36 - మోహినీ మోహముత్యృజ్య గతా విబుధమందిరమ్ 

భర్త్సితా దేవదూతేన స్థితిస్తేత్ర న పాపినీ

పాపశీలే సు దుర్మేథే భర్తృనిందా పరాయణే

హరివాసరలోపిన్యాం వాసస్తే న త్రివిష్టపే

ధర్మతో విముఖానాం చ నరకే వాస ఇష్యతే

ఏవముక్త్యా తు తాం వాయు: క్రూరం వచన మద్భుతమ్

తాడయిత్వా చ దండేన ప్రేరయామాస యాతనామ్

ఏ వం సంతాడితా రాజన్ దేవదూతేన మోహినీ 

బ్రహ్మదండపరాభూతా సంప్రాప్తా నరకం నృప

తత్ర ధర్మాజ్ఞయా సా తు దూతైస్సంతాడితా చిరమ్

సర్వేషు క్రమశో గత్వా నరకేషు నిపాతితా

పాపే ధర్మాంగదఃపుత్రో ఘాతిత: పతిపాణినా

త్వయా యతస్తతో భుంక్ష్య కృతకర్మఫలంత్విహ

 ప్రజాహితం స్థిరప్రజ్ఞం మహేన్ద్రవరుణోపమమ్

సప్తద్వీపాధిపం పుత్రం హత్వేదృక్ఫలభోగినీ

ప్రాకృతస్యాపి పుత్రస్య హింసాయాం బ్రహ్మహా భవేత్

కిం పునర్ధర్మయుక్తస్య పాపే ధర్మాంగదస్య చ

ఏవం నిర్బ ర్త్సితా దూతై ర్యమస్య నృపసత్తమ

బుభుజే యాతనాస్సర్వాః క్రమశశ్శమనోదితాః

బ్రహ్మదండహతాయాస్తు దేహస్పర్శేన యాతనా:

జ్వలితాంగా బభూవుస్తా: ధారణాయ న తు క్షమాః

తతస్తే నరకా రాజన్ ధర్మ రాజముపాగతా: 

ప్రోచు: ప్రాంజలయో భీతా: తదంగస్పర్శపీడితాః

దేవదేవ జగన్నాధ ధర్మరాజ దయాం కురు

ఇమాం ని: స్సారయాశు త్వం యాతనాభ్యః సుఖాయ నః

యస్యా: స్పర్శనతో నాధ భస్మభూతాః క్షణాదహో

భవిష్యామ స్తతస్త్యేనాం నరకేభ్యో వివాసయ

తచ్ఛ్భత్వా వచనం తేషాం ధర్మరాజోతి విస్మిత:

దూతాన్ స్వాన్ ప్రత్యువాచేడం నిస్సార్యా మమ మందిరాత్

యో బ్రహ్మదండ నిర్దగ్ధః పుమాన్ స్త్రీ వా చ తస్కరః

తస్య పాపస్య సంస్పర్శం నేచ్చంతి యాతనా మమ

తస్మాదిమాం మహాపాపాం భర్తుర్వచనలో పినీమ్ 

పుత్రఘ్నీం ధర్మహంత్రీం చ బ్రహ్మదండహతామపి

నిఃసారయత మే వాపి దేహో జ్వలతి దర్శనాత్

ఇత్యుక్తాస్తే తదా దూతా ధర్మరాజేన భూపతే!

ప్రహరంతో స్త్రశ స్త్రైశ్చ బహిశ్చక్రుర్యమ క్షయాత్

తతః సా దుఃఖితా రాజన్ మోహినీ మోహసంయుతా

పాతాళం ప్రయయౌ తత్ర పాతాళ స్థైర్నివారితా

తతస్తు బ్రీడితా త్యర్ధం మోహినీ బ్రహ్మణః సుతా

 జనకస్యాంతికం గత్వా దుఃఖం స్వం సంన్యవేదయత్

తాత తన్నాస్తి మే స్థానం త్రైలోక్యే సచరాచరే

యత్ర యత్ర తు గచ్ఛామి తత్ర తత్ర క్షిపంతి మామ్

అహం నిర్వాసితా లోకై రాతయిత్వాయుధైర్దృఢమ్

భవదాజ్ఞాం సమాదాయ గతా రుక్మవిభూషణమ్

మయా వ్యవసితం చేదం సర్వలోకవిగర్జితమ్

క్లేశయిత్వా తు భర్తారం పుత్రం హత్వా వరాసినా

సంధ్యావళీం క్షోభయిత్వా పితః ప్రాప్తి దశమిమామ్

న గతి ర్విద్యతే దేవ పాపాయా మమ సాంప్రతమ్

విశేషాద్ద్విజశాపేన జాతాహం దుఃఖభాగినీ

విప్రవాక్యహతానాం చ దగ్దానాం చిత్ర భానునా

దివాకీర్తి హతానాం చ భక్షితానాం మృగాదిభిః

శత హ్రదావిపన్నానాం ముక్తిదా స్వర్ణదీ పితః 

యది త్వం త్రిదశైః సార్థం విప్రం తం శాపదాయినమ్

ప్రసాదయసి మత్ప్రీత్యా తర్హి మే విహితా గతి:

తాం తధవాదినీం రాజన్ బ్రహ్మా లోకపితామహః

శివేంద్ర ధర్మ సూర్యాగ్ని దేవేశైర్ముని భిర్యుతః 

మోహినీమగ్రతః కృత్వా జగామ ద్విజసన్నిధౌ

తత్ర గత్వా మహీపాల  బ్రహ్మా దేవాదిభిర్వృతః

మహతా గౌరవాణాపి నమశ్చక్రే స్వయం విధిః

 భూప రుద్రాదిదేవైస్తు పూజ్యో మాన్యః పితామహః 

మోహినీ ప్రీతయే ముగ్ధః స్వయం చక్రే నమస్క్రియాం

కార్యే మహతి సంప్రాప్తే హ్యసాధ్యే భువనత్రయే

న దూషితం భవే ద్భూప యవిష్ఠస్యాభివాదనం

స ద్విజో వేద వేదాంగ పారగస్తపసి స్థితః

సంప్రేక్ష్య లోకకర్తారం దేవైః సహ సమాగతమ్

సముత్థాయ నమశ్చక్రే బ్రహ్మాణం తన్మునీన్ సురాన్

వాసయామాస భక్త్యాచ స్తుతిం చక్రేజ్జజన్మనః

తతః ప్రసన్నో భగవాన్ లోకకర్తా జగద్గురు:

తే ద్విజం ప్రార్ధయామాసు: మోహిన్యర్దే నృపార్చితమ్ 

వసిష్ఠమహర్షి పలికెను. మోహిని మోహమును విడిచి స్వర్గమునకు వెళ్ళెను. అచట దేవదూత ఓపాపాత్మురాలా నీ విచటికి రా దగదు. పాపశీలురాలా. దుర్బుద్దీ! భర్బనిందా పరాయణురాలా. హరివాసరమును లోపింప చేయు నీకు స్వర్గమున స్థానము లేదు. ధర్మవిముఖులకు నరకములో నివాసముండును. ఇట్లు వాయువు మోహినితో పలికి దండముచే దండించి నరకమునకు పంపివేసెను. ఇట్లు దేవదూతచే దండించబడిన మోహిని బ్రహ్మదండపరాభూతురాలై నరకమును చేరెను. అచట యమధర్మరాజు ఆజ్ఞచే దేతలు మోహినిని చాలాకాలము దండించిరి. అన్ని నరకములలోనికి వెళ్ళి పడిపోయెను. ఓ పాపాత్మురాలా పుత్రుడగుధర్మాంగదుని భర్త చేతితో చంపించితివి. కావున నీవు స్వయముగా నాచరించిన కర్మఫలమును అనుభవించుము. ప్రజాహితము నాచరించువానిని, స్థిరప్రజ్ఞుని, మహేందవరుణోపముని, సప్తద్వీపాధిపతియగు పుత్రుని వధించి ఈఫలమును అనుభవించు చున్నావు. సామాన్య పుత్రుని చంపిననే బ్రహ్మహత్యాపాతకము సంప్రాప్తించును. ఇక ధర్మయుక్తుడగు ధర్మాంగదుని చంపిన ఏమి చెప్పవలయును? ఇట్లు దూతలచే నిందించబడుచు యముడు విధించిన యాతనలనన్నింటిని క్రమముగా అనుభవించెను. బ్రాహ్మణ శాపముపాలైన మోహినీ దేహమును స్పృశించుటచే ఆయాతనలన్ని తమ శరీరములు కొలుచుండగా సహించజాలక నరకములన్నియూ యమధర్మరాజును చేరినవి. మోహినీ శరీరస్పర్శచే పీడితలై చేతులు జోడించి ఇట్లు పలికినవి. దేవ దేవా. జగన్నాధా! ధర్మరాజా దయను చూపుము. ఈమోహినిని త్వరగా యాతనలనుండి దూరముగా పంపుము. ఈమెను స్పృశించినంతనే క్షణములో మేము భస్మమైతిమి. కావున ఈమెను నరకములనుండి పారద్రోలుము. అట్లు పలికిన నరకముల మాటలను విని యమధర్మరాజు ఆశ్చర్యమును చెందెను. తన దూతలతో ఈమెను బయటికి పంపుము. బ్రహ్మదండనిర్దగ్గుడగు స్త్రీకాని పురుషుడుకాని, చోరుడుకాని, అతని స్పర్శను నా యాతనలు సహించజాలవు. కావున మహాపాపురాలు భర్తృవచనలో పిని, పుత్రఘ్ని, ధర్మహంతకురాలు, బ్రహ్మదండహతురాలగుమోహినిని దూరముగా తరలించుడు. ఈమెను చూచుటచే నా శరీరము మండుచున్నది. ఇట్లు ధర్మరాజు పలుకగా అతని దూతలు శస్త్రాస్త్రములచే మోహినిని కొట్టుచు యమలోకమునుండి బహిష్కరించిరి. అంతట మోహయుతురాలగు మోహిని దుఃఖితురాలై పాతాలలోకమునకు వెళ్ళెను. అచట పాతాల వాసులు వారించిరి. అంతట బ్రహ్మపుత్రి మిక్కిలి సిగ్గుపడి తండ్రి వద్దకు వెళ్ళి తనదుఃఖమను తెలిపెను. ఓ తండ్రీ ! చరాచరాత్మకమగు ఈ మూడులోకములలో నాకు స్థానము లేదు. నేనెచటికి వెళ్ళిననూ బహిష్కరించుచున్నారు. నన్ను ఆయుధములచే బాగా కొట్టి బహిష్కరించుచున్నారు. నీ ఆజ్ఞను స్వీకరించి నేను రుక్మాంగదుని సమిపించితిని. అన్నిలోకములు నిందించు పనిని చేసితిని. భర్తను బాధించి శ్రేష్ఠమగు ఖడ్గముతో పుత్రుని చంపించి సంధ్యావళీ దేవిని క్షోభింప చేసి ఈదశను పొందితిని. పాపురాలనగు నాకు ఇపుడు ఏగతిలేదు. విశేషించి బ్రాహ్మణ శాపము చే దుఃఖభాగినినైతిని. బ్రాహ్మణ వాక్యహతులకు, అగ్నిదగ్గులకు, దివాకీర్తిహతులకు, మృగాదులచే భక్షించబడిన వారికి, మెరుపుచే పీడించబడువారికి దేవనది ముక్తినిచ్చును కావున నీవు నాకు శాపమునిచ్చిన బ్రాహ్మణుని దేవతలచే కలిసి ప్రసన్నుని చేసినచో నాకు గతి లభించును. ఇట్లు మోహిని పలుకగా వినిన లోకపితామహుడగు బ్రహ్మ శివ ఇంద్ర యమ సూర్యాగ్ని దేవేశులతో కలిసి, మోహినిని ముందిడుకొని బ్రాహ్మణుని వద్దకు వెళ్ళెను. దేవాది సహితుడగు బ్రహ్మ అచటికి వెళ్ళి తానుస్వయముగా గొప్ప గౌరముతో బ్రాహ్మణునికి నమస్కరించెను. రుద్రాది దేవతలచే పూజించబడు పితామహుడు మోహినికి సంతోషమును కలిగించవలయునని ముగ్గుడై స్వయముగా తానే నమస్కరించెను. మూడులోకములలోను సాధింపశక్యము కాని గొప్ప కార్యము సంప్రాప్తించినపుడు చిన్నవానికి నమస్కరించుట దోషముకాదు. వేదవేదాంగ పారగుడు తపస్సులో నున్న ఆ బ్రాహ్మణుడు దేవతలతో కలిసి వచ్చిన లోకకర్తను చూచి లేచి బ్రహ్మకు, మునులకు, దేవతలకు నమస్కరించెను. ఆసనమును సమర్పించి కూర్చుండజేసి భక్తిచే బ్రహ్మను స్తుతించెను. అపుడు ప్రసన్నుడగులోకకర్త అయిన బ్రహ్మ, ఆదేవతలు మోహిని కొఱకు ఆ బ్రాహ్మణుని ర్ధించసాగిరి. 

తాత విప్ర సదాచార పరలోకోపకారక

కృపాం కురు కృపాసింధో మోహినీ గతిదో భవ

మయా సంప్రేషితా బ్రహ్మన్ రుక్మాంగదవిమోహనే

సుతా మే యమలోకం తు శూన్యం దృష్ట్యా చ మానద

వైకుంఠం సంకులం ప్రేక్ష్య లోకై: సర్వైర్నిరాకులై:

మనసోత్పాదితా దేవీ దేవానాం హితకారిణీ

నిశామయ ధరాదేవ యద్భ్రవీమి తవాగ్రత:

గతిం ధర్మస్యాతిసూక్ష్మాం లోక కల్యాణకారిణీమ్

అనయా నికషాప్యాంగ్యా పరీక్ష్య స్వర్ణభూషణ:

సదార: ససుతో బ్రహ్మన్ పాపితో హరిమందిరం

రాజ్ఞ్యా ప్రహతయా భక్త్యా హరివాసరపాలనాత్

కృతం శూన్యం యమస్థానం లిపి మార్జన కర్మణా

దేవాపకారో విప్రర్షే న క్షమో బాహుజన్మనా

భూసురాణాం విశేషేణ యాతాస్తే తత్సహాయకాః

న ప్రాప్యతే సాంఖ్యవిదా తు యచ్చ నాష్టాంగయోగేన తు భక్తిగమ్యం

త త్ప్రాపితం భూసుర భూపభర్తు ర్నిజస్య పుత్రస్య తధా సపత్న్యా:

యత్పుణ్య శీలన్య నృపస్య భూప శిరోమణే రాచరితం ప్రతీపమ్

తత్పాపవేగేన బభూవ విద్రుతా భస్మావశేషా తవ శాపదగ్ధా

దేవార్ధమేషా భవవర్ధనార్ధం నృపోపకారాయ చ సంప్రవృత్తా

న స్వార్ధ కామా లభతేవమానం కథం ద్విజాతోపకృతిం క్షమస్వ

దయాం కురుష్వ ప్రశమం భజస్వ పిష్టస్య పేషో న హి నీతియుక్తః

శాపప్రదానేన నిపాతితేయం కురు ప్రసాదం గతిదో భవ త్వమ్ 

యస్మిన్ కృతే బ్రాహ్మణమోహినీయం బుద్ధిం త్యజేత్ క్రూరతరాం త్వయీజ్యే

స ఏవముక్తః కమలాసనేన విమృశ్య బుద్ధ్యా విససర్జ కోపం

ఉవాచ దేవం త్రిదశాధినాధం విమోహినీ దేహకృతం ద్విజేంద్ర:

నలోకేషు స్థితిస్తస్మాత్ ప్రాణిభి: సంకులేషు చ

మయా విమృశ్య సుచిరం మోహిన్యర్దే విచింతితమ్

తద్దాస్యామి తవ ప్రీత్యా త్వం హి పూజ్యతరో మమ

యధా తవ వచః సత్యం మమ చాపి సురేశ్వర

దేవకార్యం చ భవితా మోహినీ కృత్యమేవ చ

యన్నాక్రాంతం హి భూతౌఘైః తత్ స్థానే మోహినీ స్థితి:

జంగమా జంగమై ర్భూమి: వ్యాప్తా ద్వీపవతీ సదా

తలాని చాపి దైత్యాద్వై: ఆకాశః పక్షిపూర్వకైః

నాకః సుకృతిభి ర్జీవై ర్నరకాః పాపకర్మభి: 

ఝషాద్యై: సాగరా వ్యాప్తా నైష్వస్పృశ్యా స్థితిస్తత:

తతో బ్రహ్మాసురై: సర్వై: సంమంత్ర్య నృపసత్తమ

ఉవాచ మోహినీం దేవీం నాస్తి స్థానం తవ క్వచిత్

తచ్ఛృత్వా మోహినీ వాక్యం పితురాజ్ఞా విధాయినీ

ఉవాచ ప్రణతా సర్వాన్ హరివాసరనాశినీ

పురోధసా సమేతానాం దేవానాం లోకసాక్షిణామ్ 

నాయనా! బ్రాహ్మణోత్తమా సదాచారపరా! పరలోకోపకారక! కృపాసింధో దయతలచి మోహినికి సద్గతిని ప్రసాదించుము. రుక్మాంగదుని మోహింప చేయుటకు మోహినిని నేనే పంపియుంటిని. యమలోకము శూన్యమగుట, వైకుంఠము పూర్ణముగా నుండటను చూచి, లోకులందరూ బాధలు లేని వారుగా నుండుటచే, దేవతలకు హితమునుచేయు మోహినిని మనసుచే సృజించితిని. ఓ బ్రాహ్మణోత్తమా నేను చెప్పుదానిని సావధానముగా వినుము. లోకకళ్యాణకారిణియగు ధర్మసూక్ష్మమును ధర్మస్వరూపమును తెలియుము. ఈ స్వర్ణసన్నిభయగు రూపముకల మోహినిచే రుక్మాంగదుని పరీక్షించి భార్యా పుత్రులతో 

శ్రీహరి మందిరమున చేర్చితిమి. రాజు ఎదురులేని భక్తి చే హరివాసరమును సేవించెను. కావున యమలోకము శూన్యము చేయబడినది. యమ లిపిని తుడిచి వేసెను. ఓ బ్రహ్మరీ! ఎన్ని జన్మలలోనైననూ దేవాపకారము క్షమించరానిది. బ్రాహ్మణాపకారము విశేషించి క్షమించరానిది. కావున మోహినికి సహాయముగా బ్రాహ్మణులు వెడలిరి. సాంఖ్యవిదులకు పొందరానిది, అష్టాంగయోగముచే పొందజాలని, భక్తి మాత్రముచే పొందదగిన శ్రీహరిలోకమునకు రాజును రాజపుత్రుని, రాజపత్నిని చేర్చితిమి. పుణ్యశీలుడగు రాజశ్రేష్ఠునకు జరిపిన కార్యమునకు పాపవేగమునకు నీశాపముచే దగ్గురాలై మోహిని భస్మముగా మిగిలి పోయెను. ఈ మోహిని దేవతల కొఱకు, సంసారమును పెంచుటకు, రాజునకు ఉపకరించుటకు మాత్రమే ప్రవర్తించినది. అంతే కాని స్వార్ధమును కోరి ఆచరించలేదు. అయినపుడు ఈమె' అవమానమును పొదుట తగదు. కావున ఓ బ్రాహ్మణోత్తమా ఈ అపకారమును క్షమించుము. దయ చూడుము. శాంతిని పొందుము. పిండిని ఇసురుట నీతిసమ్మతముకాదు. శాపమునిచ్చి పతితురాలను చేసితివి. అనుగ్రహించి గతిప్రదానము చేయుము. నీవిట్లు చేసినచో ఈ మోహిని తన క్రూర బుద్ధిని విడుచును. ఇట్లు బ్రహ్మ పలుకగా విచారించి కోపమును విడిచెను. త్రిదశాధినాధుని ఇట్లు పలికెను. నీపుత్రికయగు మోహిని బహుపాపముల నాచరించినది. కావున సకల ప్రాణులలో సకలలోకములలో ఉనికిని గోల్పోయినది. కావున నేను చాలా సేపు విచారించి మోహిని కొరకు నిర్ణయించితిని. నీ ప్రీతికొరకు ఆగతిని ఇచ్చెదను. నీవు నాకు పూ జ్యతరుడవు కదా నీ మాట నామాట నిజము కావలయును. దేవకార్యము మోహినీ కార్యము నెరవేరవలయును. భూతసంఘములు ఆక్రమించని ప్రదేశమున మోహినియుండును. సప్తద్వీపవతియగు భూమి జంగమా జంగమముల చే. వ్యాపించ బడియున్నది. తలాది లోకములు దైత్యాదులచే, ఆకాశము పక్ష్యాదులచే, స్వర్గము సుకృతులచే, నరకము పాపులచే, మత్స్యాదులచే సాగరము వ్యాప్తమైయున్నది. కావున వీటియందు మోహినికి ఉనికి లేదు. అని అంతట బ్రహ్మదేవతలతో ఆలోచించి మోహినితో నీకెక్కడా స్థానములేదని పలికెను. అపుడు మోహిని ఆమాటను విని, తండ్రి ఆజ్ఞను ఆచరించునదై హరివాసరన్మాశినియగు మోహిని పురోహితునితోపాటు అందరికి నమస్కరించి ఇట్లు పలికెను. 

భవతాం త్రిదశశ్రేష్ఠా ఏష బద్ధో మయాంజలిః

ప్రణిపాతశతేనాపి ప్రసన్నేన హృదా సురా:

దాతవ్యం యాచితం మహ్యం సర్వేషాం ప్రీతి కారకమ్

ఏకాదశ్యాః ప్రభావేణ సర్వేషాం పాపినాం గతిః

సాధ్యతే తాం సురశ్రేష్టా వర్ధితుం మే ప్రయోజనమ్

పతి: సపత్నీ పుత్రశ్చ మయా వైకుంఠగాః కృతాః

భూర్లోకే విధవాద్యాహం వర్తమి భవతాం కృతే

యథా హరిదినం దుష్టం జాయతే మమ మానదా:

ఏతత్ప్రయాచే దదత స్వార్ధార్ధం తద్ధి నాన్యథా 

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే 

మోహినీ చరితే షట్ త్రింశత్తమోఽధ్యాయః.

ఓ దేవోత్తములారా మీకు చేతులు జోడించుచుంటిని. ఇట్లు నమస్కారశతముచే దేవతలగు మీరు ప్రసన్నహృదయముతో సర్వప్రీతి కరముగా నా యాచన నీయ దగును. ఏకాదశి ప్రభావముచే పాపులందరికి సద్గతి లభించును. ఆగతిని పెంచుటయే నాకు ప్రయోజనము కావలయును. భర్త సవతి, పుత్రుడు ఈ ముగ్గురిని నేను వైకుంఠమునకు పంపితిని. భూలోకమున ఇపుడు నేను మీ కొరకు పతిహీననై యున్నాను. హరిదినము దుష్టమెట్లగునో తెలుపుడు. నాస్వార్ధమునకు ఇట్లు యాచించుచున్నాను.  

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మహినీ చరితమున ముప్పది యారవ అధ్యాయము.