66 -  అధ్యాయము

సనత్కుమార ఉవాచ :

తతశ్శ్వాసానుసా రేణ దత్వా పాదం మహీతలే,

సముద్రమేఖలే దేవి! పర్వతస్తనమండలే.

విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే,

ఇతి భూమిం తు సం ప్రార్ద్య విహరేచ్చ యథావిధి.

 రక్షః కోణే తతో గ్రామాద్గత్వా మంత్రముదీరయేత్,

 గచ్ఛంతు ఋషయో దేవాః పిశాచా యే చ గుహ్యకాః.

పితృభూతగణాస్సర్వే కరిష్యే నులమోచనమ్,

ఇతి తాలత్రయం దత్వా శిరః ప్రావృత్య వాససా.

దక్షిణాభిముఖం రాత్రా దీవా స్థిత్వా హ్యుదబ్ముఖః,

మలం విసృజ్య శాచం తు మృదాదిస్సముపాచరేత్.

ఏకలింగే గుదే తిసో దశవామకరే మృదః,

కరయోస్సప్త వై దద్యాత్రిత్తివారల చ పాదయోః .

ఏవం శౌచం విధాయాథ గండూషాన్గ్వాదశైవ తు,

కృత్వా వనస్పతిం చాథ ప్రార్ధయేన్మనునామునా.

ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసీని చ,

శ్రియం ప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే.

సంప్రౌఢ్యానం దంతకాష్ఠం ద్వాదశాంగులపంమీతమ్,

 గృహీత్వా కొమమంత్రేణ కుర్యోన్మంత్రీసమాహితః.

కామదేవపదం దన్తం తథా సర్వజనప్రియమ్,

హృదంతః కామబీజాఢ్యం దంతాంశ్చ నేన శోధయేత్.

జిహువల్లేఖో వాగ్భవేన మూలేన క్షాలయేన్ముఖమ్,

 దేవాగారం తతో గత్వా నిర్మాల్యమపనీర్య చ.

 పరిధాయాంబరం శుద్దం మంగలారార్తికం చరేత్,

ఆస్ట్రేణ పాత్రం సంప్రోక్ష్య మూలేన జ్వాలయేచ్చ తమ్.

సంపూజ్య పాత్రమాదాయోత్థాయ ఘంటాం చ పాదయేత్,

సుగోఘృతప్రదీ పేన బ్రోమితేన సమంతతః.

 వాద్యైర్గీతైర్మనోజైశ్చ దేవస్యారార్తికం భవేత్ ,

 ఇతి నీరాజనం కృత్యా ప్రార్థయిత్యా విజేశ్వరమ్.

స్నాతుం యాయాన్నిమ్నగాదే కీర్తయన్డేవతాగుణాన్,

గత్వా తీర్థం నమస్కృత్య స్నానీయం చ నిధాయ వై.

మూలాభిమంత్రితమృదమాదాయ కటిదేశతః,

విలప్య పాదపర్యంతం క్షాలయేత్తీర్ధవారీణా.

తతశ్చ పంచభిః పాదౌ ప్రక్ష్యాంతర్జలే పునః,

ప్రవిశ్య నాభిమాత్రే తు మృదం పామకరస్య చ.

 మణిబిందే హస్తతలే తదగ్రే చ తథా పునః,

కృత్వాంగుల్యాగాంగమృదయాదాయాస్ట్రేణ తత్పునః.

నిజోపరి చ మంత్రజ్డ్ భామయిత్వా త్యజేత్సుధీః,

తలస్థాం చ షడంగేషు తన్మంతైః ప్రవిలేపయేత్.

నిమజ్య క్షాలయేత్సమ్యక్ మలస్నానమీతీరితమ్,

 విభావ్యేష్టమయం సర్వమాంతరం స్నానమితీరితమ్.

 అనన్హాదిత్యసంకాశం నిజభూషాయుధైర్యుతమ్,

మంత్రమూర్తిం ప్రభుం స్మృత్వాజ తత్పాదోద కంభవామ్.

ధారాం చ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం నిజాం తనుమ్,

తయా సంక్షాలయేత్సర్వమంతర్దేహగతం మలమ్.

తతస్స ద్వారజామంత్రీ జాయతే స్పటికోపమః,

తతశ్శ్రౌక్త విధినా స్నాత్వా మంత్రి సమాహితః.

 మంత్రస్నానం తతః కుర్యాత్తద్విధానమథోచ్యతే.

సనత్కుమార మహర్షి పలికెను :- తరువాత శ్వాసానుసారముగా భూమి మీద పాదము నుంచి సముద్రములు మొలనూలుగా ధరించి పర్వతములను స్థనమండలము గల విష్ణుపత్నీ ! నీకు నమస్కారము. నా పాదస్పర్శను క్షమించుము అని భూమిని ప్రార్థించి యథావిధిగా తిరుగవలయును. తరువాత గ్రామమునకు నైఋతి దిక్కునకు వెడలి ఈ మంత్రమును పలుకవలయును. ఋషులు దేవతలు పిశాచములు గుహ్యములు పితృభూత గణములందరూ ఇట నుండి వెళ్ళుడు. నేను మలమోచనమును చేతును. అని మూడుమార్లు చప్పట్లు కొట్టి తలకు  వస్త్రమును చుట్టి రాత్రి అయినచో దక్షిణా ముఖముగా, పగలు ఉత్తరాభిముఖముగా కూర్చొని మల విసర్జనగావించి మట్టిచే నీటిచే శౌచమునాచరించవలయును. లింగమున ఒకసారి మట్టి, గుదమున మూడుమార్లు వామకారమును పదిమార్లు, చేతులకు ఏడుమార్లు, పాదములకు మూడూమూర్లు గండూషమునాచరించవలయును. తరువాత ఈ మంత్రముచే వనస్పతిని ప్రార్థించవలయును. ఆయుష్యమును, బలమును, యశమును, వర్చస్సును, సంతానమును, పశువులను, ధనమును, శ్రీని, ప్రజ్ఞను, మేధస్సును నీవు నాకిమ్ము. ఇట్లు ప్రార్థించి పన్నెండు అంగుళములు కల దంతకాష్ఠమును తీసుకొని మంత్రమును పొందినవాడు. కామమంత్రముచే సావధానుడై కామదేవపదము సర్వజనప్రియము హృదయాంతరమున కామబీజాడ్యము నుండు దంతములను ఈ కాష్టముచే శోధించవలయును. వాగ్భవమగు మూలముచే నాలుకను గీచుకొని ముఖ ప్రక్షాలనమును గావించవలయును. తరువాత దేవాలయమునకు వెళ్ళి నిర్మాల్యమును తీసివేసి శుద్ధవస్త్రమును ధరించి మంగళహారతి నీయవలయును. అస్త్రముచే పాత్రను ప్రోక్షించి మూలమంత్రముచే జ్వలింప చేయవలయును. చక్కగా పూజించి పాత్రను తీసుకొని లేచి ఘంటానాదమును చేయవలయును. మంచి ఆవు నెయ్యితో వెలిగించిన దీపమును అంతటా త్రిప్పి సుందరమును వాద్యగీతములచే దేవునికి ఆరతీయ వలయును. ఇట్లు నీరాజనమును చేసి తన ఇష్టదేవతను ప్రార్థించి, దేవతాగుణములను కీర్తించుచు నదీ ప్రాంతమునకు స్నానమునకు వెళ్ళవలయును. అట్లు వెళ్ళి తీర్థమునకు  నమస్కరించి స్నానీయపాత్రను ఉంచి, మూలమంత్రముచే మంత్రించబడిన మట్టిని తీసుకొని కటీ ప్రాంతము నుండి పాదముల వరకు వ్రాసుకొని తీర్ధజలముచే క్షాలనము చేయవలయును. తరువాత అయిదు మార్లు మట్టిలో పాదములను కడిగి జలాంతర్భాగమున ప్రవేశించి నాభిమాత్రమున వామహస్తమునను, మణి బంధమున, అరచేతిలో, చేతిముందు భాగమున అంగుళులచే గంగామృత్తికను వ్రాసి దానిని అస్త్రముచే మరల తన మీద చుట్టి వదలవలయును. అరచేతిలో ఉన్నదానిని షడంగముల యందు ఆ మంత్రములచే వ్రాయవలయును. మునిగి చక్కగా క్షాలన చేయవలయును. దీనిని మలస్నానమందురు. ఇట్లు ఇష్టమయముగా భావించి ఆంతర స్నానమును ఆచరించవలయును. అనంతాదీత్య సంకాశుడు, నిజభూషాయుధములతో కూడియున్న మంత్రమూర్తియగు ప్రభువును స్మరించి తత్పాదోదకసంభవయగు ధారను బ్రహ్మా రంధ్రముచే తన శరీరమున ప్రవేశించుచున్న జలముచే దేహాంతర్గతమగు మలమునంతటిని క్షాళన చేయవలయును. ఇట్లు చేసినచో మంత్రమును పొందినవాడు వెంటనే దుమ్ము తొలగినవాడై స్పటికము వలె అగును. తరువాత శ్రాతోక్త విధిచే సావధానముగా స్నానము చేసి మంత్ర స్నానమునాచరించవలయును. ఆ విధానమును ఇప్పుడు చెప్పుచున్నాను.

దేశకాలౌచ సంకీర్త్య ప్రాణాయామం షడంగ కైః.

కృత్వారనుండలాత్తీర్ధాన్యాహ్వయేన్ము ష్టిముద్రయా,

బ్రహ్మాండోదరతీర్థాని కరైసృష్టాని తే రవేః.

తేన సత్యేన మే దేవ దేహి తీర్థం దీవాకర.

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ! నర్మదే సింధు కావేరి ! జలేస్మిన్సన్నిధిం కురు.

ఇత్యావాహ్య జలే తాని సుధాబీజేన యోజయేత్,

 గోముద్రయామతీకృత్య కవచేనావగుంత్య చ.

 సంరక్ష్యాస్తేణ తత్పశ్చాచ్చక్రముద్రాల ప్రదర్శయేత్,

వహ్న్యార్కేందునుండలాని తత్ర సంచింతయైద్బుధః.

మంత్రమేదరమంత్రేణ సుధాబీజేన తజ్జలమ్,

మూలేన చైవ దశధా తత్ర పంమస్త భావయేత్.

పూజాయంత్రం చ తన్మ ధ్యే స్వాంతాదావాహ్య దేవతామ్,

స్నాపయిత్వార్చయేత్తాం చ మాన పైరుపచార కైః.

సింహాసనస్థాం తాం నత్వా తజ్జలం ప్రణమేత్సుధీః,

ఆధారప్పర్వభూతానాం విష్ణోరతులతేజసః.

తద్రూపాశ్చ తతో జాతా ఆపస్తాః ప్రణమామ్యహమ్,

ఇతి మత్వా పమారుస్థ్య పస్తఛిద్రాణి సాధకః.

 నిమజ్య పలిలే తస్మిన్ మూలం దేవాకృతిం స్మరేత్ ,

 నినుఙ్ఞ్యాన్మజ్ఞ్య త్రి శ్చైవం పించేత్కం కుంభముద్రయా.

 త్రిర్మూ లేన చతుర్మంతైరభిషించేనిజాం తనుమ్,

 చత్వారో మనవ స్త్యేత్ర కథ్యంతే తాంత్రికా మునే.

 పిసృక్షోర్నిఖిలం విశ్వం ముహుశ్శుక్రం ప్రజాపతేః,

 మాతరపర్వభూతానామాసో దేవః పునను మామ్.

 అలక్ష్మీర్మలరూపొయా సర్వభూతేషు సంస్థితా,

 క్షాలయంతి చ జాం ప్పర్శాదాపో దేవ్యః పునను మామ్.

యన్మే కే శేషు దౌర్భాగ్యం సీమస్తే యచ్చ మూర్ధని,

లలాటే కర్ణయో రక్లోరాపస్తద్ధను వో నమః.

 ఆయురారోగ్యమైశ్వర్యమరిపక్టక్షయం శుభమ్,

సంతోషః క్షాన్షిరాస్తిక్యవిద్యా భవతు వో నమః.

విప్రపాదోదకం పీత్వా శాలగ్రామశిలాజలమ్,

పిబ్వేరుద్ధం నో కుర్యాత్ ఏష తు వియతో విధిః.

పృథివ్యాం యాని తీర్థాని దక్షాంఖో తాని భూసురే,

ప్యేష్టదేవం పనువ్వొస్య నుంతీమార్తండనుండలే.

తత స్త్రీరం సమాగత్య వస్త్రం పంక్షాల్య యత్నతః,

వాసపీ పరిధాయాథ కుర్యోత్సంధ్యోదికం సుధీః.

రోద్యశక్తో మనుజః కుర్యాత్తత్రాఘమర్షణమ్,

అథవా భస్మనా స్నాతో రజోభిశ్చైవ వా క్షమః.

అథ సంధ్యాదీకం కుర్యాత్ షైతా చైవాపనే శుభే,

 కేశవేన తథా నారాయణేన మాధవేన చ.

సంప్రాశ్యం తోయం గోవిందవిష్ణుభ్యాం క్షాలయేత్కగా,

మధుసూదనత్రివిక్రమాభ్యామోష్ఠే చ మార్జయేత్.

 వామనశ్రీధరాభ్యాం చ ముఖం హస్తే స్పృశేత్తతః,

హుషీ కేశపద్మ నోభాభ్యాం ప్పృశేచ్చరణా తతః.

 దామోద రేణ మూర్థానం ముఖం సంకర్షణేన చ,

వాసుదేవేన ప్రద్యుమ్నేన ప్ప శేన్నా పికే తతః.

అనిరుద్ధపురుషోత్తమాభ్యాం నేత్రే స్పృశేత్తతః,

అధోక్షజనృసింహాభ్యాం శ్రవణే పంప చేత్తథాః.

నాభీం స్పృశదచ్యుతేన జనార్దనేన వక్షసి,

హరిణా విష్ణునాంసౌ చ వైష్ణవాచమనం త్విదమ్.

ప్రణవాదైశీవ మోతైః కేశవాదికనామభిః,

ముఖే నసోః ప్రాదేశిన్యా నామయా నేత్రకర్ణయోః.

 కనిష్ఠయా నాభిదేశం సర్వత్రాంగుష్ఠయోజనమ్,

ఆత్మ విద్యా శివేస్తత్వస్వాహాంతైశ్శవమీరితమ్.

 దీర్ఘత్రయేన్గుయుగ్వ్యోమపూర్వ కైశ్చాపిబెజ్జలమ్,

ఆత్మవిద్యా శివైరేవ శైవం స్వాహావసానికైః.

వాగ్లజ్జా శ్రీముఖైః ప్రోక్తం శాక్తం స్వాహాసానికైః,

వాగ్లజ్జా శ్రీముఖైః ప్రోక్తం ద్విజాచమనమర్థదమ్.

తిలకం చ తతః కుర్యోత్ఫాలే సుష్ఠు గదొకృతి,

నందకం హృదయే శంఖచక్రే చైవ భుజద్వయే.

శార్ణబాణీ మస్తకే చ విన్య సేత్రమశప్సుధీః,

 కర్ణమూలే పార్శ్వయోశ్చ పృ ప్లే నాళే కకుద్య పి.

ఏవం తు వైష్ణవః కుర్యాత్ వృద్భీషీర్దేచ్ఛవాదిభిః,

అగ్నిహోత్రోద్భవం భస్మ గృహీత్వా త్ర్యంబ కేణ తు.

కిం వాగ్నిరితి మంత్రేణాభిమన్ల పంచమంత్ర కైః,

క్రమాత్తత్పురుషాఫరసద్యోజాతాదినామభిః.

పంచకుర్యాత్తిపుండ్రాని ఫాలాంసోదరహృత్సు చ,

శైవశ్శాక్తస్రకోణాభం నారీవద్వా సమాచరేత్.

కృత్వా తు వైదికీం సంధ్యాం తాంత్రికీం చ పమాచరేత్ ,

 ఆచమ్య విధివన్మంత్రి తీర్ధాన్యాహ హ్యపూర్వవత్.

తతస్రావారం దర్భేణ భూమౌ తోయం వివిక్షిపేత్,

 సప్తధా తజ్జలేనాథ మూర్థానమభి షేచయేత్.

 తతశ్చ ప్రాణానాయమ్య కృత్వా న్యాపం షడంగకమ్,

ఆదాయ వామహస్తెంబు దక్షిణేణాచ్ఛాద్య పాణినా.

వియద్వాయ్వగ్నితేయక్షా బీజైప్సంమన మంత్రవిత్,

 మూలేన తస్మాత్ చ్చోతగ్జిబిందుభిస్తత్త్వముద్రయా.

 స్వశిరస్సప్తధా ప్రోక్ష్యావశిష్టం తత్పునర్జలమ్,

 ధృత్వా తదక్షరం మంత్రి నాపికొంతికమానయేత్.

జలం తేజోమయం తచ్చాకృష్యాంత శ్చేడయా పునః,

 ప్రక్షాల్యాంతర్గతం తేన కల్మషం తజ్జలం పునః.

 కృష్ణవర్ణం పింగలయా రేచయేత్స్వక్రతస్తథా,

 క్షి పేదస్త్రేణ తత్పశ్చాత్కల్పితే మలినోపలే.

ఏతద్ధి పర్వపాపఘ్నం ప్రోక్తం చైవాఘమర్షణమ్,

తతశ్చ హస్తే ప్రక్షాళ్య ప్రాగ్వదాచమ్య మంత్రవిత్.

సముత్థాయ చ మంత్రజ్ఞస్తామ్రపాత్రే సుమాదికమ్,

ప్రక్షిప్యార్థం ప్రదద్యాద్వే మూలాంఛైర్మంత్రముచ్చరన్.

రవిమండలం సంస్థాయ దేవాయ్యాం ప్రకల్పయేత్,

దత్వారం త్రిరనేనాథ దేవం రవిగతం స్మరేత్.

స్వకల్పోక్తాం చ గాయత్రీం జ పేదప్టోత్తరం శతమ్,

 అష్టావింశతివారం వా గుహ్యాతిమనునార్పయేత్.

దేశకాలములను కీర్తించి, ప్రాణాయామమును చేసి షడంగన్యాసము గావించి, ముష్టిముద్రచే అర్కమండలము నుండి తీర్థమునాహ్వానించ వలయును. బ్రహ్మండోదరమునుండి మకరములచే స్పృశింపబడిన తీర్థమున ఓ దివాకరా సత్యముతో నాకిమ్ము. ఓ గంగా ! యమునా ! గోదావరీ ! సరస్వతి ! నర్మదా ! సింధూ ! కావేరీ ! మీరందరూ ఈ జలములో నిలువుడు. అని జలమున ఆవాహన చేసి సుధాబీజముతో యోగము చేయవలయును. గోముద్రచే అమృతమును చేసి కవచముచే అవగుంఠనము చేసి అస్త్రముచే రక్షగావించి చక్రముద్రను చూపవలయును. అచట సూర్యచంద్ర అగ్నిమండలములను ధ్యానించవలయును. ఆ జలమును సూర్యమంత్రముచే సుధాబీజముచే మంత్రించవలయును. మూలమంత్రముచే పదకొండుమార్లు మంత్రించి భావించవలయును. ఆ మధ్య భాగమున పూజాయంత్రమును స్థాపించి స్వాంతమునుండి దేవతనావాహించి స్నానము చేయించి మానసోపచారములచే పూజించవలయును. సింహాసనముననున్న ఆ దేవతను నమస్కరించి, ఆ జలమునకు నమస్కరించవలయును. సర్వభూతములకు ఆధారములు సాటిలేని తేజస్సుగల విష్ణువునుండి పుట్టినవి, విష్ణురూపములు ఆయిన జలములను  నేను నమస్కరించుచున్నాను. ఇట్లు నమస్కరించి ఆరాధించి సప్త చిత్రములను సాధకుడు ఏర్పరిచి ఆ జలములో మునిగి మూలమగు దేవాకృతిని స్మరించవలయును. మునిగి లేచి. బ్రహ్మ ముద్రచే శిరస్సు పై జలమును చల్లవలయును. తన శరీరమును మూడు మార్లు మూలమంత్రముచే, నాలుగు సార్లు మంత్రములచే అభిషేకము చేయవలయును. ఆ నాలుగు మంత్రములు ఇచట చెప్పుచున్నాను.

"పిసృక్షోర్నిఖిలం విశ్వం ముహుశ్శుక్రం ప్రజాపతేః

మాతరప్సర్వభూతానామాపో దేవ్యః పునస్తు మామ్

 అలక్ష్మీర్మలరూపా యా సర్వభూతేషు సంస్థితా

క్షాలయంతి చ తాం స్పర్శాదాపో దేవః పునను మామ్

 యన్మే కే శేషు దౌర్భాగ్యం పీమనే యచ్చ మూర్ధని

లలా టే కర్ణయోరక్షోరాపస్తద్ధస్తు వో నమః

ఆయురారోగ్యమైశ్వర్యమరిపక్షక్షయం శుభమ్

 సంతోషః క్షాంతిరాస్తిక్యం విద్యా భవతు నో నమః"

ఇవి నాలుగు మంత్రములు. అఖిల ప్రపంచమును సృష్టించు ప్రజాపతికి శుక్రరూపము, సర్వభూతములకు మాతృస్వరూపములైన ఆపోదేవులు నన్ను పవిత్రుని చేయుగాక. సర్వ భూతములలో మలరూపముగా నున్న అ లక్ష్మిని స్పర్శమాత్రముచే క్షాళనము చేయు ఆపోదేవులు నన్ను పవిత్రుని చేయుగాక. నా కేశములలో, సీమస్తమున, శిరస్సున, లలాట మున,కర్ణములలో నేత్రములలో నున్న దౌర్భాగ్యమును జలములు నశింపచేయుగాక. అట్టి జలములకు నమస్కరించుచున్నాను. అని పై మంత్రముల కర్థము. ఆయుష్యమును ఆరోగ్యమును, ఐశ్వర్యమును, శత్రునాశమును, శుభమును, సంతోషమును, శాంతిని, ఆస్తీక్యమును, విద్యను నాకు ప్రసాదించు జలములకు నమస్కారము. బ్రాహ్మణపొదజలమును పానము చేసిన తరువాత శాలగ్రామశిలాజలమును పానము చేయవలయును. విపరీతముగా నాచరించరాదు. ఇది నియతవిధి. భూమి మీద నున్న సర్వతీర్థములు బ్రాహ్మణోత్తముని దక్షిణపొదమున నుండును. మంత్రమును పొందినవాడు మార్తాండమండలమున స్వేషదైవమును ఉద్వాసన చేసి తీరమున కొత్త వస్త్రమును ప్రయత్నముచే శుద్ధి చేసుకొని, వస్త్రములను ధరించి బుద్ధిమంతుడు సంధ్యాదికము నోచరించవలయును.రోగాదులచే శక్తి లేని వాడు అఘమర్షణము నోచరించవలయును.లేనిచో భస్మస్నానమును కానీ రజస్నానమును కొని చేయవలయును. తరువాత శుభాసనమున కూర్చుండి సంధ్యాదికము నాచరించవలయును. కేశవ నారాయణ మాధవ నామములతో జలప్రోశనము గావించి, గోవింద విష్ణునామములతో కరప్రకొలనము గావించి, మధుసూదన త్రివిక్రమ నామములతో ఓష్ఠములను మార్జన చేయవలయును. వామన శ్రీధర నోమములతో ముఖమును, హస్తములను స్పృశించవలయును. దామోదరనామముతో మూర్థను, సంకర్షణ నామముతో ముఖమును, వాసుదేవ ప్రద్యుమ్న నామములతో నాసికలను స్పృశించవలయును. అనిరుద్ద పురుషోత్తను సొమములతో నేత్రములను స్పృశించవలయును. అధోక్షజ నృసింహనామములతో శ్రవణములను స్పృశించవలయును. అచ్యుత నామములతో భుజములను స్పృశించవలయును. దీనిని వైష్ణవాచమనమందురు. ప్రణవాదిగా నమోంతముగా కేశవాది నామములతో ప్రదేశినీతో ముఖమున నొపికలలో, అనామికతో , నేత్రకర్ణములయందు, కనిష్టతో నాభిదేశమున, ఇతర ప్రదేశములలో అంగుష్ఠముతో యోజన చేయవలయును. స్వాహాంతములైన శివతత్త్వములతో చేయునది శైవాచమనము. దీర్ఘత్రయేందుయుక్ వ్యోమపూర్వకముగా జలపానము చేయవలయును. శివతత్త్వములచేతనే స్వాహాంతములుగా శైవము చెప్పబడినది. వాగ్లజ్జా శ్రీముఖములుగా స్వాహాంతములుగా శాక్తా చమనము చెప్పబడినది. వాగ్లజ్జశ్రీ ముఖములుగా ద్విజాచనము అర్థప్రదమని చెప్పబడినది. తరువాత ఫాల భాగమున గదాకారముగా చక్కగా తిలకధారణచేయవలయును. హృదయమున నందకాకారముగా, భుజద్వయమున శంఖచక్రములను, మస్తకమున శార్జబాణములను, క్రమముగా నుంచవలయును. కర్ణమూలములందు, పార్శ్వభాగములలో, పృష్ఠ భాగమున, నాభియందు, కకుద్భాగమున తీర్దోద్భవాదులకు మృత్తికలతో వైష్ణవుడు తిలకధారణ చేయవలయును. శైవులు అగ్నిహోత్రోద్భవమగు భస్మమును “కింవాగ్ని” అనుమంత్రముచే పంచమంత్రములచే అభిమంత్రణము చేసి, క్రమముగా తత్పురుష అఘోర, సద్యోజాతాని నామములచే అయిదు ఫౌల, అంస, ఉదర హృదయములలో త్రిపుండ్రములను ధరించవలయును. శైవుడు శాకుడు త్రికోణాకారముగాని, నొరీవలేకాని పుండ్రమును ధరించవలయును. వైదికసంధ్యావందనమాచరించిన తరువాత తాంత్రిక విధినొచరించవలయును. వీధోనోక్తముగా ఆచమనమును గావించి, మొదటి దానివలే తీర్ధములనావాహన చేసిన తరువాత భూమి పై మూడుమార్లు దర్భతో నీరుచల్లవలయును. ఏడుమార్లు ఆ జలముతో శిరస్సున చల్లుకొనవలయును. తరువాత ప్రాణాయామమును చేసి షడంగన్యాసమును చేసి ఎడమచేతిలో నీరు తీసుకొని కుడిచేతితో కప్పి ఆకాశవాయు అగ్నిజలభూ బీజములతో అభిమంత్రించి మూలమంత్రముచే తత్త్వముద్రలో ఆ జలబిందువులను ఏడుమార్లు శిరస్సున చల్లుకొనవలయును. అట్లు చల్లుకొనగా మిగిలిన జలమును నొసిక సమీపములకు తేవలయును. తేజోమయమైన ఆజలమును ఇడామార్గము ద్వారా నాసికలోనికి ఆకర్షించి దానితో నాసికాంతర్గతకల్మషమును ప్రక్షాళన చేసి మరల ఆజలమును పింగలమార్గముతో బయటికి విడువవలయును. తరువాత కల్పించబడిన కులిశోపలముమీద ఆ జలమును అస్త్రముచే విడువ వలయును. దీనినే సర్వపాపహరమగు అఘమర్షణమందురు. తరువాత. హస్తప్రక్షాళనము గావింప మొదటివలె ఆచమనమును గావించి, లేచి మంత్రజ్ఞుడై తామ్రపొత్రమున పుష్పాదీకమునుంచి మూలాంతములచే మంత్రమునుచ్చరించును రవిమండలాంతర్వర్తియగు దేవునికి అర్ఘ్యమును కల్పించవలయును. అట్లు అర్ఘ్యప్రదొనమును గావించి మూడుమార్లు ఈ మంత్రముచే దేవుని స్మరించవలయును. తరువాత స్వకల్పోక్తప్రకారముగా అష్టోత్తరశతపర్యాయము గాయత్రీ మంత్రజపమునాచరించవలయును. లేనిచో ఇరువై ఎనిమిది మార్లు జపించవలయును. తరువాత ‘గుహ్య’ అనుమంత్రముచే అర్పణ చేయవలయును.

ఉద్యదాదిత్యసంకాశాం పుస్తకాక్షకరాంబుజామ్,

కృష్ణాజినాంబరాం బ్రాహ్మీం ధ్యాయేత్తారాంకితేంబరే.

మధ్యాహ్నే వరదాం దేవం పార్వతీం పంస్మ రేత్పరామ్,

శుక్లాంబరాం వృషారూఢాం త్రినేత్రాం రవిబింబగామ్.

 వరం పాశం శూలం చ దధానాం నృకరోటికామ్,

సాయాహ్నే రత్నభూషాఢ్యాం పీతకౌశేయవాపసామ్.

శ్యామరం గా చతుర్హస్తాం శంఖచక్రలసత్కరామ్,

గదాపద్మధరం దేవం సూర్యాసనకృతాశ్రయామ్.

 తతో దేవానృషీం శ్చైవ పితరాంశ్చాపి విధానవిత్,

 తర్పయిత్వా స్పేష్టదేవం తర్పయేత్కల్పమార్గతః.

 గురుపంక్తిం చ పంతర్య సాంగం సాబీవరణం తత,

సాయుధం వైనతేయం సంతర్పయామీతి తర్పయేత్.

నారదం పర్వతం జిష్ణుం విశరోద్ధవదారుకాన్,

విష్వక్సేనం చ శైలేయం వైష్ణనః పరితర్పయేత్.

 ఏవం సంతర్ప్య విపేన్జ దత్త్వాక్యం చ వివస్వతే,

పూజాగారం సమాగత్య ప్రక్షాల్యాంఫ్రీ ఉపప్ప శత్.

అగ్నిహోత్రస్థితానగ్నీన్ హూత్వోపస్థాయ యత్నతః,

 పూజాస్థలం సమాగత్య ద్వారపూజాం సమాచరేత్.

గణేశం చోర్థ్వశాఖాయం మహాలక్ష్మీం చ దక్షిణే,

సరస్వతీం వామభాగే దక్షే విఘ్నేశ్వరం పునః.

క్షేత్రపాలం తథా వామే దకే గంగాం ప్రపూజయేత్,

వామే చ యమునాం దక్షే ధాతారం వామతస్తథా.

విధాతారం శంఖపద్మ నిధీంశ్చ వామదక్షయోః,

 ద్వారపాలాండ్తత్యోభ్యర్చేత్తత్తత్కలోదితాన్సుధీః.

నన్దప్సునన్దశ్చండశ్చ ప్రచండః ప్రచలో బలః,

భద్రపుభద్ర శ్చత్యాద్యా వైష్ణవా ద్వారపాలకొః.

నన్ద భృంగీ రిటీ స్కందో గణేశోమా మహాశ్వరాః,

వృషభశ్చ మహాకాల శ్శివా వై ద్వారపాలకాః.

బ్రహ్మ్యాద్యొ నూతరోష్ట్రా తు శక్తయో ద్వాష్టితో స్వయమ్,

పేన్దుస్స్వనామాఘగ్లాద్యాజేనంతా ఇమే స్మృతాః.

 తత స్థిత్వాసనే ధీమానొచమ్య ప్రయతశ్శుచిః,

 దివ్యాంతరీక్షభౌమాంశ్చ విఘ్నానుత్పార్య యత్నతః.

 కేశనాద్యాం మాత్రూకం తు న్య పేద్వెష్ణవపత్తమః,

కేశవః కీర్తిసంయుక్తః కాంత్యా నారాయణస్తథా.

 మాధవస్తుష్టిపహితో గోవిన్దః పుష్టిసంయుతః,

విష్ణుస్తు ధృతిసంయుక్త శ్శాంతియుజ్మధుసూదనః.

త్రివిక్రమః క్రియాయుక్తో వామనో దయితాయుతః,

 శ్రీధరో మేధయా యుక్తో హృషీ కేశశ్చ హర్షయా.

పద్మనాభయుతా శ్రద్ధా లజ్జా దామోదరాన్వితా,

 వాసుదేవశ్చ లక్ష్మీయుక్ సంకర్షణప్సరస్వతీ.

 ప్రద్యుమ్నః ప్రీతిసంయుక్తో నిరుధో రతిషంయుతః,

చక్రీ జయాయుతః పశ్చాద్గదీ దుర్గాపమన్వితః.

శార్జీతు ప్రభయా యుక్తః ఖడ్గయుక్తస్తు పత్యయా,

 శంఖీచండొపమాయుక్తో హాలీ వాణీసమాయుతః.

ముసలీచ విలాపిన్యా శూలీ విజయయాన్వితః,

పాశీ విరజయా యుక్తో కుతీ విశ్వాసమన్వితః.

ముకుందో వినతాయుక్తా నక్షజశ్చ సునందయా,

నన్దీ స్మృత్యా సమాయుక్తో నరో వృద్ధ్యా సమన్వితః.

సమృద్ధియుజరవళి శుద్ధియుక్చ హరిప్స్మతః,

కృష్ణో బుద్ధ్యా యుత్సుత్యో భుక్త్యా ముక్త్యాథ సాత్వతః.

సౌరిక్షమే పూరరమే ఉమాయుక్తో జనార్దనః,

భూధరః క్లేదినీయుక్తో విశ్వమూర్తిశ్చ క్లన్నయా.

 వైకుంఠ వసుధాయుక్తో వసుదః పురుషోత్తమః,

బలీ తు పరమాయుక్తో బలానుజపరాయణే.

బాలసూక్ష్మే వృషఘ్నస్తు సంధ్యాయుజ్ఞయా వృషః,

హంసః ప్రభాసమాయుక్తో వరాహా నిశయాయుతః.

విమలో ధారయా యుక్తో నృసింహో విద్యుతాయుతః,

కేశవాదిమాతృకాయా మునిర్నారాయణో మతః.

అమృతాద్యా చ గాయత్రీ ఛందో విష్ణుశ్చ దేవతా,

చక్రాద్యాయుధపంయుక్తం కుంభాదర్శధరం హరిమ్.

లక్ష్మీయుతం విద్యుదాభం బహుభూషాయుతం భజే,

ఏవం ధ్యాత్వాజేయచ్చక్తిం శ్రీకామపుటితాక్షరమ్.

వదేత్తద్విష్ణుశక్తిభ్యాం హృదయం ప్రణవాదివమ్,

త్వగసృఙ్మాంసమేద్యోస్థి మజ్జశుక్రౌణ్యసూన్వదేత్.

ప్రాణం క్రోధం తథా మభ్యమంతాన్యాది దశస్వపి,

ఏకం మాతా ముఖే చైకం ద్వికం నేత్రే ద్వికం శ్రుతా.

నసోర్వయం కపోలే చ ద్వయం ద్వే ద్విరదచ్ఛదే,

ఏకం తు రసమూలే గ్రీవాయామేకమేవ చ.

 కవర్గం దక్షిణే బాహౌ చ వర్గం వామబాహు కే,

టతవరౌ పాదయోస్తు పఫీకుక్షిద్వయే న్య సేత్.

పృష్ణం వంశవమిత్యుక్తం నాభౌభం హృదయే తు వమ్,

యాదిసప్తాపి ధాతుస్థా హుప్రాణేలం తదాత్మని.

క్షం క్రోధే క్రమతో న్యస్య విష్ణుపూజాక్షమో భవేత్.

నక్షత్రయుక్తమైన ఆకాశమున ఉదయించుచున్న సూర్యునికాంతి గల, పుస్తకాక్షమాలలు చేతి యందు ధరించి యున్న, కృష్ణాజినాంబరయగు సరస్వతిని ధ్యానించవలయును. మధ్యాహ్నమున వరదయగు పార్వతీదేవిని స్మరించవలయును. ఈ పార్వతీదేవిని, శుక్లాంబరవృషారూఢ, త్రినేత్ర కవిబింబగత, శ్రేష్టముగు పొశమును శూలమును, కపాలమును ధరించిన దేవిగా స్మరించవలయును. సాయంకొలనున రత్నభూషాడ, పీతకౌశేయనస్త్ర, శ్యామర, చతుర్లస, శంకచక్రధారిణీ, గదాపద్మ దొరికి, సూర్యాసనకర్యాశ్రయయగు దేవిని స్మధించవలయును. తరువాత నిధానమును తెలిసినవారు  దేవతలను, ఋషులను, పితృదేవతలను తృప్తిపరిచి, తన ఇష్టదేవతకు తర్పణము చేయవలయును, తరువాత గురు పరంపరను పూజించి సాయుధుడగువైనతేయునీ తప్పుని గోవించవలయును. నారదుని, పర్వతుని, జిష్ణుని, నిశరుని, ఉద్ధవదొరుకులను, విష్వక్సేనుని, శైతేయుని వే విష్ణుభక్తులు పూజించవలయును. తర్పణము చేయవలయును. ఇట్లు తర్పణములను గావించి సూర్యునికీ ఆర్యమునిచ్చి, పూజాకారమునకు వచ్చి పొదప్రక్షాళనమును గావించి ఆచమనమును చేయవలయును. అగ్నిహోత్రశాలలో నున్న అగ్న్యుపస్థానమును గావించి హోమములు చేసి, పూజాస్థలముమకొచ్చి ద్వారపూజ నోచరించవలయును. ఊర్ధ్వభాగమున గణేశుని, దక్షిణ భాగమున మహాలక్ష్మిని, వామభాగమున సరస్వతిని, దక్షిణ భాగమున విఘ్నేశ్వరుని, వామభాగమున యమునా నదినీ, దక్షిణ భాగమున ధాతను, వామభాగమున విధాతను, వామభాగమున శంఖమును, దక్షిణ భాగమున పద్మవిధినీ, తరువాత ఆయా కల్పములలో చెప్పబడిన ద్వారపాలకులను పూజించవలయును. నందుడు, సునందుడు, చండుడు. ప్రచండుడు, ప్రచలుడు, బలుడు, భద్రుడు, సుభద్రుడు మొదలగు వోరు విష్ణుద్వారపాలకులు. నంది, భృంగి, రిటీ, స్కందుడు గణేశుడు, ఉమా మహేశ్వరుడు, వృషభుడు, మహాకాలుడు వారు శైవద్వారపాలకులు. బ్రాహ్మి మొదలగు అష్టమాతృదేవతలు, స్వయముగా శక్తి రూపముగా ద్వార దేశముననుందురు. తరువొత శుచియై ఆసనమున కూర్చుండి ఇంద్రియనిగ్రహము కలవాడై దివ్య, అంతరీక్ష, భౌమవిఘ్నములను తొలగించుకొని, విష్ణుభక్తాగ్రేసరులు కేశవాని మాతృకలను న్యాసము చేయవలయును. కేశవుడు కీర్తితో కలిసియుండును. నారాయణుడు కాంతితో, మాధవుడు తుష్టితో, గోవిందుడు పుష్టితో, విష్ణువు ధృతితో మధుసూదనుడు శాంతితో, త్రివిక్రముడు క్రియతో, వామనుడు దయితతో, శ్రీధరుడు మేధతో, హృషీ కేశుడు హర్షతో, పద్మనొభుడు శ్రద్ధతో, దామోదరుడు లజ్జతో, వాసుదేవుడు లక్ష్మితో, సంకర్షణుడు సరస్వతితో, ప్రద్యుమ్నుడు ప్రీతితో, అనిరుద్ధుడు రతితో, చక్రి జయతో, గదీ దుర్గతో, శార్జీప్రభతో, ఖడ్గసత్యతో, శంఖి చండతో, హాలి వాణితో, ముసలి విలా సీనితో, శూలి విజయతో, పొశి విరజితో, కూకి విశ్వతో, ముకుందుడు వినతతో, నందజుడు సునందతో, నంది స్మృతితో, నరుడు వృద్ధితో, నరకజిత్తు సమృద్ధితో, హరిశుద్దితో కూడియుండును. కృష్ణుడు బుద్ధితో, సత్యుడు భుక్తితో, సాత్వతుడు ముక్తీతో, సౌరి క్షమతో, సూరమతో, జనార్థనుడు ఉమతో, భూధరుడు శ్లేదినితో, విశ్వమూర్తి క్లిన్నతో, వైకుంఠుడు వసుధతో, పురుషోత్తముడు వసువుతో, బలి పరతో, బలానుజుడు పరాయణతో, బాలుడు సూక్ష్మతో, వృషఘ్నడు సంధ్యతో, వృషుడు ప్రజ్ఞతో, హుసుడు ప్రభతో, వరొపుడు నీశతో, విమలుడు ధోరతో, నృసింహుడు విద్యుత్ తో కూడియుండును. కేశవాది మాత్సకలకు నారాయణముని చేప్పబడెను. గాయత్రీ ఛందస్సు, విష్ణువు దేవత, చక్రాద్యాయుధములతో కూడియున్న కుంభఆదర్శధరుడగు, లక్ష్మీసహితుడు, విద్యున్సీభుడు, బహుభూషాయుతుడగు శ్రీహరిని భజించవలయును. ఇట్లు ధ్యానించి శ్రీకామపుటితాక్షరయగు శక్తిని న్యౌసము చేయవలయును. ఆ విష్ణు శక్తులతోప్రణవాదికమును హృదయముకు చెప్పవలయును. త్వక్, అస్పక్ మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్రోద్యస్తువులను చెప్పవలయును. ప్రాణమును, క్రోధమును, మదమును, మొదలగు వాటిని దిక్కులలో నుంచవలయును. మౌళియందు ఒకటి, ముఖమున ఒకటి, నేత్రములలో రెండు, చెవులలో రెండు, నాసికలలో రెండు, కపోలములయందు రెండు, దంతములలో రెండు, ఓష్ఠములలో రెండు, రసనామూలమున ఒకటీ, కంఠమున ఒకటి, ఉంచవలయును. దక్షిణ బాహవున కవర్గను, వామబాహువున చవర్గము, టతవర్గలను పొదములలో, పఫలను కుక్షిలో వుంచవలయును. పృష్ణవంశమున అనుదానిని, నాభిలో ఛంను, హృదయమున మంను, యాది సప్తధాతువులను హంను ప్రాణమున, ఆత్మలో లంను, క్రోధమున క్షంను, క్రమముగా నుంచి విష్ణుపూజాయోగ్యుడగును.

పూర్ణోదర్యా తు శ్రీకంఠో హ్యానంతో విజరాన్వితః.

సూక్ష్మే శశాల్మలీయుక్తో లోలలాక్షీ యుక్త్రీమూతకః,

మహేశ్వరో వర్తులాక్ష్యా దీశో వై దీర్ఘఘోణయా.

 దీర్ఘముఖ్యా బారభూతిష్ఠిధీశో గోముఖే యుతః,

స్థావరేశో దీర్ఘజిహ్వా యుద్ధరః కుండోదరీయుతః.

 ఊర్థ కేశ్యా తు ఝాంటీశో భౌతికో వికృతాస్సయా,

పద్యో జ్వాలాముఖీయుక్తో ల్కాముఖ్యానుగ్రహాయత.

అక్రూర లాస్యయాయుక్తో మహా సేనశ్చ విద్యయా,

క్రోధీశశ్చ మహాకాల్యా చండేశేన సరస్వతీ.

పంచాంతక స్సిద్ధగౌర్యా యుక్తశ్చాథ శిరోత్తమః,

త్రైలోక్యవిద్యయా యుక్తో మస్త్రాశ క్యెకరుద్రకః.

కూర్మీశః కమఠీయుక్తో భూతమాత్రైక నేత్రకః,

 లంబోదర్యా చతుర్వర్డో హ్యజేశో ద్రావణీ యుతః.

సర్వేశో నాగరీయుక్తస్సోమేశః ఖేచరీయుతః,

మర్యాదయా లొంగలీతో దొరుకేశేన రూపిణీ.

వారుణ్యా త్వర్థనారీశో ఉమాకాంతో మువీశ్వరః,

కాకోదర్యా తథాషాఢ పూతనాపంయుతో మతః.

 దండీశో భద్రకాళీయుదత్రీశో యోగినీయుతః,

మీనేశో శంఖనీయుక్తో మే షేశస్తర్జనీయుతః.

లోహితః కాలరాత్ర్యా చ శిఖీశః కుజనీయుత,

ఛలగండః కపర్దిన్యా ద్వారండేశశ్చ వజ్రయా.

 మహాబలో జయాయుక్తో బలీశస్సుముఖేశ్వరీ,

భుజంగో రేవతీయుక్తః పినాకీ మాధవీయుతః.

 ఖడీశో వారుణీయుక్తో బకేశో వాయవీయుతః,

 శ్వేతోరస్కో విదారిణ్యా భృగుప్పహాజయా యుతః.

లకులీశశ్చ లక్ష్మీయుక్ శి వేశో వ్యాపినీయుతః,

సంవర్తకో మహామాయా ప్రోక్తా శ్రీకంఠమాతృకా.

యత్ర స్వీశపదం నోక్తం తత్ర సర్వత్ర యోజయేత్,

మునిస్స్యాదక్షిణామూర్తిర్గాయత్రీచన్ద ఈరితమ్.

 దేవతా చార్థనారీశో వినియోగ్యోఖిలాషయే,

హలోబీజాని చోక్తాని స్వరాశ్శక్తయ ఈరితాః.

కుర్యాద్భృగుస్థాకాశేన షడ్డీర్థాకథ్యేన చాంగకమ్,

బందూకపర్ణవర్ణాంగం వరాక్షాయశపాశినమ్.

అర్ధేందు శేఖరం త్యక్షం దేవవంద్యం విచింతయేత్,

ధ్యాత్వేవం శివశక్తీ శ్చ చతుర్థి హృదయాంతిమే.

 సీబీజమాతృకా పూర్వే విన్య సేన్మాతృకొస్థలే,

 విఘ్నేశశ్చ క్రియా యుక్తో విఘ్నరాజశయాయుతః.

 వినాయకస్తథా పుష్ట్యా శాంతియుక్తశ్శివోత్తమః,

విఘ్నకృత్స్యస్తిపంయుక్తో విఘ్నహర్తా సరస్వతీ.

స్వాహయా గణనాథశ్చ ఏకదంతస్సు మేధయా,

కాంత్యా యుక్తో ద్విదంతస్తు కామిన్యా గజవర్తకః.

 నిరంజనో మోహినీయుక్కపర్టీ తు నటీయుతః,

దీర్ఘజిహ్వా పార్వతీయుద్ఘ్వాలిన్యా శంకుకర్ణకః.

వృషధ్వజో నన్దయా చ సురేశ్యా గణనాయకః,

గజేన్దః కామరూపిణ్యా శూర్పకర్ణస్తథోమయా.

విరోచన స్తేజోవత్యా పత్యా లంబోద రేణ చ,

మహానన్దశ్చ విఘ్నేశ్యా చతుర్మూర్తిస్వరూపిణీ.

సదాశివః కామదయా హ్యామేదో మదజిహ్వయా,

దుర్ముఖో భూతిసంయుక్తస్సుముఖో భౌతికీయుతః.

ప్రమోద సీతయా యుక్త ఏకపాదో రమాయుతః,

ద్విజిహ్వా మహిషీయుక్తో శంఖిన్యా శూరనామకః.

వీరో వివర్ణయా యుక్తప్షణ్ముఖో భృకుటీయుతః,

వరదో లజ్జయా వామదేవేశో దీర్ఘఘోణయా.

 ధనుర్థర్యా వక్రతుండో ద్విరండో యామినీయుతః,

సేనానీ రాత్రిపంయుక్తః కామాంధీ గ్రామళీయుతః.

మత్త శ్శశీ ప్రభాయుక్తో విమతో లోలనేత్రయా,

 మత్తవాహశ్చంచలయా జట్ దీప్తిసమన్వితః.

ముండీ సుభగయా యుక్తః ఖడ్గ దుర్భగయాయుతః,

 వరేణ్యశ్చ శివాయుక్తో భగయా వృష కేతనః.

భక్ష్యప్రియో భగిన్యా చ గణేశో భగినీయుతః,

మేఘనాధప్పుభగయా వ్యాపీ స్యాత్కాలరాత్రియుక్.

గణేశ్వరః కాలికయా ప్రోక్తా విఘ్నేశమాతృకాః,

గణేశమాతృకాయాస్తు గణో మునిభిరీరితః.

 త్రివృద్గాయత్రికా ఛన్దో దేవశ్శక్తి గణేశ్వరః,

షడ్డీరాణ్యేన బీజేన కృత్వాంగాని తత్స్మరేత్.

పాశాంకుశాభయవరాన్దధానం కంజహస్తయా,

 పత్న్యాశ్లిష్టం రక్తతనుం త్రినేత్రం గణేశం భవేత్.

ఏవం ధ్యాత్వా న్య పేస్వ్సీ యబీజపూర్వాక్షరాన్వితమ్,

నివృత్తిశ్చ ప్రతిష్ఠా చ విద్యాశాంతిస్తథేధికా.

దీపికా రోచికా చాపి మోచికా పరాభిధా,

సూక్ష్మా సూక్ష్మానృతాజ్ఞానామృతా చాప్యాయనీ తథా.

 వ్యాపినీ వ్యోమరూపాచానంతా సృష్టిస్సమృద్ధికో,

స్మృతిర్మేధా తతః కాంతిర్లక్ష్మీర్ధృతిష్టి స్థితిః.

సిద్దిర్జరాపాలీనీ చ క్షాంతిరీశ్వరి రతి,

 కామికా వరదా వాథ హోదినీ ప్రీతిపంయుతా.

 దీర్ఘతీక్షా తథా రేత్రా ప్రోక్తా నిద్రా చ తన్తికా,

క్షుధా చ క్రోధినీ పశ్చాత్ర్కియాకారీ పమృత్యుకో.

పీతా శ్వేతారు పశ్చాదసీతామంతయా యుతా,

ఉక్తా కలామాతృ కైవం తత్తద్భక్తపమాచరేత్.

కలాయుజ్మాతృకాయాస్తుః మునిః ప్రోక్తః ప్రజాపతిః,

గాయత్రీ ఛంద ఆఖ్యాతం దేవతా శారదాభిధా.

 హ్రస్వదీర్ఘాంతరస్టైశ్చ తారైః కుర్యాత్షడంగకమ్,

పద్మ చక్రగుణైణాంశ్చ దధతీం చ త్రిలోచనామ్.

పంచవక్త్రాం భారతాంతాం ముక్తా భూషాం భజేత్సుధీః,

ధ్యాత్వైవం తారపూర్వాంతా న్య పేస్టస్తకలాన్వితామ్.

తతశ్చ మూలమంత్రస్య షడంగాని పమాచరేత్,

హృదయాది చతుర్థ్య జాతీస్సంయోజ్య విన్య సేత్ .

నమస్వాహా వషట్ హుంనౌషట్ ఫట్ జాతాయ ఈరితాః,

తతో ధ్యాష్టదేవం తం భూషాయుధసమన్వితమ్.

న్యస్యాంగషట్కం తన్మూర్తౌ తతః పూజనమారభేత్.

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే సంధ్యాయోదినిరూపణం నామ షట్ షష్టితమోధ్యాయః.

ఇక ఇపుడు శైవశక్తులను మాతృకలను చెప్పుచున్నాను. శ్రీకంఠుడు పూర్ణోదరితో అనంతుడు వీజరతో, సూక్ష్మేశుడు శాల్మలితో, త్రిమూతకుడు లోలాక్టితో మహేశ్వరుడు వర్తులాక్టితో అధీశుడు దీర్ఘఘాణతో, భారభూతి దీర్ఘముఖితో, తిధీశుడు గోముఖితో యుండును. దీర్ఘ జిహ్వతో స్థావరేశుడు, కుండోదరితో హరుడు, ఉర్ధ్వకేశితో ఘంటీశుడు, వికృతాస్యతో భౌతికుడు, సద్యుడు జ్వాలాముఖితో, ఉల్కాముఖితో అనుగ్రహుడు, ఆస్యతో అక్రూరుడు, విద్యతో మహా సేనుడు, మహాకాళితో క్రోధీశుడు, సరస్వతితో చండేశుడు, సిద్దగౌరితో పంచాంతకుడు, త్రైలోక్యవిద్యతో ఓరోత్తముడు, ఏకరుద్రకుడు మంత్రశక్తితో యుండును. కూర్మేశుడు కమఠితో, ఏకనేత్రుడు భూతమాతతో, చతుర్వకూడు లంబోదరితో, అజేశుడు ద్రావిణితో, సర్వేశుడు నాగరితో, సోమేశుడు ఖేచరితో, లాంగలీశుడు మర్యాదతో, దొగు కేశుడు రూపిణీతో, అర్థనారీశుడు వారుణితో, ఉమాకాంతుడు కాకోదరితో, ఆషాఢ పూతనతో యుండును. దండేశుడు. భద్రకాలితో, అత్రీశుడు యోగినితో, శంఖినితో మీనేశుడు, తర్జనితో మే షేశుడు, కొలరాత్రితో లోహితుడు, కుజనితో శిఖీశుడు, కపర్దినితో ఛలగండుడు, వజ్రతో ద్విరుడేశుడు, జయతో మహాబలుడు, సుముఖేశ్వరితో బలీశుడు, రేవతితో భుజంగుడు, మాధవితో పినాకి కలిసియుండును. ఖడీశుడు పొరుణితో, బకేశుడు వాయవితో, శ్వేతోరస్కుడు వీదొరిణితో, భృగువు సహజతో, లకులీశుడు లక్ష్మితో, శివేశుడు వ్యాపినితో, సంవర్తకుడు మహామాయతో యుండును. వీరందరు శ్రీకంఠమాతృకలు. పోరి ఈశులుగా చెప్పబడిరి. ఈశ పదము చెప్పని ప్రదేశమునంతట ఈశపదమును చేర్చవలయును. ఈ మాతృకలను ముని దక్షిణామూర్తి గాయత్రీ ఛందస్సు చెప్పబడినది. అర్థనారీశుడు దేవత. అఖిలప్రాప్తి కొరకు వినియోగము, హలము బీజములు స్వరములు శక్తులుగా చెప్పబడినవి. షడ్డీరములతో కూడిన భృగుస్థాకాశముతో అంగన్యాసమును చేయవలయును. బంధూక స్వర్ణవర్ణంగుడు, వరాక్ష అంకుశ పొశధారి, త్రినేత్రుడు దేవవంద్యుడు అగు - అర్రేన్దు శేఖరుని చింతించవలయును. ఇట్లు హృదయాంతమున నాలుగు విధములుగా శివశక్తులను ధ్యానించి మాతృకాస్థలమున సౌబీజమాతృకాపూర్వమున మాతృకాన్యాసమును చేయవలయును. విఘ్నేశ్వరుడు హీతో, విఘ్నరాజు శ్రీతో, వినాయకుడు పుష్టితో, శివోత్తముడు శాంతితో, విఘ్నకొరకుడు స్వస్తితో, విఘ్నహర్త సరస్వతీతో, గణనాధుడు స్వాహాదేవితో, ఏకదంతుడు సుమేధతో, ద్విదంతుడు కాంతితో, గజవక్తూడు కామినితో, నిరంజనుడు మోహినితో కపర్ది నటితో, దీర్ఘజిహ్వుడు పొర్వతితో, శంకుకర్లకుడు జ్వాలినీతో కలిసి యుండును. వృషధ్వజుడు నందతో, గణనాయకుడు సురేశితో, గజేంద్రుడు కామరూపిణీతో, శూర్పకర్ణుడు ఉముతో, విరోచనుడు తేజోవతితో, లంబోదరుడు సత్యతో, మహానందుడు విఘ్నేశితో, సదాశివుడు కోమదతో, ఆమోదుడు మద జిహ్వాజో, దుర్ముఖుడు భూతితో, సుముఖుడు భౌతికితో, ప్రదుడు సీతతో, ఏకపాదుడు ధమతో, ద్వీజిహ్వుడు మహిషీతో శూరనామకుడు జంఖనితో కలిసియుండును. వీరుడు వీకర్లతో, షణ్ముఖుడు భృకుటితో, వరదుడు లజ్జతో, వామదేవేశుడు దీర్ఘఫణతో, వక్రతుండుడు ధనుర్ధరితో, ద్విరుడుడు యామీనితో, సేనాని రాత్రితో, కామాంధుడు గ్రాముతో, నుశుడు శశిప్రభతో, విముడు లోల నేత్రతో, మత్త వాహుడు చంచలతో, జటిదీప్తితో, ముండి సుభగతో, ఖడ్డి దుర్బగవో, పదేణ్యుడు శివతో, ప్పష కేతనుడు భగతో, భక్ష్య ప్రియుడు భగినీతో, గణేశుడు భగినీతో, మేస్తునోధుడు సుభగతో, హ్యాపీ కొలత్రితో కలిసి యుండును. గణేశ్వరుడు కాలికతో ఉండును. వీరందరూ విఘ్నేశ మాతృకలుగా చెప్పబడిది. ఈ గణేశమాతృకాగణము మునులచే చెప్పబడినది. ఈ గణమునను త్రివృద్గాయత్రీ ఛందస్సు. శక్తి గణేశ్వరుడు దేవత. ఘర్షీర్ఘబీజముతో అంగన్యాసము చేసి స్మరించవలయును. పాశాంకుశాభయవరములను ధరించువాడు, కంజహస్తు యగు పత్నిచే కూడియున్నవాడు రక్త తనువు త్రినేత్రుడు గణాధిపతియగును. ఇట్లు ధ్యానించి స్వీయ బీజుపూర్వోకరాన్వితముగా న్యాసమును చేయవలయును. నివృత్తి ప్రతిష్ట, విద్యా, శాంతి, ఏధికి, దీపికా, చికా, చిర, పలా, సూక్ష్మా, అసూక్ష్మా, అమృతా, జ్ఞానామృత, ఆప్యాయనీ, వ్యా పినీ, వ్యోమదూపో, ఆనంతో, సృష్టి, సమృద్ధితో, స్మృతి, మేధా, కాంతి, లక్ష్మి, ధృతి, స్థిరా, స్థితి, సిద్ధి, జరా, పాలీనీ, క్షాంతి, ఈశ్వరి, రతి, కామిక, వవరదా, హోదినీ, ప్రీతి సంయుతా, దీర్ఘా, తీక్షా, రౌద్రా, నిద్రా, తంద్రికా, కుథొ, క్రోధినీ, క్రియాకారీ, సమత్యుకా, పీత, శ్వేతా, అరుణా, అపీతో, అసంలో, అనువొరు కలామాతృకలు. ఆయా మాత్సర్టులో చోరి చోరిని పూజించవలయును. కలామాతృకలకు ముని ప్రజాపతి. గోయత్రి ఛందస్సు. శారద దేవత హ్రస్వదీర్ఘాంతర తారలతో షడంగన్యాసమును చేయవలయును. పద్మ చక్ర, గుణ, ఏణములను ధరించునది, త్రిలోచన, పంచవక్త, ముక్తాభూషయగు భారతిని భజించవవలయును. ఇట్లు తాగపూర్వముగా భోగతిని ధ్యానించి కన్వితముగా జన్హన్యాసము చేయవలయును. తరువోత మూలమంత్రమునకు షడంగన్యాసమును చేయవలయును. హృదయాది చతుర్థ్యంతముగా జాతిసంయోజనము గోవించి న్యాపము గావించవలయును. నమః, స్వాహా, వషట్, హుం, పౌషట్, ఫట్, అనునవి జాతులుగా చెప్పబడినవి. తరువాత తమ ఇష్టదైవమును భూషాఆయుధ సమన్వితముగా ధ్యానించి, ఇష్టదేవతామూర్తి లో షడంగన్యాసమును చేసి పూజనోరంభించవలయును.

ఇది శ్రీ బృహన్నొరదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయసాదమున సంధ్యాదినిరూపణమను అరువది ఆర -  అధ్యాయము సమాప్తము.