37 - అధ్యాయము

మోహిన్యువాచ :

ఏకాదశీ సమం దేవాః పావనం నాపరం భవేత్

యయా పూతా మహాపాపా గచ్ఛంతి హరిమందిరమ్

తత్సమీపే మమ స్థానం యుక్తం భాతి విచార్యతాం 

దేవా ఊచుః :

వేధో నిశీధే దేవానాం ఉపకారాయ మోహినీ

సూర్యోదయే సురాణాం చ హరిణా పరికల్పితః

పారణంచ త్రయోదశ్యాం ఉపవాస వినాశనమ్ 

మహాద్వాదశికా హ్యష్టౌ యా: స్మృతా వైష్ణవాగమే

తాస్తు హ్యేకాదశీ భిన్నా ఉపోష్యంతే చ వైష్ణవై:

ఏకాదశి వ్రతం భిన్నం వైష్ణవానాం మహాత్మనాం

నిత్యం పక్షద్వయే ప్రోక్తం విధినా త్రిదినాత్మకే

సాయం ప్రాతః త్యజేద్భుక్తిం క్రమాత్పూర్వాపరాహ్ణ యోః

ఏకాదశీ యదా భిన్నా ఉపోష్యా హి పరేఽహని

ద్వాదశ్యాం హి వ్రతం కార్యం నిరంబు సముపోషణమ్

లంఘనే త్వసమర్ధానాం జలం శాకం ఫలం పయః

నైవేద్యం వా హరేః ప్రోక్తం స్వాహారాత్ పాదసంమితమ్

స్మార్తా: సూర్యోదయే విద్ధాం త్యజంత్యేకాదశీం సతి

నిష్కామా మధ్యరాత్రే చ విద్దాం ముంచంతి యామ్యయా

సర్వేష్వపి లోకేషు విదితా దశమి తిధిః

యమస్య తస్యాః ప్రాంతే తు స్థితి: కార్యా త్వయానఘా

ఏతేన దేవకార్యం చ సిద్ధం భవతి శోభనే

సూర్యేందుచారా తిధ్యాస్తు దశమ్యాః ప్రాంతగామినీ

భువి తీర్థాని చైవ త్వం స్వాఘనాశాయ సంచర

అరుణోదయ మారభ్య యావత్సూర్యోదయో భవేత్

తదంతస్త్యం ప్రతే ప్రాప్తి లభస్యైకాదశీ ఫలమ్

యః కశ్చిత్కురుతే విద్ధం త్యయాహ్యేకాదశీత్రమ్

సతూపకారక స్తుభ్యం భవిష్యతి సురప్రియే

ముహుర్తద్వయమాత్రం తు జ్ఞేయం చాత్రారుణోదయమ్

ముహుర్తా: పంచదశ చ స్మృతా రాత్రే ర్దివస్య చ

జ్ఞేయాస్తే హ్రస్వదీర్ఘత్వే త్రైరాశికవిధానత:

త్రయోదశాన్ముహుర్తాత్తు రాత్రే రూర్ధ్వం సమాగతా

లబ్ధ్వోపవాసినాం పుణ్యం స్వస్థా భవ శుచిస్మితే 

యమ సంస్థాపనార్థాయ వైకుంఠ ధ్వంసనాయచ

పాఖండానాం వివృద్ధ్యర్ధం పాప సంచయనాయ చ

దత్తం తే మోహిని స్థానం ప్రత్యూషసమయాంకితం

 విద్దం త్వయైకాదశీ వ్రతం యే కుర్వన్తి కర్తార ఇహ ప్రయత్నాత్

తేషాం భవేద్యత్సుకృతం శుభే ఫలం భుంక్ష్య ప్రసన్నాభవ భూసురే త్వమ్

ఏవం ప్రదిష్టా కమలాసనాద్యై: సా మోహినీ హృష్టతరా బభూవ

మేనే కృతార్ధం నిజజీవితంచ స్వపాపతీర్ధాభినిషేవణేన

సంసాధితం కార్యమిదం సురాణాం భస్మావశేషం హి గతేఽపి దేహే

చైతన్యమాత్రే పవనాత్మకేఽ స్మిన్ సంమార్జితో భూపకృతస్తు పంథా:

నీతం మయా చాత్మకృతం హి వాక్యం ప్రహృష్టయా వై యదుదాహృతం హి

ఏవం విమృశ్య క్షితిపాలదేవాన్ ప్రణమ్య హృష్టా చ పురోధసం స్వమ్

ప్రాంతే స్థితా సూర్యవిహీన సంజ్ఞే కాలే దశమ్యా జనమోహనాయ

కృచ్చ్రాంతరూపా చ దినం చ భుంక్తే ప్రకృష్ణరూపా నరకాయసృణామ్  

ప్రాంత స్థితాం తాం రవిజో నిరీక్ష్య ప్రహృష్టవక్త్రో వచనం జగాద

త్వయా ప్రతిష్ఠా మమ చారునేత్రే కృతా భసంస్థ:పటహ! సుఘోష

దృష్టే కార్యే జనః సర్వ: ప్రత్యయం కురుతే త్వితి

సూర్యోదయ స్పృశా హ్యేషా దశమీగర్హితా సదా!

అస్పృష్టముదయంనృణా మోహనాయ భవిష్యతి

విహాయ తాం యత్రియయోగభుక్తిం పాదస్థితా సాపి హ్యదృశ్యరూపా

సత్యం హి తే నామ విశాలనేత్రే యన్మోహి నిత్యేవ జనో బ్రనీతి

విమోమయిత్వా హి జనం సమస్తం పటే మదీయే లిఖితం కరోషి

ఇత్యేవముక్త్యా తనయో వివస్వతః ప్రణమ్య తాం బ్రహ్మసుతాం ప్రసహృష్ట:

జగామ దేవైః సహ నాకలోకం కరే గృహీత్వా లిపి లేఖితారమ్

గతేషు దేవేషు విమోహినీ సా బ్రహ్మాణమాసాద్య సురాసురేశమ్

విజ్ఞాపయామాస పిత: పురోధా మమాయమత్యుగ్రతరశ్చ కోపాత్

దగ్ధం శరీరం మమ లోకనాధ పునః ప్రపత్స్యేధ తథా కురుష్వ

విమోహితం చైవ జగన్మయేదం ప్రాంతే సమాస్థాయ యమస్య తిధ్యాః

జాతో హి రాజ్ఞా శమనః పురాద్య కృతో జయీ తాత తవ ప్రభావాత్

తవ కృత్యమిదం తాత యత్పునర్దేహధారిణీ

భూయామహం జగన్నాథ బ్రాహ్మణం సాంత్వయస్వ భో: .

తచ్చ్చత్వా మోహినీవాక్యం బ్రహ్మా లోకవిధానకృత్

బ్రాహ్మణం సాంత్వయామాస పునరేవ సుతాకృతే

వసో తాత నిబోధేదం యద్భ్రవీమి హితావహం

తవ చాస్యా మహాభాగ సర్వలోక హితాయచ

త్వయేయం మోహినీ కోపా త్కృతా భస్మావశేషితా

పునః శరీరం యాచేత తదాజ్ఞాం దేహి మానద . 

మతుత్రీ తవ యాజ్యేయం దుర్గతిం తాత గచ్ఛతి

త్వయా మయా చ సా పాల్యా కృతకార్యా తపస్వినీ

యది త్వం శుభావేన మాం జ్ఞాపయసి మానద

తతోహ మస్యా భూయోపి దేహముత్పాదయామ్యహమ్

కింతు విష్ణుదిన స్యైషా వైరిణీ పాపకారిణీ

యధా శుద్ద్యేత విప్రేంద్ర తధైవాశు విధీయతామ్

తచ్చృత్వా వచనం తస్య బ్రహ్మణః స పురోహితః

యాజ్యాయా దేహయోగార్ధ మాదిదేశ ముదాన్వితః

విప్రవాక్యం సమాకర్ణ్య బ్రహ్మా లోకపితామహః

కమండలు జలేనౌక్ష న్మోహి నీదేహ భస్మ తత్

సముక్షితే బ్రహ్మణా లోకకర్రా సా మోహినీ దేహయుతా బభూవ

ప్రణమ్య తాతం చ వసో: పురోధసో జగ్రాహ పాదౌ వినయేన నత్వా

తతో వసుర్యాజక ఏవ రాజ్ఞో ముదాన్వితో యాజ్య నితంబినీం తాం

విమోహినీం స్వామిసుతోజ్ఘి తాం చ జగాద వాక్యం విదుతామ వీరామ్

వసురువాచ : 

క్రోధస్త్యక్తో మయా దేవి బ్రహ్మణా వచనాదధ

గతిం తే కారయిష్యామి తీర్థస్నానాది కర్మణా

ఇత్యు క్త్వా మోహినీం విప్రో బ్రహ్మాణం జగతాం పతిం

విససర్జ నమస్కృత్య మోహినీ పితరం ముదా 

మోహిన్యా వసునా చైవ ప్రీత్యా బ్రహ్మా విసర్జితః

 జగామ లోకం తమసః పరమవ్యక్తవర్త్మనా

స వసుర్భ్రాహ్మణశ్రేష్ఠ రుక్మాంగద పురోహితః

మోహినీం సమనుగ్రాహ్యం మత్వా హృది విచారయన్

ముహుర్తం ధ్యానమాసన్నో బుబుధే కారణం గతే: 

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తరభాగే 

మోహినీచ రితే సప్తత్రింశోఽధ్యాయః.

మోహిని పలికెను:- ఓ దేవతలారా ఏకాదశితో సమానమగు పావనము మరొకటి లేదు. ఏకాదశిచే మహాపాపులు కూడా పవిత్రులై శ్రీ హరిలోకమును చేరెదరు. కావున ఏకాదశీ సమీపమున నాకు స్థానముచితమని తోచుచున్నది. ఆలోచించుడు. 

దేవతలు పలికిరి:- ఏకాదశినిశీథకాలమున విద్ద అయినచో దేవతలకు, సూర్యోదయకాలవేధ సురలకు అని శ్రీహరియే కల్పించెను. త్రయోదశి పారణ ఉపవాసమును నశింప చేయును. వైష్ణవాగమమున ఎనిమిది మహాద్వాదశులని చెప్పబడినవి. ఎనిమిది ద్వాదశులు ఏకాదశీ భిన్నములుగా వైష్ణవులచే ఉపవసించబడును. మహాత్ములగు విష్ణుభక్తులకు రెండు పక్షములలో యథావిధిగా ఏకాదశీ వ్రతము భిన్నముగా త్రిదానాత్మకముగ నుండును. ప్రాతః కాలము సాయంకాలము భోజనము చేయరాదు. యధాక్రమముగా పూర్వాహ్లాపరాహములలో విసర్జించవలయును. ఏకాదశి విద్ద అయినచో మరునాడుప వసించవలయును. ద్వాదశినాడు నిర్జలముగా ఉపవసించవలయును. ఉపవసించ శక్తిలేనివారు జలమును, శాకమును, ఫలమును, పాలను, శ్రీహరి నైవేద్యమును కాని తన ఆహారములో నాలుగవ భాగమును భుజించవచ్చును. సూర్యోదయకాలమున విద్ద అయినచో స్మార్తులు ఏకాదశిని విడిచెదరు. నిష్కాములు మధ్య రాత్రి విద్దను విడిచెదరు. అన్నిలోకములలో దశమి యమధర్మరాజతిధియని తెలిసి యున్నది. దశమీ ప్రాంతమున నీవు ఉండవలయును. దీనితో దేవకార్యముకూడా సిద్ధించును. సూర్య చంద్రులతో తిరుగుచు దశమీ ప్రాంతమున నివసించుము. నీపాపనాశమునకై సర్వతీర్ధములలో సంచరించుము. అరుణోదయమునుండి సూర్యోదయమగువరకు సంచరించుము. ఆమధ్యలో వ్రతమున చేరి ఏకాదశీఫలమును పొందుము. దశమీ విధ్ధ యగు ఏకాదశిన వ్రతము నాచరించువాడు నీకు ఉపకారకుడగును. ఈనాడు అరుణోదయకాలము ముహుర్తద్వయపరిమితమని తెలియుము. 

రాత్రికి పగలుకు పదిహేను ముహుర్తములుండును. తైరాశిక విధానము ననుసరించి రాత్రింబవళ్ళు హ్రస్వములు దీర్ఘములు అగును. పదమూడవ ముహుర్తము తరువాత రాత్రిపూట వచ్చును అపుడుపవసించువారి పుణ్యమును నీవు పొందెదవు. స్వస్థురాలవు కమ్ము, యముని స్థాపించుటకు వైకుంఠధ్వంసమునకు పాషండవృద్ధి కొఱకు, పాపమును పెంచుటకు నీకు ప్రత్యూషసమయ సమీప ప్రాంతమునిచ్చుచున్నాము. ఈ లోకమున దశమీవిద్దయగు ఏకాదశినాడు వ్రతము నాచరించువారి పుణ్యము నీకు లభించును. ఆ ఫలమును నీవు అనుభవించుము. , ప్రసన్నురాలవు కమ్ము. బ్రహ్మాదులు ఇట్లు చెప్పగా మోహినీ మిక్కిలి సంతోషించెను. తన పాపపరిహారమునకు తీర్థ సేవనము చేయుటచే తన జీవితము కృతార్థమగునని తలచెను. దేహము భస్మావశేషమైననూ దేవకార్యమును సాధించితిని. చైతన్యమాత్రముండి వాయురూపముగా నుండి కూడా రాజు చేసిన మార్గమును తుడిచివేసితిని. నేను సంతోషముతో పలికిన మాటనాచరించితిని. ఇట్లు విచారించి బ్రాహ్మణులను పురోహితుని నమస్కరించి సూర్యవిహీనమగు దశమిప్రాంతకాలమున జనమోహనము కొరకు నివసించెను. కృచ్చాంతరూపముగా దినమున భుజించువారికి ప్రకృష్టరూపముగా, నరకమును 

ప్రసాదించును. దశమీప్రాంతమున నున్న మోహినిని చూచిన యమధర్మరాజు సంతోషముచే విప్పారిన మోము కలవాడై ఇట్లు పలికెను. ఓ చారునేత్రి! నీవు' మరల ఈ లోకమున నా ప్రతిష్టను నిలిపితివి. రుక్మాంగదుని మత్తేభము పై నున్న పటహమును ఛేదించగలిగితివి. కార్యము దృష్టముగాన జనులందరూ విశ్వసింతురు. కావున సూర్యోదయకాలమును స్పృశించు దశమీ ఎపుడూ నిందితమే. స్పర్శలేని ఉదయము నరులను మోహింప చేయును. పావు భాగము ఉన్ననూ అదృశ్యరూపముగా నున్న ప్రియయోగభుక్తిని విడిచి ఉంటివి. కావున నిజముగా నిన్ను మోహిని అని జనులు పిలుచుచున్నారంటే నీ పేరు సార్థకమే. సమస్త జనమును మోహింప చేసినా పటమున వ్రాయించుచున్నావు. ఇట్లు యమధర్మరాజు పలికి ఆ బ్రహ్మపుత్రికను నమస్కరించి సంతోషించెను. దేవతలతో కలిసి చిత్రగుప్తుని చేత పట్టుకొని తన లోకమునకు వెళ్ళెను. ఇట్లు దేవతలందరూ వెళ్ళిన తరువాత మోహిని సురాసురనాయకుడగు బ్రహ్మను సమీపించి ఇట్లు విజ్ఞాపన చేసెను. ఓ తండ్రీ! ఈ పురోహితుడు చాలా భయంకరుడు. ఇతని కోపముచే నా శరీరము దగ్గమాయెను. మరల శరీరమును దాల్చునట్లు చేయుము. దశమీప్రాంతమున నిలిచి నేను జగత్తును మోహింపచేసితిని. పూర్వము రాజు యముని గెలిచెను. నేడు నీ ప్రభావముతో యముడు విజయి ఆయెను. నేను మరల దేహమును ధరించునట్లు నీవు చేయవలయును. పురోహితుని శాంతింపచేయుము. లోకకర్తయగు బ్రహ్మ మోహినీ వాక్యమును విని పుత్రిక కొరకు మరల పురోహితుని ఓదార్చసాగెను. ఓ బ్రాహ్మణా! నేను 

నీకు ఈ మోహినికి సర్వలోకమునకు హితము కలుగుటకు చెప్పుమాటను వినుము. నీ 

కోపముచే ఈ మోహిని భస్మమైనది. మరల శరీరమును యాచించుచున్నది. కావున అనుమతినిమ్ము. నాపుత్రిక నీకు కూడా గౌరవించదగినదే. ఇపుడు దుర్గతిని చెందుచున్నది. నేను నీవు ఆమెను కాపాడవలయును. ఆమె దీక్షతో దేవకార్యమునాచరించినది. నీవు పరిశుద్ధభావముచే అనుమతించినచో నేను ఈమెకు మరల దేహమును కల్పించెదను. కాని హరివాసరమును ద్వేషించి పాపమునాచరించినది కావున ఈమె పరిశుద్దికి ఉపాయమును ఆలోచించుము. బ్రహ్మ మాటలను వినిన పురోహితుడు పరిశుద్దాంతకరణముతో 

మోహినికి దేహకల్పనకనుమతించెను. బ్రాహ్మణవాక్యమును వినిన లోకపితామహుడగు బ్రహ్మ కమండలు జలమును మోహినీ దేహభస్మము పై చల్లెను. ఇట్లు కమండలు జలమును చల్లిన వెంటనే మోహిని దేహమును దాల్చెను. తండ్రియగు బ్రహ్మను నమస్కరించి పురోహితుని పాదములను పట్టుకొనెను. అంతట రుక్మాంగద పురోహితుడగు వసువు మోహినితో ఇట్లు పలికెను. 

వసువు పలికెను:- ఓ మోహినీ! బ్రహ్మవాక్యము వలన నేను కోపమును విడిచితిని. తీర్థస్నానాదికర్మలచే నీకు గతిని కల్పించెదను. ఇట్లు పలికి బ్రహ్మను పంపివేసెను. ఇట్లు. మోహినిని పురోహితుని సంతోషింపచేసి బ్రహ్మ తమస్సునకు దూరముగా నున్న తనలోకమునకు ఆవ్యక్తమార్గముచే వెళ్ళెను. రుక్మాంగద పురోహితుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడగు వసువు మోహినిని అనుగ్రహించవలయునని తలచి హృదయమున ఆలోచించుచు ముహూర్తకాలము ధ్యానించి గథి కారణమును తెలుసుకొనెను.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున ముప్పది యేడవ అధ్యాయము.