నారద మహా పురాణము
101 - బ్రహ్మవైవర్తపురాణానుక్రమణీ నిరూపణమ్
శ్రీ బ్రహ్మోవాచ :-
శృణు వత్స ప్రవక్ష్యామి పురాణం దశమం తవ ।
బ్రహ్మ వైవర్తకం నామ వేదమార్గాను దర్శకమ్
సావర్ణిర్యత్ర భగవాన్ సాక్షాద్దేవర్షయే స్థితః ।
నారదాయ పురాణార్థం ప్రాహ సర్వమలౌకికమ్
ధర్మార్థ కామ మోక్షణాం సారః ప్రీతిర్హరౌ హరే ।
తయో రభేద సిద్ధ్యర్థం బ్రహ్మవైవర్తముత్తమమ్
రథంతరస్య కల్పస్య వృత్తాస్త్రం యన్మయోచితమ్ ।
శతకోటిపురాణే తత్సంక్షిప్య ప్రాహ వేదవిత్
వ్యాస శ్చతుర్ధా సంవ్యస్య బ్రహ్మవైవర్త సంజ్ఞతే ।
అష్టాదశ సహస్రం తత్ పురాణం పరికీర్తితమ్
బ్రహ్మ ప్రకృతి విఘ్నేశ కృష్ణ ఖండ సమన్వితమ్ ।
తత్ర సూతర్షి సంవాదే పురాణోపక్రమస్తతః
సృష్టి ప్రకరణం త్వాద్యం తతో నారద వేధసోః ।
వివాద స్సుమహాన్యత్ర ద్వయోరాసీత్పరాభవః
శివలోకగతిః పశ్చాత్ జ్ఞానలాభశ్శివాత్మనే ।
శివవాక్యేన తత్పశ్చాత్ మరీచే రారదస్య తు
గమనం చైవ సావర్లే ర్జానార్థం సిద్ధసేవితే ।
ఆశ్రమే సుమహాపుణ్యే త్రిలోక్యాశ్చర్యకారిణి
ఏతద్ధి బ్రహ్మఖండం హి శ్రుతం పాపవినాశనమ్ ।
తతస్సౌవర్ణిసంవాదో నారదస్య సమీరితః
కృష్ణమాహాత్మసంయుక్తో నానాఖ్యాన కథోత్తరమ్ ।
ప్రకృతేరంశభూతానాం కలానాం చాపి వర్ణితమ్
మాహాత్మ్యం పూజనాద్యం చ విస్తరేణ యథాస్థితమ్ ।
ఏతత్ప్రకృతి ఖండం హి శ్రుతం భూతి విధాయకమ్
గణేశ జన్మ సంప్రశ్న: సుపుణ్యక మహా వ్రతమ్ ।
పార్వత్యాః కార్తికేయేన సహ విఘ్నేశ సంభవమ్
చరితం కార్తవీర్యస్య జామదగ్న్యస్య చాద్భుతమ్ ।
వివాదస్సు మహానాసీత్ జామదగ్న్యగణేశయోః
ఏతద్విఘ్నేశ ఖండం హి సర్వవిఘ్న వినాశనమ్ ।
శ్రీ కృష్ణజన్మసంప్రశ్నో జన్మాఖ్యానం తతోఽద్భుతమ్
గోకులే గమనం పశ్చాత్పూతనాదివధాద్భుతాః ।
బాల్యకౌమారజాలీలా వివిధ స్నత వర్ణితాః
రాసక్రీడా చ గోపీభి శారదీ సముదాహృతా ।
రహస్యే రాధయా క్రీడా వర్తితా బహువిస్తరా
సహా క్రూరేణ తత్పశ్చాన్మధురాగమనం హరేః ।
కంసాదీనాం వధే వృత్తే కృష్ణస్య ద్విజ సంస్కృతిః
కాశ్యసాందీపనేః పశ్చాద్విద్యోపాదానముత్తమమ్ ।
యవనస్య వధః పశ్చా ద్దారకా గమనం హరేః
నరకాది వధస్తత్ర కృషైన విహితోద్భుతః ।
కృష్ణఖండమిదం విప్ర నృణాం సంసార ఖండనమ్
పఠితం చ శ్రుతం ధ్యాతం పూజితం చాభివందితమ్ ।
ఇత్యేత ద్రహ్మవైవర్తపురాణం చౌత్యలౌకికమ్
వ్యాసోక్తం చాది సంభూతం పఠఞ్చృణ్వన్విముచ్యతే ।
విజ్ఞానాజ్ఞానశమనాదోరాత్సంసారసాగరాత్
లిఖిత్వేదం చ యో దద్యాత్ మాఘ్యం ధేను సమన్వితమ్ ।
బ్రహ్మలోకమవాప్నోతి స ముక్తోఽజ్ఞానబంధనాత్
యశ్చానుక్రమణిం చాపి పఠేద్వా శృణుయాదపి ।
సోపి కృష్ణ ప్రసాదేన లభతే వాంఛితం ఫలమ్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్ధపాదే బ్రహ్మవైవర్తపురాణానుక్రమణీ నిరూపణం నామ ఏకోత్తర శత తమోఽధ్యాయః.
శ్రీ బ్రహ్మ పలికెను :-
నాయనా! ఇపుడు పదియవది, వేద మార్గాను దర్శకము యగు బ్రహ్మ వైవర్త పురాణమును చెప్పెదను వినుము. సావర్ణి మనువు దేవర్షియగు నారదునకు స్వయముగా చెప్పెను. ధర్మార్థ కామ మోక్షముల సారము, హరి హరులయందు ప్రీతి, హరి హరుల అభేద సిద్ది ఈ పురాణమున ప్రతిపాదించబడినది. శతకోటి విస్తృతమగు నాచే చెప్పబడిన పురాణము వివరించబడిన రథంతర కల్పవృతానమును వేద వ్యాస మహర్షి సంక్షేపముగా చెప్పెను. వ్యాసుడు బ్రహ్మవైవర్త పురాణమును నాలుగు భాగములుగా పదునెనిమిది వేల శ్లోకములు కలదానినిగా నిర్మించేను. ఈ పురాణమున బ్రహ్మ ప్రకృతి విఘ్నేశ కృష్ణ ఖండములు కలవు. మొదటిదగు సృష్టి ప్రకరణమున సూతర్చి సంవాదమున పురాణోపక్రమము చేయబడినది. తరువాత నారద బ్రహ్మల వివాదము ఇద్దరీ పరాభవము, తరువాత శివలోకగమనము, జ్ఞానలాభము, శివ వాక్యముచే కలుగుట, మరీచి నారదులు జ్ఞానము కొరకు సిద్ద సేవితము, పరమ పావనము, త్రైలోక్యాశ్చర్య కరమగు సావర్ణి ఆశ్రమమునకు వెళ్ళుట ఇవి బ్రహ్మఖండమున ప్రతిపాదించబడినవి. తరువాత సావర్ణి నారదుల సంవాదము, కృష్ణ మాహాత్మ్యయుతము నానా కథా సమన్వితము, ప్రకృతి అంశ భూతములగు కల చరితమును వర్ణించుట, మాహాత్మ్యములు పూజాదికములు విస్తృతముగా వర్ణించ బడినవి. ఇది ప్రకృతి ఖండము. సర్వ భూతి ప్రదాయకము. గణేశ జన్మ వృత్తాన ప్రశ్న, సుపుణ్యక మహావ్రతము, పార్వతీ దేవికి కుమారస్వామి గణపతులు పుట్టుట, కార్తవీర్యార్జునుని పరశురాముని చరిత్రము, జామదగ్న్య గణేశుల వివాదము, ఇది సర్వపాప వినాశకమగు విఘ్నేశ ఖండము. శ్రీ కృష్ణ జన్మవృత్తాంత ప్రశ్నము. అద్భుతమగు శ్రీ కృష్ణ జన్మ, గోకుల గమనము, పూతనాది వధ, పలువిధములగు బాల్య కౌమార లీలలు, శరద్రాత్రి గోపికలతో రాసక్రీడ, రహస్యముగా రాధతో క్రీడించుట బహువిస్తృతముగా వర్ణించబడినది. అక్రూరునితో కలిసి శ్రీ కృష్ణుడు మధురా నగరమునకు వెళ్ళుట, కంసాధులను వధించుట, కృష్ణునికి ఉపనయన సంస్కారము. సాందీపని వద్ద విద్యాభ్యాసము, కాలయవన వధ, ద్వారకా గమనము, అచట నరకాది వధ. ఇవియన్నియు కృష్ణ ఖండమున చెప్పబడినవి. ఈ కృష్ణ ఖండము మానవుల సంసార ఖండమును చేయును. ఈ అలౌకికము అగు బ్రహ్మ వైవర్త పురాణమును చదివిననూ, వినిననూ, ధ్యానము చేసిననూ పూజించిననూ, అభివందనము చేసిననూ ముక్తిని పొందును. విజ్ఞాన జ్ఞానములను శమింప చేయు పరమఘోరమగు సంసార సాగరము నుండి చదువు వారు వినువారు విముక్తులగుదురు. మాఘ పూర్ణిమనాడు ఈ పురాణమును వ్రాసి బ్రాహ్మణునకు దానము చేసినచో అజ్ఞాన బంధము నుండి విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. బ్రహ్మ వైవర్తక పురాణాను క్రమణిని చదివిననూ వినిననూ శ్రీ కృష్ణ ప్రసాదము వలన కోరిన ఫలము లభించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున బ్రహ్మవైవర్తక పురాణానుక్రమణి యను నూట ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 103 of the Nārada Mahā Purana is as follows:
భూదేవిని రక్షించుటకై భగవాన్ విష్ణువు దాల్చిన వారాహ అవతార వైభవమును చాటే వారాహ మహాపురాణము యొక్క విషయ సంగ్రహము ఈ అధ్యాయంలో వివరింపబడినది. వివిధ పుణ్యక్షేత్ర మాహాత్మ్యములు, వ్రత కల్పములు మరియు భాగవత ధర్మముల సమగ్ర స్వరూపము ఇక్కడ అభివర్ణించబడినది.