18 - మార్గశీర్షపౌర్ణిమాయాం లక్ష్మీనారాయణవ్రతమ్

సనక ఉవాచ :-

అన్యద్వ్రతవరం వక్ష్యే శృణుష్వ మునిసత్తమ !

సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖనిబర్హణమ్

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం యోషితాం తథా

సమస్త కామఫలదం సర్వవ్రత ఫలప్రదమ్

దుస్స్వప్న నాశనం ధర్మ్యం దుష్టగ్రహ నివారణమ్

సర్వలోకేషు విఖ్యాతం పూర్ణిమావ్రతముత్తమమ్

యేన చీర్ణేన పాపానాం రాణికోటిః ప్రశామ్యతి

మార్గశీర్షే సితే పక్షే పూర్ణాయాం నియతః శుచిః

స్నానం కుర్యాద్యథాచారం దన్తధావనపూర్వకమ్

శుక్లాంబరధరశ్శుద్ధో గృహమాగత్య వాగ్యతః

ప్రక్షాళ్య పాదావాచమ్య స్మరన్నారాయణం ప్రభుమ్

నిత్యం దేవార్చనం కృత్వా పశ్చాత్సంకల్పపూర్వకమ్

లక్ష్మీనారాయణం దేవమర్చయేద్భక్తిభావతః

ఆవాహనాసనాద్యైశ్చ గంధపుష్పాదిభిర్వతీ

నమో నారాయణాయేతి పూజయేద్భక్తి తత్పరః

గీతైర్వా ద్యైశ్చ నృత్యశ్చ పురాణపఠనాదిభిః

స్తోత్రైర్వారాధయేద్దేవం వ్రతకృత్సుసమాహితః

దేవస్య పురతః కృత్వా స్థండిలం చతురస్రకమ్

అరత్ని మాత్రం తత్రాగ్నిం స్థాపయేద్గృహ్యమార్గతః

ఆజ్యభాగాస్త్రపర్యన్తం కృత్వా పురుషసూక్తతః

చరుణా చ తిలైశ్చాపి ఘృతేన జుహుయాత్తథా

ఏకవారం ద్వివారం వా త్రివారం వాపి శక్తితః

హోమం కుర్యాత్ప్రయత్నేన సర్వపాపనివృత్తయే

ప్రాయశ్చిత్తాదికం సర్వం స్వగృహ్యోక్తవిధానత

సమాప్య హోమం నిధివచ్ఛాన్తిసూక్తం జపేద్బుధః

సనకమహర్షి పలికెను : ఓ మునిసత్తమా ! ఇంకొక ఉత్తమవ్రతమును చెప్పదను. ఈ వ్రతము అన్ని పాపములను నశింపచేయును. పరమ పవిత్రమైనది. అన్ని దుఃఖములను తొలగింపచేయును. బ్రాహ్మణక్షత్రియ వైశ్య, శూద్రులకు స్త్రీలకు అన్ని కోరికలను తీర్చును. ఈ వ్రతము నాచరించినచో అన్ని వ్రతముల నాచరించిన ఫలము లభించును. దుస్స్వప్నములను నశింపచేయును. ధర్మమును ప్రసాదించును. దుష్టగ్రహములను నివారింపచేయును. ఈ పూర్ణిమా వ్రతము అన్ని లోకములలో ప్రసిద్ధి చెందినది. ఈ వ్రతమును నిర్వర్తించినచో పాపరాశి నశించును. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమనాడు పవిత్రుడై నియమముగా ప్రాతఃకాలమున దంతధావనము చేసుకొని ఆచొరానుగుణముగా స్నానము చేసి తెల్లని వస్త్రములను ధరించి శుద్దుడై ఇంటికి వచ్చి మౌనము వహించి, పాదప్రక్షాళనమును చేసుకొని ఆచమనమును చేసుకొని ప్రభువైన నారాయణుని స్మరించుచు నిత్య విధియైన దేవార్చనను చేసి తరువాత సంకలపూర్వకముగా భక్తి భావముతో లక్ష్మీనారాయణ దేవుని అర్చించవలయును. వ్రతమును స్వీకరించినవాడు ఆవాహనాసనగంధపుష్పాదులచే ‘నమో నారాయణాయ’ అని భక్తి తత్పరుడై పూజించవలయను. గీత నృత్యవాద్యములచే పురాణ పఠనాదులచే కాని స్తోత్రములచే కాని ఆరాధించవలయును. లక్ష్మీనారాయణుని పురోభాగమున చతురస్ర స్థండిలమునేర్పరచి గృహ్యసూత్రానుసారముగా ఆ స్థండిలమున ఆరంగుళముల ప్రదేశమున అగ్నిని స్థాపించవలయును. ఆజ్యభాగాంతము వరకు పురుషసూక్తముచే పొంగలిచే (దరువు) నువ్వులచే నెయ్యిచే హోమమును చేయవలయును. సర్వపాపనివృత్తి కొఱకు ప్రయత్నముచే ఒకమారు, రెండుమార్లు మూడు మార్లు కాని హోమమును చేయవలయును. తమతమ గృహ్యసూత్రానుసారముగా ప్రాయశ్చిత్తాదికమంతటిని ముగింపచేసి, హోమమును సమాప్తిని గావించి శాంతి సూక్తమును పఠించవలయును.

పశ్చాద్దేవం సమాగత్య పునః పూజాం ప్రకల్పయేత్

తథోపవాసం దేవాయ హ్యార్పయేద్భక్తి సంయుతః

పౌర్ణమాస్యాం నిరాహారః స్థిత్వా దేవ తవాజ్ఞయా

భోక్ష్యామి పుండరీకాక్ష పరేహ్ణి శరణం భవ

ఇతి విజ్ఞాప్య దేవాయ హ్యర్ఘ్యం దత్వా తథేన్దవే

జానుభ్యామవనీం గత్వా శుక్ల పుష్పాక్షతాన్వితః

క్షీరోదార్ణవసంభూత అత్రిగోత్రసముద్భవ

గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణీనాయక ప్రభో ఏవమర్ఘ్యం ప్రదాయేన్దో ప్రార్ధయేత్ప్రాంజలిః స్థితః

తిష్ఠన్పూర్వముఖో భూత్వా పశ్యన్నిన్దుం చ నారద నమః శుక్లాంశవే తుభ్యం ద్విజరాజాయ తే నమః

రోహిణీపతయే తుభ్యం లక్ష్మీభాత్రే నమోస్తు తే

తతశ్చ జాగరం కుర్యాత్పురాణశ్రవణాదిభిః

జితేన్ద్రియశ్చ సంశుద్ధః పాషండాలోకవర్జితః తతః ప్రాతః ప్రకుర్వీత స్వాచారం చ యథావిధి

పునస్సంపూజయేద్దేవం యథావిభవవిస్తరమ్

బ్రాహ్మణాన్ఫోజయేచ్ఛక్త్యా తతశ్చ ప్రయతో నరః

బంధుభృత్యాదిభిః సార్థం స్వయం భుంజీత వాగ్యతః

మరల దేవుని సమీపించి మరల పూజను సలుపవలయును. భక్తి గలవాడై లక్ష్మీనారాయణునికి ఉపవాసమును ఆర్పించవలయను. ఓ దేవా ! నీ యాజ్ఞచే పౌర్ణమి తిథిన నిరాహారముగా నుండి మరుసటి దినమున భుజింతును. నాకు రక్షకుడవు కమ్ము. ఇట్లు విజ్ఞాపన చేసి స్వామికి అర్ఘ్యము నీయవలయును. అట్లే భూమి పై మోకాళ్ళనుంచి తెల్లని పూవులను అక్షతలను చేతిలో తీసుకొని క్షీరోదార్ణవ సంభూత ! అత్రిగోత్రసముద్భవ ! గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయకప్రభో !” అను మంత్రముచే అర్ఘ్యమును చంద్రునకిచ్చి చేతులు జోడించి ప్రార్థించవలయును. (“పాలసముద్రమున పుట్టిన వాడా ! అత్రిగోత్రమున ఆవతరించినవాడా ! రోహిణీపతీ! నేనిచ్చిన అర్ఘ్యమును స్వీకరించుము” అని పై మంత్రమున కర్ణము) తూర్పు ముఖముగా నిలచి చంద్రుని చూచుచు తెల్లని కిరణములు కలిగిన, ద్విజరాజువైన, రోహిణీ పతివి, లక్ష్మీదేవి సోదరుడవు" అయిన నీకు నమస్కారము. అని ప్రార్థించి పురాణ శ్రవణాదులచే జాగరమును చేయవలయును, పవిత్రుడై ఇంద్రియ జయము కలిగి పాషండుల దృష్టి సోకక యుండవలయును. తరువాత ప్రొద్దున స్వాచారాను గుణముగా యథావిధిగా నిత్యకృత్యములను నిర్వర్తించి విభవాను గుణముగా విస్తరముగా మరల స్వామిని పూజించవలయును. బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వినయముతో బంధుమిత్ర భృత్యపరివారముతో మౌనముగా తాను భుజించవలయును.

ఏవం పౌషాదీమా సేషు పూర్ణిమాయాముపోషితః

అర్చయేద్భక్తిసంయుక్తో నారాయణమనామయమ్

ఏవం సంవత్సరం కృత్వా కార్తిక్యాం పూర్ణిమా దినే

ఉద్యాపనం ప్రకుర్వీత తద్విధానం వదామి తే

మండపం కారయేద్దివ్యం చతురస్రం సుమంగలమ్

శోభితం పుష్పమాలాభిర్వితానధ్వజరాజితమ్

బహుదీపసమాకీర్ణం కింకిణీజాలశోభితమ్

దర్పణైశ్చామ రైశ్చైవ కలశ్చైశ్చ సమావృతమ్

తన్మధ్యే సర్వతోభద్రం పంచవర్ణవిరాజితమ్

జలపూర్ణం తతః కుంభం న్య సేత్తస్యోపరి ద్విజ

పిధాయ కుంభం వస్త్రేణ సుసూక్ష్మేణాతిశోభితమ్

హేమ్నా వా రజతేనాపి తథా తామ్రేణ వా ద్విజ

లక్ష్మీనారాయణం దేవం కృత్వా తస్యోపరి న్య సేత్

పంచామృతేన సంస్నాప్యాభ్యర్చ్య గంగాదిభిః క్రమాత్

భక్షైర్భోజ్యాదినైవేద్యార్భక్తి తస్సంయతేంద్రియః

జాగరం చ తథా కుర్యాత్సమ్యక్శ్రద్దాసమన్విత

పరేఽహ్ని ప్రాతర్విధివత్పూర్వవద్విష్ణుమర్చయేత్

ఆచార్యాయ ప్రదాతవ్యా ప్రతిమా దక్షిణాన్వితా

బ్రాహ్మణాన్ఫోజయేచ్ఛక్త్యా విభవే సత్యవారితమ్

తిలదానం ప్రకుర్వీత యథా శక్త్యా సమాహితః

కుర్యాదగ్నౌ చ విధివత్తిలహోమం విచక్షణః

ఏవం కృత్వా నరసమ్యగ్లక్ష్మీ నారాయణవ్రతమ్

ఇహ భుక్త్వా మహాభోగాన్పుత్రపౌత్రసమన్వితః

సర్వపాపవినిర్ముక్తః కులాయుతసమన్వితః ప్రయాతి విష్ణుభవనం యోగినామపి దుర్లభమ్

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణే పూర్వభాగే ప్రథమపాదే వ్రతాఖ్యానే మార్గశీర్ష పౌర్ణిమాయాం లక్ష్మీనారాయణవ్రతం నామ అష్టాదశోఽధ్యాయః

ఇట్ల పుష్యాది మాసములలో పూర్ణిమా తిథిన ఉపవసించి వికారరహితుడగు శ్రీమన్నారాయణుని భక్తితో పూజించవలయును. ఇట్లు ఒక సంవత్సరము వ్రతము నాచరించి కార్తీక పూర్ణిమ నాడు ఉద్యాపనమును చేయవలయును. ఆ విధానమును చేప్పెదను వినుము. కళ్యాణకరమగు చతురస్రమండపమును చేయవలయును. ఆ మండపమును పుష్పమాలాదులచే ఛత్రచామర ధ్వజములచే అలంకరించవలయును. చాలా దీపములనుంచవలయును. గంటలు అమర్చవలయును. అద్దములతో కలశములతో కూర్చవలయును. ఆ మధ్యన పంచవర్ణములతో సర్వతో భద్రమును లిఖించవలయును. దాని పై జలపూరిత కుంభమునుంచవలయును. కలశమును వస్త్రముతో కప్పి, బంగారముతో కాని, వెండితో కాని, రాగితో కాని చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రము పై నుంచవలయును. ఆ ప్రతిమను పంచామృతముతో అభిషేకించి క్రమము ననుసరించి గంధాదులతో అర్చించవలయును. ఇంద్రియ --నిగ్రహము కలవాడై భక్య భోజ్యములను నివేదన చేయవలయును. శ్రద్ధతో చక్కగా జాగరణ చేయవలయును. మరుసటి దినమున ప్రాతఃకాలమున యథావిధిగా పూర్వము వలె విష్ణువు నర్చించవలయును. ఆ ప్రతిమను సదక్షిణగా ఆచార్యునకు దానము చేయవలయును. సంపదలున్నచో కాదనక బ్రాహ్మణులను భుజింపచేయవలయును. శక్తి ననుసరించి సావధానముగా తిలదానమును చేయవలయును. వివేకము కలవాడై వీధిపూర్వకముగా తిలహోమమును చేయవలయును. ఇట్లు చక్కగా లక్ష్మీనారాయణ వ్రతమును నాచరించినవారు ఇహలోకమున పుత్రపౌత్రాదులతో మహాభోగముల ననుభవించి అన్ని పాపముల నుండి విముక్తిని పొంది పదివేల తరములతో యోగులకు కూడా దుర్లభమగు విష్ణుభవనమును చేరుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున, వ్రతాఖ్యానమున మార్గశీర్ష పూర్ణిమనాడు లక్ష్మీ నారాయణ వ్రతమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.