79 - హనుమచ్చరిత్రమ్

సనత్కుమార ఉవాచ :

అథాపరం వాయుసూనోశ్చరితం పాపనాశనమ్,

యదుక్తం స్వాసు రామేణ ఆనన్దవనవాసినా.

సద్యో జాతే మహాకల్పే శ్రుతవీర్యే హనూమతి,

మమ శ్రీరామచన్ద్రస్య భక్తిరస్తు సదైవ హి.

శృణుష్వ గదతో మత్తః కుమారస్య కుమారక !,

చరితం సర్వపాపఘ్నం శృణ్వతాం పఠతాం సదా.

వాంఛామ్యహం సదా విప్రసంగమం కేశరూపిణా,

రహస్యం రహపి స్వస్య మమానన్దవనోత్తమే.

పరీతేఽత్ర సఖాయో మే పఖ్యశ్చ విగతజ్వరాః,

క్రీడన్తి సర్వదా చాత్ర ప్రాకట్యేఽపి రహస్యపి.

కస్మింశ్చిదవతారే తు యద్వృత్తం చ రహో మమ,

తదత్ర ప్రకటం తు భయం కరోమి ప్రీతమానసః.

ఆవిర్భూతోఽస్మ్యహం పూర్వం రాజ్ఞో దశరథక్షయే,

చతుర్వ్యూహాత్మకస్తత్ర తప్య భార్యాత్ర మే మునే.

తతః కతిపయైరభ్దైరాగతో ద్విజపుంగవః,

విశ్వామిత్రోఽర్థయామాస పితరం మమ భూపతిమ్.

యక్షరక్షోవిఘాతార్థం లక్ష్మణేన సహైవ మామ్,

ప్రేషయామాస ధర్మాత్మా సిద్ధాశ్రమమరణ్యకమ్.

తత్ర గత్వా శ్రమమృషేర్దూషయన్తౌ నిశాచరౌ,

ధ్వస్తౌ సుబాహుమారీచౌ ప్రసన్నోఽభూత్తదా మునిః.

అస్త్రగ్రామం మహ్యం మాసం చావాసయత్తదా,

తతో గాధిసుతో ధీమాన్ జ్ఞాత్వా భావ్యర్థమాదరాత్.

మిథిలామనయత్తత్ర రౌద్రం చాదర్పయద్దనుః,

తస్య కన్యాం పణీభూతాం సీతాం సురసుతోపమామ్.

ధనుర్విభజ్య సమితి లబ్ధవాన్మానినోఽస్య చ,

తతో మార్గే భృగుపతేర్దర్పమూఢం చిరం స్మయన్.

వ్యపనీయాగమం పశ్చాదయోధ్యాం స్వపితుః పురీమ్,

తతో రాజ్ఞాహమాజ్ఞాయ ప్రజాశీలనమానసః.

యౌవరాజ్యే స్వయం ప్రీత్యా సమ్మంత్ర్యాప్తైర్వికల్పితః,

తచ్ఛ్రుత్వా సుప్రియా భార్యా కైకేయీ భూపతిం మునే.

దేవకార్యవిధానార్థం విదూషితమతీర్జగౌ, పుత్రో మే భరతో నామ యౌవరాజ్యేఽభిషిచ్యతామ్.

రామశ్చతుర్థశసమా దండకాన్ప్రవివాప్య తామ్,

తదాకర్ణ్యాహముద్యుక్తోఽరణ్యం భార్యానుజాన్వితః.

గంతుం నృపతినానుకోఽప్యగమం చిత్రకూటకమ్,

తత్ర నిత్యం వన్యఫలైర్మాంసైశ్చావర్తితక్రియః.

నివసన్నేవ రాజ్ఞస్తు నిధనం చాప్యవాగమమ్,

తతో భరతశత్రుఘ్నో భ్రాతరౌ మమ మానదౌ.

మాతృవర్గయుతౌ దీనౌ సాచార్యామాత్యనాగిరౌ,

వ్యజిజ్ఞపతమాగత్య పంచవట్యాం నిజాశ్రమమ్.

అకల్పయం భ్రాతృభార్యాసహితశ్చ త్రివత్సరమ్,

తతస్త్రయోదశే వర్షే రావణో నామ రాక్షసః.

మాయయా హృతవాన్సీతాం ప్రియాం మమ పరోక్షతః,

తతోఽహం దీనవదన ఋష్యమూకం హి పర్వతమ్.

భార్యామన్వేషయన్ప్రాప్తస్సఖ్యం హర్యధిపేన చ,

అథవాలినమాహత్య సుగ్రీవస్తత్పదే కృతః.

సహ వానరయూధైశ్చ సాహాయ్యం కృతవాన్మమ,

విరుధ్య రావణేనాలం మమ భక్తో విభీషణః.

ఆగతో హ్యభిషిద్యాశు లంకేశో హి వికల్పితః,

హత్వా తు రావణం సంఖ్యే సపుత్రామాత్యబాంధవమ్.

సీతామాదాయ సంశుద్ధామయోధ్యాం సముపాగతః,

తతః కాలాంతరే విప్ర సుగ్రీవశ్చ విభీషణః.

నిమంత్రితౌ పితుశ్శ్రౌద్దే షట్కులాశ్చ ద్విజోత్తమాః,

అయోధ్యాయాం సమాజగ్ముస్తే తు సర్వే నిమన్త్రితాః.

ఋతే విభీషణం తత్ర చింతయానే రఘూత్తమే,

శంభుర్భ్రాహ్మణరూపేణ షట్కులైశ్చ సహాగతః.

అథ పృష్టో మయా శంభుర్విభీషణసమాగమే,

నీత్వా మాం ద్రావిడే దేశే మోచయ ద్విజబంధనాత్.

మయా నియంత్రితాశ్శ్రాద్ధే హ్యగస్త్యాద్యా మునీశ్వరాః,

సంభోజితాస్తు ప్రయయుస్స్వస్వమాశ్రమమండలమ్.

సనత్కుమార మహర్షి పలికెను : ఇక ఇపుడు పాపనాశకమగు వాయుపుత్రుని చరితమును చెప్పెదను. ఆనన్దవన వాసియగు రాముడు చెప్పినది చరితము. మహా కల్పమున ప్రసిద్ద బలుడగు హనుమంతుడు సద్యోజాతుడాయెను. నాకు శ్రీరామచంద్రుని పై భక్తి ఎల్లప్పుడూ ఉండనిమ్ము. ఈ చరితము • వినువారికి చదువువారికి పాపనాశకము. నేనెప్పుడూ వానరరూపితో నున్న హనుమంతునిచే సంగమమును కోరుచున్నాను. ఆనందవనమున ఏకాంతములో రహస్యమగు ఈ వృత్తాంతమును చెప్పెను. ఇచట అంతటా చింతారహితులగు సఖీజనము స్నేహితులు ఎల్లపుడూ రహస్యముగా ఏకాంతముగా క్రీడించుచుందురు. నా యొకానొక అవతారమున జరిగిన ఒక రహస్యమును ఇచట నీకు సంతోషముతో ప్రకాశింప చేయుచున్నాను. పూర్వకాలమున నేను దశరథ మహారాజుగారింటిలో చతుర్వ్యూహాత్మకముగా దశరథుని భార్యాత్రయమున ఆవిర్భవించితిని. తరువాత కాన్ని సంవత్సరములకు బ్రాహ్మణోతముడగు విశ్వామిత్రుడు వచ్చి నా తండ్రిని యక్షరాక్షస సంహారమునకు లక్ష్మణునితో కూడిన నన్ను యాచించెను. నా తండ్రి విశ్వామిత్రుని వెంట సిద్దాశ్రమమునకు పం పెను. నేను విశ్వామిత్ర మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఆ యాశ్రమమును కలుషితమును చేయుచున్న సుబాహమారీచుల బాధను తొలగించితిని. అపుడు విశ్వామిత్రమహర్షి నాయెడ ప్రసన్నుడాయెను. నాకు అస్త్రవిద్యను ప్రసాదించేను. ఒకనెల అచటనే ఉంచుకానెను. తరువాత మహానుభావుడగు విశ్వామిత్రమహర్షి భవిష్యత్తును తెలుసుకాని నన్ను మిథిలానగరమునకు తీసుకాని వెళ్ళెను. శివుని ధనువును చూ పెను. నేను ఆ సభలో ఆ శివధనువును భగ్నము గావించి సురసుతోపమయగు జనకమహారాజ పుత్రియగు సీతను పణభూతను భార్యగా పొందితిని. తరువాత మార్గనుధ్యములో పరశురాముని గర్వమునణచి అయోధ్యకు చేరితిని అపుడు దశరథమహారాజు నన్ను ప్రజారంజకునిగా తెలుసుకాని యువరాజుగా చేయుటకు సంకల్పించేను. ఆ వార్తను దశరథమహారాజునకు ప్రియపతి యగు కైకయి విని దేవకార్యనిర్వహణకై కలుషితమతియే నా పుత్రుడగు భరతుని యువరాజుగా అభి షేకించుము. రాముని పదునాలుగువత్సరములు దండకారణ్యమునకు పంపుము. అని పలికెను. రాజు చెప్పకున్ననూ కైకమాటలను విన్న నేను భార్యాసోదరసహితుడైనై అరణ్యమునకు బయలుదేరితిని. చిత్రకూటమును చేరితిని. అచట నిత్యము వన్యఫలములచే మాంసములచే పనులు చేయుచుంటిని. అచట నివసించుచూ దశరథమహారాజు నిధనవార్తను వింటిని. తరువాత నన్ను గౌరవించు భరత శత్రుఘ్నులు మాతృవర్గముతో ఆచార్యులతో అమాత్యవర్గముతో దీనులై నావద్దకు వచ్చిరి. విజ్ఞాపన చేసిరి. తరువాత నేను భార్యాసోదరసహితుడనై పంచవటికి పెళ్ళితిని. అచట ఆశ్రమమును ఏర్పరుచుకుంటిని. మూడు సంవత్సరములుంటిని. అంతట పదమూడవయేట రావణుడను రాక్షసుడు మాయతో నా ప్రియురాలగు సీతను నా చాటుగా అపహరించెను. అపుడు నేను దీనవదనుడనై భార్యను వెదకుచూ ఋష్యమూకపర్వతమును చేరితిని. వానరాధిపతియగు సుగ్రీవునితో చెలిమి చేసితిని. అపుడు వాలిని చంపి సుగ్రీవుని అతని స్థానమున రాజును చేసితిని. సుగ్రీవుడు వానరయూధములతో నాకు సాయము చేసెను. రావణునితో విరోధించిన రావణానుజుడగు విభీషణుడు నా వద్దకు వచ్చెను. నేను విభీషణుని లంకాధిపతిగా అచటనే అభిషిక్తుని జేసితిని. సపుత్రామాత్యభాంధవుని రావణుని చంపి, పరిశుద్ధురాలగు" సీతాదేవిని తీసుకాని అయోధ్యకు చేరితిని. తరువాత కొంతకాలమునకు పితృశ్రాద్దమున సుగ్రీవవిభీషణులను నిమంత్రణ చేసితిని. అట్లే షట్కులులగు బ్రాహ్మణులను కూడా ఆహ్వానించితిని. అట్లు పిలువబడిన వారందరూ వచ్చిరి. ఒక్క విభీషణుడు మాత్రము రాలేదు. విభీషణుని గురించి నేను ఆలోచించుచుండగా శివుడు బ్రాహ్మణరూపముతో షట్కులులతో కలిసి వచ్చెను. అపుడు నేను విభీషణుని గూర్చి శంకరుని అడిగితిని. అపుడు నన్ను ద్రావిడ దేశమునకు గొనిపోయి ద్విజబంధనమునుండి విడిపించెను. శ్రాద్ధమునకు వచ్చిన అగస్త్యాది బ్రాహ్మణోత్తములు చక్కగా భోజనము చేసి తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి.

తతః కాలాన్తరే విప్రా దేవా దైత్యా నరేశ్వరాః,

గౌతమేన సమాహూతాః సర్వే యజ్ఞసభాజితాః.

తే సర్వే స్ఫాటికం లింగం త్య్రంబకాద్రౌ నివేశితమ్,

సంపూజ్య వ్యవసంస్తత్ర దేవదైత్యనృపాగ్రజాః.

తస్మిన్సమాజే వితతే సర్వైర్లింగే పమర్చితే,

గౌతమోఽప్యథ మధ్యాహ్నే పూజయామాస శంకరమ్.

సర్వే శుక్లాంబరధరా భస్మోద్ధూలితవిగ్రహాః,

 సితేన భస్మనా కృత్వా సర్వస్థానే త్రిపుండ్రకమ్.

నత్వా తు భార్గవం సర్వే భూతశుద్ధిం ప్రచక్రముః,

హృత్పద్మమధ్యే సుషిరం తత్రైవ భూతపంచకమ్.

తేషాం మధ్యే మహాకాశమాకాశే నిర్మలామలమ్,

తన్మధ్యే చ మహేశానం ధ్యాయేద్దీప్తిమయం శుభమ్.

అజ్ఞానపంయుతం భూతం పమలం కర్మపంగతః,

తం దేహమాకాశదీపే ప్రదహే జ్ఞానవహ్నినా.

ఆకాశస్యావృతిం చాహం దగ్ధ్వాకాశమధో దహేత్,

దగ్ధ్వాకాశమధో వాయుమగ్నిభూతం తథా దహేత్.

అబ్భూతం చ తతో దగ్ధ్వా పృథివీభూతమేవ చ,

తదాశ్రితాన్గుణాన్దగ్ధ్వా తతో దేహం ప్రదాహయేత్.

ఏవం ప్రదగ్ధ్వా భూతాదిం దేహీ తఙ్ఞానవహ్నినా,

శిఖామధ్యస్థితం విష్ణుం ఆనన్దరసనిర్భరమ్.

నిష్పన్నచన్ద్రకిరణసంకాశకిరణం శివమ్,

శివాంగోత్పన్నకిరణైరమృతద్రవసంయుతైః.

సుశీతలా తతో జ్వాలా ప్రశాంతా చన్ద్రరశ్మివత్,

ప్రసారితసుధారుగ్భిస్సాంద్రీభూతశ్చ సంప్లవః.

అనేన ప్లావితం భూతగ్రామం సంచింతయేత్పరమ్.

ఇత్థం కృత్వా భూతశుద్ధిం క్రియార్హో మర్త్యశ్శుద్ధో జాయతే హ్యేవ సద్యః,

పూజాం కర్తుం జప్యకర్మాపి పశ్చాత్ ఏవం ధ్యాయేద్బ్రహ్మహత్యాదోశుద్ధ్యై.

ఏవం ధ్యాత్వా చంద్రదీప్తిప్రకాశం ధ్యానేనారోప్యాశు లింగే శివస్య,

పదాశివం దీపమధ్యే విచిన్త్య పంచాక్షరేణారచనమవ్యయం తు.

ఆవాహనాదీనుపచారాస్తథాపి కృత్వా స్నానం పూర్వవచ్ఛంకరస్య,

ఔదుంబరం రాజితం స్వర్ణపీఠం వస్త్రాదిచ్ఛన్నం సర్వమేవేహ పీఠమ్.

అంతే కృత్వా బుద్బుదాభ్యాం చ సృష్టిం పీఠే పీఠే నాగమేకం పురస్తాత్,

కుర్యాత్పీఠే చోర్ధ్వకే నాగయుగ్మం దేవాభ్యాశే దక్షిణే వామతశ్చ.

జపాపుష్పం నాగమధ్యే నిధాయ మధ్యే వస్త్రం ద్వాదశప్రాతిగుణ్యే,

సుశ్వేతేన తస్య మధ్యే మహేశం లింగాకారం పీఠయుగ్మం ప్రపూజ్యమ్.

ఏవం కృత్వా సాధకాస్తే తు సర్వే దత్వా దత్వా పంచగంధాష్టగంధమ్,

పుష్పైః పత్రైశ్శ్రతిలైరక్షతైశ్చ తిలోన్మిశ్రైః కేవలైశ్చ ప్రపూజ్య.

ధూపం దత్వా విధివత్సంప్రయుక్తం దీపం దత్వా చోక్తమేహోపహారమ్,

పూజాశేషం తే సమాప్యాథ సర్వే గీతం నృత్యం తత్ర తత్రాపి చక్రుః.

కాలే చాస్మిన్సువ్రతే గౌతమష్య శిష్యః ప్రాప్తశ్శంకరాత్మేతి నామ్నా.

ఉన్మత్తవేషో దిగ్వాసా అనేకం వృత్తిమాస్ధితః,

క్వచిద్ద్విజాతిప్రవరః క్వచిచ్చండాలపన్నిభః.

క్వచిచ్ఛూద్రసమో యోగీ తాపపః క్వచిదప్యుత,

గర్జత్యుత్పతతే చైవ నృత్యతి స్తౌతి గాయతి.

రోదితి శృణుతేఽత్యుక్తం పతత్యుత్తిష్ఠతి క్వచిత్,

శివజ్ఞానైకసంపన్నః పరమానన్దనిర్భరః.

సంప్రాప్తో భోజ్యవేలాయాం గౌతమస్యాంతికం యయౌ,

 బుభుజే గురుణా సాకం క్వచిదుచ్ఛిష్టమేవ చ.

క్వచిల్లిహతి తత్వాత్రం తూష్ణీమేవాభ్యగాత్క్వచిత్,

హస్తం గృహీత్వైవ గురోస్స్వయమేవాభునక్క్వచిత్.

క్వచిద్గృహాంతరే మూత్రం క్వచిత్కర్ధమలేపనమ్,

సర్వదాతం గురుర్దృష్ట్వా కరమాలింబ్య మందిరమ్.

ప్రవిశ్య ప్వీయ పీఠే తముపవేశ్యాష్యభోజయత్,

స్వయం తదస్య పాత్రేణ ఋభుజే గౌతమో మునిః.

తస్య చిత్తం పరిజ్జాతుం కదాచిదథ సుందరీ,

అహల్యా శిష్యమాహూయ భుంక్ష్వేతి ప్రాహ తం ముద్.

నిర్దిష్టో గురుపత్న్యోతు ఋభుజే సోఽవిశేషతః,

యథా షపౌ హి పానీయం తథా వహ్నిమపి ద్విజ.

కంటకానన్నవద్భుక్త్వా యథాపూర్వమతిష్ఠత,

పురోహి మునికన్యాభిరాహూతో భోజనాయ చ.

దినే దినే తత్ప్రదత్తం లోష్టమంబు చ గోమయమ్,

కర్ధమం కాష్ఠదండం చ భుక్త్వా పీత్వాథ హర్షితః.

ఏతాదృశో మునిరసౌ చండాలపదృశాకృతిః,

సుజీర్ణోపానహౌ హస్తే గృహీత్వా ప్రలపన్షసన్.

అంత్యజోచితవేషస్తు వృషపర్వాణమభ్యగాత్,

 వృషపర్వేశయోర్మధ్యే దిగ్వాసాస్సమతిష్టత.

వృషపర్వా తమజ్ఞాత్వా పీడయిత్వా శిరోఽచ్ఛినత్,

హతే తస్మిన్ద్విజశ్రేష్టే జగదేతచ్చరాచరమ్.

అతీవ కలుషం హ్యాపీత్తత్రస్థా మునయస్తథా,

గౌతమస్య మహాశోకస్సంజాతస్సుమహాత్మనః.

నీర్యయౌ చక్షుషో వారి శోకం సందర్శయన్నివ,

గౌతమస్సర్వదైత్యానాం సన్నిధౌ వాక్యముక్తవాన్.

కీమనేన కృతం పాపం యేన చ్ఛిన్నమిదం శిరః,

మమ ప్రాణాధిక స్యేహ సర్వదా శివయోగినః.

మమాపి మరణం సత్యం శిష్యచ్ఛద్మా యతో గురుః,

శైవానాం ధర్మయుక్తానాం సర్వదా శివవర్తినామ్.

మరణం యత్ర దృష్టం స్యాత్తత్ర నో మరణం ధ్రువమ్,

తచ్ఛ్రుత్వా హ్యసురాచార్యశ్శ్రుక్రః ప్రొహ విదాం వరః.

ఏనం సంజీవయిష్యామి భార్గవం శంకరప్రియమ్,

కీమర్థం ప్రియతే బ్రహ్మన్ పశ్య మే తపసో బలమ్.

ఇతి వాదిని విపేంద్రే గౌతమోఽపి మమార హ,

తస్మిన్మృతేఽథ శుక్రోఽపి ప్రాణాంస్తత్యాజ యోగతః.

తస్యైవం హతమాజ్ఞాయ ప్రహ్లాదాద్య దితీశ్వరాః,

దేవా నృపా ద్విజాస్సర్వే మృతా ఆసంస్తదద్భుతమ్.

మృతమాషీదథ బలం తస్య బాణస్య ధీమతః,

అహల్యాశోకసంతప్తా రురోదోచ్చైః పునః పునః.

గౌతమేన మహేశప్య పూజయా పూజితో విభుః,

నీరభద్రో మహాయోగీ సర్వం దృష్ట్వా చుకోప హ.

ఆహో కష్టమహో కష్టమ్మహేశా బహవో హతాః,

శివo విజ్ఞాసయిష్యామి తేనోక్తం కరవాణ్యథ.

ఇతి నిశ్చిత్య గతవాన్ నుందరాచలమవ్యయమ్,

నమస్కృత్వా విరూపాక్షం వృత్తం పర్వమథోక్తవాన్.

బ్రహ్మాణం చ హరిం తత్ర స్థితౌ ప్రాహ శివో వచః,

మద్భక్తైస్సాహసం కర్మ కృతం జ్ఞాత్వా వరప్రదమ్.

గత్వా పశ్యామి హే విష్ణో సర్వం తత్కృతసాహసమ్,

ఇత్యుక్త్వా వృషమారుహ్య వాయునా ధూతచామరః.

నన్దికేన పువేషేణ ధృతే ఛత్రేఽతిశోభనే,

సుశ్వేతే హేమదండే చ నాన్యయోగ్యే ధృతే విభో.

మహేశానుమతిం లబ్ధ్వ హరిర్నాగాంతకే స్థితః,

ఆరక్తనీలఛత్రాభ్యాం శుశుభే లక్ష్మకౌస్తుభః.

శివానుమత్యా బ్రహ్మాపి హంసారూఢోఽభవత్తదా,

ఇంద్రగోపప్రభాకారఛత్రాభ్యాం శుశుభే విధిః.

ఇంద్రాదిపర్వదేవాశ్చ స్వస్వవాహనసంయుతాః,

అథ తే నిర్యయుస్సర్వే నానావాద్యానుమోదితాః.

కోటికోటిగణాకీర్ణా గౌతమస్యాశ్రమం గతాః,

 బ్రహ్మవిష్ణుమహేశానా దృష్ణా తత్పరమాద్భుతమ్.

స్వభక్తం జీవయామాస వామకోణనిరాక్షణాత్,

శంకరో గౌతమం ప్రాహ తుష్టాఽహాం తే వరం వృణు.

తదాకర్ణ్య వచస్తస్య గౌతమః ప్రాహ సాదరమ్,

యది ప్రపన్నో దేవేశ యది దేయో వరో మమ.

త్వల్లింగార్చనసామర్థ్యం నిత్యమస్తు మహేశ్వర,

వృతమేతన్మయా దేవ త్రినేత్ర శృణు చాపరమ్.

శిష్యోఽయం మే మహాభాగో హేయాదేయాదివర్జితః,

ప్రేక్షణీయం మమత్వేన న చ పశ్యతి చక్షుషా.

న ఘ్రాణగ్రాహ్యం దేవేశ న పాతవ్యం న చేతరత్,

ఇతి బుద్ధ్యా తథా కుర్వన్ స హి యోగీ మహాయశాః.

ఉన్మత్తవికృతాకారశ్శంకరాత్మేతి కీర్తితః,

న కశ్చితం ప్రతి ద్వేషీ న చ తం హింసయేదపి.

ఏతన్మే దీయతాం దేవ మృతానామమృతిస్తథా,

తచ్చ్రుత్వోమాపతిః ప్రీతో నిరీక్ష్య హరిమవ్యయః.

స్వాంశేన వాయునా దేహమావిశజ్జగదీశ్వరః,

హరిరూపశ్శంకరాత్మా మారుతిః కపిసత్తమః.

పర్యాయైరుచ్యతేఽధీశస్సాక్ష్వాష్ణుశ్శివః పరః,

ఆకల్పమేష ప్రత్యేకం కామరూపముపాశ్రితః.

మమాజ్జా కారకో రామభక్తః పూజితవిగ్రహః,

అనన్తకల్పమీశాన్తరః స్ట్రాప్యతి ప్రీతమానసః.

త్వయా కృతమిదం వేశ్మ విస్తృతం సుప్రతిష్ఠితమ్,

నిత్యం వై సర్వరూపేణ తిష్టామః క్షణమాదరాత్.

సమర్చితాః ప్రయాస్యామస్స్వస్వపాపం తతః పరమ్,

 అథాభిభాషే విశ్వేశం గౌతమో మునిపుంగవః.

అయోగ్యం ప్రార్థయామీశ హ్యర్థి దోషం న పశ్యతి,

 బ్రహ్మాద్యలభ్యం దేవేశ దీయతాం యది రోచతే.

తరువాత కాలాంతరమున బ్రాహ్మణులు, దేవతలు, దైత్యులు, నరేశ్వరులు, గౌతముడు పిలువగా యజ్ఞమునకు వచ్చిరి. వారందరూ త్ర్యంబకాద్రిమీద స్థాపించబడిన స్పాటికలింగమును చక్కగా పూజించి నివసించిరి. ఆ విస్తృతమైన సమాజము లింగమును పూజించిన తరువాత మధ్యాహ్న కాలమున గౌతమ మహర్షి శంకరుని పూజించెను. అందరూ శుక్లాంబరధరులై భస్మోధూలిత విగ్రహులై తెల్లని భస్మమును సర్వశరీరమున త్రిపుండ్రములుగా ధరించి భార్గవుని నమస్కరించి భూతశుద్దిని చేసిరి. హృత్పద్మమధ్యమున నున్న భూత పంచకము, వారి మధ్య మహాకాశము, ఆకాశమున నిర్మలము, దాని మధ్యన దీప్తిమయుడు శుభకరుడగు మహేశ్వరుని ధ్యానించవలయును. అజ్ఞానసంయుతము భూతము సమలము కర్మ సంగతమైన ఆకాశదీపమున నున్న ఆ దేహమును జ్ఞానవహ్నితో దహించవలయును. ఆకాశావృతియైన అహం తత్త్వమును దహించి తరువాత ఆకాశమును దహింప చేసి, తరువాత వాయువును దహింప చేయవలయును. తరువాత అగ్ని భూతమును దహించి, జలభూతమును దహించవలయును. తరువాత పృథివీ భూతమును దహించవలయును. తరువాత భూతాశ్రితులైన గుణములను దహించి తరువాత దేహమును దహించవలయును. ఇట్లు భూతాదిని జీవునజ్ఞానవ హిచే దహించి, శిఖామధ్యగతుడు, ఆనన్దరసనిర్భరుడగు విష్ణువును నిష్పన్న చన్డకిరణసంకాశకిరణుడగు శివుని, శివాంగోత్పన్నములు అమృత ద్రవసంయుతములగు కిరణములచే సుశీతలము చంద్రరశ్మి వలే ప్రశాంతముగా ప్రసరించబడిన గొప్పధారలచే సాంద్రముగా చేయబడిన ప్రవాహముచే ప్లావితము చేయబడిన భూతగ్రామమును చింతించవలయును. ఇట్లు భూత శుద్ధిని చేసి క్రియార్థుడగు మర్త్యుడు వెంటనే పరిశుద్దుడైనచో పూజించుటకు, జపించుటకు యోగ్యుడగును. ఇట్లు చేసినచో బ్రహ్మ హత్యాది పాతకములనుండి విముక్తుడగును. ఇట్లు ధ్యానించి ధ్యానముచే శివలింగమునందు చంద్రదీప్తి ప్రకాశమును ఆరోపించి, దీపమధ్యమున సదాశివుని చింతించి పంచాక్షర మంత్రముచే అవ్యయుని అర్చించవలయును. శంకరునికి ఆవాహన స్నానాద్యుపచారములను పూర్వము వలె నాచరించి మేడి కాని, రాజత స్వర్ణమయములు కాని, వస్త్రాది ఛన్నమగు పీఠమును ఏర్పరిచి, అంతమునందు బుద్బుదములచే సృష్టిజరిపి ప్రతి పీఠమున ఒక్కొక్క నాగమునుంచి, ఊర్ధ్వ పీఠమున నాగయుగ్మమును దేవాభ్యాసమున దక్షిణవామభాగములలో నుంచి నాగమధ్యమున జపాపుష్పమునుంచి మధ్యమున వస్త్రము నుంచి, ఆవస్త్రమధ్యమున పీఠయుకుడు లింగాకారుడగు మహేశుని పూజించవలయును. ఆ సాధకులందరు ఇట్లుచేసి పంచగంధములను అష్టగంధములనిచ్చి, పుష్పములచే, పత్రములచే, శ్రీతిలలచే, అక్షతలచే, కేవలపాలలచే పూజించి యథావిధిగా ధూపము నిచ్చి దీపముని యథోక్తముగా ఉపహారము నిచ్చి, పూజా శేషమును ముగించి నృత్యగీతములను ఆచరించిరి. ఈ సమయమున గౌతమశిష్యుడగు శంకరాత్మయను పేరుగలపోడు ఉన్మత్త వేషుడు దిగంబరుడు అనేక వృత్తులనవలంబించినవాడు అచటికి వచ్చెను. ఒకచోట బ్రాహ్మణవేషధారి, ఒకచోట చండాలసముడు, ఒకచోట శూద్రసమునిగా ఒకచోట యోగిగా, ఒకచోట తాపసిగా, నుండుచు గర్జించుచు, గంతులేయును. నృత్యము చేయును. స్తోత్రము చేయును. గానము చేయును. ఏడ్చును వినును. పడును. లేచును. శివజ్ఞానేక సంపన్నుడు పరమానందనిర్భరుడు భోజన సమయమున వచ్చెను. గౌతముని వద్ద కేగెను. గురువుతో కలిసి భుజించెను. ఒకచోట ఉచ్చిష్టమును తినెను. ఒకచోట పాత్రను నాకును. ఒకచోట ఊరికే వెళ్ళును. గురువు హస్తమును పట్టుకాని స్వయముగా తినును. మరియొక - గృహమున మూత్రము చేసెను. మరియొక యింట బురదను పూసుకానెను. అట్లు శంకరాత్మను గురువు చూచి చేయిపట్టుకాని గృహమునకు తీసుకాని వెళ్ళి, తమ పీఠమున అతనిని కూర్చుండబెట్టి భోజనము చేయించేను. గౌతమ మహర్షి కూడా అతని పాత్రలో తినెను.

శంకరాత్మ మనసును తెలుసుకానుటకు గౌతముని భార్యయగు అహల్య ఒకసారి అతనిని పిలిచి తినుమని పలికెను. గురుపత్ని ఆజ్ఞను విని ఏ భేదము లేకుండగా తనేను. నీరును తాగెను. అట్లే అగ్నిని కూడా త్రాగేను. ముళ్ళను అన్నము" వలె తిని ఎప్పటి వలెనే యుండెను. తరువాత మునికన్యలు పిలిచి " ప్రతి దినము వారిచ్చు భోజనమును, రాళ్ళను నీటిని, గోమయమును బురదను, కాషదండములను తిని త్రాగి సంతోషముతో చండాలాకారము నుండు ముని యతడు. ఇట్లు ఒకమారు జీర్ణములగు పాద రక్షలను చేతిలో పట్టుకాని, అరచుచు నవ్యుచు చండాల వేషము కలవాడై వృషపర్వరాజువద్దకు వెళ్ళెను. వృషపర్వుడు ప్రభువు మధ్య దిగంబరుడుగా నిలిచెను. వృషపర్వుడు అతనిని తెలియక పీడించి శిరస్సును ఖండించేను. ఆ బ్రాహ్మణోత్తముడు వధించబడగా చరాచరమగు ఈ ప్రపంచమంతయు కలుషితమాయెను. అచట మునులు కూడా కలత చెందిరి. మహాత్ముడగు గౌతమునకు మహాశోకము కలిగెను. తమ దుఃఖమును చూపుచున్నట్లు నేత్రములనుండి నీరు వేడలెను. గౌతమ మహర్షి దైత్యులందరి ముందు ఇట్లు పలికెను. ఇతను చేసిన అపరాధమేమిటి? ఇతని శిరస్సు నేల ఖండించితిరి? నాకు ప్రాణాధిక ప్రియుడు, సర్వ కాలములలో శివయోగి ' అయిన వానిని చంపితిరి గావున నామరణము కూడా సంభవించును. గురువు శిష్యరూపముతో నుండును కదొ ధర్మయుక్తులు, శైవులు, సర్వదా శివవరులు అయిన వారి మరణమును చూచినచో మా మరణము తప్పదు. ఆమాటలను విని జ్ఞానులలో శ్రేషుడు రాక్షసాచార్యుడగు శుక్రుడు ఇట్లు పలికేను. భార్గవుడు శంకర ప్రియుడగు ఇతనిని బ్రతికించెదను. మీరెందుకు మరణించెదరు? నా తపోబలమును చూడుము. శుక్రాచార్యులు ఇట్లు పలుకుచుండగనే గౌతమమహర్షి మరణించెను. గౌతమమహర్షి మరణించిన వెంటనే శుక్రాచార్యుడు కూడా యోగము చే మరణించెను. శుక్రాచార్యుడు మరణించిన వార్తను వినిన ప్రహ్లాదాది దైత్యేశ్వరులు, దేవతలు రాజులు, బ్రాహ్మణులు అందరూ మరణించిరి. అహల్యశోకసంతప్తమై మాటి మాటికి పెద్దగా ఏడ్చెను. మహేశుని పూజలో గౌతమునిచే పూజించబడిన వీరభద్రుడు అదంతయూ చూచి కోపించేను. ఇది చాలా కష్టము. చాలా కష్టము. చాలా మంది మరణించిరి. ఇదంతయూ మహేశునికి నివేదించెదను. అతను చెప్పినది చేసెదను. ఇట్లు నిశ్చయించుకాని మందరాచలమునకు వెళ్ళెను. శంకరునికి నమస్కరించి జరిగినదంతయూ నివేదించెను. అచట నున్న బ్రహ్మను విష్ణువును గూర్చి శివుడిట్లు పలికెను. నేను వరప్రదుడనని తెలిసి నా భక్తులు సాహసమును చేసిరి. ఓ విష్ణు అచటికి వెళ్ళి వారు చేసిన సాహసమును చేసెదను. అని పలికి వృషభము నౌరోహించి వాయువు చామరములు వీవగా, సువేషుడగు నంది కేశ్వరుడు ఛత్రమును పట్టగా ఇతరులు ధరించరాని శ్వేత హేమదండము ధరించగా మహేశ్వరుని అనుమతిని పొంది శ్రీ మహావిష్ణువు గరుడునధిరోహించెను. అరక్త నీలఛత్రములచే కౌస్తుభ శ్రీవత్సములచే శోభించెను. శివానుమతితో బ్రహ్మ కూడా హంసారూఢుడాయెను. బ్రహ్మ ఇంద్రగోపప్రభాకార చత్రములచే శోభించెను. ఇంద్రాది దేవతలందరు స్వస్వవాహనారూఢూలాయిరి. నానావిధమంగళవాద్యములు మ్రోగుచుండగా వారు బయలుదేరిరి. కోటికోటిగణములతో గౌతమాశ్రమమును చేరిరి.

బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆ పరమాద్భుతమును చూచిరి. అపుడు శంకరుడు తన వామనేత్ర నిరీక్షణచే స్వభక్తుడగు గౌతముని జీవింపచేసి గౌతమునితో ఇట్లు పలికెను. నేను నీయెడ ప్రీతి చెందితిని. వరమును కోరుము అని. ఆ శంకరుని మాటను వినిన గౌతముడిట్లు పలికెను. నీవు నాయెడ ప్రసన్నుడవైనచో నాకు వరమీయదలిచినచో నాకెప్పుడూ నీ లింగార్చనాసామర్థ్యముండనీమ్ము, ఇది ఒక వరము. ఇంకాక వరమును వినుము. ఇతను నా శిష్యుడు మహానుభావుడు. హేయ అదేయాది వర్షితుడు అహంకార మమకార రహితుడు. ఇంద్రియములను జయించినవాడు. కావుననే మహాయోగి మహాయశస్వి ఉన్మత్తవికృతాకారముచే శంకరాత్మ యని నామము గలవాడు. ఇతనిని ఎవరూ ద్వేషించరాదు. ఎవరూ హింసించరాదు. అట్లే చనిపోయిన వారికి ప్రాణములనిమ్ము. ఈ . వరమును నాకిమ్ము. ఆమాటలను వినిన శంకరుడు సంతోషించి హరిని చూచి స్వాంశమగు వాయువుచే శంకరాత్ముని దేహము నావేశంచేను. కావున శంకరాత్ముడు హరిరూపుడు వాయుపుత్రుడుగా కపిశ్రేష్టుడాయెను. అతను సాక్షాద్విష్ణువు శివుడు అని పర్యాయ పదములచే పిలువబడుచుండెను. ఇతను కల్పాంతము వరకు కామ రూపియై యుండును. నా యాజ్ఞికారియై రామభక్తుడై పూజితవిగ్రహునిగా నుండును. అనంత కల్పములు ప్రీతమానసుడై ఉండగలడు. నీవు చేసిన ఈ గృహము సుప్రతిష్ఠితముగా నుండును. నిత్యము అన్నిరూపములచే క్షణకాలము ఆదరముతో నుండగలము. ఆ పూజలనంది మా లోకములకు వెళ్ళగలము. ఆ శంకరుని మాటలను వినిన గౌతముడిట్లు పలికెను. యోగ్యము కాని దానిని ప్రార్థించుచున్నాను. యాచకుడు దోషమును చూడజాలడు. బ్రహ్మ మును లభ్యము కాని దానినడుచుచున్నాను. నచ్చినచో ఈయుము.

అథేశో విష్ణుమాలోక్య గృహీత్వా తత్కరం కరే,

ప్రహసన్నంబుబౌభాక్షమిత్యువాచ సదాశివః.

క్షామోదరోపి గోవిన్ద దేయం తే భోజనం కిము,

స్వయం ప్రవిశ్య యది వా స్వయం భుంక్ష్య స్వగేహవత్.

గచ్చ వా పార్వతీ గేహం యా కుక్షిం పూరయిష్యతి,

ఇత్యుక్త్వా తత్కరాలంబీ హ్యేకొంతమగమద్విభుః.

ఆదిశ్య నందినం దేవో ద్వారాధ్యక్షం యథోక్తవత్,

ప గత్వా గౌతమం వాథ హ్యుక్తవాన్విష్ణుభాషణమ్.

సంపాదోయాన్నం దేవేశా భోక్తుకామా వయం మునే,

ఇత్యుక్త్వైకాంతమగమద్వాసుదేవేన శంకరః.

మృదుశయ్యాం సమారుహ్య శయితౌ దేవతోత్తమౌ,

 అన్యోన్యం భాషణం కృత్వా ప్రోత్తస్థతురుభావపి.

గత్వా తటాకం గంభీరం స్నాప్యన్తౌ దేవపత్తమౌ,

 కరాంబుపాతమన్యోన్యం పృథకృత్వోభయత్ర చ.

మునయో రాక్షసాశ్చైవ జలక్రీడాం ప్రచక్రిరే,

అథ విష్ణుర్మ హేశశ్చ జలపానాని శీఘ్రతః.

చక్రతుశ్శంకరః పద్మకింజల్కాంజలినా హరేః,

అవాకిరన్ముఖే తస్య పద్మోత్ఫుల్లవిలోచనే.

నేత్రే కేశరసంహితాత్ప్రమీలయత కేశవః,

అత్రాంతరే హరేస్స్కంధమారురోహ మహేశ్వరః.

హర్యుత్తమాంగః బాహుభ్యాం గృహీత్వా సంన్యమజ్జయత్,

ఉన్మజ్జయిత్వా చ పునః పునశ్చాపి పునః పునః.

పీడితస్సహరి స్సూక్ష్మం పాతయామాప శంకరమ్,

అథ పాదౌ గృహీత్వా తం భామయన్విచకర్ష హ.

అతాడయద్ధర్వేక్షః పాతయామాప చాచ్యుతమ్,

అథోత్తితో హరిస్తోయమాదయాంజలినా తతః.

శీర్షే చైవాకిరచ్చంభుమథ శంభురథో హరిః,

జలక్రీడైవమభవదథ చర్షిగణాన్త్రరే.

జలక్రీడాసంభ్రమేణ విస్రస్తజటబంధనాః,

అథ సంభ్రమతాం తేషాం అన్యోన్యజటబంధనమ్.

ఇతరేతరబద్ధాసు జటాపు చ మునీశ్వరా,

శక్తిమంతోఽశక్తిమత ఆకర్షన్తి చ సవ్యధమ్.

పాతయన్తోఽన్యతశ్చాపి క్రోశంతో రుదతస్తథా,

ఏవం ప్రవృత్తే తుములే సంభృతే తోయకర్మణి.

ఆకాశే వానరేశస్తు ననర్త చ ననాద చ,

 విపంచీం వాదయనాద్యం లలితాం గీతిముజ్జగా.

సుగీత్యా లలితాయాస్తు అగాయత విధా దశ,

శుశ్రావ గీతిం మధురాం శంకరో లోకభావతః.

స్వయం గాతుం హి లలితం మన్దం మన్దం ప్రచక్రమే,

స్వయం గాయత్రి దేవేశే విశ్రామం గలదేశికమ్.

స్వరం ధ్రువం సమాదాయ సర్వలక్షణసంయుతమ్,

స్వధారామృతసంయుక్తం గౌనైర్నైవ  మపో నయన్.

వాసుదేవో మర్థలం చ కరాభ్యామప్యవాదయత్,

అంబుజాంగశ్చతుర్వక్త్రస్తుంబురుర్ముఖరో బభౌ.

తానకా దౌతమాద్యాస్తు గాయకో వాయు జోఽభవత్,

గాయకే మధురం గీతే హనూమతి కపీశ్వరే.

మ్లానమమ్లానమభవత్కృశాః పుష్టాప్తదాభవన్,

స్వాం స్వాం గీతిమతస్సర్వే తిరస్కృత్యైవ మూర్ఛితాః.

తూష్ణీభూతం సమభవద్దేవర్షిగణదానకమ్,

ఏకస్స హనుమాన్గాతా శ్రోతారస్సర్వ ఏవ తే.

మధ్యాహ్నకాలే వితతే గాయమానే హననుతి,

స్వస్వవాహనమారుహ్య నిర్గతాస్సర్వదేవతాః.

గానప్రియో మహేశస్తు జగ్రాహ ప్లవగేశ్వరమ్,

ప్లవగత్వం మయాజ్ఞప్తో నిశ్శంకో వృషమారుహ.

మమ చాభిముఖో భూత్వా గాయస్వానేకసాయనమ్,

ఆథాహ కపిశార్దూలో భగవంతం మహేశ్వరమ్.

వృషభారాహసామర్థ్యం తవ నాన్యస్య విద్యతే,

తవ వాహనమారుహ్య పాతకీ స్యామహం విభో.

మామేవారుహ దేవేశ విహంగశ్శివధారణః,

తవ చాభిముఖం గానం కరిష్యామి విలోకయ.

అథేశ్వరో హనూమన్తమారురోహ యథా వృషమ్,

ఆరూఢే శంకరే దేవే హనుమత్కంధరాం శివః.

ఛిత్వా త్వచం పరావృత్య సుఖం గాయతి పూర్వవత్,

శృణ్వన్గీతిసుధాం శంభుర్గౌతమస్య గృహం తతః.

సర్వే చాప్యాగతాస్తత్ర దేవర్షిగణ దానవాః,

పూజితా గౌతమేనాథ భోజనావపరే పతి.

యచ్చుష్కం దారుసంభూతం గృహోపకరణాదికమ్,

ప్రరూఢమభవత్సర్వం గాయమానే హనూమతి.

తస్మిన్గానే సమస్తానాం చిత్రం దృష్టిరతిష్ఠత.

ద్విబాహురీశస్య పదాభివందనస్సమస్తగాత్రాభరణోపపన్నః,

ప్రసన్నమూర్తిస్తరుణస్సుమధ్యే విన్యస్త మూర్ధాంజలిభిశ్శిరోభిః.

శిరః కరాభ్యాం పరిగృహ్య శంకరో హనూమతః పూర్వముఖం చకార, పద్మాసనాసీనం హనూమతంఽజలౌ నిధాయ పాదం త్వపరం ముఖే చ.

పాదాంగులిభ్యామథ నాసికాం విభుస్స్నేహేన జగ్రాహ చ మందమందమ్,

స్కంధే ముఖే త్వంసతలే చ కంఠే వక్షస్థలే చ స్తనమధ్యమే హృది.

తతశ్చ కుక్షావథ నాభిమండలే పాదం ద్వితీయం విదధాతి చాంజలౌ,

శిరో గృహీత్వావనమయ్య శంకర పస్పర్శపృష్ఠం చిబుకేన సోఽధ్వని.

హారం చ ముక్తాపరికల్పితం శివో హనూమతః కంఠగతం చకార.

అథ విష్ణుర్మహేశానమేవం వచనముక్తవాన్,

హనూమతా సమో నాస్తి కృత్స్న బ్రహ్మాండమండలే.

శ్రుతి దేవాద్యగమ్యం హి పదం తవ కపిస్థితమ్,

సర్వోపనిషదవ్యక్తం త్వత్పదం కపిసర్వయుక్.

యమదిసాధనైర్యోగైర్న క్షణం తే పదం స్థితమ్,

మహాయోగిహృదంభోజే పరం స్వస్థం హనూమతి.

వర్షకోటిసహస్రం తు సహస్రాబ్దైరథాన్వహమ్,

భక్త్యా పంపూజితోఽపీశపాదో నోదర్శితస్త్వయా.

లోకే వాదో హి సుమహాన్ శంభుర్నారాయణప్రియః,

హరిప్రియస్తథా శంభుర్నతాదృగ్భాగ్యమస్తి మే.

అంతట శివుడు విష్ణువును చూచి అతని చేతిని తన చేతిలోకి తీసుకాని నవ్వుచు విష్ణువుతో నిట్లు పలికెను. ఓ గోవిందా ! నీవు కామోదరముతో నుంటివి. నీకు భోజనము కావలయునో? నీవు స్వయముగా ఇంటిలోనికి ప్రవేశించి స్వగృహమున వలే భుజించుము. లేదా పార్వతీ గృహమునకు వెళ్ళుము. నీ కడుపును నింపును. ఇట్లు పలికి అతని చేతిని పట్టుకాని ఏకాంతమునకు వెళ్ళెను. నందిని యథాప్రకారముగా ద్వారాధ్యక్షునిగా నియమించేను. ఆనంది వెడలి గౌతమునితో విష్ణువు మాటలను తెలిపేను. అన్నమును సిద్ధము చేయుము. దేవేశులు అన్నమును భుజించగోరుచున్నారు. ఇట్లు పలికి వాసుదేవునితో శంకరుడు ఏకాంతమున చేరెను. మృదువగు శయ్యను చేరి దేవోత్తములు శయనించిరి. పరస్పరము కొంత సేపు సంభాషించి లేచిరి. తటాకమునకు వెళ్ళి స్నానము చేయుచుండిరి. ఇద్దరు చేతులతో నీరును ఒకరి పై నొకరు చల్లుకానిరి. మునులు రాక్షసులు కూడా జలక్రీడల తేలిరి. అంత విష్ణువు శంకరుడు కూడా జలపానమును చేసిరి. శంకరుడు పద్మ కింజల్క సదృశకరములతో విష్ణువు యొక్కముఖాంభోజమున చల్లెను. నేత్రములలో కేశరములు పడుటవలన శ్రీహరి నేత్రములను మూసుకానెను. ఇంతలో 'శంకరుడు హరి భుజముల నధిరోహించెను. హరి శిరమును చేతులతో పట్టుకాని ముంచెను. ఇట్లు మాటికి మాటికి ముంచుటచే పీడించబడిన శ్రీహరి శంకరుని పడవైచేను. అంతట శంకరుడు విష్ణుపాదములను పట్టుకాని తిప్పి లాగి హరివక్షమును కాట్టి అచ్యుతుని పడవైచెను. అంతట లేచిన శ్రీహరి లేచి దోసిటితో నీరు తీసుకాని శిరస్సున చల్లెను. శంభువు హరి శిరమున చల్లెను. ఇట్లు ఋషి గణమధ్యమున శివ కేశవుల జలక్రీడ సాగేను. జలక్రీడాసమాసక్తులై జటాబంధములు వీడగా ఒకరి జట మరొకరి జటతో ముడిపడెను. ఆ జటా బంధమును విడిపించుటకు శక్తిమంతులు శక్తి హీనులు అగు మునులు లాగుచుండిరి. ఒకరినొకరు పడవేయుచు, పడుచు, ఆక్రోశించుచు రోదించుచుండిరి. ఇట్లు జలక్రీడలో తుములసంరంభము జరుగుచుండగా ఆకాశమున వానరేంద్రుడు నాదము చేసి నృత్యము చేసెను. వీణను లలితముగా మీటుచు పెద్దగా పాడెను. చక్కని గీతములను పది విధములుగా పాడెను. శంకరుడు లోకభావనుడు ఆ మధురగీతమును వినేను.

తాను కూడా మెల్లమెల్లగా మధురముగా పాడ మొదలిడెను. స్వయముగా శంకరుడు మధురముగా గొంతెత్తి పాడుచుండగా ధ్రువస్వరమును సర్వలక్షణ సంయుతమును స్వధారమృత సంయుక్తమును చేసి గానముతో గానమును కలి పెను. వాసుదేవుడు చేతులతో మద్దెలను మ్రోగించేను. తుంబురుడు కూడా మెల్లగా మీ టెను. గౌతమాదులు తానమును చేసిరి. వాయుజుడు గాయకుడాయెను. ఇట్లు కపీశ్వరుడగు హనుమంతుడు మధురముగా గానము చేయుచుండగా వాడినవి చిగురించేను. కృశించినవి పుష్పములాయెను. అందరూ తమతమ గొనములనాపి దేవర్షి దానవగణము స్థిరముగా క్రియా శూన్యులుగా నిలిచిరి. ఒక్క హనుమంతుడు గానము చేయువాడు. మిగిలిన వారందరు శ్రోతలు. మధ్యాహ్నకాలమగుచండగా, హనుమంతుడు. పాడుచుండగా దేవతలందరూ తమ తమ వాహనములనధిరోహించి తమ తమ లోకములకు వెళ్ళిరి. గానప్రియుడగు మహేశ్వరుడు వానరేశ్వరుని గ్రహించెను. ఓ ప్లవ గేశ్వరా ! నీవు నా యాజ్ఞతో నిస్సందేహముగా వృషభమునధిరోహించుము. నాకభిముఖుడవై అనేక గీతములను పాడుము. అని కపీ శార్దూలుడు శివుని గూర్చి ఇట్లు పలి కెను. వృషభారోహణసామర్థ్యము నీకు తప్ప ఇతరులకు లేదు. నీవాహనమునధిరోహించినచో. నేను పాతకినగుదును. నీవు నన్ను అధిరోహించుము. నేను . ఇకఅభిముఖుడనై గానము చేసెదను. ఇట్లు పలుకగా శంకరుడు హనుమంతునధి రోహించెను. శివుడు అధిరోహించగనే హనుమంతుడు తన శిరస్సును భేదించి తిప్పి పెట్టి పూర్వము వలెనే గానము చేయుచుండెను. హనుమంతుని మధురగానమును వినుము. శివుడు గౌతముని ఇల్లు చేరెను. దేవర్షి గణదోనవులందరూ అచటికి వచ్చిరి. భోజనావసరమున గౌతముడు వారినందరిని పూజించెను. గౌతముని ఇంటిలోనున్న శుష్కదారుసంభవ గృహోపకరణములన్నియూ హనుమంతుని గానముతో చిగిర్చెను. హనుమంతుని గానమును అందరూ చిత్తరులవలె వినుచు చూడసాగిరి. హనుమంతుడు ద్విబాహువు. శివపోదాభివందనమును చేయుచు, సమస్తాభరణభూషితుడై ప్రసన్నాకారముతో తరుణుడుగా నుండగా మిగిలిన వారందరు శిరమున చేతులు జోడించియుండిరి. శంకరుడు హనుమంతుని శిరమును చేతులతో పట్టుకాని యథాపూర్వముగా చేసెను. పద్మాసనాసీనుడగు హనుమంతుని అంజలిలో ఒకపాదము నుంచి, మరియొక పాదమును ముఖమున నుంచి, పాదాంగుళులచే నాసికను స్నేహముతో పట్టుకానెను. స్కంధమున ముఖమున, భుజమున కంఠమున వక్షస్థలమున, స్తనమధ్యమున, హృదయమున, కుక్షీయందు, నాభిమండలమున, పాదము నుంచుచు, రెండవ పాదమును దోసిట నుంచుచు శిరస్సును పట్టుకాని వంచుచు ప్పష్టమును చిబుకముతో సుశీంచెను. అట్లే ముక్తాహారమును. హనుమంతుని కంఠమున వేసెను. దానినంతటిని చూచుచున్న విష్ణువు శంకరునితో నిట్లు పలికెను. ఈ బ్రహ్మాండమునందంతటా హనుమత్సముడు మరియొకడు లేడు. శ్రుతులను దేవతలకు గోచరముకాని నీ పాదము హనుమంతుని శరీరమున నిలిచినది. సర్వోపనిషత్తులకు అందని నీ పాదము కపీశ్వరుని చేరినది. యమాదిసాధనములచే కూడా యోగుల హృదయపద్మమున నిలువని నీ పాదము హనుమంతుని యందు స్థిరముగా నిలిచినది. వేలకోట్ల సంవత్సరములు పూజించిననూ నీపాదదర్శనము కలుగదు. లోకమున శివుడు నారాయణప్రియుడని నారాయణుడు శివప్రియుడని అనుకొందురు. కాని నాకా భాగ్యము కలుగలేదు.

తచ్భుత్వా వచనం శంభుర్విష్ణోః ప్రాహ ముదాన్వితః,

న త్వయా సదృశో మహ్యం ప్రియోఽన్యోఽస్తి హరే క్వచిత్.

పార్వతీ వా త్వయా తుల్యా వర్తనేనైవ భిద్యతే,

అథ దేవాయ మహతే గౌతమః ప్రణిపత్య చ.

వ్యజిజ్ఞపదమేయాత్మన్దేవైర్హి కరుణానిధే,

మధ్యాహ్నోఽయం వ్యతిక్రౌంతో భుక్తివేలాఖిలస్య చ.

అథాచమ్య మహాదేవో విష్ణునా సహితో విభుః, ప్రవిశ్య గౌతమగృహం భోజనాయోపచక్రమే.

రత్నాంగులీయైరథ నూపురాభ్యాం దుకూలబంధేన తడిత్సుకాంచ్యా,

హారైరనేకైరథ కంఠనిష్కయజ్ఞోపవీతోత్తర వాసపీ చ.

విలంబిచంచన్మణికుండలేన సుపుష్పధమ్మిల్లవరేణ చైవ,

పంచాంగగంధస్య విలేపనేన బాహ్వంగదైః కంకణకాంగులీయైః.

అథో విభూషితశ్శివో నివిష్ట ఉత్తమాపనే,

స్వసంముఖం హరిం తథా న్య వేశయద్వరాసనే.

దేవశ్రేష్టౌ హరీశౌ తావన్యోన్యాభిముఖస్థితా,

సువర్ణభాజనస్థాన్నం దదౌ భక్త్యా స గౌతమః.

త్రింశత్ప్రభేదాన్భక్ష్యాంపు పాయసం చ చతుర్విధమ్,

సుపక్వం పాకజాతం చ కల్పితం యచ్ఛతద్వయమ్.

అపక్వం మిశ్రకం తద్ద్వాత్రింశకం పరికల్పితమ్,

శతం శతం సుకందానాం శాకానాం చ ప్రకల్పితమ్.

పంచవింశతిధా సర్పి సంస్కృతం వ్యంజనం తథా,

శర్కరాద్యం తథా చూతమోచాఖర్జూరదాడిమమ్.

ద్రాక్షేక్షునాగరంగం చ మిష్టం పక్వం ఫలోత్కలమ్,

ప్రియాలకం జంబుఫలం వికంకతఫలం తథా.

ఏవమాదీని చాన్యాని ద్రవ్యాణీశే పమర్ప్య చ,

దత్త్వాపోశనకం విప్రో భుంజర్వతి చాబ్రవీత్.

భుంజానేషు చ సర్వేషు వ్యజనం సూక్ష్మవిస్తృతమ్,

 గౌతమస్స్వయమాదాయ శివవిష్ణు అవీజయత్.

పరిహాపమథో కర్తుమియేష పరమేశ్వరః,

పశ్య విష్ణో హనూమన్తం కథం భుంక్తే స వానరః.

వానరం పశ్యతి హరౌ మండకం విష్ణుభాజనే,

చిక్షేప మునిసంఘేషు పశ్యత్స్వపి మహేశ్వరః.

హనూమతే దత్తవాంశ్చ స్వోచ్చిష్టం పాయసాదికమ్,

త్వదుచ్ఛిష్టమభోజ్యం తు తవైవ వచనాద్విభో.

అనర్హం మమ నైవేద్యం పత్రం పుష్పం ఫలాదికమ్,

మహ్యం నివేద్య సకలం కూప ఏవ వినిక్షిపేత్.

అభుక్తే త్వద్వచో నూనం భుక్తే చాపి కృపా తవ,

బాణలింగే స్వయంభూతే చంద్రకాంతే హృది స్థితే.

చాంద్రాయణసమం జ్ఞేయం శంభో నైవేద్యభక్షణమ్,

భుక్తివేలేయమధునా త్వద్వైరస్యం కథాంతరాత్.

భుక్త్వా తు కథయిష్యామి నిర్విశంకం విభుంక్ష్వతత్,

అథాసౌ జలసంస్కారం కృతవాన్ గౌతమో మునిః.

ఆరక్తసుస్నిగ్దసుసూక్ష్మగాత్రాననేకధా దౌతసుశోభితాంగాన్,

తటాకతోయైః కతబీజధర్షితైర్విశోధితైస్త్సైః కరకా నపూరయత్.

నద్యాస్సైకతవేదికాం నవతరాభాద్య సూక్ష్మాంబరైః,

శుద్ధైశ్శ్వేతతరైరధోపరి ఘటాంన్త్రయేన పూర్ణాన్క్ష్కి పేత్.

లిప్తానాలకజాతి మాస్తపుటకం తత్కాలకంకారికా,

చూర్ణం చన్దన చన్ద్ర రశ్మి విశదాం మాలాం పుటాంత్ క్షిపేత్.

యామస్యాపి పునశ్చ వారివసనే నాశోధ్య కుంభేన తత్,

చన్ద్రగ్రంథిమధో నిధాయ వకులం క్షిప్త్వా తథా పాటలమ్.

శేఫాలీస్తమకమధో జలం చ తత్ర విన్యస్య ప్రధమత ఏవ తోయశుద్దిమ్,

కృత్వా ధోమృదుతర సూక్ష్మవస్త్రఖండేనావేష్టేతృణికముఖంచ సూక్ష్మచంద్రమ్.

అనాతపప్రదేశే తు నిధాయ కరకానధ,

మన్దవాత సమోపేతే సూక్ష్మవ్యజనవీజితే.

సించేచ్చితేర్జలైశ్చాపి వాసితై స్పృణీకామపి,

సంస్కృతా స్వాయతాస్తత్ర నరా నార్యోఽధవా నృపాః.

తత్కన్యావా క్షాలితాంగా ధౌతా పాదాసువాససః, మధుపింగమనిర్యాసమసాంద్రమగురూద్భవమ్.

బాహుమూలే చ కంఠే చ విలీప్యాసాంద్రమేవ చ,

మస్తకే జాపకం న్యస్య పంచగంధవిలేపనమ్.

పుష్పనద్ధసు కేశాస్తు తాశ్శుభాస్యుస్సునిర్మలాః,

ఏవమేవార్చితానార్య ఆప్తకుంకుమవిగ్రహాః.

యువత్యశ్చారుసర్వాంగ్యో నితరాంభూషణైరపి,

ఏతాదృగ్వనితాభిర్వా నరైర్వా దాపయేజ్జలమ్.

తేఽపి ప్రాదానసమయే సూక్ష్మవస్త్రాల్పవేష్టనమ్,

 అథవామకరే న్యస్య కరకం ప్రేక్ష్య తత్ర హి.

దారికాన్యస్తమున్ముచ్య తతస్తోయం ప్రదాపయేత్,

ఏవం స కారయామాస గౌతమో భగవానునికి.

మహేశాదిషు సర్వేషు భుక్తవత్సు మహాత్మసు,

 ప్రక్షాలితాంఘ్రహస్తేషు గంధద్వర్తితపాణీషు.

ఉచ్చాసనసమాసీనే దేవదేవే మహేశ్వరే,

అథనీచసమాసీనా దేవాస్సర్షిగమాస్తథా.

మణిపాత్రేషు సంవేష్ట్య పూగఖండాన్సుధూపితాన్, కోణాన్వర్తులాన్సూల్దానసూక్ష్మానకృశానపి.

శ్వేత పత్రాణి సంశోధ్య క్షిప్త్వా కర్పూర ఖండకమ్,

చూర్ణం చ శంకరాయాథ నివేదయతి గౌతమే.

గృహాణ దేవతాంబూలమిత్యుక్తవచనే మునౌ,

కపే గృహాణ తాంబూలం ప్రయచ్ఛ మమ ఖండకాన్.

ఉవాచ వానరో నాస్తి మమ శుద్ధిర్మహేశ్వర,

నేకఫలభోక్తృత్వాదానరస్తు కథం శుచః.

తచ్ఛ్రుత్వా తు విరూపాక్షః ప్రాహ వానరసత్తమమ్,

మద్వాక్యాదఖిలం శుద్ధేన్మద్వాక్యాదమృతం విషమ్.

మద్వాక్యాదఖిలా వేదా మద్వాక్యాద్దేవతాదయః,

 మద్వాక్యాద్ధర్మవిజ్ఞానం మద్వాక్యానోక్ష ఉచ్యతే.

పురాణాన్యాగమాశ్చైవ స్మృతయో మమ వాక్యతః,

అతో గృహాణ తాంబూలం మమ దేహి సుఖండకాన్.

హరిర్వామకరేణాథాత్తాంబూలం పూగఖండకమ్,

తతః పత్రాణి సంగృహ్య తస్మై ఖండాన్సమర్పయత్.

కర్పూరమగ్రతో దత్తం గృహీత్వాభక్షయచ్ఛివః,

దేవే తు కృతతాంబూలే పార్వతీ మందరాచలాత్.

జయావిజయయోర్హస్తం గృహీత్వాయాన్మునేర్గృహమ్,

దేవపాదౌ తతో నత్వా వినమ్రవదనా భవత్.

ఉన్నమయ్య ముఖం తస్యా ఇదమాహా త్రిలోచనః,

 త్వదర్ధం దేవదేవేశి అపరాధః కృతో మయా.

యత్త్వాం విహాయ భుక్తం హి తధాన్యచ్ఛృణు సుందరి,

యత్త్వాం స్వమందిరే త్యక్త్వా మహదేనో మయాకృతమ్.

క్షస్తుమర్హసి దేవేశి త్యక్తకోపా విలోకయ,

న బభాషేఽప్యేవముక్తా సారుంధత్యా వినిర్యయా.

నిర్గచ్ఛన్తీం మునిర్జాత్వా దండవతణనామ హ,

అథోవాచ శివా తం చ గౌతమ త్వం కిమిచ్ఛసి.

ఆథాహ గౌతమో దేవీం పార్వతీం ప్రేక్ష్య పస్మితామ్,

కృతకృత్యో భవేయం వై భుక్తాయాం మద్గృహే త్వయి.

తతః ప్రొహా శివా విప్రం గౌతమం రచితాంజలిమ్,

భోక్ష్యామి త్వద్గృహే విప్ర శంకరానుమతేన వై.

అథ గత్వా శివం వింశే లజ్ఞానుజ్ఞ స్త్వరోగతః,

భోజయామాస గిరిజాం దేవీం చారుంధతీ తథా.

భుక్త్వాథ పార్వతీ సర్వగంధపుష్పాద్యలంకృతా,

సహానుచరకన్యాభిస్సహస్రాభిర్హరం యయౌ.

అథాహ శంకరో దేవీం గచ్ఛ గౌతమమందిరమ్,

సంధ్యోపాస్తిమహం కృత్వా హ్యాగమిష్యే తవాంతీకమ్.

ఇత్యుక్తా ప్రయయౌ దేవీ గౌతమస్స్యైవ మందిరమ్,

సంధ్యావందనకామాస్తు సర్వ ఏవ వినిర్గతాః.

కృతపంధ్యాస్తటాకే తు మహేశాద్యాశ్చ కృత్స్నశః,

 అధోత్తరముఖశ్శంభుర్న్యాసం కృత్వా జజాప హ.

అథ విష్ణుర్మహాతేజా మహేశమిదమబ్రవీత్,

సర్వైర్నమస్యతే యస్తు సర్వైరేవ సమర్ప్యతే.

హూయతే సర్వయజ్ఞేషు ప భవాన్కింజపిష్యతి,

రచితాంజలయస్సర్వే త్వామేవైకముపాపతే.

స భవాన్దేవదేవేశః కస్మై విరచితాంజలిః,

నమస్కారాది పుణ్యానాం ఫలదస్త్వం మహేశ్వరః.

తవ కః ఫలదో వంద్యః కో వా త్వత్తోఽధికో వద,

 తచ్ఛ్రుత్వా శంకరః ప్రాహ దేవదేవం జనార్ధనమ్.

ఇట్లు పలికిన విష్ణువు మాటలను విని శంకరుడు సంతోషముతో ఇట్లు పలికెను. నీతో సముడగు ప్రియుడు మరియొకడు లేడు. నీతో సమప్రియత్వము ఒక పార్వతిలో యున్నది. మీ ఇద్దరి ప్రీతిలో నాకు భేదము లేదు. అంతట గౌతముడు మహాదేవునకు నమస్కరించి ఇట్లు విజ్ఞాపన చేసెను. ఓ కరుణానిధీ ! మధ్యాకాలము దాటుచున్నది. అందరికి ఇది భోజన వేల. అంతట మహాదేవుడు ఆచమనము చేసి విష్ణువుతో కలిసి గౌతమగృహమును ప్రవేశించి భోజనమునకుపక్రమించెను. రత్నాంగులీయములచే నూపురములచే, దుకూల బంధముచే, మెరుపు వంటి కాంచీ సూత్రము, బహువిధహారములచే, కంఠనిష్కుయజ్ఞోపవీతోత్తరీయములచే మెరయుచు వ్రేలాడుచున్న కుండలములచే సుపుష్పధమ్మిల్లవరముచే, పంచాంగగంధవిలేపనముచే, బాహ్వాంగదములచే, కంకణాంగులీయములచే అలంకరించబడిన శివుడు ఉత్తమాసనమున కూర్చొని, తనకు సమ్ముఖముగా ఉత్త మాసనమున శ్రీహరిని కూర్చోబెట్టెను. ఇట్లు దేవ శ్రేష్టులగు హారీశులు అన్యోన్యాభి ముఖమముగా కూర్చోనిరి. గౌతముడు భక్తితో వారికి సువర్ణభోజనమున అన్నము పెట్టెను. ముప్పది విధముల భక్ష్యములను, నాలుగు విధముల పాయసమును, చక్కగా కల్పించబడిన రెండు వందల పాకజాతమును, అపక్వమును మిశ్రమమును ముప్పది రెండు విధములుగా కల్పించబడిన దానిని నూరు నూరు విధముల చక్కని కందములచే శాకములచే కల్పించబడినదానిని నేతితో చేయబడిన ఇరువదియైదు విధముల వ్యంజనములను, శర్కరాదికమును, మామిడి అరటి దొడిమ, ద్రాక్ష, చెరుకు, నాగరంగ మొగలగు ఫలములను మీషాన్నమును, పక్వాన్నములను, ప్రియాలక జంబూ వికంతర ఫలములను ఇటువంటి ఇతర ద్రవములను ఈశ్వరునికి సమర్పించి ఔపోశానకమునిచ్చి భుజించుడని పలికెను. అందరూ భుజించుచుండగా సూక్ష్మవిస్తృతమగు వ్యజనమును తీసుకాని, స్వయముగా గౌతముడు శివ విష్ణువులకు వీచెను. అంతటా పరమేశ్వరుడు పరిహాసమును చేయకోరెను. ఓ వీస్తూ హనుమంతుడెట్లు తినుచున్నాడో చూడుము అని పలికెను. అట్లు విష్ణువు హనుమంతుని చూచుచుండగా మహేశ్వరుడు మునులందరూ చూచుచుండగనే ఒక మండకమును విష్ణుబోజన పాత్రలో పడవేసెను. స్వోచ్చిష్టమగు పాయసాదికమును హనుమంతునికిచ్చెను. అంతట హనుమంతుడు ఓ ప్రభూ నీ మాటలవలననే నీ ఉచ్ఛిష్టమును భుజించరాదు. నా నైవేద్యమగు పత్ర పుష్పఫలాదికము అభోజ్యము. నాకు నివేదన చేసినదంతయూ బావిలో పడవేయవలయును. తిననిచో నీ మాట సత్యమగును. తినినచో నీ యనుగ్రహము కలుగును. స్వయంభూతుడగు బాణలింగుడు చంద్రకాంతుడు హృదయమున నుండగా శంభునైవేద్య భక్షణము చాంద్రాయణసమమని తెలియుము. అని పలుకగా శంకరుడు, ఇపుడిది భోజన సమయము. ఇపుడు వేరే మాటలు వైరస్యమును కలిగించును. భోజనము చేసిన తరువాత చెప్పెదను. నిశ్శంకగా భోజనము చేయుము. అని పలికెను. అంతట గౌతముడు జలసంస్కారమును చేసెను. ఆరక్తసుస్నిగ్గసుసూక్ష్మ గోత్రములను పలుమార్లు పరిశుద్ధములుగా చేయబడుటచే బాగుగా శోభించుచున్న అంగములను, కతబీజములచే కలచిన తటాకతోయములచే విశోధితములుగా చేయబడిన వాటిచే కరకములను నిం పెను. క్రొత్తనదీ సైకత వేదికను శుద్ధమైన సూక్ష్మాంబురములచే కప్పి, తోయపూర్ణములైన ఘటములను ప్రతిష్టించి నాలకజాతిని అస్తపుటకమును వ్రాసి, కీలకంకారికాచూర్ణమును పూసి చందన చంద్ర రశ్మి విశదమైన మాలను పుటాంతముగా నుంచవలయును. యామభాగమున కూడా నీటితో వస్త్రముచే శోధించి, కుంభమును. ప్రతిష్టించి, చంద్రగ్రంథిని క్రిందిభాగమున ఉంచి, పాటలవకుళమునుంచి, శేఫాలీస్తబకమునుంచి, నీటిని పోసి, మొదట జలమును శుద్ధిపరిచి, మృదుతరము సూక్ష్మవస్త్రమును ఆవేష్టనము చేసి, ఆతపములేని ప్రదేశమున కరకములనుంచి, మంచి మారుతముగల సూక్ష్మవ్యజనముచే వీచబడిన దానిని సువాసనగల శీతజలములను చల్లవలయును. మనో నిగ్రహము గలవారు సుసంస్కృతులగు నరులు, నారీజనము, రాజులు, వారి కన్యలు కాని, క్జాలితాంగులు, దౌతపాదులై మంచి వస్త్రములను ధరించి, బాహమూలమునందు కంటమునందు సువాసన చందనాగురువులను పూసుకాని, మస్త కమున జపాపుష్పమును ధరించి, పంచగంధ విలేపనముగావించి, కేశములందు పుష్పబంధములను దాల్చి నిర్మలులై కుంకుమాది ద్రవ్యములను దాల్చినవారై పూజించబడిన నరులు, సౌందర్యవతులగు యువతులు భూషణములచే భూషితులైన స్త్రీలచేకాని పురుషులచేకాని నీటినిపించవలయును. వీరు కూడా జలప్రధాన సమయమున సూక్ష్మవస్త్రపరివేష్టితులై వామకరమున కరకమునుంచి అచట దోరికాన్యస్తమును వదిలి నీటినీయవలయును. గౌతముడిట్లు అంతటిని చేయించేను. మహాత్ములగు మ హేశాదులు భుజించి హస్తపాదప్రక్షాలనము చేసుకాని, గందొదులు లేపనము గావించుకాని దేవేశ్వరుడగు మహేశ్వరుడు ఉచాసీనుడు కోగా నీచాసనమున మిగిలిన వారు ఆసీనులైరి. మణిఖచితపాత్రలందు కోణములు లేనివి, గుండ్రనివి, స్టూలములు, సూక్ష్మములు కానివి, కృశములు కానివీ, సూధూపితములగు పూగఖండములనుంచి, శ్వేత పత్రములను శుద్దిపరిచి కర్పూర ఖండములనుంచి చూర్ణమునుంచి శంకరునికీ గౌతముడు పెంచి ఓ దేవా తాంబూలముమ స్వీకరించుమని గౌతముడు పలుకుచుండగా శంకరుడు ఓ కపీశ్వరో ఈ తాంబూలమును నీవు స్వీకరించి నొకు. పూగఖండములనిమ్ము అని పలికెను. ఓ మ హేశ్వరా నాకు పరిశుద్ది లేదు. బహు విధములగు ఫలములను భుజించు వొనరులకు పరిశుద్ధి ఎక్కడిది. అని పలి కెను. ఆ మాటను వినిన శంకరుడు కపీశ్వరునితో ఇట్లు పలికెను. నామాట వలన అంతయు శుద్ధి పొందును. నామాటవలన అమృతము కూడా విషమగును. నామాట వలననే వేదములు దేవతాదులు, నామాటవలననే ధర్మ జ్ఞానము కలుగును. నామాట వలననే మోక్షము లభించును. పురాణములు, ఆగమములు స్మృతులు కూడా నామాటవలననే ఏర్పడును. కావున తాంబూలమును గ్రహించుము. పూగఖండములనిమ్ము. అని పలికెను. అంతట కపీన్దుడు వామకరముచే తాంబూలమును గ్రహించేను. పత్రములను సంగ్రహించి శంకరునికి పూగఖండములనిచ్చేను. మొదట ఇచ్చిన కర్పూరమును శంకరుడు భక్షించెను. ఇట్లు శంకరుడు తాంబూలభక్షణము చేయగనే మందరాచలమునుండి పార్వతీదేవి జయవిజయల హస్తములను పట్టుకాని గౌతముని గృహమునకాచ్చి దేవపాదములకు నమస్కరించి ముఖము వంచి నిలబడెను. అంతట శంకరుడు పార్వతీదేవి ముఖమును పైకెత్తి ఇట్లు పలికెను. నీ విషయమున నేను అపరాధమును చేసితిని. నిన్ను విడిచి భోజనము చేసితిని. అట్లే నిన్ను స్వమందిరమున విడిచి నేను గొప్పతప్పును చేసితిని. నన్ను క్షమించి కోపమును విడిచి చూడుము. ఇట్లు పలికిననూ పార్వతి మాటలాడక అరుంధతితో కలిసి బయలు వెడలేను.. అట్లు పార్వతి వెడలుట చూచీ గౌతమ మహర్షి దండవత్సణామమునాచరించెను. అపుడు పార్వతి గౌతముని గూర్చి నీవేమి కోరుచుంటివని అడిగెను. అపుడు చిరునవ్వుతో నున్న పార్వతి గౌతమ మహర్షి, నీవు నొఇంటిలో భుజించినచో కృతకృత్యుడనౌదును అని పలికెను. అపుడు అంజలి బద్దుడగు , గౌతముని చూచి శంకరుడు అనుమతించినచో భుజించేదనని పలి కెను. అంతట గౌతముడు శివుని నుండి అనుమతి పొంది త్వరగా వచ్చెను. పార్వతిని అరుంధతిని భోజనము చేయించెను. అట్లు భుజించిన పార్వతి సర్వగంధ పుష్పాలంకృతయై సహస్ర అనుచర కన్యలచే శివుని చేరెను. అంతట శంకరుడు ఓ దేవా నీవు గౌతమ మందిరమునకు వెళ్ళుము. నేను సంధ్యోపాసన గావించి నీ వద్దకు వచ్చెదను అని పలికెను. ఆ మాటతో పార్వతీదేవి గౌతమ మందిరమునకు వెళ్ళెను. సంధ్యావందనము చేయగోరి అందరూ బయలుదేరిరి. మహేశాదులు తటాకమునందు సంధ్యవార్చిరి. శంకరుడు ఉత్తరముఖుడై న్యాసమును గావించి జపించెను. అంతట మహాతేజస్వియగు విష్ణువు మహేశునిట్లు పలి కెను. అందరిచే నమస్కరించబడు నీవు, అందరిచే పూజించబడు నీవు, యజ్ఞములు ఎవరి నీకారకు చేయబడునో అట్టి నీవు, దేనిని జపించు చుంటివి? చేతులు జోడించి అందరూ నిన్నే ఉపాసించేదరు. అట్టి దేవదేవేశుడవగు నీవు ఎవరికి చేతులు జోడించు చుంటివి? నమస్కారాది పుణ్యములకు ఫలమునిచ్చునది నీవు. నీకు ఫలమునిచ్చు వాడెవడు? నీకు నమస్కరించదగిన వాడెవడు ? నీకంటే అధికుడెవరు ? నాకు చెప్పుము. ఆమాటలను వినిన శంకరుడు విష్ణువుతో నిట్లు పలికెను.

ధ్యాయే న కంచిద్గోవిన్ద ! నమప్యేహం న కించన,

కింతు నాస్తికజంతూనాం ప్రవృత్త్యర్థమిదం మయా.

దర్శనీయం హరే చైతదన్యధా పాపకారిణః,

తస్మాల్లోకోపకారార్ధమిదం సర్వం కృతం మయా.

ఓమిత్యుక్త్వా హరిరథ తం నత్వా పమతిష్ఠత,

ఆథ తే గౌతమగృహప్రాప్తా దేవర్షయస్తథా.

సర్వే పూజామథో చక్రుర్దేవదేవాయ శూలినే,

దేవో హనుమతా సార్ధం గాయన్నాస్తే మహేశ్వర.

పంచాక్షరీం మహావిద్యాం సర్వ ఏవ తదాఽజపన్,

హనుమత్కరమాలంబ్య దేవాభ్యాం సంగతో హరః.

ఏకశయ్యాసమాసీనౌ తావుభౌ దేవదంపతీ,

 గాయన్నాస్తే చ హనుమాంస్తుంబురుప్రముఖాస్తథా.

నానావిధవిలాసాంశ్చ చకార పరమేశ్వరః,

ఆహూయ పార్వతీమీశ ఇదం వాక్యమువాచ హ.

రచయిష్యామి ధమ్మిల్లమేహి మత్పురత శ్శుభే,

దేవ్యాహ న చ యుక్తం తద్భర్త్రా శుశ్రూషణం స్త్రియః.

కేశప్రసాధన కృతా వనార్ధాంతర మాపతేత్,

కేశప్రసాధనే దేవతత్త్వం సర్వం న చేప్సితమ్.

అథ బంధే కృతే పశ్చాదంపప్రానప్రమార్జనమ్,

తతశ్చరమసంలగ్న కేశపుష్పాదిమార్జనమ్.

ఏతస్మిన్వర్తమానే తు మహాత్మా నో యదాగమన్,

 తదా కిముత్తరం వాచ్యం తవ దేవాదివందిత.

నాయాన్తి చేదథ విభో ! భీతిర్నాశముపైష్యతి,

ఏవం హి భాషమాణాం తాం కరేణాకృష్య శంకరః.

స్వోరోస్సంస్థాపయిత్త్యైవ విప్రస్య కచబంధనమ్,

విభజ్య చ కరాభ్యాం స ప్రసార నఖైరపి.

విష్ణుదత్తాం పారిజాతస్రజం కచగతామపి,

కృత్వా ధమ్మిల్లమకరోదథ మాలాం కరాగతామ్.

మల్లికాస్రజమాదాయ బబన్ద కచబన్దనే,

కల్పప్రసూనమాలాం చ బ్రహ్మదత్తాం మహేశ్వరః.

పార్వతీవసనే గూఢగంధాఢ్యే చ సమాదదాత్,

అథాసంపృష్టసంలగ్నమార్జనం కృతవాన్ప్రభుః.

శ్లధన్నీవీరథో దేవ్యా వస్త్రవేష్టాదధో గతః,

 కిమిదం దేవి చేత్యుక్త్వా నీవీబంధం చకార హి.

నాసాభూషణమేతత్తే సత్యమేన వదామి తే,

తతః ప్రాహ శివా శంభుం స్మిత్వా పర్వతనందినీ.

అహో త్వన్మన్దిరే శంభో సర్వవస్తుసమృద్ధిమత్,

 పూర్వమేవ మయా పర్వం జ్ఞాతప్రాయమభూత్కిల.

సర్వద్రవిణసంపత్తిర్భూషణైరవగమ్యతే,

శిరో విభూషితం దేవ బ్రహ్మ శీర్షస్య మాలయా.

నరకస్య తథా మాలా వక్షస్థలవిభూషణమ్,

శేషశ్చ వాసుకిశ్చైవ సవిషౌ తవ కంకణౌ.

దిశోంఽబరం జటాః కేశా భోపితం చాంగరాగకమ్,

మహోక్షో వాహనం గోత్రం కులం చాజ్ఞాతమేవ చ.

జ్ఞాయతే పితరో నైవ విరూపాక్షం తథా వపుః,

ఏవం వదంతీం గిరిజాం విష్ణుః ప్రాహాతికోపనః.

కీమర్థం నిందసే దేవి ! దేవదేవం జగత్పతిమ్,

దుష్ప్రాణా న ప్రియా భద్రే తవ నూనమపంయమాత్.

యత్రేశనిన్దనం భద్రే తత్ర నో మరణం వ్రతమ్,

 ఇత్యుక్త్వాథ నఖాభ్యాం హి హరిశ్చేత్తుం శిరో గతః.

మహేశస్తత్కరం గృహ్య ప్రాహ మా సాహసం కృథాః,

పార్వతీవచనం సర్వం ప్రియం మమ న చాప్రియమ్.

మమాప్రియం హృషేకేశ కర్తుం యత్కించిదిష్యతే,

ఓమిత్యుక్త్వాథ భగవాంస్తూష్ణీభూతోఽభవద్ధరిః.

హనుమానథ దేవాయ వ్యజ్ఞాపయదీపం వచః,

ఆర్థయామి వినిష్కామం మమ పూజావ్రతం తథా.

పూజార్థమప్యహం గచ్ఛే మామనుజ్ఞాతుమర్హసి,

తచ్ఛ్రుత్వా శంకరో దేవస్స్మిత్వా ప్రాహ కపీశ్వరమ్.

కస్య పూజా క్వ వా పూజా కిం పుష్పం కిం దలం వద,

కో గురుః కశ్చ మంత్రస్తే కీదృశం పూజనం తథా.

ఏవం వదతి దేవేశ హనుమాన్నీతిసంయుతః,

వేపమానపసమస్తాంగః స్తోతుమేవం ప్రచక్రమే.

నమో దేవాయ మహతే శంకరాయామితాత్మనే,

యోగినే యోగధాత్రే చ యోగినాం గురవే నమః.

యోగగమ్యాయ దేవాయ జ్ఞానినాం పతయే నమః,

వేదానాం పతయే తుభ్యం దేవానాం పతయే నమః.

ధ్యానాయ ధ్యానగమ్యాయ ధ్యాతౄణాం గురవే నమః,

అష్టమూర్తే నమస్తుభ్యం పశూనాం పతయే నమః.

అంబకాయ త్రినేత్రాయ సోమసూర్యాగ్ని చక్షు షే,

సుభృంగరాజధత్తూరద్రోణపుష్పప్రియస్య తే.

బృహతీపూగపున్నాగచంపకాదిప్రియాయ చ,

నమస్తేఽస్తు నమస్తేస్తు భూయ ఏవ నమో నమః.

శివో హరిమథ ప్రాహ మాభైషీర్వద మేఽఖలమ్,

తతస్త్యక్త్వా భయం ప్రాహ హనుమాన్వాక్యకోవిదః.

శివలింగార్చనం కార్యం భస్మోద్ధూలితదేహినా,

దివా సంపాదితైస్తోయైః పుష్పాద్యైరపి తాదృశైః.

దేవ విజ్ఞాపయిష్యామి శివపూజావిధిం శుభమ్,

సాయంకాలే తు సంప్రాప్తే అశిరస్స్నానమాచరేత్.

క్షాలితం వపనం శుష్కం ధృత్వాచమ్య త్రిరన్యధీః,

అథ భస్మ సమాదాయ ఆగ్నేయం స్నానమాచరేత్.

ప్రణవేన సమామన్త్య్ర అష్టవారమథాపి వా,

పంచాక్షరేణ మంత్రేణ నామ్నా వా యేన కేనచిత్.

సప్తభిర్మన్త్రితం భస్మ దర్భపాణిస్సమాహత్,

ఈశానస్సర్వవిద్యానాముక్త్వా శిరసి పాతయేత్.

తత్పురుషాయ విద్మహే ముఖే భస్మ ప్రసేచయేత్,

అఘోరేభ్యోఽథ హోరేభ్యో భస్మ వక్షసి నిక్షిపేత్.

వామదేవాయ నమః ఇతి గుహ్యస్థానే వినిక్షిపేత్,

సద్యోజాతం ప్రపద్యామి నిక్షిపేదథ పాదయోః.

ఉర్దూలయేత్సమస్తాంగం ప్రణవేన విచక్షణాః,

త్రైవర్ణికానాముదితః స్నానాదినిధిరుత్తమః.

శూద్రాదీనాం ప్రవక్ష్యామి యదుక్తం గురుణా తథా,

శివేతి పదముచ్చార్య భస్మ సంమన్త్రయేత్సుధీః.

సప్తవారమథాదాయ శివాయేతి శిరస్యథ,

శంకరాయ ముఖే ప్రోక్తం సర్వజ్ఞాయ హృది క్షిపేత్.

స్థాణవే నమ ఇత్యుక్త్వా ముఖే చాపి స్వయంభువే,

ఉచ్చార్య పాదయోః క్షిప్త్వా భస్మశుద్దమతః పరమ్.

నమశ్శివాయేత్యుచ్చార్య సర్వాంగోద్దూలనం స్మృతమ్,

ప్రక్షాల్య హస్తావాచమ్య దర్భపాణిస్సమాహితః.

దర్భాభావే సువర్ణం స్యాత్తదభావే గవాలుకాః,

తదభావే తు దూర్వాస్స్యుస్తదభావే తు రాజతమ్.

సంధ్యోపాస్తిం జపం దేవ్యాః కృత్వా దేవగృహం వ్రజేత్,

దేవవేదీమథో వాపి కల్పితం స్థండిలం తు వా.

మృణ్మయం కల్పితం శుద్ధం పద్మాదిరచనాయుతమ్,

చాతుర్వర్ణకరంగైశ్చ శ్వేతేనైకేన వా పునః.

విచిత్రాణి చ పద్మాని స్వస్తికాది తథైవ చ,

ఉత్పలాసీగదాశంఖత్రిశాలడమరూంస్తథా.

శరోక్త పంచప్రాసాదం శివలింగమథైవ చ,

సర్వకామఫలం వృక్షం కులకం కోలకం తథా.

షట్కోమం చ త్రికోణం చ నవకోణమథాపి వా,

కోణే ద్వాదశకాoదోలా పాదుకా వ్యజనాని చ.

చామరచ్ఛత్రయుగలం విష్ణుబ్రహ్మదికాంస్తథా,

చూర్ణైన్విరచయేద్వేద్యాం ధీమాన్దేవాలయేపి వా.

యత్రాపి దేవపూజా స్యాత్తత్రైవం కల్పయేత్సుధీః,

సవహస్తరచితం ముఖ్యం క్రితం చైవ తు మధ్యమమ్.

యాచితం తు కనిష్ఠం స్యాదలాత్కారమథోఽధమమ్,

అర్హేషు యత్త్వనర్హేషు బలాత్కారాత్తు నిష్పలమ్.

రక్తశాలిజపాశాణకలమాసితరక్తకైః

తందులైర్వ్రీహిమాత్రోత్ధైః కణైశ్చైవ యథాక్రమమ్.

ఉత్తమైర్మధ్యమైశ్చైవ కవిష్ఠైరథమైస్తథా,

 పద్మాది స్థాపనైరేవ తత్సమాగ్యాగమాచరేత్.

ప్రాగుత్తరముఖో వాపి యది వా పాఙ్ముఖే స్థితః,

ఆసనం చ ప్రవక్ష్యామి యథాదృష్టం యథాశ్రుతమ్.

ఓ గోవిందా ! నేనెవరినీ ధ్యానించుటలేదు. ఎవరికీ నమస్కరించుట లేదు. కాని నాస్తికుల ప్రవృత్తి కాఱకు ఇట్లాచరించి చూపవలయును లేనిచో లోకులు పాపాచారులగుదురు. కావున లోకోపకారము కాఱకునే నిట్లాచరించుచున్నాను. అంత విష్ణువు అట్లే అని నమస్కరించి నిలిచెను.. అంత వారు దేవర్షులు గౌతమ గృహమును చేరిరి. వారందరు దేవ దేవుడగు శంకరునికి పూజలు జరిపిరి. శివుడు హనుమంతునితో కలిసి గానము చేయుచుండెను. వారందరూ పంచ్ మంత్రమును జపించిరి. హనుమంతుని హస్తమును పట్టుకాని శివుడు దేవతలతో కలిసి యుండెను. అంత శివపార్వతులు ఏకశయ్యాసమాసీనులైరి. హనుమంతుడు తుంబురు ప్రముఖులు గానము చేయుచుండిరి. పరమేశ్వరుడు నానావిధివిలాసములను చేయుచుండెను. పార్వతిని పిలిచి ఇట్లు పలికెను. ఓ శుభురాలా ! నీకు కాప్పుముడిచెదను. నా ముందుకు రమ్ము. అంత పార్వతి స్త్రీని పతి సేవించుట యుక్తముకాదు. కేశ ప్రసాధనముతో పాటు అర్థాంతరము కూడా సంభవించును. కేశప్రసాధనముననే ఈప్పితమంతయూ నేరవేరదు. కేశబంధము తరువాత భుజప్రాంతమున ప్రమార్జనమును చేయవలయును. తరువాత కేశమును చివర తగిలియున్న పుష్పాదీమార్జనము. ఇట్లు జరుగుచుండగా మహానుభావులు వచ్చినచో దేవవందితుడవగు నీవు ఏమి సమాధానమును చెప్పెదవు ? ఎవ్వరూ రానిచో భయము తొలగిపోవును. అని పలికెను ఇట్లు మాటలాడుచున్న పార్వతిని శంకరుడు చేతితో లాగి తన ఊరువుల మీద కూర్చోబెట్టుకాని కచబంధమును విప్పి, చేతులతో చక్కగా విడమరచి, గోళ్ళతో చిక్కు తీసి, విష్ణువిచ్చిన పారిజాతమాలను కేశములలో ముడిచెను. అట్లు ముడిచి కాప్పు వేసెను. చేతిలో నున్న మల్లెలమాలను కాప్పున కట్టెను. బ్రహ్మ ఇచ్చిన కల్ప పుష్పమాలను సుగంధభరితమగు పార్వతీవస్త్రమున కట్టెను. అట్లు చేయుచున్నపుడు అంటుకున్నది, అంటియున్న పుష్పమార్జనమును గావించెను. అంత నడుముభాగమున వస్త్ర వేష్టనము లోపల జారుచున్న నీవీ బంధమును చూచి ఇది యేమిటని నీవీ బంధమును గావించెను. తరువాత ఇది నీకు నాసా భూషణము. నిజము చెప్పుచున్నాను అనెను. అంత పార్వతి చిరునవ్వుతో శంకరునితో ఇట్లుపలికెను. ఓ శంభూ? నీ మందిరమున సర్వవస్తువులు సమృద్ధిగా కలవు. నేను మొదటనే ఈ విషయమును తెలిసియుంటిని. సర్వద్రవ్య సంపత్తి భూషణములచే తెలియబడును. స్వామి మీ శిరస్సు బ్రహ్మ శిరోమాలచే అలంకరించబడుచున్నది. నరకపాలమాలచే వక్షస్థలము విభూషణమైనది. విషయుక్తములైన శేషవాసుకులు నీకు కంకణములు. నీ వస్త్రములు దిక్కులు. జటలు కేశములు. భస్మము అంగరాగము. మహావృషభము వాహనము. గోత్రము కులము తెలియదు. తలిదండ్రులు తెలియదు. నీ శరీరము విరూపాక్షము. ఇట్లు పార్వతీ పలుకుచుండగా విష్ణువు చాలా కోపముతో ఇట్లు పలికెను. ఓ దేవా ! దేవదేవుడు జగత్పతియగు శివుని ఏల నిందించుచున్నావు ? నీ నియమాభావముచే ప్రాణములు ప్రియములు కావనిపించుచున్నది. ఈశ్వరుని నింద జరిగినచో మరణించుట మా వ్రతము. ఇట్లు పలికి శ్రీహరి నఖములచే తన శిరస్సును ఛేదించుకానుటకు ఉద్యుక్తుడాయెను. అంతట శంకరుడు విష్ణువు హస్తమును పట్టుకాని సాహసము చేయకుము. పార్వతీ వచనములన్నియూ నాకు ప్రియములే. అప్రియములు కావు. ఇపుడు నీవే నాకు అప్రియమును చేయ ప్రయత్నించుచున్నావు అని పలి కెను. అంతట శ్రీహరి అట్లే అని ఊరకుండెను. అంతట హనుమంతుడు శంకరునితో ఇట్లు విజ్ఞాపన చేసేను. స్వామి నిష్కామమగు నీ పూజా వ్రతమును చేయుటకు అర్థించుచున్నాను. పూజ చేయుటకు వెళ్ళవలయును. నాకు అనుజ్ఞ నిమ్ము. ఆ మాట నినిన శంకరుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. నీవు ఎవరిని పూజించెదవు. ఎచట పూజించేదవు. ? ఏ పుష్పము? ఏ దళమో చెప్పుము. గురువెవ్వరు ? మంత్రమేది ? ఎట్లు పూజింతువు ? ఇట్లు శంకరుడు పలుకగా నీతియుతుడగు హనుమంతుడు శరీరమంతయూ వణకుచుండగా స్తోత్రము చేయ నారంభించెను. మహాదేవుడు అమితాత్ముడగు శంకరునికి నమస్కారము. యోగికి యోగధాతకు యోగి గురువునకు నమస్కారము. యోగగమ్యుడగు దేవునికి, జ్ఞాని పలికి నమస్కారము. వేదసతికి దేవపతికి నమస్కారము. ధ్యానమునకు, ధ్యానగమ్యునకు, ధ్యాతగురువునకు నమస్కారము. అష్టమూర్తికి పశుపతికి నమస్కారము. అంజకునికి, త్రినేత్రునకు, సోమసూర్యాగ్ని నేత్రునకు నమస్కారము. సుభృంగరాజ ధత్తూర ద్రోణప్రియునకు, బృహతీ పూగ పున్నాగ చంపక ప్రియునకు, నమస్కారము. నమస్కారము మరల మరల నమస్కారము. ఇట్లు స్తోత్రము చేయగా శివుడు కపీంద్రునితో భయపడకుము. నాకంతయూ చెప్పుము. అని పలికెను. అంతట వాక్యకోవిదుడగు హనుమంతుడు భయమును విడిచి ఇట్లు పలికెను. భస్మోద్ధూలితదేహీ శివలింగార్చనమును పగలు సంపాదించిన జలముచే, పుష్పాదులచే చేయవలయును. ఓ దేవా ? శుభప్రదమగు శివపూజావిధిని విజ్ఞాపన చేతును. సాయంకాలమున అశిరస్నానము నాచరించవలయును. చక్కగా శుద్ధిచేయబడిన, ఆరిన వస్త్రమును ధరించి, మూడు మార్లు ఏకాగ్రచిత్తముతో ఆచమనము గావించి, భస్మమును తీసుకాని ఆగ్నేయ స్నానము నోచరించవలయును. ప్రణవముతో అష్టవారము మంత్రించి కాని, పంచాక్షరమంత్రముతో కాని, ఏదో ఒక నామముతో ఏడుమార్లు మంత్రించిన భస్మమును దర్భపాణియై “ఈశానః సర్వవిద్యానాం” అని శిరమున వేసుకానవలయును. “సద్యోజాతం ప్రపద్యామీ” అను మంత్రముచే పాదముల పై చల్లుకానవలయును. ప్రణవముచే సమస్తాంగముల పై చల్లుకానవలయును. ఇది తైవర్లి కులకు స్నానవిధి చేప్పబడినది. గురువు చెప్పిన శూద్రస్నానవిధిని చేప్పెదను. శివ అను పదమును పలికి భస్మమును మంత్రించవలయును. ఏడుమార్లు శివనామముతో మంత్రించి శిరస్సున చల్లుకానవలయును. ‘శంకరాయ’ అని ముఖమున, ‘సర్వజ్ఞాయ’ అని హృదయమున, స్థాణవే నమః అని ముఖమున, “స్వయంభువే” అని పాదముల పై చల్లి, శుద్ధమగు భస్మమును తీసుకాని నమశ్శివాయ అని సర్వాంగములందు చల్లుకానవలయును. హస్త ప్రక్షాలనము గావించుకాని, ఆచమనము చేసి దర్భపాణియై సావధానముగా నుండవలయును. దర్పలేనిచో సువర్ణము, సువర్ణము లేనిచో గవోలుకలు, అవి లేనిచో దూర్వలు, అవి కూడా లేనిచో రజతమును ధరిచవలయును. సంధ్యోపాసనను, దేవీ జపమును చేసి దేవ గృహమునకు వెళ్ళవలయును. లేదా దేవవేదికను కాని, కల్పించిన స్థండిలమును కాని చేరవలయును. కల్పించబడిన మృణ్మయరచితమైనది పరిశుద్ధమైనది నాలుగు వర్ణములతో రంగములతో కూడినది పద్మా దిరచనా యుతము లేదా ఒక శ్వేతముతో కూడియున్నది, అట్లే విచిత్రములైన పద్మములు, స్వస్తికాదులు, ఉత్పలాదులు గదా శంఖత్రిశూల డమరులు, శరోక్త పంచ ప్రాసాదములు కలదిగా నేర్పరిచి, అచట శివలింగము నుంచి, సర్వకామఫలవృక్షము కులకము కోలకము, షట్కోణము, త్రికోణము లేదా నవకోణము, ద్వాదశ కోణమునందు ఆందోళపాదుకావ్యజనములు చామర చత్రయుగలము, విష్ణుబ్రహ్మదులు వీటినన్నిటిని చూర్ణాదులచే వేదికయందు రచించవలయును. లేదా దేవాలయమునందు కాని చేయవలయును. దేవపూజ చేయు ప్రదేశమున ఇట్లు కల్పించవలయును. స్వహస్తిరచితమైనది ఉత్తమము. క్రీతము మధ్యమము. యాచితము కనిష్టము. బలాత్కార లభ్యము అధమము. అర్ణములలో ఆనర్ణములలో బలాత్కారలభ్యము నిష్పలమగును. రక్తశాలి జపాశాణకలమఅసితరక్తకములచే ప్రీమాత్రేళ్లతండులములచే కణములచే యథాక్రమముగా ఉత్తమ మధ్యమ కనిష్టములచే పద్మాదిస్థాపనములచే చక్కగా యాగము నాచరించవలయును. ప్రాగుత్తరముఖముగాకాని ప్రాజ్ముఖముగా కాని కూర్చొనవలయును. ఇక ఇపుడు చూచినట్లు వినినట్లు ఆసనవిధిని కూడా చెప్పెదను.

కౌశం చర్మం చైలతల్పే దారవం తాలపత్రకమ్,

కాంబలం కాంచనం చైవ రాజితం తామ్రమేవ చ.

గోకరీషార్కజైర్వాపి హ్యాపనం పరికల్పయేత్,

వైయాఘ్రం రౌరవం చైవ హరిణం మార్గమేవ చ.

చార్మం చతుర్విధం జ్ఞేయం అథ బంధుకమేవ చ,

యథా సంభవమేతేషు హ్యాపనం పరికల్పయేత్.

కృతపద్మాపనో వాపి స్వస్తికోపన ఏవ చ,

దర్భభస్మసమాసీనః ప్రాణానాయమ్య వాగ్యతః.

తావత్స దేవతారూపో ధ్యానం చాన్తస్సమాచరేత్,

శిఖాంతే ద్వాదశాంగుల్యే స్థితం సూక్ష్మతనుం శివమ్.

అంతశ్చరంతం భూతేషు గుహాయాం విశ్వతో ముఖమ్, సర్వాభరణసoయుక్తమణిమాగుణాన్వితమ్.

ధ్యాత్వా తం ధారయేచ్చిత్తే తద్దీప్త్యా పూరయేత్తనుమ్,

తయా దీప్త్యా శరీరస్థం పాపం నాశముపాగతమ్.

స్వర్ణపాదైర సంపర్కాద్రక్తం శ్వేతం యథా భవేత్,

తద్ద్వాదశదళావృత్తమష్ట పంచ త్రిరేవ వా.

పరికల్ప్యాపనం శుద్ధం తత్ర లింగం నిధాయ చ,

గుహాస్థితం మహేశానం లింగేశం చింతయేత్తథా.

శోధితే కలశే తోయం శోధితం గంధవాపితమ్,

సుగన్ధపుష్పం నిక్షిప్య ప్రణవే నాభిమంత్రితమ్.

ప్రాణాయామశ్చ ప్రణవః శూద్రేషు న విధీయతే,

ప్రాణాయామపదే ధ్యానం శివేత్యోంకారమంత్రితమ్.

గంధపుష్పాక్షతాదీని పూజాద్రవ్యాణి యాని చ,

తాని స్థాప్య సమీ పే తు తత్సంకల్పమాచరేత్.

శివపూజాం కరిష్యామి శివత్యుష్ట్యర్థమేవ చ,

ఇతి సంకల్పయిత్వా తు తత ఆవాహనాదికమ్.

కృత్వా తు స్నానపర్యన్తం తతస్స్నానం ప్రకల్పయేత్,

నమస్తేత్యాదిమంత్రేణ శతరుద్రనిధానతః.

అవిచ్ఛిన్నా తు యా ధారా ముక్తిధారేతి కీర్తితా,

తయా యస్స్నాపయేన్మాపం జపన్రుద్రముఖాశ్చ వా.

ఏకవారం త్రివారం వా పంచ సప్త నవాపి వా,

ఏకాదశ తథా వారమథైకాదశధాన్వితమ్.

ముక్తిస్నానమిదం జ్ఞేయం మాపం మోక్షప్రదాయకమ్,

శైవయా విద్యయా స్నానం కేవలం ప్రణవేన వా.

మృణ్మయైర్నాలికేరస్య శకలైశ్చోర్మిభిస్తథా,

కాంస్యేన ముక్తా శుక్త్యా చ పుష్పాణి కేసరేణ వా.

స్నాపయేద్దేవదేవేశం యథాపంభవమీరితైః,

శృంగస్య చ విధిం వక్ష్యే స్నానయోగ్యం యథా భవేత్.

పూర్వమంతస్తు సంశోధ్య బహిరంతస్తు శోధయేత్,

సుస్నిగ్ధం లఘు కృత్వాథ నాంగం ఛిద్యాత్కథంచన.

నీచైకదేశవిన్యస్త ద్వారద్రోణ్యా సుహృత్తయా,

కృశానుయుక్తం స్నానం తు దేవాయ పరికల్పయేత్.

ఏవం గతయశృంగస్య జలపూర్తిరథోచ్యతే,

ద్వారే నిషిద్ధలోహార్థసంధిద్వారా సమన్వితే.

యోగచక్రం నాగదండం నాగాకారం ప్రకల్పయేత్,

ఫలస్థానే తు చషకం దండేన సమరంధ్రకమ్.

తత్రైవ పాతయేత్తోయం మూర్ధయంత్రఘటే స్థితమ్,

పాతయేదథ చాన్యేన వామేనైవ కరేణ వా.

ముక్తిధారా కృతా తేన పవిత్రం పాపనాశనమ్,

ఏవం సంస్నాప్య దేవేశం పంచగవ్యైస్తథైవచ.

పంచామృతైరథ స్నాప్య మధురత్రితయేన చ,

విభూష్య భూషణైర్దేవం పునస్స్నాప్య మహేశ్వరమ్.

శీతోపచారం కృత్వాథ తత ఆచమనాదికమ్,

వస్త్రం తథోపవీతం చ గంధద్రవయకమేవ చ.

కర్పూరమగరుం చాపి పాటీరమథవా భవేత్,

ఉభయమిశ్రితం చాపి శివలింగం ప్రపూజయేత్.

కృత్స్నం పీఠం గంధపూర్ణం యద్వా విభవసారతః,

తూష్ణీమథోపచారం వా కాలేయం పుష్పమేవ చ.

శ్రీపత్రమరుచిత్యాజ్యం యథాశక్త్యఖిలం యథా,

అనేకద్రవ్యధూపం చ గుగ్గులం కేవలం తథా.

కపిలాఘృతసంయుక్తం సర్వధూపం ప్రశస్యతే,

ధూపం దత్వా యథాశక్తి కపిలాఘృతదీపకాన్.

అథవా పూజామాత్రేణ దీపాన్దత్వోపహారకమ్,

నైవేద్యముపపన్నం చ దత్వా పుష్పసమన్వితమ్.

ముఖశుద్ధిం తతః కృత్వా దత్వా తాంబూలమాదరాత్,

ప్రదక్షిణనమస్కారౌ పూజైవం హి సమాప్యతే.

కుశలతో ఏర్పరిచినది, చర్మముతో ఏర్పరిచినది. దొరువుతో ఏర్పరిచినది. తాటాకులతో చేయబడినది. కంబలముచే ఏర్పరిచినది. కొంచనముచే ఏర్పరిచినది. రాజతము, తామ్రము. గోకరీషార్కజములచే ఆసనములను కల్పించవలయును. పద్మాసనమును కాని స్వస్తికాసనమును కాని ఏర్పరచుకానవలయును. దర్భలయందుకాని, భస్మమునందుకాని సమాసీనుడై వాక్కును నియమించి ప్రాణాయామమును గావించి, దేవతారూపుడై అంతర్ధ్యానము గావించవలయును. ద్వాదశాంగుల పరిమితమగు. శిఖాంచమున నున్న మంగళప్రదమగు సూక్ష్మతనువుగా నున్న, భూతములలో అంతర్భాగమున గుహాయందు చరించుచున్న విశ్వతోముఖుడు, సర్వాభరణ సంయుక్తుడు, అణిమాదిగుణాన్వితుడుగు మ హేశ్వరుని ధ్యానించి, అతనినే చిత్తమున ధరించవలయును. అతని కొంతిచే శరీరమును నింపవలయును. ఆ కాంతిచే శరీరమున నున్న పాపమును నశింపచేయవలయును. స్వర్ణపాద సంపర్కము లేనందువలన రక్తము కాని శ్వేతముగా కాని ఉంటున్నటుల ద్వాదశ దలావృత్తము అష్టకాని పంచకాని మూడుకాని దళములున్న శుద్ధమగు ఆసనమును కల్పించి అచట లింగమునుంచి గుహలోనున్న లింగేశ్వరుని చింతించవలయును. పరిశుద్ధము చేయబడిన కలశమునందు గంధవాసితము శోధితము అగు జలమును గంధపుష్ప సహితముగా నుంచి, ప్రణవముచే అభిమంత్రించవలయును. శూద్రుల విషయమున ప్రాణాయామము, ప్రణవముచే అభిమంత్రించవలయును. శూద్రుల విషయమున ప్రాణాయామము, ప్రణవము విధించబడలేదు. ప్రాణాయామ స్థానమున ఓంకారాభి మంత్రితమగు శివనామముండును. గంధపూష్పాక్షతాదికముగు పూజాద్రవ్యములను సమీపమున నుంచి సంకల్పమునాచరించవలయును. శివుని సంతోషము కాఱకు శివుని పూజకు చేసెదను. ఇట్లు సంకల్పముగావించిన తరువాత ఆవాహనాదికమును గావించి స్నానమును కల్పించవలయును. ‘నమస్తే’ ఇత్యాది మంత్రముచే శతరుద్ర విధానముగా అవిచ్చిన్నధారను ముక్తిధారయందురు. జపించుచు ముక్తిధారచే రుద్రముఖులను ఒకనేల స్నానము చేయించినచో ఆ స్నానము కూడా ఒకమారు కానీ మూడు అయిదు ఏడు తొమ్మిది పదకొండుమార్లు పదకొండు మార్లు పదకొండు విధములుగా చేసినచో దీనిని ముక్తి స్నానమందురు. ఇట్లు ఒక మాసము చేసినచో మోక్షమును ప్రసాదించును. శైవవిద్యచే కాని, కేవలప్రణవముచే కాని, మృణ్మయములచే కాని నారి కేలశకలములచే కాని, జలధారలచే కాని, కాంస్యములచే కాని, ముత్తేపుచిప్పలచే కాని, పుష్పాది కేసరములచే యథాశక్తి దేవదేవేశుని స్నానము చేయించవలయును. ఇక ఇపుడు స్నానయోగ్యమగు శృంగవీధిని చెప్పెదను. మొదట అంతర్భాగమును సంశోధించి, బహిరంతరము శోధించవలయును. సుస్నిగముగా లఘువుగా చేసి అంగఛేదన గావించకూడదు. నీచైకదేశవిన్యస్త ద్వాదశ ద్రోణిచే సహృత్తుగా అగ్నిహోత్రయుక్తముగా స్నానమును మహాదేవునికి కల్పించవలయును. ఇట్ల గవయశృంగమునకు జలపూర్తిని ఇపుడు చెప్పెదను. నిషిద్ధలోహార్ధసంధిద్వారసమన్వితమగు ద్వారమున యోగవక్రమును, నాగ దండమగు నాగాకారముగా కల్పించవలయును. ఫలస్థానమున దండముతో సమరంధ్రకమగు చషకమునుంచి అచటనే మూర్ధ యంత్రఘటమున నున్న జలము నుంచవలయును. మరియొక దానిచే కాని వామకరముచే కాని నుంచవలయును. ఇట్లు దానిచే చేయబడిన ముక్తిధార పరమపవిత్రము పాపనాశకము. ఇట్లు పంచగవ్యములచే పంచామృతముచే మధురత్రితయముచే కాని స్నానము గావించి భూషణములచే చక్కగా నలంకరించి, మరల స్నానము చేయించి శీతలోపచారమును గావించి, ఆచమనాదికమును వస్త్రమును, ఉపవీతమును గంధద్రవ్యమును, కర్సూరుమును, అగరును, పాటీరమును కాని, ఉభయమిశ్రితముగా కాని శివలింగమును పూజించవలయును. సమస్త పీఠమును కాని, లేదా విభవాను సారముగా కాని గంధపూర్ణమును గావించి, కాలీయ పుష్పమును, శ్రీపత్రమరుచిత్యాజ్యమును యథాశక్తిగా సమస్తమును అనేక ద్రవ్యధూపమును, కేవల గుగ్గులమును, సర్వధూపము కపిలాఘృతసంయుక్తమైనచో పరమోత్తమముగా పేరుకానబడినది. యథాశక్తిగా ధూపమును సమర్పించి, కపిలాఘృతములచే దీపములను కాని, పూజామాత్రముచే దీపములనుంచి, ఉపహరమునిచ్చి ఉపపన్నమగు నైవేద్యమును పుష్పసమన్వితముగా కల్పించి, ముఖశుద్దిని గావించి, ఆదరముగా తాంబూలము నిచ్చి ప్రదక్షిణనమస్కారములు గావించినచో పూజ పరిసమాప్తమగును.

గీత్యంగపంచకం పశ్చాత్తాని విజ్ఞాపయామితే,

గీతిర్వాద్యం పురాణం చ నృత్యం హాసోక్తి రేవ చ.

నీరాజనం చ పుష్పాణామంజలిశ్చాఖిలార్పణమ్,

 క్షమాపణం చోద్వసనం ప్రోక్తం పంచోపచారకమ్.

భూషణం చ తథా ఛత్రం చామరవవ్యజనే అపి,

ఉపవీతం చ కైంకర్యం షోడశానుపచారకాన్.

ద్వాత్రింశదుపచారైస్తు యస్సమారాధయేచ్ఛివమ్,

ఏకేనాహ్నా సమస్తానాం పాతకానాం క్షయో భవేత్.

ఏతచ్ఛ్రుత్వా హనుమతో వచనం ప్రాహ శంకరః,

ఏవమేతత్కపిశ్రేష్ఠ యదుక్తం పూజనం మమ.

సారభూతమహం తుభ్యముపదేక్ష్యామి సాంప్రతమ్,

ఆరాధయన్ యథాలింగే విస్తరేణ త్వయోదితమ్.

మత్పాదయుగలం ప్రార్చ్య పూజాఫలమవాప్నుహి,

తతః ప్రాహ కపిశ్రేష్ఠో దేవదేవముమాపతిమ్.

గురుణా లింగపూజైవ నియతా పరికల్పితా,

తాం కరోమి పురా దేవ పశ్చాత్త్వత్పాదపూజనమ్.

ఇత్యుక్త్వేశం నమస్కృత్య శివలింగార్చనాయ చ,

పరసస్తీరమాగత్య కృత్వా సైకతవేదికామ్.

తాలపత్రైర్విరచితమాసనం పర్యకల్పయత్,

ప్రక్షాల్య పాదౌ హస్తౌ చ సమాచమ్య సమాహితః.

భస్మస్నానముథో చక్రే పునరాచమ్య వాగ్యతః,

దేవవేద్యామదో చక్రే పద్మం చ సుమనోహరమ్.

అనన్తరం తాలపత్రే పద్మాసనగతః కపిః,

ప్రాణానాయమ్య సంన్యస్య శుక్లధ్యానసమన్వితః.

ప్రణమ్య గురుమీశానం జపన్నాసీదతః పరమ్,

అథ దేవార్చనం కర్తుం యత్నమాస్థితవాన్కపిః.

పలాశపత్రపుటకద్వయానీతజలం శుచి,

శిరః కమండలుగతం నిధాయాన్నినిమంత్రితమ్.

ఆవాహనాదికృత్వాథ స్నానపర్యంతమేవ చ,

ఆథ స్నాపయితుం దేవమాదాయ కరసంపుటే.

కృత్వా నిరీక్షణం దేవపీఠం నో దృష్టవాన్కపి,

లింగమాత్రం కరగతల దృష్ట్వా భీతిసమన్వితః.

ఇదనహ మహాయోగీ కిం వా పాపం నుయా కృతమ్,

య ఏతత్పఠరహితం శివలింగం కరస్థీతమ్.

మమాద్య మరణం సిద్దం న పీఠం చోగమిష్యతి,

అథ రుద్రం జపిష్యామి తదాయాతి మహేశ్వరః.

ఇతి నిశ్చిత్య మనసా జప శతరుద్రీయమ్,

యదా తు న సమాయాతో మహేశోఽథ కపీశ్వరః.

రుద్రం న్యపాతయద్భూమౌ వీరభద్రస్సమాగతః,

కిమర్ధం రుద్యతే భద్ర దుదితే కారణం వద.

తచ్ఛ్రుత్వా ప్రాహ హనుమాన్వీరభద్రం మనోగతం,

పీఠహీనమిదం లింగం పశ్య మే పాపసంచయమ్.

వీరభద్రస్తతః ప్రాహ శ్రుత్వా కపిసమీరితమ్,

 యది నాయాతి పీఠం తే లింగే మా సాహసం కురు.

దాహయిష్యామ్యహం లోకాన్యది నాయాతి పీఠకమ్,

పశ్య దర్శయ మే లింగం పీఠం ఛత్రాగతం న వా.

అథ దృష్ట్వా వీరభద్రో లింగే పీఠమునాగతమ్,

దగ్ధుకామోఽఖిలాన్దోకాన్వీరభద్రః ప్రతాపవాన్.

అనలం భువి చిక్షేప క్షణాద్దగ్ధా మహీ తదా,

అథ సప్త తలాద్దగ్ధ్వా పునరూర్ద్వమవర్తత.

పంచోర్ధ్వలోకానదహజ్జనలోకనివాసినః,

లలాటనేత్రసంభూతం నఖేవాదాయ చానలమ్.

జంబీరఫలసంకాశం కృత్వా కరతలే విభుః,

తపస్సత్యం చ సందగ్ధుముద్యతోఽభూన్మునీశ్వరః.

తతస్తు మునయో దృష్ట్వా తపోలోకనివాసినః,

దగ్ధుకామం వీరభద్రం గౌతమాశ్రమమాగతాః.

న దృష్ట్వా తత్ర దేవేశం శంకరం స్వాత్మని స్థితమ్,

అస్తువన్భక్తి సంయుక్తా స్తోత్రైర్వేదపముద్భవైః.

ఓం వేదవేద్యాయ దేవాయ తప్మె శుద్దప్రభాచిన్త్యరూపాయ కస్మె,

బ్రహ్మాద్యధీశాయ సృష్ట్యాదికర్త్రేవిష్ణుప్రియాయార్తిహంత్రేంఽతకర్త్రే.

నమస్తేఽఖిలాధీశ్వరాయాంబరాయ నమస్తే చరస్థావరవ్యాపకాయ,

నమో వేదగుహ్యాయ భక్తప్రియాయ నమః పాకభోక్త్రే మఖేశాయ తుభ్యమ్.

నమస్తే శివాయాదిదేవాయ కుర్మో నమో వ్యాలసద్యజ్ఞోపవీతప్రధర్త్రే,

నమస్తే సురాబిన్దువర్షాపనాయత్రయీమూర్తయే కాలకాలయేనాథ.

ధర్త్రీమరుద్య్వోమతోయేన్దువహ్నిప్రభామండలాత్మాష్టధామూర్తిధార్త్రే,

శివాయాశి వాఘ్నాయ వీరాయ భూయాత్ పదా నః ప్రసన్నో జగన్నాథకేజ్యః.

కలానాథభాలాయ ఆత్మా మహాత్మా మనో హ్యాగ్రయానో నిరూప్యోననార్థిక, జగజ్జాడ్యవిధ్వంపనో భుక్తిముక్తి ప్రదస్స్యాత్ప్రసన్నస్సదా శుద్ధకీర్తిః.

యతస్సంప్రసూతం జగజ్జాతమీశాత్తితం యేన రక్షావతా భావితం చ,

లయం యాస్యతే యత్ర వాచా విదూరే స వై నః ప్రసన్నోఽస్తు కాలత్రయాత్మా.

యదాదిం చ మధ్యం తథాంతం న కోఽపి విజానన్తి విజ్ఞా స్వానుమానాః,

స వై సర్వమూర్తి స్సదా నో విభూత్యై ప్రసన్నోఽస్తు కిం జ్ఞాపయామోఽత్ర కృత్యమ్.

ఏతాం సుతిమథాకర్ణ్య భగనేత్రప్రదర్శినః,

విష్ణుమహ మునీనేతానానయప్ప మదంతికమ్.

అథ విష్ణుప్సమాగత్య తపోలోకనివాసినః,

మువీసాంత్వయ్య విశ్వేశం దర్శయామాస శంకరమ్.

ఇక ఇపుడు గీత్యంగపంచకమును విజ్ఞాపన చేసెదను. గీతము, వాద్యము, పురాణము, హాసోక్రీనృత్యము అనునవి అయిదు గీత్యంగపంచకము. నీరాజనము, పుష్పాంజలి, అఖిలార్పణము, క్షమాపణము, ఉద్వాసనము అనునవి అయిదు ఉపచారములు. భూషణము, ఛత్రము, చామరవ్యజనములు, ఉపవీతము, కైంకర్యము, షోడశోపచారములను చేయవలయును. ముప్పదీ రెండు ఉపచారములుచే శివుని ఆరాధించినచో ఒకే దినమున సమస్త పాపములు నశించును. ఇట్లు చెప్పిన హనుమంతుని మాటలను విని శంకరుడు ఇట్లు పలికెను. నీవు చెప్పిన నా పూజా విధానమంతయూ సత్యమే. కాని ఇపుడు నేను నీకు సారభూతమగు దానిని ఉపదేశించెదను. లింగమున నీవు చెప్పిన విస్తృతమగు శివారాధనా ఫలమును నా పాదయుగమునర్సించినచో పొందగలవు. అపుడు కపి శేషుడు దేవదేవుడగు ఉమాపతిని గూర్చి ఇటు పలికెను. నా గురువు నాకు లింగపూజానియమము నేర్పరిచెను. కావున మొదట లింగపూజను గావించి తరువాత నీ పాదపూజను గావింతును. ఇట్లు పలికి ఈశ్వరుని నమస్కారించి శివలింగార్చన కారకు సరసీరమున కాచ్చి సైకత వేదికను కల్పించి తాలపత్రరచితమగు నాసనమునేర్పరచుకాని హస్తపాద ప్రక్షాలనము గావించి ఆచమనము చేసి సావధానుడై, భస్మస్నానమును గావించి, మరల ఆచమనము చేసి, వాక్కును నియమించి, దేవవేదియందు మనోహరమగు పద్మమును చేసెను. తరువాత తొలపత్రమున పద్మాసనగతుడై, ప్రాణాయామమును గావించి, న్యాసమును చేసి శుక్ల ధ్యానసమన్వితుడై గురువును ఈశ్వరుని నమస్కరించి జపించుచుండెను. అంతట కపీనుడు దేవార్చన గావించుటకు ప్రయత్నించెను. మోదుగాకుచే ఏర్పరిచిన రెండు దొప్పలచే తేబడిన పరిశుద్ధజలమును కమండలమున శిరము నుంచి అగ్నిని మంత్రితముగా ఆవాహనాదికము స్నానపర్యంతము గావించి స్నానము చేయించుటకు చేతులలోనికి శివలింగమును తీసుకోని చూడగా దేవపీఠము కనిపించడాయెను. చేతులలో కేవలము శివలింగమును చూచి నేనేమి మహాపాతకమును చేసితిని ? ఇట్లు పీఠరహితమగు శివలింగము నాచేతిలో నున్నది. పీఠము రానిచో ఈ దినము నా మరణము తప్పదు. కావున రుద్రుని జపించెను. అపుడు మహేశ్వరుడు వచ్చును. అని నిశ్చయించి మనస్సుచే శతరుద్రీయమును జపించెను. అయిననూ మహేశ్వరుడు రాకపోగా కపీశ్వరుడు రుద్రుని భూమి పై పడవేసెను. అంతట వీరభద్రుడొచ్చెను. ఓ శుభప్రదుడా ? ఎందుకు రోదించుచుంటివి ? రోదన కారణమును చెప్పుము. అని అడిగెను. అంతట కపీనుడు వీరభద్రునితో తన మనసులోని మాటను పీఠహీనముగు శివలింగమున్నది. నా పాపసంచయమును చూడుము అని పలికెను. అంతట వీరభద్రుడు ఆమాటను విని పీఠము రానిచో శివలింగమున సాహసమును చేయకుము. నాకు శివలింగమును చూపుము. పీఠము వచ్చినదో లేదా ? అని అడిగేను. అయననూ లింగము రాకుండుటను చూచి ప్రతాపవంతుడగు వీరభద్రుడు అగ్నిని భూమి పై పడవే సెను. అదే క్షణములో భూమి దగ్గమాయెను. అయదు ఊర్ధ్వలోకములను దహించెను. లలాటనేత్రసంభూతమగు అగ్నిని నఖముతో తీసుకాని చేతిలో నుంచుకాని తపోలోకమును సత్యలోకమును దహించుటకు. సిద్దపడెను. అంతట తపోలోకనివాసులగు మునిజనులు దహించ సంకల్పించిన వీరభద్రుని చూచి గౌతమాశ్రమమునకు వచ్చిరి. అచట శంకరుని చూడక తనలో నున్న శంకరుని భక్తితో వేదసముద్భూతములగు స్తోత్రములచే స్తుతించిరి. వేదవేద్యుడదు దేవునకు, శుద్దప్రభాచిన్యరూపునకు, బ్రహ్మాద్యధీశునకు సృష్ట్యాదికర్తకు, విష్ణుప్రియునకు, ఆర్తిహంతకు అంతకర్తకు నమస్కారము. అఖిలాధీశ్వరునకు, ఆంబరస్వరూపునకు, చరస్థావరవ్యాపకునకు, వేదగుహ్యునకు, భక్తి ప్రియునకు, పాకభోక్తకు, మఖేశునకు నమస్కారము. శివునకు, ఆదిదేవునకు, వ్యాలయజ్ఞోపవీతధారికి, సురాబిన్దువద్దాపనునకు, త్రయీమూర్తికి కాలకాలునకు నమస్కారము. ధరిత్రీమరుత్ వ్యోమత్యఇందు వహ్నిప్రభా మండలాత్మునకు అష్టమూర్తిధారికి, శివునకు ఆశివనాశికి, వీరునకు నమస్కారము. జగనాధులచే పూజించబడువాడు మాయెడ ఎల్లపుడు ప్రసన్నుడగు గావుత. కాలనాధపౌలునకు నమస్కారము. ఆత్మ స్వరూపుడు, మహాత్ముడు, మనోరూపుడు, అగ్రగణ్యుడు, వేదములచే నిరూపింప శక్యము కాని వాడు, జగజ్జాడ్యమును ధ్వంసము చేయువాడు, భుక్తి ముక్తి ప్రదుడు, శుద్ద కీర్తి ఎల్లప్పుడూ ప్రసన్నుడుగా ఉండనిమ్ము. ఈ ప్రపంచమును సృష్టించిన వాడు, రక్షించువాడు, నశింపచేయువాడు, వాగ్విదూరుడు, కాలత్రయస్వరూపుడు మాకు ప్రసననుడు కావలయును. స్వానుమానము కలవాడు, సర్వస్వరూపుడు మా విభూతి కాఱకు ఎల్లపుడు మాకు ప్రసన్నుడగు గావు. మాకృత్యమును విజ్ఞాపనమును విన్నవించెదము. భగనేత్రప్రదుడగు శివుడు మునులు చేసిన స్తోత్రమును విని, ఈమునులను నా వద్దకు తీసుకాని రమ్మని విష్ణువునకు చెప్పెను. అంతట విష్ణువు తపోలోకవాసులను సమీపించి ఓదార్చి వారిని శివుని వద్దకు తీసుకాని వచ్చెను.

 తానాహ శంకరో వాక్యం కిమర్దం యూయమాగతాః,

తపోలోకాద్భూమిలోకం మునయో ముక్తకిల్బిషాః.

తచ్ఛ్రుత్వా శూలినో వాక్యం ప్రోచుస్తే మునిసత్తమాః,

దేవ ద్వాదశలోకానాం దృశ్యంతే భస్మరాశయః.

స్థితమేకం వనమిదం పశ్యత లోకసంక్షయం,

తచ్ఛ్రుత్వా గిరిశః ప్రాహ తాన్ము నీరూర్థ్వరేతపః.

భూలోకస్య తు సందా హే పాతాళానాం తదైవ చ,

సందేహో నాస్తి మునయస్స్థితానాం నో రహపులే.

ఊర్థ్వపంచకలోకానాం దాహే సందేహ ఏవ నః,

కధమంగారవృష్టిశ్చ కథం నో మౌ మహాధ్వనిః.

తదాకర్ణ్య విభోర్వాక్యం శంకరస్య మునీశ్వరాః,

ప్రోచు ప్రాంజలయో దేవం బ్రహ్మాదిసురసంగతమ్.

భీతిరస్మాకమధునా వర్తతే వీరభద్రతః,

ప ఏవాంగారవృష్టిం చ పిపాసురపి మద్విభో !

దేవోఽథ వీరమాహూయ కిం వీరేత్యబ్రవీద్యచః,

వీరోఽప్యాహ కపేర్లింగే పీఠాభావాదిదం కృతమ్.

తచ్ఛ్రుత్వాహ శివో దేవో మునీంస్తాన్భయవిహ్వలాన్,

క పేశ్చిత్తం పరిజ్ఞాతుం మయా కృతమిదం ద్విజాః.

మా భైష్ట భవతా సౌఖ్యం సదా సంపాదయామ్యహమ్,

ఇత్యుక్త్వా తు యదో పూర్వం దేవ దేవః కృపానిధిః.

దగ్దానప్యఖిలాన్దోకాన్పూర్వతశ్శోభనాన్విభుః,

కల్పయామాప విశ్వాత్మా వీరభద్రమథాబ్రవీత్.

సాధు వత్స యతో భద్రం భక్తానామీహ సే సదా,

తత స్తే విపులా కీర్తిర్లోకే స్థాపతి శాశ్వతీ.

ఇత్యుక్త్వాలింగ శిరసి సమాఘ్రాయ మహేశ్వరః,

 తాంబూలం వీరభద్రాయ దత్తవాన్ప్రీతమానసః.

అథాసౌ హనుమానీశపూజనం కృతవాన్యథా,

సమాప్తాయాం తు పూజాయాం హనుమాన్ప్రీతమానసః.

ఏకం వనచరం తత్ర గంధర్వం సవిపంచకమ్,

దదర్శ తమథాభ్యాహ వీణా మే దీయతామితి.

గంధర్వోఽప్యాహ న మయా త్యాజ్యా వీణా ప్రియా మమ,

మమాపీష్టే హ గంధర్వ వీణేత్యాహ కపీశ్వరః.

యదా న దత్తే గంధర్వో వల్లకీం కపయే ప్రియామ్,

తదా ముష్టిప్రహారేణ గంధర్వః పాతితః క్షితౌ.

వీణామాదాయ మహతీం స్వరతంతుసమన్వితామ్,

హనుమాన్వానర శ్రేష్ఠో గాయన్ప్రాగాచ్ఛివాంతకమ్.

తతో గానేన మహతా ప్రసాద్య జగదీశ్వరమ్,

బృహతీ కుసుమైశ్శుద్ధైర్దేవపాదావపూజయత్.

తతః ప్రసన్నో విశ్వాత్మా మునీనాం సన్నిదౌ తదా,

దైత్యానాం దేవతానాం చ నృపాణాం శంకరోఽపి చ.

తస్మై వరమథ ప్రాదాత్కల్పాన్తం జీవితం పునః,

సముద్రలంఘనే శక్తిం శాస్త్రజ్ఞత్వం బలోన్నతిమ్.

ఏవం దత్తం వరం ప్రాప్య మహేశేన మహాత్మనా,

ప్రత్యక్షం మమ విప్రేన్ద్ర హనుమాన్త్రర్షమాగతః

సమస్తభూషాసు విభూషితాంగస్వదీప్తిమందీకృతదేవదీప్తిః, ప్రసన్నమూర్తిస్తరుణశ్శివాంశస్సంభావయామాప సమస్త దేవాన్.

ఆజ్ఞ ప్తో హనుమాoస్తత్ర మత్సేవాయై మునీశ్వరః,

మహేశేనాహమ ప్యేనం శశిమౌలిమవైమి చ.

కిం బహూక్తేన విప్రర్షే యాదృశో వానరేశ్వరః,

బుద్ధౌ న్యాయే చ వై ధైర్యే తాదృగన్యోఽ స్తి న క్వచిత్.

ఇతి తే సర్వమాఖ్యాతం చరితం పాపనాశనమ్,

పఠతాం శృణ్వతాం చైవ గచ్ఛ విప్ర యథాసుఖమ్.

తచ్భుత్వా రామభద్రస్య రఘునాథస్య ధీమత,

వచనం దక్షిణే కృత్య నత్వా చాగాం యథాగతః.

ఏతత్తేఽభిహితం విప్ర చరితం చ హనూమతః,

సుఖదం మోక్షదం సారం కీమన్యచ్చ్రోతుమిచ్ఛసి.

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే హనుమచ్చరిత్రం నామ ఏకోనాతీతీతమోఽధ్యాయః.

వారిని చూచిన శంకరుడిట్లు పలికెను. ఓ పాపరహితులైన మునులారా ? మీరు తపోలోకము నుండి భూలోకమున కేల వచ్చితీరి ? ఆ మాటలను వినిన మునులు ఇట్లు పలికిరి. ఓ దేవా ! పన్నెండు లోకములు బూడిదకుప్పలుగా కనపడుచున్నవి. ఈ  వనమొక్కటి మిగిలినది. ఆ లోకసంక్షయమును చూడుము. వారి మాటలను వినిన శంకరుడు జితేంద్రియులగు మునులను గూర్చి. ఇట్లు పలికెను. భూలోకము పాతాలలోకములు దగ్గమగుటలో సందేహము లేదు. ఊర్ధ్వపంచలోకముల దాహము విషయములోనే సందేహము కలదు. ఊర్ధ్వలోకముల పై అంగార వృష్టి ఎట్లు సంభవించినది? ఈ మహాధని ఎట్లు వచ్చినది ? ఈ శంకరుని ప్రశ్నను వినిన మునులు బద్దాంజలులై శంకరునితో ఇట్లనిరి. ఇపుడు మాకు వీరభద్రుని వలన భయమేర్పడినది. అతనే అంగారవృష్టి నేర్పరచెను. అంతట శంకరుడు వీరభద్రుని పిలిచి ఏమిటిది ? అని అడిగెను. అంతట వీరభద్రుడు కపి శేషుని శివలింగమున పీఠము లేనందువలన ఇట్లు చేసితినని పలికెను. ఆ మాటను విన్న శంకరుడు భయవిహ్వలులగు మునులను చూచి ఇట్లు పలికెను. కపిశ్రేష్ఠుని మనసును తెలియగోరి నేనిట్లు చేసితిని. మీరు భయపడకుడు. మీకు క్షేమమును నేను కూర్చేదను. ఇట్లు పలికి కృపానిధియైన దేవదేవుడు దగ్గములైన లోకములను యథాపూర్వముగా మొదట కంటే శోభాయుతములుగా చేసెను. అపుడు వీరభద్రునితో ఇట్లు పలికెను. ఓ వత్సా! బాగు ! నీవు భక్తులకు భద్రమును కల్పించుచున్నావు. కావున నీకు శాశ్వతమైన కీర్తి లోకమున వ్యాపించగలదు. ఇట్లు పలికి ఆలింగనము చేసుకాని శిరస్సును మూర్కొని ప్రీతితో వీరభద్రునకు - తాంబూలము నిచ్చెను. అంతట హనుమంతుడు శివలింగపూజను యథావిధిగా పూర్తి చేసెను. పూజ ముగిసిన వెంటనే సంతోషము నిండిన మనసుతో నున్న హనుమంతుడు అచట ఒక వనచర రూపములో నున్న గంధర్వుని వీణతో నున్నవానిని చూచెను. అతనితో కపి శేషుడు వీణను నొకిమ్మని యడుగెను. గంధర్వుడు కూడా ఈ వీణ. నాకు చాలా ప్రియమైనది. కావున వీడలేననేను. నాకు కూడా చాలా ఇష్టమైనదీ వీణ అని హనుమంతుడనేను. అయిననూ గంధర్వుడీయనందున హనుమంతుడు ముష్టి ప్రహారముతో గంధర్వుని నేల పై పడవేసెను. అంతట స్వరతంతు సమన్వితమైన వీణను తీసుకాని మీటుచు శివుని వద్దకు వెళ్ళేను. అంతట గానముచే జగదీశ్వరుని ప్రసన్నము చేసుకాని శుద్ధమగు బృహతీపుష్పములతో శివపాదములను పూజించేను. అంతట ప్రసన్నుడైన శివుడు మునులు, దేవతలు, దైత్యుల, రాజుల సమీపమున హనుమంతునికి కల్పాంతజీవనమును, సముద్రలంఘనశక్తిని, సకల శాస్త్ర జ్ఞానమును, ఉన్నత బలమును వరముగా నిచ్చెను. ఇట్లు మ హేశ్వరునిచే వరమును పొంది నా కనుల ముందే మహాసంతోషమును పొందెను. సమస్తాభరణభూషితాంగుడై " తన కాంతిచే దేవకాంతిని క్రిందుగా చేసి, ప్రసన్నమూర్తి, తరుణుడు, శివాంశ సంభూతుడు దేవతల నందరిని సంభావించెను. అంతట నా సేవలో ఆజ్ఞాపించబడినవాడై యుండెను. నేను కూడా ఇతనిని శంకరునిగానే తలతును. ఇంకనూ ఏమని చెప్పవలయును. బుద్ధిలో, న్యాయములో, ధైర్యములో హనుమంతునితో సమానుడు మరియొకడు లేడు. ఇట్లు వినువారలకు చదువువారలను పాపములను నశింపచేయు హనుమచ్చరితమును నీకు చెప్పితిని. కావున నీ కనుకూలమైన ప్రదేశమునకు వెళ్ళుము. అట్లు రామభద్రుని వాక్యమును విని నమస్కరించి ఆటనుండి వచ్చితిని. ఇట్లు నీకు సుఖమును మోక్షమునిచ్చు హనుమంతుని చరితమును చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు ?

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున హనుమచ్చరిత్రమను డెబ్బది తొమ్మిద -  అధ్యాయము ముగిసినది.