49 - బృహదుపాఖ్యానమ్

సనందన ఉవాచ:

నిశమ్య త స్యేతి వచః పరమార్థసమన్వితమ్

ప్రశ్రయావనతో భూత్వా తమాహ నృపతిర్ద్విజమ్

సనందన మహర్షి పలి కెను :- రొజు ఇట్లు పరమార్ధమైన బ్రాహ్మణుని మాటలను విని వినయముచే వినమ్రుడై ఇట్లు పలికెను.

రాజోవాచ :

భగవన్యత్త్వయా ప్రోక్తం పరమార్థమయం వచః

శ్రుతే తస్మిన్భ్రమంతీప మనసో మన వృత్తయః

ఏతద్వివేకవిజ్ఞానం యది శేషేషు జంతుషు

భవతా దర్శితం విప్ర తత్పరం ప్రకృతేర్మహత్

నాహం వహామి శిబికాo శిబికా మయి న స్థితా

శరీరనున్యదస్మత్తో మేనేయం శిబికా ధృతా

గుణప్రవృత్తిర్భూతానాం ప్రవృత్తిః కర్మ చోదితా

ప్రవర్తంతే గుణాశ్చైతే కిం సమేతి త్వయోదితమ్

ఏతస్మిన్పరమార్ధజ్ఞ మమ శ్రోత్రపధం గతే

మనో విహ్వలతామేతి పరమార్థాద్ధతాం గతమ్

పూర్వమేవ మహాభాగ ! కపిలర్షిమహం ద్విజ

ప్రష్టుమభ్యుద్యతే గత్వా శ్రేయః కిం త్వత్ర సంశయే

తదంతరే చ భవతి యదిదం వాక్యమీరితమ్

తేనైవ పరమార్థార్ధం త్వయి చేతః ప్రధావతి

కపిలర్షిర్భగవతః సర్వభూతస్య వై కిల

విష్ణోరంశో జగన్మోహనాశాయ సముపొగతః

స ఏవ భగవాన్నూనమస్మాకం హితకామ్యయా

ప్రత్యక్షతామనుగతస్తథైతద్భనతోచ్యతే

తన్మహ్యం మోహనాశాయ యచ్చ్రేయః పరమం ద్విజ

తద్వదాఖిలవిజ్ఞానజలవీచ్యుదధిర్భవాన్

రాజు పలికెను :- ఓ మహానుభావో ! మీరు చెప్పిన పరమార్థమయమైన మాటను వినిన తరువాత నా మానసిక ప్రవృత్తులు భ్రాంతి చెందుతున్నట్టుగా తోచుచున్నవి. మిగిలి ప్రాణిజాతములలో ఈ వివేకము విజ్ఞానము కానరాదు. మీరు చూపిన విజ్ఞానము ప్రకృతికి అతీతమైనది. నేను పల్లకిని మోయుట లేదు. పల్లకి నా మీద లేదు. పల్లకిని మోయు శరీరము నాకంటే భిన్నమైనది. ప్రాణుల గుణప్రవృత్తి కర్మచే ప్రేరేపించబడును. ఇట్లు గుణములు ప్రవర్తించునపుడు నాదేది? అని మీరంటీరి. ఓ పరమార్ధ జ్ఞానము కలవాడా; మీ మాటలు నా చెవిన పడినపుడు సంపూర్ణముగా పరమార్ధము తెలియనందున నా మనసు వ్యాకులమగుచున్నది. ఈ సంశయగ్రస్తమగు సంసారమునందు హితమును కలిగించునదేది? అని కపిలమహర్షిని అడుగుటకే నేను బయలుదేరి యుంటిని. ఈ మధ్యలో మీరు పలికిన మాట పరమార్ధమును తెలుసుకొనమని నా మనసును ప్రేరేపించుచున్నది. సర్వజగత్స్వరూపుడగు శ్రీమహావిష్ణువు అంశమే జగన్మోహనోశమునకు కపిలమహర్షిగా అవతరించేననీ వింటీమి. ఆ భగవానుడు మాకు హితమును కూర్చు తలంపుచే ప్రత్యక్షమాయెనేమో? అని మీ మాటలు సందేహమును కలిగించుచున్నవి. కావున సమస్త విజ్ఞాన జలతరంగసముద్రమగు నీవు నా మోహము నశించుటకు ఉపయోగించు హితమునుపదేశించుము.                                                           

బ్రాహ్మణ ఉవాచ :-

భూయః పృచ్ఛసి కిం శ్రేయః పరమార్థ న పృచ్ఛసి

శ్రేయాంసి పరమార్థాని హ్య శేషాణ్యేవ భూపతే !

 దేవతారాధనం కృత్వా ధనసంపదమిచ్ఛతి

పుత్రానిచ్ఛతి రాజ్యం చ శ్రేయస్తస్యైవ తన్నృప

వివేకినస్తు సంయోగ శ్శ్రేయోఽసౌ పరమాత్మనా

కర్మయజ్ఞాదికం శ్రేయస్స్వర్లోకఫలదాయి యత్

శ్రేయః ప్రధానం చఫలే తదేవానభిసంహితే ఆత్మా ధ్యేయస్సదా భూప యోగయుక్తైస్తథాపరైః

శ్రేయస్త స్యైవ సంయోగ శ్శ్రేయో యః పరమాత్మనః

శ్రేయాం సేవమనేకాని శతశోఽథ సహస్రశః

సంత్యత్ర పరమార్థాస్తు నత్వా తే శ్రూయతాం చ మే

ధర్మోఽయం త్యజతే కింతు పరమార్ధో ధనం యది

వ్యయశ్చ క్రియతే కస్మాత్ కామప్రాప్యుపలక్షణః

పుత్రశ్చత్పరమార్ధాఖ్యసోఽప్యన్యస్య నరేశ్వర

పరమార్థభూతస్సోఽన్యస్య పరమార్దో హి నః పితా

ఏవం న పరమార్దోఽస్తీ జగత్యత్ర చరాచరే

పరమార్దో హి కార్యాణి కరణానామ శేషతః

రాజ్యాంప్రాప్తిరత్రోక్తా పరమార్థతయా యది

పరమార్థా భవంత్యత్ర న భవస్తి చ వై తతః

ఋగ్యజుస్సామనిష్పాద్యం యజ్ఞకర్మ మతం తవ

పరమార్ధభూతం తత్రాపి శ్రూయతాం గదతో మమ

యత్తు నిష్పాద్యతే కార్యం మృదా కారణభూతయా

తత్కారణానుగమనాత్ జాయతే నృప మృణ్మయమ్

ఏవం వినాశిభిర్ద్రవ్య: సమిదాజ్య కుశాదిభిః

నిష్పాద్యతే క్రియా యా తు సా భవిత్రీ వినాశినీ

అనాశీ పరమార్ధస్తు ప్రాజ్ఞైరభ్యుపగమ్యతే

యత్తు నాశి న సందేహా నాశిద్రవ్యోపపాదితమ్

తదేవాఫలదం కర్మ పరమార్ధో మతో మమ

ముక్తిసాధనభూతత్వాత్పరమార్ధో న సాధనమ్

ధ్యానమేవాత్మనో భూప పరమార్థార్థశబ్దితమ్

భేదకారి పరేభ్యస్తు పరమార్ధో న భేదవాన్

పరమార్ధాత్మ నోర్యోగః పరమార్థ ఇతీష్యతే

మిధ్యైతదన్యద్ధ్రవ్యం హి నైతౄవ్యమయం యతః

తస్మాచ్చ్రేయాంస్య శేషాణి న పైతాని న సంశయః

పరమార్ధస్తు భూపాల సంక్షేపాచ్చ్రుయతాం మము

ఏకో వ్యాపీ సమశ్శుద్ధో నిర్గుణః ప్రకృతేః పరః

జన్మవృద్ధ్యాదిరహిత ఆత్మా సర్వగతో నృప

పరిజ్ఞానమయో సద్భిర్నామజాత్యాదిభిర్విభుః

న యోగవాన్నయుక్తోఽ భూన్నైవ పార్ధివ యోక్ష్యతి

తస్యాత్మపరదే హేషు సతోఽ ప్యేకమయం హి తత్

విజ్ఞానం పరమార్దోఽసౌ వేత్తినోఽతథ్యదర్శనః

వేణురన్ద్రవిభేదేన భేదష్షడ్జాదిసంజ్ఞాతః

అభేదో వ్యాపినో వాయోస్తథా తస్య మహాత్మనః

ఏకత్వం రూపభేదశ్చ బాహ్యాకర్మ ప్రవృత్తిజః

దేవాదిభేదమధ్యా స్తే నా స్త్యేవాచరణ్ హి సః

శ్రుణ్వత్ర భూప ప్రాగ్వృత్తం యుద్గీతమృభుణా భవేత్

అవబోధం జనయతో నిదాఘస్య ద్విజన్మనః

బ్రాహ్మణుడు పలికెను:- మరల ఏమడుగుచున్నావు? శ్రేయస్సును పరమార్థముగా నడుగుచుంటివా? అన్ని శ్రేయస్సులు పరమార్ధములుగానే చెప్పబడుచున్నవి. దేవతారాధనమును చేసి ధనసంపదను కోరును. పుత్రులను కోరును. రాజ్యమును కోరును. వారికవియే శ్రేయస్సులు. వివేకము కలవారికి మాత్రము పరమాత్మతో సంయోగమే శ్రేయస్సు. స్వర్గాది లోకఫలములనిచ్చు యజ్ఞాది కర్మ లు కూడా శ్రేయస్సులే. ఫలమునాశించక చేయునది ప్రధానమగు శ్రేయస్సు. కావున యోగయుక్తులగు నరులు ఎల్లపుడు ఆత్మను ధ్యానించవలయును. ఇతరులు కూడా ఆత్మ నే ధ్యానించవలయును. ఆత్మ ధ్యానమే నిజమగు శ్రేయస్సు. పరమాత్మ సంయోగమే శ్రేయస్సు. ఇట్లు కొన్నివందల వేల శ్రేయస్సులు కలవు. కాని ఇవియన్నియూ పరమార్థములు కావు, నా మాటను వినుము. నిజముగా ధనమే పరమార్ధమగుచో ధనము నెందుకు విడుచుచున్నారు. కామఫలప్రాప్తి కొరకు వ్యయమెందుకు చేయుచున్నారు? పుత్రుడు పరమార్ధమైనచో అతడు కూడా ఇతరులకు ఈయబడుచున్నొడు. తీసుకొనువాడు పరమార్థమన్నచో అతను కూడా ఇతరులకు తండ్రి యగును కదా? తండ్రి పరమార్థమగుచో ఇతరుల కొరకేల తండ్రిని విడుచుచుంటివి? కావున ఈ జగత్తులో ఏ ఒక్కటీ నియతముగా పరమార్థమని చెప్పుటకు వీలు పడదు. సమస్త కోరణములకు కార్యములను పరమార్ధముగా చెప్పబడుచున్నది. రాజ్యాది ప్రొప్పులను పరమార్ధములుగా చెప్పినచో పరమార్ధములగును. చెప్పనిచో పరమార్ధములు కాజాలవు.ఋగ్యజుస్సామములతో నిష్పన్నములగు యజ్ఞాదులు పరమార్ధములగుచో ఆవిషయమున నేను చెప్పుదానిని వినుము. కారణ భూతమగు మృదాదులచే నిష్పన్నమగునది కారణము ననుసరించి మృణ్మయమగును. అట్లే నశించు స్వభావముకల సమిధలు దర్భలు పుష్పములు మొదలగు ద్రవ్యములచే చేయబడు క్రియ కూడా వినాశియే యగును. పరమార్ధము నాశము లేనిదని పండితులంగీకరింతురు. నశించునది " నశించుద్రవ్యములచే ఏర్పడినదనుట నిస్సందిగ్గమే, అది ఫలమునిచ్చునది కాదు. కావున ఫలము నీయని కర్మ పరమార్థమని చెప్పవలయును. ముక్తికి సాధనమగు నదియే పరమార్థమనిచో పరమార్ధము సాధనము కాజాలదు. ఆత్మ ధ్యానము మాత్రమే పరమార్థమనబడును. ఇతరులు . భేదమును కల్పింతురు కాని పరమార్ధమునకు భేదము లేదు. , పరమార్ధమునకు ఆత్మకు సంయోగము మాత్రమే పరమార్ధము. మిగిలిన " ద్రవ్యమును పరమార్దమనుట మీధ్యయే యగును, పరమార్ధము ద్రవ్యమయము కాక పోవుటయే దానికి కారణము. కావున ఇవి యన్నియు శ్రేయస్పులు మాత్రమే కొని పరమార్థములు కావు. పరమార్ధమును సంక్షేపముగా చెప్పెదను వినుము. ఒకడు, వ్యాపకుడు, సముడు, శుద్దుడు, నిర్గుణుడు, ప్రకృతి కంటే పరుడు, జన్మవృద్ద్యాది రహితుడు, సర్వగతుడు ఆత్మ. నామ జాత్యాదులచే సజ్జనులు తెలియుదురు.ఆత్మయే విభువు. ఆత్మయోగము కలది కాది, యుక్తము కాదు. యుక్తము కాబోదు. ఆ యాత్మ తన, ఇతర దేహములలో ఉన్ననూ ఒక్కటే కాని భిన్నము కాదు. ఆత్మను తెలియు ఓ పరమార్ధము. అసత్యమును చూచువారు దీనిని తెలియ జాలరు. వేణురంధ్రముల భేదములచే షడ్డాది స్వరభేదములు ఏర్పడును. కాని అన్నిరంధ్రములలో వ్యాపించియుండు వాయువు మాత్రము ఒక్కటే. అట్లే దేహాదులు భిన్నములైనను ఆత్మ ఒక్కటే. రూపభేదము బాహ్యకర్మ ప్రవృత్తులచే ఏర్పడినది మాత్రమే. రూపాది భోగములచే దేవాది భేదములను పొందును కాని ఆచరణలో మాత్రమే సమానమే. ఈ విషయమున పూర్వకాలమున జరిగినది ఋభువుచే చెప్పబడినది. ఒకటి కలదు. వినుము. బ్రాహ్మణుడగు నిధఘునకు చేసిన జ్ఞానోపదేశమది.

ఋభుర్నామా భవత్పుత్రో బ్రహ్మణః పరమేష్ఠినః

 విజ్ఞాతతత్త్వసద్భావో నిసర్గాదేవ భూపతే

తస్య శిష్యో నిదాఘోఽభూతులస్త్యతనయః పురా

ప్రాదాద శేషవిజ్ఞానం స తస్మై పరయా ముదా

అవాస్తజ్ఞానతత్త్వస్య న తస్యాద్వైతవాసనా

స ఋభుస్తర్కయామాస నిదాఘస్య నరేశ్వర

దేవికాయాస్తటే వీర నాగరం నామ వై పురమ్

సమృద్ధమతిరమ్యం చ పులస్యైననివేతమ్

రమ్యోపవనపర్యంతం స తస్మిన్పార్దివోత్తమ

నిదాఘనామా యోగజ్ఞ స్తస్య శిష్యోఽభవత్పురా

దివ్య వర్షసహ స్తే తు సమతీఽస్య తత్పురమ్

జగామ స ఋభుశ్శీష్యం నిదాఘమవలోకతుమ్

స తస్య వైశ్వదేవాంతే ద్వారాలోకనగోచరః

స్థిత స్తేన గృహీతార్దో నిజవేశ్మ ప్రవేశిత

ప్రక్షాలితాంఘ్రపాణిం చ కృతాసనపరిగ్రహమ్

ఉవాచ స ద్విజశ్రేష్ఠో భుజ్యతామితి సాదరమ్

పరమేష్టియగు బ్రహ్మకు ఋభువను పుత్రుడు కలడు. సహజముగా ఋభువు తత్త్వార్ధ జ్ఞానము కలవాడు. ఆ ఋభువునకు పులస్త్యతనయుడగు నిదాఘుడను వాడు శిష్యుడుగా ఉండెను. ఋభువు పరమానందముతో సమస్త విజ్ఞానమును బోధించెను. ఇట్లు తత్త్వ జ్ఞానము కలిగిన నిదాఘనకు అద్వైత వాసన కలుగలేదని ఋభువు ఊహించెను. జ్ఞానమును పొందిన నిదాఘుడు తన తండ్రివసించు నాగరమను పురమునకు వెళ్ళి నివసించేను. ఆ పురము దేవినదీ తీరమున నుండెను. సర్వసంపత్సమృద్ధము, అతిసుందరము సుందరోపవనయుతము. ఆ నగరమున యోగజ్ఞుడగు నిదాఘుడు నివసించుచుండెను. దివ్యములగు వేయిసంవత్సరములు గడిచిన తరువాత తన శిష్యుడగు నిదాఘుని చూచుటకు ఋభువు వేడలేను. నిదాఘుడు వైశ్వదేవమును పూర్తిగావించిన పిదప ద్వారదేశమున ఋభుని చూచి లేచి ఎదురేగి స్వాగతము పలికి లోనికి తీసుకొని వచ్చి పాదప్రక్షాళనముచేసి ఆసనమున కూర్చుండబెట్టి భుజించుడని పలికెను.

ఋభురువాచ :-

భో విప్రవర్య భోక్తవ్యం యదత్ర భవతో గృహే

తత్కథ్యతా కదన్నేషు న ప్రీతిస్సతతం మమ

ఋభువు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా!మీ గృహమున ఏమి తినవలయునో చెప్పుము. ఈ కుత్సితాన్నము నందు నాకు ప్రీతిలేదు.

నిదాఘ ఉవాచ :-

పక్తుయావకవ్రీహీనామపూపానాం చ మే గృహే

యద్రోచతే ద్విజశ్రేష్ఠ తావద్బుంక్ష్వ యథేచ్చయా

నిదాఘుడు పలికెను :- సత్తు పిండి, యవలు ద్రోహులచే చేయబడిన పదార్ధములు అపూపములు నా ఇంటిలో సమృద్ధిగా నున్నవి. వాటిలో మీకు నచ్చిన వాటిని భుజించుడు.

ఋభురువాచ :

కదన్నాని ద్విజైతాని మిష్టమన్నం ప్రయచ్ఛ మే

సంయావపాయసాదీని చేక్షు కారసవంతి చ

ఋభువు పలికెను:- ఇదియన్నియూ కదన్నములే. నాకు మిష్టాన్నమునిమ్ము భక్ష్యములను పాయసములను చెరుకు రసములను ఇమ్ము.

నిదాఘ ఉవాచ :

గృహే శాలిని మద్గే హే యత్కించిదతిశోభనమ్

భోజ్యేషు సాధనం మిష్టం తేనాస్యాన్నం ప్రసాధయ

ఇత్యుక్తా తేన సా పత్నీ మిష్టమన్నం ద్విజస్య తత్

ప్రసాధితవతీ తద్వై భర్తుర్వచనగౌరవాత్

తం భుక్తవంతమిచ్ఛాతో మిష్టమన్నం మహామునిమ్

నిదాఘః ప్రాహ భూపాలప్రశ్రయావనతస్స్థితః

నిదాఘుడు పలికెను :- ఓ శాలినీ ! మన ఇంటిలో ఉన్న ఉత్తమ ఫదార్ధములతో రుచికరమైన ఉత్తమాన్నమును సిద్ధము చేయుము అనీ భార్యతో పలుకగా నిదాఘుని భార్య రుచికరమైన ఆహారమును సిద్ధము చేసెను. ఋభుడు ఆ ఆహారమును భుజించెను. అపుడు నిదాఘుడు వినయముతో  వినమ్రుడై ఋభునితో - ఇట్లు పలికెను.

నిదాఘ ఉవాచ :

ఆపి తే పరమా తృప్తిరుత్పన్నా పుష్టిరేవ వా

అపి తే మానసం స్వస్థం ఆహారేణ కృతం ద్విజ

క్వ నివాసీ భవాన్విప్ర క్వ వాగంతుం సముద్యతః

ఆగమ్యతే చ భవతా యతస్తచ్చ నివేద్యతామ్

నిదాఘుడు పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా ! మీరు కోరిన రుచికరమైన ఆహారముతో మీకు తృప్తి పుష్టి కలిగినవా? మీ మనసుకు స్వస్థత చేకూరినదా? మీరు ఎక్కడ నివసించుచున్నారు? ఎచటికి బయలుదేరుతున్నారు? ఎచటి నుండి వచ్చుచున్నారు? దయచేసి తెలుపుడు.

ఋభురువాచ :-

క్షుధితస్య చ భుక్తేఽన్నే తృప్తిర్భ్రహ్మ నిజాయతే

న మే క్షుధా భవేత్తృప్తిః కస్మానాం ద్విజపృచ్ఛసి

వహ్నినా పార్ధివేనాదౌ దగ్ధే వై క్సుత్సా పార్ధివః

భవత్యంభసి చ క్షీణే నృణాం తృష్ణాసముద్భవః

క్షుత్తృష్ణే దేహధర్మాఖ్యే న మమైతే యతో ద్విజ!

తతః కుత్సంభవాభవాత్ తృప్తిర స్త్యేవ మే సదా

మనసస్స్వస్థతా తుష్టిశ్చిత్తధర్మావిమౌ ద్విజ

చేశసో యస్య యత్పృష్టం పుమానేభిర్న యజ్యతే

క్వ నివాసస్త వేత్యుక్తం క్వ గంతాసి చ యత్త్వయా

కుతశ్చాగమ్యతే త్వతత్ త్రితయేఽపి నిబోధ మే

పుమాన్సవర్గతో వ్యా పీత్యాకాశవదయం యతః

కుతః కుత్ర క్వ గంతాసీత్యేతదప్యర్థవత్కథమ్

సోఽహం గంతా న చాగంతా నైక దేశని కేతనః

త్వం చాన్యే చ న చ త్వం త్వం నాన్యే నైవాహమప్యహమ్

మిష్టాన్నే మిష్టమిత్యేషా జిహ్వ సా మే కృతా తవ

కిం వక్ష్యతీతి తత్రాపి శ్రూయతోం ద్విజసత్తమ

మిష్టమేవ యదా మిష్టం తదేవోద్వేగకారణమ్

అమిష్టం జాయతే మిష్టం మిష్టాదుద్విజతే జనః

ఆదిమధ్యావసానేషషు కిమన్నం రుచికరణమ్

 మృణ్మయం హి మృదా యద్వద్గృహం లిప్తం స్థిరీభవేత్

పార్థివోఽయం తథా దేహః పార్థివైః పరమాణుభిః

యవగోధూమముద్గాదిఘృతం తైలం పయో దధి

గుడః ఫలానీతి తథా పార్థివాః పరమాణవః

తదేతద్భవతా జ్ఞాత్వా మిష్టామిష్టవిచారి యత్

తన్మనశ్శమనాలంబి కార్యం ప్రాప్యం హి ముక్తయే

ఇత్యాకర్ణ్య వచస్తస్య పరమార్ధాశ్రితం నృప

ప్రణిపత్య మహాభాగో నిదాఘో వాక్యముబ్రవీత్

ప్రసీద మద్ధితార్థాయ కథ్యతాం యస్త్వమాగతః

నష్టా మోహస్తనాకర్ణ్య వచాం స్యేతాని మే ద్విజ

ఋభువు పలికెను :- ఆకలిగొన్నవాడు అన్నమును భుజించినచో తృప్తి కలుగును. నాకు ఆకలి లేదు. తృప్తి లేదు. నన్నేల అడుగుచున్నావు? అగ్నిచే పార్థివము దహించబడగా ఆకలి కలుగును. దానిని పార్థివకుల్ అందురు. శరీరములోని నీరు తరిగినచే దప్పియగును. మనసు అడిగిన దానితో జీవునకు సంబంధములేదు. మీనివాసమెక్కడ? మీరెక్కడికి వెళ్ళుచున్నారు? ఎక్కడి నుండి వచ్చుచున్నారు? అని నీవడిగితివి. ఈ మాటి విషయమున నేను చెప్పుదానిని తెలియుము. జీవుడు ఆకాశము వలె అంతటా వ్యాపించియుండును. కావున ఎక్కడ, ఎచటినుండి? ఎచటికి? అను ప్రశ్నలకు అర్థమెట్లుండును? జీవుడనగు నేను వెళ్ళువాడను కాను, వచ్చువాడను కాను. ఒకే ప్రదేశమున ఉండువాడను కాను. నీవు కాని ఇతరులు కాని ఇంతియే. నీవు నీవు కావు, నేను నేను కాను ఇతరులు ఇతరులు కారు. రుచికరమైన ఆహారమును కోరినది జిహ్వ. రుచిని తెలుపునదికూడా జిహ్వయే. ఆ జిహ్వ ఏమి చెప్పుతో వినుము. రుచికరమైనది నిజముగా రుచించినచో ఉద్వేగమును కలిగించును. రుచి లేనిది రుచి కలిగించును. రుచి కలిగిన ఉద్వేగము కలుగును. ఆదిమధ్యావసానములలో అన్నము రుచి కారణమగునా? మట్టితో నిర్మించిన ఇంటిని మరల మట్టిచే చక్కగా పై పూత పూసినచో స్థిరముగా నుండును. అట్లే పొర్ధవమైన ఈ దేహము పార్ధివ పరమాణువులచే దృఢమగును. యవలు, గోధుమలు, పెసలు, ఘృతము, తైలము, పాలు, పెరుగు గుడము ఫలములు ఇవియన్నియు పార్థివ పరమాణు సంఘాతములే. దీనిని తెలుసుకొని మీష్టమో అమిష్టమో ఆలోచించుము. అట్లాలోచించినచో మనశ్శాంతి కలుగును. అపుడు ముక్తికి ప్రయత్నించవలయును. ఇట్లు ఋభువు పలికిన పరమార్థయుక్తమగు వచనమును వినిన నీదొఘుడు ప్రణామముల నాచరించి ఇట్లు పలికెను. ఓ మహానుభావా? ప్రసన్నుడవు కమ్ము. మీరు నాకు హితమును కూర్చుటకే వచ్చియుంటిరి. ఓ బ్రాహ్మణోత్తమా? మీరు పలికిన మాటలను విని నా మోహము తొలగినది.

ఋభురువాచ :

ఋభురస్మి తవాచార్యః ప్రజ్ఞాదానాయ తే ద్విజ!

ఇపగతోఽహం దాస్యామి పరమార్థం సుబోధితమ్

ఏక ఏవమిదం విద్ది న భేది సకలం జగత్

వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మనః

ఋభువు పలికెను :- నేను ఋభుడను వాడను, నీ ఆచార్యుడను. నీకు జ్ఞానమును ప్రసాదించుటకు ఇటకొచ్చితిని. నీకు చక్కని పరమార్ధమును సులభముగా బోధించెదరు. ఈ జగత్తంతయూ ఒకటే. భిన్నము కాదు. ఈ ప్రపంచమంతయూ పరమాత్మ యగు వాసుదేవుని స్వరూపమే.

బ్రాహ్మణ ఉవాచ :

తథేత్యుక్త్వా నిదాఘేన ప్రణిపాతపురస్సరమ్

పూజితః పరయా భక్త్యా నిశ్చితః ప్రయయౌ విభుః

పునర్వర్షసహస్రాంతే సమాయాతో నరేశ్వర!

నిదాఘజ్ఞానదానాయ తదేవ నగరం గురుః

నగరస్య బహిస్సోఽథ నిదాఘం దృష్టవాన్మునిమ్

మహాబలపరీవారే పురం విశతి పార్ధివే

దూరస్థితం మహాభాగ జనసంమర్ధవర్జకమ్

క్షుత్కామకంఠమాయాంతమరణ్యాత్స సమిత్కుశమ్

దృష్ట్వా నిదాఘం స ఋభురుపాగత్యాభివాద్య చ

 ఉవాచ కస్మా దేకాంతే స్త్రీయతే భవతా ద్విజ

బ్రాహ్మణుడు పలికెను :- నిదాఘుడు అట్లే అని పలికి పరమభక్తితో పూజించగా పూజను స్వీకరించి సంతృప్తితో వెడలిపోయెను. మరల వేయిసంవత్సరములు గడిచిన పిదప నిదాఘునకు, జ్ఞానమునిచ్చుటకు ఆదే నగరమునకు వచ్చెను. నగరము వెలుపల ఋభువు మునిగా నున్న నిదాఘుని చూచేను. మహా సైన్యముతో రాజు నగరములోనికి ప్రవేశించుచుండగా జన సమ్మర్ధములేని ఏకాంత ప్రాంతమున దూరముగా నున్న వానిని ఆకలి దప్పులచే శుష్క గాత్రునిగా అరణ్యమునుండి సమిధలను దర్భలను తెచ్చుచున్న నిదాఘుని చూచేను. అట్లు నిదాఘుని చూచిన ఋభువు నిదాఘుని సమీపించి అభివాదము చేసి నీవి బ్లీకొంతమున ఎందుకుంటివి? అని అడిగేను.

నిదాఘ ఉవాచ :

భో విప్ర జనసమ్మర్దో మహానేష జనేశ్వరే

ప్రవివిక్షా పురే రమ్యే తేనాత్ర స్థియతే మయా

నిరాఘుడు పలికెను:- ఓ బ్రాహ్మణోత్తమా! ఈ జనాధిపుడు నగరమును ప్రవేశించుచున్నపుడు చాలా జనసమూహమున్నది. కావున నేనిచట ఉంటీని.

ఋభురువాచ :

నరాధిపోఽత్ర కతమః కతమ శ్చేతరో జనః

కథ్యతాం మే ద్విజశ్రేష్ఠ త్వమభిజ్ఞో మతో మమ

ఋభువు పలికెను :- ఇక్కడున్న వారిలో రాజెవరు? ఇతరులెవరు? నీవు బాగా తెలిసిన వాడవు. కావున నాకు తెలుపుము.

నిదాఘ ఉవాచ :

యోఽయం గజేన్ద్రమున్మత్త మద్రిశృంగసముచ్చ్రయమ్

అధిరూఢ నరేన్ద్రోయం పరితో యస్తదేతరః

నిదాఘుడు పలికెను :- పర్వత శిఖరము వలె ఎత్తుగానున్న గజేన్ద్రుని అధిరోహించియున్నవాడు రాజు. అతని చుట్టూ ఉన్నవారు ఇతర జనులు.

ఋభురువాచ:-

ఏతా హి గజరాజానౌ దృష్టౌ హి యుగపన్మయా

భవతా నిర్విశే షేణ పృథగ్వేదోపలక్షితా

తత్కథ్యతాం మహాభాగ విశేషో భవతానయోః

జ్ఞాతుమిచ్ఛామ్యహం కోఽత్ర గజః కో వా నరాధిపః

ఋభువు పలికెను:- నేను మాత్రము గజమును రాజును ఒకేమారు ఒకేవిధముగా చూచుచున్నాను. నీవు మాత్రము విడిగా గుర్తించుచున్నావు. కావున ఓ మహానుభావా ! ఈ గజరాజులకున్న భేదమును తెలుపుము. ఎవరు గజమో ఎవరు రాజో చెప్పుము.

నిదాఘ ఉవాచ :-

గజో యోఽయమథో బ్రహ్మన్నుపర్య స్త్యేష భూపతిః

వాహ్యవాహకసంబంధం కో న జానాతి వై ద్విజ

నిదాఘుడు పలికెను:- ఓ బ్రాహ్మణా! క్రింద నున్నది గజము పైన ఉన్నవాడు రాజు. ఈ ఇద్దరి కున్న వాహ్యవాహక : సంబంధమును తెలియని వారెవరు?

బుభురువాచ :-

బ్రహ్మన్యథాహం జానీయాం తథా మామవబోధయ

అధస్సత్త్వవిభాగం కిం కిం చోర్ధ్వమభిధీయతే

ఋభువు పలికెను :- ఓ బ్రాహ్మణా నాకు తెలియునట్లు తెలుపుము. అధోభాగమనగా నేమి? ఊర్ధ్వభాగమనగానేమి? ఈ విభాగమును తెలుపుము.

బ్రాహ్మణ ఉవాచ :-

ఇత్యుక్త్వా సహసారుహ్య నిదాఘః ప్రాహ తం ఋభుమ్

శ్రూయతాం కథయామ్యేష యన్మాం త్వం పరిపృచ్ఛసి

 ఉపర్యహం యథా రాజా త్వమధః కుంజరో యథా

అవబోధయ తే బ్రహ్మన్దృష్టాంతో దర్శితో మయా

బ్రాహ్మణుడు పలికెను :- ఈ మాటను వినిన వెంటనే నిదాఘుడు ఋభువు నధిరోహించి నీవడిగిన దానిని చెప్పెదను వినుము. రాజువలె నేను పైన ఉంటిని. ఏనుగు వలె నీవు క్రిందనుంటివి. ఇపుడు ఈ దృష్టాంతముతో తెలియుము.

ఋగురువాచ :

త్వం రాజేవ ద్విజశ్రేష్ఠ స్థితోఽహం గజవద్య

తదేవ త్వం సమాచక్ష్వ కతమస్త్వమహం తథా

ఋభువు పలికేను :- నీవు రాజువలె నేను ఏనుగు వలె ఉన్నచో మొదట నీవెవరు? నేనెవరో తెలుపుము.

బ్రాహ్మణ ఉవాచ :

ఇత్యుక్తస్సత్వరస్తస్య చరణావభివాద్య సః

నిదాఘః ప్రాహ భగవన్ ఆచార్యస్త్వమృభుర్మమ

నాన్యస్యా ద్వైతసంస్కారసంస్కృతం మానసం తథా

యథాచార్యస్య తేన త్వాం మన్యే ప్రాప్తమహం గురుమ్

బ్రాహ్మణుడు పలికెను :- ఋభువు మాటలను వినిన నిదాఘుడు త్వరపడి వెంటనే క్రిందికి దిగి, పాదముల పై బడి ప్రణమిల్లి మీరు మా ఆచార్యులగు ఋభువులు. ఇతరుల కిట్లు అద్వైత సంస్కారముగల మనసుండదు. కావున నేను మిమ్ములను ఆచార్యులనుగా గుర్తించితిని .అని పలి కెను.

ఋభురువాచ :-

తవోపదేశదానాయ పూర్వశుశ్రుషణాత్తవ

గురు స్నేహాదృభుర్నామ నిదాఘం సముపాగతః

తదేతదుపదిష్టం తే సంక్షే పేణ మహామతే!

పరమార్ధసారభూతం యత్తదద్వైతమ శేషతః

ఋభువు పలికెను :- నీవు మొదట చేసిన సేవలవలన నీకు ఉపదేశించుటకు గురు స్నేహముచే ఋభువు నిదాఘుని చేరెను. ఓ మహామతీ! పరమార్ధసారభూతమైన అద్వైతమును సమగ్రముగా సంక్షేపముగా నీకుపదేశించితిని.

బ్రాహ్మణ ఉవాచ :-

ఏవముక్త్వా దదౌ విద్యాం నిదాఘం ప ఋభుర్గురుః

నిదాఘోఽప్యుపదేశేన తేనాద్వైతపరోఽభవత్

సర్వభూతాన్యభేదేన దదృశే స తదాత్మనః

తథా బ్రహ్మ తనౌ ముక్తిమవాప పరమో ద్విజః

తథా త్వమపి ధర్మజ్ఞ తుల్యాత్మరిపుబాంధవః

భవ సర్వగతం జ్ఞానం ఆత్మానమవనీపతే

సితనీలాదిభేదేన యథైవం దృశ్యతే నభః

భ్రాంతదృష్టిభిరాత్మా పి తథైకస్సన్పృథక్ పృథక్

ఏకస్సమస్తం యదిహాస్తి కించిత్ తదచ్యుతో నాస్తి పరం తతోఽన్యత్

 సోహం స చ త్వం స చ సర్వమేతత్ ఆత్మా స్వయం భాత్యపభేదమోహః

బ్రాహ్మణుడు పలికెను :- ఇట్లు గురువగు ఋభువు నిదాఘుని గూర్చి పలికి అద్వైతవిద్యను బోధించెను. ఆ యుపదేశముచే నిదాఘుడు కూడా అద్వేశపరుడాయెను. అపుడు తనను ఇతర ప్రాణులను అభేదముగా చూడగలిగెను. అట్లు అద్వైత జ్ఞానముచే కొంతకాలమునకు నిదాఘుడు బ్రహ్మ స్వరూపమున లీనమై ముక్తిని పొందెను. అట్లే నీవు కూడా ధర్మజ్ఞుడవై శత్రుమిత్రులలో సమభావము కలవాడవై ఆత్మ సర్వగతము ఏకము అని తెలియుము. ఒకటే ఆకాశము నలుపు తెలుపు బేధముచే ఎట్లు కనపడుచున్నదో అట్లే భాంత్రదృష్టి గలవారికి ఒకే ఆత్మ భిన్నముగా కనపడును. ఈ లోకమున ఉన్నదంతయూ ఒకే ఆత్మ. ఆత్మ కంటే భిన్నమైనది మరియొకటి లేదు. అదియే అచ్యుత నామము. ఆ యచ్యుతుడే నేను, నీవు, ఈ సమస్త ప్రపంచము. ఆ పరమాత్మ భేదమోహశూన్యముగా నుండును.

సనందన ఉవాచ :-

ఇతీరిత స్తేన స రాజవర్యస్తత్యాజ భేదం పరమార్ధదృష్టి:

స చాపి జాతిస్మ రణావబోధస్తత్రైవ జన్మ న్యపవర్గమాప

పరమార్థాధ్యాత్మ మేతత్తుభ్యముక్తం మునీశ్వర

బ్రాహ్మణక్షత్రియవిశాం శ్రోతౄణాం చాపి ముక్తిదమ్

యథా పృష్టం త్వయా బ్రహ్మన్ తథా తే గదితం మయా

బ్రహ్మజ్ఞానమిదం శుద్దం కిమన్యత్కథాయామి వై

ఇతి శ్రీబృహన్నారదీయపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే ఏకోనపంచాశత్త మోఽధ్యాయః

సనందన మహర్షి పలికెను :- ఇట్లు బ్రాహ్మణుని ఉపదేశమును పొందిన ఆ రాజశ్రేష్ఠుడు పరమార్ధదృష్టికలవాడై భేదదృష్టిని విడిచెను. ఆ బ్రాహ్మణుడు కూడా పూర్వజన్మ జ్ఞానముచే ఆ జన్మలోనే మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా!ఇట్లు ఈ పరమార్ధమగు అధ్యాత్మజ్ఞానమును నీకుపదేశించితిని. ఈ జ్ఞానము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు విను వారందరికీ మోక్షమును ప్రసాదించును. నీవడిగినట్లు నేను చెప్పితిని. ఇదియే పరిశుద్ధమగు బ్రహ్మ జ్ఞానము. ఇంకనూ ఏమి చెప్పవలయునో అడుగుము.

ఇది శ్రీబృహన్నారదీయపురాణమున పూర్వభాగమున బహదుపాఖ్యానమున రెండవపాదమున నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.