన జుహుయాతాగ్వదర్చనమ్.
తారో మాయా స్వబీజాంతే కర్ణోగ్రం వీరమీరయేత్,
మహావిష్ణుం తతో బ్రూయాజ్జ్వలంతం సర్వతో ముఖమ్.
స్పురద్ద్వయం ప్రస్ఫురేతి ద్వయం ఘోరపదం తతః,
వదేద్ఘోరతరం తేతు తను రూపం చఠద్వయమ్.
ప్రచటద్వయమాభాష్య కహయుగ్మంచ మద్వయమ్,
బంధ ద్వయం ఘాతయేతి ద్వయం వర్మాస్త్రమీరయేత్.
నృసింహం బీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహమ్,
పంచాశీత్యక్షరో మంత్రో భజతామిష్టదాయకః.
ఋషీహ్యరబ్రహ్మణే తథా త్రిష్టుబనుష్టుబౌ,
ఛందసీ చ తథా హోరనృసింహాదేవతా మతః.
ధ్యానార్చనాదికం చాస్య కుర్యాదానుష్టుభం సుధీః,
విశేషాన్మవర్యోయం సర్వరక్షాకరో మతః.
బీజం జయయుగం పశ్చానపిం త్యష్టవర్ణవాన్,
ఋషిః ప్రజాపతిశ్చాస్యానుష్టుప్చంనద ఉదాహృతమ్.
విదారణనృసింహ్యాస్య దేవతా పరికీర్తితః,
జంబీజం హం తథాశక్తి ర్వినియేగ్యో ఖిలాప్తయే.
దీర్ఘాఢ్యన నృసిం హేన షడంగన్యాసమాచరేత్,
రౌద్రం ధ్యాయేన్నహం తు శత్రు వక్షో విదారణమ్.
నఖదంష్ట్రాయుధం భక్తాభయదం శ్రీనికేతనమ్,
తప్తహాటక కేశాంతజ్వలత్పావకలోచనమ్.
వజ్రాధికనఖస్పర్శదివ్యపింహనమోఽస్తు తే,
మునిరహ్మా సమాఖ్యాతోనుష్టుప్ఛన్షస్సమీరితః.
దేవతాప్య దార్ణస్య దీయపూర్వో నృ కేసరీ,
పాదైశ్చతుర్భిస్సర్వేణ పంచాంగాని సమాచరేత్.
ధ్యానపూజాదికం సర్వం ప్రాగ్వతోక్తం మునీశ్వర,
పూర్వోక్తాని చ సర్వాణి కార్యాణ్యాయాంతి సిద్ధతామ్.
తారో నమో భగవతే నరసింహాయ హృచ్చ తే,
జస్తే ఇసే ఆవిరావిర్భవ వజ్రనఖాంతత.
వజ్రదంషేతి కర్మాంతే ద్వాపయాక్రందయద్వయమ్,
తమోగ్రసద్వయం పశ్చాత్సాహాంతే చాభయం తతః,
ఆత్మన్యంతే చ భూయిషా ధ్రువో బీజాంతమో మతః,
ద్విషష్ట్యగ్జ్యోస్యమున్యాది సర్వం పూర్వవదీంతమ్.
తారో నృసింహబీజం చ నమో భగవతే తతః,
నరసింహాయ తారశ్చ బీజమస్య యథా తతః,
రూపాయ తారస్సరీజం కూర్మరూపాయ తారకమ్,
బీజం వరాహరూపాయ తారో బీజం నృసింహతః.
రూపాయ తారం ప్వం బీజం వామనాంతే చ రూపతః,
పొపధ్రువత్రయం బీజం రామాయ నిగమాదితః.
బీజం కృష్ణాయ తారాంతే బీజం చ కలినే తతః,
జయద్వయం తతశ్శాలగ్రామాంతే చ నివాసినే.
దివ్య పింహాయ జేన్తః స్యాత్స్వయం భూః పురుషాయ హృత్,
తారస్యం బీజమిత్యేష మహాసామ్రాజ్యదాయకః
నృసింహమన్తః భాంకార్ణో మునిరత్రిః ప్రకీర్తితః,
ఛందోబ్రతిజగతీ ప్రోక్తం దేవతా కథితా మనోః.
దశావతారో నృహరిం బీజం ఖం శక్తిరవ్యయః,
షడ్జీర్జాఢ్యన బీజేన కృత్వాంగాని చ భావయేత్.
అనేకచన్దప్రతిమో లక్ష్మీముఖకృతేక్షణః,
దశావతారైస్సహితస్తనోతు నృహరిస్సుఖమ్.
జపోయుతం దశాంశేన హోమస్యాత్సాయ పేన తు,
ప్రాగుక్తీ పూజయేతీరే మూర్తిం సంకల్ప్య మూలతః.
అంగాన్యాదౌ చ మత్య్సాద్యాబ్దిగ్గలేషు తత్కోర్చయేత్,
ఇంద్రాద్యానపి వజ్రాద్యాన్సంపూజ్యేష్టమవాప్నుయాత్.
సహస్రార్ణం మహామంత్రం వక్ష్యే తంత్రేషు గోపితమ్,
తారో మాయా రమాకామో బీజం క్రోధపదం తతః,
మూర్తీ నృసింహశబ్దాంతే మహాపురుష ఈరయేత్,
ప్రధానధర్మాధర్మానే నిగడేతి పదం వదేల్.
నిరోచనాంతే కాలేతి తతః పురుష ఈరయేత్,
కాలాన్తకపదృక్ష్యం స్వేశ్వరాంతే సదృగ్జాలమ్.
శ్రాంతాంతే తు నివి స్టేతి చైతన్యచిత్సదా తతః,
భాసకాంతే తు కాలాద్యతీతనిత్యోదితేతి చ
ఉదయాస్తమయాక్రాన్తమహాకారుణి కేతి చ,
హృదయాల్టచతుశ్చక్తా దలాంతే తు నివిష్టితః.
చైతన్యాత్మంశ్చతురాత్మన్ద్వాదశాత్మంస్తతః పరమ్,
చతుర్వింశాత్మమనస్తే తు పంచవింశాత్మన్నిత్యది.
బకో హరిప్సహస్రాంతే మూర్తే ఏ హ్యాహి శబ్దత,
భగవన్నసింహ పురుష క్రోధేశ్వర రసా సహ.
స్రవందితాంతే పాదేతి కల్పాక్షాన్నిపహస్ర చ,
కోట్యాభాంతే మహాదేవ నికాయదశశబ్దతః.
శతయజ్ఞాతలం జ్ఞేయం తతశ్చామలయుగ్మ కమ్,
పింగలేక్షణసటాదంష్ట్రా దంష్ట్రాయుధ ! నఖాయుధ.
దానవేంద్రోంతకావహ్నిశోణిత పదం తతః,
పరసక్తి విగ్రహాంతే తు భూతాపస్మారయాతుధాన్
సురాసురవంద్యమానపాదపంకజశబ్దతకి,
భగవన్యోమచక్రేశ్చ రాంకేతు ప్రభవాప్యయ.
రూ పేజోత్తిష్ఠ చోత్తిష్ఠ అవిద్యానిచయం దహ,
దహ జ్ఞానేశ్వర్యమంతే ప్రకాయుగం తతః,
ఓం సర్వజ్ఞ ఆరోషాంతే జంభాజృంభవతారకమ్,
పత్యపురుషశబ్దాంతే పదసన్మధ్య ఈరయేత్.
నివిష్టం మమ దుస్స్వప్నభయం నిగడశబ్దతః,
భయం కాంతారశబ్దాంతే భయం విషపదాత్తతః.
జ్వరాంతే డాకినీ కృత్యాధ్వరేవతీ భయం తతః,
అశన్యంతే భయం దుర్భిక్షభయం మారీశబ్దతః.
భయం మారీచశబ్దాంతే భయం ఛాయాపదం తతః,
స్కందోపస్మారశబ్దాంతే భయం చోరభయం తతః,
జలస్వప్నాన్నిభయం గజపింహభుజంగతః,
భయం జన్మ జరాంతే తు మరణాదిశబ్దమీరయేత్.
భయం నిర్మో చయయుగం ప్రశమయయుగం తతః,
శ్లేయరూపధారణాంతే నృసింహబృహత్సామతః.
పురుషాంతే పర్వభయనివారణ పదం తతః,
అష్టాష్టకం చతుష్టష్టిచేటికాభయమీరయేత్.
విద్యాకృతస్రయస్ట్రింశద్దేవతాకోటిశబ్దతః,
నమితాంతే పదపదాత్పంజొన్విత ఈరయేత్.
పహాస్రవదనాంతే తు సహస్ర దళ పంవదేత్,
సహ సేక్షణశబ్దాంతే సహస్రపదమీరయేత్.
సహస్రభుజ సంప్రోచ్య సహస్రజిహ్వ సంవదేత్,
సహస్రాంతే లలాటతీ పహస్రాయుధతో ధరాత్.
తమః ప్రకాశక పురమధానస్తే తు సర్వ చ,
మంత్రరాజేశ్వరపదాద్విహాయసగతిప్రద.
పాతాలగతిప్రాదాంతే యౄమర్దన ఈరయేత్,
ఫరాట్టహాసహసీతవిశ్వావవాపపదం తతః.
వాసుదేవ తతో క్రూర తతో హయముఖేతి
చ పరమహంస విశ్వేశ విశ్వాంతే తు విడంబన.
నివిష్టాంతే తతః ప్రాదుర్భావకారక ఈరయేత్,
హృషీ కేశ చ స్వచ్ఛన్ల నిశ్శేషజీవ విన్య సేత్.
గ్రాసకాంతే మహా పశ్చాతిశితాసగీరయేత్,
లంపటాంతే ఖేచరీతి సిద్ధ్యంతే తు ప్రదాయక.
అజేయావ్యయ అవ్యక్త బ్రహ్మాండోదర ఇత్యపి,
తతో బ్రహ్మసహస్రాంతే కోటిస్రగ్రుండశబ్దతః.
మాలపండితముండేతి మత్స్యకూర్మ తతః పరమ్,
వరాహాంతే నృసిం హేతి వామనాంతే పమీరయేత్.
త్రైలోక్యక్రమణాంతే తు పాదశాలిక ఈరయేత్,
రామత్రయ తతో విష్ణురూపాంతే ధర ఏవ చ.
తత్త్వత్రయంతే ప్రణవా ఆధారతస్త్రచ్ఛిఖాం పదమ్,
నివిష్టవహ్నిజాయాంతే ద్విధా చైవ తతో వషట్.
నేత్రవర్మాస్త్రముచ్చార్య ప్రాణాధార ఇతీరయేత్,
ఆదిదేవపదాతాణాపాన పశ్చాన్నివిష్టితః.
పాంచరాత్రికదిపాజవీనిధనాంతే కరేతి చ
మహామాయా ఆమోఘాంతే దర్యం దైత్యేష్ట్ర శబ్దతః.
దర్యాంతే దళనేత్యుక్తా తేజోరాశిన్దూవం స్మరః,
తేజస్వరంతే పురుషషండేస్తే సత్యపూరుష
అస్త్రతార్యోచ్యుతాస్త్రం చ తారో వాచా సుదేవ ఫట్,
తార మాయామూర్తేః ఫట్ వః కామః స్మరాదీమః.
మూర్తోస్త్రమవ్యయం బీజం విశ్వమూర్తేజ్రరవ్యయః,
మాయావిశ్వాత్మనే షట్చ తారం శౌచం తురాత్మనే.
ఫట్ తార్యోఒహం విశ్వరూన్న స్త్రంచ తదనన్తరమ్,
తారాహై పరమాంతే తు ప్రాంసఫట్ ప్రణవస్తత.
హో హిరణ్యగర్భరూపధారణాంతే చ ఫట్ ధ్రువః,
హోం అనౌపమ్యరూపధారిణాస్త్రం ధ్రువస్తతః.
క్షౌం నృసింహరూపధారిన్ ఓం క్లం శైశ్చ స్వరాదికః,
అష్టాంగవిన్యాపవిన్యస్తమూర్తి ధారిన్ తతశ్చ ఫట్.
హోం నిసర్గపిర్ధ్యాకరూపధారింస్తతశ్చ ఫట్,
తారో వర్మ త్రయం పరికరం వం చాముకనుస్తకమ్.
ఖండద్వయం ఖాదయేతి ద్వయం క్లీం సాధ్యమానయ,
ద్వయం తతో మహాత్మాగ్యాన్సమ్యగ్డర్శయ యుగ్మకమ్.
షడ్జీర్జాఢ్యం స్వబీజం చ క్షపితాంతే తు కల్మష,
ఉత్తరాయం ద్వయం పంచ బాణబీజాని వోచరేత్.
నరసింహాంతే తతో జ్వాలాత్మనే స్వాహా పమీరయేత్,
నృసింహాంతే తతః కాలాత్మనే స్వాహా ధ్రువస్తతః.
ఖబీజం కామబీజం చ లక్ష్మీబీజద్వయం తతః,
మాయాతారాంతిమో మన్తస్సహస్రాక్షరసంమీతః.
కపిల్యోస్య_మునిశ్ఛందో జగతీ దేవతా పునః,
శ్రీలక్ష్మీ నృహరిర్భీజం క్షౌం శక్తిర్వహ్నివల్లభా.
శ్వేతో వర్ణ ఉదాత్తశ్చ స్వరః ప్రోక్తో మనీషిభిః,
క్షేత్రం చ పరమాత్మా తు వినియోగోఖలాప్తయే.
క్షస్సహస్రబాహవేంతే సహస్రాయుధధరాయ చ,
నృసింహారతం వహ్నిజాయాస్త్రాయ ఫట్ మన్రో ఈరితః.
అనేన కరశుద్ధిం చ కృత్వా ఆంగొని సమాచరేత్,
తారక్షాం చ సహస్రాంతే క్షరశబ్దాద్విజృంభితమ్.
నృసింహాయాగ్నిజాయాంతో హృదయే మనురీరితః,
మారః క్షీం చ మహాతేనుం ప్రభాంతే వీక రేతి చ
నృసింహాయాగ్నిజాయాంతే శిరోమంత్రః ప్రకీర్తితః,
తారః క్రూం కషయం హాయశ్చాదు కే శాంత ఈరయేత్,
జ్వలత్యావకలో కూర్మో దీరా వజ్రాధి కేతి చ
నఖప్పర్మొద్దివ్యపింహ నమోస్తు భగవాన్ హరి
మహాధ్వస్త జగద్రూప నృపింహాయ ద్వయం ద్వయమ్,
అనేన చ శిఖాప్రోక్తా కవచం తదనన్తరమ్.
తారః కైం చ సువర్ణం తే నుదమత్తపదం తతః,
విహ్వలితనృసింహాయ స్వాహాంతం కవచం స్మృతమ్.
తారం క్రైం చ సహస్రాక్ష విశ్వరూప పదం వదేత్,
ధారణ్యేన్ని ప్రియాంత్యోయం నేత్రమంత్రః ప్రకీర్తితః,
తారో క్షశ్చ సహస్రాంతే వారావే పదమీరయేత్,
సహస్రాంతే యుధాసార్థం నృసింహాయాగ్నిసుందరీ.
అస్త్రమౄప్సమాఖ్యాతస్తతో ధ్యాయేన్న కేసరీ,
ఉద్యదరపహస్రాభం తీక్షణం భీమభూషణమ్.
తీక్షాస్రభుజోదండెత్తైత్యదొరణకం స్మరేత్,
ఏవం ధ్యాత్వా జు పేన్మస్త్రీ సహస్రం పాయ పేన చ.
ఆజ్యప్టుతేన జుహుయాత్సమ్యక్సిద్గో భవేన్మనుః,
ప్రాగుకే వైష్ణవే పీతే మూర్తిం సంకల్ప్య మూలతః,
సంపూజ్య నృహరిం పశ్చాద్దవంగాని పూజయేత్,
చక్రం శంఖం చ పాశం వాంకుశం కులిశమేవ చ
గదొకృపాణి వడాని దలేషు పరిపూజయేత్,
లోకేశానపి వజ్రాద్యొనూజయేత్తదననంతరమ్.
ఏవం సిగ్ధ మనో మన్రో ప్రయోగాన్కర్తునుర్హతి,
భస్మాభిమంత్రితం కృత్వా గ్రహగ్రస్తం విలేపయేత్ .
భస్మపంలేపనాదేవ సర్వగ్రహవినాశనమ్,
అనేనైవ విధానేన యక్షరాక్షసకిన్నరా.
భూత ప్రేత పిశాచాశ్చ నశ్యంత్యేవ న సంశయః,
పరాభిచారకృత్యాని మనునానేన మంత్రితమ్.
భస్మసంలేపయేత్సద్యో దురాధర్షా భవేన్నరః,
పుదినే స్థాపయేత్కుంభే పర్వతో భద్రమండలే.
తీర్థతోయేన సంపూర్య జపేదష్టోత్తరం శతమ్,
తేనాభిషిక్తో మనుజస్సర్వాపత్తిం తరేద్దవమ్.
కిం బహూర్తేన పర్వేష్టదాయకోయం మనూత్తమః,
వజ్రనఖాయ విద్మహే తీక్షదంష్ట్రాయ ధీమహి,
తన్నో నృసింహశ్శబ్దాంతే వదేచ్చివ ప్రచోదయాత్,
ఏషా నృసింహగాయత్రీ సర్వాభీష్టప్రదాయినీ.
ఏతస్యాస్స్మరణాదేవ సర్వపాపక్షయో భవేత్.
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే
నృసింహోపాసనా మంత్రగాయత్య్రాదినిరూపణం నామ ఏకసప్తతితమోఽధ్యాయః.
“జయ జయ శ్రీనృసింహ” అనునది అష్టాక్షర మంత్రరాజము. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ, గాయత్రీ ఛందస్సు, జయ నృసింహాస్వామి దేవత. సర్వాభీష్టప్రదాయకుడు. సేందువగు గోవింద పూర్వముతో సేంద్వాకాశముతో షడ్దర్షాధ్యముతో షడంగన్యాసమును చేయవలయును. తరువాత హృదయమున చంద్ర శేఖరుడగు నృసింహస్వామిని ధ్యానము చేయవలయును. శ్రీమంతుడగు నృసింహ శరీరా ! జగదేక బంధూ ! శ్రీ నీలకంఠ ! కరుణార్ణవ ! సామరాజ ! సూర్యచంద్రాగ్ని నేత్ర పినాకపాణీ ! శ్రీ చంద్ర శేఖర ! రమాపతీ ! విష్ణో ! కాపాడుము. ఇట్లు ధ్యానము చేసి ఎనిమిది లక్షలు జపమును చేయవలయును. దశాంశము నేయి కలిసిన పాయసాన్నముచే హోమము గావించవలయును. మొదటివలె అర్చన చేయవలయును. మాయాతారము స్వబీజాంతమున కర్ణోగ్రవీర శబ్దమును పలుకవలయును. “మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం స్పుర స్పుర ప్రస్పుర ప్రస్పుర ఘోర ఘోరతర తనురూప ప్రచట ప్రచట కహా కహ బన్ల బన్ల ఘాతయ ఘాతయ” అని కవచాస్త్రములనుచ్చరించవలయును. భయంకరుడు భద్రస్వరూపుడు మృత్యు మృత్యువు యగు నృసింహుని నమస్కరించవలయును. భయంకరుడు భద్రస్వరూపుడు మృత్యుమృత్యువు యగు నృసింహుని నమస్కరించుచున్నాను. ఈ మంత్రము ఎనుబదియైదక్షరములు గలది. సేవించువారికి ఇష్టమును కలిగించును. అఘోర బ్రహ్మలు ఋషులు త్రిష్టుప్ అనుష్టుప్ ఛందస్సులు. హోరనృసింహుడు దేవత. ఆనుష్టుభవిధానముగా ధ్యానార్చనాదికమును ఆచరించవలయును. విశేషించి ఈ మంత్రరాజుము సర్వరక్షాకరముగా ప్రసిద్ధిపొందినది. “జయ జయ నరసింహ” అను అష్టాక్షరీ మంత్రము బీజము. ఈ మంత్రమునకు ప్రజాపతి ఋషి. అనుష్టుప్పన్లస్సు. విదారణ నరసింహస్వామిదేవత జం బీజము హం శత్రి అఖిలాప్తికి వినియోగము. దీర్జాడ్యమగు నృసింహ మంత్రముతో షడంగన్యాసమును గావించవలయును. శత్రువక్షో విదారణుడగు నృసింహస్వామీని రౌద్రరూపుని ధ్యానము చేయవలయును. నఖదంష్ట్రాయుధుడు, భక్తాభయ ప్రదుడు, శ్రీనికేతనుడు, తప్తహాటక కేశాంత జ్వలత్సావకలోచనుడు, వజ్రాధికనఖస్పర్శుడగు ఓ దీవ్య సింహా! నీకు నమస్కారము బ్రహ్మ ముని, అనుష్టుప్పన్లస్సు. ముప్పది రెండక్షరములు గల ఈ మంత్రమునకు దివ్యమారసింహుడు దేవత. నాలుగు పొదములతో పంచాంగన్యాసమును చేయవలయును. ధ్యానపూజాదికమునంతటిని పూర్వము వలే నాచరించవలయును. పూర్వోక్త కార్యములన్నియు సిద్దించును.
“ఓమ్ నమో భగవతే నరసింహాయ తేజ స్తేజే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర, కర్మ త్రాసయ త్రాసయ, ఆక్రందయ ఆక్రందయ, తమోగ్రసగ్రస స్వాహా ఆభయమాత్మని భూయిష్టా ధ్రువమ్” అనునది మంత్రము. ఈ మంత్రము అరువది రెండక్షరములు గలది. మున్యాదికము సర్వము పూర్వము వలెనే చెప్పుకోనవలయును. “ఓమ్ నమో భగవతే నరసింహాయ” అనునది ఈ మంత్రమునకు బీజము. రూపాయ అనునది తారము స్వః అనునది బీజము. ఈఓమ్ నమో భగవతే కూర్మరూపొయ, వరాహరూపాయ నరసింహారూపాయ, వామనరూపొయ, రామాయ కృష్ణాయ కల్కి నే జయ జయ శాలగ్రామ నివాసినే దివ్య సింహాయ స్వయంభువే పురుషాయ స్వాహా అను మంత్రము మహాసామ్రాజ్యప్రదము. ఈ నృసింహమంత్రము నూరక్షరములు కలది. అత్రి మహర్షి అతిజగతీ ఛన్దము దశావతారుడగు నృహరిదేవతా, ఖం బీజము అవ్యయ శక్తి షడ్దర్జాగ్యబీజముతో అంగన్యాసము చేసి భావన చేయవలయును. అనేక చంద్రప్రతిముడు, లక్ష్మీ ముఖమునందు చూపు నిలిపినవాడు దశావతారములు కలవాడు అయిన నరసింహస్వామి ఆనందమును విస్తరించుగావుత. పది వేలు జపము చేసి దశాంశము పాయసముతో హోమమును గావించవలయును. పూర్వోక్త పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పూజించవలయును. మొదటి అంగములను తరువాత దిగంతములందు మత్స్యాదులను పూజించవలయును. ఇంద్రాదులను, వజ్రాదులను పూజించి ఇష్టమును పొందవలయును. ఇక ఇపుడు తంత్రములందు రహస్యముగా దాచబడియున్న సహస్రాక్షరమహామంత్రమును చెప్పెదను వినుము. ఈ మంత్రము మాయాతారము. రమాకామ బీజము. “క్రోధమూర్తే ! నృసింహా ! మహాపురుష !? ప్రధానధర్మాధర్మనిగడ నిర్మోచన ! కాలపురుష ! కాలాన్తకసదృక్ స్వేశ్వరాదృక్ జలశ్రాంతనివిష్ట ! చైతన్య చిత్సదాభాపక ! కాలాద్యతీత ! నిత్యోదిత ! ఉదయాస్తమయాక్రాంతమహాకారుణిక ! హృదయాబ్ద చతుదిల నివిష్టిత ! చైతన్యాత్మన్ ! చతురాత్మన్ ! ద్వాదశాత్మన్ ! చతుర్వింశాత్మన్ ! పంచవింశాత్మన్ ! ఓరి ! హరిసహస్రమూర్తీ ! ఏ హ్యే హి ! భగవన్నసింహపురుష ! క్రోధేశ్వర రస ! సహస్రవందితపాద ! కల్పాన్హాగ్ని సహస్రకోట్యాభ ! మహాదేవనికాయ ! దశశత యజ్ఞతల ! అమల అమల పింగలేక్షణ .! సహస్ర దంష్ట్ర ! దంష్ట్రాయుధ ! నఖాయుధ ! దొన వేండ్రోంతక ! వహ్ని వర్ణ శోణిత ! సంసక్తి విగ్రహ ! భూతాపస్మార యాతుధాన సురాసుర వంద్యమాన పాదపంకజ ! భగవాన్ ! వ్యోమచక్రచర ! ప్రభవాష్యయ రూ పేజోత్తిష్ణోత్తిష్ణ ! అవిద్యానిచయం దహ దహ ! జ్ఞానేశ్వర్యం ప్రకాశయ ! ప్రకాశయ ! ఓం సర్వజ్ఞ ! అరోష జంభా జృంభ్యవతారక ! సత్యపురుష' ! సదసన్మధ్యనివిష్ట ! మమ దుస్స్వప్నభయం నిగడభయం కొంతారభయం విషజ్వర ఢాకినీ కృత్యాధరేవతీ భయం, ఆశనిభయం, దుర్భిక్షభయం, మారీభయ మారీచ భయం, ఛాయాస్కందాపస్మార భయం, చోరభయం, జలస్వప్నాన్ని భయం, గజసింహభుజంగ భయం, జన్మ జరామరణ భయం నిర్మోచయ నిర్మోదయ, ప్రశమయ ప్రశమయ, జ్ఞేయ రూప ధారణ నృసింహా బృహత్సామ పురుష సర్వభయనివారణ అష్టాష్టక చతుష్టష్టి చేటికాభయం, విద్యావృత స్త్రయం శద్దేవతా కోటి నమిత పదపంకజ సహస్రవదన సహసోదర సహ సేక్షణ సహస్రపద సహస్రభుజ సహస్రజిహ్వా సహస్రలలాట వహస్రాయుధధర నమ: ప్రకాశక పురమథన సర్వమన్త రాజేశ్వర విహాయసగతిప్రద పాతాలగతిప్రద యంత్రమర్ధన ఫరాట్టహాసహసిత విశ్వావాస వాసుదేవ అక్రూర హయముఖ పరమహంస విశ్వేశ విశ్వవిడంబన నిర్దిష్ట ప్రాదుర్భావకారక హృషీకేశ స్వచ్ఛన్ల నిశ్శేషజీవగ్రాసక మహాపిశితా స్పక్ లింపట ఖేచర సిద్ధి ప్రదాయక అజేయ అవ్యయ అవ్యక్త బ్రహ్మండోదర బ్రహ్మ సహస్రకోటి సగ్రుండ మూలపండితముండ మత్స్య కూర్మ వరాహ నృసింహవామన త్రైలోక్యక్రమణ దశాలిక రామత్రయ విష్ణురూపధర తత్త్వత్రయ ప్రణవాధార తచ్చిఖానివిష్ట స్వాహాస్వధావషట్” ఇది నృసింహాసహస్రాక్షరి తరువాత నేత్రవర్మాస్త్రముల నుచ్చరించవలయును. “ప్రాణాధార ఆదిదేవ ప్రాణాపాన నివిష్టిత పాంచ రాత్రిక దితిజవినిధనకర మహామాయా అమోఘ దర్యదైత్యేంద్ర దర్పదళన తేజోరాశికి తేజస్వర పురురూపాయ సత్య పూరుష” అని పలుకవలయును. అస్త్రతారము అచ్యుతాస్త్రము తారము వాక్కుచే 'సుదేవ ఫట్' అనునది.
తారామాయామూర్తికి ‘ఫట్ వః కామః” అనునది స్వర్గాదిమము. మూర్తి అస్త్రము బీజము అవ్యయ . అనునది విశ్వమూర్తే అస్త్రమవ్యయము. “మాయీ విశ్వాత్మనే” అని షట్ తారము శౌచము తురాత్మను. “ఫట్ తారోఽహం. వీశ్వరూపిన్ అనునది అస్త్రము తరువాత హై అనునది తారము పరమాంతమున ప్రాంస ఫట్ ప్రణవము పలికిన తరువాత “హ్రః హిరణ్య గర్పరూపధారణ అనుదాని తరువాత ఫట్ అనునది ధ్రువము. “హౌం అనౌపమ్యరూపధారిణే” అనునది అస్త్రము తరువాత ధ్రువము “క్షౌం నృసింహరూపధారిన్ ఓం క్లం శ్రః” అనునది తరువాత ధ్రువము “క్షౌం నృసింహ రూపధారిన్ ఓం క్లం శ్రః” అనునది సంకరము ఖండద్వయము ఖాదయద్వయము క్లీం సాధ్యము. ఆనయ ఆనయ మహాత్మన్ సమ్యగ్లర్శయ దర్శయ” అని షడ్జీర్జాడ్యమగు స్వబీజము క్షపితాంతము కల్మష ఉత్తరాయ ద్వయము పంచ బాణబీజములను ఉచ్చరించవలయును. నృసింహజ్వాలాత్మనే స్వాహా " అని పలుకవలయును. నృసింహకాలాత్మనే స్వాహా” అని ధ్రువము. ఆకాశబీజము, కొమబీజము, లక్ష్మీబీజద్వయము మాయాజారాంతిమమగు ఈ మంత్రము సహస్రాక్షర సమ్మీ తము. ఈ మంత్రమునకు ముని కపిల మహర్షి జగతీ ఛందస్సు. శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవత క్రైం బీజము. శక్తి స్వాహా శ్వేత వర్ణము ఉదాత్త స్వరము పరమాత్మ క్షేత్రము అఖిలాప్తి కొఱకు వినియోగము. “క్షః సహస్రబాహవే సహస్రాయుధ ధరాయ నృసింహాయ స్వాహా అస్త్రాయ ఫట్” అనునది మంత్రము. ఈ మంత్రముచే కరశుద్ధిని చేసుకొని అంగన్యాసము చేయవలయును. క్షాం అనునది తారము. సహస్రాంతమున క్షర శబ్దము వలన విజృంభితము. “నృసింహాయ స్వాహా” అనునది హృదయ మంత్రము. మారః క్షీరం మహాతనుప్రభావికరన్న సింహాయ స్వాహా అనునది శిరో మంత్రము.. కూం, అనునది తారము. తప్త సింహాయ అనునది నేత్రములనుండి కేశాంతము వరకు ఉచ్చరించవలయును. జ్వలత్యావకలో కూర్మో దీర్ఘ వజ్రాదినఖస్పర్శదివ్య సింహా భగవన్ మహాధ్వస్త జగద్రూప నృసింహాయ స్వాహా అనునది శిఖామంత్రము. తరువాత కవచము. క్షేం అనునది తారము.
“సహస్రబాహవే సహస్రాయుధాయ నృసింహాయ స్వాహా” అనునది అస్త్రమంత్రము. తరువాత నృసింహస్వామిని ధ్యానించవలయును. ఉదయించు సహస్రసూర్యులకాంతి గలవాడు. త్రినేత్రుడు, భీమభూషణుడు, సుతీక్షాస్రభుజుడు దైత్యదొరణకుడగు నృసింహస్వామిని స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి ఒక సహస్రము నేయి కలిపిన పాయసముచే హోమము చేసినచో మంత్రము సిద్ధించును. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి నృసింహస్వామిని చక్కగా పూజించి తరువాత అంగపూజను గావించవలయును. చక్రమును, శంఖమును, పొశమును అంకుశమును, కులిశమును, గదా కృపొణక్ష్వీడములను దలములందు పూజించవలయును. లోకపాలకులను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్ర సిద్ది లభించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును. భస్మమును మంత్రించి గ్రహగ్రస్తునికి లేపనము గావించవలయును. భస్మ లేపనము వలననే సర్వగ్రహవినాశము జరుగును. ఈ విధానము చేతనే యక్షరాక్షస కిన్నరులు భూత ప్రేత పిశాచములు నశించును. సంశయముతో పనిలేదు. ఈ మంత్రముచే మంత్రించిన భస్మమును లేపనము చేసినచో పరాభిచారకృత్యములు కూడా నశించును. శుభదినమున సర్వతోభద్రమండలమున కుంభమును స్థాపించి తీర్థజలముచే నింపి అష్టోత్తర శతమును జపించవలయును. ఆ జలముచే అభి షేకము చేయబడిన మానవుడు అన్ని ఆపదలనుండి విముక్తుడగును. ఇంకా ఏమి చెప్పవలయును ఈ మంత్రరాజము సకలాభీష్టప్రదము “వజ్రనఖాయ విద్మహే తీర్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్” అనునది నృసింహగాయత్రి. ఈ గాయత్రి సర్వాభీష్టప్రదాయిని ఈ నృసింహగాయత్రిని స్మరించినంత మాత్రముననే సర్వపాపక్షయము జరుగును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమునగ బృహదుపాఖ్యానమున తృతీయపాదమున నృసింహోపాసనా మంత్ర గాయత్ర్యాది నిరూపణమను డెబ్బది యొకట - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 72 of the Nārada Mahā Purana is as follows:
జ్ఞాన ప్రదాతయైన శ్రీ హయగ్రీవ భగవానుని పవిత్ర మంత్రోపాసన ఈ అధ్యాయంలో వర్ణించబడినది. హయగ్రీవ మంత్ర జపము వలన బుద్ధి వికాసము, సర్వ విద్యా ప్రాప్తి మరియు నిశ్చల విష్ణుభక్తి సిద్ధించునని నిరూపించబడినది.