నారద మహా పురాణము
2 - తిథివిచారః
వసిష్టఉవాచ:-
ఇమమే వార్థముద్దిశ్య నైమిషారణ్యవాసినః ।
పప్రచ్చుర్మునయస్సూతం వ్యాసశిష్యం మహామతిమ్
స తు పృష్టో మహాభాగ ఏకాదశ్యాస్సువిస్తరమ్ ।
మహాత్మ్యం కధయామాస ఉపవాసవిధిం తధా
తద్వాక్యం సూతపుత్రస్య శ్రుత్వా దిజవరోత్తమాః ।
మాహాత్మ్యం చక్రిణశ్చాపి సర్వపాపౌఘ శాంతిదమ్
పునః పప్రచ్చురమలం సూతం పౌరాణికం నృప ।
అష్టాదశపురాణాని భవాన్ జానాతి మానద !
కానీనస్య ప్రసాదేన మహాభారతమప్యుత ।
తన్నాస్తి యన్నవేత్సి త్వం పురాణేషు స్మృతిష్వపి
చరితే రఘనాధస్య శతకోటి ప్రవిస్తరే ।
అస్మాకం సంశయః కశ్చి ద్దృదయే సంప్రవర్తతే
తం భవానర్హతి ఛేత్తుం యాధార్ధ్యేన సువిస్తరాత్ ।
తిధేఃప్రాంతము పోష్యంస్యా దాహోస్విన్మూలమేవచ
దైవే పైత్య్రే సమాఖ్యాహి నావేద్యం విద్యతే తవ
వసిష్ఠమహర్షిపలికెను :- ఈ విషయమునుద్దేశించి నైమిషారణ్యవాసులగు మునులు మహామతి వ్యాస శిష్యుడగు సూతమహర్షినడిగిరి. ఇట్లు ఏకాదశీవివరమునడుగగా ఏకాదశీమాహత్మ్యమును ఉపవాసవీధిని చెప్పసాగెను. ఇట్లు సూతమహర్షి చెప్పిన సర్వపసాపరాశినాశక మగు చక్రి మాహాత్మ్యమును విని మరల నిట్లడిగిరి. మహానుభావా. నీవు అష్టాదశపురాణములను తెలియుదువు. వ్యాపానుగ్రహమున మహాభారతమును కూడా తెలియుదును. కావున పురాణములలో, స్మృతులలో శతకోటివిస్తరమగు రామాయణమున కూడా నీకు తెలియనిదేదియులేదు. మా మనసున ఒక సంవశయముకలదు. దానినినీవు యధార్ధముగా విస్తరముగా తొలగించ దగుదువు. ఏకాదశితిధి చివర ఉపవసించవలయునా, మొదట ఉపవసించవలయునా? పైత్ర్యమున నీకు తెలియనిది లేదు. కావున తెలుపుము.
సౌతిరువాచ:-
తిథేః ప్రాంతం సురాణాం హి ఉపోష్యం ప్రీతివర్ధనమ్
మూలం తిథేః పితృణాం తు కాలజ్ఞేః ప్రియమారీతమ్ ।
అతః ప్రాంతము పోష్యం హి తిధేర్దశ ఫలేప్పుభిః
పూర్వవిద్ధా ద్విజశ్రేష్టాః కర్తవ్యా సప్తమి సదా ।
దర్శశ్చ పౌర్ణమాసశ్చ పితుస్సాంవత్సరం దినమ్
మూలం హి పితృతృప్త్యర్థం విజ్ఞేయం ధర్మకాంక్షిభిః ।
పూర్వవిద్ధా న కర్తవ్యా ద్వితీయా చాష్టమి తధా
షష్ఠీ చైకాదశీ భూప ధర్మకామార్థలప్పుప్పుభిః ।
పూర్వవిద్దాం పరిత్యజ్య నరకం ప్రాప్నుయాద్రువకు
హానిం చ సంతతేర్భూప దౌర్భాగ్యం సమవాప్నుయాత్ ।
ఏతచ్చ్రుతం మయా విప్రా కృష్ణద్వైపాయనాత్పురా
ఆదిత్యోదయవేలాయాం యా స్తోకాపి తిధిర్భవేత్ ।
పూర్వవిద్దాతు మంతవ్యా ప్రభూతా నోదయం వినా
పారణే మరణే నృణాం తిధిస్తాత్కాలి కీస్మృతా ।
పిత్ర్యేఽస్తమనవేలాయాం స్పర్శే పూర్ణా ని గద్యతే
న తత్రోదయినీ గ్రాహ్యా దైవస్యోదయికీ తిధిః ।
ప్రత్యహం శోధయేత్ప్రాజ్ఞ స్తిధిం దైవజ్ఞచింతకాత్
తిధిప్రమాణం విప్రేన్ద్రాః క్షపాకరదివాకరౌ ।
చన్ద్రార్క చారవిజ్ఞానా తాలం కాలవిదో విదుః
పూర్వాయాస్సంగదోషేణ నయోగ్యాస్తాః ప్రపూజనే ।
వర్షయన్తి నరాస్తజ్జా యామాశ్చ చతురోద్విజ
అతం ఊర్థ్వం ప్రవక్ష్యామి స్నానపూజావిధిక్రమమ్ ।
న దివా శుద్ధీమాప్నోతి తదా రాత్రౌవిధీయతే
దినకార్యమశేషం హి కర్తవ్యం శర్వరీముఖే ।
విధిరేష మయాఖ్యాతో నరాణాముపవాసినామ్
అల్పాయామధవిప్రేన్ద్రా ద్వాదశ్యామరుణోదయే ।
స్నానార్చనక్రియా కార్యా దానహోమాది సంయుతా
త్రయోదశ్యాం హి శుద్ధాయాం పారణే పృధివీఫలమ్ ।
శతయజ్ఞాధికం వాపి నరః ప్రాప్నోత్యసంశయమ్
ఏతస్మాత్కారణాద్విప్రాః ప్రత్యూషేస్నాన మాచరేత్ ।
పితృతర్పణ సంయుక్తం న దృష్ట్వా ద్వాదశీదినమ్
మహాహానికరా హ్యేషా ద్వాదశీ లంఘితా నృభిః ।
కరోతి ధర్మహరణ మస్నాతే వ సరస్వతీ
క్షయే వావ్యధవా వృద్ధౌసంప్రాప్తే వా దినోదయే ।
ఉపోష్యా ద్వాదశీ పుణ్యా పూర్వవిద్ధాం వివర్జయేత్
సౌతి పలికెను :- దేవతలకు తిధిప్రాంతము ప్రియము. కావున ప్రాంతమున ఉపోషము ప్రీతివర్ధనము పితరులకు తిధిమూలము ప్రియమని కాలజ్ఞులు చెప్పిరి. కావున ఫలమును కోరువారు ఎల్లపుడు తీధిప్రాంతమున ఉపవసించవలయును. ఓ బ్రాహ్మణోత్తములారా? సప్తమిని ఎపుడూ పూర్వవిద్దనే ఆచరించవలయును. అమావాస్యాపూర్ణిమలు పితరులకు సాంవత్సరదినము కావున పితృతృప్తి కొరకు మూలమున ఆచరించవలయును. ద్వితీయ అష్టమి పూర్వవిద్దను ఆచరించరాదు. ధర్మకామార్థములను కోరువారు షష్టి ఏకాదశిని పూర్వ విద్దలను వదిలిపెట్టవలయును. మిగిలిన వాటిని పూర్వవిద్దలనే ఆచరించవలయును. వీటిని పూర్వ విద్దలను వదిలినచో నరకమును పొందును. హాని కలుగును. దౌర్బాగ్యమును పొందును. ఈవిషయమును నేను వ్యాసుని వలన వింటిని. సూర్యోదయకాలమున ఏతిధి కొంచెమున్ననూ పూర్వవిద్దగా నేరుగవలయును. పారణమున, మరణమున మానవులకు తాత్కాలిక తిధినే గ్రహించవలయును. పితరులకు అస్తమయ వేళలో నిస్పర్శ పూర్ణయందురు. ఇచట ఉదయకాలమున నుండి తిధిని గ్రహించ రాదు. దైవకార్యములందు ఉదయతిధిని గ్రహించవలయును. ప్రతిదినము దైవజ్ఞచింతకుని వలన తిధిని పరిశీలించవలయును. తిధికి సూర్యచంద్రులు ప్రమాణము. సూర్యచంద్ర చారమును తెలియుటచే కాలజ్ఞులు కాలమును తెలియుదురు. పూర్వతిధి సంగదోషమున్నచో పూజకు యోగ్యములు కాజాలవు. తెలిసిన వారు నాలుగు రూములను వదిలెదరు. ఇక ఇపుడు స్పానపూజావిధి క్రమమును చెప్పెదను. పగలు శుద్ధిలేనిచో రాత్రి చేయవలయును. పగలు చేయవలసిన దంతయూ సాయంకాలమే చేయవలయును. ఉపవసించునరులు ఈ విధిని అనుసరించవలయును అని నేను చెప్పుచున్నాను. అరుణోదయ వేళలో ద్వాదశిస్వల్పముగా నున్ననూ దానమస్నానార్చనక్రియలనాచరించవలయును. త్రయోదశి శుద్ధమైనపుడు పారణచేయుట అనస్తఫలప్రదము. శతయజ్ఞాధిక ఫలమును మానవుడు పొందగలుగును. కావున ప్రత్యూషకాలమున స్నానము నాచరించవలయును. ద్వాదశీదినమున చూడవలసిన పనిలేకనే పితృతర్పణములను ఆచరించవలయును. ద్వాదశిని లంఘించినచో మహాహానికలుగును. స్నానముచేయని సరస్వతివలె స్నాతకములేని విద్యవలె ధర్మమును హరించును. దీనోదయమును క్షయముకాని వృద్దికాని కలిగినచో ద్వాదశిన ఉపవసించుట పుణ్యావహము. ద్వాదశిపూర్వవిద్దఅయినచో విడువవలయును.
బ్రాహ్మణ ఉవాచ :-
యదా చ ప్రాప్యతే సూత ద్వాదశ్యాం పూర్వసంభవా ।
తదోపవాసో హి కధం కర్తవ్యోమానవైర్వద
ఉపవాసదినం విద్ధం యదా భవతి పూర్వయా ।
ద్వితీయేఽహ్ని యదా నస్యా త్స్యల్పా ప్యేకాదశీ తిధిః
తత్రోపవాసో విహితః కధం తద్వద సూతజ
బ్రాహ్మణుడు పలికెను :- ద్వాదశినాడు పూర్వసంభవము ప్రాప్తించినచో అపుడు ఉపవాసమునేట్లు చేయవలయును? ఉపవాసము చేయవలసిన దినము పూర్వవిద్దఅయి మరునాడు ఏకాదశి స్వల్పముగా కూడా లేనపుడు ఎట్లు ఉపవాసమును చేయవలయునో చెప్పుము.
సౌతిరువాచ :-
యదా న ప్రాప్యతే విప్రా ద్వాదశ్యాం పూర్వసంభవమ్ ।
రవిచన్ద్రార్కజాహంతు తదోపాష్యం పరం దినమ్
బహ్వాగమవిరోధేషు బ్రాహ్మణేషు వివాదీషు ।
ఉపోష్యాద్వాదశీపుణ్యా త్రయోదశ్యాం తు పారణమ్
ఏకాదశ్యాం తు విద్ధాయాం సంప్రాప్తే శ్రవణే తధా ।
ఉపోష్యా ద్వాదశీ పుణ్యా పక్షయో రుభయోరపి
ఏష వో నిర్ణయః ప్రోక్తో మయా శాస్త్ర వినిర్ణయాత్ ।
కిమన్యచ్చ్రోతుకామా హి తద్భవంతోబ్రవంతు మే
సౌతిపలికెను :- ద్వాదశినాడు పూర్వతిధిరానిచో అపుడు మరునాడు ఉపవసించివలయును. బ్రాహ్మణులలో భేదమున్నపుడు బహ్వాగమ విరోధములున్నపుడు ద్వాదశినాడు పవసించి త్రయోదశిపారణ చేయవలయును. శుక్లకృష్ణపక్షములలో ఏకాదశి విద్దయైనపుడు, శ్రవణా నక్షత్రము వచ్చినపుడు ద్వాదశినాడు పవసించవలయును. శాస్త్రీయానుసారము నేనీనిర్ణయమును చెప్పితిని. ఇంకనూ మీరేమి వినదలచితిరో చెపుడు.
యుగాదీనాం వద నిధిం సౌతే సమ్యగ్యధాతధమ్ ।
రవిసంక్రాతికాదీనాం నావేద్యం విద్యతేతవ
ఋషులు పలికిరి. ఓ సూతపుత్రా! ఉన్నదున్నట్టు రవిసంక్రమణము మొదలగు యుగాది విధిని తెలుపుము. నీకు తెలియని దేదియునూలేదుకదా.
సౌతిరువాచ :-
ద్వే శుక్లే ద్వే తధా కృష్ణే యుగాద్యాః కవయో విదుః ।
శుక్లే పూర్వాహ్ణికే గ్రాహ్యా కృష్ణే గ్రాహ్యాపరాహ్ణికే
అయనం దినభాగాఢ్యం సంక్రమః షోడశః పలః ।
పూర్వే తు దక్షిణే భాగే వ్యతీతే చోత్తరోమతః
మధ్యకాలే తు విషువే త్వక్షయా పరికీర్తితా ।
జ్ఞాత్వా విప్రాస్తిధిం సమ్య క్సాంవత్సరమితీరితంమ్
కర్తవ్యో హ్యుపవాసస్తు అన్యధా న రకం వ్రజేత్ ।
పూర్వవిద్దాం ప్రకుర్వాణో నరో ధర్మం నికృంతతి
సంతతే స్తు వినాశాయ సంపదాం హరణాయచ ।
పలవేధేఽపివిప్రేన్ద్రా దశమ్యా వర్జయే చ్చివామ్
సురాయ బిందునా స్పృష్టం యధా గంగాజలం త్యజేత్ ।
శ్వహతం పంచగవ్యంచ దశమ్యా దూషితాం త్యజేత్
ఏకాదశీం ద్విజశ్రేష్టా పక్షయోరుభయేరపి ।
పూర్వవిద్ధా పురాదత్తా సా తిధిర్యదుమౌలినా
దానవేభ్యో ద్విజశ్రేష్టాః ప్రీణనార్థం మహాత్మనామ్ ।
అకాలే యద్ధనం దత్తం అపాత్రే భ్యో ద్విజోత్తమాః
సంక్రుద్ధైరపి యద్దత్తం యద్దత్తం చాప్యసత్కృతమ్ ।
పూర్వవిద్ధతిధౌ దత్తం తద్దత్తమసురేష్వధ
యదుచ్ఛిష్టేన దత్తం తు యద్దత్తం పతితేష్వపి ।
స్త్రీజితేషు చ యద్దత్తం యద్దత్తం జలవర్జితమ్
పునఃకీర్తన సంయుక్తం తద్దత్తమసురేషు వై ।
తస్మాద్విప్రా న కర్తవ్యా విద్దాప్యేకాదశి తిధిః
యధా హన్తి పురాపుణ్యం శ్రాద్ధం చ వృషలీపతిః ।
దత్తం జప్తం హుతం స్నాతం తధా పూజా కృతా హరేః
తిథౌవిద్ధేక్షయం యాతి తమసూర్యోదయేయధా
జీర్ణం పతిం యౌవన గర్వితా యధా త్యజన్తి నార్యో ఝుషకేతునార్థితాః
తధా హి వేధం విబుధాస్త్యజున్తి తిధ్యన్తరం ధర్మవివృద్ధయే సదా
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే తిధివిచారో నామ ద్వితీయోఽధ్యాయః.
సౌతిపలికెను :- శుక్లపక్షమున రెండు కృష్ణపక్షమున రెండు యుగాదులునున్నవి. శుక్లపక్షమున పూర్వాహ్ణమున కృష్ణ పక్షమున అపరాహ్లామున గ్రహించవలయును. దినభాగమును అనుసరించి అయనము నిర్ణయించబడును. సంక్రమణము షోడశపలాత్మకము. పూర్వకమున దక్షిణభాగము, వ్యతీతమున ఉత్తరభాగము సమ్మతము. విషువమధ్యకాలమున అక్షయాఅనబడును. విప్రులు చక్కగా తిధిని తెలుసుకొని సంవత్సరమును చెప్పవలయును. తిధిని తెలుసుకొని ఉపవసించవలయును లేనిచో నరకమును పొందును. పూర్వవిద్దతిధియందు ఉపవసించినచో ధర్మచ్చేదము, సంతతివినాశము సంపద్ధరణము జరుగును. ఏకాదశికి ఒక పలయైనను దశమావేధ యున్నచో సురాబిందుస్పర్శగల గంగాజలమును వలే విడువవలయును. కుక్క తాకిన పంచగవ్యమును వలే దశమివిద్దయగు ఏకాదశిని విడువవలయును. పూర్వవిద్ధయగు ఏకాదశిని శ్రీకృష్ణుడు మహాత్ములసంతోషముకోరకు రాక్షసులకిచ్చెను. అకాలమున నిచ్చినధనము, ఆపాత్రులకిచ్చిన ధనము, కోపించనవారిచే చేయబడు దానము, అసత్కారపూర్వకముగా నిచ్చినదానమువలె రాక్షసులకిచ్చిన దానము పూర్వవిద్ధతిధియందు చేయబడిన దానము, ఉచ్చిష్టునిచే చేయబడినదానము, పతితులకిచ్చిన దానము, స్త్రీజితులకిచ్చిన దానము, జలవర్జితదానము, ఇచ్చిన తరువాత చెప్పుకొనిన దానము అసురుల కిచ్చిన దానమువంటిది. కావున విద్దయగు ఏకాదశి తిధిన ఉపవసించరాదు. వృషలీపతి శ్రాద్దము పూర్వపుణ్యమును హరించినట్లు దశమివిద్దయగు ఏకాదశితిధిన చేయు దానము జపము హోమము స్నానము హరిపూజ సూర్యోదయమున చీకటివలే హరించబడును. వృద్దుడగు పతిని యౌవన గర్వితయగు స్త్రీలు విడుచునట్లు దశమివిద్ధయగు ఏకాదశిని పండితులు విడిచెదరు. ధర్మవృద్ధికొరకు తిద్వస్తరమును గ్రహింతురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున తిధివిచారమను రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 129 of the Nārada Mahā Purana is as follows:
ధర్మపరాయణుడైన వసు రాజర్షి యొక్క పవిత్ర వృత్తాంతము ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. ఏకాదశీ వ్రత నిష్ఠ ద్వారా వసు చక్రవర్తి పొందిన అనంతమైన పుణ్యరాశి మరియు భగవత్కృపా విశేషములు ఇక్కడ అత్యంత భక్తిరసభరితంగా ప్రతిపాదించబడినవి.